*'దీపావళి' ప్రప్రధమముగా జరుపుకున్న స్థలము, ఆంధ్రదేశము లోనే వున్నది*
🌿విజయవాడ నుంచి, అవనిగడ్డ వెళ్ళే కృష్ణానది కరకట్ట మీదుగా వెళితే, 'నడకుదురు' గ్రామమ
🌸ఆ గ్రామమునకు గల పురాతనమైన పేరు "నరకాసుర సంహార క్షేత్రము".
ఆ గ్రామము పేరు, కాలక్రమేణా మారుతూ, నరకొత్తూరు, తర్వాత 'నడకుదురు గా మారింది.
🌿ఇక్కడ, మహా సుందరమైన పచ్చని అరటి తోటల మధ్యన,
"శ్రీ పృథ్వీశ్వరాలయముంది".
సత్యభామాదేవి.. సాక్షాత్తు భూదేవి. నరకాసురుని సంహరించిన తర్వాత, అమ్మవారు ఈశ్వర ప్రతిష్ట చేసిందని స్థల పురాణము.
🌸'పృథ్వి' అంటే భూదేవి, సత్యభామ.
🌿ఆ ఆలయము వద్దనే, శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహము కూడా వున్నది.
🌸నరకాసురుని ఇచ్చట సంహరించిన తర్వాత, మొదట మొదటగా నరక చతుర్దశి, దీపావళి జరుపుకున్నారు.
🌿నరకాసురుడు, స్వర్గలోకమునుంచి తెచ్చి 'పాటలీవృక్షమును' ఈ ఆలయము వద్ద నాటాడు. మన భారతదేశంలోనే గల ఏకైక వృక్షమిది. 5000 సంవత్సరములనాటిది. ఈ వృక్షమును ఇప్పటికీ మనము దర్శించుకోవచ్చు.
🌿బిడ్డలు లేని వారు, ఈ చెట్టుకు 'వుయ్యాల' కడితే, తప్పక సంతానవతులవుతారు.
🌸విజయవాడ నుంచి, అవనిగడ్డ వెళ్ళే కృష్ణానది కరకట్ట మీదుగా వెళితే, సుమారు 50 కి.మీ. దూరంలో ఈ 'నడకుదురు' గ్రామము చేరుకోవచ్చు....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి