31, మే 2021, సోమవారం

తెలివితేటలకు లోటు లేదు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

బ్రిటన్ కంపనీ లీవర్ హిందూస్తాన్ లీవర్ గా మారి 70 సం. లుగా ఈ దేశంలో ఉన్న వనరులే వాడుతూ సబ్బులు, తలనూనెలు, పేస్టులు డిటర్జెంట్స్ సౌందర్య సాధనాలు ఇలా ప్రతీ వస్తువూ అమ్ముతూ  అంబానీ, ఆదాని, టాటా, బిర్లాలు అందరి కంటే ఎక్కువ సంపాదించి వేల కోట్ల లాభాలు సంపాదిస్తూ బ్రిటన్ పట్టుకుపోతోంది. 


కానీ మనకు ఎప్పుడూ బాధ గాని నొప్పి గాని అనిపించలేదు.


అయ్యో మన దేశంలో కూడా అటువంటి పెద్ద కంపనీలు తయారు అయి పలు దేశాలలో వ్యాపారం చేసి మన దేశానికి డబ్బులు సంపాదిస్తే బాగుండును అన్న అలోచన కూడా ఎప్పుడూ రాలేదు.


బాగా చదువుకున్న  వారి ఆలోచలను కూడా కమ్యూనిజం ఇంతలా కలుషితం చేసింది అంటే ఇంకా ఈ దేశంలో చదువురాని వారిని ఈ కమ్యూనిజం ఎంత బ్రష్టు పట్టించి ఉంటుందో ఆలోచించండి.


ఈ దేశంలో వ్యక్తుల సామర్ధ్యానికి తెలివితేటలకు లోటు లేదు. రామ్ దేవ్ బాబా నేను పతంజలి సంస్థను దేశీయ MNC గా తయారు చేసి విదేశీ FMCG హిందూస్తాన్ లీవర్ వంటి సంస్థలని ఎదుర్కొంటాను అని ఛాలెంజ్ చేసాడు. ఒక్క 10 సం. లలో వాటికి పోటీగా నిలిపి అనుకున్నది సాధించాడు. 


కానీ అతనిని మనమే వెక్కిరిస్తాం. అతని ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ప్రశ్నిస్తాo.  అతని మెల్ల కన్నుని, గోచీ కట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తాం తప్ప ఒక సాధారణ వ్యక్తి పట్టుదల ఉంటే ఎంతలా ఎదగగలడో అతనిని ఈ తరానికి చూపి స్ఫూర్తిని ఇవ్వం. 


కానీ హిందూ స్థాన్ లీవర్ వాడు మా సబ్బు వాడితే తెల్లగా అవుతుంది అని చెపితే మన చర్మం తెల్లబడక పోయినా70 ఏళ్లుగా వాడుతూనే ఉన్నాం. వాడి కంపెనీని వెక్కిరించం. ఎందుకంటే మనకు వెయ్యి సం. ల బానిస బతుకు అలవాటు అయి మనదేశంలో వాళ్ళు చెప్పే దానికన్నా తెల్లవాడు చెప్పింది ఎక్కువ నమ్ముతాం సో కాల్డ్ చదువుకున్న మేధావులతో సహా...


ఒక్క టాటా, బిర్లా, ఆదాని, అంబానీ, రాం దేవ్ బాబా మాత్రమే కాదు అన్ని దేశీయ కంపెనీలు ఎదిగితేనే విదేశీ MNCల తో పోటీ పడగలవు. విదేశాల్లో వ్యాపారాలు చేసి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజి సంపాదించగలవు.


ఎదో కారణం చూపి మన దేశంలోనే వాటిపై ద్వేషం పెంచి ఎదగకుండా చేస్తే మన తెలివైన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈ హింస భరించలేక లక్ష్మీ మిట్టల్ లా పై దేశం పోయి వ్యాపారాలు చేసుకుంటారు.


నెహ్రు గారు వ్యాపార వేత్తలను అసహ్యించుకునే వారు అని స్వయంగా JRD టాటా గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. నెహ్రు గారికి ప్రైవేట్ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు అంటే పడేది కాదు. కానీ ఆయనతో సహా ఆయన కాబినెట్ మంత్రులు అధికారులు విదేశీ ప్రైవేట్ MNC వస్తువులే వాడేవారు, విదేశీ ప్రైవేట్ కంపెనీల కార్లలోనే తిరిగే వారు.


మిట్టల్ కుటుంబం మార్వాడీలు. కలకత్తా స్టీల్ వ్యాపారం చేసే వారు. 1976లో ఇక్కడ దేశంలో ఇందిర ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ మీద నిషేధం పెట్టడంతో ఇండోనేషియా వెళ్లి అక్కడ మొదటి పరిశ్రమ పెట్టి అక్కడ నుండి త్రినిడాడ్ పోయి అక్కడ దివాళా తీసిన స్టీల్ పరిశ్రమలు కొని వాటిని లాభాల బాటలోకి తెచ్చారు.

ఆ తరువాత యూకే వెళ్లారు. ఆర్సెల్ మిట్టల్ అని ప్రపంచంలోనే పెద్ద స్టీల్ పరిశ్రమ కంపనీ స్థాపించి ఎంతో ఎత్తుకు ఎదిగారు.  2005 కి మిట్టల్ ప్రపంచ మొదటి 10 మంది ధనవంతుల్లో ఒకరు. ఆ లిస్ట్ లో చేరిన మొట్ట మొదటి భారతీయుడు.


మనకి ఇనుప ముడి ఖనిజం కుప్పలు తెప్పలుగా ఉంది. ఇక్కడ దేశంలో ఆ ముడి ఖనిజం  వాడుకునే అన్ని స్టీల్ పరిశ్రమలు, స్టీల్ వినియోగం లేక మన బైలదుల్లా నుండి ముడి ఖనిజాన్ని ప్రత్యేక రైల్వే లైన్ వేసి జపాన్ ఎగుమతి చేసుకుంటున్నాం.


అదే ఆ మనిషిని ఈ దేశంలో వ్యాపారం చెయ్యి నిచ్చి ఉంటే స్టీల్ పరిశ్రమ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది.  ప్రపంచ స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి కేంద్రంగా భారత్ నిలిచి ఉండేది. అతని సంపద భారత్ లో ఉండేది. ఆయన ఎందరికో ఉపాధి చూపించి ఉండేవాడు కదా!


ఈ సోషలిజం ఎంత తప్పుడు ఆలోచనలు మన మనసుల్లో చొప్పిస్తున్నదో ఒక్క సారి ఆలోచించండి.


రిలయన్స్ పెట్టి 47 సం. లు అయింది. ఆస్తులు 11లక్షల కోట్లు.


అమెజాన్ పెట్టి 10 సం. లు అయింది ఆస్తులు 18 లక్షల కోట్లు


చైనా అలిబాబా కంపనీ మొదలు పెట్టి 20 సం. లు అయింది. ఆస్తులు 15 లక్షల కోట్లు.


అమెరికా ఎదగడానికి ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక అమెజాన్ ఇలా బోల్డు పెద్ద కంపెనీల వల్ల ఎదిగింది. అలాగే చైనా డజన్ల కొద్దీ ప్రైవేట్ MNC లను ఎదగనిచ్చింది. ఇప్పుడు అమెరికాతో ప్రపంచ మొదటి స్థానానికి పోటీ పడుతోంది.


ఇలా ప్రతీ దానికి అడ్డు పడి వామపక్షాలు బెంగాల్ నాశనం చేశాయి. యూనియన్స్ కి కొమ్ములు ఇచ్చి సమ్మెలు బందులు చేసి ఒక నాడు దేశంలో ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా పెరు పొందిన కలకత్తా పేరు నాశనం చేశారు.


CPM దగ్గర నేర్చుకున్న విద్య తో మమతా టాటా నానో ప్రాజెక్ట్ అడ్డుకుంది. సింగూర్ రైతులు అలా బీద వాళ్లుగానే ఉండిపోయారు.

అదే టాటా నానో పరిశ్రమ మోడీ  సీఎం గా ఉన్నప్పుడు గుజరాత్ తీసుకుపోయి సానంద్ లో అన్ని సదుపాయాలు కల్పించాడు. ఇప్పుడు సానంద్ ప్రపంచంలోనే ఒక పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ హబ్. అక్కడ అన్ని కంపెనీలు అంటే టాటా, మారుతి, హుందాయి, ఫోర్డ్, హోండా మొ. కంపెనీలు కార్లు స్కూటర్లు, మోటారు సైకిల్స్ ఉత్పత్తి చేస్తున్నాయి.  అక్కడ రైతులు కోటీశ్వరులు అయిపోయారు. స్థానికులకు ఉద్యోగాలు దొరికాయి.


మీరే ఆలోచించుకోండి మన దేశ కంపెనీల మీదే మనమే ద్వేషం పెంచి ఎదగకుండా చేసే ఇటువంటి ఆలోచనలు పెంచడం వల్ల మన దేశానికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అని.           అందుకే స్వదేశీ వస్తువులు వాడుకుందాం.... మనదేశ ఆర్థికవ్యవస్థను పెంచుకుందాం..  


*భారత్ మాతా కీ జయ్*

Sringari


 

Happyest man


 

తల్లి ప్రేమ


 

Vaccine in China


 

Maanasika పవిత్రత


 

Prevention


 

Circus


 

Rugveda mantram


 

అష్టమస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 2 .

 ఆయుర్వేదము నందు గల అష్టమస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ  - 2 . 


  

      హస్తనాడి గురించి మీకు అంతకు ముందు పోస్టు నందు వివరించాను. ఇప్పుడు మరింత విలువైన సమాచారం మీతో పంచుకుంటున్నాను . 


           ముందుగా ఆయుర్వేదం నందు నాడిని చూసే విధానం  గురించి తెలియచేస్తాను . వైద్యుడు నాడిని ఉదయమున పరగడుపున పరీక్షించవలెను . ముందు రోగి యొక్క మోచేతి భాగము పట్టుకొని పిసికి తన కుడిచేతి మూడువేళ్ళతో బ్రొటనవేలి మొదటి భాగమున చక్కగా నాడిని పరీక్షించవలెను . 


       పురుషులకు కుడిచేతి యందు , స్త్రీలకు ఎడమ చేతి యందు నాడిని పరీక్షించవలెను . దీనికి ప్రధాన కారణం పురుషులకు నాభి కూర్మము అధోముఖముగా , స్త్రీలకు నాభి కూర్మము ఊర్ధ్వ ముఖంగా ఉండును. ఈ బేధము చేతనే స్తీపురుషుల హస్తనాడులు బేధముగా ఉన్నవి. అనుభవము మరియు శాస్త్రము నందు చెప్పబడిన దాన్ని బట్టి చేతి యొక్క నాడిని పరీక్షించి అనంతరం రెండో చేతి యందలి నాడిని కూడా పరీక్షించుట మంచిది . 


             పాదనాడి పరీక్షించుట వలన ఎంతకాలము జీవించునది , శరీరము బరువుగా ఉండునా లేక తేలికగా ఉండునా మరియు జ్వరము విడిచి స్వస్థత చేకూరినదా వంటి విషయాలు తెలియును . ఆరోగ్యవంతునికే ఇది చూడవలెను . 


      హస్తనాడి అజీర్ణము , ఆమదోషము , జ్వరము రాబోవు సంగతిని ఆకలిగొనుటను , చెడిపోయిన వాతపిత్తకఫములను తెలియచేయును . అందుచే వైద్యులు ప్రధానముగా దీనినే పరీక్షించెదరు . 


           కంఠనాడి గాయములు , భయము మున్నగు బాహ్యాకారణముల చేత వచ్చు జ్వరమును , తృష్ణను , ఆయాసమును స్త్రీసంగమము , భయము , దుఃఖము , కోపము అనువాటిని ఈ కంఠనాడి తెలుపును . దీనిని పరీక్షించుటకు ప్రత్యేక నైపుణ్యత అవసరము . సామాన్యులు దీనిని పరీక్షించలేరు . 


       నాసా నాడి  చనిపోవుటయు , జీవించి ఉండుటయు , కామము , నేత్రవ్యాధులను , తలనొప్పిని , కర్ణముఖరోగములను గురించి తెలియచేయును . 


           అప్పుడే స్నానము చేసినవారికి భుజించినవారికి , తలస్నానం చేసినవానికి , ఈదినవానికి , ఆకలిగొన్నవానికి , దప్పికతో ఉన్నవానికి , నిద్రనుండి లేచినవానికి నాడిని పరీక్షించిన బాగుగా తెలియదు . కావున అప్పుడు నాడిని చూడరాదు . 



      తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం అందించడం జరుగును. 


    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

కొరోనా వైరస్ సృష్టికర్తలు

 హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.


*కొరోనా వైరస్ సృష్టికర్తలు - ఒక మగ పిశాచం , ఒక ఆడ రాక్షసి* ? 


బయటపడుతున్న ఆశ్చర్యకరమైన నిజాలు ! 


ఈ వ్యాసాన్ని ఒక ముఖ్యమైన వ్యాసంగా నేను అనుకొంటున్నాను ఎందుకంటే ఇది మన చావు బ్రతుకులతో ముడిపడివున్న ఒక సమస్యపై వ్రాస్తున్న వ్యాసం , ప్రపంచం లో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన ఒక విపత్తుపై వ్రాస్తున్న వ్యాసం.


ఇది చదివినపుడు , ఇది మీకు నచ్చితే , మీరు ఇతరులతో ఈ విషయాలు చర్చించడానికి , వాళ్ళకు వివరించడానికి సులభంగా వుండాలని ఈ వ్యాసాన్ని ఒక నోట్సు లాగా చిన్న చిన్న పేరాలుగా / పాయింట్లుగా వ్రాస్తున్నాను. 


ఈ వ్యాసం వ్రాస్తున్న ఈ సమయానికి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య *35, 47, 858.(~35.5 lakhs)*


అమెరికా లో మరణాల సంఖ్య 6 , 09 , 417. భారత్ లో ఈ సంఖ్య 3, 25 , 998. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 17, 06,09,  535.


ఇంతమందిని పొట్టనపెట్టుకొన్న ఈ కోవిడ్ మహమ్మారి ప్రకృతి లో సహజంగా వచ్చినది కాదు , *ఇద్దరు వ్యక్తులు ఒక చైనా  ప్రయోగశాలలో సృష్టించిన [man made] మహా ప్రళయం*.


ఆ ఇద్దరు వ్యక్తుల పాపిష్టి ముఖాలను క్రింద ఫోటోలో చూడవచ్చు.


*ఆమె పేరు Shi Zhangli [ షీ జంగ్ లీ - చైనా ] , అతని పేరు Peter Daszak [ పీటర్ దస్జాక్ - అమెరికా* ] 


ఈ కోవిడ్ వైరస్ ను మొదట నవంబరు - 2019 లో గుర్తించినపుడు ఇది  చైనా లోని Wet Market లో జంతువుల ద్వారా వచ్చిందని అన్నారు.


 [బ్రతికివున్న మూగ జంతువులను , పాములు , గబ్బిలాలు , కప్పలు మొదలగు ప్రాణులను , అప్పటికప్పుడు చంపి అమ్మే దుర్మార్గపు మార్కెట్లను wet markets అంటారు. ఇలా చేసే నీచ నికృష్ట దేశం ప్రపంచంలో చైనా ఒక్కటే అని అంటారు].


 ఈ వైరస్  2002 లో వచ్చిన SARS  లాంటిది అని దీనికి SARS-2  అని పేరు పెట్టారు.


 తరువాత WHO  వాళ్ళు  Novel Corona Virus అని అన్నారు , చివరికి CO అంటే Corona  అని , VI అంటే virus అని , D అంటే Disease అని చెప్పి , వచ్చిన ఏడాది 2019 కాబట్టి  *COVID - 19  అని నిర్ధారించారు*. 


*షి జంగ్ లీ* అనే ఆవిడ [ కింద ఫోటో లో చూడవచ్చు] చైనా లోని WIV [ Wuhan Institute of Virology ] లో శాస్త్రవేత్త , పరిశోధకురాలు.


ఆమె గబ్బిలాల [Bats]  మీద విశేషంగా రీసెర్చి చేస్తుంటారు. అందుకే ఆమెను Bat Lady  అని పిలుస్తుంటారు.


ఈ వైరస్ గబ్బిలాల వల్ల వచ్చిందని అని మొదట్లో తప్పుడు ప్రచారం చేసారు.


మనుషులు చేసిన ఘోరమైన పాపాన్ని , పాపం గబ్బిలాల మీదకు తోసారు.


 ఈ *జంగ్ లీ* , అలాగే ఇతర శాస్త్రవేత్తలు ప్రచారం చేసినట్టు ఈ వైరస్ ఊహాన్ లో గబ్బిలాల ద్వారా రావడానికి అవకాశం లేదు.


 *ఎందుకంటే ఊహాన్ లో గబ్బిలాలు లేవు*.


 "అవి వుండేది దక్షిణ చైనా

లోని Yunnan ప్రాంతంలో."


మన మనసులో ఒక ప్రశ్న పుట్టవచ్చు - Yunnan నుండి Wuhan  కు గబ్బిలాలు రావచ్చు కదా ? అని.


*రావు ఎందుకంటే రాలేవు ! ఎందుకు ?*.


 "యున్నాన్ ( Yunnan) కు ఊహాన్( Wuhan) కు మధ్య దూరం 1500 కి.మీ."


*గబ్బిలాలు 50 కి.మీ. కంటే ఎక్కువ దూరం ఎగరవు అని వాటిని అధ్యయనం చేసిన సైంటిస్టులు చెపుతున్నారు.*


మరి అవి ఊహాన్ కు ఎలా వచ్చాయి ? అంటే ,  వాటిని తెచ్చారు.


*ఎవరు ?*.


" ఇంకెవరు ఈ Bat lady నే". 


ఎపుడు తెచ్చిందో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం.


 "2015 లో యున్నాన్( Yunnan) గుహలలోంచి వాటిని *జంగ్ లీ* ఊహాన్ ( Wuhan) కు తెచ్చింది."


*ఎన్ని తెచ్చింది ?*


 "100 గబ్బిలాలు తెచ్చింది".


2015 కు ముందు , ఆ తరువాత ఆమె యున్నాన్ (Yunnan ) గుహలకు అనేకమార్లు వెళ్ళిందని అఫిషియల్ రికార్డులు చూపిస్తున్నాయి.


 *గబ్బిలాలు తెచ్చి ఏమి చేసింది ?*.


అమెరికా లో North Carolina  రాష్ట్రంలోని *North Carolina State University* లో శాస్త్రవేత్త అయిన *Ralph S Baric* ను సంప్రదించింది.


"ఆయన ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్టుల్లో ముఖ్యుడు".


 గబ్బిలాల లోకి , మనుషులు , ఇతర ప్రాణుల శరీరాల్లోకి ప్రవేశించే వైరస్ ను ఎలా జొప్పించాలి అనే విషయంలో ఈ *జంగ్ లీ* కి ఆయన పాఠాలు చెప్పాడు. 


*ఎలా ప్రవేశ పెడతారు ?*-

అనే ప్రశ్నకు చాలా వివరంగా చెప్పాల్సివుంటుంది.


*దాన్ని చిన్నగా టెక్నికల్ భాషలో చెపుతాను* :


"SARS -1 సూక్ష్మజీవి లోని *spike protein* ను తొలగించి దాని స్థానంలో గబ్బిలాలలోవుండే ఒక కణాన్ని ప్రవేశపెడతారు."


"ఇది మానవ శరీరంలోని సూక్ష్మ కణజాలాన్ని త్వరగా , వేగంగా  infect చేస్తుంది". 


*ఇంత ప్రమాదకరమైన పనిని ఎందుకు చేసారు ?*


"ఈ ప్రశ్నకు జంగ్ లీ , WIV వాళ్ళు తెలివైన జవాబు ఇచ్చారు."


 SARS-1 మహమ్మారి ఇంకోసారి భవిష్యత్తులో మరికొన్ని వ్యాధులకు దారి తీయకుండా వుండేందుకు , ఆ వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయో తెలుసుకొనేందుకు ఈ ప్రయోగాలు చేసాము అని వారు అన్నారు.


*ఈ అంశాన్ని వైరాలజీ లో Gain of Function అంటారు*.


" ఇది వింటే వాళ్ళ పని తప్పు అనిపించదు కదా ?" 


*కాదు*.


"ఈ ప్రయోగాలు వారు చెపుతున్నట్టు 'ముందుముందు వచ్చే వ్యాధులకు సంబంధించింది' కాదు." 


*మరేమిటి ?*


"ఇది ప్రపంచం మీదకు దుష్ట చైనా ఎక్కుపెట్టిన విషపు బాణం."


*ఎలానో వ్యాసం చివరన చూద్దాం.*


   "మరి వ్యాసం మొదట్లో చెప్పిన *Peter Daszak* ఎవరు" ?


 *ఈ వ్యక్తి అమెరికాకు చెందిన వైరాలజిస్టు.*


"అమెరికా పొలిటీషియన్ల దగ్గర పరపతి ఎక్కువ వున్న వాడు."


ఈ మొత్తం ' పరిశోధనలకు '  అవసరమయ్యే లక్షలకొద్దీ డాలర్ల కాంట్రాక్టును ఈ *పీటర్* దక్కించుకొన్నాడు.


దాన్ని *జంగ్ లీ* కి సబ్ కాంట్రాక్ట్ చేసాడు. అత్యంత ఎక్కువ ఇన్ ఫెక్టివిటి వున్న కొరోనా వైరస్ ను ల్యాబ్ లో సృష్టించే ప్రయత్నంలో లీ కి అండ దండ ఈయనే !


డిశెంబరు 9 , 2019 న ఇచ్చిన ఇంటర్వ్యూ  లో '' *ఈ వైరస్ కు వ్యతిరేకంగా వ్యాక్సినేట్ చేయలేం , ఇది untreatable  వైరస్* '' అని వెన్నులో వణుకు పుట్టించే సంగతులు బయటపెట్టాడు.


ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే *మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చైనా తో* చాలా సన్నిహితంగా వుండేవాడు.


 2005 నుండి 2019 వరకూ US  National Institute of Health కు నిరాటంకంగా నిధులు అందాయి.


2009 నుండీ 2017 వరకూ [ *అంటే ఒబామా ప్రెసిడెంట్ గా వున్న సమయం* ] ఈ నిధులు మరింత ఎక్కువగా అందాయి.


 ఈ సంస్థ నుండి *జంగ్ లీ* కి నిధులు అందేలాగా *పీటర్* సహకరించాడు.


"తెలిసో , తెలియకో *ఒబామా* కూడా ఈ పాపం లో భాగం అయ్యాడు !"


 "ఆయనకు చైనా పట్ల వున్న ప్రేమ ఎంత పని చేసింది !". 


"కొరోన వైరస్ మొదలయ్యింది ఊహాన్ [ చైనా ] కదా , దీన్ని చైనీస్ వైరస్ , వూహాన్ వైరస్ అనకుండా WHO రాజ్యాంగం లో వున్న ఒక క్లాజ్ ను జంగ్ లీ , మరియు చైనా ప్రభుత్వంతెలివిగావాడుకొన్నాయి".


అదేమంటే '' ఏదైనా ఒక ప్రాంతంలో మొదలైన వైరస్ ను ఆ ప్రాంతం / దేశం పేరుతో గుర్తించడం , పిలవడం ఆ ప్రాంత / దేశ ప్రజలను అవమానించినట్టు అవుతుంది ''.


 అనే ఈ క్లాజును చూపి WHO ఈ వైరస్ ను *కోవిడ్ -19* గా పిలిచేలా *చైనా ' మ్యానేజ్* '  చేసింది.


"అంతేకాదు , ఈ పాపిష్టి పనిలో చైనా తప్పు ఏమీ లేదు అని ప్రపంచాన్ని నమ్మించేందుకు చైనా ప్రపంచ ప్రఖ్యాత దినపత్రికలు , చానెళ్ళకు  రచయితలకు  పెద్ద మొత్తంలోడబ్బులుకుమ్మరించింది."


 *భారత్ లో కూడా సుమారుగా 60 మందికి ఈ డబ్బులు అందినట్టు సమాచారం.*


"ప్రపంచ వ్యాప్తంగా ఇలా డబ్బులు అందుకొన్న వాళ్ళ పని ఏమంటే : *వాళ్ళ వాళ్ళ దేశాల ప్రభుత్వాలు కోవిడ్ ను నియంత్రించడంలో విఫలమయ్యాయని* , వున్నవి , లేనివి అన్నీ కలిపి *అర్ధ సత్యాలు , అసత్యాలను పేపర్లు , చానెళ్ళ ద్వారా ప్రచారం చేయడం*.


 [ *భారత్ లో అరుంధతీ రాయ్ , రాణా అయూబ్ , బర్ఖా దత్ లాంటి దేశ వ్యతిరేక , లెఫ్టిస్టు రచయితలు  ఈ వర్గం కిందకు వస్తారు*.]


"మన దేశంలో కోవిడ్ తో మరణించిన వారి శవాలను సామూహికంగా దహనం చేస్తున్న దృశ్యాలను ఈ వర్గం జర్నలిస్టులు ఫొటోలు తీసి *ఒక్కో ఫోటోను 80 వేలు , ఒక లక్ష రూపాయలకు*,  విదేశీ [ ప్రత్యేకించి అమెరికా , ఇంగ్లాండ్  కు] పత్రికలు , చానెళ్ళకు అమ్మిన విషయం *మనలో ఎంతమందికి తెలుసు* ?".


"మనకేం తెలుసు" అంటే -ఇంత పెద్ద దేశంలో , ఇంతటి భయంకర మహమ్మారిని , *అడుగడుగునా విమర్శలు గుప్పిస్తూ , అడ్డుపడుతున్న ప్రతిపక్షాల మధ్య*- ప్రభుత్వాలు సమస్యను హాండిల్ చేయడంలో జరిగిన ఒకటి రెండు తప్పులను- *భూతద్దంలో చూపించడం మాత్రం మనకు తెలుసు* !


"నేను గమనిస్తున్నాను , చాలా మంది నిష్పక్షపాతంగా  , నిజాయితీగా , లోతుగా అధ్యయనం చేసి కాకుండా  ' పాపులర్ ' కావాలని సోషియల్ మీడియా లో కనిపించాలనే కోరికతో మాట్లాడుతున్నట్టు , వ్రాస్తున్నట్టు వుంది."


 [ *అందరూ కాదు , చాలామంది*] 


మళ్ళీ వ్యాసం లోకొద్దాం. 


తాను దక్కించుకొన్న కాంట్రాక్ట్ ను *జంగ్ లీ* కి సబ్ కాంట్రాక్ట్ చేసినది ఎవరు ? - *పీటర్ దస్జాక్*.


*జంగ్ లీ* ని తెగ మెచ్చుకొన్నది ఎవరు ?  *పీటర్ దస్జాక్.*

 

ఊహాన్ లోని ల్యాబ్ నుండీ ఈ వైరస్ బయటికిపంపబడిందా , లేదా అని నిర్ధారించేందుకు WHO ఏర్పాటు నియమించిన కమిటీ లో ముఖ్యమైన సభ్యుడు ఎవరు ?- *పీటర్ దస్జాక్.* 


"ప్రాణాంతకమైన ఈ వైరస్ ను సృష్టించింది తామే అని *ప్రపంచానికి తెలిసింది కాబట్టి,  ఇబ్బందులొస్తాయని ఊహించి *చైనా ఊహాన్ లోని జంగ్ లీ ల్యాబ్ లను సీల్ చేసాము* అని చెప్పుకొంటోంది.


 "కానీ, ఇప్పటికే ఆమె వైరస్ ను సృష్టించడంలో విజయం సాధించింది కదా !"


 *ఇక ల్యాబ్ ను మూస్తే ఏమిటి ? మూయకపోతే ఏమిటి* ?  


*ఇపుడు అసలు విషయం.


ఇదంతా చైనా ఎందుకు చేసింది ? కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం యొక్క సైన్యం పేరు People's Liberation Army [ PLA ] 2015 నుండీ ఈ PLA  ఊహాన్లోని WIV తోకలిసి రహస్యంగా పనిచేస్తున్నదట.


*వీళ్ళ లక్ష్యం Bio weapons ను తయారుచేసుకోవడం*.


 "దేనికి ?".


 *మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే లాగా పరిస్థితులు కల్పించి* , ఆ యుద్ధమే వస్తే అందులో తాము గెలిచి *మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో వుంచుకోవాలని* కామ్రేడ్ల సామ్రాజ్యవాద రాక్షస ఆకాంక్ష.


 "ఎవరి చేత , ఎలా , ఎందుకు కొరోనా వైరస్ సృస్టించబడిందో తెలిసింది కదా ! "


*ప్రపంచ వ్యాప్తంగా లక్షలమంది చావుకు కారణమయ్యి ,  వేలాదిమందిని అనాథలను చేసిన పాపం వూరికేపోతుందా*?


 "కచ్చితంగా పోదు."


"నాకెందుకో నా ఇంట్యూషన్ చెపుతున్నట్టు అనిపిస్తోంది - భవిష్యత్తులో చైనా నాలుగైదు ముక్కలు అయ్యి [టిబెట్ స్వేచ్చను పొంది ]  , బలహీనపడి దెబ్బతింటుందేమోనని."


*ఆ శుభ ఘడియలను మీరూ , నేనూ చూస్తామా , లేదా చెప్పలేను*.


 "కానీ,జరగక మానదని నా నమ్మకం."


గమనిక - ఇదంతా [ చివరి పేరా కాకుండా ] నీవు చూసినట్టు వ్రాసావే అనేవాళ్ళు కూడా వుంటారు.


*అలా ఏమీ లేదండి.*


" Nature , Science , The NewYork Times లాంటి ప్రఖ్యాత పత్రికలకు ఎడిటర్ గా , Science Correspondent గా అనేక ఏళ్ళు పనిచేసిన Nicholas Wade అనే రచయిత May 5 , 2021  న Bulletin of Atomic Scientists  అనే పత్రికలో  The Origin of COVID - Did People or Nature - *open Pandora's Box at Wuhan* ? అనే అద్భుతమైన investigative వ్యాసం లోని అంశాలను ఈ వ్యాసానికి ఆధారం చేసుకొన్నాను.


 *ఆ గొప్ప వ్యాసాన్ని చదివాక ఇలాంటి జర్నలిస్టులు మన దేశంలో ఎందుకు లేరబ్బా అని బాధ కూడా కలిగింది.*.


In late 1960s, Brahmananda Reddy, the then CM of AP, told :" It is not enough if follow the rules of the Road, but you must also be vigilant to observe the *violators of the Road rules, because you would also be involved  as a victim in any road accident that ensues*".


So, it is not enough if you very keenly study about India, but you should also *study the intentions of the World about India*.



" All that glitters is not Gold. Sweet & pep talk is *not really sweet in taste*.


"Beware of the World around you & its real Intentions."


హరిః ఓమ్.

పాంచాలరాజు రాజ్యప్రాప్తి*

 _*వైశాఖ పురాణం - 20 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*పాంచాలరాజు రాజ్యప్రాప్తి*



☘☘☘☘☘☘☘☘☘



నారదమహర్షి అంబరీష మహారాజుతో వైశాఖమహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా ! వినుము.   శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరియొక  కథను చెప్పుదును వినుము.


పూర్వము పాంచాలదేశమున పురుయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచేనతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని యశ్వములు , గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరవు యేర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము , కోశము బలహీనములై గజము మ్రింగిన వెలగపండువలె సారవిహీనములయ్యెను.


వాని బలహీనతనెరిగి వాని శత్రువులందరును కలసి దండెత్తి వచ్చిరి. యుద్దములో నోడిన రాజు భార్యయగు శిఖినితో గలసి పర్వతగుహలో దాగుకొని యేబదిమూడు సంవత్సరముల కాలము గడపెను. ఆ రాజు తనలో నిట్లు విచారించెను. *"నేను ఉత్తమ వంశమున జన్మించితిని. మంచి పనులను చేసితిని. పెద్దలను గౌరవించితిని. జ్ఞానవంతుడను. దైవభక్తి , ఇంద్రియజయము కలవాడను. నావారును నావలెనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసితినని నాకిట్టి కష్టములు కలిగినవి ? నేనిట్లు అడవిలో నెంతకాలముండవలయునో కదా ! అని విచారించి తన గురువులగు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులగు వారిద్దరును రాజు స్మరింపగనే వానివద్దకు వచ్చిరి.


రాజువారిద్దరికి నమస్కరించి యధాశక్తిగనుపచారములను చేసెను. వారిని సుఖాసీనులగావించి దీనుడై వారి పాదములందుపడి నాకిట్టి స్థితియేల వచ్చెను ? నాకు తరణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పినమాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై ఇట్లనిరి. రాజా ! నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత పదిజన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీయందు ధర్మప్రవృత్తి కొంచమైనను లేదు. సద్గుణము లేవియును లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవైయుంటివి. అందరిని బాధించుచు , బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశముననున్నవారికి భయంకరుడవై యుంటివి. ఇట్లు అయిదు సంవత్సరములు గడచినవి.


బాలురను , మృగములను , పక్షులను , బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీజన్మయందును సంతానము లేకపోవుటకును నీపూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరును అప్పుడును లేకుండిరి. అందరిని పీడించుట చేతను దానమన్నది లేకపోవుటచేతను నీవు దరిద్రుడవుగా నుంటివి. అప్పుడు అందరిని భయపెట్టుటచే నీకిప్పుడు ఈ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే నిప్పుడు నీ రాజ్యము శత్రువులయధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము.


నీవు గౌడదేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలోనుండగా ధనవంతులగు ఇద్దరు వైశ్యులు కర్షణుడనుముని నీవున్న అడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. రెండవ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింటదాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు , యెండకు , దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్షణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసరి వానికి సేవచేసి వానిని సేదతీర్చితివి. అతడు తేరుకున్న తరువాత నీవు మునీ ! నీకు నా వలన భయములేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును. కాని పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచెనో చెప్పుము. నిన్ను విడిచెదను చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణ రక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను.


అప్పుడు నీవు  ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితిని దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసిపొమ్ము. రాజభటులు నాకై రావచ్చును కావున నేను నీవెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లనిగాలి వీచునని వానికి మోదుగ ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచటనున్నదో తెలిసికొనుటకై ఆ మునికి సేవలు చేయుటవలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయమార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖమాసమగుటచే నీవు తెలియకచేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజ వంశమున జన్మించితివి.


నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలెనని యనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖమాసము. నీవు వైశాఖశుద్ద తదియ యందు ఒకసారి యీనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతఃకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికి సుఖమును కలిగింపుము. నీవు భక్తిశ్రద్దలతో వైశాఖ వ్రతము నాచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానములను చేయుము. లోకములన్నియు నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలి పోయిరి.


రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తిశ్రద్దలతో నాచరించెను. యధాశక్తిగ దానములను చేసెను. వైశాఖవ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరును మరల వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగ తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకొని సంపదలకంటె అధికముగ సర్వసంపదలను పొందెను. వైశాఖవ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగ నుండెను. వానికి ధృష్టకీర్తి , ధృష్టకేతువు , ధృష్టద్యుమ్నుడు , విజయుడు , చిత్రకేతువు అను అయిదుగురు పుత్రులు కుమార స్వామియంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరును వైశాఖమాస వ్రత మహిమ వలన రాజానురక్తులై యుండిరి.


రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్దలతో వైశాఖవ్రతము నాచరించి యధాశక్తి దానధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చలభక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖశుద్ద తృతీయ అక్షయతృతీయనాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహువులయందు శంఖచక్రగదా ఖడ్గములను ధరించి పీతాంబర ధారియై వనమాలావిభూషితుడై లక్ష్మీదేవితో గరుడాదిపరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని జూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసికొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గదస్వరముతో శ్రీహరిని జూచుచు ప్రభుభక్తితో ఆనందపరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెనని నారదమహర్షి అంబరీషునితో పలికెను.

నిజాయితీగల ప్రభుత్వాన్ని

 ప్రబీర్ బసు IAS అధికారి గారి పోస్ట్,


మొట్టమొదట, నేను ఎప్పుడూ 'రాజకీయ' సమస్యలపై వ్రాయను.  నేను వ్రాసేది కేవలం 'జాతీయ' సమస్యలపై మాత్రమే. ఉదాహరణకు, రాహుల్ గాంధీ తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండాలా వద్దా అనే దానిపై నాకు అభిప్రాయం లేదు, నాకు కుతూహలం కూడా లేదు.  అదేవిధంగా, కాంగ్రెస్ కంటే బిజెపి మంచి పార్టీయా కాదా అన్నది లాంటి విషయాలపై నాకేమాత్రం ఆసక్తి ఉండదు.  


ఐఎఎస్‌లో 36 సంవత్సరాల సర్వీసు తరువాత కూడా నాకు ఒక్క ఎమ్మెల్యే, ఎంపి లేదా రాజకీయాల్లో పాల్గొన్న ఎవరైనా సన్నిహితులుగా లేదా పరిచాయస్తుడిగా ఎవరూ లేరు. 

కాబట్టి, గెలిచిన ఏ పార్టీ అయినా సరే నా దేశానికి మంచి చేస్తూ నిజాయితీగల ప్రభుత్వాన్ని నడుపుతున్నంతవరకు ఏ పార్టీ గెలుస్తుందో, ఓడిపోతుందో అన్నది నేను పట్టించుకోను.


ఇప్పుడు, ఇన్నేళ్ల తరువాత నేను గౌరవనీయులైన శ్రీ నరేంద్ర దామోదర్ మోడీకి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నాను అనేది వివరిస్తాను:


 1. నా IAS అధికారిక సర్వీసు సేవ ప్రారంభమైనప్పటి నుండి నేను గమనించింది ఏంటంటే "ప్లానింగ్ కమిషన్" అనేది ఎటువంటి ఉపయోగకరమైన ప్రయోజనాలకు గానీ దేశానికి గానీ ఏవిధంగానూ ఉపయోగపడటం లేదని నేను గ్రహించాను. నేను దానిని రద్దు చేయాలనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా…... 

ఆ పని మన ప్రధాని మోడీ చేశారు.


 2. మా పన్ను వ్యవస్థ (Tax structure) ఏమాత్రం పనికిరాని, అక్కరకు రానిదని నేను ఎప్పుడూ భావిస్తూ వచ్చాను.  నన్ను బీహార్‌లో కమర్షియల్ టాక్స్ కమిషనర్‌గా నియమించినప్పుడు, దీని ప్రక్షాళన, సరిదిద్దాల్సిన అవసరం ఎంతగానో నాకు అర్థమైంది.  కొంత హేతుబద్ధీకరణ కోసం నేను స్వంతంగా సరిదిద్దడానికి ప్రయత్నించాను. కానీ అది కేవలం స్థానిక విధి విధానాలకు మాత్రమే పరిమితమై ఉండింది. వ్యాట్ system వచ్చినప్పుడు నేను  చాలా సంతోషించాను. కానీ జీఎస్టీ పన్ను విధానం అమలూజ్ దానివల్ల దేశానికి, ఆర్ధిక వ్యవస్ధకు జరిగే మేలు, పన్ను ఎగవేతదారుల కట్టడి నాకు స్వయానా తెలుసు కాబట్టి నేను దాని గొప్పదనం గ్రహించగలిగాను. ఆశ్చర్యకరంగా ఈ పని కూడా మోడీ గారే చేశారు. 


 3. మన దేశ భాగమైన జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని, నెహ్రూ నిర్ణయాన్ని నేను చిన్నతనం నుంచి కూడా ఎప్పటికీ జీర్ణించుకోలేకపోయాను. తరువాత నేను పెద్దయ్యాక ఈ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి కథలు విన్నాను, అలాగే కాశ్మీరీ బ్రాహ్మణులపై ఈ నేతల ద్వారా జమ్మూ & కాశ్మీర్ లో జరిగిన దారుణ హింస.  జమ్మూ & కాశ్మీర్ ల్లో కోట్లాది రూపాయలు వేర్పాటు నేతల, ఖంగ్రెస్ నాయకుల, వారి తొత్తుల పాలయ్యాయి అనే విషయం IAS అధికారిగా నాకు ఈ నిజానిజాలన్నీ తెలుసు. కాబట్టి మోడీ గారు ఈ ప్రత్యేక హోదాను తొలగించినప్పుడు మరియు మా MEA సంస్థలు ఈ రగడ పై పాకిస్తాన్ మరియు చైనాల నోళ్లు మూసివేయడంలో ఎంత అత్యుత్తమమైన పని చేసిందో అనే వివరాలు తెలిసి నేను చాలా సంతోషించాను. అలాగే మొదటిసారిగా ఈ మనిషి మాటల మనిషి కాదు చేతల మనిషనీ, దమ్మున్న నాయకుడని నేను గ్రహించాను.


 4. పాకిస్తాన్ ఉగ్రతీవ్రవాదులను సరిహద్దులు దాటించి పంపించి, మన సైనిక జవాన్లను చంపిన ప్రతిసారీ అందరిలాగే నేను కూడా చాలా కోపంగా ఉండేవాణ్ణి. ఎందుకు మనం చాతగాని దద్దమ్మల్లా ఊరకుండిపోతున్నాం అని రగిలిపోతూ ఉండేవాణ్ణి. దాదాపు 70 ఏళ్ళ తరువాత మొదటిసారిగా కేవలం మోడీ అనే ఈ ప్రధాని  మాత్రమే ఆ పుందాకోర్ బాస్టర్డ్లకు యూరి (Uri) మరియు బాలకోట్ మిషన్ ల పరంగా ధీటైన జవాబిస్తూ మరచిపోలేని ఒక గుణపాఠం నేర్పించారు అలాగే కాశ్మీర్లోని సొరంగాల నుండి తరలి వస్తున్న ఈ తీవ్రవాద ముష్కర ఎలుకలను చంపడం కొనసాగించారు. కేవలం మోడీ యే ఈ చర్యలకు కారణమని నేను తెలుసుకుని చాలా సంతోషించాను. 


 5. నేను బెంగాల్ వాడిగా అనుభవించాను కాబట్టి ఘంటాపథంగా చెప్పగలను. చిన్నతనంలో బెంగాల్ విభజన మరియు అటుపై ఏర్పడిన తూర్పు పాకిస్తాన్‌లో ప్రజలపై మైనారిటీలపై జరిగిన దారుణ దాడుల వల్ల నేను, నా కుటుంబం మానసికంగా, శారీరకంగా చాలా కష్టాలు అనుభవించాం అలాగే  ఆర్థికంగా చాలా నష్టపోయాం. విభజన సమయాన్నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, మరియు ' ముక్కలై మిగిలున్న అసలైన భారత్' లోని కొన్ని భాగాలలో ముస్లిమేతరులు అప్పటికి ఇప్పటికీ కూడా చాలా దాయనీయమైన బతుకులు గడుపుతూండటం నన్ను చాలా కలచివేసింది. మన ప్రధాని సిఎఎ ను (CAA) తీసుకువచ్చారు మరియు భారతదేశం వారినందరిని భారతీయ కుటుంబంలోకి తిరిగి తీసుకువెళుతుందనే ప్రేమపూర్వక హామీని ఇచ్చింది. చివరికి ఒకే ఒక వ్యక్తి, కేవలం శ్రీ నరేంద్ర మోడీ మన భారత ప్రజల బాధలను, కష్టాలను అర్థం చేసుకున్నారు అలాగే దానికి వెసులుబాటును కూడా తీసుకు వచ్చారు. 


 6. మన రక్షణ విభాగ సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధ పరికరాలు, ఆయుధాలను అప్‌గ్రేడ్ చేయడంలో వరుస ప్రభుత్వాల వైఫల్యాలు చూసి చాలా నిరుత్సాహంగా ఉంటూ ఆందోళన పడుతూ ఉండేవాణ్ణి. మన ప్రధాని మోదీ గారే రక్షణ శాఖ ని పునరుద్దరిస్తూ ఫాస్ట్ ట్రాక్‌లో పెట్టటం జరిగింది. 

అంతే కాదు, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా ల వద్ద మన సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, సొరంగాలు - మౌలిక సదుపాయాల రూప కల్పనపై ఆయన దృష్టి పెట్టటమే కాదు రక్షణ వ్యవస్థని బలీయం చేసి చూపారు. అంతకుముందు లా కాకుండా నేను ఇప్పుడు ఈ దేశంలో చాలా సురక్షితంగా ఉన్నానని మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను, భావించగలుగుతున్నాను.  


 7. అమర్జిత్ అని నా మిత్రుడు మన ప్రధాని ప్రధాని గారి చేత చేయబడిన గ్రామీణాభివృద్ధి పనుల గురించి నాకు వివరించి చెప్పారు. అమర్జిత్ గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే అతను గ్రామీణాభివృద్ధి కార్యదర్శి మరియు ఇప్పుడు పిఎంఓలో సలహాదారు.


 8. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలు నీళ్ల కోసం మైళ్ళ తరబడి నడవడం సిగ్గుచేటుగా ఎప్పుడూ భావించేవాణ్ణి.  ఈ సమస్యను పరిష్కరించడానికి వాటర్ మిషన్ ప్రవేశపెట్టబడింది మరియు ఫలితాలు దేశమంతటా గ్రామీణుల మొహాల్లో ప్రతిబింబిస్తూ చూపిస్తున్నాయి.


 9. చాలా న్యూస్ ఛానెల్స్ మరియు న్యూస్ పేపర్లు ప్రధాని మోడీ గారికి వ్యతిరేకంగా నిరంతరం విరుచుకుపడుతూనే ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.... కానీ అతను ఏమాత్రం స్పందించడు.  షాహిన్‌బాగ్‌లో నిరసనకారులు రోడ్లను అడ్డుకున్నప్పుడు, రైతుల ఆందోళనలో ఎంతో సహనం ప్రదర్శించడం ఆయనలోని ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. 


 10. ఆయనకు సహాయం చేయడానికి వివిధ గవర్నమెంట్ విభాగాల్లో, శాఖల్లో ఆయన ఎంచుకున్న అధికారులు, డాక్టర్ పి.కె. మిశ్రా, భాస్కర్ ఖుల్బే, పికె సిన్హా, పిఎంఓ లో అమర్జిత్ సిన్హా, క్యాబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గువాబా, తన నీటి మిషన్ కోసం భరత్ లాల్, RBI గవర్నర్‌గా శక్తి కాంత్ దాస్, మరియు అనేక ఇతర కీలక పదవుల్లోని అధికారులు వారి సమగ్రత, తేజస్సు మరియు పంపిణీ సామర్థ్యానికి పేరు గాంచారు, అలాంటివారినే ఆయన నియమించుకున్నారు. ఇది అతని నైపుణ్యాన్ని, తీక్షణ బుద్దిని సూచిస్తోంది. 


 11. అతను తన మంత్రివర్గంలో అత్యుత్తమ మాజీ పౌర అధికారులను మంత్రులుగా ఎన్నుకున్నాడు. నా స్నేహితుడు ఆర్ కె సింగ్ పవర్ మరియు ఎంఎన్‌ఆర్‌ఇ (ప్రభుత్వ శాఖ) కి స్వతంత్ర బాధ్యత వహిస్తున్నారు.  ఆయన సహకారం అందరికీ కనిపిస్తుంది. వి జైశంకర్, తెలివైన కెరీర్ దౌత్యవేత్త మన విదేశాంగ మంత్రి. మరో కెరీర్ దౌత్యవేత్తను పౌర విమానయాన మంత్రిగా చేశారు.  కాబట్టి, అతను ప్రభుత్వాన్ని నడపడానికి ఉత్తమ ప్రతిభను ఎన్నుకోవడం లోనే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 


 12. మన ప్రధాని గాల్వాన్ వద్ద చైనీస్ సైనికుల గూబలు గుయ్ మనేలా ఇచ్చిన చప్పుడుకి 1962 లో మన అవమానానికి తగిన ప్రతీకారం తీర్చుకున్నారు.  చైనా సైనికులు ఇప్పుడు భారత సైన్యాన్ని ఎదుర్కోవటానికి చాలా భయపడుతున్నారు. చైనా అధినేత క్సింగ్ వారి ఆర్మీ జనరల్‌ను మార్చినప్పుడు వారికి భారతదేశం చేతిలో జరిగిన తీవ్ర అవమానానికి మరింత రుజువు వచ్చి చేకూరింది.


 13. శ్రీ మోడీ నినాదం "నేను తినను, ఎవరిని తిననివ్వను" (न खाऊंगा न खाने दूँगा) అనే నినాదం ఇప్పుడు అందరి కళ్ళకు కనబడుతోంది. 1965 లో లాల్ బహదూర్ శాస్త్రిజీ, అటుపై వాజపేయి మమ్మల్ని విడిచిపెట్టిన తరువాత మళ్లీ నిజాయితీ, నిబద్ధత గల ప్రధానిని పొందడం కోసం మేము పౌర సేవకులగా దశాబ్దాలుగా ఎదురు చూశాము. మోడీ రాకతో మా ఎదురుచూపులకు అర్ధం దొరికింది. 


ఇప్పుడు నాకు చెప్పండి. నా దేశం కోసం నేను ఇన్నేళ్ళుగా కలలుగన్న ప్రతీది, ప్రతి ఒక్కటీ మన ఈ ప్రధాని చేత చేయబడుతుంటే, నేను ఇప్పుడు అతనిని ఇష్టపడి, నా మద్దతు ఇవ్వడంలో నే చేసిన నా తప్పు ఏమిటి?  


గత 20 సంవత్సరాలుగా మనము దిగుమతి చేసుకున్న పప్పుధాన్యాలు మాత్రమే తింటున్నాము. ఈ విషయం మనకు తెలిసింది ఎప్పుడూ ???? 🤔🤔🤔


మోడీ జీ 2 సంవత్సరాల క్రితం ఈ దిగుమతిని కట్ చేసి దేశీయ పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచుతూ తీసుకున్న నిర్ణయం కారణంగా మనకు తెలిసి వచ్చింది. ఇప్పుడు కరోనా కారణంగా పూర్తిగా ఆగిపోయింది .. 


అందుకే ఇప్పుడు రుడాలి, వ్యవసాయ ఉద్యమం అనేది ఒక పెద్ద సాకు.

2005 లో, మన్మోహన్ ప్రభుత్వం చేసుకున్న రహస్య ఒప్పందం ప్రకారం భారతదేశంలో పండిన పప్పుధాన్యాలను సబ్సిడీ చేయడం మానేసింది.


అటుపై రెండేళ్ల తరువాత, కెనడా, ఆస్ట్రేలియా మరియు నెదర్లాండ్స్ నుండి పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వపు కొత్త ఒప్పందం కుదుర్చుకుంది.


2005 లో, కెనడా ఒక పెద్ద పప్పుధాన్యాలు పండించే అతి పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించింది, ఇందులో చాలా మంది పంజాబీ సిక్కులను రైతులుగా, పనివంతులుగా ఉంచారు… .ఈ సంస్థల్లో మొదట మేనేజర్లు గురుద్వారా నుంచి వారిని మార్చి తరువాత ఖలిస్తానీలు నిర్వాహకులుగా పెరిగారు.


దీనిద్వారా 2007 కల్లా కెనడాలో పప్పుధాన్యాల ఉత్పత్తి చాలా పెరిగిపోయి ఆఖరికి దీనిని "పసుపు విప్లవం" అని పిలిచే స్థాయికి చేరుకుంది. ఎందుకంటే వారి కస్టమర్లు మరి భారతదేశ పంజాబీ మండీల ఏజెంట్లు .. వీరిలో కొందరేమో కాంగ్రెస్ పంజాబీ కుటుంబాలు, మహారాజా పాటియాలా కుటుంబం మరియు బాదల్ కుటుంబం కూడా ఉన్నాయి.


నేడు, మోడీ తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ విధానపు చట్టం అనేది పాపం ఈ బ్రోకర్లందరి ఆదాయాన్ని భూమిపై చేసిన సర్జికల్ స్ట్రైక్ లాగా వీరందరినీ, వారి దోపిడీని నిరోధించింది.


మరి ఆలోచించండి, ఇప్పుడు భారతదేశం వారి మార్కెట్ కాకపోతే, కెనడా మరియు ఇతర దేశాలు వారి పొలాలపై [వారి వారి దేశాలలో .. పెట్టిన పెట్టుబడి డబ్బు .. ]

ఇది వృధా కావడమే కాకుండా నిరుద్యోగం మరియు భారతదేశంలో ఇంత భారీ మార్కెట్ వారి చేతుల్లోనుంచి చూస్తూ చూస్తూనే ఎలా జారిపోయింది.


ఈ మొత్తం పప్పుధాన్యాల, మండీ మార్కెట్ కుంభకోణంలో కాంగ్రెస్ అతిపెద్ద బ్రోకర్.

ఇలాగే మనం ఇదివరకే చూసాం…..

చైనాలో వాణిజ్యం, తయారీ కోసం సిడబ్ల్యుసి విపి మరియు సిసిపి విపి చైనాలో ఒక ఒప్పందంపై సంతకం చేసినట్లు మనం చూశాము.  


భారతీయ ఆర్థిక వ్యవస్థ, శ్రమ, ఉపాధి, వ్యాపారం అనే పెట్టుబడి లేని ఖర్చుతో భారత జాతీయ సంపదను దోచుకుంటూ ఖాంగ్రాస్ మరియు దాని చెంచాలు కొల్లగొట్టాలి. 


నరేగా అంటే, గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ act అనే పథకం కింద పేదలకు ఎంగిలి మెతుకులు విసిరారు.

(https://www.nrega.nic.in/netnrega/mgnrega_new/Nrega_home.aspx)


మోడీ వారి మోసాలలో ఒక్కోదాన్ని బహిర్గతం చేస్తున్నారు. వారి అక్రమ ఆదాయానికి ప్రతి తలుపు మూసివేస్తు గండి కొడుతున్నారు.  

ఇక్కడ రైతు చట్టం నిరోధక పేరు మీద జరుగుతున్న దుర్మార్గం అంతా కేవలం దాని గురించి మాత్రమే.


అందుకే కెనడా కూడా తమ పార్లమెంటులో మన ఈ రైతు చట్టం బిల్లుపై చర్చలు జరుపుతుంది మరియు అక్కడి ఖలీస్తానీ గ్రామస్తులను భారతదేశానికి పంపిస్తామని బిజెపిని, భారత దేశాన్ని తీవ్రంగా బెదిరిస్తోంది.  

ఖలీస్తానీ అనేదే కాంగ్రెస్ యొక్క సృష్టి మరియు మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఖాలిస్తాన్ పై చూపే ఆ వక్ర అభిమానం.


ఈ సందేశాన్ని భారతదేశంలోని ప్రతి పౌరుడికి అందించే ప్రయత్నం చేయండి.


ఎందుకంటే నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను

🙏🙏🙏


మేరా భారత్ మహాన్

జై భారత్, జై హింద్

Precations to be taken by apartment residents

 https://drive.google.com/file/d/17feu_Z5t2Hm3cRrSnc2sxkDkeStof1nZ/view?usp=drivesdk

Sandya vandanam

 https://drive.google.com/file/d/17Z7kmfM33PGth-RTxeb_Bo4z3P9BkY1b/view?usp=drivesdk