*🧘♂️ఆత్మజ్ఞానం🧘♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*ప్రతి మనిషి తన జీవన యానంలో మోయలేని 'భారాల్ని' మోస్తున్నాడు! ఏమిటా భారాలు? బంధాలు, భౌతిక వస్తు లాలసలు. ఇన్ని బరువులతో ప్రయాణిస్తే జీవితం ఏమంత సుఖంగా ఉంటుంది? తక్కువ సామాన్లు వెంట తీసుకెళితే ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని అందరికీ తెలుసు. ఈ సత్యాన్ని మన జీవితానికి మాత్రం అన్వయించుకోలేక పోతున్నాం? భౌతిక అవసరాలు తీరినంత మాత్రాన శాశ్వత ఆనందం రాదు. ఆత్మసాక్షాత్కారంతో మాత్రమే అది సాధ్యం. మరి ఆత్మసాక్షాత్కారం కోసం మనం ఏం చేయాలి?*
*'నేను' అన్న పదంలోనే 'అహం' దాగివుంది. నేను అంటేనే స్వార్థం. ఇంతకీ నేనెవరినీ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే నా అస్తులు, నా బంధాలు అనే సమాధానాలు వస్తాయి. అంతేనా? నేను అంటేనే నేను మోస్తున్న బరువు అని అర్థం.*
*ఈ బరువు మనల్ని కట్టిపడేస్తూ ఉంటుంది. మనల్ని మనలా బతకనివ్వదు. పక్షికున్న స్వేచ్ఛ మనిషికుందా? మనను మనం ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. ప్రతి మనిషి నిత్యం జీవనయానం చేస్తూనే ఉంటాడు.*
*అయితే ఈ బంధాలు, భౌతిక వస్తు లాలసలు అనే భారాలు మనిషి తాను కోరుకునే స్వేచ్ఛా జీవితాన్ని పొందడానికి అవరోధాలుగా మారుతున్నాయి. మనం ఈ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి పది మందిలో గుర్తింపు పొందడానికి తహతహ లాడుతుంటాం.*
*మంచి స్థితిమంతునిగానో, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించో సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కోవడానికి ప్రయత్నిస్తుంటాం. దీన్నే జీవితంలో గొప్ప విజయంగా భావిస్తాం.*
*'నేను ఎవరిని' అని మనల్ని మనం ప్రశ్నించుకున్నపుడు సమాజంలో మనకున్న గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలను మాత్రమే పరిగణనలోకి మనం తీసుకుంటాం.*
*మనం మోస్తున్న 'భారం' మన ఉనికిగా మారడానికే ఇష్టపడతాం. తాత్విక దృష్టిలో ఆలోచిస్తే 'నేను ఎవరిని ?' అన్న ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనను మనం ఆత్మపరిశీలన చేసుకోవలసి వస్తుంది.*
*నిజంగా 'నేను' నేనుగా, నా కోసమే నేను బతుకుతున్నానా అని ప్రశ్నించుకోవలసి వస్తుంది.*
*"గతం, భవిష్యత్తు అంతా ఈ బంధాలతోనే సాగుతుంది. ఈ బంధనాల్లో చిక్కుకుని, నీలోపలకి నీవు తొంగి చూసుకునేదెప్పుడు? అలా చూడలేనంత కాలం దివ్య జ్ఞానజ్యోతి మనకు గోచరించదు. ఈ 'భారాన్ని' మోస్తున్నంత కాలం నేను నేను కాదన్న వాస్తవం బోధపడుతుందంటారు భగవాన్ రమణమహర్షి.*
🕉️🌞🌍🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి