9, నవంబర్ 2023, గురువారం

ఆలోచనాలోచనాలు

 ///// ఆలోచనాలోచనాలు /////       -----౦ భయం! భయం భయం!! ౦-----                      ***** మృత్యుదేవత ఒక పట్టణం లోకి ప్రవేశిస్తూ ఒక మహనీయుని కంటబడింది. ఎంతమందిని తీసుకుని పోతున్నావ్? అని ప్రశ్నించాడా మహనీయుడు. కేవలం 500 మందినే!, జవాబిచ్చింది ఆ దేవత. మరునాడు పత్రికలలో, టి.  వి. ఛానళ్ళలో ఆ పట్టణంలో "" కలరా వ్యాధి"" ద్వారా 5000 మరణించినట్లు వార్త వెలువడింది. మహనీయుడు ,మృత్యుదేవతతో నాతో ఐదు వందలని చెప్పి ఐదువేల ప్రాణాలను బలిగొన్నావే? అని.దానికామె ఇట్లా బదులిచ్చింది. "" పట్టణంలో కలరా వలన మరణించిన వారు 500 మందే! కలరా వస్తుందేమోననే భయంతో మరణించినవారు మిగిలిన 4,500 మంది , అని.......       ***** ప్రపంచంలో అత్యధికులు భయపడేది వేదికలపైన పదిమంది ముందు నిలబడి మాట్లాడటానికి; ఎత్తు ఎంత ఎక్కువగా ఉంటే, అంతగా భయపడేవాళ్ళు రెండోస్థానంలో నిలుస్తారు. క్రిమికీటకాలు, విషజంతువులు మరియు క్రూరజంతువులకు భయపడేవారిది మూడోస్థానం. కొంతమందికి చావుభయం. మరికొందరికి మృత్యుభయం. చీకటి భయస్థులు కోట్ల సంఖ్యలలో లభిస్తారు. ఉరుములు, మెరుపులంటే భయపడేవారు కొందరైతే, పిడుగుల ధ్వనికి కంపించిపొయ్యేవారు మరికొంతమంది.                   ***** సర్కస్ లో సింహాలను లొంగదీసుకొని, వాటితో విన్యాసాలు చేయించే వీరాధివీరులు వారి, వారి భార్యలముందు పిల్లులై మెలగుతూ వుంటారు.                            ***** తెలివైనవారు మూడు విషయాలకు భయపడుతుంటారు. అవి తుఫానులలోని కల్లోల సముద్రాన్ని చూచి, చంద్రుడు లేని కటిక చీకటిని చూచి మరియు సజ్జనుడి కోపాన్ని చూచి.       ***** ఎందులోనూ భయపడని కొందరు ఒంటరితనానికి భయపడుతుంటారు.            ***** ప్రమాదం వచ్చినపుడు భయపడడం ఒక ఎత్తైతే, ప్రమాదం వస్తుందేమోనని భయపడడం మిక్కిలి ప్రమాదకరం. గండం గడిచిన తరువాత భయపడేవారు కొందరు. తాడును తొక్కి అది పామేననుకొని భయంతో వణికిపొయ్యేవారు మరికొంతమంది.                   ***** నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. అవి దాటిపోయిన తరువాత అంతటి గండాన్ని ఎట్లా దాటగలిగేనా? అని భయపడుతుంటానన్నాడొక మేథావి.                            ***** దాదాపు అందరం భయం గుప్పిట్లో బతుకుతున్న వాళ్ళమే! కాకపోతే కొంచెం ఎక్కువ లేదా తక్కువ. అంతే!              ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~.                             Sharpen your mind!         1* What flies without wings?                               2* Which vehicle is spelled the same forwards and backwards ?                     3* What is harder to catch , the faster you run?                                        4* A is the father of B. But B is not the son of A. How's that possible?                            (For proper answers you have to wait 24 hours only.).                      ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~                              తెలుగు నుడికారం ( సామెతలు మరియు జాతీయాలు)                        1* బంగారానికి తావి( సువాసన) అబ్బినట్లు.                           2* బంగారు చెప్పులైనా కాళ్ళకే కదా తొడిగేది!             3* వాడెవడో పౌరుషానికి వచ్చి పచ్చిపులుసు తాగేట్ట!                                 4* పొరుగూరికి పోగానే పోతుందా దుర్దశ?                 5* పొదుగెంత జారినా, కుక్క గోవు అవుతుందా?     6* పొద్దుగాని పొద్దులో పెద్దిగాని పెళ్ళి.                      7* అదేమిటోగాని , పొట్లపాదుకు పొరుగు గిట్టదు.                                 8* పొంగిందంతా, పొయ్యి పాలే కదా!                            9* పైరుకు రాగులు, భాగ్యానికి మేకలు.                10* వాడెవడో పేలాలను చల్లి , దయ్యాలను లేపాట్ట!    తేది 9--11--2023, గురువారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: