(సనాతన హిందూ గ్రంధాల యధార్థ పరిశీలన ప్రకారం - అందరికీ నిజదైవం కేవలం ఒక్కడు మాత్రమే! అయన "జనన మరణ ప్రతిరూపములు లేనివాడు!" ఆ నిజదైవం మాత్రమే ఆరాధనలకు అర్హుడు!. వాస్తవానికి ఆ అత్యంత పవిత్రుడైన మహా నిజదైవం ఎన్నటికీ అవతారాలు, శరీరము ధరించడు!. (Part - 3)
-----------------------------------
14, దేవతో మనుష్యాద్యుపాసనా కామ సంకల్పో బంధః (నిరాలంబోపనిషత్ 8వ మంత్రం)
భావం: దేవతలను, మనుషులను ఆరాధించాలనే కోరిక నరకానికి మార్గము
15, య ఇత్ తద్ విదుస్తే అమృతత్వ మానుశుహు| (అధర్వణవేదం 9:10:1)
భావం : ఆ యదార్ధ సృష్టికర్తను తెలుసుకున్నవారికే స్వర్గము
16, యమూర్తం తదసత్యం| యదమూర్తం తత్సత్యం తద్బ్రహ్మ|| (మైత్రేయన్యుపనిషత్ 5:3)
భావం : విగ్రహం అసత్యం, విగ్రహం కానిది సత్యం! ఆయనే సృష్టికర్త!!
17, శయోన్యాయం దేవతా ముపాసతే యధా పశురేవామ్ సదేవనాం! (శత్పధ బ్రాహ్మణం 14:4:2)
భావం : నిరాకార సృష్టికర్తను వదిలి ఇతరులను ఆరాధించువారు అజ్ఞానులు, వారు పశువువంటివారు
18, అజ్ఞానాం భావనార్ధాయ ప్రతిమాః పరికల్పితాః (దర్శనోపనిషత్ 4:5)
భావం: దేవుడున్నాడని నిరూపించుటకుగాను ధర్మవగాహనలేని కొందరు అవివేకుల వల్ల విగ్రహాలు కల్పించబడినవి
19, న చక్షుషా గృహ్యతే నాపివాచా ~ జ్ఞాన ప్రసాదే న పశ్యుతే| (ముండకోపనిషత్తు 3:1:8)
భావం : నిరాకారముగా ఆరాధించువాడు మాత్రమే ఆ "పర" (ఆ "పరమందు" వుండే) "బ్రహ్మమును" (సృష్టిర్త ను) పొందుచున్నాడు ("బ్రహ్మ" అనగా సంస్కృతంలో "సృష్టికర్త" అని అర్ధము)
* అసలు కేవలం "దేవుడు అనే మాట మాత్రమే సత్యం!", దేవుళ్ళు అనే మాట అసత్యం! ఎందుకనగా అందరికీ దేవుడు ఒక్కడే గనక! అందుకే అందరికీ కలిపి సృష్టి కూడా ఒక్కటే! అందుకే ఎవరికైనా సరే ఏదైనా సమస్య వస్తే పైకి చూసి లేదా తన వ్రేలును పైకి చూపించి ఇక ఆ "దేవుడే" వున్నాడు అంటారు గాని! "దేవుళ్ళు" వున్నారు అని ఎవరూ అనరు! అనగా స్వయంగా ఇది ప్రతీ ఒక్కరి అంతరాత్మలో దైవం పెట్టిన అసలు నిజం!.
* ఆకాశ మహాకాశాలకంటే పెద్దవాడైన, గొప్పవాడైన, అత్యంత పవిత్రుడైన, దేనితోనూ పోల్చనలవికాని, ఊహింపనలవికాని, అత్యంత ఆశ్చర్యకరుడు మరియు అద్భుతుడైన, సృష్టికర్త అయిన, అన్నిటికన్నా పైనున్న అందరి ఆ మహా నిజదైవం వాస్తవానికి సృష్టిలోని ఏ స్వరూపములోనూ, మరియు మానవస్వరూపములోనూ, మరియు ఎందులోనూ కూడా ఇమిడేవాడుకాదు!.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి