7, జనవరి 2024, ఆదివారం

Panchang

 


తెలుగు భాష గొప్పదనం*.

 శుభ సాయంత్రం ..మీకు

ఓం శ్రీ మాత్రే నమః

రాసిందెవరో కానీ . . .

మన లెక్కల ఫిజిక్స్ పంతుళ్ళ పని కొంచెం తేలిక చేశారు . . .

థాంక్యూ ఫ్రెండూ . . .

అమ్మ చేసిన రొట్టె *వృత్తము*

సగానికి మడిచిన దోసె *అర్ధ వృత్తము*

మనం కూర్చునే స్టూల్ *చతురస్త్రం*

పడుకునే మంచం *దీర్ఘ చతురస్త్రం*

మనకిష్టమైన లడ్డూఒక  *గోళము*

సగం మన మిత్రునికిస్తే *అర్ధ గోళము*

మన తరగతి గది ఒక *ఘనం*

మనం కూర్చునే బెంచీ ఒక *దీర్ఘ ఘనం*

మన జెండా కర్ర ఒక *స్థూపం*

కొడవలి మలుపు ఒక *చాపం*

ధాన్యపు రాశి ఒక *శంఖువు*

రూపాయి రూపాయి కలిపితే *కూడిక*

కొనడానికి కొంత తీస్తే *తీసివేత*

తలా పది పంచితే *భాగహారం*

హెచ్చిస్తే *గుణకారం*

కూర్చుంటే *జడత్వం*

కదిలితే *చలనం*

పరిగెత్తితే *వేగం*

ఆగి ఆగి పరుగు తీస్తే *త్వరణం*

పడిపోతే *ఆకర్షణ*

విడిపోతే *వికర్షణ*

తన చుట్టూ తాను తిరిగితే *భ్రమణం*

గుడి చుట్టూ తిరిగితే *పరిభ్రమణం*

మాట్లాడడానికి *శక్తి*

పనిచేయడానికి *బలం*

గంటకు ఎంతపని చేస్తావో అది *సామర్థ్యం*

వింటున్నా మంటే *శబ్దం*

చూస్తున్నామంటే *వెలుగు*

రంగులన్ని *వర్ణ పటం*

ఆహారం అరగడం *జీవక్రియ*

అరిగిన ఆహారం శక్తిగా మారడం *రసాయన క్రియ*

ఉచ్వాస నిశ్వాసాలు *శ్వాస క్రియ*

నేను చూశాను *భూతకాలం*

నేను చూస్తున్నా *వర్ధమాన కాలం*

నేను చూడ బోతున్నా *భవిష్యత్ కాలం*

నాకు తొంభై ఏళ్ళు ఇక *పోయే కాలం*

బతుకుల్లో లేనిది ఏముంది శాస్త్రాల్లో ..

సరిగా అర్థం చేసుకుంటే మన బతుకే ఒక శాస్త్రం...

మనిషిని, ఇతర ప్రాణుల్ని , ప్రకృతిని గురించి తెలుసుకోవడం తప్ప.

భయమెందుకు నీకు ...

నీకంటే ప్రపంచంలో ఎవరు గొప్ప...

తెలుసుకో పదిలంగా

నేర్చుకో సులభంగా...!   


*అదే మన తెలుగు భాష గొప్పదనం*.  

భలే ఉంది కదా మరి ఆలస్యం ఎందుకు మిత్రులతో పంచుకోండి

💐💐💐🙏🙏🙏

Agriculture drone


 

External spring fitting to scooty


 

Marble stone cutting


 

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*07-01-2024 / ఆదివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

---------------------------------------

వృషభం


వృత్తి వ్యాపారాల్లో ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్నిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

మిధునం


 వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. సంతానం విద్యా ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి.

---------------------------------------

కర్కాటకం


దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

---------------------------------------

సింహం


ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.  వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన  వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాలు సహోద్యోగులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.  ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

కన్య


సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.  వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.

---------------------------------------

తుల


సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులలో అవాంతరాలు కలుగుతాయి.  వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో  గందరగోళ వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

---------------------------------------

వృశ్చికం


కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి మాటతీరుతో ఇంటా బయట అందరిని ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

--------------------------------------

ధనస్సు


వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. నూతన రుణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

---------------------------------------

మకరం


గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సంతాన ఉద్యోగ యత్నాలు సానుకూల మౌతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో  మెరుగ్గా రాణిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుని బాధపడతారు. 

---------------------------------------

కుంభం


సంతాన వివాహ విషయమై చర్చలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో  నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

మీనం


వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిఒత్తిడుల వలన తగిన విశ్రాంతి ఉండదు. ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.           *ప్రధమ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.         *అర్జున విషాద యోగము*

.                *శ్లోకము 21-22*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


 *అర్జున ఉవాచ ।*

*సెనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ।। 21 ।।*


*యావదేతాన్ నిరీక్షేఽహం*

*యోద్దుకామానవస్థితాన్ ।*

*కైర్మయా సహ యోద్ధవ్యమ్*

*అస్మిన్ రణసముద్యమే ।। 22 ।।*


అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; 

సేనయోః —  సైన్యములు; 

ఉభయోః   — రెండు; 

మధ్యే  — మధ్యలో; 

రథం — రథము; 

స్థాపయ — నిలిపిఉంచు; 

మే — నా యొక్క; 

అచ్యుత — శ్రీ కృష్ణా (ఎట్లాంటి దోషములు లేనివాడా); 

యావత్  — ఎంతవరకు అయితే; 

ఏతాన్  — ఈ యొక్క; 

నిరీక్షే — చూసి; 

అహం — నేను; 

యోద్దు-కామాన్  — యుద్ధం కొరకు; 

అవస్థితాన్  — నిలిపిఉన్న; 

కైః  — ఎవరితో; 

మయా  — నాతో; 

సహ — కూడి; 

యోద్ధవ్యమ్  — యుద్ధం చేయవలసి; 

అస్మిన్  — ఈ యొక్క; 

రణ సముద్యమే — మహా పోరాటంలో.


*భావము:*

అర్జునుడు ఇలా అన్నాడు. అచ్యుతా (శ్రీ కృష్ణా), దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలుపుము. ఈ మహా పోరాటంలో, రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను పరీక్షించాలి.


వివరణ: సమస్త సృష్టి కి పరమేశ్వరుడైన శ్రీ కృష్ణుడి, భక్తుడు అర్జునుడు.  అయినప్పటికీ ఈ శ్లోకం లో అర్జునుడు భగవంతుడిని తన రథాన్ని కావలసిన చోటికి తీసుకెళ్లమన్నాడు.  ఇది భగవంతునికి తన భక్తులతో ఉండే సంబంధం యొక్క మాధుర్యాన్ని తెలియచేస్తోంది.  భగవంతుడు తన భక్తుల ప్రేమకు ఋణపడి, వారికి దాసుడు అయిపోతాడు.

అహం భక్త పరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ

సాధుభిర్గ్రస్త-హృదయో భక్తైర్భక్త-జన-ప్రియః (భాగవతం 9.4.63)

"నేను సర్వ స్వతంత్రుడను అయినా, నా భక్తులకు బానిస అయిపోతాను. వారు నాకు అత్యంత ప్రియ మైన వారు మరియు నేను వారి ప్రేమకు ఋణ పడివుంటాను." అర్జునుడు సుఖంగా రథంలో కూర్చుని తనకి ఆదేశాలు ఇస్తుంటే, అతని భక్తికి వశుడైపోయిన శ్రీ కృష్ణ పరమాత్మ రథాన్ని నడిపే సారధి స్థానాన్ని తీస్కున్నాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం

 .        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *129వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*సూర్యగ్రహ మహిమ - 2*


సూర్యుడి కిరణాలకు ఏదీ అడ్డుతగలని చోట , ఉదయం నుండీ సాయం సమయం దాకా ఎండ పడేచోట - యాజ్ఞవల్యుడు తపస్సు ప్రారంభించాడు.


సూర్యుడు ఉదయిస్తున్నాడు , అస్తమిస్తున్నాడు. అయితే ఆ రెండు దైనిక క్రియల్నీ గమనించే స్థితిలో లేడు , యాజ్ఞవల్క్యుడు. అతనిలోని పట్టుదల భక్తి శ్రద్ధలకూ , ఏకాగ్రతకు పదనుపెట్టుతోంది. అచిరకాలంలోనే అతడు శారీరక స్పృహను కోల్పోయాడు. ఆకలిదప్పులూ , శీతోష్టాలూ , వెలుగు చీకట్లూ అనే ద్వంద్వాలకు అతి దూరంగా , ధ్యాన క్షేత్రంలో సాగిపోయాడు యాజ్ఞవల్క్యుడు.


కాలం గడిచిపోతోంది. అతను కలలుగన్న కమనీయ ఘడియ కదలి వచ్చింది. 


తపస్సులో గాఢంగా మునిగిపోయిన యాజ్ఞవల్క్యుడి అర్ధనిమీలిత నేత్రాల మీద. ఏదో కొత్త వెలుగు పడింది. అతని కనురెప్పలు స్పందిస్తూ మెల్లగా తెరుచుకున్నాయి. ఎదురుగా కళ్ళు మిరుమిట్లు గొలిపే వెల్తురు ! యాజ్ఞవల్క్యుడి రెప్పలు టపటపలాడి , కళ్ళ మీద వాలిపోయాయి !


*"యాజ్ఞవల్క్య !"* మేఘ గర్జనలాంటి కంఠధ్వని తనను పిలుస్తోంది ! యాజ్ఞవల్క్యుడు కళ్ళు తెరిచాడు. ఈసారి అతడి కళ్ళు నిబ్బరంగా చూడగలుగు తున్నాయి.


ఎదురుగా కేంద్రీకరించిన కాంతిపుంజంలోంచి ఏడు గుర్రాలు రథాన్ని లాగుతూ వెలికి వచ్చాయి ! రథానికి ఒకే చక్రం ఉంది. గుర్రాల వెనక సారథి అరుణుడు !


రథంలో వేయి కిరణాల వేలుపు ! కెందామరలాంటి మనోహరమైన శరీరవర్ణం ! శరీరవర్ణంతో చెలిమి చేస్తూ , దానిని అందంగా ఆచ్ఛాదించిన ఎర్రటి వస్త్రం ! చేతిలో తెల్లని తామర ! చుట్టూ ఆవరించిన సువర్ణకాంతులను చెదరగొడుతూ , చేతిలోని శ్వేత పద్మ వర్ణాన్ని వెక్కిరిస్తున్న చిరునవ్వు !


*"ఓం సూర్యాయనమః ! ఓం సూర్యాయనమః..."* జోడించిన చేతుల్ని , శిరస్సును పైకి యెత్తి , నమస్కరిస్తూ ఆదిత్య మంత్రాన్ని పఠించాడు యాజ్ఞవల్క్యుడు.


*"యాజ్ఞవల్మా ! నీ ధ్యాన కిరణం నా సహస్ర కిరణాలనూ ఆకర్షించి , నన్నిక్కడికి తెచ్చింది ! ఏం కావాలి నీకు ?"* సూర్యభగవానుడి కంఠం ఆకాశంలో సుళ్ళు తిరుగుతూ మారుమ్రోగింది.


*"భగవాన్ ! నీ దయ లోపించిన కారణంగా , నీ వక్రవీక్షణ కారణంగా నేను గురుదేవుల తిరస్కారానికి గురయ్యాను. కోరిన విద్యలను పొందలేకపోయాను. మహత్తరమైన యజుస్సులను ప్రసాదించు. నన్ను కరుణతో చూడు !"* యాజ్ఞవల్యుడు రెండు చేతులూ చాచి , దోసిలిపట్టి అభ్యర్థించాడు.


సూర్యుడు చిన్నగా నవ్వాడు. *"నువ్వు చివర కోరిన కోరికను మొదట అనుగ్రహిస్తాను. నిన్ను కరుణతో చూస్తాను. నీ మీద ఉన్న నా వక్రదృష్టిని ఉపసంహరించి , శుభదృష్టితో వీక్షిస్తాను !"*


*"స్వామీ ! అంత అదృష్టమా నాది !”* యాజ్ఞవల్క్యుడు వణికే కంఠంతో అన్నాడు.


*"నా శుభదృష్టి నీ మీద వాలగానే వాగ్దేవి అయిన సరస్వతి నిన్ను ఆవహిస్తుంది ! ఆ గీర్వాణికి స్వాగతం పలుకుతూ , నీ శరీరానికి మహద్వారమూ , 'తలవాకిలీ' అయిన నోటిని తెరిచి ఉంచు !"* సూర్యుడి పలుకును ప్రకృతి ఆనందంగా ప్రతిధ్వనించింది.


యాజ్ఞవల్క్యుడు ఆదిత్య భగవానుని ఆజ్ఞను శిరసావహిస్తూ , ఆయననే చూస్తూ నోరు తెరిచాడు , సరస్వతిని స్మరిస్తూ.


క్షణంలో మహాశ్వేత అయిన సరస్వతి సాక్షాత్కరించింది. చిరునవ్వులు చిందిస్తూ సూక్ష్మ రూపంలోకి మారి , యాజ్ఞవల్క్యుడి వదనద్వారం గుండా అతని శరీరంలోకి ప్రవేశించింది.


యాజ్ఞవల్క్యుడి శరీరం ఒక్కసారి జలదరించింది. ఏదో తెలియని అలౌకికమైన , ఆందోళనకరమైన 'మహాతాపం' అతని శరీరాన్ని దావానలంలా దహించివేస్తోంది. భరించలేని మంట అతని శరీరాన్ని ఆవరించి , పొగలు చిమ్ముతున్నట్టనిపించింది.


ఆ మహాతాపాన్ని భరించలేకపోతున్న యాజ్ఞవల్క్యుడు అసంకల్పితంగా పరుగెట్టాడు. సరోవర జలంలోకి దూకబోయాడు. సూర్యుడి గంభీర కంఠస్వరం అతన్ని ఆపింది.


*"యజ్ఞా ! ఆగు ! వాగ్రూపిణి మహత్తర శక్తి నీలో ప్రవేశించింది. అదే ఆ తాపానికి కారణం. ఆ తల్లిని ధ్యానించు. ఆ మహాతాపం స్వల్పకాలికమే సుమా !”*


యాజ్ఞవల్క్యుడు, సూర్యుని వైపు తిరిగి , వినయంగా నమస్కరించాడు. *"ఆజ్ఞ !” సూర్య వచనం నిజమైంది , క్షణంలో ! యాజ్ఞవల్క్యుడి తనువును దహించిన భుగభుగలు మాయమైపోయాయి. ఏదో తెలియని దివ్యకాంతి మంచుతో తడిసి పిల్లగాలిలా అతని శరీరాన్ని రెండవ చర్మంలా ఆవరించింది.*


*"నిష్ఠతో , తపస్సుతో , భక్తితో , విశ్వాసంతో నన్ను మెప్పించావు. నా వక్రదృష్టిని , ప్రసన్న దృష్టిగా మార్చుకున్నావు. వేదవిజ్ఞానం నీకు లభిస్తుంది. నువ్వు కోరిన యజుస్సుల ఉనికిపట్టు అదే ! అంతే కాకుండా నీకు సాంఖ్య యోగాలు సిద్ధిస్తాయి. ఇదిగో , నా చేతిలోని కమలం వికసించినట్టు - నీ మేథస్సు వికసిస్తుంది. శతపథ బ్రాహ్మణం నీకు సిద్ధిస్తుంది. సరస్వతీ మాత నీ వెంట ఉంది ; నీ ఇంట ఉంటుంది. వెళ్ళు ! ఇష్టప్రాప్తి కలుగుతుంది !"*


దీవిస్తున్న సూర్యభగవానుడికి , కృతజ్ఞతా భారంతో చలించిపోతూ , నమస్కరించాడు యాజ్ఞవల్క్యుడు. *"ధన్యోస్మి దేవా , ధన్యోస్మి !”*


చిరునవ్వుతో దీవిస్తున్న సూర్యుడూ , ఆయన రథమూ నెమ్మదిగా గగన నేపథ్యంలో కలిసిపోయాయి. గుండ్రటి సూర్యబింబం - ఆస్థానంలో - యాజ్ఞవల్క్యుడికి కనిపిస్తోంది.


*************************


వాతావరణం ప్రశాంతంగా ఉంది. ప్రాతఃకాలీన అనుష్టాలు తీర్చుకున్న యాజ్ఞవల్క్యుడు , సూర్యభగవానుడి అనుశాసనాన్ని గుర్తుచేసుకుంటూ , సరస్వతీ ధ్యానంలో నిమగ్నుడయ్యాడు.4


కాస్సేపట్లో శ్రావ్యమైన వీణానాదం వినవచ్చిందతనికి. శబ్ద బ్రహ్మను తలపించే మనోజ్ఞ నాదమది ! తన చుట్టూ ప్రతిధ్వనిస్తున్న దివ్యరాగాన్ని ఆలకిస్తూ యాజ్ఞవల్క్యుడు కళ్ళు తెరిచాడు. అతని ఎదురుగా చిరునవ్వు వెన్నెలలు కురిపిస్తున్న సరస్వతీ మాత !


శ్వేత వస్త్రాలతో ఉన్న ఆ మహాశ్వేతను అక్షరాలు అచ్చులూ , హల్లులూ అందమైన తమ ఆకారాలతో ఆభరణాలుగా అలంకరించి ఉన్నాయి , ఓంకారం అగ్రభాగాన ఉంది !


అక్షరాభరణ సౌందర్యంతో వెలిగిపోతున్న 'అక్షరస్వరూపిణి'ని యాజ్ఞవల్క్యుడు పులకించిపోతూ దర్శించాడు. చేతులు జోడించి ఆ విద్యాధినేత్రికి నమస్కరించాడు.


*"అమ్మా ! వేదవిజ్ఞాన భిక్ష అనుగ్రహించు !"*


*"పుత్రా ! సూర్యగ్రహ వీక్షణ అనుకూలంగా లేని కారణంగా నీకు ఆశించిన విద్య అందే యోగం లేకపోయింది. ఇప్పుడు ఆ గ్రహరాజును ప్రసన్నుడిగా చేసుకున్నావు. కోరిన విద్యను నీకు అనుగ్రహించాలన్న స్ఫూర్తి నాకు కలిగింది !”*


*“ధన్యుణ్ణి , తల్లీ !"* యాజ్ఞవల్క్యుడు నమస్కరించాడు.


అక్షరరూపిణికి అర్ఘ్యం సమర్పించాడు. పుష్పాలతో పూజించాడు. అర్చన ముగించిన భక్తుడు తీర్థప్రసాదాల కోసం వేచి చూస్తున్నట్టు , కూర్చున్నాడు.


*"యాజ్ఞవల్క్యా ! కళ్ళు మూసుకో ! ఏకాగ్రచిత్తంతో , ధ్యాన నిష్ఠలో నిమగ్నుడివి కా ! ధ్యాన సమయంలో , నా అనుగ్రహంతో కోరిన విద్యలన్నీ నీకు స్ఫురిస్తాయి. ధ్యానగోచర మవుతాయి. ఇష్టవిద్యాప్రాప్తిరస్తు !"* సరస్వతి దీవిస్తూ అంది. ఆమె చల్లని చూపులు జ్ఞాన కిరణాల్లా యాజ్ఞవల్క్యుడి కళ్ళల్లోకి దూసుకెళ్ళాయి. ధ్యాన భారంతో అతని కళ్ళు సగం మూసుకున్నాయి.


జ్ఞాన పరిమళం తన సర్వస్వాన్నీ ఆవరిస్తున్న అనుభూతి కలుగుతోంది యాజ్ఞవల్క్యుడికి !


పదిహేను శాఖల యజుర్వేదం స్ఫురిస్తూ , యాజ్ఞవల్క్యుడి మేధోమంజూషికలో నిక్షిప్తమయింది. సాంఖ్యమూ , యోగమూ అతనిలోని జ్ఞానపుష్పాన్ని సంపూర్ణంగా వికసింపజేశాయి. శతపథ బ్రాహ్మణం పూర్తిగా అతని అంతరంగంలో ఆవిష్కరించబడింది.


మహత్తరమైన , అమూల్యమైన జ్ఞాన సంపదను ఆర్జించిన మహదానందంతో , పరమతృప్తితో కళ్ళు తెరిచాడు యాజ్ఞవల్క్యుడు. అక్షరాభరణాలతో అలౌకికమైన దర్శనాన్ని అనుగ్రహించిన సరస్వతీ మాత , తల్లి ఇచ్చిన క్షీరాన్ని తాగిన పసిబాలుడిలా కనిపిస్తున్న యాజ్ఞవల్క్యుడి వైపు చిరునవ్వుతో చూస్తూనే ఉంది. ఆమె దక్షిణ హస్తం అతన్ని దీవిస్తోంది. చేతులు జోడించి నమస్కరిస్తూ , ఆనందబాష్పాలు రాలుస్తున్న యాజ్ఞవల్క్యుడి ముందు నుంచి అదృశ్యమైంది సరస్వతి.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

దేశభక్తి

 *"మీరు సిగ్గులేని వారు కావచ్చు, నేను కాదు" - రతన్ టాటా*


*26/11 ముంబై దాడులు జరిగిన*

*కొన్నినెలల తరువాత భారత్ మరియు విదేశాల్లో ఉన్న తమ హోటళ్ళన్నీ రీమోడలింగ్ చేయడం కోసం అతి పెద్దవైన టెండర్లను టాటా కంపెనీ ఆహ్వానించింది.* *కొన్ని పాకిస్తానీ కంపెనీలు కూడా టెండర్లు వేసాయి. ఆ కాంట్రాక్టు తాము దక్కించుకునేందుకు చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా, ఇద్దరు పాకిస్తానీ పారిశ్రామికవేత్తలు ఎలాంటి అపాయింట్ మెంటూ లేకుండా రతన్ టాటాను కలిసేందుకు బొంబాయిలో ఉన్న బొంబాయి హౌస్ (టాటా హెడ్ ఆఫీస్) కు వచ్చారు.*

*అక్కడి ఆఫీసులో, వారిద్దరూ రతన్ టాటాను కలవడం కోసం చాలా సేపు నిరీక్షించారు. అలా వారు కొన్నిగంటల పాటు నిరీక్షించిన తరువాత సిబ్బంది వచ్చి, సార్ చాలా బిజీగా ఉన్నారు, అపాయింట్ మెంట్ లేనివారినెవరినీ కలవలేరు అని చెప్పి వెళ్ళిపోయారు.*

*దాంతో నిరాశ చెందిన వారిద్దరూ హస్తినకు వెళ్ళి, పాకిస్తాన్ హైకమీషన్ ద్వారా అప్పటి కాంగ్రెస్ మంత్రి ఆనంద్ శర్మను కలిసి విషయం వివరించారు.*

*ఆ వెంటనే ఆనంద్ శర్మ రతన్ టాటాకు ఫోన్ చేసి ఆ పాకిస్తానీలిద్దరినీ కలవాలని, వారి టెండర్లను పరిశీలించాలని ఒకింత గట్టిగా అడిగారు.*

*అప్పుడు రతన్ టాటా "మీరు సిగ్గు లేని వారు కావచ్చు, నేను కాదు" అని చెప్పి ఫోన్ పెట్టేసారు.*

*ఆ తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం టాటా సుమోలను దిగుమతి చేసుకోవడం కోసం ఆర్డరు ఇచ్చింది.*

*అయితే రతన్ టాటా ఒక్క సుమోను కూడా పాకిస్తాన్ కు పంపడానికి అంగీకరించలేక, ఆ ఆర్డరును తిరస్కరించారు.*

*అదీ రతన్ టాటా యొక్క దేశభక్తి.*

*ఆయన దేశభక్తి ముందు డబ్బూ మరియు వ్యాపారం కూడా చిన్నదే*