శ్లోకం:☝️
*ఇదం అంధతమః కృత్స్నం*
*జాయతే భువనత్రయం |*
*యది శబ్దాన్వయం జ్యోతిః*
*ఆసంసారం న దీప్యతే ||*
భావం: ముల్లోకాలలో శబ్దమనే జ్యోతి వెలిగి ఉండకపోతే ఈ సమస్త జగత్తు అంధకారంలో మునిగి ఉండేది.
పశువులనుండి మనుషులను వేరు చెసేది, మదిలోని భావాలను నలుగురితో పంచుకోనేలా చెసేది, సంఘజీవిగా మనిషి మనుగడ సాగించడానికి ఉపయోగపడేది - భాష. అట్టి భాషకి మూలం అక్షరాలు. అక్షరాలకు మూలం శబ్దం.
*అనాది నిధనం బ్రహ్మ*
*శబ్దతత్త్వం యదక్షరం |*
*వివర్తతేర్థ భావేన*
*ప్రక్రియా జగతో యతః ||*
భావం: అనాదిగా శబ్ద బ్రహ్మ అక్షరరూపంలో ఈ జగత్తులో వ్యాపించి ఉంది. దానిని మనం భక్తి పూర్వకంగా సేవించాలి.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి