9, నవంబర్ 2023, గురువారం

Egypt train


 

Nasar Dry fruit merchant

https://www.facebook.com/reel/251159877612474?mibextid=YNcHmz 

Coolest places in the world


 

What a catch


 

Panchaag


 

Aa kaaratrayam

 


⚜ శ్రీ కష్టబంజన హనుమాన్ మందిర్

 🕉 మన గుడి : నెం 234






⚜ గుజరాత్ : సారంగపూర్ 


⚜ శ్రీ కష్టబంజన హనుమాన్ మందిర్



💠 సారంగపూర్ హనుమాన్ ఆలయం గురు స్వామినారాయణచే సృష్టించబడిన స్వామినారాయణ సంప్రదాయంలోని అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.  

గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలోని సారంగ్‌పూర్ గ్రామంలో ఉన్న ఇక్కడ ప్రధాన దైవం హనుమంతుడు కస్తభంజన్ రూపంలో పూజించబడ్డాడు, అంటే దుఃఖాలను తొలగించేవాడు.


💠 గుజరాత్‌లోని సారంగ్‌పూర్‌లో ఉన్న హనుమంతుని కస్తభంజన్ ఆలయం ఒక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం, ఇక్కడ అతని పాదాల వద్ద శనిదేవుని విగ్రహం ఉంది. 

ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ ఆలయంలో శనిదేవుడు స్త్రీ రూపంలో కొలువై ఉన్నాడు.  

ఇక్కడ ఇద్దరు దేవుళ్లను ఇలా వర్ణించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.


💠 ఒకప్పుడు శని భగవానుడు తన భక్తులను చాలా పరీక్షిస్తూ వారిని బాధపెట్టేవాడని పురాణాలు చెబుతున్నాయి.  

బాధలో ఉన్న భక్తులు హనుమంతుని జోక్యం చేసుకొని సహాయం చేయవలసిందిగా ప్రార్థించారు.  వారి స్థితిని చూసిన హనుమంతుడు శనిపై కోపించి అతడిని శిక్షించాలని నిర్ణయించుకున్నాడు.


💠 శని దేవుడు హనుమంతుని ఉద్దేశాలను తెలుసుకున్నప్పుడు, అతను హనుమంతుని కోపాన్ని వదిలించుకోవడానికి మార్గాలను కనుగొనడం ప్రారంభించాడు.  

హనుమంతుడు 'బ్రహ్మచారి' అని, ఏ స్త్రీని ఎప్పుడూ బాధపెట్టలేడని స్త్రీగా రూపాంతరం చెందాడు మరియు క్షమాపణ కోరుతూ హనుమంతుని పాదాల వద్ద లొంగిపోయాడు.

హనుమంతుడు అతనిని క్షమించాడు, అప్పటి నుండి శని స్త్రీ రూపంలో ఈ ఆలయంలో పూజించబడతాడు.


💠 సద్గురు గోపాలనంద్ స్వామి బొటాడ్ అనే గ్రామాన్ని సందర్శించడానికి వచ్చారు (సారంగ్‌పూర్ నుండి దాదాపు 11.3 కిమీ దూరంలో).  సారంగపూర్ నుండి దర్బార్ శ్రీ వాగాఖచార్ అనే భక్తుడు గోపాలనాద్ స్వామి దర్శనానికి వచ్చాడు.


💠 గోపాలానంద స్వామి వాగఖచార్ స్వామీజీని చూసిన తర్వాత అంతా సరిగ్గా ఉందా అని అడిగారు.  దానికి వాగాఖాచర్ సమాధానమిస్తూ సారంగపూర్‌లోని ప్రజలు చాలా కలత చెందుతున్నారని, గత 3 సంవత్సరాల నుండి వర్షాలు లేవు మరియు దాని కారణంగా సత్సంగానికి సదు సంత్‌లను పిలవడానికి కూడా తగినంత మంది ప్రజలు లేరని చెప్పారు.  

ఇది విన్న గోపాలానంద స్వామి ఆలోచించడం ప్రారంభించాడు మరియు "వాగాఖచర్ చింతించకండి, కష్టభంజనం మూర్తిని ఆలయంలో ప్రతిష్టిస్తే, దాని నుండి అన్ని కష్టాలు పోతాయి" అని చెప్పాడు, నేరుగా కంజి మిస్త్రీ అనే మూర్తిని పిలిచి, అతనికి డిజైన్ ఇచ్చారు.  సృష్టించాల్సిన మూర్తి. 

శాస్త్రం ప్రకారం గోల్పాలాండ్ స్వామి జీవితాన్ని మూర్తిగా మార్చాడు.  మూర్తిలోకి జీవం పోయడానికి గోపాలానంద స్వామి కష్టభంజన్ హనుమాన్‌జీ కళ్లల్లోకి చూశారని, స్వామీజీ శక్తుల కారణంగా మూర్తి వణుకుతున్నట్లు అక్కడి ఆలయ శాసనాళ్లలో  ఉంది.


💠 సారంగపూర్ హనుమాన్ దేవాలయం – హరతి వివరాలు

సారంగపూర్ హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తులు స్వామినారాయణ మహామంత్రాన్ని పఠిస్తారు.


🔅 మంగళ ఆరతి:

"జై కపి బల్వంత" అనేది సారంగపూర్ హనుమాన్ దేవాలయం యొక్క ఆర్తి.  తెల్లవారుజామున 5:30 గంటలకు జరిగే మంగళ హారతి లేదా ఆరతి దేవుని విగ్రహం చుట్టూ వృత్తాకారంలో వెలిగించిన కర్పూరాన్ని ఊపడం ద్వారా జరుగుతుంది.  

దేవతలు రోజు మొదటి దర్శనాన్ని అందిస్తారు, ఇది భక్తులకు శుభకరమైన ప్రారంభాన్ని సూచిస్తుంది.


🔅 శంగర్ ఆరతి: 

ప్రతి మంగళవారం మరియు గురువారాల్లో ఉదయం 7:00 గంటలకు శంగర్ ఆరతి నిర్వహిస్తారు.  శంగర్ అంటే అలంకారాలు.  ఈ హారతి సమయంలో, దేవతలు దుస్తులు ధరించి అలంకరిస్తారు.


🔅 రాజ్‌భోగ్ ఆరతి: 

రాజభోగ్ ఆరతి ఉదయం 10:30 నుండి 11:00 గంటల వరకు జరుగుతుంది.  

మధ్యాహ్న భోజనం యొక్క రాజ నైవేద్యాలను దేవతలకు సమర్పిస్తారు.


🔅 సంధ్యా ఆరతి: 

సూర్యాస్తమయ సమయాలను బట్టి సాయంత్రం సమయంలో ఈ హారతి నిర్వహిస్తారు.  భక్తులు సంధ్యా ఆరతి సమయంలో దేవుడి దర్శనం కోసం మరియు ప్రార్థనలు చేయడానికి తరలివస్తారు.


🔅 శయన ఆరతి: 

శయన హారతి అనంతరం భక్తులకు దర్శనం మూసివేయబడింది. 

దేవతలు రాత్రికి విశ్రాంతి తీసుకోబోతున్నారని ఇది సూచిస్తుంది.


💠 ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు, సాయంత్రం 4:00 నుండి రాత్రి 9:00 వరకు


💠 సందర్శించడానికి ఉత్తమ సమయం

ఆగస్టు నుండి మార్చి వరకు


💠 రైలు ద్వారా: బోటాడ్ రైల్వే స్టేషన్ నుండి సారంగపూర్ హనుమాన్ ఆలయానికి మధ్య దూరం 73 కిమీ మరియు 168 మీటర్లు. 

Atibala


 

దౌత్య నైపుణ్యం

శు భో ద యం🙏


దౌత్య నైపుణ్యం! హంస  చాతుర్యం! 


                      తెలుగు సాహిత్యం అనువాదంతో  ప్రారంభమైంది. ఆకోవలోనే   కావ్యానువాదాలూ  నర్వహింపబడినాయి. శ్రీనాధమహాకవి  కాశీఖండాది  పురాణముల ననువదించుటయేగాక, శ్రీహర్షనైషధమును మూలమునకు వన్నెబెట్టుచు, కడుమనోహరముగా ననువదించినాడు. 


                          అందు నల-దమయంతుల నడుమ ప్రణయ రాయబారృనొనరించిన  హంస  పాత్రను కడుంగడు మెళకువతో తీర్చిదిద్దినాడు. ఆమెమాటలు నేర్చిన  హంస. కార్య సాధనకు దగిన వాక్ చాతుర్య మామె సొత్తు. అవసరమైనచో  యెంతటివారినైనను  తన మాటల మధ్యలో నిరికించి తనపని పూర్తిచేసికొను నుపాయమామెకు కరతలామలకము. ఆరాయంచ కార్యసాధనా నైపుణ్యమునకు ప్రతీకలైన    రెండుపద్యములను  మీకు పరిచయ మొనరింతును. చిత్తగిపుడు!చం: 


చం:  అడిగితి  నొక్కనాడు  కమలాసను   తేరికి   వారువంబనై  

         నడచుచు  నుర్విలో   నిషధనాధున  కెవ్వతెయొక్కొ భార్యయ 

         య్యెడునని, చక్ర  ఘోషమున నించుక  యించుక   గాని, యంత  యే 

         ర్పడ  విన నైతి; నీవ యని చెప్పిన చందము  దోచె, భామినీ! 


ఉ:    నిర్ణయ  మానృపాలునకు  నీకును  సంగతి ; యెల్లి   నేటిలో 

        దూర్ణము  చేయగాగలడు  తోయజసూతి; తదన్యధా  వృధా 

        దుర్ణయ  వృత్తికిన్   మనసుఁ దూర్చినయేని, జగజ్జనాప వా 

        దార్ణవ ముత్తరించుటకు   నాతని  కెయ్యది  తెప్ప? జెప్పుమా? 


                                ఈరెండు పద్యాలతో దమయంతిని కట్టిపారేసింది. యెటూమనస్సు త్రిప్పుకుంటానికి వీలులేకుండా!అదీచతురత! " బ్రహ్మగారు  నీకూ నలునకూ పెళ్ళి నిర్ణయించేశాడమ్మా! నేనడిగానొకనాటి ప్రయాణసమయంలో, చక్రాలరొదలో  స్పష్టంగా వినబడలేదుగానీ, నీపేరే చెప్పినట్లు గుర్తు. మీయిద్దరికీ ముడిపెట్టటానికి బ్రహ్మ ముహూర్తంగూడా పెట్టేశాడు. ఇప్పుడు నువ్వు నలుని కాదవ్నావనుకో బ్రహ్మగారు కుదేలే! లోకనింద సముద్రంకన్నా విశాలం. దానిని దాటటానికతనికి   తెప్పకూడా దొరకదమ్మా!(   ఇంత వరకూ బ్రహ్మ రాతకు తిరుగులేదనే జనుల యభిప్రాయం మారిపోతుంది. బ్రహ్మ రాతలన్నీ నీటిమూటలేృనని నలుగురూ నవ్వి పోతారు) అందు చేత నలుని మాత్రమే నీవు వరింతువుగాక! యనితనమాటతో దమయంతిని కట్టిపారేసింది! 

             

                       ఇదిగో  యిలాంటి అసమాన నైపుణ్యం  పింగళిసూరన  గారికావ్యం ప్రభావతీ ప్రద్యుమ్నం లోఉంది. అందులో 

"సుచిముఖి" అనేఓచిలుక  ప్రభావతీ  -ప్రద్యమ్నుల నడుమ  ప్రణయ రాయబారావ్ని నిర్వహిస్తుంది. అందుకే వాఙ్మయ పరిశీకులన్నారు" శ్రీనాధుని  హంసము, సూరనగారి  చిలుకకు గురుస్థానమున నిలచినదని". ఆవింత మరోసారి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

జీవన వేదం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

https://whatsapp.com/channel/0029VaA63sq5q08lbf7pP73f


*జీవన వేదం*

 

రచన : గన్నవరపు నరసింహమూర్తి      


 

"ఇల్లు అద్దెకు ఇవ్వబడును " అన్న బోర్డు చూసి ఆ ఇంటి ముందు నేను భాను ఆగేము. ఇప్పటికి వారం రోజుల నుంచి  ఇద్దరం ఇంటివేటలో ఎన్నో ఇళ్ళు చూసాము. కానీ  ఏ ఇల్లు కుడా మాకు నచ్చలేదు . కొన్ని బాగున్నా లొకాలిటి బాగాలేక వద్దనుకున్నాము. నాకు ఈ వూరి  హై స్కూల్లో  సైన్సు అసిస్టెంట్ గా క్రితం నెలలో పోస్టింగొచ్చింది. అంతకు మునుపు నేను బి. ఈడి. పూర్తికాగానే  ఒక ప్రైవేటు స్చూల్లో టీచర్ గా పని చేసే వాణ్ని.అప్పుడు అక్కడే టీచర్ గా పనిచేస్తున్న భానుతో పరిచయమయి పెళ్లి చేసుకున్నాను. ఆ తరువాత నేను డి. ఎస్సి  లో సెలెక్ట్ అయి ఈ ఊర్లో పోస్టింగ్ రావడంతో ఇక్కడకు వచ్చి జాయిన్ అయ్యాను. భాను కూడా ఆ టీచర్  ఉద్యోగానికి రాజీనామా చేసి నాతో పాటు వచ్చేసింది. మొదట్లో ఇల్లు దొరక్క భానుని వాళ్ళ పుట్టింటికి పంపించాను. పదిహేను రోజుల తరువాత ఒక చిన్న ఇల్లు దొరికితే అందులో సామాన్లు దించి భానుని తీసుకు వచ్చాను. ఎందుకో భానుకి ఆ ఇల్లు నచ్చలేదు. దానికి కారణం అది చిన్న ఇల్లు కావడం. అప్పుడప్పుడు మా అమ్మ వచ్చి రెండేసి నెలలు  ఉంటుంది. ఆ సమయంలో ఆమెకు ఇబ్బంది ఎదురౌతుందని ఆమె ఆలోచన. అందుకే  ఈ ఇళ్ళ వేట. 


వారం రోజుల నుంచి ఇద్దరం కళ్ళకు బలపాలు కట్టుకు తిరుగు తున్న ఒక్క మంచి ఇల్లు కూడా కనిపించటం లేదు. గేటు ముందున్న కాలింగ్ బెల్ నొక్కగానే లోపలి నుంచి ఓ ఏ భై ఏళ్ళ వయసున్న ఒకావిడ బయటకు వచ్చి "చెప్పండి ఏమి కావాలి "  అని అడిగింది.

"మేడం ఇల్లు ఖాళీగా వుందని విన్నాం.  అందుకే వచ్చాం" అన్నాను. 

"మేడ  మీద పోర్షను  ఖాళీగానే వుంది  రండి చూద్దురు గాని" అంటూ గేటు తలుపులు తీస్తూ "ఏమండోయ్ ఇంకా పేపర్ చదవడం పూర్తి కాలేదా ఇల్లు చూడటానికి ఎవరో వచ్చారు ఇటు రండి " అంటూ లోపలికి ప్రవేశించింది.  ఆమె మాటలకూ వరండాలో వాలుకూర్చులో కూర్చుని పేపరు పటనంలో మునిగి పోయిన ఆ వ్యక్తి ఒక్క ఉదుటన లేచి "అబ్బే ఎప్పుడో చదివీసేనోయ్ " అంటూ బయటకు వచ్చాడు. చూడటానికి అతను అరవై ఏళ్ళ వ్యక్తి లా ఉన్నా ముఖంలో  హుషారు కనిపిస్తోంది. అతనికి నేను నమస్కారం పెట్టి "నాపేరు భరద్వాజ ఈ మధ్యనే ఇక్కడి హై స్చూల్లో టీచర్ గా జాయిన్ అయ్యాను. ఈమె నా శ్రీమతి భాను . ఇల్లు ఖాళీగా ఉందని తెలిసి ఇలా వచ్చాము" అన్నాను. 


నమస్కారం.. మీరు టీచరే నన్న  మాట. రండి ఇల్లు చూద్దురుగని అంటూ మమ్మల్ని మేడ  మీదకు తీసికెళ్ళాడు. ఏ  తలుపులకీ తాళాలు లేకపోవడంతో ఒక్కక్కటి తీస్తూ అన్ని గదులూ చూపించాడు. ఇల్లు విశాలంగా బాగానే ఉంది. రెండు బెడ్ రూములు, హాలు, కిచెన్, దూరంగా టాయిలెట్ ,పక్కనే వాష్ బేసిన్. ముఖ్యంగా ఆ ఇల్లు భాను కి బాగా నచ్చింది. ఇల్లు చూసిన తరువాత కిందకు వచ్చాము. నేను కింద ఉన్న కుర్చీలో కూర్చుంటే భాను ఆవిడతో కలసి లోపలికి వెళ్ళింది. ఇంతలో అతను కుడా వచ్చి నా పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటూ "ఇప్పుడు చెప్పండి. ఏ  వూరు మీది?ఎంతమంది   ఉంటారు? " అని అడిగాడు .


మాది ఇక్కడికి నలభయ్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లెటూరు. మా నాన్న గారు కూడా అక్కడే టీచరుగా  పని చేసి రిటైయ్యి క్రితం సంవత్సరమే అనారోగ్యం తో చనిపోయారు. ఇప్పుడక్కడ మా అమ్మ ఒంటరిగా ఉంటోంది. నేనొక్కడినే కొడుకు కా వడంతో అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తూ వుంటుంది . మా పెళ్లి క్రితం సంవత్సరమే అయ్యింది. ఇంకా మాకు పిల్లలు లేరు. ప్రస్తుతానికి మేమిద్దరమే ఉంటాం. అన్నాను.


అమ్మగారు వొంటరిగా వుంటున్నారు  అన్నారు, మరి ఆవిడని మీ దగ్గరికే తీసుకువస్తే మంచిది కదా,  ఇంతకీ మా గురించీ చెప్పలేదు కదూ,  నా పేరు వెంకట్రామయ్య , నేను కుడా మీరు పని చేస్తున్న హైస్కూల్లోనే తెలుగు మాస్టారిగా పని చేసి రెండేళ్ళ క్రితం పదవీ విరమణ చేశాను. మా ఇద్దరు  పిల్లలు   అమెరికాలో ఉంటున్నారు, కొడుకు న్యూయార్క్ లోను ,పిల్ల న్యు జెర్సీలో ఏంటో  పిల్లలున్నా  మాది ఒంటరి బ్రతుకే ....అందుకే మీ అమ్మని మీదగ్గరికి  తెచ్చుకోమంటున్నాను.. క్రితం సంవత్సరం దాక పిల్లలొచ్చినప్పుడు ఇబ్బందనీ ఈ ఇంటిని అద్దేకివ్వలేదు. కానీ  ఈ వయసులో ఎదైనా అవసరం పడితే పనికొస్తారని క్రితం సంవత్సరం నుంచే అద్దె కిస్తున్నాము. మీ లాంటి టీచరే మొన్నటి దాక ఆ పోర్షన్ లో అద్దె కుండేవారు. అతగాడికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావడంతో ఖాళీ చేసివేళ్ళిపోయారు అంటూ చెప్పాడాయన. 


     ఇంతలో భాను ఇంట్లోనుంచి ఇంటావిడితో కలసి బయటకు వచ్చింది.   నేను వెంటనే కుర్చీలోంచి లేస్తూ మాస్టారు  మీ ఇల్లు మాకు నచ్చింది. అద్దె ఎంతో చెబితే ఈ వారం లోనే మేము దిగిపోతాము  అన్నాను.


అద్దె పెద్ద సమస్య కాదులే బాబు, పాత వాళ్ళు  పదిహేనువందలిచ్చేవారు మీరు అంతే ఇవ్వండి, మాకు డబ్బు ముఖ్యం కాదు, ఓ మంచి కుటుంబం మంచి మనుషులు మాకు కావాలి. అంతే. మీ కిష్టం అయితే మంచి ముహూర్తం  చూసుకొని దిగండి అన్నాడాయన .


ఆ తరువాత మరో పది నిముషాలు పిచ్చా పాటి  మాట్లాడి నేను భాను ఇంటికి తిరిగోచ్చాము

.

  అనుకున్నట్లుగానే నాలుగు రోజుల తరువాత ఆ ఇంట్లోకి మారిపోయాము.


   ***                         


ప్రుత్యూషపు  వేళ.  దేవుడి గదిలోంచి గంటల శబ్దం చెవులకి సోకడంతో ఒక్కసారిగా నాకు తెలివొచ్చింది. అప్పటికే భాను లేచి స్నాన పానాదులు ముగించి దేవుని పూజలో మునిగిపోయివుంది. మా పెళ్లి అయిన దగ్గర్నుంచి ఆమెకది అలవాటు. ఎప్పుడు నాలుగు గంటలకే లేచిపోతుంది. మడిగా  స్నానం చేసి పూజాదులు ముగిసిన తరువాతే మిగతా పనులు. అందువల్ల నాక్కూడా త్వరగా లేవడం అలవాటు. కళ్ళు నులుపు కొని లేచి కాలకృత్యాలు తీర్చుకొని మార్నింగ్ వాక్ కి బయలుదేరాను. అప్పటికింకా చీకటి తెరలు తొలగలేదు. 


హేమంతం కావడంతో తెల్లటి మంచు విపరీతంగా కురుస్తోంది. నేను బయటకు వచ్చే సరికి ఇంటావిడ అన్నపూర్ణమ్మ గారు ఇంటిముందర ముగ్గులేస్తోంది. దూరంగా ఆలయం లోంచి ఎమ్మెస్  సుబ్బలక్ష్మి భజగోవిందం మంద్రంగా వీనులకు సోకుతు ఆ ప్రభాత సమయానికి ఒక పవిత్రతని ఆపాదించ  సాగింది. నేను ఆ ముగ్గును దాటుకుంటూ  బయటపడ్డాను . రెండు కిలోమీటర్లు నడిచి వెనక్కి వస్తుంటే దార్లో వెంకట రామయ్య గారు కనపడ్డారు.


ఏమయ్యా నీకు వాకింగ్ అలవాటా? అన్నారు.

అవును మాస్టారు, నాకు చిన్నప్పట్నుంచి  వాకింగ్ అంటే ఇష్టం అన్నాను.

చాలా మంచి అలవాటు, ఎలా వుంది స్కూలు? ఇంతకీ ఈ ఉరు నచ్చిందా?

స్కూలు, ఊరు రెండు  బాగున్నాయి మాస్టారు అది సరే   ..మీ పిల్లలు అప్పుడప్పుడు వస్తుంటారా?"

ప్రతీ సంవత్సరం వస్తామనే వెళ్ళేటప్పుడు చెప్పారు. కానీ అలా జరగటం లేదు, అబ్బాయి సుధాకర్ వెళ్లి నాలుగేళ్ళు కావస్తున్న ఇప్పటిదాకా రాలేదు, ఇకపోతే అమ్మాయి పెళ్ళికి ముందు మా అల్లుడు రవి అసలు అమెరికా వెళ్ళే ఆలోచనే లేదని చెప్పాడు, కానీ   ఆరు నెలల తరువాత అక్కడేదో మంచి ఉద్యోగం వచ్చిందనీ, రెండేళ్ళు పనిచేస్తే బోలెడు డబ్బు సంపాదిన్చావచ్చ  నీ చెప్పి అమ్మాయిని కుడా తనతో తీసుకుపోయాడు. కానీ వాళ్ళు వెళ్లి మూడేళ్ళు దాటిపోయింది, వాళ్ళు కుడా ఇప్పటిదాకా రాలేదు పక్కనే ఉన్న పార్క్ లోకి నడుస్తూ చెప్పాడాయన.


తూర్పు సంజ సింధూర వర్ణం తో వెలుగు రేకల్ని ప్రసరించడానికి ఆయత్తమవుతోంది. అప్పటికే పార్కు అంతా మార్నింగ్ వాకర్స్ తో కళకళ లాడుతోంది.మేమిద్దరం ఒక మూలగా ఉన్న గన్నేరు చెట్టు కింద బెంచి మీద కూర్చున్నాం  .    


మాస్టారు , ఈ వయసులో ఇద్దరు పిల్లలు మీకు దూరంగా ఉండటం బాగా ఇబ్బందే, పోనీ మీ అబ్బాయిని అయినా త్వరగా రమ్మని చెప్పండి. మీక్కొంచెం వెసులుబాటు అవుతుంది. నువ్వు చెప్పింది నిజమే భరద్వాజా, కానీ అమెరికా కి వెళ్ళడం అన్నది పద్మవ్యూహంలోకి ప్రవేశించడం లాంటిది, ఒక్కసారి వెళ్ళినవారు అంత త్వరగా  వెనక్కి రాలేరు, అక్కడి సమస్యలు అటువంటివి, పోనీ రాకపోతే లేదు కనీసం ఉత్తరాలు గానీ ,ఫోన్లో మాట్లాడటం గాని చెయ్యరు. . వేలమైళ్ళ   దూరంలో వృద్ధులు  అయిన తల్లితండ్రులు ఉన్నారని, వాళ్ళకీ వయసులో తరచూ ఆరోగ్య సమస్యలు తలెత్తు తుంటాయన్న ఆలోచన కుడా వాళ్లకి రాకపోవడం ఆశ్చర్యం. ఎప్పుడైనా మేము మాట్లాడటమే తప్ప వాళ్లకి వాళ్ళు మా సమాచారం తెలుసుకోరు. ఇద్దరికిద్దరూ అంతే, అదే మా బాధ. నేను పదవీ విరమణ చేసినప్పుడు ఇద్దరు వస్తామన్నారు, కానీ ఇద్దరు రాలేదు, ఆ రోజు మాత్రం చాలా బాధ వేసింది." అతని మాటల్లో వేదన ధ్వనిస్తోంది. 


మీరేమీ ఈ విషయాన్ని తలచుకొని బాధ పడొద్దు మాస్టారు! ఏమైనా సమస్యలొస్తే మేమంతా లేమా చెప్పండి. ...

పదండి మాస్టారు ఇప్పటికే సమయం బాగా మించి పోయింది.. అంటూ నేను లేవడంతో ఆయన కుడా లేచి నన్ను అనుసరించేరు.


ఆ రోజు నుంచి మా రెండు కుటుంబాల మధ్య స్నేహం పెరుగుతూ వచ్చింది. రోజు నేను కూరగాయలకు మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా వాళ్లకి కుడా తెచ్చేవాడిని.  అలాగే రోజు పాలపేకెట్టుకి తెల్లవారి లేచి మాస్టారు గారు వెళ్ళేవారు. నేను ఎలాగు మా పాలకోసం వేల్లవలసిరావడంతో  వాళ్లకి కుడా నేనే తెచ్చేవాడిని. మొదట్లో ఆ దంపతులు కొద్దిగా  మొహమాట పడినా నేను గట్టిగా చెప్పడంతో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇవేగాక మాస్టారు గారికి సెల్ ఫోనులో ఎన్నో సమస్యలు వచ్చేవి. అతనికి అందులో అడ్రస్ లు   సేవ్ చెయ్యడం, చార్జింగు ఎప్పుడు ఆపు చెయ్యాలోనన్న విషయం, అలారం పెట్టడం లాంటివి తెలిసేవి కావు, అందుకోసం రోజు నన్ను గాని, భాను ని  గానిపిలిచి సెల్లిచ్చి  వాటిని సెట్ చేయమనేవాళ్ళు.


 అలాగే భానుకి ఇంటావిడ అన్నపూర్ణమ్మ గారితో బాగా స్నేహం కుదిరింది. ఇద్దరు తెల్లవారే లేచి స్నానాలు చేయడం, పూజలనంతరం గుమ్మం ముందు కలిసే ముగ్గులు పెట్టేవారు, ఆ తరువాత ప్రతీ శనివారం దగ్గరలోని వెంకటేశ్వరుడి గుడికి వెళ్ళేవారు. ఇక మేము ఇంట్లో దిగిన వెంటనే వచ్చిన కార్తీకమాసం వాళ్ళ బంధాన్ని మరింత బాల పడేటట్లు చేసింది. తెల్లవారి స్నానాలు ,కార్తీక సోమవారాల్లో ఉపవాసాలు, కార్తీకపురాన పటనం   ఉదయం పూట శివాలయంలో అభిషేకాలు  ...ఇలా వాళ్ళిద్దరికీ క్షణం తీరిక ఉండేది కాదు. అప్పుడప్పుడు నేను, మాస్టారుగారు కలిసి మాఇంట్లో నే భోజనాలు చేసే వాళ్ళం.


ఇలా మా అద్దింటి జీవితం హాయిగా సాగిపోతున్న సమయంలో చిన్న అపశ్రుతి మాస్టారి గారి భార్య బాత్ రూం లో జారిపోవడం అనే సంఘటన ద్వారా దొర్లింది. అదృష్టవశాత్తు తలకయితే దెబ్బ తగల్లేదు గాని కాలు మాత్రం విరిగిపోయింది. హాస్పిటల్ కి తీసికేల్తే కట్టు కట్టి రెండు నెలలు విశ్రాంతి అవసరం అని చెప్పారు డాక్టర్లు. 


ఆ రోజు సాయంత్రం స్కూలు నుంచి రాగానే మాస్టారి దగ్గరికి వెళ్లి అన్నపూర్ణమ్మ గారి ఆరోగ్యం గురించి సమాచారం తెలుసుకున్నాను. అప్పటికే భాను ఆ విడ దగ్గరే ఉంది. ఆ మధ్యాహ్నం భానే వాళ్ళకి మా ఇంట్లోనే వంట వండి తీసుకెళ్ళింది. ముందుగా మాస్టారుగారు మొహమాతపడినా భాను బలవంతం మీద ఒప్పుకున్నారు,  నన్ను చూడగానే మాష్టారు చాలా సంతోశించేరు. నిజంగా మీ దంపతుల సాయం మరచిపోలేమ య్యా, మీరే గానీ లేకపోతే ఈ సమయంలో చాలా ఇబ్బందులు పడే వాళ్ళం. అన్నారాయన.


ఇటువంటి సమయాల్లో ఎవరైనా సహాయం చేస్తారు. అది సరే అమ్మగారికి జరిగిన ప్రమాదం గురించి పిల్లలకు చెప్పారా? కుర్చీలో కూర్చుంటూ అడిగాను.

ఉదయం నుంచీ ఇద్దరకి నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తోంది. అయినా ఇప్పుడు వాళ్లకి రాత్రేమో.రాత్రి మళ్ళీ ట్రై చేస్తాను అన్నాడాయన .

ఓ పని చెయ్యండి.వాళ్ళ నంబర్లు చెప్పండి, నా సెల్లు ద్వారా ట్రై చేస్తాను అనగానే ఆయన పక్కనే ఉన్న చిన్న పుస్తకం తీసి చెప్పాడు. వెంటనే ఆ నంబర్లకి  నేను రింగ్ చెయ్యగానే వాళ్ళ అబ్బాయి  లయిన్లోకి వచ్చాడు.


సుధాకర్ గారు నా పేరు భరద్వాజ నేను ఇండియా  నుంచి మాట్లాడుతున్నాను మీ ఇంట్లో అద్దెకుంటున్నాను నేను. ఈ రోజు ఉదయం మీ అమ్మగారు బాత్ రూంలో పడిపోయారు. మిగతా విషయాలు మీ నాన్నగారితో మాట్లాడండి అంటూ ఆయనకే ఫోను ఇచ్చాను. ఆయన ఫోన్ అందుకొని సుధా నేనురా మీ నాన్నని అవును  మీ అమ్మకే బాత్రూం లో స్నానం చేస్తూ పడిపోయింది.... కాలుకి ఫ్రాక్చర్  అయింది....  కట్టు కట్టారు రెండు నెలలు మంచం దిగకూడదు అన్నారు. మిమ్మల్ని చూడాలంటోందిరా  మీరిద్దరూ వస్తే బాగుంటుంది.  ఈ వయసులో మీరు మా గురించి పట్టించు కోకపోవడం చాలా ఘోరం రా ఈ విషయం చెల్లికి కుడా చెప్పు....ఏంటి సెలవు దొరకదా సరే నీ ఇష్టం వుంటాను అంటూ ఫోన్ కట్ చేసి నాకిచ్చారు.


నేను చెప్ప లేదయ్యా  వాళ్ళు రారనీ శలవులు దొరకవట అవసరం అయితే డబ్బులు పంపుతారట. డబ్బులు ఎందుకయ్యా మాకు అదృష్ట వశాత్తు నాకు పదవీ విరమణ తరువాత పదిహేను లక్షలు వచ్చాయి. పది వేలు పెన్షన్ వస్తోంది కానీ ఈ వయసులో డబ్బు కన్నా పిల్లల ప్రేమ ముఖ్యం మాకు.. వాళ్ళిద్దరూ సంవత్స రానికి ఒక్కసారి వచ్చినా  తృప్తి గా వుంటుంది మాకు లేకపోతె పిల్లలు ఎందుకు చెప్పు? మనం మానవులం.  పశు పక్ష్యాదులం కాము. తల్లి తండ్రుల్ని మరిచిపోవడానికి. కానీ మా వాళ్ళకీ బందాలేవీ అర్ధం కావడం లేదు ఏమి చేస్తాం మా ఖర్మ. అన్నాడాయన విచారంగా .అతను ఆ ఆ మాటలు చెబుతుంటే అతని కళ్ళల్లో సన్నటి తడిని గమనించాను. కొద్ది సేపటి తరువాత మళ్ళీ అతనే చెప్పడం మొదలు పెట్టాడు.


అసలు విషయం నీకు చేప్పలేదయ్య,  మా అబ్బాయి సుధాకర్ అమెరికా వెళ్ళిన సంవత్సరానికి తనతో పాటే వుద్యోగం చేస్తున్న ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్ళాడాడు. ఆ తరువాత మేము పెళ్లి సంబందాలు చూస్తున్నామని చెబితే ఇక తప్పక ఆ విషయాన్ని చెప్పాడు. ఆ విషయాన్ని విన్న వాళ్ళ అమ్మ రెండు సంవత్సరాలు మనిషి కాలేదు. వాడి సంగతి అలా ఉంచితే అమ్మాయిది ఇంకో సమస్య దానికి మేమే పెళ్లి చేసినా అక్కడికి వెళ్ళిన తరువాత ఇద్దరు గొడవలు పడి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత అది ఇంకో అమెరికన్ని పెళ్లి చేసుకుందిట. ఆ విషయం మా వాడి ద్వారా ఈ మధ్యనే మాకు  మాకు తెలిసింది.  అందుకే వాళ్ళిద్దరూ ఇక్కడికి రారు వాళ్లకు ముఖం చెల్లదు. ఎందఱో విద్యార్దులను తీర్చిదిద్దిన నేను మా పిల్లల విషయంలో మాత్రం అపజయం చెందానని చెప్పొచ్చు. ఎం చేస్తాం ఇది మా ప్రారభ్డం అన్నాడాయన.


మాస్టారు అది మీ అపజయం కాదు. ఒక విధంగా సమాజం అలా తయారయింది, అమెరికా చదువులు, ఉద్యోగాలు అంటూ నేటి యువత ఆశల ఎండమావుల వెంట పరిగెడుతోంది. ఇప్పటి యువతరం గమ్యం అమెరికా, డబ్బులు సంపాదించడం. వీళ్ళకి తల్లితండ్రులు, మానవ సంబంధాలు ముఖ్యం కావు. ఎప్పుడు అయితే  మనిషికి డబ్బు మొదటి ప్రాధాన్యం అవుతుందో అప్పుడు మృగంలా మారతాడు.. అంటూ ఆయన్ని ఓదార్చి ఇంటి లోపలి వెళ్లాను. ఆతరువాత అన్నపూర్ణమ్మ గారిని పరామర్శించి నేను భాను ఇంటికి తిరిగి వచ్చేసాము.


    *****  


అన్నపూర్ణమ్మ గారికి ప్రమాదం జరిగి రెండు నెలలు దాటిపోయాయి.ఇప్పుడిప్పుడే ఆమె కోలుకొనీ తన పనులు తాను చేసు కుంటోంది. భాను కుడా ఆమెకి అన్ని పనుల్లో సహాయం చేస్తుండటంతో వాళ్లకి పెద్దగా సమస్యలు రాలేదు.


వాళ్ళు  భావించినట్లు పిల్లలు మాత్రం రాలేదు.  ఈ లోగా వేసవి శలవులు రావడంతో మా వూరు వెళ్లి అమ్మ ని తీసుకొచ్చాను. వేసవి శలవుల్లో ఆమెని కాశీకి తీసికేళ్ళాలని నా ఆలోచన.తనని కాశీ  తీసికెళ్ళమనీ అమ్మ చాలా రోజుల నుంచీ పోరు పెడుతున్నా  నేనే తీరిక లేక ఆ ప్రయాణాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాను. ఆ విషయం మాస్టారితో చెబితే తాము కుడా వస్తామని చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను.వెంటనే మా అయిదుగురికి రిజర్వేషన్ చేయించి వారం రోజుల తరువాత కాశీకి   బయలు దేరాము.


మేము వెళ్ళేరైలు  తెల్లవారి అయిదు గంటలకు. దగ్గరలోని విజయనగరంలో రైల్ ఎక్కాము. అలసట లేకుండా ఉంటుందనీ ఏసీలో రిజర్వేషన్ చేయించాను .ఉదయానికి ఇడ్లీలు,మధ్యాహ్నానికి పులిహోర చేసి పట్టుకుంది భాను. ఎప్పుడు లేనిది వెంకట్రామయ్య గారి దంపతుల ముఖాల్లో ఆనందాన్ని గమనించాను నేను. మర్నాడు సాయంత్రం మేము కాశీకి చేరుకున్నాము. కాశీలో దిగగానే టాక్సీ తీసుకొని ఆంధ్రా సమాజం వారు నడుపుతున్న సత్రానికి బయలుదేరాము.ఆ రోజు పూర్తిగా  విశ్రాంతి తీసుకొని తెల్లవారు తుండగా గంగా నదికి బయలుదేరాము. గ్రీష్మం కావడంతో అక్కడి వాతావరణం వేడిగా వున్నా ప్రత్యూష సమయం కాబట్టి గంగా తీరం చల్లటి గాలులతో ప్రశాంతంగా ఉండటంతో తృప్తిగా గంగలో స్నానం చేసాము . మాస్టారు గారయితే  చిన్నపిల్లాడిలా మొలలోతు నీళ్ళలోకి వెళ్లి గంటసేపు స్నానం చేసారు. భాను, అన్నపూర్ణమ్మగారు మా అమ్మ చేత ఆ పవిత్ర గంగలో స్నానం చేయించేరు.. ఆ తరువాత అందరం కలిసి కాశీ విశ్వనాధున్ని విశాలాక్షిని దర్శించుకోవడానికి ఆలయానికి బయలుదేరాము.


ఆలయంలో ఘంటికలు విరామం లేకుండా మ్రోగుతున్నాయి. దూరంగా ఎక్కడినుంచో లింగాష్టకం మృదు మధురంగా వినిపిస్తూ వీనులకు విందు చేస్తోంది. బ్రహ్మ మురారి సురార్చిత లింగం,

నిర్మల భాసిత శోభిత లింగం" అలా ఆ లింగాష్టకం వినిపిస్తుంటే నేను కుడా నా పెదవులతో దాన్ని ఉచ్చరిస్తూ విశ్వనాధ, విశాలాక్షి లను మనస్పూర్తిగా దర్శనం చేసుకున్నాము. ఆ తరువాత మేమందరం కలిసి అభిషేకం చేయించాము.    


దర్సనానంతరం పడవలో గంగానది మధ్యకి వెళ్లి పిత్రు తర్పణాలు కావించాము.మాస్టారు దంపతులు, మా అమ్మ చేత తమస్వపిండాలను పవిత్ర గంగలో విడిచి పెట్టినాము. అలా తర్పణం చేస్తే వంశానికి మంచిదని పురాణాలు చెబుతున్నాయని మాస్టారు గారు చెప్పారు.


ఆ సమయంలో నాకో సందేహం వచ్చి మాస్టారు కాశీకి  వచ్చి నప్పుడు తమ కిష్టమయిన  వస్తువుని గంగలో విసర్జిస్తే మంచిదనీ, కాకపోతే దాన్ని తరువాత త్యజించాలనీ మా నాన్న గారు చెబుతుండేవారు. ఇది నిజమేనా?" అని అడిగాను.


 "నిజమేనయ్య, మనం దేని మీద ఎక్కువగా మక్కువ చూపిస్తే దానికి బానిసలమై అవి లేనిదే మనం బ్రతకలేనంతబలహీనతకు లోనవుతాము. దానిని అధిగమించడానికే ఈ గంగలో త్యజించడం అని పురాణాల్లో చెప్పబడ్డాయి. ఒక విధంగా ఇది మన మనో నిబ్బరానికి పరీక్ష, అది సరే ఇంతకీ నువ్వు, కోడలు ఏమిటి విసర్జించదలిచారు? అన్నాడాయన ఒడ్డుమీడకు వస్తూ.


అప్పుడు నేను నవ్వుతు నాకు బెండకాయలు బాగా ఇష్టం. అందుకే వాటిని వదిలేడ్డామనుకున్తున్నాను. అంటూ సంచిలో తెచ్చిన బెండకాయల్ని గంగలో విడిచాను. పురోహితుడు మంత్రాలు చదువుతూ వాటిని గంగలో విడిచి పెట్టించాడు. అలాగే భాను కుడా పొట్లకాయలు విడిచి పెట్టింది.

   

ఆ తరువాత మాస్టారు దంపతులతో మీరే వస్తువులను గంగలో విసర్జిన్చాలనుకున్తున్నారు ? అని అడిగాను.


నా ప్రశ్న  వినగానే మాస్టారి గారి ముఖం గంభీరంగా మారిపోయింది. అన్నపూర్ణమ్మగారి కయితే కంట నీరు ప్రత్యక్ష మైనది. కొద్ది క్షణాల మౌనం తరువాత ఆయన చెప్పడం మొదలు పెట్టాడు.


మా ఇద్దరి పిల్లల్ని మేము కంటికి రెప్పల్లా పెంచాము. వాళ్ళ తోడే జీవితమనీ నమ్మాము. వాళ్ళు జీవితాంతం మాకు తోడుగా ఉంటారనీ త్రికరణ శుద్ధిగా నమ్మాము. కానీ అతి సర్వత్ర వర్జియేత్.


..ఆ ప్రేమ ఎక్కువయ్యి ఇప్పుడు చేదుగా అనిపిస్తోంది. వాళ్ళు మమ్మల్ని బాగా మోసం చేసారు. అందుకే అంతగా ఇష్టపడ్డ మా పిల్లల మీద ప్రేమను, మమకారాన్ని ఈ పవిత్ర గంగలో ఈ సుప్రభాత సమయంలో విసర్జిస్తున్నాము. ఒక విధంగా మేము ఈ కాశీకి వచ్చింది ఈ తర్పణ చేయడానికే, ఈ రోజు నుంచీ ఆ ప్రేమ, మమకారాలు మాకు అక్కర్లేదు అంటూ ఇద్దరూ పురోహితుడు మంత్రాలు చదువుతుంటే ఆ గంగా జలాన్ని దోసిళ్ళతో తీసుకొని కళ్ళు మూసుకుంటూ గంగలో విసర్జించారు.


పిదప ఆ దంపతులిద్దరూ గంభీర వదనాలతో దూరంగా వెళ్ళిపోయారు.

వాళ్ళని చూస్తూ నేను, భాను నిశ్చేష్టుల మయ్యాము.

గురువారము, నవంబర్, 9, 2023

 గురువారము, నవంబర్, 9, 2023

-----------------------------------------

మాసం: ఆశ్వీయుజ మాసం

ఆయనం: దక్షిణాయణం

పక్షము: కృష్ణ పక్షము

ఋతువు: శరత్ ఋతువు

అమృతకాలము: 13:58 నుండి 15:44 వరకు

సూర్యోదయము: 06:18

సూర్యాస్తమయము: 17:42

రాహు కాలం: 13:25 నుండి 14:51 వరకు

యమగండము: 06:18 నుండి 07:43 వరకు

దుర్ముహుర్తములు: 10:06 నుండి 10:51 వరకు, 14:39 నుండి 15:25 వరకు

అభిజిత్: 11:37 నుండి 12:23 వరకు

కరణం: బాలవ 10:41 వరకు, కౌలవ 23:42 వరకు

చంద్రోదయం: 03:31,నవంబర్ 10

చంద్రాస్తమయం: 15:11

చంద్ర రాశి: కన్య

తిథులు: ఏకాదశి 10:41 వరకు

నక్షత్రము: ఉత్తర 21:57 వరకు

గుళిక కాలం: 09:09 నుండి 10:34 వరకు

శక: 1945 శోభకృత్

వర్జ్యం: ఏమిలేదు

యోగా: వైధృతి 16:49 వరకు


 

Checkout Telugu Calendar Panchangam App: 

 IOS :  https://itunes.apple.com/app/telugu-calendar/id1448360812

నీరసం , నిస్సత్తువ

 శరీరం నందలి నీరసం , నిస్సత్తువ హరించుటకు సిద్ద యోగాలు  - 


 *  మామిడి పండ్లు దొరికే సమయంలో మంచి రకం, పూటకో రకం తినటం వలన త్వరగా నీరసం పోయి శరీరానికి మంచి పుష్టి కలుగును 


 *  రోజుకో లేత కొబ్బరి బోండం లోని నీరు తాగుతూ ఆ కొబ్బరిని భక్షిస్తూ ఉన్నచో నీరసం తగ్గును.


 *  అప్పుడప్పుడు దాల్చిన చెక్కని బుగ్గన పెట్టుకుని దాని రసాన్ని మింగుతూ ఉంటే నీరసం పోతుంది . 


 *  రోజుకి ఒకసారి నేలవేము కషాయాన్ని పావుకప్పు మోతాదుగా నీరసం పోతుంది . జబ్బుతో ఉన్నప్పుడు ఈ కషాయాన్ని లోపలికి ఇవ్వడం వలన త్వరగా కోలుకుంటారు .


 *  ఖర్జూరం కాయలు రోజూ తినటం వలన శరీరానికి మంచి పుష్టి కలుగును. నాలుగు ఎండు ఖర్జూరాలు ఒక గ్లాసు నీటిలో రాత్రి సమయంలో నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీటిని తాగినచో శరీరానికి మంచి రక్తం పట్టి కాంతి , రంగు వచ్చును. 


 *  తుమ్మజిగురు శరీరానికి మంచి టానిక్కు లాంటిది . ఉసిరికాయ అంత జిగురుని కప్పు నీటిలో కలిపి కొంచం పంచదార చేర్చి రోజుకి ఒకసారి తాగితే నీరసం పోయి బలం వచ్చును.


 *  తాజా తాటికల్లుని పులవకుండా ఒక మోతాదుగా రోజూ తీసుకుంటూ ఉంటే శరీరానికి మంచి పుష్టి , బలం కలుగును. దీనిని "నీర " అని పిలుస్తారు . 


 *  రోజుకో వెలగపండు బద్ధ తింటూ ఉంటే నీరసం పోయి బలం వచ్చును. 


    పైన చెప్పిన సులభ యోగముల  వలే మరెన్నో అద్భుత సులభయోగాలు నేను రచించిన గ్రంథాల యందు సంపూర్ణముగా ఇచ్చాను. 


 

   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

        9885030034 


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


            9885030034

హిందువా ఇకనైనా

 *మొద్దు నిద్రలో ఉన్న ఓ హిందువా ఇకనైనా కళ్ళు తెరు,పూర్తిగా చదివి భాజపా కు వోట్లు ఎందుకు వేయాలో తెలుసుకో,భావితరాలకు శత్రువు గా మిగలకు.*


మన అనధికార తురక నెహ్రు ప్రధానిగా అయిన తరువాత 1952 లో కుటుంబ నియంత్రణ మొదలు పెట్టిన తరువాత 70 దశకాల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కేవలం హిందువులకే చేశారు.


1980 ల్లో ముగ్గురు చాలు అన్నారు.


1990 ల్లో ఇద్దరు చాలు అన్నారు.


2000 ల్లో ఒక్కరు చాలు లేదా అసలే వద్దు అన్నారు.


అన్ని గోడల మీద బొట్టు పెట్టుకొన్న కుటుంబం చిత్రమే. ఒక్క బురఖ ఫోటో లేదు. 


1990 దశకాల్లో హిందువుల్లో వచ్చిన అతి పొదుపు మరియు బద్ధకం వల్ల ఏకైక సంతానము వచ్చారు. ఆ ఏకైక సంతనాన్ని మనం గాజు బొమ్మలు గా పెంచడం జరిగింది. దీని ప్రభావము కుల వృత్తులపై బాగా ప్రభావము చూపింది. నెమ్మదిగా హిందువులు కుల వృత్తులకు దూరం అయ్యారు. ఆ స్థానం తురకలు భర్తీ చేశారు.


వాడు కనీసం ఇద్దరిని, ఎక్కువుగా 4 గురిని కన్నాడు. కాబట్టి, గత 3 దశాబ్దాల ప్రభావము..అన్ని రంగాల్లో 80% వారే ఉన్నారు. హిందువుల లో అధిక సంతానం ఉన్న వారంతా క్రైస్తవులు గా మారిపోయి తరువాత తురకలచే సులభంగా ఆక్రమించబడతారు,ఇజ్రాయిల్, పారిస్, కేరళ, బెంగాల్ ఇవన్నీ కళ్ళముందు సాక్ష్యాలు.


ప్రస్తుత హిందు మగాళ్లు సోమవారం నుండి శుక్రవారం వరకు సంపాదనకు, శనివారం నుండి ఆదివారం వరకు తాగుడుకు ఖర్చు చేస్తున్నారు.


అదే హిందు ఆడవారు సోమవారం నుండిశుక్రవారం వరకు సీరియల్స్ కు, శనివారం నుండి ఆదివారం వరకు స్విగ్గి లేదా జామోటో తో గడుపుతున్నారు.

చదువుకున్న హిందువులు వారి పిల్లల బు విదేశాలకు పంపేస్తున్నారు.ఫలితంగా బలహీనులై వారి ఆస్తులు కూడా తురక,క్రైస్తవుల చేత దురాక్రమణలు చేయబడుతున్నాయి. 

# చివరకు వోట్లు ఉన్న వే తక్కువ, వేసేవారు ఇంకా తక్కువ, హిందూ నేతలను ఎవరైనా తిడితే ఈ హిందువులే పది తిడతారు,హాస్పిటళ్ళకు,సాయిబాబాలకు,సాంబ్రాణి సాయిబుల వరకూ లక్షల్లో ఖర్చు పెట్టే వీళ్ళు ఒక గోశాలకో,గోవుకో,దేవాలయం లో అర్చకునికో పది రూపాయలు ఇవ్వడానికి వందసార్లు ఆలోచించి పదిరూపాయలు ఇచ్చి వందలెక్కలడుగుతారు,కానీ దౌర్జన్యం గా వీరి ఆస్తులు ఇతర మతాలవారు, ప్రభుత్వాల అండలతో ఆక్రమించుకుంటారు. కానీ తురకలు,క్రైస్తవులు మాత్రం మసీదులు, చర్చి లలో మాత్రమే డబ్బు లిస్తారు.

# హిందువుల ఆడపిల్లలను చదువు లు,ఉద్యోగాల మాయలలో పెళ్ళి చేయకుండా ఉంచుతారు, వారి ని సులభంగా తురకలో క్రైస్తవులో ప్రేమ వలలతో లేపుకు పోతారు,ఆ తరువాత కొందరు హిందూ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని ఛస్తారు. సంప్రదాయ బద్ధమైన పెళ్ళి కి వందలెక్కలు చుస్తారు. ఈలోగా లవ్ జిహాద్ లకు బలైతే ఏడ్చి ఛస్తారు.

#మొత్తంగా స్వయంకృతంగానే హిందువులు బలహీన పడుతున్నారు. ఇలాంటప్పుడు రక్షించడానికి వచ్చిన భాజపా ను బలపరచకపోతే నేటి హిందువులు భావితరాలకు శత్రువు లుగా మిగలక తప్పదు.


# ప్రేమ విఫలం అయ్యి ఆత్మహత్య చేసుకొన్న ఒక్క తురక ను చూడలా


# పెళ్ళాం కాపురానికి రాలేదు అని ఆత్మహత్య చేసుకొన్న ఒక్క తురక ను చూడలా.


# ఆర్థిక భాదలతో ఆత్మహత్య చేసుకొన్న ఒక్క తురక ను చూడలా.


# కొడుకు మోసం చేశాడు అని కోర్టుకు వెళ్లిన లేదా ఆత్మహత్య చేసుకొన్న ఒక్క తురక తల్లి తండ్రిని చూడలా.


# ఆస్తి కోసం తల్లినో తండ్రినో హత్య చేసిన..ఆత్మహత్య చేసుకొన్న ఒక్క తురక ను చూడలా.


మరి మన విలువలు ఎక్కడ?


హిందువులు ఆర్ధికంగా చితికిపోవడానికి, తురక సమూహాలు అప్పు లేకుండా గడపడానికి కారణాలు వారిలో 10% మాత్రమే ఉన్నత విద్యను చదువుతున్నారు, మిగతా 90% చేతి వృత్తిలో ఉన్నారు.


మన కుటుంబాల్లో 60% ఇంట్లో ఒక్కరు మాత్రమే సంపాదన. ఒక వేళ భార్య భర్త ఉద్యోగులు అయితే ఎవరి జీతం వారి ఇష్టం.

అదే తురకల్లో..ఆడవాళ్లను నేను గమనించిన వారిలో ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఉంటారు. అంటే ఇంటి దగ్గర చిన్న కిరాణా కొట్టు రోజుకి 200 వస్తాయి. పండగల సమయాల్లో, అయ్యప్ప స్వాముల సీజన్ లో పూలమాలలు సగం మంది హిందువులు కాని వారే అల్లుతారు. ఉరి చివర పోరంబోకు భూమిని ఆక్రమించి ఇల్లు కట్టుకొని ఉంటాడు. తల్లి తండ్రి కనీసం ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబంలో వారి రోజువారీ సంపాదన తక్కువగా 1500 ఎక్కువగా 3 వేలు ఉంటుంది. రోజు వారి ఖర్చు తక్కువగా 300 ఎక్కువగా 500 దాటదు.


# అతి ముఖ్యమైన విషయం ఓటు. మసీదులో ఏ పార్టీకి ఓటు వేయాలో చెబితే 90% ఓట్లు ఆ పార్టీకే పడతాయి. 


తురకలు 99% ఓటింగ్ చేస్తారు. హిందువుల్లో ఓటింగ్ 60% దాటదు. 


GDP గురించి, పెట్రోల్ గురించి, రైల్వే ఫ్లాట్ ఫామ్ టికెట్ గురించి వాగే ఒక్క హిందూ గాడిద కూడా ఓటింగ్ రోజున వచ్చి ఓటు వేయదు. 


ఓటు వేసే హిందువులు కులం, జాతి, పార్టీ, ప్రాంతం వారీగా మరియు డబ్బు, మందు పంచిన వారికి ఓటు వేస్తారు.


 తురకలకు మసీదు ఒక పవిత్ర స్థలం. హిందువులకు దేవాలయం తమ పాపాలను కడిగే వాషింగ్ మెషీన్, నువ్వు నా కోరిక తీర్చితే నీ హుండీలో లంచం ఇస్తానని దేవుడితో మొక్కుకునే ప్రభుత్వ కార్యాలయం మాత్రమే!!!!!


©

శ్రీపాద శ్రీవల్లభ మందిరం..1వ భాగం..*

 *శ్రీపాద శ్రీవల్లభ మందిరం..1వ భాగం..*


*మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది...*


"శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి మందిర నిర్మాణం పూర్తి అవుతున్నది కదా..మరి విగ్రహ ప్రతిష్ట ఎప్పుడు అనుకుంటున్నారు?" అని నిన్న ఉదయం ఆ భక్తుడు అడిగాడు.."ఈనెల 11,12,13 వతేదీ లు గా నిర్ణయించాము..13వతేదీ నాడు విగ్రహప్రతిష్ఠ ఉంటుంది.." అన్నాను.."ఆరోజు మేము ఇక్కడికి వచ్చి..ఆ కార్యక్రమాన్ని కళ్లారా చూడవచ్చా?" అన్నాడు.."ఏ ఇబ్బందీ లేదండీ..మీకు వీలుంటే ఆ మూడు రోజులూ ఇక్కడే ఉండండి..భక్తులందరికీ మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేసాము..ఇక్కడే శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం యొక్క మంటపం లోనే ఉండండి.."అన్నాను.."చాలా సంతోషమండీ..నాతోపాటు మరో పదిమందిమి కలిసి వస్తాము..ఆ మూడురోజులూ గురుచరిత్ర పారాయణం కూడా ఇక్కడ చేస్తాము.." అన్నారు..


మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు సిద్ధిపొందిన పదిహేనేళ్లకు..ఆ మందిర ప్రాంగణం లోనే నైరుతి దిశలో శ్రీ సాయిబాబా మందిరం నిర్మించారు..ఆ తరువాత కొన్నేళ్లకు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడి కి మందిరం ఏర్పాటు అయింది..మళ్లీ ఈనాటికి శ్రీపాద శ్రీవల్లభుల వారి మందిరము కూడా ఆ ప్రాంగణం లోనే ఉండబోతోంది..మొగలిచెర్ల గ్రామ సరిహద్దుల్లో ఉన్న అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం రాబోయే రోజుల్లో ఒక సంపూర్ణ దత్తక్షేత్రం గా మారుతుందని..శ్రీ స్వామివారు ఆనాడే చెప్పివున్నారు..స్వామివారు చెప్పిన ఆ మాటలు ఒక్కొక్కటిగా నిజం అవుతున్నాయి..


శ్రీపాద శ్రీవల్లభ స్వామివారికి ఒక చిన్న గుడి కట్టించాలని సంకల్పించాము..ఆ విషయమై నేనూ మా సిబ్బంది తర్జన భర్జన పడుతున్నాము..సంకల్పం చేసాము..సరే..కానీ..మందిర నిర్మాణానికి నిధులు కావాలి..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..మనస్ఫూర్తిగా స్వామివారిని మా దంపతులము వేడుకున్నాము.."స్వామీ..ఈ మందిర ప్రాంగణం లో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి కొరకు ఒక గుడి కట్టించాలని అనుకున్నాము..అందుకు మీ ఆశీర్వాదం కావాలి తండ్రీ.." అని..స్వామివారి మీద భారం వేశాము కనుక..ఇక గుడి నిర్మాణం గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు అని మా భావన..


ఆ ప్రక్కరోజే..హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ దువ్వూరి భాస్కరరావు గారు నాకు వాట్సప్ లో ఒక మెసేజ్  పంపించారు..తన వద్ద శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి విగ్రహం వున్నదని..మీరు ఒక మందిరం నిర్మాణం చేస్తే..తాను ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేయిస్తానని ఆ మెస్సెజ్ లో తెలిపారు..మొగలిచెర్ల దత్తాత్రేయస్వామి వారి లీల అప్పుడే కనబడింది..వెంటనే స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని వచ్చాను.. స్వామివారి అనుమతి రాబట్టే..ఆ మెస్సెజ్ వచ్చిందని అర్థమై పోయింది..శ్రీ భాస్కరరావు గారిని ఫోన్ ద్వారా సంప్రదించాను..వారిని మొగలిచెర్ల కు రమ్మనమని ఆహ్వానించాను..శ్రీ భాస్కరరావు గారు మరో వారం రోజుల తరువాత తన మిత్రుడిని వెంటబెట్టుకొని మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు వచ్చారు..శ్రీ భాస్కరరావు గారు తనతోపాటు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి విగ్రహాన్ని కూడా తీసుకొని వచ్చారు..ఆరోజే ఏ ఏ కొలతలతో గుడి నిర్మించాలో కూడా నిర్ణయం జరిగిపోయింది..శంఖుస్థాపన కొరకు ముహూర్తం కూడా నిర్ణయించేసాము..ఆరోజుకు శ్రీ భాస్కరరావు గారు వస్తామని చెప్పి వెళ్లారు..అనుకున్న విధంగానే శ్రీ భాస్కరరావు గారు దంపత్సమేతంగా రావడం..శంఖుస్థాపన చేయడం..అంతా చక చకా జరిగిపోయాయి..


శ్రీపాద శ్రీవల్లభుల గుడి నిర్మాణం గురించిన మరికొన్ని విశేషాలు రేపు చదువుకుందాము..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)

శరీరం కర్మలు చేసే ఒక పరికరం*

 *శరీరం కర్మలు చేసే ఒక పరికరం*


*పునర్విత్తం పునర్మిత్రం* 

*పునర్భార్య పునర్మహి*

*ఏతత్సర్వంపునర్లభ్యం*

*న శరీరం పునఃపునః।।*


 🌷పోయిన *ధనం* మళ్లీ చేరుతుంది. 


🌷*దూరమైన మిత్రుడు* మళ్లీ చేరువఅవుతాడు.      

         

🌷*భార్య* గతిస్తే మరొక భార్య లభిస్తుంది.


🌷*భూసంపద* మళ్లీ ప్రాప్తిస్తుంది. 


పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు! 


కాని *మానవ శరీరం మాత్రం మళ్లీ మళ్లీ తిరిగి రాదు.*


అందుకే 

*శరీరం ఖలు ధర్మసాధనం* అన్నారు.


 కేవలం *శరీరం* ఉంటేనే ధార్మిక పనులు చేయవచ్చు.


 *శరీరం* ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది.


 *శరీరం* ఉంటేనే హితవాక్యాలు చెప్పవచ్చు.

ఏ పని చేయడానికైనా *శరీరం* కావాలి.


 కనుక *శరీరము* ను రక్షించుకోవాల్సింది మానవ జన్మ ఎత్తినవాళ్లే.


జంతువులకు *శరీరం* ఉంటుంది, కాని, వాటికి ఆలోచన ఉండదు.


పైగా కొద్దోగొప్పో ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి *శరీరం* సహకరించదు.


*బుద్ధి, ఆలోచన, మాట్లాడే శక్తి, కావలసినది సంపాదించుకొనే జ్ఞానం *తగిన అవయవ నిర్మాణం*

ఉండేది ఒక్క *మనుష్యులకే.*


వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది.

కనుక మనమందరం శరీరాన్ని కాపాడుకోవాలి.


*అతిగా తిన్నా,*

*అతిగా ఆలోచించినా,*

*అతిగా సుఖించినా,*

*అతిగా దుఃఖించినా,*                    

*ఏదైనా అతిగా చేస్తే ఈ "శరీరం" కాస్తా పుటుక్కుమంటుంది*. 


ఇక *శరీరం* చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు. 


కనుక ముందు *శరీరము* ను జాగ్రత్తగా చూసుకోవాలి.    

                                   

*దీనికి*

 

*సత్యం,* 

*ధర్మం*,

*శాంతి*,

*ప్రేమ,*

*అహింసలను*


 *పాటించడమే "మహా ఔషధంగా" భావించాలి.*


*విస్తరాకు*


విస్తరి ఆకుని ఎంతో శుబ్రoగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటారు. 


బోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము,


తినిన మరుక్షణం ఆ విస్తరాకును మడిచి, దూరంగా *మురికి పెంటపై పడేసి వస్తాము.*


 తర్వాత ఆ ఎంగిలి ఆకును ముట్టుకోము కూడా.


*మనిషి జీవితం కూడ అంతే*


*'ఊపిరి" పోగానే ఊరిబయట పారేసి వస్తారు*


విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది, ఎందుకంటే పొయే ముందు *ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగ పడినాను అన్న తృప్తి ఆకుకు ఉంటుంది*,


*విస్తరాకుకు ఉన్న* 

*"ముందు ఆలోచన", తృప్తి భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ !*


*"" సేవ చేసే అవకాశము* *వచ్చినపుడు సేవ చేయండి""*     *జారవిడుచుకోకూడదు* 


మళ్లీ ,

ఇంకొకసారి,

ఎప్పుడో చేయవచ్చు

అనుకొని వాయిదా వేయకండి, 

ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే....., 


*కుండ ఎప్పుడైనా పగలవచ్చు, అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.*


*ఎంత సంపాదించి ఏమి లాభం ?*


*ఒక్క పైసా కూడా తీసుకు పోగలమా?*

*మన చేత, మన వల్ల* *ప్రత్యక్షంగా,పరోక్షంగా ఓ 10 మందికి* 

*మంచి జరిగితే, *మన ఈ జన్మ సార్థకమయినట్లే ...*🙏

సహజస్థితి

 *సహజస్థితి:*

                ➖➖➖✍️


*ఎవరైతే సమస్త సృష్టిలో సర్వవ్యాపిని చూడగలుగుతారో, వారికే ఆత్మ దర్శనం కలుగుతుంది.*


   *ప్రతి మనిషిలో ముఖ్యంగా మూడు కోరికలు ఉంటాయి.* 

                        

1 జీవించాలి...! మరణం ఉండకూడదు!!*

               *2,సంపాదించాలి...! మితం ఉండకూడదు!!*   

                 *3.ఆనందించాలి...! హద్దులు ఉండకూడద.!! ఎవరైతే వీటిని దూరంగా ఉంచగలు గుతారో వారిని మానవాతీతులుగా భావించాలి.*


 *మనిషి మొదటి నుంచి తాను ఉన్న స్థితిలో రాజీ పడలేక ఇంకా దేనికోసమో తపనతోనే జీవిస్తున్నాడు. అనంతాన్ని జయించాలన్న కోరిక ఒక్క మనిషిలోనే కనిపిస్తుంది.*  


*‘మీరు ఇంకా ఒక్క గంట మాత్రమే బతుకుతారని ముందుగా తెలిస్తే, ఎలా ఉంటుందో... ఆ స్థితిలోనే జీవించాలి’ అంటారు ఆత్మ జ్ఞానులు.*


*ఆ రహస్యం తెలిసిన మరుక్షణమే తనకు సంబంధించినవన్నీ తనవారికి ధారాదత్తం చేయడానికి ఆ గంట వ్యవధి సరిపోదని బాధపడతాడు మనిషి. త్యజించాల్సిన శరీరాన్ని బతికించాలన్న తపనతోనే, విలువైన సమయాన్ని వృథా చేస్తాడు. కానీ తాను చేరుకోవాల్సిన సహజ స్థితి గురించి ఆలోచించడు.*


 

*కర్మ ఫలాల్ని జన్మ జన్మలుగా అనుభవిస్తున్నాడు. అయినా దేహం ఉండగానే విముక్తి కోసం సాధన మార్గం సుగమం చేసుకోలేక పోతున్నాడు.*


*రామకృష్ణ పరమహంస పొందిన నిర్వికల్ప సమాధి, రమణ మహర్షి పొందిన సహజస్థితి, బుద్ధుడు పొందిన జ్ఞానోదయం...*


*ఇవన్నీ వారు అంతఃకరణాన్ని, ఇంద్రియాలను, సమస్త భోగ సామగ్రిని త్యజించి సాధించారు. ఆశారహితులై శారీరక కర్మలను చేసినట్టు కనిపించినా, వాటి ఫలితం అంటకుండా జీవించబట్టే అవి సిద్ధించాయి. మనిషి సహజ స్థితిని పొందడానికి సన్యాసం అవసరం లేదంటారు.*


*మరణం తరవాతే సహజస్థితి సిద్ధిస్తుంది అనేది అపోహ. వాస్తవానికి మనిషి నశించేవాడు కాదు, స్వేచ్ఛారహితుడు అంతకంటే కాదు. నిజమైన మనిషి అంటే ఆత్మ. ఆత్మ నిజస్వరూపం సచ్చిదానందం. అనంత ఆకాశంలో సర్వవ్యాపకమైన సర్వస్వాన్ని ప్రకాశింపజేసేదే సత్‌, చిత్‌, ఆనందం. నిత్యమైన, మరణం లేని, పతనం లేని పరమాత్మతత్వం ఇదే.*


 

*దాన్ని పొందడానికి చేసే సాధనలో ‘అహం’ అడ్డు పడుతూ ఉంటుంది. ‘అహం’ అనే ప్రవాహం మీద తేలుతూ సహజస్థితి చేరే సాధన చేయడం అసాధ్యం. అహం హద్దులు దాటి, దాని ఆద్యంతాలు తెలుసుకోవడానికి అంతఃచైతన్యమనే నిచ్చెన ఎక్కాలి. అప్పుడే స్పష్టత ఏర్పడుతుంది. చైతన్య ఉన్నత స్థితిని చేరుకోవడానికి చేసే ప్రయత్నమే నిజమైన సాధన.*


*సూర్యుడి వేడికి సముద్ర జలాలు ఆవిరై, మేఘాలుగా మారతాయి. అవి హిమాలయాల ఎత్తుకు ఎగురుతాయి. ఆవిరి అణువుల నిజస్వరూపం సముద్రమే. తమ మూలస్థానమైన సముద్రాన్ని తిరిగి చేరడానికి ఆ అణువులు నిరంతరం తాపత్రయ పడతాయి. ఆకాశంలో సంచరిస్తూ తిరుగుతుంటాయి. సమయం రాగానే వర్షించి, అనంత సాగరంలో ఐక్యమై సహజస్థితికి చేరుకుంటాయి.*


*అన్ని నీటి బిందువులూ సముద్రాన్ని చేరనట్లే, ఎంత సాధన చేసినా కర్మఫల శేషం వీడిపోనిదే సహజస్థితి సిద్ధించదు. కర్మ బంధాలనుంచి విముక్తి పొంది, ఆత్మను గుర్తించి, ఇంద్రియాల పరిధిని అధిగమించడానికి చేసే ప్రయత్నం నిరంతరం కొనసాగాలి.* 


*ఎవరైతే సమస్త సృష్టిలో సర్వవ్యాపిని చూడగలుగుతారో, వారికే ఆత్మ దర్శనం కలుగుతుంది. ఆ స్థితిని నిలబెట్టుకోవడమే యోగం.*


*భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే, ఎంతో మంది తపోధనులు తమ యోగవిద్య ద్వారా, ఉన్నతమైన ఆధ్యాత్మిక చైతన్యంతో అస్తిత్వ సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు.* 


*తమ ఆధ్యాత్మికతతో అహం తాలూకు వాస్తవ స్వరూపం తెలుసుకొని, భవబంధ విముక్తులు అయ్యారు.*✍️


. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🚩🙏*

                      

*లోకా సమస్తా సుఖినోభవన్తు!*🙏


*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మంచి మాటలు

 ఈరోజు మంచి మాటలు.

 

     నిన్ను వదిలీ వెళ్ళిన వారి గురించి *ఆలోచించకు*, నీతో ఉన్నవాళ్ళు శాశ్వతమని *భావించకు*,ఎవరో నీ *బాధను* అర్థం చేసుకుంటారని *ఆశించకు*, నీకు నువ్వే *తోడు* నీ *దైర్యమే* నీకు *సరిజోడు*,


        ఈ *సృష్టిలో* ఏ విషయాన్నైనా *ఉన్నది* ఉన్నట్టుగా *చూడడం* ఎవరి *తరం* కాదు , ప్రతి ఒక్కరూ తమ *కోణం* నుంచి తమ *మనోభావాలకు* అనుకూలంగానే *చూస్తారు* అందుకే తమకు *నచ్చిన* వారిని చేర్చుకుంటారు తమని *నచ్చని* వారిని *దూరం* పెడతారు .


     మన *జీవితంలో* ఎవరో ఒకరు *గుణపాఠం* నేర్పిస్తూనే ఉంటారు , ఒకరు *ప్రేమలో*,ఇంకొకరు స్నేహంలో*,మరొకరు *బంధుత్వంలో*. ఇక్కడ ముఖ్యంగా *గమనించవలసిన* విషయం   *ప్రతి చోటా* మనమే *గుణపాఠం* (పాఠం )నేర్చుకుంటూ ఉంటాం.

*కానీ* ఒక్కటి మాత్రం *నిజం*  దెబ్బ తిన్నవాడికే *గెలవాలి* అనే  *తపన* ఎక్కువ *ఉంటుంది*  అందుకని *నువ్వనుకున్నది* గెలిచే వరకూ తపించు,  *పోరాడు* విజయం సాధించు  చివరగా *విజయ మాధుర్యాన్ని* అనుభవించు . 


          మనకు *విలువ* లేని చోట మాట్లాడరాదు, *ప్రేమ* లేని చోట *ఆశ* పడరాదు, మనల్ని *నిర్లక్ష్యం* చేస్తున్నవారి కోసం *ఎదురు* చూడకుడదు,మన *ఆత్మ గౌరవం* పణంగా పెట్టి *ప్రేమించకుడదు*, మనల్ని దూరం పెడుతున్న వారికి *దగ్గర* అవ్వాలని చూడకుడదు,మనం *భారం* అనుకున్న వాళ్ళతో మన *భావాల్ని* పంచుకోవద్దు, మనది *కానిది* దేనిపైన ఎక్కువ *ఇష్టం* పెంచుకోవద్దు, మన *నిజాయితీని* గుర్తించని చోట *నిమిషం* కూడా ఉండొద్దు.


కోరుకున్నవి అన్ని *కావాలంటే* ఎవరికీ *సాధ్యం* కాదు..మనం *కష్టపడి* సంపాదించినవి, *దేముడిచ్చిన* వాటిని *సద్వినియోగం* చేసుకుంటూ *జీవిద్దాం.* *తినటం* కోసం *బతకటం* కాకుండా *బతకటం* కోసం *తిందాం* తక్కువ తింటే *ఆరోగ్యం*, ఎక్కువ తింటే *అనారోగ్యం*

ఆలోచనాలోచనాలు

 ///// ఆలోచనాలోచనాలు /////       -----౦ భయం! భయం భయం!! ౦-----                      ***** మృత్యుదేవత ఒక పట్టణం లోకి ప్రవేశిస్తూ ఒక మహనీయుని కంటబడింది. ఎంతమందిని తీసుకుని పోతున్నావ్? అని ప్రశ్నించాడా మహనీయుడు. కేవలం 500 మందినే!, జవాబిచ్చింది ఆ దేవత. మరునాడు పత్రికలలో, టి.  వి. ఛానళ్ళలో ఆ పట్టణంలో "" కలరా వ్యాధి"" ద్వారా 5000 మరణించినట్లు వార్త వెలువడింది. మహనీయుడు ,మృత్యుదేవతతో నాతో ఐదు వందలని చెప్పి ఐదువేల ప్రాణాలను బలిగొన్నావే? అని.దానికామె ఇట్లా బదులిచ్చింది. "" పట్టణంలో కలరా వలన మరణించిన వారు 500 మందే! కలరా వస్తుందేమోననే భయంతో మరణించినవారు మిగిలిన 4,500 మంది , అని.......       ***** ప్రపంచంలో అత్యధికులు భయపడేది వేదికలపైన పదిమంది ముందు నిలబడి మాట్లాడటానికి; ఎత్తు ఎంత ఎక్కువగా ఉంటే, అంతగా భయపడేవాళ్ళు రెండోస్థానంలో నిలుస్తారు. క్రిమికీటకాలు, విషజంతువులు మరియు క్రూరజంతువులకు భయపడేవారిది మూడోస్థానం. కొంతమందికి చావుభయం. మరికొందరికి మృత్యుభయం. చీకటి భయస్థులు కోట్ల సంఖ్యలలో లభిస్తారు. ఉరుములు, మెరుపులంటే భయపడేవారు కొందరైతే, పిడుగుల ధ్వనికి కంపించిపొయ్యేవారు మరికొంతమంది.                   ***** సర్కస్ లో సింహాలను లొంగదీసుకొని, వాటితో విన్యాసాలు చేయించే వీరాధివీరులు వారి, వారి భార్యలముందు పిల్లులై మెలగుతూ వుంటారు.                            ***** తెలివైనవారు మూడు విషయాలకు భయపడుతుంటారు. అవి తుఫానులలోని కల్లోల సముద్రాన్ని చూచి, చంద్రుడు లేని కటిక చీకటిని చూచి మరియు సజ్జనుడి కోపాన్ని చూచి.       ***** ఎందులోనూ భయపడని కొందరు ఒంటరితనానికి భయపడుతుంటారు.            ***** ప్రమాదం వచ్చినపుడు భయపడడం ఒక ఎత్తైతే, ప్రమాదం వస్తుందేమోనని భయపడడం మిక్కిలి ప్రమాదకరం. గండం గడిచిన తరువాత భయపడేవారు కొందరు. తాడును తొక్కి అది పామేననుకొని భయంతో వణికిపొయ్యేవారు మరికొంతమంది.                   ***** నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. అవి దాటిపోయిన తరువాత అంతటి గండాన్ని ఎట్లా దాటగలిగేనా? అని భయపడుతుంటానన్నాడొక మేథావి.                            ***** దాదాపు అందరం భయం గుప్పిట్లో బతుకుతున్న వాళ్ళమే! కాకపోతే కొంచెం ఎక్కువ లేదా తక్కువ. అంతే!              ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~.                             Sharpen your mind!         1* What flies without wings?                               2* Which vehicle is spelled the same forwards and backwards ?                     3* What is harder to catch , the faster you run?                                        4* A is the father of B. But B is not the son of A. How's that possible?                            (For proper answers you have to wait 24 hours only.).                      ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~                              తెలుగు నుడికారం ( సామెతలు మరియు జాతీయాలు)                        1* బంగారానికి తావి( సువాసన) అబ్బినట్లు.                           2* బంగారు చెప్పులైనా కాళ్ళకే కదా తొడిగేది!             3* వాడెవడో పౌరుషానికి వచ్చి పచ్చిపులుసు తాగేట్ట!                                 4* పొరుగూరికి పోగానే పోతుందా దుర్దశ?                 5* పొదుగెంత జారినా, కుక్క గోవు అవుతుందా?     6* పొద్దుగాని పొద్దులో పెద్దిగాని పెళ్ళి.                      7* అదేమిటోగాని , పొట్లపాదుకు పొరుగు గిట్టదు.                                 8* పొంగిందంతా, పొయ్యి పాలే కదా!                            9* పైరుకు రాగులు, భాగ్యానికి మేకలు.                10* వాడెవడో పేలాలను చల్లి , దయ్యాలను లేపాట్ట!    తేది 9--11--2023, గురువారం, శుభోదయం.

కార్తికమాసమున

 శ్రీరస్తు  శుభమస్తు అవిఘ్నమస్తు 


 శివాయవిష్ణురూపాయ శివరూపాయవిష్ణవే! శివస్యహృదయం విష్ణుర్విష్ణోశ్చహృదయగ్ంశివః!


*సమస్త ఆస్తికజనులారా*  ! 

శివకేశవులకు ప్రీతికరమైన ఈ కార్తికమాసమున కార్తికదామోదర ప్రీతిగా సకల దేవతా స్వరూపముగా 365  మృణ్మయ లింగములను ఈశ్వర స్వరూపముగా అమర్చి అభిషేక. అర్చనాదులు జరుపుటకు కార్తిక దామోదరుని అనుగ్రహముతో  బ్రహ్మశ్రీ తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజిగారి పర్యవేక్షణలో మాసదీక్షా పూర్వక మహాలింగార్చన చేయుటకు పరమేశ్వరుని యొక్క ప్రేరణ జరిగినది 


           కార్యక్రమ వివరాలు

తేదీ : 14.11.2023 మంగళవారం నుండి  12:12:2023 మంగళవారం వరకు

ప్రతీరోజూ ప్రదోష (సాయం) సమయమున గణపతి పూజ మహాలింగార్చన ఆవరణ పూజ పంచామృతసహిత సుగంధద్రవ్య పాశుపత ఏకాదశ రుద్రాభిషేకము జరుగును 

   *విశేష కార్యక్రమ వివరాలు*

*సోమవారములు* 4

*ఏకాదశిలు* 2

*కార్తిక పౌర్ణమి*

*ఆరుద్రా నక్షత్రము*

*మాసశివత్రి*

*ఈ యొక్క పర్వదినములలో సహస్ర లింగార్చన జరుగును*

పై జరుగు కార్యక్రములలో

 ఆసక్తి గల భక్తులు అందరూ ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ పాల్గొనవచ్చును

భక్తులు వారి వారి అభీష్టములు తీర్చుకొనుటకు  అనగా 1.కార్యసిద్ధి కొరకు--ఎటువంటి ఆటంకములు లేకుండా పనులు పూర్తి అగుటకు -- గణపతి హోమము

2.సర్వ శత్రుపీడా,నరఘోషా,సర్వ కార్య విజయము కొరకు-- సుదర్శన నారసింహ హోమము, మన్యుసూక్త హోమము

3.ఆరోగ్యము కొరకు సమస్త రోగపీడా పరిహారమునకు, సూర్యనమస్కారములు

4.ఐశ్వర్య ప్రాప్తి,సమస్త మనోభీష్టమైన కోర్కెలు తీరుటకు సమస్త గ్రహ బాధా నివృత్తికై చండీ సప్తశతీ హోమము

5.సకల పీడా పరిహారమునకు,అపమృత్యు దోష పరిహారము,వివాహ ప్రాప్తి, సంతానప్రాప్తి ఇత్యాదులకు పాశుపత రుద్రాభిషేకము జరపబడును కావున భక్తులు గమనించి వారి వారి అభీష్టములు సిద్ధించుటకు కార్యక్రమము జరిపించుకొనుటకు 

ఈ మహత్కార్యములో పాల్గోదలచిన‌‌ భక్తులు రూ 5556/ రుసుమును చెల్లించవలెను 

వివరముల‌ కొరకు మీరు తంగిరాల భార్గవ శర్మ గారిని సంప్రదించగలరు 9502925449


         *కార్యస్థలము*

*రాజమహేంద్రవరం. కొంతమూరు బ్రాహ్మణ అగ్రహారం అభీషగణపతి ఆలయమ్*

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||

మహర్షీ! మా తండ్రిగారి అనుగ్రహం వల్ల మాకు కావలసినవన్నీ పుష్కలంగా లభిస్తూనే

ఉన్నాయి. కోరుకోవలసింది ఏమీ లేదు. అయినా నీ సంతృప్తికోసం ఒకటి అడుగుతున్నాం, నెరవేర్చు..

దేవతలతోపాటు సోమపానం చెయ్యాలని మా చిరకాల వాంఛ. దేవవైద్యులం కనక మాకు అది

నిషిద్ధవస్తువయ్యింది. మేరు పర్వతంమీద బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినప్పుడు దేవేంద్రుడు మా ఇద్దరికీ

ఈ నిషేధం విధించాడు. అప్పటినుంచీ మాకు ఇది తీరని కోరిక అయ్యింది. నువ్వేమన్నా తీర్చగలిగితే ఈ

చిన్నికోరిక తీర్చు అన్నారు అశ్వినులు.

అశ్వినులారా! అదెంతటి మహాభాగ్యం. తప్పక తీరుస్తాను. మిమ్మల్ని సోమపానుల్ని చేస్తాను.

ఇంద్రుడికి కోపంవస్తే వచ్చుగాక. అతడి సమక్షంలోనే మాట నిలబెట్టుకుంటాను. మా మామగారు

శర్యాతిమహారాజు త్వరలోనే ఒక మహాయజ్ఞం చేస్తాడు. అప్పుడు మీ కోరిక తీరుస్తాను. ఇది నా వాగ్దానం

- అన్నాడు చ్యవనుడు. అశ్వినులు సంతోషించి వెళ్ళిపోయారు. సుకన్యాచ్యవనులు ఆశ్రమం చేరుకున్నారు.

(అధ్యాయం 5, శ్లోకాలు 590)

వ్యాసమహర్షి సూర్యచంద్రవంశాల చరిత్రను చెబుతూండగా శర్యాతి విషయంవచ్చి.

సుకన్యాచ్యవనుల కథ విస్తరించింది. జనమేజయుడు శ్రద్ధగా ఆలకించాడు. ఈ కథలో మరికొన్ని

వివరాలు అడిగాడు.

వ్యాసమహర్షీ! దేవవైద్యులకు చ్యవనుడు సోమరసం తాగించాడా? మరి ఇంద్రుడు

కోపించలేదా? దేవరాజబలంతో మానుషబలం పోటీపడి నెగ్గగలిగిందా? ఇది చాలా కుతూహలాన్ని

కలిగిస్తోంది. వివరించవా?

జనమేజయా! తప్పకుండా వివరిస్తాను. విను. ఇది చాలా అద్భుతమైన కథ. దేవకన్యలాంటి

సుకన్యతో చ్యవనమహర్షి గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వహిస్తున్నాడు. తన అల్లుడు సుందరాకారుడయ్యాడవి

శర్యాతి దంపతులకు ఇంకా తెలియలేదు.

శర్యాతి సుకన్యను శంకించడం

ఒకనాడు శర్యాతి భార్య దుఃఖిస్తూ భర్త దగ్గరికి వచ్చింది. మహారాజా! బంగారం లాంటి

అమ్మాయిని ఒక వృద్ధాంధతాపసికి కట్టబెట్టి అడవుల్లో విడిచిపెట్టి వచ్చాం. చాలాకాలమయ్యింది. ఎలా

ఉందో! జీవించి ఉందో, మరణించిందో! కుశలవార్తలు ఏమీ అందడంలేదు. ఒకసారి వెళ్ళి చూసి

రాకూడదా! కూతురికి ఇలాంటి సంబంధం చేశామే అని నేను ఏడవని రోజంటూ లేదు. పిచ్చితల్లి,

మొగుడికి సేవలతో ఆ అడవుల్లో చిక్కిశల్యమైపోయుంటుంది. వెళ్ళి ఒకసారి ఇంటికి తీసుకురండి. బెంగ

పెట్టుకున్నాను. చూడాలనిపిస్తోంది. నారచీరలతో కందమూలాలతో ఆ గుడ్డి మొగుడితో ఎలా పడుతోందో

ఏమో! అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

దుస్సహోఽయం పుష్పధన్వా విశేషణ చ యౌవవే ॥

కులే కళంకస్సుమహాననయా మానవే కృతః

దీపావళి' ప్రప్రధమముగా

 *'దీపావళి' ప్రప్రధమముగా జరుపుకున్న స్థలము,  ఆంధ్రదేశము లోనే వున్నది*


🌿విజయవాడ నుంచి, అవనిగడ్డ వెళ్ళే కృష్ణానది కరకట్ట మీదుగా వెళితే, 'నడకుదురు' గ్రామమ

🌸ఆ గ్రామమునకు గల పురాతనమైన పేరు "నరకాసుర సంహార క్షేత్రము". 

ఆ గ్రామము పేరు, కాలక్రమేణా మారుతూ, నరకొత్తూరు, తర్వాత 'నడకుదురు గా మారింది.

🌿ఇక్కడ, మహా సుందరమైన పచ్చని అరటి తోటల మధ్యన,

"శ్రీ పృథ్వీశ్వరాలయముంది".

సత్యభామాదేవి.. సాక్షాత్తు భూదేవి. నరకాసురుని సంహరించిన తర్వాత, అమ్మవారు ఈశ్వర ప్రతిష్ట చేసిందని స్థల పురాణము. 

🌸'పృథ్వి' అంటే భూదేవి, సత్యభామ.

🌿ఆ ఆలయము వద్దనే, శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహము కూడా వున్నది.

🌸నరకాసురుని ఇచ్చట సంహరించిన తర్వాత, మొదట మొదటగా నరక చతుర్దశి, దీపావళి జరుపుకున్నారు.

🌿నరకాసురుడు, స్వర్గలోకమునుంచి తెచ్చి 'పాటలీవృక్షమును' ఈ ఆలయము వద్ద నాటాడు. మన భారతదేశంలోనే గల ఏకైక వృక్షమిది. 5000 సంవత్సరములనాటిది. ఈ వృక్షమును ఇప్పటికీ మనము దర్శించుకోవచ్చు.

🌿బిడ్డలు లేని వారు, ఈ చెట్టుకు 'వుయ్యాల' కడితే, తప్పక సంతానవతులవుతారు.

🌸విజయవాడ నుంచి, అవనిగడ్డ వెళ్ళే కృష్ణానది కరకట్ట మీదుగా వెళితే,  సుమారు 50 కి.మీ. దూరంలో ఈ 'నడకుదురు' గ్రామము చేరుకోవచ్చు....

ప్రదక్షిణలు

 🙏 *శుభోదయం మిత్రులారా* 🙏

🕉️🚩 *ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది !?* 🚩🕉️


‘ప్రదక్షిణం’ లో ‘ప్ర’ అనే అక్షరము పాపాలకి నాశనము…. ‘ద’ అనగా కోరికలు తీర్చమని, ‘క్షి’ అనే అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. ‘ణ’ అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణము లో ఇంత అర్ధం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్ని వైపులా నుంచి నిన్నే అనుసరిస్తూ ద్యానిస్తున్నానని అర్ధం. 

గుడికి వెళ్ళిన ప్రతివారూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం. ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే, మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ. ప్రదక్షిణలు అయితే చేస్తాం కానీ, ఎందుకు చేస్తామో మనలో చాలామందికి సరిగా తెలీదు. ఇది ఒక జవాబు దొరకని ప్రశ్నగా ఉంటోంది. గుడిలో వుండే దేవుడికి మనస్సులో ఏదన్నా కోరిక కోరుకుని నమస్కారం పెడతాం. ఆయనకి నైవేద్యం కింద కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ సమర్పిస్తాం. దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది అని కొందరికి సందేహం కలగవచ్చు. దీనికి జవాబు కొందరు పండితులు ఇలా చెబుతారు. మనకి కనిపించే ‘సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తనచుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. భూమి ఇలా ప్రదక్షిణలు చేయటంవల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా వున్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి (సూర్యరశ్మి) ని పొందుతోంది.ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక, సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది. అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగటం పైన చెప్పిన విషయాలకు సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం ‘చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు. ఇది మనస్సుకు, శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీనిని గుర్తించబట్టే వేల సంవత్సరాల నుంచీ కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ (భ్రమణం) చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు.

దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణలు చేయాలి. అప్పుడే ప్రదక్షిణ పూర్తయినట్లు లెక్క. అసలు దేవాలయంలోనికి ప్రవేశించగానే ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం చేయాలి.

ధ్వజస్తంభానికి జీవధ్వజం అనే మరో పేరు కూడా ఉంది. అదేవిధంగా దారు బేరం అని కూడా పిలుస్తుంటారు. దారువు అంటే చెక్క అని అర్థం. మద్ది, పనస, బొగడ, వేగిస, రావి, మారేడు, మోదుగ వృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగిస్తుంటారు. ధ్వజస్తంభం కింద కూర్మయంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. వైష్ణవాలయాల్లో పైన పతాకం లాగ మూడు వరుసల్లో జెండా ఎగురుతున్నట్లు ధ్వజస్తంభం ఉంటుంది. ఇలా మూడు భాగాలుగా ఉన్న వాటిని మేఖల అని అంటారు. చెక్కతో తయారు చేసిన ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగును వేస్తుంటారు. కొన్ని కొన్ని ఆలయాల్లో వెండి, బంగారుపు తొడుగులను వేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే మానవదేహమే దేవాలయంగా పాదం నుంచి శిరస్సు వరకు వ్యాపించి నిటారుగా నిలిచి ఉన్న ధ్వజస్తంభం.

ప్రదక్షిణలు చేసే సమయంలో మెల్లగా నడవాలి. అంతేతప్ప, వేగంగా పరుగెత్తినట్లు ప్రదక్షిణ చేయకూడదు. ప్రదక్షిణం చేసే సమయంలో చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రదక్షిణ చేయవచ్చు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, ఆయా దేవతలకు సంబంధించిన అష్టోత్తరనామాలను చెపుతూ ప్రదక్షిణ చేయడం మంచిది. అష్టోత్తరనామాలు తెలియనివారు పరమాత్మను ధ్యానిస్తూ, లేక ఆ స్వామినామాన్ని ఉచ్చరిస్తూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, మనస్సు, ఆలోచనలు స్వామిపైనే కేంద్రీకరింపజేసుకోవాలి. సాధారణంగా మూడుసార్లు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితి. సాధారణంగా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు చాలామంది మనసులు ప్రదక్షిణల సంఖ్యను లెక్కబెట్టుకోవడంలోనే నిమగ్నమై ఉంటుంటాయి. ఇలా ప్రదక్షిణలు చేయడంవల్ల ఎలాంటి ఫలితముండదు. అలా ప్రదక్షిణల సంఖ్యను లెక్క పెట్టాలనుకొనేవారు, వక్కలను గాని, పసుపుకొమ్ములనుగాని, నిర్ణీత సంఖ్యలో తీసుకెళ్ళి ప్రదక్షిణ మార్గంలో ఒకచోట ఉంచుకుని, ప్రదక్షిణ పూర్తిచేసి, అక్కడికి వస్తూనె ఒకదానిని తీసి ప్రక్కన ఉంచుకోవాలి. అలా ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క దానినితీసి ప్రక్కన పెట్టడం వల్ల, సరిగా ప్రదక్షిణలు చేసిన లెక్క ఉంటుంది. దేవునిపై మనస్సును లగ్నం చేసినట్లుగాను ఉంటుంది.

మహిమాన్వితమైన ‘ప్రదక్షిణ’లో అనేక రకాలున్నాయి.

1. ఆత్మప్రదక్షిణ: సాదారణంగా ఇంట్లో ఏదైన వ్రతం లేక పూజ చేసిన తరువాత:  మనచుట్టూ మనం సవ్య దిశలో తిరుగుతూ చేసే ప్రదక్షిణను ఆత్మప్రదక్షిణ అని అంటాం. అంటే ప్రదక్షిణాపథం లేనప్పుడు ఒకేచోట నిలబడి చేసే ప్రదక్షిణ ఇది.

2. పాదప్రదక్షిణ: సాధారణంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణాపథంలో గానీ, ఆలయం చుట్టుగాని నడుస్తూ చేసే ప్రదక్షిణ ఇది.

3. దండ ప్రదక్షిణ: ప్రదక్షిణాపథంలో స్వామికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి, అనంతరం లేచి నిలబడి ప్రదక్షిణ చేయడం, మరలా సాష్టాంగనమస్కారం, మళ్ళీ ప్రదక్షిణ చేయడాన్ని దండప్రదక్షిణ అనంటారు. ఈ పద్ధతిలో నాలుగుదిక్కులలోగానీ, లేక నాలుగుదిక్కులు, నాలుగుమూలలు కలిపి ఎనిమిదిచోట్ల సాష్టాంగ నమస్కారం చేస్తారు.

4. అంగప్రదక్షిణ: మనిషి అవయవాలన్నీ భూమిని తాకేటట్లుగా పడుకుని, ఆలయం చుట్టూ దొర్లుతూచేసే ప్రదక్షిణకు అంగప్రదక్షిణ అని పేరు.

5. పైన పేర్కొన్న ప్రదక్షిణా పద్దతులన్నీ కలిపి చేసే ప్రదక్షిణే మిశ్రమప్రదక్షిణ.


సాధారణంగా ఆలయంలో రెండవ ప్రదక్షిణా పద్ధతినే అనుసరించాలి. మొక్కుబడులున్నవారు పైన పేర్కొన్నవాటిలో వేటినైన చేయవచ్చు. ఆలయం చుట్టూ లేదా ప్రదక్షిణాపథం ఉన్నప్పుడు, అందులోగాని ప్రదక్షిణ చేయాలి. గర్భాలయంలోగాని స్వామివారికి ఎదురుగా నిలబడి, అంటే ధ్వజస్తంభం వద్దగాని, ప్రదక్షిణామార్గం వద్దగాని నిలబడి, స్వామికి నమస్కరించి ప్రదక్షిణలను ప్రారంభించాలి. ఒక్క శివాలయం తప్ప మిగతా అన్ని అఆలయాలలో ఇలాగే ప్రదక్షిణలు చేయాలి.

అయితే …

దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే… శివుడు దేవదేవుడు. అంటే… దేవుళ్లకే దేవుడు. కాబట్టి… ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా… పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ… గుడిలోని శివలింగాన్ని అభిషేకించి, పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలువగుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుందని అంటారు. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి వుంటుంది. పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారని పండితులు చెబుతున్నారు.

శివాలయం ధ్వజస్తంభం దగ్గర నుంచి మనకు ఎడమ పక్కగా బయలుదేరి గర్భాలయానికి వెనుక ఉన్న సోమసూత్రం( శివుని అభిషేక జలం బయటకు పోయే మార్గం) వరకూ వెళ్లి వెనుతిరగాలి. కానీ సోమసూత్రం దాటరాదు. అక్కడ నుంచి వెనుదిరిగి అప్రదక్షిణంగా మళ్లీ ధ్వజ స్తంభాన్ని చుట్టుకుని సోమసూత్రం వరకూ రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ ముగిసినట్లు.శివప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదన్నది ప్రధాన నియమం. అలాచేస్తే ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఒక ప్రదక్షిణ కిందకే వస్తుందంటుంది శాస్త్రం.

🌻🌹🪷🌻🌹🪷

పూజాకార్యక్రమాల సంకల్పము.

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు

ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ. 09.11..2023

బృహస్పతివాసరే( గురువారము)

**************


గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతాు హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే ఏకాదశ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

బృహస్పతివాసరే( గురువారము)

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు

 శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  ఆశ్వయుజ మాసే  కృష్ణ పక్షే ఏకాదశ్యౌపరి ద్వాదశ్యాం, 

బృహస్పతివాసరే  అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.05

సూ.అ.5.23

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 


శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

ఆశ్వయుజ మాసం 

కృష్ణ పక్షం ఏకాదశి ఉ. 9.31 వరకు. 

 బృహస్పతివాసరే.

నక్షత్రం ఉత్తర రా.9.50 వరకు. 

అమృతం  మ. 1.53 ల  3.39 వరకు. 

దుర్ముహూర్తం ఉ.9.51 ల 10.36 వరకు. 

దుర్ముహూర్తం మ.2.22 ల 3.07 వరకు. 

వర్జ్యం లేదు. 

యోగం వైధృతి సా. 5.36 వరకు.

కరణం బాలవ ఉ.9.31 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం మ. 1.30 ల 3.00 వరకు. 

గుళిక కాలం ఉ.9.00 ల 10.30 వరకు. 

యమగండ కాలం ఉ. 6.00 ల 7.30 వరకు. 

***********

పుణ్యతిధి ఆశ్వయుజ బహుళ ద్వాదశి. 

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

Sachivalayanagar,

Vanasthalipuram,

Rangareddy Dist, 500 070,

80195 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

మూలం శబ్దం

 శ్లోకం:☝️

*ఇదం అంధతమః కృత్స్నం*

  *జాయతే భువనత్రయం |*

*యది శబ్దాన్వయం జ్యోతిః*

  *ఆసంసారం న దీప్యతే ||*


భావం: ముల్లోకాలలో శబ్దమనే జ్యోతి వెలిగి ఉండకపోతే ఈ సమస్త జగత్తు అంధకారంలో మునిగి ఉండేది.


పశువులనుండి మనుషులను వేరు చెసేది, మదిలోని భావాలను నలుగురితో పంచుకోనేలా చెసేది, సంఘజీవిగా మనిషి మనుగడ సాగించడానికి ఉపయోగపడేది -  భాష. అట్టి భాషకి మూలం అక్షరాలు. అక్షరాలకు మూలం శబ్దం.


*అనాది నిధనం బ్రహ్మ*

  *శబ్దతత్త్వం యదక్షరం |*

*వివర్తతేర్థ భావేన*

  *ప్రక్రియా జగతో యతః ||*


భావం: అనాదిగా శబ్ద బ్రహ్మ అక్షరరూపంలో ఈ జగత్తులో వ్యాపించి ఉంది. దానిని మనం భక్తి పూర్వకంగా సేవించాలి.🙏

పంచాంగం 09.11.2023 Thursday,

 ఈ రోజు పంచాంగం 09.11.2023  Thursday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష: ఏకాదశి తిధి బృహస్పతి వాసర: ఉత్తరఫల్గుని నక్షత్రం వైధృతి యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి పగలు 10:39 వరకు.

పూర్వఫల్గుని రాత్రి 09:54 వరకు.

సూర్యోదయం : 06:21

సూర్యాస్తమయం : 05:38

వర్జ్యం : ఈ రోజు లేదు.

దుర్ముహూర్తం : పగలు 10:07 నుండి 10:52 వరకు తదుపరి మధ్యాహ్నం 02:37 నుండి 03:23 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం  01:30  నుండి 03:00 వరకు 


యమగండం : ఉదయం 06:00 నుండి 07:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

 మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు .


 *1* . *తల్లి* 


మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన... తల్లి మొదటి అద్భుతం. 


 *2* . *తండ్రి* 


మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు.మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు.దుఃఖాన్ని తాను అనుభవిస్తూ.. సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం.....


 *3* . *తోడబుట్టిన* *వాళ్ళు* 


మన తప్పులను వెనుకెసుకురావాడానికి...  

మనతో పోట్లాడడానికి... మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు... 

తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం......


 *4* . *స్నేహితులు*  


మన భావాలను పంచుకోడానికి..  

మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...

ఏది ఆశించకుండా.. మనకు దొరికిన స్నేహితులు నాలుగో అద్భుతం....


 *5* . *భార్య* / *భర్త* 


ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా చేస్తుంది.కలకాలం తోడు ఉంటూ... ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే... ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది .....భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే ఐదో అద్భుతం మన సొంతం .


 *6* . *పిల్లలు* 


మనలో స్వార్థం మొదలవుతుంది.. మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది...  

వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..  

వారికోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది.. 

వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు అసలు ఉండరు... పిల్లలు ఆరో అద్భుతం.


అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?


 *7* . *మనవళ్ళు* *మనవరాళ్లు* 


వీరికోసం ఇంకా కొన్నిరోజులు బతకాలనే ఆశపుడుతుంది.. వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం మళ్ళీ పసిపిల్లలం... అయిపోతాం.వీరు మన జీవితానికి దొరికిన.. ఏడో అద్భుతం....


ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం... 

కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి  

చిన్న పలకరింపు చాలు... మనల్ని ఆ అద్భుతంగా చూడడానికి.  

అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం ...


ఇప్పుడు మన మధ్య ఉన్న మనిషి తెల్లవారేసరికి వుంటాడో లేదో తెలియని కాలం ఇది అందుకే ఉన్న దానిలో సర్దుకుపోయి హాయిగా జీవించడం లోనే ఆనందం. ✍️ వింజమూరి వెంకటరావు, సీనియర్ న్యాయవాది, కాకినాడ.

 ఓం.. విశ్వవ్యాప్త శ్రీ రాముని భక్తులకు విన్నపం.

మాతృమూర్తులూ..సోదరీమణులు మరియు సోదరులారా..

రాబోయే పౌష్ శుక్ల ద్వాదశి, విక్రమ సంవత్ 2080, సోమవారం (జనవరి 22, 2024) పవిత్రమైన రోజున.. 

కొత్త ఆలయం యొక్క గ్రౌండ్ ఫ్లోర్ లోని గర్భగుడిలో భగవాన్ శ్రీ రామచంద్రుడిని బాలరాముని రూపంలో కొత్త విగ్రహం ప్రతిష్టించబడుతుంది. 

ఇది శ్రీరాముని జన్మస్థలం మీద నిర్మించబడినా ఆలయం..

ఈ సందర్భంగా అయోధ్యలోనే కాదూ ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన ఆనంద వాతావరణం నెలకొంటుంది. 

మీరు కూడా, ప్రాణ-ప్రతిష్ఠ రోజున (ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 01:00 గంటల మధ్య), మీ గ్రామం, ప్రాంతం, కాలనీలో ఉన్న దేవాలయంలో మీ ఇరుగుపొరుగున ఉన్న రామభక్తులను సమీకరించి భజన-కీర్తనలు చేయండి. 

మొత్తం కార్యక్రమాన్ని పరదా (ఎల్.ఈ.డి., స్క్రీన్) వేయడం, శంఖం ఊదడం, గంటలు మోగించడం, హారతి చేయడం, ప్రసాదం పంపిణీ చేయడం ద్వారా సమాజానికి అయోధ్య యొక్క ప్రతిష్ఠాపన కార్యక్రమం గురుంచి తెలియచెప్పండి..

కార్యక్రమం పూర్తిగా ఆలయ కేంద్రంగా ఉండాలి.. 

మీ ఆలయంలో ఉన్న దేవతలు మరియు దేవతల భజన-కీర్తన - ఆరతి పూజ .. శ్రీరామ విజయ మంత్రం "శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్" యొక్క సామూహిక జపం 108 సార్లు. 

దీనితో పాటు, హనుమాన్ చాలీసా , సుందర కాండ, రామరక్షా స్తోత్రం మొదలైనవి మీరు సామూహిక పారాయణం కూడా చేయవచ్చు. విశ్వంలోని సమస్త దేవీ దేవతలూ సంతోషిస్తారు, మొత్తం భారతదేశం యొక్క వాతావరణం సాత్విక మరియు రామ-మయం  అవుతుంది. పవిత్రోత్సవం దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది..

మిగిలిన చానల్స్ లో కూడా ప్రసారం చేయబడుతుంది.. 

ప్రాణ-ప్రతిష్ఠ రోజున సూర్యాస్తమయం తర్వాత మీ ఇంటి ముందు దీపం వెలిగించి దేవతలను ప్రసన్నం చేసుకోండి: దీపాన్ని అలంకరించండి, దీపావళిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో జరుపుకోవాలి..

భగవాన్ శ్రీ రామ్ లల్లా నూ అలాగే  కొత్తగా నిర్మించిన ఆలయాన్ని చూడటానికి పవిత్రోత్సవ రోజు తర్వాత మీకు అనుకూలమైన సమయంలో మీ కుటుంబంతో సహా అయోధ్య కి రావాలని రామసేవకులమైన మేము మిమ్మల్ని అభ్యర్దిస్తున్నాం.. అయిధ్య రండి శ్రీరాముని ఆశీస్సులు పొందండి.. అజేయులుగా తిరిగి వెళ్ళండి..


శ్రీ రామ జన్మభూమి ఆలయ వివరాలు..భవిష్య కార్యక్రమాలు..

1. సాంప్రదాయ నాగర్ శైలిలో నిర్మించిన ఆలయం..

ఆలయ పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు మరియు ఎత్తు 161 అడుగులు.

2. మూడు అంతస్తుల ఆలయం, ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు, మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు.

3. గ్రౌండ్ ఫ్లోర్ గర్భగుడి - భగవంతుడు శ్రీ రాముని పిల్లల రూపం (శ్రీ రామ్ లల్లా), మొదటి అంతస్తు గర్భగుడి - శ్రీ రామ్ దర్బార్.

4. మొత్తం ఐదు మంటపాలు డ్యాన్స్ పెవిలియన్, కలర్ పెవిలియన్, మిస్టరీ పెవిలియన్ (మీటింగ్ పెవిలియన్) ప్రార్థన పెవిలియన్, కీర్తన పెవిలియన్

ఓం స్తంభాలు, గోడలలో దేవతల విగ్రహాలు.

5. సింహద్వారం గుండా 32 మెట్లు (ఎత్తు 16.5 అడుగులు) ఎక్కి తూర్పు వైపు నుండి ఆలయంలోనికి ప్రవేశం ఉంటుంది.

6. మంది వికలాంగులు మరియు వృద్ధులకు ర్యాంప్ మరియు లిఫ్ట్ ఏర్పాటు.

7. గుండ్రని దీర్ఘచతురస్రాకార ఉద్యానవనం (ఆకారం) - పొడవు 732 మీటర్లు, వెడల్పు 4.25 మీటర్లు, ఉద్యానవనం యొక్క నాలుగు మూలల్లో నాలుగు ఆలయాలు, సూర్య భగవానుడు, శంకర్, గణపతి, భగవతి దేవి, పార్కుకు దక్షిణం వైపున హనుమంతుడు మరియు ఉత్తరం వైపున మాతా అన్నపూర్ణ దేవీ ఆలయం.

ఆలయ దక్షిణ భాగంలో పౌరాణిక సీతాకూపం..

పార్క్ వెలుపల దక్షిణ దిశలో ప్రతిపాదిత దేవాలయాలు - మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాద రాజ్, మాతా శబరి మరియు దేవి అహల్య.

నైరుతి భాగంలో నవరత్న కుబేరుడు గుట్టపై ఉన్న శివాలయాన్ని పునరుద్ధరించడం.. 

రామభక్తుడు జటాయు పక్షి రాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం..ఇవీ రాబోయే రోజుల్లో జరగబోయే అభివృద్ది..

జైశ్రీరాం..జైజై శ్రీరాం..


 

శ్రీ గెలా సోమనాథ్ మందిర్

 🕉 మన గుడి : నెం 233





⚜ గుజరాత్ : రాజ్ కొట్


⚜ శ్రీ గెలా సోమనాథ్ మందిర్



💠 ఘెలా సోమనాథ్ భారతదేశంలోని రాజ్‌కోట్ జిల్లాలో ఉంది. ఇక్కడ చాలా అందమైన మరియు పవిత్రమైన శివాలయం ఘెలా సోమనాథ్ ఆలయంగా పిలువబడుతుంది.


💠 ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో  మినాల్ దేవి నిర్మించారు. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, సోమనాథ్ ఆలయంపై దాడిలో మినాల్ దేవి  అనే  స్థానిక యువరాణి ఈ శివలింగాన్ని రక్షించి ఇక్కడికి తీసుకువచ్చిందని నమ్ముతారు. 



💠 స్వామినారాయణే స్వయంగా ఈ ప్రవాహంలో కొన్ని సార్లు స్నానం  చేశాడని చెబుతారు కాబట్టి స్వామినారాయణ అనుచరులకు ఇది ఒక పెద్ద యాత్ర ప్రదేశం.


💠 ఘేలా సోమనాథ్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ ఆలయం ఘెలా నది ఒడ్డున ఉంది.  

ఈ శివలింగం సోమనాథ్ నుండి ఘెలా వానియాతో వచ్చింది మరియు ఘెలో వానియా యుద్ధంలో వీరమరణం పొందినందున, నది పేరు ఘెలో నది మరియు ఈ శివలింగానికి ఘెలా సోమనాథ్ అని పేరు పెట్టారు.



💠 ఘేలా సోమనాథ్ మహాదేవ్ ఆలయంలో శివలింగం ఉంది.  ఈ దేవాలయం శివ భక్తుల విశ్వాసానికి పెద్ద కేంద్రం.  

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ సహా పలువురు పెద్ద నేతలు కూడా ఘెలా సోమనాథ్‌ మహాదేవ్‌ ఆలయానికి వచ్చి ఆశీస్సులు తీసుకుని జలాభిషేకం చేశారు.  


💠 ఈ ఆలయాన్ని సందర్శించినంత మాత్రాన ప్రజల కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు.  ఆలయ గర్భగుడి దగ్గర గజానన కూర్చుని ఉన్నాడు.



💠 ఈ ఘెలా సోమనాథ్ దేవాలయంలోని శివలింగం చాలా పెద్దది, ఒక్క దర్శనం వెయ్యి పాపాలను నాశనం చేస్తుంది మరియు ప్రతి కోరికను నెరవేరుస్తుంది.  


💠 ఈ ఆలయంలో ఉదయం మరియు సాయంత్రం హారతి చేస్తారనే నమ్మకం కూడా ఉంది.  అయితే ముందుగా మీనాల్ దేవి యొక్క హారతి నిర్వహించబడుతుంది, తరువాత ఘెలా సోమనాథ్ దాదా యొక్క ఆరతి జరుగుతుంది.  


💠 ఇక్కడ గుడిలో  జ్వాల ఏళ్ల తరబడి మండుతూనే ఉంది.  


💠 ఈ ఆలయంలోని శివలింగం మరియు కొండపై కూర్చున్న తల్లి మీనాల్దేవ్ ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి.  దానిని చూస్తుంటే కొండపై నుండి శివలింగానికి తల్లి మినాల్‌దేవ్ కాపలాగా ఉన్నట్లు అనిపిస్తుంది.  


💠 ఈ ఆలయ ప్రధాన ద్వారం గతంలో ఆలయానికి ఎడమ వైపున ఉండేది.  కొండపై ఉన్న మాతా మినాల్‌దేవ్ ఆలయానికి మరియు శివలింగానికి మధ్య ఒక చిన్న ద్వారం ఉంది.  అయితే ఈ తలుపు మూసి అక్కడ గోడ కట్టేసరికి ఈ గోడ పడిపోవడంజరిగింది .

ఇలా చాలా సార్లు జరిగింది.  

అది చూడగానే తల్లి మినాల్దేవి కొండపై నుండి శివలింగానికి కాపలాగా ఉన్నట్లు అనిపించింది.  ఆపై ఆలయం యొక్క ప్రధాన ద్వారం శివలింగం మరియు తల్లి మీనాల్దేవ్ ఆలయం మధ్య నిర్మించబడింది.  ఆ విధంగా మాత మీనాల్దేవ్ నేటికీ ఈ ఆలయంలోని శివలింగాన్ని రక్షిస్తుంది.



 💠 ఘెలా సోమనాథ్ మందిరాన్ని సందర్శించడానికి శ్రావణ మాసం ఉత్తమ సమయం.


 💠 సమయాలు:- 

05:00 AM నుండి 09:00 PM వరకు


💠 రాజ్‌కోట్ నగరానికి కేవలం 77 కిలోమీటర్ల దూరంలో కలదు