16, ఫిబ్రవరి 2021, మంగళవారం

పుల్లంపేట జరీచీర

 పుల్లంపేట జరీచీర

రచయిత :     శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు


ఆంధ్రభూమి 1940 నాటి సంచికలో వచ్చిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చిన్నకధ “పుల్లంపేట జరీ చీర” ! 

                                             ***************

                                                           

 అతని సంపాదన  అంతంత మాత్రమే అయినా  తన భార్యకు ఎలాగైనా సరే పండక్కి కొత్త చీర కొనాలనే అతని తపన,  చేసిన త్యాగాలు  హర్షనీయంగా ఉన్నాయి.  మధ్య తరగతి జీవితాలలో  ఇటువంటి ఆనందాలు, అనుభూతులు  ఎంతో మనోహరంగా ఉంటాయి.  తన ప్రియమైన  భార్య  కళ్లలో  వేయి దీపాల  కాంతిని చూస్తూ  మురిసిపోవాలని  ఏభర్తకు ఉండదు ?  భార్యను సంతోషపెట్టడానికి  అప్పులు చేయలేదు,  భేషజాలకు పోలేదు.  కేవలం  తన దైనందిక జీవితంలో భార్యకు తెలియకుండా చిన్న చిన్న త్యాగాలు చేస్తూ, పొదుపుచేసుకుంటూ,  పండక్కి  చక్కని చీరకొని ఆమె చేత కట్టించి మురిసిపోయిన ఒక మధ్యతరగతి భార్య్భర్తల ముచ్చటైన  సంసార సరిగమలు  ఎంత మధురంగా  కధ ద్వారా చూపించారో  రచయితగారు.  మంచి మనసున్న భర్త దొరకడం ఆ ఇల్లాలి అదృష్టం.  పుట్టింటి నుండి  కట్నకానుకలకై  వేధించే  కొంతమంది కైనా  ఇటువంటి కధలు కనువిప్పు కలిగించకమానవు.  ఎలాగైనా సరే  పండక్కి గాని  తన పుట్టినరోజుకిగాని  ఖరీదైన చీరలే కాకుండా  బంగారు నగలు కావాలని వేధించి క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనిపించుకున్న స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. చక్కని దాంపత్యజీవితానికి  భార్యా భర్తల మధ్య మంచి అవగాహన ఎంత అవసరమో తెలియ చేసే ఒక పాతకాలపు కధ ..దాదాపు  దగ్గరగా ఎనభైసంవత్సరముల నాటి కధ .. కాని ఎప్పటికీ నిత్యనూతనంగా అనిపించే  "  పుల్లంపేట జరీచీర " ....


-----------------------------------------------------------


యాజులు నెల్లూరి జిల్లా కోర్టులో గుమస్తాగా వుండినప్పటి సంగతి


ఇక నెలా పదిహేనురోజులుందనగా, సంకురాత్రి పండుక్కి రాధమ్మని పుట్టింటివారు తీసుకెళ్లరని తేలిపోయింది.అప్పటికామె పద్ధెనిమిదేళ్ల పిల్ల. పండుగులనీ, పబ్బాలనీ, అచ్చట్లనీ, ముచ్చట్లనీ కిందా మీదా పడిపోతూ ఉండే వయస్సు.దగ్గిరగా ఉన్నంత కాలమూ పుట్టింటివారామెకి లాంఛనాలన్నీ బాగానే తీర్చేవారు. కానీ నెల్లూరికి, పిఠాపురానికీ రానూ పోనూ కూతురికీ, అల్లుడికీ కావలసిన రైలు ఖర్చుల మొత్తం తెలిసేటప్పటికి వారికి గుండెలాగిపోయాయి.


ఇది ఆలోచించి చివరికి రాధమ్మ కూడా సరిపెట్టుకుంది.మొదట మాత్రం తండ్రి రాసిన ఉత్తరం చూసుకొని ఆమె నిర్ఘాంతపడిపోయింది.ఇది యాజులు గుర్తించాడు. అతని హృదయం దడదడ కొట్టుకుంది. కాని ఒక్క క్షణంలో తేరుకుని, ఆమె కళ్లల్లోకి జాలిగా చూసి, తన వెచ్చని పెదవులతో తాకి ఆమె పెదవులకు చలనం కలిగించుకున్నాడు.తరువాత ‘మడి కట్టుకోండి’ అంటూ ఆమె వంటింట్లోకి వెళ్లిపోయింది.అతను తాపితా కట్టుకున్నాడు.


 కుచ్చెళ్లు పోసుకునేటప్పుడు ‘‘రెండేళ్ల కిందట విజయదశమినాడు నీ అత్తవారిచ్చారు నీకిది. ఇంత గొప్పవి కాకపోయినా, ప్రతీ సంవత్సరమూ నువ్వు నీ అత్తవారి బహుమతులు కట్టుకుంటూనే ఉన్నావు. కానీ పుట్టింటి వారిస్తూనే ఉన్నారు గదా, లోటు లేదు గదా అనుకుంటున్నావే కాని రాధకి నువ్వొక్క చీర అయినా కొనిపెట్టావా పాపం? చిలక వంటి పెళ్లానికి మొగుడు చూపించవలసిన మురిపెం ఇదేనా? చివరకి వొక్క రైక అయినా కుట్టించావా? నీకిది బాగుందనిపించిందా?’’ అని ఎవరో నిలవతీసి అడిగినట్టనిపించింది.


దీంతో వల్లమాలిన సిగ్గు వచ్చి ఊదర గొట్టేసింది.దాని మీది ‘ఇప్పుడైనా రాధకొక మంచి చీర కొనిఇవ్వాల’నుకున్నాడు. ‘ఇచ్చి తీరాలి. పండుక్కి కొత్త చీర లేని లోటు కలగనివ్వకూడదు’ అని దృఢపరుచుకున్నాడు.కానీ, డబ్బేది?ఏనెల జీతం ఆనెలకే చాలీచాలనట్టుంది. అక్కడికీ నెల్లూరిలో ఇంటి అద్దెలు చౌక కనుక సరిపోయింది. కాని లేకపోతే ఎన్ని చేబదుళ్లు చేస్తూ ఎన్ని వొడిదుడుకులు పడవలసి వచ్చేదో?రాధమ్మ కూడా పొదుపయిన మనిషి కనక ఆటసాగుతోంది. కానీ కాకపోతే, ఆ చేబదుళ్లకు సాయం ఎన్ని అరువులు పెరిగిపోయి ఉందునో?ఏమైనా చీర కొనితీరాలని శపథం పట్టుకున్నాడు.ఖర్చులు తగ్గించుకోడం తప్ప మార్గాంతరం కనపడలేదు. ఆ ఖర్చులలో నేనా సంసారం కోసం రాధమ్మ చేసేవాటిలో తగ్గించడానికి వీలు కనపడదు.దీని మీద ‘నా ఖర్చులు తగ్గించుకుంటా’నని అతను నిశ్చయించుకున్నాడు.అది మొదలు, అతను నాటకాలకి వెళ్లడం కట్టిపెట్టేశాడు. పుస్తకాలు కొనడం మానేసి భాండాగారానికి వెళ్లసాగాడు. ఒకటి రెండు వినోదయాత్రలు చాలించుకున్నాడు. కోర్టుకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడూ బండెక్కడం తగ్గించుకున్నాడు. మధ్యాహ్నం కోర్టు దగ్గర ఫలహారం ఒక్కటే కాదు, కాఫీ కూడా మానుకొన్నాడు.


 పొద్దుటి పూట మాత్రం యింటి దగ్గర కాఫీసేవ మానుకోలేదు. అంచేత రాధమ్మ కిదేమీ తెలవకుండా జరిగిపోయింది.


ఆవేళ పెద్దపండుగ.


మధ్యాహ్నం. రెండు గంటల సమయంలో యాజులు, రాధమ్మ యేం చేస్తోందో చూద్దామని వసారాలోకి వెళ్లి జంట వెదురుకుర్చీలో కూర్చున్నాడు.


ఉన్న చీరల్లో మంచివి నాలుగు పట్టుకువచ్చి 'వీటిలో యేది కట్టుకోను చెప్పండీ' అంటూ రాధమ్మ పక్కని కూచుంది.


'నన్నడగడం యెందుకూ?'


'మంచిచీర కట్టుకోవడం మీకొసమా, నా కోసమా?'


'నా కోసమే అయితే, ఆ చీరలన్నీ మీవాళ్ళిచ్చినవి, వాటిమీద నాకేమీ అధికారం లేదు'


'అదేమిటండీ?'


'ఎకసెక్కం చెయ్యడం లేదు నేను'.


'చె-ప్పండీ పెడర్ధాలు తియ్యకా.'


ఇలా గునుస్తూ ఆమె కుడిచెయ్యి అతని నడుముకి చుట్టేసింది.


దానిమీది, ఆనందమూ, వుద్వేగమూ అతికష్టం మీద అణుచుకుంటూ అతను 'నేను మానెయ్యమన్నది మానేసి కట్టుకోమన్నది కట్టుకుంటావా?' అని గంభీరంగా ప్రశ్నించాడు.


'ఆ'


'అయితే అవన్నీ పెట్టిలో పెట్టేసి రా'


ఆమె కేమీ అర్ధం కాలేదు. అయినా, యేదో లేకుండా అతనలా చెప్పడని యెరుగును కనుక, అతనికి అడ్డుమాట చెప్పలేదు కూడా కనిక, వొక్కమాటు గంభీరంగా చూసి అవి యింట్లో పెట్టేసి వచ్చి, మళ్ళీ పక్కని కూచుని 'మరి చెప్పండి' అని అడిగింది.


వెంటనే అతనొక్కమాటు మందహాసం మొలిపించి, అతి తాపీగా లేచి, అతిదర్జాగా వాకిట్లోకి వెళ్ళి, మేజా సొరగులోనుంచి వొక పొట్టం తీసుకువచ్చిఅతిప్రేమతో ఆమెకందించి దగ్గిరగా కూచున్నాడు.


ఆమె చేతులు గబగబలాడిపోయాయి.


విప్పిచూడగా, అల్లనేరేడుపండు ఛాయతో నిగనిగ మెరిసిపోతూ పుల్లంపేట జరీచీర.


'ఇదెలా వచ్చిందండీ?' అని అడుగుతూ ఆమె మడత విప్పింది. వెంటనే మైజారు కొంగున వున్న జరీ నిగనిగ, ఆమె కళ్లలోనూ, చెక్కిళ్ళమీదా, పెదవులమీదా తళుక్కుమంది.


దాంతో అతని మొగం మరీ గంభీరముద్ర వహించింది.


'చెప్పండీ'.


'వెళ్ళి కట్టుకురా'.


'మానేస్తానా యేవిటి చె-ప్పండీ'


'చెప్పనా యేవిటి కట్టుకురా'.


'ఆమె గదిలోకి వెళ్ళి మడత పూర్తిగా విప్పగా యేదో కింద పడింది.


'ఇందిలో పట్టు జాకెట్టు కూడా వుందండీ!


'ఇంకేం తొడుక్కురా'.


యాజులిక్కడ మాట్టాడకుండానే కూచున్నాడు. కాని 'మామిడిపిందె లించక్కున్నాయో! బాబోయ్ పద్దెనిమిది మూళ్ళ పొడుగున్నట్టుంది. మా అమ్మాయిలాంటిది వొక్కటీ పెట్టలేకపోయింది. ఎన్నాళ్ళనుంచో మనసుపడుతున్నా నీరంగుకోసం. పాపం, చెప్పినట్టు తెచ్చిపెట్టారు' అంటూ అక్కడ రాధమ్మ రిమార్కులమీద రిమార్కులు దొర్లించేసింది.


అదివిని తన కష్టం పూర్తిగా ఫలించినందుకతను చాలా సంతోషించాడు.


తరువాత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చి వొళ్లోకూచుని ఆమె 'యిదెలా వచ్చింది చెప్పరూ?' అని మళ్ళీ అడిగింది.


'పుల్లంపేటలో వొక దేవాంగి నేశాడు'.


'ఊహూ'.


'అది తెప్పించి నాతా సుదర్శనశెట్టి నెల్లూరి పెద్దబజారులో పెట్టి అమ్మాడు'.


'సరే'


'నేను కొన్నాను'.


'బాగుంది'.


'నువ్వు కట్టుకున్నావు'.


'ఎలా వచ్చిందీ?'


'మళ్ళీ మొదలా?'


'మరి నా ప్రశ్న అలాగే వుండిపోయింది. కదూ!'


'లేదు, బాగా ఆలోచించుకో'.


'పోనీ, యిది చెప్పండి డబ్బెక్కడిదీ?'


'మిగిలిస్తే వచ్చింది.'


'ఎవరూ?'


'నేను.'


'ఎలా మిగిల్చారూ?'


అతను రెప్పవెయ్యకుండా చూశాడు.


'చెప్పరు కాదూ? అయితే నన్ను -'


'ఆగు ఆగు. ఇవాళ పెద్ద పండుగ. అలాంటి మాటలు రాకూడదు.


'అయితే మరి చెప్పండి'.


'యాజులు జరిగిందంతా చెప్పాడు; కానీ, నమ్మలేక, ఆమె 'నిజంగా?' అని చెయ్యి చాపింది.


'అక్షరాలా నిజం. ముమ్మాటికీ నిజం' అంటూ అతనాచేతిలో చెయ్యివేసి, ఆ చెయ్యి గిల్లాడు.


ఆమె మనస్సు గుబగుబలాడిపోయింది. హృదయం నీరయిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి.


'చూశారా? నా చీరకోసం కారెండలో నడిచివెళ్ళారా?' అక్కడ కడుపు మాడ్చుకుని వుసూరుమంటూ పని చేశారా? చీర లేకపోతే నాకు పండుగ వెళ్ళగనుకున్నారా? నేను రాకాసినా?' అని యిక మాట్టాడలేక చేతులు అతని కంఠానికి పెనవేసి తన శిరస్సు అతని భుజం మీద ఆనికుని దుఃఖించసాగింది.


అది చూసి, మొదట అతను నిర్విణ్ణుడయిపోయాడు; కాని తరువాత ఛా! ఏడుస్తున్నావా? నేను ఏది వద్దనుకున్నానో అదే చేస్తావా? ఇలా చూడూ, అబ్బే! అయితే నాకూ నీకూ మాటల్లేవు. నాకూ నీకూ జతలేదు, అని బెదిరిస్తూ మూతి బిడాయించుకుని ఆమె మొగం పైకెత్తి కొంటెచూపులు చూశాడు.


ఏడ్పల్లా ఆమెకి నవ్వయిపోయింది.


'మరి నాతో యెందుకు చెప్పారు కారూ? నేను మాత్రం కాఫీ మానుకోకపోదునా? దాంతో మీక్కూడా జామారు రాకపోవునా?'


'ఇప్పుడు రాకపోతేనా?'


'ఏదీ, చూపించరూ?'


ఇద్దరూ లేచారు. ఒకర్ని వొకరు పొదిపి పట్టుకుని వాకిట్లో మేజా దగ్గరికి వెళ్ళారు. యాజులు సొరగు లాగి వెంకటగిరి సరిగంచు చాపు పైకి తీశాడు.


అది చూసి, ఆమె సంతోష విహ్వాల అయి మరి తొరగా కట్టేసుకోండి' అంటూ అతని భుజాలు వూపేసింది.


***

_*శ్రీ పంచమి

 _*శ్రీ పంచమి / వసంత పంచమి*_


*మాఘ మాసం శుక్ల పంచమి రోజును వసంత పంచమి , శ్రీ పంచమి , మదన పంచమి అని పేర్లతో పిలుస్తారు,*


జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. 

జ్ఞానము , విద్య , చదువు పర్యాయపదాలు. 

విద్యకు అధిదేవత , జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి , స్మరించి , పూజించే రోజే వసంత పంచమి. యావద్భారతావనిలో ప్రజలంతా , ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంత పంచమి. 

ఈరోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు.


*యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా* అంటూ సకల విద్యాస్వరూపిణి ఐన సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావనమైన తిథి. 

బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు ఈ రోజు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి.


*శ్రీ పంచమి రోజు చేయవలసిన పూజలు:*


*మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ*

*పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః ॥*

వసంత పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. 

ఈరోజు మహాగణపతిని షోడశోపచారాలతో పూజించి , శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు , జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను , లేఖినులను పూజాపీఠంపై ఉంచి అష్టోత్తర పూజను చేయాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని కుసుమాలతో , సుగంధ ద్రవ్యాలతో , చందనంతో , అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి.

చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారంకూడా ఉంది. తద్వారా , ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి , నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం.


పూర్వ కాలంలో రాజాస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి , కవితా ఘోష్టులు జరిపి కవులను , పండితులను , కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది.


*సరస్వతీ కటాక్షం:*


బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి , ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు.

గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి ఓకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో , సూర్యుని ఆరాధించగా , ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు.

వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేసేడని పురాణాలు చెబుతున్నాయి...

అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహంవల్లనే వేద విభజన గావించి , పురాణాలను ఆవిష్కరించాడని , మహాభారత , భాగవత , బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి...

తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక , ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు.


*వసంత పంచమి శుభ సమయం*


పవిత్ర సమయం ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 3.36కు ప్రారంభమవుతుంది,

ఫిబ్రవరి 17న ఉదయం 5.46 గంటల వరకు ఉంటుంది. ఫిబ్రవరి 16న ఉదయం 6.59కి సరస్వతి దేవికి పూజ చేయడం, మధ్యాహ్నం 12.35కి మధ్య శుభ సమయం ఉంటుందని వేదపండితులు చెబుతున్నారు...


          *_🌾శుభమస్తు🌾_*

సరస్వతీ నమస్తుభ్యం...

 సరస్వతీ నమస్తుభ్యం...


🍁🍁🍁🍁



పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. 


ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది.


 మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది



జ్ఞాన ప్రదాతగా సరస్వతి - కొన్ని గాథలు...



పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు.

 శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు.


 పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు. 


వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. 


ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. 


ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. 


ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.


పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి.


 అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రథమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు. 


అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. 


యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు, జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. 


తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు.


 సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. 


ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో కనిపిస్తుంది..


🍁🍁🍁🍁🍁

శ్రీపంచమి




*శ్రీపంచమి*

 వ‌సంత‌పంచ‌మి

***********

స‌ర‌స్వ‌తీ దేవీ జ‌న్మ‌దినం

మాఘ శుక్ల పంచ‌మి

ఫిబ్ర‌వరి 16

*********


సకలవిద్యా స్వరూపిణి సరస్వతీ దేవి జన్మదినం మాఘ శుక్ల పంచమిని- శ్రీపంచమి గా చెబుతారు. 

వాక్కు బాగుంటే సకల విజయాలు మనవే. 

కనుక మనకు వాక్శుద్ధిని ప్రసాదించే ,జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతీ మాతను

ఆరాధిద్దాం.

మాఘమాసం శుక్లపక్ష పంచమిని శ్రీపంచమి, వసంత పంచమి, సరస్వతి జయంతి, మదన పంచమి అనే పేర్లతో పిలుస్తారు.  శాంతమూర్తియైన

సరస్వతీ దేవి ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందనేది శాస్త్రోక్తి.


విద్యచేత వినయం, వినయం చేత జ్ఞానం, జ్ఞానం చేత ధనం, ధనం చేత అధికారం సంప్రాప్తిస్తాయి. సరస్వతీ ఆరాధన వల్ల వాక్సుద్ధి లభిస్తుంది. 

మనిషికి మాటే ప్రాణం కాబట్టి 

దేవిని ఆరాధించి మనిషి సద్బుద్ధిని పొందుతాడు. 

మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, 

ప్రజ్ఞ, స్ఫురణా శక్తుల స్వరూపమే శారదాదేవి

 కాబట్టి, శివానుజ అనీ పిలుస్తారు.

 కుల మత భేదాలు లేకుండా ప్రపంచంమంతా సరస్వతీ దేవిని పూజిస్తున్నా

 మాఘ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి ప్రత్యేకతను సంతరించుకుంది.

             🙏

         ఫిబ్రవరి 16

 శ్రీ పంచమి ,వసంత పంచమి

పర్వదినం.

 ఈ రోజు వీలైనన్ని ఎక్కువ సార్లు

సరస్వతీ స్తుతి లేదా

సరస్వతి అష్టోత్రం చదువుదాం.

మొగలిచెర్ల

 *స్వస్థత...సంతానం..*


"స్వామీ దత్తాత్రేయా మా ఆయనకు ఆరోగ్యం బాగు చేయి తండ్రీ..ఈ మాయదారి రోగాన్ని తగ్గించు.." అంటూ ఆ యువతి మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం యొక్క ముందున్న పందిరి కింద కూర్చుని పరి పరి విధాలా వేడుకుంటున్నది..ఆమెతో పాటు ఎనిమిదేళ్ల వయసున్న ఆమె కుమారుడు బేల చూపులు చూస్తూ ప్రక్కనే కూర్చుని వున్నాడు..ఆమె భర్త ఆ ప్రక్కనే పడుకొని వున్నాడు..


ఆమె పేరు చంద్రమ్మ..భర్త పేరు మాలకొండయ్య..వాళ్ళది నెల్లూరు జిల్లా లోని సిద్దనకొండూరు గ్రామం ప్రక్కనే ఉన్న చిన్న పల్లెటూరు పరికోట..వాళ్లకు పెళ్లి జరిగి అప్పటికి సుమారు పది సంవత్సరాలు..ఒక కుమారుడు కలిగాడు..వ్యవసాయాధారిత కుటుంబం..అయినా లక్షణంగానే వున్నారు..అంతా బాగుంది అని సంతోషం గా ఉన్న సమయం లో మాలకొండయ్యకు హఠాత్తుగా మూర్ఛ వ్యాధి సోకింది..ఉన్నట్టుండి మూర్ఛ వచ్చి పడిపోతున్నాడు..చంద్రమ్మ కు భయం పట్టుకుంది..ఆరోజుల్లో అంటే 1978, 79 నాటికి నెల్లూరు లో ఉన్న పెద్ద పెద్ద వైద్యులకు చూపించారు..కానీ ఫలితం దక్కలేదు..


సిద్దనకొండూరు లో ఉన్న చంద్రమ్మ బంధువులు.."నీ భర్తను తీసుకొని మొగిలిచెర్ల వెళ్ళు..అక్కడ దత్తాత్రేయ స్వామి సిద్ధిపొందిన ఆశ్రమం ఉంది..ఆ స్వామి సమాధి వద్ద మొక్కుకో..నీ భర్త బాగుపడతాడు.." అని సలహా ఇచ్చారు..ఆ సలహా ఇవ్వటానికి కూడా ఒక కారణం ఉంది..శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సుకు వెళ్లేముందు..ఈ సిద్దనకొండూరు గ్రామం లో కొన్నాళ్ళు వున్నారు..శ్రీ స్వామివారు సిద్ధపురుషుడని ఆ గ్రామస్థులకు ఒక నమ్మకం ఆనాడే కలిగింది..ఆ నమ్మకం తోనే వాళ్ళు చంద్రమ్మకు సలహా ఇచ్చారు..


ఆ సలహా ను నమ్మి, చంద్రమ్మ తన భర్తను, కుమారుడిని తీసుకొని మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చింది..శ్రీ స్వామివారి తల్లిగారైన సుబ్బమ్మ గారు కూడా అప్పుడు మందిరం వద్దే ఒక గదిలో నివాసం ఉండేవారు..సుబ్బమ్మ గారు కూడా చంద్రమ్మ కు ధైర్యం చెప్పారు..చంద్రమ్మకు మానసికంగా కొంత ఊరట కలిగింది..కానీ భర్త పరిస్థితి మరికొంత క్షీణించింది..


రెండురోజులు గడిచాయి..చంద్రమ్మ ప్రార్ధన ఫలితమో..మరే కారణమో తెలీదు కానీ..మాలకొండయ్య కు తరచూ వస్తున్న  మూర్చలు కొద్దిగా తగ్గాయి..మనిషి కొద్దీ కొద్దిగా కోలుకుంటున్నాడు..ఆరోజు మధ్యాహ్నం భర్తకు ఆహారం పెట్టి..చంద్రమ్మ తన కుమారుడితో సహా శ్రీ స్వామివారి మందిరం లోకి వచ్చి, ఆ పందిరి కింద పడుకుంది..వెంటనే నిద్ర పట్టింది..నిద్రలో..ఒక యోగి నడుచుకుంటూ వచ్చి.."అమ్మా..నీకు సంతాన యోగం ఉంది..పొత్తిగుడ్డలు నీ దగ్గర ఉంచుకో..నీ భర్త బాగుపడతాడు..ముగ్గురు బిడ్డల్ని కంటావు.." అని చెప్పినట్లు కల వచ్చింది..ఉలిక్కిపడి లేచిన చంద్రమ్మ శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, "స్వామీ నాకు కుమారుడు వున్నాడు..ఇప్పుడు నేను నా భర్త ఆరోగ్యం గురించి వచ్చాను..నా భర్త బాగుంటే అదే పదివేలు..నాకు ఒక కుమారుడు ఉన్నాడు..మళ్లీ సంతానం కలుగక పోయినా పర్వాలేదు.." అని ప్రార్ధించింది..


మరో మూడురోజుల్లోనే మాలకొండయ్యకు మూర్చలు తగ్గిపోయాయి..వారం లోపలే మాలకొండయ్య మామూలు మనిషిగా మారిపోయాడు..చంద్రమ్మ కు పట్టరాని సంతోషం వేసింది..స్వామివారికి పరి పరి విధాల నమస్కారం చేసుకొని..భర్తనూ, కుమారుడిని తీసుకొని పరికోటకు వెళ్ళింది..సరిగ్గా మూడు నెలలకు చంద్రమ్మ గర్భవతి అయింది..ఆరోజు చంద్రమ్మ కు తనకు వచ్చిన కల గుర్తుకొచ్చి, భర్తతో వివరంగా చెప్పింది.."స్వామివారి ప్రసాదం అనుకుందాము..ఆయన దయ " అన్నాడు మాలకొండయ్య..


చంద్రమ్మ కు మొదటి కుమారుడు పుట్టిన తొమ్మిది ఏళ్లకు మళ్లీ రెండో సంతానం గా కుమారుడే పుట్టాడు..చిత్ర మేమిటంటే..ఆ తరువాత మరో కుమారుడు..మళ్లీ కుమారుడు..ఇలా ముగ్గురు కొడుకులు ఐదేళ్ల వ్యవధిలో పుట్టారు..శ్రీ స్వామివారు కలలో చెప్పిన మాట సత్యమై పోయింది..


"అయ్యా..ఆ తరువాత మా సంసారం లో ఏ ఇబ్బందులూ లేవు..నా నలుగురు కొడుకులూ చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ లక్షణంగా వున్నారు..ఏటా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని వెళుతుంటాము..నా పసుపుకుంకుమలు స్వామి కాపాడి, సంతానాన్ని కూడా ఇచ్చాడు.." అంటూ నాలుగురోజుల క్రితం మందిరానికి వచ్చిన చంద్రమ్మ నాతో చెప్పుకొచ్చింది..ఆ సమయం లో ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.."స్వామిని నమ్ముకుంటే చాలయ్యా..అన్నీ ఆయనే చూసుకుంటాడు.." అన్నది..ఇప్పుడు చంద్రమ్మ కు వయసు మీద పడింది..కానీ శ్రీ స్వామివారి మీద భక్తి కొంచెం కూడ తగ్గలేదు..తాను శ్రీ స్వామివారి మందిరానికి వచ్చినప్పుడల్లా..తన అనుభవాలను నాతో చెప్పుకోవడం ఒక అలవాటు..


"పొద్దస్టం స్వామి దగ్గర ఉంటావు కదయ్యా..నీకు చెప్పుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది.." అంటూ వుంటుంది..స్వామి వద్దనే ఉంటున్న మాట వాస్తవమే కానీ..చంద్రమ్మకున్నంత భక్తి ప్రపత్తులు ఉన్నాయా అన్నదే ప్రశ్న..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

"దేవుడే" వున్నాడు

 (సనాతన హిందూ గ్రంధాల యధార్థ పరిశీలన ప్రకారం  -   అందరికీ నిజదైవం కేవలం ఒక్కడు  మాత్రమే!  అయన  "జనన మరణ ప్రతిరూపములు లేనివాడు!"  ఆ నిజదైవం మాత్రమే  ఆరాధనలకు అర్హుడు!.  వాస్తవానికి  ఆ అత్యంత పవిత్రుడైన మహా నిజదైవం  ఎన్నటికీ  అవతారాలు, శరీరము  ధరించడు!.   (Part - 3)

-----------------------------------



14,  దేవతో    మనుష్యాద్యుపాసనా  కామ  సంకల్పో బంధః  (నిరాలంబోపనిషత్ 8వ మంత్రం)


భావం:  దేవతలను,  మనుషులను  ఆరాధించాలనే  కోరిక నరకానికి  మార్గము



15,   య ఇత్ తద్ విదుస్తే అమృతత్వ  మానుశుహు| (అధర్వణవేదం 9:10:1)


భావం :  ఆ యదార్ధ సృష్టికర్తను తెలుసుకున్నవారికే స్వర్గము



16,  యమూర్తం  తదసత్యం|  యదమూర్తం  తత్సత్యం   తద్బ్రహ్మ||  (మైత్రేయన్యుపనిషత్ 5:3)


భావం :  విగ్రహం  అసత్యం,  విగ్రహం కానిది  సత్యం!  ఆయనే  సృష్టికర్త!!



17,  శయోన్యాయం    దేవతా ముపాసతే  యధా పశురేవామ్ సదేవనాం!  (శత్పధ  బ్రాహ్మణం  14:4:2)


భావం :  నిరాకార  సృష్టికర్తను వదిలి  ఇతరులను  ఆరాధించువారు  అజ్ఞానులు,  వారు పశువువంటివారు



18,  అజ్ఞానాం  భావనార్ధాయ    ప్రతిమాః  పరికల్పితాః  (దర్శనోపనిషత్ 4:5)


భావం: దేవుడున్నాడని  నిరూపించుటకుగాను  ధర్మవగాహనలేని కొందరు  అవివేకుల వల్ల  విగ్రహాలు  కల్పించబడినవి



19,  న చక్షుషా  గృహ్యతే  నాపివాచా ~ జ్ఞాన ప్రసాదే న    పశ్యుతే|  (ముండకోపనిషత్తు  3:1:8)


భావం :  నిరాకారముగా  ఆరాధించువాడు  మాత్రమే  ఆ  "పర" (ఆ "పరమందు" వుండే)  "బ్రహ్మమును"  (సృష్టిర్త ను)  పొందుచున్నాడు ("బ్రహ్మ" అనగా సంస్కృతంలో "సృష్టికర్త" అని అర్ధము)



* అసలు  కేవలం "దేవుడు  అనే మాట మాత్రమే సత్యం!", దేవుళ్ళు  అనే మాట  అసత్యం!  ఎందుకనగా  అందరికీ  దేవుడు ఒక్కడే  గనక!  అందుకే  అందరికీ  కలిపి  సృష్టి కూడా  ఒక్కటే! అందుకే ఎవరికైనా సరే  ఏదైనా సమస్య  వస్తే  పైకి  చూసి లేదా తన వ్రేలును  పైకి చూపించి  ఇక  ఆ "దేవుడే"  వున్నాడు  అంటారు గాని!  "దేవుళ్ళు" వున్నారు   అని ఎవరూ  అనరు!  అనగా  స్వయంగా  ఇది    ప్రతీ  ఒక్కరి  అంతరాత్మలో  దైవం పెట్టిన అసలు నిజం!.


* ఆకాశ మహాకాశాలకంటే  పెద్దవాడైన, గొప్పవాడైన, అత్యంత పవిత్రుడైన, దేనితోనూ పోల్చనలవికాని, ఊహింపనలవికాని, అత్యంత ఆశ్చర్యకరుడు మరియు అద్భుతుడైన, సృష్టికర్త అయిన, అన్నిటికన్నా పైనున్న  అందరి  ఆ మహా నిజదైవం  వాస్తవానికి  సృష్టిలోని  ఏ స్వరూపములోనూ, మరియు మానవస్వరూపములోనూ, మరియు ఎందులోనూ  కూడా ఇమిడేవాడుకాదు!.

వసంత పంచమి

 🌹🥀🌾🌺💐🌸🌷🌹

*మాఘ శుద్ధపంచమి వసంత పంచమి విశేషం?*


*మనం శ్యామలా నవరాత్రులు అని చెప్పుకున్నాం, శ్యామల రూపములు శ్యామలా తంత్రప్రకారం    ఎనిమిది. శ్యామలా నవరాత్ర మధ్యంలో విశేష స్వరూపం పంచమి రోజున శ్యామలా మాత సరస్వతీ స్వరూపంలో దర్శనం.*


*అక్షరాలకు అధిదేవత సరస్వతీదేవి. సకల విద్యలకు ఆమె రాణి జ్ఞానప్రదాయిని. ఆమె జన్మదినమే వసంత పంచమి.*


*ప్రతి ఏటా మాఘ శుద్ధ పంచమిరోజు పర్వదినాన్నే వసంతపంచమి, సరస్వతీ జయంతి, మదన పంచమి అని కూడా వ్యవహరిస్తారు.*

            

*మానవ జాతి మనుగడకు, అక్షయ సంపదకు మూలమైన ప్రణవ స్వరూపిణిగా వసంతపంచమినాడు సరస్వతీదేవి పూజలందుకుంటుంది*


*యాకుందేందు తుషారహార ధవళా. అని, తల్లీ నిన్ను దలంచి.. సరస్వతీనమస్తుభ్యం....క్షోణితలంబు నెన్నుదురు... అంటూ ఎన్నోవిధాలుగా మనతో ప్రార్థనలు అందుకుంటుంది.*


*వాగ్దేవీ ఉపాసన వేదాలలో సరస్వతీ సూక్తాలున్నాయి*


*అంచితమే నదీతమే దేవీతమే సరస్వతీ అని శ్రీవాణిని శ్రుతి కీర్తించింది. వేదజ్ఞానానికి మాతృక అయిన గాయత్రి, సావిత్రి సరస్వతీ రూపాలే. ఆమెను విద్యావాహికగా ఆరాధిస్తారు. లౌకిక అలౌకిక విద్యలన్నీ ఆమె అధీనంలోనే ఉంటాయి. సరస్వతీ అనుగ్రహం కలిగితే ప్రతిభ, మేధ, శ్రద్ధ స్ఫురణ, ధారణ, చైతన్యం, కళానైపుణ్యం 1 జ్ఞానరహస్యం, సంస్కారం, సత్కీర్తి లభిస్తాయి.*


*సరస్వతీదేవిని అహింసాదేవతగా, జ్ఞానదేవతగా పురాణాలు కీర్తించాయి మన పురాణాల్లో శుంభ, నిశుంభులను సంహరించినది మహాసరస్వతియే. తెల్లని వస్త్రాలు, తెల్లని పువ్వులు, తెల్లని ముత్యాల సరాలు. తెల్లటి గంథపు పూత, తెల్లటి వీణ ఇవన్నీ సరస్వతీ దేవికి ఇష్టమైనవి. అవి శాంతికి, స్వచ్ఛతకు సంకేతాలు.*

            

*లక్ష్మిని, సరస్వతిని ఇద్దరినీ కలిపి కూడా పూజిస్తారు. ఆ పూజావిధానాన్ని గురించి పురుషార్థ చింతామణి గ్రంథం అభివర్ణిస్తుంది. కాగా సరస్వతి ప్రధానంగా సకల కళాధిదేవత. కవిత్వం, సంగీతం నృత్యం, శిల్పం, చిత్రలేఖనం వంటి లలితకళలు అభ్యసించే వారిపై ఆమె అపార కరుణారస వృష్టిని వర్షిస్తుంది.*


*మంత్రశాస్త్రంలో సరస్వతీ రూపాలు ఎన్నెన్నో ఉన్నాయి. మాతంగి, వాగేశ్వరి వాగ్వాదిని, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి నీలసరస్వతి, అంతరిక్ష సరస్వతి ఇంకా మరెన్నో రూపాల్లో సాధకులు ఆమెనుపూజిస్తూ ఉంటారు.*

🌹🌷🌸💐🌺🌹

*వాక్కుకు అధిదేవత అయిన సరస్వతికి మనదేహంలో నాలుగు స్థానాలున్నాయి నాభి, హృదయం, కంఠం, జిహ్వ అనే నాలుగు స్థానాల్లోనూ వరుస పర పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కుల రూపంలో సరస్వతీదేవి కొలువై ఉంటుంది. ఈ స్థానాలన్నింటి నుంచి వెలువడే మూలనాదాన్ని సరస్వతిగా యోగులు ఆరాధిస్తారు. వీటికి సరస్వతి రూపమే మూలమైన నాదం.*


*సరస్వతి హంసవాహినీ. హంస నీటిని విసర్జించి పాలను స్వీకరించినట్లే చెడును త్యజించి మంచిని స్వీకరించాలని ప్రబోధిస్తుంది అక్షరాధి దేవత. ఆమె మనలోని ఆత్మజ్యోతికి ప్రతీక*


*సరస్వతీ భక్తులు పరాశక్తిని శారద రూపంలో దర్శించి ఆరాధించి సృష్టి చేసే శక్తిని బ్రహ్మ పొందగలిగాడు. వాల్మీకి రామాయణ రచన చేసినట్టు పురాణ కథనం. వాల్మీకి నుంచి వ్యాసమహర్షి శారదా దీక్ష స్వీకరించి వేద విభజన చేయగలిగాడు. భారత, భాగవత బ్రహ్మసూత్రాది రచనలు చేయగలిగాడు అష్టాదశ పురాణాలను ఆవిష్కరించగలిగాడు.*


*బృహస్పతి కూడా విద్యాసిద్ధి కోసం గీర్వాణినే అర్చించాడు. మహాపండితునిగా పేరుపొందిన ఆదిశేషుని భూదేవి జ్ఞానరహస్యాలు బోధించమని కోరితే అతడు శారదను ఆరాధించి శాస్త్ర జ్ఞానరహస్యాలు గ్రహించి భూమాతకు చెప్పగలిగాడు*

          

*దక్షిణాదిన కంటే ఉత్తరభారతంలో ముఖ్యంగా రాజస్థాన్ లోనూ ఈ పర్వాన్ని విశేషంగా నిర్వహిస్తారు. పూర్వం ఈరోజు యవేష్టి అనే యజ్ఞం చేసేవారు. యవలతో చేసే యజ్ఞం కనుక దీనికి ఆ పేరు వచ్చిందంటారు. వంగదేశంలో పండితులంతా సరస్వతి జయంతిని చాలా భక్తి శ్రద్ధలతో జరిపే పండుగగా కీర్తించారు. ప్రాచీన కాలంలో రోమనులు కూడా వసంతరుతు సంబంధమైన పండుగను శ్రీవాణి ఆరాధనగా నిర్వహించుకునే వారు. గ్రీకులు, రోమనులు సరస్వతిని మినర్వా పేరుతో కొలుస్తారు. బెంగాల్లో కవులంతా ఈ పంచమి తమ గ్రంథ రచన ప్రారంభించేవారు.*


*నిగమార్ధ నిధులున్న నెలవు సరస్వతి అనే శబ్దానికి ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానమని అర్థం ప్రవాహం చైతన్యానికి సంకేతం. అమృతమయమైన జ్ఞానప్రకాశ కాంతిపుంజమే సరస్వతి.*

🌹🌺💐🌸🌷🌷🌸🌹

*(సరః అంటే కాంతి. మన జీవితాన్ని జ్ఞానకాంతిమంతం చేసే మాతృశక్తి సరస్వతి. ఆమె శ్వేత వస్త్రాలతో అలంకృతమై హంసవాహినిగా తెల్లతామరపుష్పంపై కొలువు తీరి ఉంటుంది. అక్షమాల, గ్రంథం ధరించి వీణానాదం చేస్తుంటుంది. సరస్వతీదేవి నివసించే మూలస్థానం పేరు శశాంక సదనం అంటారు. గంగా సరస్వతులు సవతులై పరస్పరం శపించుకొని నదులై పోయాయన్న కథనం ఒకటి ప్రచారంలో ఉంది. సరస్వతీ నది గంగ యమునలతో కలిసి త్రివేణీ సంగమమైంది.)*


🌹🌸🌷💐🌺💐🌹

*ఈ వసంత పంచమినాడు ఏవిధంగా సరస్వతిని ఆరాధించాలనే విధివిధానాలను శ్రీ మహావిష్ణువు నారదునికి వివరించినట్టు దేవీ భాగవతం చెబుతోంది*

                

*చండీ సప్తశతి, బ్రహ్మపురాణం, సరస్వతీ రహష్యోపనిషత్తు, ప్రపంచసార సంగ్రహం, శారదా తిలకం తదితర గ్రంథాలు పలుకుల తల్లి వ్రత, ఉద్యాపనల విధానాలను తెలియ చేస్తున్నాయి. పెరుగు, వెన్న, పేలాలు, తెల్లనువ్వు ఉండలు, చెరకు, పటికబెల్లం, తేనె, తెల్లచందనం, తెల్లని పూలు, తెల్లని వస్త్రం, పాలకోవ, ముల్లంగి, పంచదార, కుడుములు, పళ్లు, టెంకాయలు తల్లికి సమర్పిస్తారు*


 *ఇవేకాకుండా మత్స్య, మార్కండేయ, స్కంద పురాణాలు, ధర్మసింధు, మానసారాది లాక్షణిక శిల్పశాస్త్రాల్లోనూ వాణీ వైభవం వర్ణితమైంది.*


*సాహిత్య సంగీతాలనే అమృతకలశాలను మానవాళికి అందిస్తున్న జగన్మాత సకల కళారూపిణి. భగవతి కృపాకటాక్ష ప్రసాదానికి వాక్కుద్ధి, వాక్సిద్ధితో స్వరార్చన చేసి ధన్యులమవుదాం. అక్షర సంపదను లోకకల్యాణానికి వినిమయం చేద్దాం.*


🌹💐🌷🌸🌺🌾🌾🌹


*ఓం ఐం హ్రీం సరస్వత్యే నమః*


*వసంత పంచమిని విద్యారంభ దినంగా బ్రహ్మవైవర్త పురాణం అభివర్ణించింది. ఆ తల్లి బీజాక్షరం ఐం. ఆమె మూలమంత్రం .ఓం ఐం హ్రీం సరస్వత్యే నమః మనం ఏదైనా మంచిమాట పలుకుతున్నామంటే ఆ తల్లి చలువే. సంపదకు, కీర్తికి పదోన్నతికి, మనుగడకు అన్నింటికీ ఆమెను అర్చించాల్సిందే.*   


             🙏🙏🙏

ఆత్మజ్ఞానం

 *🧘‍♂️ఆత్మజ్ఞానం🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*ప్రతి మనిషి తన జీవన యానంలో మోయలేని 'భారాల్ని' మోస్తున్నాడు! ఏమిటా భారాలు? బంధాలు, భౌతిక వస్తు లాలసలు. ఇన్ని బరువులతో ప్రయాణిస్తే జీవితం ఏమంత సుఖంగా ఉంటుంది? తక్కువ సామాన్లు వెంట తీసుకెళితే ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని అందరికీ తెలుసు. ఈ సత్యాన్ని మన జీవితానికి మాత్రం అన్వయించుకోలేక పోతున్నాం? భౌతిక అవసరాలు తీరినంత మాత్రాన శాశ్వత ఆనందం రాదు. ఆత్మసాక్షాత్కారంతో మాత్రమే అది సాధ్యం. మరి ఆత్మసాక్షాత్కారం కోసం మనం ఏం చేయాలి?*



*'నేను' అన్న పదంలోనే 'అహం' దాగివుంది. నేను అంటేనే స్వార్థం. ఇంతకీ నేనెవరినీ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే నా అస్తులు, నా బంధాలు అనే సమాధానాలు వస్తాయి. అంతేనా? నేను అంటేనే నేను మోస్తున్న బరువు అని అర్థం.*



*ఈ బరువు మనల్ని కట్టిపడేస్తూ ఉంటుంది. మనల్ని మనలా బతకనివ్వదు. పక్షికున్న స్వేచ్ఛ మనిషికుందా? మనను మనం ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. ప్రతి మనిషి నిత్యం జీవనయానం చేస్తూనే ఉంటాడు.*



*అయితే ఈ బంధాలు, భౌతిక వస్తు లాలసలు అనే భారాలు మనిషి తాను కోరుకునే స్వేచ్ఛా జీవితాన్ని పొందడానికి అవరోధాలుగా మారుతున్నాయి. మనం ఈ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి పది మందిలో గుర్తింపు పొందడానికి తహతహ లాడుతుంటాం.*



*మంచి స్థితిమంతునిగానో, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించో సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కోవడానికి ప్రయత్నిస్తుంటాం. దీన్నే జీవితంలో గొప్ప విజయంగా భావిస్తాం.*



*'నేను ఎవరిని' అని మనల్ని మనం ప్రశ్నించుకున్నపుడు సమాజంలో మనకున్న గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలను మాత్రమే పరిగణనలోకి మనం తీసుకుంటాం.*



*మనం మోస్తున్న 'భారం' మన ఉనికిగా మారడానికే ఇష్టపడతాం. తాత్విక దృష్టిలో ఆలోచిస్తే 'నేను ఎవరిని ?' అన్న ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనను మనం ఆత్మపరిశీలన చేసుకోవలసి వస్తుంది.*



*నిజంగా 'నేను' నేనుగా, నా కోసమే నేను బతుకుతున్నానా అని ప్రశ్నించుకోవలసి వస్తుంది.*



*"గతం, భవిష్యత్తు అంతా ఈ బంధాలతోనే సాగుతుంది. ఈ బంధనాల్లో చిక్కుకుని, నీలోపలకి నీవు తొంగి చూసుకునేదెప్పుడు? అలా చూడలేనంత కాలం దివ్య జ్ఞానజ్యోతి మనకు గోచరించదు. ఈ 'భారాన్ని' మోస్తున్నంత కాలం నేను నేను కాదన్న వాస్తవం బోధపడుతుందంటారు భగవాన్ రమణమహర్షి.*


🕉️🌞🌍🌙🌟🚩