26, అక్టోబర్ 2021, మంగళవారం

సంస్కృత మహాభాగవతం*

 *26.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పందొమ్మిదవ అధ్యాయము*


*జ్ఞాన-భక్తి-యమనియమాది సాధనముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*19.1 (ప్రథమ శ్లోకము)*


*యో విద్యాశ్రుతసంపన్నః ఆత్మవాన్ నానుమానికః|*


*మాయామాత్రమిదం జ్ఞాత్వా జ్ఞానం చ మయి సన్న్యసేత్॥12961॥*


*శ్రీభగవానుడు నుడివెను* ఉద్ధవా! ఉపనిషత్తులు మొదలగు శాస్త్రములయొక్క శ్రవణ, మనన, నిదిధ్యాసనముల ద్వారా జ్ఞానసంపన్నుడు, శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, ఆత్మసాక్షాత్కారమును పొందినవాడు ఐన యోగికి 'ఈ జగత్తంతయును భగవన్మాయ' యని తెలియును. అట్టివాడు ఆ జ్ఞానమును నాయందే సమర్పించును. అనగా నన్ను జ్ఞానస్వరూపునిగా భావించును.


*19.2 (రెండవ శ్లోకము)*


*జ్ఞానినస్త్వహమేవేష్టః స్వార్థో హేతుశ్చ సమ్మతః|*


*స్వర్గశ్చైవాపవర్గశ్చ నాన్యోఽర్థో మదృతే ప్రియః॥12962॥* 


అట్టి జ్ఞానికి నేనే అత్యంత ఇష్టుడను. ప్యాప్యుడను, తదుపాయమును నేనే, స్వర్గము, అపసర్గము (మోక్షము) నేనే. నేను తప్ప అతనికి ఈ విశ్వమునందు ప్రియమైన పదార్థము మరి ఏదియును లేదు.


*19.3 (మూడవ శ్లోకము)*


*జ్ఞానవిజ్ఞానసంసిద్ధాః పదం శ్రేష్ఠం విదుర్మమ|*


*జ్ఞానీ ప్రియతమోఽతో మే జ్ఞానేనాసౌ బిభర్తి మామ్॥12963॥*


జ్ఞానవిజ్ఞానములతో సంపన్నుడైన సిద్ధపురుషుడు నా యొక్క సర్వాతిశాయియగు వాస్తవిక స్వరూపమును ఎరుగును. అట్టి జ్ఞాని తన జ్ఞానముద్వారా నిరంతరము అంతఃకరణమునందు నన్నే ధారణ చేయును. ఉద్ధవా! అట్టి జ్ఞాని నాకు అత్యంత ప్రియతముడు.


*19.4 (నాలుగవ శ్లోకము)*


*తపస్తీర్థం జపో దానం పవిత్రాణీతరాణి చ|*


*నాలం కుర్వంతి తాం సిద్ధిం యా జ్ఞానకలయా కృతా॥12964॥*


పరమాత్మజ్ఞానముయొక్క ఒక అంశతో లభించు సిద్ధికి సమానముగ తపశ్చర్యలు, తీర్థసేవలు, జపములు, దానములు, ఇంకను పవిత్రకార్యములు మొదలగువాని వలన ప్రాప్తించెడి సిద్ధులెవ్వియును సాటిరావు.


*19.5 (ఐదవ శ్లోకము)*


*తస్మాజ్జ్ఞానేన సహితం జ్ఞాత్వా స్వాత్మానముద్ధవ|*


*జ్ఞానవిజ్ఞానసంపన్నో భజ మాం భక్తిభావతః॥12965॥*


కనుక, ఉద్ధవా! జ్ఞానసహితముగా నీ ఆత్మస్వరూపమును ఎరుంగుము. జ్ఞానవిజ్ఞానసంపన్నుడవై భక్తిభావముతో నన్ను భజింపుము.


*19.6 (ఆరవ శ్లోకము)*


*జ్ఞానవిజ్ఞానయజ్ఞేన మామిష్ట్వాఽఽత్మానమాత్మని|*


*సర్వయజ్ఞపతిం మాం వై సంసిద్ధిం మునయోఽగమన్॥12966॥*


మహామునులు సర్వయజ్ఞ స్వరూపుడను, తమ అంతఃకరణములయందు నిలిచిన నన్ను జ్ఞానవిజ్ఞానయజ్ఞములద్వారా ఆరాధించి, పరమసిద్ధిని పొందిరి.


*19.7 (ఏడవ శ్లోకము)*


*త్వయ్యుద్ధవాశ్రయతి యస్త్రివిధో వికారో మాయాంతరాఽఽపతతి నాద్యపవర్గయోర్యత్|*


*జన్మాదయోఽస్య యదమీ తవ తస్య కిం స్యురాద్యంతయోర్యదసతోఽస్తి తదేవ మధ్యే॥12967॥*


ఉద్ధవా! దేహేంద్రియ అంతఃకరణములతోగూడిన ఈ శరీరము త్రిగుణాత్మకమైన ప్రకృతియొక్క వికారరూపము. అజ్ఞానకారణముగా దీనిని నీవు ఆశ్రయించితివి. నీ ఆత్మస్వరూము మాయచే ఆవృతమై ఉన్నది. ఈ శరీరము జన్మకు ముందుగాగాని, మరణానంతరముగాని అవ్యక్తమే. కేవలము మధ్యకాలములో మాయాకారణమున ప్రతీతమగుచున్నది. జన్మాది షడ్వికారములు ఈ శరీరమునకు సంబంధించినవి. ఇది (నశ్వరమైన ఈ శరీరము) ఆద్యంతములయందును, మధ్యకాలమునందును అనిత్యమే. దీనితో నీకు ఎట్టి సంబంధమూలేదు.


*ఉద్ధవ ఉవాచ*


*19.8 (ఎనిమిదవ శ్లోకము)*


*జ్ఞానం విశుద్ధం విపులం యథైతద్వైరాగ్యవిజ్ఞానయుతం పురాణమ్||*


*ఆఖ్యాహి విశ్వేశ్వర విశ్వమూర్తే త్వద్భక్తియోగం చ మహద్విమృగ్యమ్॥12968॥*


*ఉద్ధవుడు పలికెను* విశ్వేశ్వరా! నీవు విరాట్ పురుషుడవు. నీవు వివరించిన జ్ఞానయోగము విశుద్ధము, విపులము. ఇది ఉపదేశపరంపరాప్రాప్తము, వైరాగ్యవిజ్ఞానయుతము. ఇప్పుడు దయతో భక్తియోగమును గూర్చి విశదీకరింపుము. పరమగోప్యమైన ఈ భక్తియోగమును బ్రహ్మాదిదేవతలుగూడ అన్వేషించుచుందురు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

ఆడదే మగాడికి సర్వస్వం

 మనం ఆడవాళ్లు, భార్య మీద ఎన్నో జోక్స్ వేస్తము 

👏 విలువైన పోస్ట్..తప్పక చదవండి 👏 🙏 🙏


"ఆమె" లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం


_ఆమెలేని అతడు వట్టి మోడు ఇది వాస్తవం.. భార్య విహీనులైన చాలా మంది భర్త లు చరమాంకంలో పలు బాధలు పడినవారు చాలా మంది ఉన్నారు.. --వారికి రోజులు గడవడం కష్టం అవుతూంది--_


--భర్త దూరమైనా భార్య 

తట్టుకుని జీవించగలదు... 

కానీ పురుషులు కుటుంబసభ్యులతో 

కలిసిపోలేరు..                                                                                                                                                                               


--2012లో రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. 

అందులో ఒక ఆసక్తికరమైన 

అంశం వెల్లడైంది...


--సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. 

తన కన్నా చిన్నదైన భార్య

 చనిపోతుందనే సన్నద్ధత

 పురుషుల్లో ఉండదట. 

భార్య చనిపోతే భర్త 

కుంగుబాటుకు గురవడానికి 

ఇది కూడా ఒక ప్రధాన 

కారణమని వారు విశ్లేషించారు._

                                                                                                            --భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు... 

కొందరు ప్రబుద్ధులైతే పురుషాహంకారంతో 

కొడతారు కూడా ! 

ఆమె శాశ్వతంగా దూరమైతే

 మాత్రం తట్టుకొని బతికేంత

 మానసిక బలం పురుషులక ఉండదు --


_‘ఆమె’ లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం !!'

అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ 

ఆమె విలువ తెలుసుకోలేని మగానుభావులు..

 ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక.. 

అందరితో కలవలేక.. 

మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు !!_

                                                                                                                                                                                      _'‘ నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు.

పైనున్న భగవంతుడికి తెలుసు.

 ఒరే.. పచ్చటి చెట్టుకింద కూర్చుని చెబుతున్నా. 

‘దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు. 

ఆ తర్వాత నా సంగతి చూడు’ 

అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని.

 ‘మొగుడి చావు కోరుకునే వెర్రిముండలుంటారా అని అనుకోకు... వుంటారు. 

నాకు మీ మావయ్యంటే 

చచ్చేంత ఇష్టంరా. 

ఆయన మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది. 

చీకటంటే భయం. 

ఉరిమితే భయం. 

మెరుపంటే భయం. 

నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు ? 

అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని 

లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు ?’’...ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది !_

                                                _

          నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా ? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన ! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు._

                                                                                                                                                 _ప్రముఖ చిత్రకారుడు, 

దర్శకుడు బాపు సైతం.. 

భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిపోయిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు._

                                                                                                                                                                                                                                                                                                                                                       _సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది.

 భార్య తన మీద ఆధారపడి ఉందని.. 

తాను తప్ప ఆమెకు 

దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు. 

కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. 

చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు.

 

భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది.

 వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. 

భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. 

భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు.


_ స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది. 

తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. 

అదే తనకు ఏదైనా అయితే 

ఎవరి కోసం ఎదురుచూడదు. 

తనకు తానే మందులు వేసుకుంటుంది. 

ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. 

ఆ మనోబలమే... 

భర్త లేకపోయినా 

ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది._

                                                                                                                                                                                                                             _భావోద్వేగ బలం ఆమెదే :-_


_పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, *స్ర్తీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది*. 

సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. 

ఒక విధంగా చెప్పాలంటే.. 

ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. 

ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. 

ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది..


 -- *అందుకే ఆడదే మగాడికి సర్వస్వం*...యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత...


🙏🙏🙏🙏

తిరుమల దర్శనం RTC ప్రకటన*

 *తిరుమల దర్శనం RTC ప్రకటన* 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏ.పి.ఎస్. ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు విచ్చేయు ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పించినారు.

ఏ.పి.ఎస్. ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చును.

ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు కలదు. తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు RTC సూపర్ వైజర్లు సహాయం చేసెదరు. కావున తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరడమైనది. APSRTC ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం కలదు. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చు ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యం.


* (సేకరణ)

*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము

 *26. 10. 2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2303(౨౩౦౩)*


*10.1-1442-*


*క. "నా మిత్రుఁడు వసుదేవుఁడు*

*సేమంబుగ నున్నవాఁడె? చెలువుగఁ బుత్రుల్*

*నేమంబున సేవింప మ*

*హామత్తుండైన కంసుఁ డడగిన పిదపన్.* 🌺



*_భావము: “నా ప్రియమిత్రుడు వసుదేవుడు క్షేమమే కదా! మదమత్తుడైన కంసుడు మరణించాక తన కుమారులు నియమపూర్వకముగా సేవలు చేస్తుంటే సుఖంగా ఉన్నాడు కదా!"_* 🙏



*_Meaning: “Is my good friend Vasudeva in good health? After the death of Kamsa, the arrogant, he must be living comfortably being diligenly served by his sons.”_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

వివాహ సమయంలో

 🙏★ *వివాహ సమయంలో జరిగే లోటుపాట్లు పర్యావసానం ఎలా ఉంటుందో గమనించండి.*


★ *నేటి మన పెళ్ళిళ్లలో పొరపాట్లు...*


★ *15000 మంది దంపతులపై గడచిన 20సంవత్సరాల పరిశోధన కృషియే ఈ అక్షర రూపం...*


◆ 1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..


*పెళ్ళి ముహూర్తం పెట్టేది ఎందుకు..? ఆ ముహూర్తానికి వధూవరులు ఒక్కటి అయితే సంతోషంగా వుంటారు అనే కదా..!*


*ముహూర్తానికి పెళ్ళి జరగక పోతే ఎలాగయినా చేసుకోవచ్చు కదా హంగు ఆర్భాటాలకు పోకుండా..*


*ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!*


2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో

ఒకరు చూపులు నిలపకపోవటం.. -

*ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!*


■ *(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)*

■ *(ఫోటోలు తీపి జ్ఞాపకాలే.. కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)*


◆ 3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..

*ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!*


◆ 4. తలంబ్రాలకు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..

*ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు ...!*


◆ 5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం, వధూవరులని ఆశీర్వదించటం..

*ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవటం..!*


◆ 6. బఫే భోజనాలు..

ఫలితం: దీనివలన అన్నదాన *ఫలితం పొందక పోవటం.!*


◆ 7. వేదమంత్రాలు వినబడకుండా వాటి స్థానంలో మైకులు పెట్టి మరి సినిమా పాటలు వినిపించటం..

*ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!*


◆ *ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి. అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని*


◆ *భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ, మంచి సంతానం పొంది, పదిమందికీ ఆదర్శంగా నిలవండి....*


◆ *అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్ధిష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.*


◆ *వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని ఈ వ్యాసం. అందరికి అందించండి.*

అందరూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం నెరవేరేటట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ.. 🙏🙏🙏


★ *శుభమస్తు*★

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సూర్యోపాసకుడు..*


"ఈ క్షేత్రం లో ఒక వారం పాటు ఉండాలని వచ్చాము..మా ఉపాసనకు ఇదే సరైన ప్రదేశమని మాకు ఆ సూర్యభగవానుడి నుంచి ఆదేశం వచ్చింది..మీరు మాకోసం ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లూ చేయనవసరం లేదు..మా అవసరాలు మేము తీర్చుకోగలం.." అన్నారాయన..


కాషాయ వస్త్రాలు ..పొడవాటి గడ్డం..శిరస్సుపై ముడి వేసిన జుత్తు..అరవై ఏళ్ల పైబడిన వయసు..ఇదీ వారి రూపం..చూడగానే ఒక సాధువు అనే భావం కలుగుతుంది..ఆయన కళ్ళు మాత్రం మిల మిలా మెరుస్తున్నాయి..ఆ ముఖం లో కళ్లదే ప్రత్యేక ఆకర్షణ..వారి చూపు చాలా తీక్షణంగా ఉంది..నేనూ కుతూహలం ఆపుకోలేక పోయాను..


"స్వామీ..మీరెక్కడినుంచి వస్తున్నారు?..మీ పేరేమిటి?.." అని అడిగాను..


"మాది ఒక ప్రాంతం అని చెప్పలేను..సూర్యోపాసన చేస్తుంటాను..కొన్నాళ్ల పాటు ఈ క్షేత్రం లో ఉండి.. ఉపాసన చేసుకోవాలని సంకల్పం కలిగింది..అందుకు ఆ ప్రత్యక్ష నారాయణుడి అనుగ్రహం కూడా కలిగింది..ఇది కూడా ఒక సాధకుడి తపో భూమి కదా? ఇక్కడ కూడా సాధన చేయాలని అనిపించింది.. వచ్చాను..ఒక చోట స్థిరంగా ఉండలేను..అందుకనే మా ఊరు ఫలానా అని చెప్పలేదు..ఎన్నో క్షేత్రాల్లో ఈ రకంగా నా ఉపాసనను అందరికీ చూపించాను.."అన్నారు..


ఆ మాటల్లో "నేను చాలా గొప్పవాడిని సుమా!.."అనే అహం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది..


వారి ఉపాసనా పద్దతి చాలా చిత్రంగా ఉండేది..ఉదయం ఎనిమిది గంటల నుండి..మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సూర్యునికి అభిముఖంగా నిలబడి..నేరుగా సూర్యుడిని చూస్తూ వుండేవారు..అలా చూడటం మనబోటి వాళ్లకు సాధ్యపడదు..సూర్యుని నుంచి వచ్చే ఆ కాంతి కిరణాలను ఎటువంటి ఆచ్ఛాదనా లేకుండా..కంటితో చూడలేము..కానీ..ఆయన దాదాపు ఐదు గంటల సేపు..అలానే చూస్తూ వుండేవారు..ఆ సమయం లో ఆ కళ్ళలో తెల్లటి పొర అడ్డం వున్నట్లుగా ఉండేది..ఇటువంటి ఉపాసన కానీ..సాధన గురించి కానీ నేనెక్కడా విని వుండలేదు..చూసి కూడా వుండలేదు..


అలా చూడటం అయిపోయిన తరువాత.."చూసారా..నేను చేస్తున్న ఈ ఉపాసన!..ఇది అందరికీ సాధ్యం కాదు..మా గురువుగారు కూడా తన వల్ల కూడా సాధ్యపడదు అని చెప్పారు..నన్ను చూసి..మీరు అనుకరించొద్దు..కళ్ళకు ప్రమాదం..జాగ్రత్త!.."అన్నారు..


ఆరోజు ఆదివారం కూడా..తన సాధన ముగించుకొని వచ్చి.."నాయనా..శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకుంటాను.." అన్నారు..సరే అన్నాను..


ముందుగా శ్రీ స్వామివారి సమాధి గది ద్వారం వద్ద నిలబడి కళ్ళుమూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసుకున్నారు..ఆ తరువాత..లోపలికి ప్రవేశించి..శ్రీ స్వామివారి సమాధికి మూడు ప్రదక్షిణాలు చేసి..శ్రీ స్వామివారి పాదుకలను తాకి నమస్కారం చేసుకున్నారు..ఆ పాదుకలను నెత్తి మీద పెట్టుకోబోయి..ఒక్కసారిగా ఆగిపోయి..వాటిని యధాస్థానంలో ఉంచి..మోకాళ్ళ మీద కూర్చుని..వంగి..ఆ పాదుకులకు తన శిరస్సు ఆనించి ..అలానే ఓ పది నిమిషాలు ఉండిపోయారు..వెంటనే లేచి..గబ గబా సమాధి మందిరం లోనుంచి బైటకు వచ్చారు..ఆయన కళ్ల నుంచి ధారాపాతంగా అశ్రువులు కారిపోతున్నాయి..


"స్వామీ..నేను అహంకారంతో ఇన్నాళ్లూ ప్రవర్తించాను..నన్ను క్షమించు..నా ఉపాసనా..సాధనా..అన్నీ ప్రదర్శన కోసం వినియోగించాను..పొట్టకూటి కోసం ఈ విద్యను ఉపయోగించుకున్నాను..నన్ను మన్నించు.." అని పరి పరి విధాల విలపించడం మొదలుపెట్టారు..


కొద్దిసేపటి తరువాత నా దగ్గరకు వచ్చారు.."ఖర్చులకు ఉంచండి!" అని ఒక వేయి రూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టాను..మొహమాటపడుతూనే..ఆ డబ్బు తీసుకొని..గది ఖాళీ చేసి వెళ్లిపోయారు..ఆ తరువాత ఆయన గురించి ఎటువంటి వార్తా మాకు అందలేదు..


సమాధి లోపల ఉన్న శ్రీ స్వామివారు..ఏ బోధ చేసారో తెలీదు..నా అంతటి వాడు లేడు అని విర్రవీగిన ఆయన అహంకారాన్ని క్షణాల్లో అణచి..గురువు పాదాలు పట్టుకునేలా చేసారు..


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699)

మరుత్తరాట్చరిత్ర

 *చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచియించితి మరుత్తరాట్చరిత్ర*


సరే ఇంతకు ఏమిటీ మరుత్తుని చరిత్ర.

........................................................


చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచియించితి మరుత్తరాట్చ చరిత్ర.


మనోజ్ఞమైన రూపంతో నూనూగు మీసాలప్రాయంలో మరుత్తరాట్చరిత్ర గ్రంథాన్ని వ్రాశానని శ్రీనాథకవి సార్వభౌముడు చెప్పుకొన్నాడు. మనం కూడా చదువుకొన్నాం, కాని ఈ మరుత్తచక్రవర్తి కథేమిటో చాలామందికి తెలియదని నా అభిప్రాయం. అలాంటి వారి కోసం.


పూర్వం కరందముడనే రాజొకడు వుండేవాడు. అతని పట్టపురమహిషి వీరమహదేవి. వీరికి అనిక్షితుడనే కొడుకు కలిగాడు. అతను పెరిగి పెద్దవాడైన సమయానికి విశాల రాజు తన కుమార్తె వైశాలికి స్వయంవరం ప్రకటించాడు.


ఆ రాకుమారిని స్వయంవరంలో చేపట్టడానికి అనిక్షితుడు బయలుదేరాడు. ఈ యువరాజు అందగాడే కాక సకలకళావల్లభుడు పైగా మంచి యోధుడు కూడా. అనిక్షితుడు స్వయంవరానికి వస్తే తమలో ఎవరికికూడా రాకుమారి దక్కదని ఇతర రాజకుమారులు అసూయ చెంది మోసంతో బంధివేశారు.


కొడుకు బంధీఅయినాడని తెలియగానే కరందముడు పెద్ద సేనతో వచ్చి ఇతర రాకుమారులను ఓడించి అనిక్షితుని విడుదలచేశాడు. సాహసవీరుడై వుండి శక్తిసామర్థ్యాలు కలిగివుండి కూడా ఇతర రాజకుమారులను ఓడించలేక తండ్రిచేత విడుదలైనందుకు అనిక్షితుడు బాగా సిగ్గుపడ్డాడు. ఇలాంటి అసమర్ధుడైన తనకు పెండ్లెందుకని రాజ్యమెందుకని విచారించాడు. తండ్రి ఎంత వారించినా నాలాంటి చేతకానివాడికి పాలించే అర్హత లేదని బ్రహ్మచర్యదీక్ష తీసుకొంటానని అడువులకు వెళ్ళిపోయాడు. కానితల్లి నోము నోచేవేళ ఆమె దగ్గరేవుండి సేవలు చేసేవాడు. ఆ రోజున అడిగినవారికి లేదనుకుండా దానం చేసేవాడు.


అనిక్షితుడి పౌరుషం దీక్షలు వైశాలికి నచ్చాయి. పెండ్లంటూ చేసుకొంటే అనిక్షితుడిని తప్ప ఇతరులను పెండ్లాడనంటూ పంతంతో తపస్సు చేసుకోటానికని అడవులకు వెళ్లిపోయింది.


పాతళలోకంలో నాగులున్నారు. ఓ వృద్ధ నాగేంద్రం వారికి నాయకుడు. నాగులకు శత్రుబాధ అధికంగా వుంది. వారి హాని వలన నాగజాతి హరించుకుపోయే ప్రమాదముంది. వైశాలి అనిక్షితుల పుత్రుడే తమ కష్టాలను తీర్చగలడని ఆ నాగేంద్రునకు తెలుసు.


అందుకే తపంలోనున్న వైశాలిని ఆ నాగేంద్రుడు పాతాళలోకానికి తీసుకుపోయాడు. చక్కగా చూసుకొన్నాడు. ఆమెకు జన్మించబోయే బిడ్డకుబాగా శిక్షణలు ఇచ్చి మంచివీరుడిగా చేస్తానని మాట ఇచ్చాడు. అలాగని ఆమెతో మాట కూడా తీసుకొన్నాడుకాని బ్రహ్మచర్యంలోనున్న అనిక్షతుడికి పాతాళంలోనున్న వైశాలికి కుదిరేదెట్లా ? కరందముడు కూడా వంశాంకురంలేదని వేదన పడసాగాడు. అందుకు అతనికో ఆలోచన వచ్చింది.


తల్లి వీరమహాదేవి నోమునోచుకొనే వేళ అనిక్షితుడు అమ్మ దగ్గరకు వచ్చాడు. తల్లినోము పూర్తికాగానే అనిక్షితుడు ఎవరేమి అడిగితే దానిని లేదనకుండా దానంగా ఇవ్వసాగాడు. తండ్రి నా వంశం నిలబడే సంతానాన్ని కనమని ఇదే తనకు దానంగా ఇవ్వాలని కరందముడు కొడుకును కోరాడు.


తండ్రికి ఇచ్చిన మాట దాటలేక వైశాలితో పరిణయానికి ఒప్పుకొన్నాడు. నాగరాజు సాయంతో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇద్దరికి వివాహం జరిగింది. అనిక్షితుడు రాజ్యం చేపట్టాడు.


వారికో కొడుకు పుట్టాడు, అతనికి మరుత్తుడనే పేరు పెట్టారు. మరుత్తు అన్ని రకాల రాజనీతులు యుద్ధతంత్రాలు నేర్చుకొని తాత రాజ్యాన్ని తండ్రి అనుమతితో పొంది ఏలసాగాడు. యజ్ఞయాగాలు చేశాడు. మరుత్తుడు ఎంత పరాక్రముడంటే ఇంద్రునికే యుద్ధాలలో తోడ్పడేవాడు.


మరుత్తుని యజ్ఞయాగాల నిర్వహణ అతని శక్తియుక్తులు రణతంత్రాలను చూచి ఇంద్రుడు అసూయపడ్డాడు. ఒకసారి మరుత్తు ఓ యాగాన్ని తలపెట్టి బృహస్పతిని ఉపద్రష్టగా (యాగ నిర్వహాకుడు) వుండమని కోరాడు. కాని ఇంద్రుడు అందుకు ఒప్పుకోలేదు. బృహస్పతిని అడ్డగించాడు. బృహస్పతిని మరుత్తు పిలిచినా రాలేదు. నువ్వు రాకపోతేనేమి నీ సోదరుడైన సంవర్తునితో యాగం పూర్తిచేస్తానన్నాడు. సంవర్తబుుషిని యాగకర్తగా యజ్ఞం తలపెట్టాడు.


ఈలోగా నాయనమ్మనుండి మనవడికి కబురొచ్చింది. పాతాళనాగులు మనదేశంపై పడి మునులను హింసిస్తున్నారు, పదునైన కోరలతో కాటువేసి చంపుతున్నారు. బుుషులను అసహాయులను ఉపిరాడకుండా చుట్టి బాధిస్తున్నారనేది నానమ్మ పంపిన సారాంశం.


మరుత్తు రెట్టించిన క్రోధంతో నాగులపై బడ్డాడు. నాగులను చీల్చిచెండాడసాగాడు. దీంతో నాగరాజు భయపడిపోయాడు. ఒకప్పుడు అడవిలో తపస్సు చేసుకొంటున్న వైశాలిని నాగేంద్రుడు పాతాళానికి తీసుకువెళ్ళి ఆదరించి తనకు పుట్టబోయే కొడుకుచేత నాగులకు శత్రుబాధలేకుండా చేయిస్తానని మాటకు ఆమెనుండి తీసుకొన్నాడు కదా !


ఆ చనువుతో నాగరాజు, మరుత్తునుండి రక్షించాల్సిందిగా ఆమెను ప్రార్థించాడు. వైశాలి భర్తయైన అనిక్షితుడివద్దకు వెళ్ళి కొడుకుచే యుద్ధాన్ని ఆపించాల్సిందిగా కోరింది. తండ్రి కొడుకును పిలిచి నాగులసంహారాన్ని ఆపాల్సిందిగా ఆదేశించాడు. అమాయక తపసులను ప్రజలను చంపే నాగులను ఉపేక్షించేదిలేదని మరుత్తు బదులిచ్చాడు. తండ్రియైన తనమాటనే కాదన్నందుకు మరుత్తుమీద అనిక్షితుడు కోపగించాడు.


ఇద్దరికి మాటమాట పెరిగింది. కత్తులు దూశారు. ఇరు పక్షాలకు ఘోరయుద్ధం మొదలైంది. వారి ఆయుధధాటికి కొండలు పిండైనాయి, భూమి కంపించింది, సముద్రాలు ఉప్పొంగినాయి. లోకాలన్ని అల్లాడిపోయాయి. ఈ పరిస్థితినుండి కాపాడమని దేవతలు మునులు దేవేంద్రుని ప్రార్థించారు.దేవేంద్రుడు వారి మాటను ఆలకించారు.


తండ్రికొడుకుల యుద్ధభూమికి వచ్చాడు. ఇద్దరిని శాంతించమని కోరాడు. నాగులు మరుత్తుని రాజ్యంలో అశాంతికి తానే కారణమని దేవేంద్రుడు చెప్పాడు. మరుత్తు తల్లి వైశాలి నాగులకు ఇచ్చిన మాటను కట్టుబడక శత్రువులనుండి నాగులను రక్షించడానికి మరుత్తుని వారిలోకానికి ఆమె పంపలేదని, అందుకుగాను నాగులు తన్నశ్రయించారని, పైగా తనకు అడ్డుచెప్పి యాగనిర్వహణనను ఉపద్రష్టగా (యాగ నిర్వాహకుడి) సంవర్తుని నియమించి యాగనిర్వహణ మరుత్తు తలపెట్టాడని, ఇదే అవకాశంగా నేనే నాగులను మీ రాజ్యంపైకి ఉసిగొల్పానని చెప్పాడు.


అంతేకాకుండా చనిపోయిన ముని, జనాలను, నాగులను బ్రతికించినాడు. ఇద్దరు యుద్ధం ఆపి శాంతించాలని కోరాడు.


తండ్రికొడుకులు యుద్ధం ఆపి శాంతించారు. ఇంద్రుడు మరుత్తుని మిత్రుడిగా అక్కున చేర్చుకొని, శత్రువులనుండి నాగులను కాపాడటానికి దివ్యాయుధాలు ఇచ్చాడు.


*చిన్నప్రశ్న.*

*శ్రీకృష్ణదేవరాయలంతటివాడినే అడవి దున్ననుండి యోధుడొకడు రక్షించాడు. ఆ యోధుడి పేరేమైనా మీకు తెలిస్తే చెప్పండి.*


*॥శుభమ్॥*


॥సేకరణ॥

..................................................................................................................జిబి.విశ్వనాథ, Deputy Co॥ector (Rtd) గోరంట్ల, అనంతపురం జిల్లా.944 1245857.

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

 *26.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునెనిమిదవ అధ్యాయము*


*వానప్రస్థ - సన్న్యాసాశ్రమముల ధర్మములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*18.40 (నలుబదియవ శ్లోకము)*


*యస్త్వసంయతషడ్వర్గః ప్రచండేంద్రియసారథిః|*


*జ్ఞానవైరాగ్యరహితస్త్రిదండముపజీవతి॥12952॥*


*18.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*సురానాత్మానమాత్మస్థం నిహ్నుతే మాం చ ధర్మహా|*


*అవిపక్వకషాయోఽస్మాదముష్మాచ్చ విహీయతే॥12953॥*


పంచేంద్రియముల మీదనూ, మనస్సుపైనను అదుపులేనివానిని ఇంద్రియములనెడి గుర్రములు, బుద్ధియనెడి సారథి అపమార్గమును పట్టించును. అతనిలో జ్ఞానముగాని, వైరాగ్యముగాని మచ్చునకైనను ఉండవు. అతడు ఉదరపోషణార్థమై దండ, కమండలమును, కాషాయంబరములను గలిగి, సన్న్యాసి వేషమును ధరించినను అతడు సన్న్యాసధర్మములనే గాక ఇతర ఆశ్రమ ధర్మములను కించపఱచువాడును, హృదయములో ఆత్మరూపముననున్న నన్నును మోసగించునట్టివాడును అగును. కేవలము సన్న్యాసివేషము వేసికొనినంత మాత్రమున వానికి విషయవాసనలు ఏమాత్రమూ నశింపవు. అట్టివానికి ఇహలోకమునందును, పరలోకమునందును సుఖము ఉండదు. అనగా ఉభయభ్రష్టుడగును.


*18.43 (నలుబది శ్లోకము)*


*భిక్షోర్ధర్మః శమోఽహింసా తప ఈక్షా వనౌకసః|*


*గృహిణో భూతరక్షేజ్యా ద్విజస్యాచార్యసేవనమ్॥12954॥*


జితేంద్రియత్వము, అహింస (సకల ప్రాణులయెడ ఎట్టి ద్రోహచింతయు లేకుండుట) అనునవి సన్న్యాసియొక్క పరమధర్మములు. కాయ క్లేశములకు ఓర్చుకొనుచు తత్త్వచింతన చేయుట, భగవద్భక్తి భావము కలిగియుండుట వానప్రస్థుని ధర్మములు. సకలప్రాణులను దయతో రక్షించుట,ఆచార్యుని చక్కని భక్తిశ్రద్ధలతో సేవించుట బ్రహ్మచారి యొక్క ధర్మము.


*18.43 (నలుబది మూడవ శ్లోకము)*


*బ్రహ్మచర్యం తపః శౌచం సంతోషో భూతసౌహృదమ్|*


*గృహస్థస్యాప్యృతౌ గంతుః సర్వేషాం మదుపాసనమ్॥12955॥*


గృహస్థునకు బ్రహ్మచర్యము (ఋతుకాలమునందే ధర్మపత్నితో సంగమించుట), తపస్సు (కాయక్లేశములకు ఓర్చుకొనుట), శౌచము (బాహ్యభ్యంతర శుచిత్వము), సంతోషము (సంగ్రహబుద్ధి లేకుండా లభించినదానితో తృప్తిచెందుట), సకలప్రాణులయెడ ప్రేమభావమును కలిగియుండుట అనునవి ముఖ్యధర్మములు. అన్ని ఆశ్రమముల వారికిని నన్ను (భగవంతుని) ఉపాసించుటయే పరమధర్మము.


*18.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*ఇతి మాం యః స్వధర్మేణ భజేన్నిత్యమనన్యభాక్|*


*సర్వభూతేషు మద్భావో మద్భక్తిం విందతే దృఢామ్॥12956॥*


చతురాశ్రమములవారును స్వధర్మములను ఆచరించుచు, ఇతర లౌకిక ప్రయోజనములను ఆశింపకుండా నన్ను భజించు చుండవలెను. సకల ప్రాణులయందును పరమాత్మ భావమును కలిగియుండవలెను. అప్పుడు వారికి నా యందు దృఢమైన భక్తి కుదురుకొనును.


*18.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*భక్త్యోద్ధవానపాయిన్యా సర్వలోకమహేశ్వరమ్|*


*సర్వోత్పత్త్యప్యయం బ్రహ్మ కారణం మోపయాతి సః॥12957॥*


ఓ ఉద్ధవా! నేను సృష్టి, స్థితి, లయములకు కారణమైన పరబ్రహ్మను, సకలలోక మహేశ్వరుడను, నన్ను అనన్యభక్తితో సేవించినవారు నన్నే పొందుదురు.


*18.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*ఇతి స్వధర్మనిర్ణిక్తసత్త్వో నిర్జ్ఞాతమద్గతిః|*


*జ్ఞానవిజ్ఞానసంపన్నో న చిరాత్సముపైతి మామ్॥12958॥*


తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుట వలన పరిపూర్ణమైన అంతఃకరణశుద్ధి ఏర్పడును. తద్ద్వారా నా ఐశ్వర్యమును - నా స్వరూపమును తెలిసికొనును. అంతట జ్ఞాన-విజ్ఞాములతో సంపన్నుడైన ఆ భక్తుడు శీఘ్రముగ నన్ను పొందును.


*18.47 (నలుబది ఏడవ శ్లోకము)*


*వర్ణాశ్రమవతాం ధర్మ ఏష ఆచారలక్షణః|*


*స ఏవ మద్భక్తియుతో నిఃశ్రేయసకరః పరః॥12959॥*


ఉద్ధవా! ఇంతవఱకును నేను నీకు వర్ణాశ్రమ ధర్మములను, వాటి ఆచారలక్షణములను గూర్చి తెలిపితిని. నాయందు దృఢమైన భక్తిగలగి ఈ ధర్మములను ఆచరించినచో, మానవుడు అవలీలగా పరమశ్రేయస్కరమైన మోక్షమును పొందును.


*18.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*


*ఏతత్తేఽభిహితం సాధో భవాన్ పృచ్ఛతి యచ్చ మామ్|*


*యథా స్వధర్మసంయుక్తో భక్తో మాం సమియాత్పరమ్॥12960॥*


సాధుపురుషా! నీవడిగిన ప్రశ్నలకు సమాధానముగా 'భక్తుడు స్వధర్మపాలనము గావించుచు, పరబ్రహ్మస్వరూపుడనైన నన్ను ఏవిధముగా చేరుకొనునో అను దానిని వివరించితిని.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే అష్టాదశోఽధ్యాయః (18)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *వానప్రస్థ - సన్న్యాసాశ్రమముల ధర్మములు* అను పదునెనిమిదవ అధ్యాయము (18)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*475వ నామ మంత్రము* 26.10.2021


*ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః*


కంఠమునందు తెల్లని రంగుగల పదహారుదళాల పద్మమందు వజ్రేశ్వరియను చక్రాధిష్ఠానదేవతా స్వరూపంలో విలసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *విశుద్ధిచక్రనిలయా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ పరమేశ్వరి కరుణచే సాధకునికి చక్కని వాక్పటిమ, పలువురిని ఆకట్టుకొనే నేర్పరితనము, అంతకు మించి తనయొక్క వృత్తి లేదా ఉద్యోగ కార్యక్రమములందు నేర్పరితనముగలిగి కీర్తిప్రతిష్టలతోబాటు, ధనధాన్యసంపదలను కూడా సంప్రాప్తింపజేసికొనగలుగును.


మన శరీరంలో షట్చక్రములు అన్నవి. యోగ సాధనచేసేవారికి తప్ప సాధారణమైనవారికి సరిగా అవి అలాంటివి అర్ధంకావు అని. అది నిజమే సుమా, అందులో తప్పులేదు కదా.


మన శరీరంలో షట్చక్రములు ఉన్నవి. ఏడవది అయిన సహస్రారంకూడా గలదు. ఈ విషయం యోగసాధన చేయువారికి వివరంగా తెలుస్తుంది. సాధన చేసేవారు ఆ చక్రాలను అనుభవించగలరు. ఆ చక్రాల పేర్లెేంటో అవి ఎక్కడ ఉంటాయో తెలుసుకొందాం.


*మూలాధారం గుదస్థానం, స్వాదిస్ఠానం తు మేహనం నాభిస్థు మణిపూరాఖ్యాం, హృదయాబ్జ మనాహతం తాలుమూలం విశుద్దాఖ్యం, ఆఙ్ఞాఖ్యం నిటలాంబుజం సహస్రారాం బ్రహ్మరంధ్ర ఇత్యాగమ విదోవిదుః*


వీటిని ఊర్ద్వలోక సప్తకమంటారు.


7. సహస్రారం -- సత్యలోకం -- పరమాత్మస్థానం


6. ఆజ్ఞాచక్రం -- తపోలోకం -- జీవాత్మస్థానం


5. విశుద్దం -- జనలోకం -- ఆకాశభూతస్థానం


4. అనాహతం -- ముహర్లోకం -- వాయుభూతస్థానం


3. మణిపూరకం -- సువర్లోకం -- అగ్నిభూతస్థానం


2. స్వాదిష్ఠానం -- భువర్లోకం -- జలభూతస్థానం


1. మూలాధారం -- భూలోకం -- పృథ్వీభూతస్థానం



*మూలాధారం:* మలరంధ్రానికి రెండు అంగుళాల పై భాగంలో ఉంటుంది. దీనిరంగు ఎర్రగా రక్తవర్ణంలో ఉంటుంది. నాలుగు రేకులుగల తామరపువ్వు ఆకారంలో ఉంటుంది. ఈ చక్రానికి అధిపతి గణపతి, వాహనం ఏనుగు.


*స్వాధిష్టానం* : ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నుముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మ, తత్వం జలం. సింధూరవర్ణంలో ఉంటుంది, ఆరు రేకుల పద్మాకారంలో ఉంటుంది. వాహనం మకరం.


*మణిపూరకం*: బొడ్డునకు మూలంలో వెన్నుముకయందు ఉంటుంది. అధిపతి విష్ణువు, పది రేకుల పద్మాకారంలో, బంగారు వర్ణంలో ఉంటుంది, వాహనం కప్ప.


*అనాహత చక్రం :* హృదయం వెనుక వెన్నుముకలో ఉంటుంది. అధిదేవత రుద్రుడు, పండ్రెండు రేకుల తామరపువ్వు వలె నీలం రంగులో ఉంటుంది. తత్వం వాయువు, వాహనం లేడి.


*విశుద్ధిచక్రం :* కంఠం యొక్క ముడియందు ఉంటుంది. అధిపతి జీవుడు, నలుపురంగులో ఉంటుంది. తత్వం ఆకాశం, వాహనం ఏనుగు.


*ఆఙ్ఞాచక్రం :* రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. అధిపతి ఈశ్వరుడు, రెండుదళాలు గల పద్మాకారంలో, తెలుపు వర్ణంలో ఉంటుంది.


*సహస్రారం :* కపాలం పై భాగంలో, మనం మాడు అని పిలిచేచోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రం అంటారు. అధిపతి పరమేశ్వరుడు, వేయిరేకుల పద్మాకృతిలో ఉంటుంది. సుషుమ్నా నాడి పై కొన మీద ఈ చక్రం ఉంటుంది. దీనికి ఫలం ముక్తి.


కంఠమందున్న విశుద్ధిచక్రకర్ణికయే పరమేశ్వరి నివాసస్థానమై విలసిల్లుచున్నది గనుకనే ఆ తల్లి *విశుద్ధిచక్రనిలయా* యని అనబడినది.


విశుద్ధిచక్రము నుండి సప్తచక్రములందును డాకినీ, రాకినీ, లాకినీ, కాకినీ, సాకినీ, హాకినీ, యాకినీ అనుపేర్లుగల ఏడుగురు యోగినీ దేవతలు అధిష్ఠానదేవతలై యుండిరి.


ఇక్కడ (విశుద్ధిచక్రము) ప్రారంభముగా చెప్పుటకు కారణము డాకిన్యాది యోగినుల క్రమము అనుసరించుటకు అని చెప్పబడినది. సప్తచక్రములు, ఆ చక్రాధిష్ఠాన యోగినీ దేవతలకు సంబంధించిన నామ మంత్రములు లలితా సహస్రంలో క్రిందిక్రమంలో ఈయబడినవి.


475వ నామ మంత్రము - *విశుద్ధి చక్రనిలయా*


484వ నామ మంత్రము - *డాకినీశ్వరీ*


485వ నామ మంత్రము - *అనాహతాబ్జనిలయా*


484వ నామ మంత్రము - *రాకిన్యంబా*


495వ నామ మంత్రము - *మణిపూరాబ్జనిలయా*


503వ నామ మంత్రము - *లాకిన్యంబా*


504వ నామ మంత్రము - *స్వాధిష్ఠానాంబుజగతా*


513వ నామ మంత్రము - *కాకినీరూపధారిణీ*


514వ నామ మంత్రము - *మూలాధారాంబుజారూఢా*


520వ నామ మంత్రము - *సాకిన్యంబాస్వరూపిణీ*


521వ నామ మంత్రము - *ఆజ్ఞాచక్రాబ్జనిలయా*


527వ నామ మంత్రము - *హాకినీరూపధారిణీ*


528వ నామ మంత్రము - *సహస్రదళపద్మస్థా*


534వ నామ మంత్రము - *యాకిన్యంబాస్వరూపిణీ*


అమ్మవారు ఆయా చక్రములకు సంబంధించిన పద్మములయందు ఆయా యోగినీరూపములలో విలసిల్లుతున్నదని పైన చెప్పిన నామమంత్రములద్వారా తెలియుచున్నదని మనవి. 


విశుద్ధి చక్రమందుగల డాకినీ యోగినీధ్యానము ఈ విధంగా వర్ణింపబడినది:- *కంఠమందు పదునారుదళములుగల పద్మముగలదు. దానికి విశుద్ధిచక్రమనిపేరు. ఆ పద్మముయొక్క కర్ణికయందు పాటలవర్ణముతో, మూడునేత్రములుగలది, చతుర్బాహువులందును క్రమముగా ఖట్వాంగము (మంచపుకోడు), ఖడ్గము, త్రిశూలము, మహాచర్మము అను నాలుగింటిని ధరించునదియు, ఒక్క ముఖము గలిగినదియు, అజ్ఞానులగువారికి భయమును గలిగించునదియు, పరమాన్నమునందాసక్తియు గలదియు, చర్మధాతువునందు చైతన్య రూపముగా ఉండునదియు, చుట్టూ అమృతాది శక్తులచే ఆవరింపబడినదియు, ఉపాసకులచే నమస్కరింపదగినదియు అగు డాకినీదేవికి నమస్కరిస్తున్నాను*. ఈ డాకినీస్వరూపిణియే పరమేశ్వరి. అటువంటి పరమేశ్వరి డాకినీస్వరూపిణిగా విశుద్ధిచక్రమునందు ఉండుటచే అమ్మవారు *విశుద్ధిచక్రనిలయా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంఘటన కౌశల్యము

 “సంఘటనా శాస్త్ర నిపుణులం”


ఫిబ్రవరి 1946 కలకత్తా నగరంలో జరిగిన సంగతి. ఒకరోజు సాయంత్రం నగరంలోని కొంతమంది పెద్దలతో టీ కార్యక్రమం ఏర్పాటైంది. అక్కడ ఒక ప్రౌఢ డాక్టర్ గురూజీతో “నేను మీ సంఘ ధ్యేయంతో ఏకీభవిస్తాను. కాని ఈ అల్పసాధనాలతో అనగా దక్ష, ఆరమ, దండ, ఖడ్గ, శూల, కబడ్డీ మొదలైన వాటితో ఇంత మహత్కార్యాన్ని, ఏనాటికైనా సాధించడం సాధ్యమవుతుందా? అని నాకనుమానం కలుగుతుంది” అన్నారు.

శ్రీ గురూజీ నవ్వుతూ “ డాక్టర్ గారూ? ప్రసుత్తం మీ అలోపతి మందులలో మాస్టర్ డ్రగ్ ఏది?” అని అడిగారు.

డాక్టర్ గారు "పెన్సిలిన్” అన్నారు. 

శ్రీ గురూజీ “ఈ పెన్సిలిన్ దేనితో సిద్ధం చేస్తారు? ” అని అడిగారు . 

డాక్టర్ గారు “అందరికీ తెలిసిందే . దుర్గంధపూరితంగా మురిగిన అన్ని పదార్థాలతో అది తయారవుతుంది” అన్నారు. 

శ్రీ గురూజీ “ప్రవీణులైన వారి చేతుల్లో చెడువస్తువు కూడా సదుపయోగకరంగా మారుతుందనే కదా దీని తాత్పర్యం.” 

డాక్టర్ గారు “అవును” 

శ్రీ గురూజీ మరొక వాక్యం జోడిస్తూ, “మేము సంఘటన శాస్త్ర విశేషజ్ఞులం” అన్నారు.

     ******. ********. *********

(ఎన్నో వికారములున్న వ్యక్తిని స్నేహ, ప్రేమలనే సూత్రముతో బంధించుతూ వికారములను తొలగించుకొని, రాష్ట్రపురుషునికి పట్టిన జబ్బును ‘సంఘటన’ మనే మందుద్వారా తొలగిస్తున్నామని భావము. 

ఇదే సంఘటన కౌశల్యము అంటే.

సంస్కరించడమనేది లేనినాడు దుర్గంధపురితమైన, మురిగిన వికారములతో కూడిన సంఘటన రాష్ట్రానికి చేటు చేస్తుంది)

పెద్దరికం


🌹పెద్దరికం🌹


ఇంటికి పెద్దదిక్కు వుండాలి అంటారు.. ఎందుకంటే నాలుగు మంచి మాటలు చెప్పడానికి మరియు ఎవరైనా తప్పు చేస్తే ఖండించడానికి.. ‘మాకు పెద్ద దిక్కే వద్దు, మంచి చెప్పే వాళ్లు వద్దు !’ అని అంటే ఆ కుటుంబం ఎటుపోతుంది ? కళ్లు గానక ఊబిలోనికి కూరుకుపోతారు. ఇదే దుర్యోధనుని విషయంలో జరిగింది. దుర్యోధనునికి తల్లిదండ్రులు ప్రేమ వలన సుద్దులు చెప్పలేకపోయారు, విదురుడు మంత్రిత్వం వలన చెప్పలేక పోయాడు, భీష్ముడు పాపం తాత గారు, చనువు ఎక్కువ అయినా ఎన్నో సార్లు చెప్పి చూశాడు కానీ ఆయన్నీ లెక్క చేయలేదు.. చివరికి సర్వం రాజ్యమే కూలిపోయింది.


పెద్దలు లేని సంసారం, కుటుంబం ఏమవుతుందో తెలుసుకోవాలి.


నూరుగురు కౌరవులు ఏమయినారో మనం గుర్తుంచుకోవాలి, ధర్మాన్ని చెప్పేవాడు ఒక్కడైనా వుండాలి, అదే ధృతరాష్ట్రుని గొప్పతనం... ధృతరాష్ట్రుడు విదురుడ్ని ప్రక్కన బెట్టుకొన్నాడు, అందుకనే ఆయనకు శ్రీకృష్ణ విశ్వరూప దర్శనం లభించింది. అదే ‘శకుని’ని దగ్గర పెట్టుకొన్న దుర్యోధనడు యొక్క స్థితి మనకు తెలుసు.


దుర్మార్గుడైనా సరే ఓ మహాత్ముడ్ని, మంచి వాడ్ని చెంత పెట్టుకోవాలి.. దీనిని మనం బాగా పట్టుకోవాలి.


అదే ధర్మరాజు విషయంలో చూడండి.. అందరి మాట విన్నాడు, ఆయన మాట ఆయన తమ్ముళ్లు విన్నారు, ధర్మ ప్రవర్తనతో బ్రతికారు


దుర్యోధనుడు ఎవ్వరి మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు, గురువుల మాట వినలేదు, పెద్దల మాట వినలేదు, శ్రేయోభిలాషుల మాట వినలేదు, భగవంతుడి మాట కూడా వినలేదు చివరికి ఏమైయాడు ?


మంచి చెప్పే వాళ్లను బ్రతిమలాడి కోనైనా తెచ్చుకోవాలి. "అయ్యా మీరు మార్గ నిర్ధేశకులుగా ఉండండి, అధ్యక్షులుగా వుండండి, పెద్దలుగా వుండండి మాకు !" అని ప్రాధేయపడి వుంచుకోవాలి. పెద్దవాళ్లను వుంచుకున్నందువలన కుటుంబాలకు, సంస్థలకు, సభలకు గౌరవం లభిస్తుంది, చెడ్డవాళ్లను డబ్బులు ఇచ్చి అయినా వదిలించుకోవాలి అంటారు. రాజు చెడ్డవాడు అయినా మహా మంత్రి మంచివాడుగా, ధర్మం చెప్పేవాడుగా వుండాలి.. అప్పుడే ఆ రాజు, ప్రజలు పది కాలాలు పాటు చల్లగా వుంటారు.


ధర్మం చెప్పే పెద్దలు లేనందువలన లేదా చెప్పినా వినకపోవడం వలన సమాజం దెబ్బతింటుంది.


ఎవడికి వాడు నేనే పెద్ద అంటే ఎలాగా ? అలాంటి జ్ఞానవంతులు వుంటేనే ఒక్కోసారి పొరబాట్లు, తప్పులు జరిగిపోతూనే వుంటాయి.


”అయ్యా శ్రీకృష్ణా ! నేను ఏమి తప్పుజేసానని ? అని భీష్ముడు శ్రీకృష్ణుల వారిని అడుగుతాడు


"ఓ తప్పు జరిగేచోట పెద్దలు వుండటమే తప్పు" అని అంటాడు. ఓ తప్పును చూస్తూ ఖండించకుండా, అక్కడ నుంచి వెళ్లిపోకుండా మౌనం వహించి చూస్తూ వుండటమే భీష్ముడు చేసిన తప్పు.


ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు ఏమీ చేయలేక అక్కడే వుండిపోయాడు.. అదే విదురుడు చూడకుండా వెళ్లిపోయినాడు...


*_కావున పెద్దలు ఓ తప్పు జరిగిన చోట వుంటే ఆ పాపం వారి ఖాతాలో కూడా వేస్తారు. అందువలన చెప్పిన మాట విననప్పుడు పెద్దలు ఆ స్థలం నుంచి వెళ్లిపోతారు... ఇది విజ్ఞులు చేసే పని.


కావున ఎవరైనా తప్పు చేస్తుంటే వారికి చెప్పి సరిదిద్దాలి... వారు మాట వినకపోతే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు... 


💥సర్వేజనాః సుఖినోభవంతు💥

లిబరల్ హిందూ ఏకం సత్ వేదాంతులు,

 Srinivasa Dikshit Harathi పోస్ట్:


లిబరల్ హిందూ ఏకం సత్ వేదాంతులు,

నిజమైన సెక్యులర్ ముస్లిం లు,

లెఫ్ట్ మేధావులు, జై భీం జై మిమ్ లు

నా సందేహం తీర్చగలరా??

................

హిందూ సమాజ చరిత్రనే కాదు 

సామాన్య అజ్లాఫ్, అర్జాల్ ముస్లిం ల చరిత్రను కుట్ర పూరితంగా కప్పి

పెట్టిన భారత వామపక్ష వాద మోసగాళ్ళు.

..............

16 ఏళ్ళ కింద బంజారాహిల్స్ Care ఆస్పత్రి లో నాన్న గారికి గుండె ఆపరేషన్ సందర్భ చెక్కప్ కొరకు వైటింగ్ హల్ లో కూర్చున్నాం.


పక్కన ఒక ముస్లిం పెద్దమనిషి కూర్చున్నాడు.మాటలు కలిసినయ్.


ఆయన తనగురించి చెపుతూ మేము బుందేలి రాజపుట్ ల నుంచి ఇస్లాం లోకి మారినము. నేను నాలుగో తరం వాణ్ణి.

మేము అజ్లాఫ్ లము అన్నడు.

మొదటి సారి ఆమాట వినడం.

తరువాత నాన్న అష్రాఫ్, అజ్లాఫ్,అర్జాల్ తేడాల గురించి చెప్పినడు.

ముస్లిం లలో ఏమిటీయీ తేడాలు.

........


భారతీయ ముస్లిం లలో

అష్రాఫ్ Ashraf, 

అజ్లాఫ్ Ajlaf, 

అర్జాల్ Arzal / Arjalఅనే వర్గీకరణలు ఉన్నయ్.


ఇస్లాం ఇక్కడికి వచ్చి నప్పుడు

బయటినుంచి వచ్చిన 

అరబ్, టర్క్, ఉజ్బెక్, ఆఫ్ఘన్ జాతుల వాళ్ళు తమను తాము ఉత్తములుగా చెప్పుకున్నారు.


ప్రవక్త పుట్టిన తెగకు చెందిన Qureshi లు ఆయన మక్కా నుంచి వెళ్ల గొట్టబడి మదీనాకు వెళ్ళినప్పుడు ఆయనను స్వాగతించి సహాయం చేసిన Ansar లు, ఆయన direct descendents అని చెప్పుకునే Sayyad లు, 

కులీనులం, అధికార వర్గం అనే షేక్, పఠాన్ లు వగైరా యీ వర్గం లోకి వస్తారు.

తరువాత ఇక్కడి హిందు అగ్ర కులాలనుంచి తమలో కలిసిన వాళ్ళను తమ రాజకీయ అధికారం

నిలుపుకోవడానికి తమతో 

సమంగా కలుపుకున్నరు..So 

ముస్లింలలోని కులీనవర్గం Ashraf లు.

దీనికి Noble అని నిఘంటు అర్థం

వీళ్ళు ముస్లిం లలో పెత్తందారీ FC వర్గం.


తరువాత BC వర్గాలనుంచి మారిన వృత్తి కులాల వాళ్ళను తక్కువ దర్జాగా చూసినరు. వాళ్ళు Ajlaf వర్గం.

వీళ్ళు ముస్లిం లలో BC వర్గం


SC కులాలనుంచి మారిన వాళ్ళను Low category అని అర్థం వచ్చే 

Arzal / Arjal వర్గం గా చెప్పినరు.

ఉదాహరణకు తెలుగు ప్రాంతాల్లో దూదేకుల వాళ్ళు.

వీళ్ళు ముస్లిం లలో అస్పృశ్యత అనుభవించే SC వర్గం.


Ajlaf, Arjal వర్గాలు రెండింటిని కలిపి వాళ్ళు Pshmanda వర్గం గా చెప్పుకుంటారు.

యిది భారత ముస్లిం లలో బహుజన ఉద్యమం వంటిది.


బ్రిటిష్ ప్రభుత్వం ముస్లిం లకు సెపరేట్ నియోజక వర్గాలు పెట్టడం తో మొదలయ్యి ముస్లిం లీగ్ 1920 నుంచి ద్విజాతి సిద్ధాంతం ను ప్రచారం చేసినప్పుడు దాన్ని లేవనెత్తినది 

జమీందారులు, భూస్వాములు, మతాధికారులుగా, ప్రభుత్వ అధికారులుగా ఉండిన అష్రఫ్ FC వర్గం.


అలిఘర్ ముస్లిం యూనివరసిటీ ఏర్పాటు చేసిన Sir Sayyed Ahmed Khan, కాశ్మీరీ పండిత్ లనుంచి మతం మారిన కవి Iqbal లాంటి అష్రాఫ్ లు దింట్లో ప్రధాన పాత్ర పోషించినరు


కానీ యీ ద్విజాతి సిద్ధాంతాన్ని, వేరే దేశ డిమాండ్ ను పెద్ద ఎత్తున వ్యతిరేకించింది

ఉత్తర, మధ్య భారతం లో ఉన్న

Pashmanda ఉద్యమ BC, SC ముస్లిం వర్గం.


Pashmanda ముస్లిం ల యొక్క పాకిస్థాన్ ఏర్పాటు మీద వ్యతిరేకత:

...........

1941 లోనే బీహార్, UP లలో మెజారిటీ ముస్లిం వర్గం అయిన BC ముస్లిం వర్గం momin conference పేరుతో ఢిల్లీలో పాకిస్థాన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద సభ పెట్టింది.


Pasmanda వర్గం బలంగా ఉన్న

All India Azad Muslim Conference,

All India Momin Conference లాంటి అజ్లాఫ్ వర్గ ముస్లిలకు ప్రాతినిధ్యం వహించిన సంస్థలు మతపరంగా పాకిస్థాన్ ఏర్పాటు వల్ల అష్రాఫ్ ముస్లిం లకే లాభం కలుగుతుంది.

భారత్ కలిసి ఉంటేనే అజ్లాఫ్ లము, అర్జాల్ లము అయిన తమకు భద్రత, సామాజిక లాభం అనే పాయింటుతో పాకిస్థాన్ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించినవి.


కానీ రాజ్యాంగ సభ ఏర్పాటుకు మార్గం వేసిన 1945-46 ఎన్నికల్లోseparate electorate పద్దతిలో ముస్లిం లు ఓటువేసే సీట్లలో ఎన్నికల్లో మతాన్ని, పాకిస్థాన్ ఏర్పాటును ప్రచార అస్త్రం గా వాడి అష్రాఫ్ డామినేషన్ ఉన్న ముస్లిం లీగ్ 80 శాతం పైన సీట్లు గెలుచుకుంది.

............

ఇప్పుడు కమ్మీ మేధావుల దగ్గరకు వద్దాం.


హిందూ చరిత్రను మాత్రమే కాదు భారతీయ ముస్లిం ల చరిత్రను కూడా వక్రీకరించిన కమ్మిలు.


భారత దేశం లో మతం ప్రధానం కాదు.

మనువాద కులమే ప్రధానం అనేది కమ్మీల ఒక వాదన.


కాబట్టి

ఇస్లాం లోకి మారిన హిందూ అగ్ర కులాలు

తమ విభజన వాద మనువాద కుల రొచ్చును 

"అద్భుత సమానత్వ సిద్ధాంతం" ఉన్న ఇస్లాం లోకి కూడా తీసుక పోయినరు.

కాబట్టి భారత ఇస్లాం లో కులం వివక్ష అనేది ఇస్లాం లోకి మారిన హిందూ అగ్ర కులాల కుట్ర అని అంటరు కమ్మీ మేధావులు.


కమ్మిలు చేసే అబద్ధపు ప్రచారం ఏమంటే,

బయటి నుంచి వచ్చిన జాతుల ముస్లిం లు తమను తాము

 "Nobul కూలిన వర్గం" అని అర్థం వచ్చే అష్రాఫ్ లుగా తామే చెప్పుకున్నరు అనేది కప్పి పెట్టి, 


ఉర్లో పెండ్లికి కుక్కల హడావిడి మాదిరి

అష్రాఫ్ లకంటే ఎక్కువగా వాదిస్తూ

అష్రాఫ్ లు తమగురించి చెప్పుకున్న దాన్ని కమ్మిలు హిందూ మతానికి,

మనువాదానికి అంట గడుతరు.


రెండు జాతుల సిద్ధాంతాన్ని సమర్థించి పాకిస్తాన్ ఏర్పాటును సమర్ధన చేసిన కమ్మిలు, అదే సమయంలో అజ్లాఫ్ అర్జాల్ వర్గ ముస్లిం లలో ఉవ్వెత్తున లేచిన ద్విజాతి సిద్ధాంత వ్యతిరేక , పాకిస్థాన్ వ్యతిరేక ఉద్యమం గురించి, ఎక్కడా రాయలేదు.


యీరకంగా భారత లెఫ్ట్ హిందూ సమజానికే కాదు ముస్లిం సమాజానికి కూడా చరిత్ర రాయడంలో ద్రోహం చేసింది.


కాబట్టి భారత కమ్మిలు 

1.కులీన వర్గం అనే అష్రాఫ్ ముస్లిం లకు, 2.స్వాతంత్ర్య తెచ్చిన పార్టీ అనే పేరుతో, గాంధేయవాదము పేరుతో ఉద్దేరకు అధికారం లో ఉండిన "ఇందిరా కాంగ్రెస్" పార్టీకి తొత్తులు తప్ప విళ్ళకు ఏ నైతిక విలువలు లేవు.


మహమ్మద్ ప్రవక్త చెప్పిన

తెగలు, జాతులు, సంపద ఆధారిత వర్గాలు లేని సమనత్వ egaliterian సమాజము అయిన ఇస్లాం లో సామాజిక విభేదాలు ఉండే వర్గాలు ఎందుకు ఉన్నయ్?


Pashmanda ఉద్యమం ఎందుకు వచ్చింది?


ఇస్లాం లోకి తనతో పాటు మనువాది కులాన్ని తీసుకపోతే 

అప్పుడు ఇస్లాం లోకి రమ్మని పిలిచిన వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నరు?


జరిగింది ఏదో జరిగింది.

కానీ ఇప్పుడు 


1- కులం అనే వ్యవస్థ లేని అద్భుత ఇస్లాం లొకి కులం అనేది భారత హిందూ మనువాది తెచ్చిన రొచ్చు అనే క్లారిటీ కలిగిన కమ్మీ మేధావికానీ,


2-హిందూ కుల వివక్ష గురించి పోరాడే కమ్మీ సంస్కర్త కానీ "నాకు అన్యాయం జరుగుతున్నది" అంటున్న పశ్మందా ముస్లిం ల గురించి ఎందుకు మాట్లాడడు?


3-జై భీం జై మిమ్ అని హిందూ దళితుల మీద ప్రేమ చూపే 

ముస్లిం లు కానీ,కమ్మిలు కానీ,

లేదా


4-చర్చ్ లో దళిత క్రైస్తవులు అంటూ

మతం మారితే కులం మారదు అని వాదిస్తూ క్రైస్తవమ్ తీసుకున్న SC లకు కూడా SC రిసర్వేషన్ ఉండాలి అనే దళిత అంబెడ్కర్ వాదులు కానీ

యీ నలుగురు కూడా అస్పృశ్యత అనుభవిస్తున్న 

"అర్జాల్ Arjal ముస్లిం" ల గురించి ఎందుకు మాట్లాడరు?


అగ్రకుల కమ్యూనిస్టుల మీద అంబెడ్కర్ వాదుల ఆరోపణ:

అగ్రకుల కమ్యూనిస్టులు పెద్ద దొంగలు, కుట్ర దారులు.

లెఫ్ట్ వాదం పేరుతో లాభ పడ్డది అగ్రకులాలనుంచి వచ్చిన కమ్యూనిస్టులే!

కానీ ......

సామాజిక ఉద్యమాల నుంచి నక్సలిజం వరకు చనిపోయినది SC లు అనేది దళిత అంబెడ్కర్ వాదుల మాట.


అదే రకంగా 

హిందూ, ముస్లిం బేధాలు అల్లర్లు పెరిగితే లాభ పడేది ముస్లిం మత వ్యవస్థలు, ముస్లిం రాజకీయ వ్యవస్థల మీద పట్టు బిగించిన అష్రాఫ్ వర్గం మాత్రమే లాభ పడుతుంది.


నిజానికి హిందూ ముస్లిమ్ విభేదాలలో నష్టపోయేది మెజారిటీ హిందువులతో రోజు వారీ కాంటాక్ట్ లో ఉండే 

పండ్లు పూల వ్యాపారి,

చాయ్ కేఫ్, పంచర్ షాప్, ప్లంబర్, ఎలెక్ట్రిషియన్, డ్రైవర్, ఆటో మొబైల్ రంగం, పెయింటింగ్ వర్కర్, చిన్న వ్యాపారాలు, చిన్న దుకాణం, మటన్ షాప్, చిన్న ఉద్యోగాలు చేసే అజ్లాఫ్, అర్జాల్ వర్గం అయిన బడుగు పాశ్మందా ముస్లిం.


కాబట్టి మనువాద హిందువు ఇస్లాం లోకి మారి తనతో పాటు తీసుకుపోయిన కులం కంపును

"అద్భుత సామాజిక సమానత్వ తాత్విక ఉన్న ఘనత వహించిన ముస్లిం సమాజం" ఇంకా ఎందుకు

మోస్తున్నదో 

సెక్యులర్ జైభీం జైమిమ్ వాద ముస్లింలు, అంబెడ్కర్ దళిత వాదులు, 

లిబరల్ వాద హిందు సంస్కర్తలు, 

భారత ఉద్యమ సంఘాల కమ్మీలు చెప్పాల.

అసలు ఆ డబ్బంతా ఏం చేస్తారు

 ఇండియా లో సందుకో గుడి ఉంటుంది. భక్తులు డబ్బులు, కానుకలు తెగ వేస్తారు అసలు ఆ డబ్బంతా ఏం చేస్తారు అని పాశ్చాత్య దేశం లో ఓ మేధావికి కుతూహలం పుట్టి.దీనిమీద 

 

డాక్యుమెంటరీ వ్రాయాలి అనుకుని వెంటనే మన రాష్ట్రానికి వచ్చాడు. ఆరోజు రెస్ట్ తీసుకుని ఏ దేవాలయానికి వెళ్తే ఇన్ఫర్మేషన్ సరిగా వస్తుందో తర్జన భర్జనలు పడి హోటల్ ఓనర్ కి  

విషయం చెప్పి అడిగితే మామూలు రోజుల్లో ఎక్కువ గా రద్దీ వుండని. ఈ మేధావికి కావలసిన సరైన సమాచారం ఇచ్చే జ్ఞాని అయిన పూజారి వుండే శివాలయానికి వెళ్ళమని చెప్పాడు.


మర్నాడు తీరికగా హోటల్ ఓనర్ చెప్పిన శివాలాయనికి ఆ మేధావి డాక్యుమెంటరీ కోసం వచ్చాడు.. అక్కడ పూజారి గారు ఎర్ర పట్టువస్త్రం లాటిది కట్టుకుని వున్నారు.. ఆ ప్రక్కన మరో భారీకాయం టేబుల్ దగ్గర కుర్చీ లో కూర్చుని ఉన్నాడు. ఆ ప్రక్కన రెండు చేతులకి 10 ఉంగరాలు పెట్టుకుని మరో భారీ కాయం ఉంది.. భక్తులు వస్తున్నారు ఆ రెండో భారీ కాయం అప్పుడప్పుడు వచ్చే భక్తులపై ఏవేవో అరుస్తున్నాడు.. 

 

భక్తుల రద్దీ అయిన తర్వాత మన మేధావి పూజారి గారిని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్ళాడు.. ఇంగ్లీష్ భాష లో మీతో చిన్న ఇంటర్వ్యూ కావాలి అన్నాడు...పూజారి గారు యం ఏ చదువుకున్నారు. ఒంటి గంటకి ఫ్రీ అవుతాను వీళ్లిద్దరూ కూడా వెళ్ళిపోతారు వైట్ చెయ్యండి అని ఇంగ్లీష్ భాష లో చెప్పి దర్శనం చేయించి తీర్థం ఇచ్చి శఠగోపం పెట్టేసారు..  

అది మొదటి భారీ కాయానికి అర్ధం కాలేదు..రెండో భారీ కాయం హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాట్సాప్ లో ఎదో చూస్తున్నాడు ..మొదటి భారీ కాయం ఏంటట అని గర్జించాడు. అబ్బే ఏమీ లేదు చిన్న ఇంటర్వ్యూ కావాలట అని పూజారిగారు చెప్పారు, దానికి ఆ భారీ కాయం ఇక్కడ ఇంటర్ చదివే వాళ్ళు ఎవరూ లేరని చెప్పండి. ఈ లోపల ఒంటి గంట అయ్యింది ఆ రెండు భారీ కాయాలు సాయంత్రం 5 గంటలకు వస్తాం అని చెప్పి తమ స్వంత కార్లలో 

వెళ్లిపోయారు.. పూజారి గారు గర్భ గుడికి తాళం వేసి గుడి ఆవరణ ల్ ఓ చల్లని చెట్టు క్రింద బెంచి పై ఆ మేధావిని కూర్చోబెట్టి తాను కూర్చుని ఇప్పుడు అడగండి మీకు ఏం కావాలో అన్నారు.. అప్పుడు మేధావి సార్ మీకు భక్తులు డబ్బు, కానుకలు చాలా ఇస్తారు అవి దేముడు మీరు ఎలా పంచుకుంటారు అని అడిగుతూ పూజారి గారిని నిశితంగా పరిశీలించాడు. పూజారి గారు బాగా బక్కగా ఉన్నా మంచి ఆరోగ్యం తో వున్నాడు.. 


భక్తులు డబ్బులు, కానుకలు తెగ వేస్తారు. అసలు ఆడబ్బంతా ఏమి చేస్తారు? అని అడిగాడు మేధావి పూజారిగారిని. 

పూజారి గారు డబ్బు, కానుకలు అని పేలవంగా ఓ నవ్వు నవ్వాడు.. అది పూర్వ వైభవం నాయనా గుళ్ళకి మాన్యాలు ఉండేవి రాజులు పూజారులకి ఎకరాలు పొలాలు ఇచ్చేవారట. ఇప్పుడు చాలామంది పూజారులకి రోజు గడవడం కష్టంగా ఉంది నాయనా అన్నారు.  


ఇంటరెస్టింగ్ గా ఉంది విపులం గా చెప్పండి అన్నాడు మేధావి. డబ్బు, కానుకలు ఒకప్పటి మాట నాయనా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు..నేను ఎం ఏ చదివాను ఉద్యోగం కూడా వచ్చింది ఈ అర్చకత్వం అనువంశికం గా వస్తోంది మా నాన్నగారు ఓ 40 ఏళ్ల క్రితం చనిపోవడం వల్ల నాన్నగారి భాద్యత ఉద్యోగం వదిలి నేను తీసుకున్నాను.. ప్రస్తుత పరిస్థితి లో ప్రతీ గుడి కి పాలక మండలి ఉంటుంది ఈ గుళ్లు పై వచ్చే ఆదాయ పర్యవేక్షణ కి ఓ ప్రభుత్వ శాఖ ఒకటి ఉంటుంది. ఆదాయం ఉన్న ఏ గుడి అయినా ఆ ప్రభుత్వ శాఖ ఆధీనం లో కి వచ్చేస్తుంది. ఇందాక గుడిలో పది ఉంగరాలు పెట్టుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాఁట్సప్ చూస్తున్నవాడు ఆ ప్రభుత్వ శాఖ ఉద్యోగి. వచ్చిన భక్తులని డబ్బులు కానుకలు హుండీ లో వెయ్యండి అని గదమాయిస్తూ ఉంటాడు. ఇప్పటి దాకా ఎంత మింగాడో వాడికే తెలియదు. ఉద్యోగం లో చేరిన క్రొత్తలో వాడికి సైకిల్ కూడా లేదు ఈ రోజు ఓ కారు మూడు ఫ్లాట్ లు ఉన్నాయి. రూల్ ప్రకారం భక్తులు పళ్ళెము లో వేసినవి మాకు చెందుతాయి హుండీ లో వేసినవి మాకు చెందవు. ప్రతీ భక్తుడు హుండీ లో నే కానుకలు వేసేలా చూడడమే వాడి కర్తవ్యం.దేవాలయాల ఆస్తులు వాటి పై వచ్చే రాబడి అవి ఇవి చూస్తుంటాడు ఇక భక్తులు పెద్దనోట్లు హుండీ లో వేసి చిల్లర,దొంగ నోట్లు చిరిగి అతికించబడిన నోట్లు మా పళ్లెం లో వేస్తారు..ఓ అరవై మంది పేర్లు చెప్పి అర్చన చేయిస్తారు కానీ సర్వే జనాః సుఖినో భవంతు అని ఒక్కడూ అడగడు. ఒకవేళ ఎవరైనా దైర్యం గా పెద్ద నోటు పళ్లెం లో వేస్తే అది వీరు చూస్తే ఆ రోజు మాకు నరకమే… ఇక ఎవరైనా భక్తులు అమ్మవారికి ఖరీదైన చీర పెడితే ఆ ప్రభుత్వం నియమించిన ఉద్యోగి తన కర్తవ్యం మర్చిపోయి ఆ చీరని లటుక్కుమని మాయం చేస్తాడు.. ఇక మొదటి భారీకాయం పాలక మండలి చైర్మన్,, సారా కాంట్రాక్టర్.. భక్తులు ఇచ్చిన బంగారు ఆభరణాలు ఈయన ఇంట్లో నే ఉంటాయి. ఏదో ఉత్సవాలకు మాత్రామే బయటకు వస్తాయి..  

 

ఇక అన్నీ వేలం పాట లే. గుడిముందు కొబ్బరి కాయల దుకాణం నించి ప్రతీది వేలం వేస్తారు.. టిక్కట్లు అమ్మకం లో కుంభకోణాలు, ప్రసాదం కౌంటర్ లో కుంభకోణాలు. అమవారికి భక్తులు పెట్టే చీరలు జాకెట్ ముక్కలు కూడ వేలం వేస్తారు.. 

చివరికి భక్తులు కొట్టే కొబ్బరి కాయ కి కూడా వేలం పాటే. కాయలో క్రింద సగం భక్తుడు కి ఇవ్వాలి. పై భాగం ఎవరో హోటల్ వాళ్ళు వేలం పాడుకుంటారు. ఆ సగం చిప్ప కూడా మాకు దక్కదు.. చాలీ చాలని జీతం ఇస్తారు, అందులోనే నైవేద్యం మేమే వండాలి

ఈ పూజరిని ఎలా ఎప్పుడు పీకేయ్యాలా, మనకి అనుకూలం గా ఉండేవారిని ఎలా పెట్టుకోవాలా అని ఆలోచిస్తారు.. ఆ ప్రభుత్వ ఉద్యోగి మా చేత చెప్పులు కూడా మోయిస్తాడు. దొంగ తనాలు అంటకడతారు కొందరు పూజారులు వీళ్ల టార్చెర్ భరించలేక ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.. నాయనా.

 

గత కొన్ని సంవత్సరాలుగా భక్తులు పరాయి రాష్ట్ర దేముళ్లపై పడుతున్నారు.. చిన్న దేవాలయాల పరిస్థితి ఘోరం గా తయారయ్యింది.. రామాలయాలు వీళ్ళకి శ్రీరామనవమి నాడే గుర్తుకువస్తాయి. రామాలయం లో పని చేసే పూజారుల పరిస్థితి మరీ ఘోరం.. ఈ సందు చివరన ఉంది అక్కడికి కూడా ఓ సారి వెళ్లి చూడండి.

 

మధ్యలో మేధావి.. మరి ఎలా బ్రతుకుతున్నారు.. 

 

నమ్ముకున్న దేముడిని పూజారి వదిలే ప్రసక్తి లేదు.

కొంచెం ఆయుర్వేదం, హోమియోపతి, జాతకాలు, వాస్తు జ్ఞానం ఉంటుంది భక్తుల కు నమ్మకం ఎక్కువ.

పల్లెటూళ్ళలో ఎవరికైనా జ్వరం వస్తే ముందు గుడి పూజారి దగ్గర కే వెళ్లేవారు ఆయన నేర్చుకున్న వైద్య జ్ఞానం తో మందు ఇస్తారు.. కొందరు భక్తులు పూజారి కి ఇస్తే మంచిది అని భావించి మాకు గుప్తం గా సాయం చేస్తుంటారు.. 

 

దారుణం ఏమిటంటే 1983 నించి కంచె లా దేవాలయాలని కాపు కాయవలసిన ప్రభుత్వమే దేవాలయాల ఆస్తులపై పడుతోంది.. 

 

దేముడి సొమ్ము తినే ఎవరైనా సరే ఆఖరికి పొందేది అధోగతే..


మరి ఇవన్నీ చూసి మీ దేముడుకి కోపం రాదా ఆయన ఏమీ చెయ్యడా.. అని మేధావి అడిగారు.. 

 

మంచి ప్రశ్న వేశావు నాయనా.. నీకు కోట్ల ఆస్తి ఉంది లేక లేక నీకు ఓ కొడుకు పుట్టాడు. వాడికి నువ్వు వాడి ప్రధమ జన్మదినానికి ఓ 10 లక్షలు పెట్టి చైన్ చేయించి మెడలో వేస్తావు, ఓ 5 లక్షలు పెట్టి వజ్రాల ఉంగరం చేయించి వెలికి పెడతావు. ఓ 10 వేలు పెట్టి బట్టలు కొని వేస్తావు. బర్త్ డే పార్టీ కి పుర ప్రముఖుల్ని పిలుస్తావు సాయంత్రం పార్టీ పెడతావు.. 

అందరూ వస్తారు. బుగ్గలు నిమిరి ముద్దులు పెడుతుంటారు. కానీ వాడి కళ్ళు ఎవరి కోసమో వెతుకుతూ ఉంటాయి.. నువ్వు చేయించిన బంగారం కానీ వజ్రాల ఉంగరాలు కానీ 10 వేలు పెట్టి కొన్న బట్టలని వాడు పట్టించుకోడు.. పార్టీ కి పెద్ద వాళ్ళు వస్తారు అని ఎక్కడో రూమ్ లో బంధించబడిన రోజూ తనతో ప్రేమగా ఉంటూ తనని ఆడించే లాలించే తాతా నానమ్మ, తోటమాలి ల కోసమే వాడి కళ్ళు వెతుకుతుంటాయి.. ఆ విధం గానే దేముడు కూడా తనే లోకం గా బ్రతికే భక్తుల కోసమే ఎదురు చూస్తుంటాడు. ఈ మాన్యాలు, ఆస్తులు ఆభరణాలు ఆయన పట్టించుకోడు.. నీ ఆనందానికి నువ్వు నగలు గట్రా చేయిస్తున్నావు, ఆయన ఏన్నడూ నాకు ఫలానా ది కావాలి అని అడగడు.. ఆయన సృష్టించిన వాటిని ఆయనకే ఇవ్వడం ఏమిటి.. మీ దేముడు ఏమీ చెయ్యడా అని ఆడిగావు మా అమ్మవారు ఊరికి కాపలా కాస్తూ ఉంటుంది. అయ్యవారు స్మశానం లో కూర్చుంటాడు.

ఎవరు పోయినా బంధు, మిత్ర జనం స్మశానం వరకే వస్తారు అక్కడ నించి అయ్యవారు చూసుకుంటారు..అని చెప్పారు.. ఈ లోపల పూజారి గారు పులిహోర చక్రపొంగలి ఆ మేధావికి పెట్టి మంచినీళ్ళు ఇచ్చారు. 

 

మేధావి మస్తిష్కాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన మేఘం ఆవరించింది..

 

మరి మీ దేముడికి వీళ్ళు మంచివాళ్ళు కాదు నా సొమ్ము తినేస్తారు అని ముందే తెలియదా అని అడిగాడు.. 

 

చూడు నాయనా దైవ వాసన లేనిదే ఆయన ప్రమేయం లేకుండా ఆయన సన్నిధి లో ఉండటం ఎవరికీ సాధ్యం కాదు.. పైగా దేముడు ఎవరి ఋణమూ ఉంచుకొడు.. వీరు గత జన్మలలో ఉత్సవాలలో పల్లకీ లు మోసే వాళ్ళో, త్యాగరాజు అన్నమాచారి కీర్తనల కచేరీ లో వెనక నించి చిడతలు, సన్నాయి, తాళాలు వేసే వారో రకరకాలైన దైవ సేవలలో పాలు పంచుకున్నవారో అయ్యివుంటారు వారు సేవ చేశారు, దానికి ఫలం ఈ విధం గా ఇచ్చాడు. ఈ సదవకాశాన్ని ఇప్పుడు వారు దుర్వినియోగం చేసుకుంటున్నారు.. 

 

మరి ఉత్తమ మార్గం లో కి పోవాలంటే ఏమి చెయ్యాలి అని మేధావి అడిగాడు.. 

 

బాబూ ముందు తల్లి తండ్రులకి సేవ చెయ్యాలి..

మానవసేవ ని మించింది లేదు.. ప్రతిఫలం మీద కోరిక లేకుండా, తిండి లేనివాడికి అన్నదానం, చదువుకునే స్తోమత లేనివారికి విద్యాదానం లాటివి చేస్తే ఉత్తమ మార్గం లో కి వెళ్లడం సాధ్యం అని చెప్పారు పూజారి గారు. 

 

మేధావి లేచి బ్యాగ్ లోంచి పూజారిగారికి ఇవ్వడానికి చాలా డబ్బు తీశాడు.. పూజారిగారు అది నాకు వద్దు. మా అబ్బాయి బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్నాడు నాకు డబ్బు.పంపిస్తున్నాడు. ఈ సందు చివర రామాలయం ఉంటుంది ఆ ప్రక్కనే పాక లో పూజారిగారు వుంటారు. 

 

రామాలయ పూజారుల పరిస్థితి అంతగా బాగోలేదు. ఆయన చాలా ఆర్ధిక ఇబ్బందులతో వున్నారు. ఆయనకి ఇమ్మని చెప్పారు. 

 

ఆయన చెప్పిన విధంగా నే ఆ సందు చివర రామాలయం ప్రక్కన ఉన్న పాకలోకి మేధావి వెళ్ళాడు. అక్కడ ఇంట్లో పరిస్థితి చూసి నేను చాలా పోరబాటుగా ఆలోచించాను అనుకుని వృద్ధ పూజారి గారిని కలిసి జరిగినది అంతా చెప్పి నాకు ఇంకా జ్ఞానం కావాలి అని మేధావి అడిగాడు.


ఆయనకు ఆయన ఆర్ధిక సమస్యలు అన్నీ తీరిపోయి సుఖం గా బ్రతకడానికి సరిపోయే డబ్బు ఆయన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఆతిధ్యం స్వీకరించాడు. పూజారిగారు నా కష్టాలు చూసి రాముడే ఈయనని ఈ విధం గా పంపాడు అనుకున్నాడు.. మేధావి గారు పూజారి గారిని కదిలిస్తే ఆధ్యాత్మిక విషయాల మీద చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది 

 

నువ్వు కాశీ ఒక్కసారి వెళ్ళు అక్కడ నీకు అంతా తెలుస్తుంది అని చెప్పారు రామాలయం పూజారిగారు.

ఒక్క రోజులో ఒక చిన్న సంభాషణ ఒక పెను మార్పు తెచ్చింది. ఇంతమంది జ్ఞానులు చుట్టూ వున్నారు వివిధ రకాలైన మాధ్యమాలద్వారా జ్ఞానం మనచుట్టూ పారుతూనే ఉంటుంది.. అయినా మన జ నాలలో మార్పు ఎందుకు రాదో ఎవరికీ అర్థం కాని ప్రశ్న…..

ఇది మన పూజారుల పరిస్థితి .


నువ్వు కాశీ ఒక్కసారి వెళ్ళు అక్కడ నీకు అంతా తెలుస్తుంది అని చెప్పారు రామాలయం పూజారిగారు.

 

సత్యాన్వేషణ కోసం మేధావి కాశీ వెళ్ళిపోయాడు.. (శంకరకృప ఆధ్యాత్మిక పత్రికనుంచి సేకరణ )


                                ------------ శుభO ---------------

సూర్యోదయ వర్ణన*

 🌹💐🌹💐🌹💐🌹💐🌹💐

           *సూర్యోదయ వర్ణన*


ప్రాగ్దిశాకన్యకాఫాలభాగమునందు

               సిందూరతిలకమ్ము చేర్చినట్లు

సాగరామలనేత్రి చంచలకెరటాల

               భృకుటిలో పెంగెంపు వెల్గినట్లు

తొలిచూలుటెలనాగ జ్వలితసీమంతాన

               కుంకుమాన్వితరేఖ గూర్చినట్లు

భూమాతనుదిటిపై భువనతాతామోద

               చుంబనాచిహ్నంపు బింబమట్లు

హనుమ పండుగా భావించి యారగింప

భ్రమలు గొల్పిన సూర్యుండు ప్రభలనీనె

తూర్పుటబ్ధిని శోభలన్ మార్పు గలుగ

దివము మొదలయ్యెనని దెల్ప భవహరుండు

✍️శ్రీశర్మద

(పెను+కెంపు=పెంగెంపు; భువనము=ఆకాశము;)

శ్రీమద్వాల్మీకి రామాయణం



ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 


(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం)

                ----------------------- 


          5. పరిపాలనా విధానం 


     ప్రజలకి చక్కని పరిపాలన అందించాలంటే పాలకులకు ఉండవలసిన ముఖ్య లక్షణాలు తెలిసికోవలసిన అవుసరం ఎంతైనా ఉంది. 

    రాజదోషాలుగా పరిపాలకునకు ఉండకూడని పదునాలుగు లక్షణాలు, 

    సమయంతో కూడిన ఆధారమూ, 

    చర్చలూ, 

    నివేదికలూ, 

    మానవ వనరులూ, 

    నేరాలూ - శిక్షలూ, 

    సామాజిక సమానతా అనే ప్రధాన విషయాలతోపాటు అనేకం శ్రీమద్రామాయణంలో పరిపాలనా సంబంధ విషయాల ద్వారా తెలుస్తాయి. 


పదునాలుగు రాజదోషాలు


* నాస్తికత్వము, 

* అబద్ధమాడడం, 

* క్రోధం, 

* ఏమరుపాటు, 

* కర్తవ్యాన్ని ఉపేక్షిస్తూ కాలయాపన, 

* జ్ఞానులను దర్శించకుడడం, 

* సోమరితనం, 

* పంచేద్రియాలకు వశుడవడం, 

* రాచకార్యాలపై మంత్రులతో చర్చించక తానొక్కడే ఆలోచించడం, 

* విషయాలపై అవగాహన లేనివారితో సమాలోచన, 

* నిశ్చయించిన పనులను వెంటనే ప్రారంభించకుండుట, 

* రహస్యాలను దాచకుండడం, 

* మంగళకరమైన ఆచారాలను పాటించకపోవటం, 

* పెక్కుమంది శత్రువులపై ఒకే సమయంలో దండెత్తడం        

   - అనే పదునాలుగు రాజదోషాలనీ పరిత్యజించాలని శ్రీరాముడు భరతునికి ఉపదేశించాడు. 


ఆధారం - సమయం 


* ధర్మాచరణానికీ, 

* అర్థార్జనకూ,

* కామానుభవాలకూ సముచిత సమయాలను విభజించుకొని, 

     తగిన సమయాలలో ధర్మార్థకామాలను నడుపుతున్నావా? 

  - అని భరతుని అడుగుతున్నట్లుగా సందేశమిస్తాడు శ్రీరాముడు. 


  - ధర్మము చేత అర్థమునుగానీ, 

  - అర్థముచేత ధర్మమునుగానీ, 

  - అధిక సుఖాసక్తుడై - కామముచేత ధర్మార్థములనుగానీ బాధించరాదని కూడా ఆ సమయంలోనే సందేశమిస్తాడు. 


చర్చలు 


    రహస్య లోచనలని 

  - ఒక్కడే ఆలోచించకూడదనీ, 

  - పెక్కుమందితో కూడా మంత్రాంగం నడుపకూడదనీ చెప్పబడింది. 


    రాజనీతి శాస్త్రాన్ని అనుసరించి ముగ్గురు లేక నలుగురు మంత్రులతో 

  - విడివిడిగా గానీ లేక 

  - అందఱితో కలసి గానీ రహస్య సమాలోచనలని చేస్తూండాలనీ, 

    రహస్య చర్చలు రాజ్యాన్ని దాటి పోకూడదనీ రామాయణం సూచిస్తుంది. 


నివేదికలు 


* విధులు బాగా ఎఱిగినవారూ, 

* ప్రతిభాశాలురూ, 

* ఋజువర్తనులు అయినవారూ, 

    కార్యాలని నిర్వహింపచేయడానికి నియుక్తులై, 

  - చేయబడిన కార్యాలనుగూర్చీ, 

  - చేయవలసిన కార్యాలనుగూర్చీ, 

      ఎప్పటికప్పుడు పరిపాలకునికి నివేదించాలని చెప్పబడింది. 


మానవ వనరులు 


  - ఉన్నతశ్రేణి ఆలోచనకి చెందినవారిని గొప్ప కార్యాలకూ,   

  - మధ్యస్థాయికి చెందిన వారిని సామాన్య కార్యాలయందునూ, 

  - నిమ్నస్థాయి ఆలోచనాపరులను అథమ/స్వల్ప కార్యాలయందునూ నియమించాలని తెలుపబడింది. 


నేరాలూ - శిక్షలూ - సమాన న్యాయం 


    శ్రీమద్రామాయణం "నేరాలూ - శిక్షలూ - సమాన న్యాయం" అనే అంశాలపై స్పష్టంగా నిర్వచించింది. వాటిలో కొన్ని తెలపబడుతున్నాయి.  


అ) నిర్దోషులు అసత్యాలైన నేరారోపణలకు గుఱైనప్పుడు, రాజు వాస్తవాలను తెలిసికోకుండా, "తనకు తిరుగులేద"ని తన ఇష్టంవచ్చినట్లు ఆ నిరపరాధులను శిక్షించరాదు. 


ఆ) సజ్జనులు, ఉత్తమస్వభావులు త్రికరణశుద్ధికలవారు, 

    దొంగతనం వంటి నేరారోపణలకు గురైనప్పుడు, 

    న్యాయశాస్త్ర నిపుణులచేత లోతుగా విచారణ చేయించకుండానే లోభంతో వారికి శిక్షలు విధించకూడదు. 


ఇ) దీనికి విరుద్ధంగా దొంగతనం చేసే సమయాన చూడబడి, చౌర్యం చేసి పట్టుబడేవారూ, 

    అధికారులు ప్రశ్నించినప్పుడు దొరికిపోయినవారూ, 

    దొంగిలించిన ధనంతో చిక్కినవారూ, 

    ఇలా అనేక కారణాలచే నేరాలు ఋజువైనా, 

      అట్టి చోరులని ధనలోభంచే విడిచిపెట్టకూడదు. 


ఈ) ధనవంతుని విషయంలో గానీ, నిర్ధనుని విషయంలో గానీ, ఏదైనా ఒక వివాదం ఏర్పడినప్పుడు, 

    న్యాయశాస్త్ర నిపుణులు ధనలోభంతో గానీ, పక్షపాత బుద్ధితో గానీ వ్యవహరించకూడదు. 


      శ్రీమద్వాల్మీకి రామాయణంలో పరిపాలనా విషయమై ప్రస్తావించబడిన ముఖ్యమైన ఎన్నో విషయాలలో కొన్ని మనం ఇంతవరకూ పరిశీలించాం. 

    తద్వారా ఆదర్శ పరిపాలన వలన ప్రజలు సంపదలతో తులతూగుతూ, సుఖశాంతులతో ఆనందంతో న్యాయబద్ధంగా, ధర్మంతో జీవించే సమాజం మనకి కనిపిస్తుంది.


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము

 *25.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2302(౨౩౦౨)*


*10.1-1440-వ.*

*10.1-1441-*


*శా. ఆ పుణ్యాత్మునిఁ గౌఁగిలించుకొని నందాభీరుఁ డానంది యై*

*మా "పాలింటికిఁ గృష్ణు డీతఁ" డనుచున్ మన్నించి పూజించి వాం*

*ఛాపూర్ణంబుగ మంజులాన్నమిడి మార్గాయాసముం బాపి స*

*ల్లాపోత్సాహముతోడ నిట్లనియె సంలక్షించి మోదంబునన్.* 🌺



*_భావము: దరహాసచంద్రికలతో కూడిన సుందరవదనారవిందుడగు శ్రీకృష్ణుడు ప్రేమగా చేతిలో చేయి కలిపి కమ్మని కబుర్లు చెప్పి వీడుకోలు పలుకగా, ఉద్ధవుడు రథమెక్కి సాయంకాల సమయానికి నందవ్రజము చేరాడు. ఆ రథము, అడవిలో మేతమేసి తిరిగి వస్తున్న గోవుల గోధూళి చే కప్పబడియుండగా, నందుని నివాసానికి చేరాడు. పుణ్యపురుషుడగు ఉద్ధవుణ్ణి చూడగానే నందుని ప్రాణం లేచివచ్చింది, "మా కృష్ణుణ్ణి చూచినట్లే ఉన్నది", అనుకుంటూ అతనిని ప్రేమగా కౌగలించుకున్నాడు. మర్యాదపూర్వకంగా పూజించి రుచికరమైన భోజనము పెట్టి ప్రయాణ బడలిక తీరేటట్లు చేసాడు. ఆపై మధురమైన సరస సల్లాపములు, ముచ్చటలాడుతూ ఇలా అన్నాడు:_* 🙏



*_Meaning: The most beautiful Sri Krishna passionately held the hand of Uddhava in His and indulged in some chit chat and bid goodbye to him. Uddhava then went to Vrepalle on his chariot and reached the vicinity of Nandavraja by evening. As the cows were returning from their daily grazing schedule in the forest, the dust that rose from their foot movements covered the chariot of Uddhava while he reached Nanda's abode. Seeing Uddhava, the pious one, Nanda felt as if he could see his son SriKrishna, got up and embraced him, welcomed him with honour and regard. Therafter, he arranged for sumptuous tasty food and made him recover from the fatigue of long travel. Then he exchanged pleasantries with Uddhava and said to him further:_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

*శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం*

 *శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం*

🌸🌸🌸🌸🌸🌸


శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే

భోగింద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే

యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్



బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి

సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత

లక్ష్మీలసత్ కుచసరోరుహ రాజహంస

లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్


సంసారసాగర విశాల కరాళకామ

నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య

మగ్నస్య రాగలసదూర్మినిపీడితస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసారఘోరగహనే చరతో మురారే

మారోగ్రభీకర మృగ ప్రవరార్దితస్య

ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసారకూప మతిఘోర మగాధమూలం

సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య

దీనస్య దేవ కృపయా శరణాగతస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసారభీకర కరీంద్ర కరాభి ఘాత

నిష్పీడ్యమానవపుష స్సకాలార్దితస్య

ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసార సర్పవిషదుష్ట భయోగ్రతీవ్ర

దంష్ట్రాకరాళ విషదగ్ధ వినష్టమూర్తేః

నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసారజాలపతితస్య జగన్నివాస

సర్వేందియార్ధబడిశస్థ ఝుషాత్మనశ్చ

ప్రోత్తంభిత ప్రచురతాలుక మస్తకస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసారవృక్ష మఘబీజ మనంతకర్మ

శాఖాయుతం కరణపత్ర మనంగ పుష్పమ్

ఆరుహ్య దు:ఖ జలధౌ పతతో దయాళో

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసారదావ దహనాకుల భీకరోగ్ర

జ్వాలావళీభి రభిదగ్ధ తనూరుహస్య

త్వత్పాదయుగ్మ సరసీరుహ మస్తకస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసారసాగర నిమజ్జన మహ్యమానం

దీనంవిలోకయ విభో కరుణానిధే మామ్

ప్రహ్లాదఖేద పరిహార పరావతార

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసార యూథ గజసంహతి సింహదంష్ట్రా

భీతస్య దుష్టమతిదైత్య భయంకరేణ

ప్రాణప్రయాణభవభీతినివారణేన

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసారయోగి సకలేప్సిత నిత్యకర్మ

సంప్రాప్యదు:ఖ సకలేంద్రియ మృత్యునాశ

సంకల్ప సింధుతనయాకుచకుంకుమాంక

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


బద్ధ్వా కశై ర్యమభటా బహు భర్త్సయంతి

కర్షంతి యత్ర పథి పాశశయై ర్యదా మామ్

ఏకాకినం పరవశం చకితం దయాళో

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


అంధస్యమే హృతవివేక మహాధనస్య

చోరై ర్మహాబలభి రింద్రియనామధేయైః

మోహాంధకారకుహరే వినిపాతితస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో

యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప

బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


ప్రహ్లాద నారద పరాశర పుండరీక

వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస

భక్తానురక్త పరిపాలన పారిజాత

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ

మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్

వామేతరేణ వరదాభయహస్తముద్రాం

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


ఆద్యంతశూన్య మజ మవ్యయ మప్రమేయ

మాదిత్యరుద్ర నిగమాది నుత ప్రభావమ్

త్వాంభోధిజాస్య మధులోలుప మత్తభృంగం

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


వారాహ రామ నరసింహ రమాదికాంతా

క్రీడా విలోల విధిశూలి సుర ప్రవంద్య

హంసాత్మకం పరమహంస విహారలీలం

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


మాతా నృసింహశ్చ పితా నృసింహ:

భ్రాతా నృసింహశ్చ సఖానృసింహ:

విద్యా నృసింహో ద్రవిణం నృసింహ:

స్వామీ నృసింహ: సకలం నృసింహ:


ప్రహ్లాద మానససరోజ విహారభృంగ

గంగాతరంగధవళాంగ రమాస్థితాంగ

శృంగార సంగర కిరీటలసద్వరాంగ

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్



శ్రీశంకరాచార్యరచితం సతతం మనుష్య:

స్తోత్రం పఠేదిహ తు సర్వగుణప్రపన్నమ్

సద్యో విముక్త కలుషో మునివర్యగణ్యో

లక్ష్మీపతే: పద ముపైతి స నిర్మలాత్మా


యన్మాయ యార్జితవపు:ప్రచుర ప్రవాహ

మగ్నార్త మర్త్యనివహేషు కరావలంబమ్

లక్ష్మీనృసింహ చరణాభ మధువ్ర తేన

స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ


శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ

తాపత్రయోపశమనాయ భవౌషధాయ

తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ

క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే