శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
మహర్షీ! మా తండ్రిగారి అనుగ్రహం వల్ల మాకు కావలసినవన్నీ పుష్కలంగా లభిస్తూనే
ఉన్నాయి. కోరుకోవలసింది ఏమీ లేదు. అయినా నీ సంతృప్తికోసం ఒకటి అడుగుతున్నాం, నెరవేర్చు..
దేవతలతోపాటు సోమపానం చెయ్యాలని మా చిరకాల వాంఛ. దేవవైద్యులం కనక మాకు అది
నిషిద్ధవస్తువయ్యింది. మేరు పర్వతంమీద బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినప్పుడు దేవేంద్రుడు మా ఇద్దరికీ
ఈ నిషేధం విధించాడు. అప్పటినుంచీ మాకు ఇది తీరని కోరిక అయ్యింది. నువ్వేమన్నా తీర్చగలిగితే ఈ
చిన్నికోరిక తీర్చు అన్నారు అశ్వినులు.
అశ్వినులారా! అదెంతటి మహాభాగ్యం. తప్పక తీరుస్తాను. మిమ్మల్ని సోమపానుల్ని చేస్తాను.
ఇంద్రుడికి కోపంవస్తే వచ్చుగాక. అతడి సమక్షంలోనే మాట నిలబెట్టుకుంటాను. మా మామగారు
శర్యాతిమహారాజు త్వరలోనే ఒక మహాయజ్ఞం చేస్తాడు. అప్పుడు మీ కోరిక తీరుస్తాను. ఇది నా వాగ్దానం
- అన్నాడు చ్యవనుడు. అశ్వినులు సంతోషించి వెళ్ళిపోయారు. సుకన్యాచ్యవనులు ఆశ్రమం చేరుకున్నారు.
(అధ్యాయం 5, శ్లోకాలు 590)
వ్యాసమహర్షి సూర్యచంద్రవంశాల చరిత్రను చెబుతూండగా శర్యాతి విషయంవచ్చి.
సుకన్యాచ్యవనుల కథ విస్తరించింది. జనమేజయుడు శ్రద్ధగా ఆలకించాడు. ఈ కథలో మరికొన్ని
వివరాలు అడిగాడు.
వ్యాసమహర్షీ! దేవవైద్యులకు చ్యవనుడు సోమరసం తాగించాడా? మరి ఇంద్రుడు
కోపించలేదా? దేవరాజబలంతో మానుషబలం పోటీపడి నెగ్గగలిగిందా? ఇది చాలా కుతూహలాన్ని
కలిగిస్తోంది. వివరించవా?
జనమేజయా! తప్పకుండా వివరిస్తాను. విను. ఇది చాలా అద్భుతమైన కథ. దేవకన్యలాంటి
సుకన్యతో చ్యవనమహర్షి గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వహిస్తున్నాడు. తన అల్లుడు సుందరాకారుడయ్యాడవి
శర్యాతి దంపతులకు ఇంకా తెలియలేదు.
శర్యాతి సుకన్యను శంకించడం
ఒకనాడు శర్యాతి భార్య దుఃఖిస్తూ భర్త దగ్గరికి వచ్చింది. మహారాజా! బంగారం లాంటి
అమ్మాయిని ఒక వృద్ధాంధతాపసికి కట్టబెట్టి అడవుల్లో విడిచిపెట్టి వచ్చాం. చాలాకాలమయ్యింది. ఎలా
ఉందో! జీవించి ఉందో, మరణించిందో! కుశలవార్తలు ఏమీ అందడంలేదు. ఒకసారి వెళ్ళి చూసి
రాకూడదా! కూతురికి ఇలాంటి సంబంధం చేశామే అని నేను ఏడవని రోజంటూ లేదు. పిచ్చితల్లి,
మొగుడికి సేవలతో ఆ అడవుల్లో చిక్కిశల్యమైపోయుంటుంది. వెళ్ళి ఒకసారి ఇంటికి తీసుకురండి. బెంగ
పెట్టుకున్నాను. చూడాలనిపిస్తోంది. నారచీరలతో కందమూలాలతో ఆ గుడ్డి మొగుడితో ఎలా పడుతోందో
ఏమో! అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
దుస్సహోఽయం పుష్పధన్వా విశేషణ చ యౌవవే ॥
కులే కళంకస్సుమహాననయా మానవే కృతః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి