31, మే 2021, సోమవారం

అష్టమస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 2 .

 ఆయుర్వేదము నందు గల అష్టమస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ  - 2 . 


  

      హస్తనాడి గురించి మీకు అంతకు ముందు పోస్టు నందు వివరించాను. ఇప్పుడు మరింత విలువైన సమాచారం మీతో పంచుకుంటున్నాను . 


           ముందుగా ఆయుర్వేదం నందు నాడిని చూసే విధానం  గురించి తెలియచేస్తాను . వైద్యుడు నాడిని ఉదయమున పరగడుపున పరీక్షించవలెను . ముందు రోగి యొక్క మోచేతి భాగము పట్టుకొని పిసికి తన కుడిచేతి మూడువేళ్ళతో బ్రొటనవేలి మొదటి భాగమున చక్కగా నాడిని పరీక్షించవలెను . 


       పురుషులకు కుడిచేతి యందు , స్త్రీలకు ఎడమ చేతి యందు నాడిని పరీక్షించవలెను . దీనికి ప్రధాన కారణం పురుషులకు నాభి కూర్మము అధోముఖముగా , స్త్రీలకు నాభి కూర్మము ఊర్ధ్వ ముఖంగా ఉండును. ఈ బేధము చేతనే స్తీపురుషుల హస్తనాడులు బేధముగా ఉన్నవి. అనుభవము మరియు శాస్త్రము నందు చెప్పబడిన దాన్ని బట్టి చేతి యొక్క నాడిని పరీక్షించి అనంతరం రెండో చేతి యందలి నాడిని కూడా పరీక్షించుట మంచిది . 


             పాదనాడి పరీక్షించుట వలన ఎంతకాలము జీవించునది , శరీరము బరువుగా ఉండునా లేక తేలికగా ఉండునా మరియు జ్వరము విడిచి స్వస్థత చేకూరినదా వంటి విషయాలు తెలియును . ఆరోగ్యవంతునికే ఇది చూడవలెను . 


      హస్తనాడి అజీర్ణము , ఆమదోషము , జ్వరము రాబోవు సంగతిని ఆకలిగొనుటను , చెడిపోయిన వాతపిత్తకఫములను తెలియచేయును . అందుచే వైద్యులు ప్రధానముగా దీనినే పరీక్షించెదరు . 


           కంఠనాడి గాయములు , భయము మున్నగు బాహ్యాకారణముల చేత వచ్చు జ్వరమును , తృష్ణను , ఆయాసమును స్త్రీసంగమము , భయము , దుఃఖము , కోపము అనువాటిని ఈ కంఠనాడి తెలుపును . దీనిని పరీక్షించుటకు ప్రత్యేక నైపుణ్యత అవసరము . సామాన్యులు దీనిని పరీక్షించలేరు . 


       నాసా నాడి  చనిపోవుటయు , జీవించి ఉండుటయు , కామము , నేత్రవ్యాధులను , తలనొప్పిని , కర్ణముఖరోగములను గురించి తెలియచేయును . 


           అప్పుడే స్నానము చేసినవారికి భుజించినవారికి , తలస్నానం చేసినవానికి , ఈదినవానికి , ఆకలిగొన్నవానికి , దప్పికతో ఉన్నవానికి , నిద్రనుండి లేచినవానికి నాడిని పరీక్షించిన బాగుగా తెలియదు . కావున అప్పుడు నాడిని చూడరాదు . 



      తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం అందించడం జరుగును. 


    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

కామెంట్‌లు లేవు: