25, మే 2024, శనివారం

సాధనాసప్తకం

 🌹సాధనాసప్తకం🌹


🔹🔸🔹🔸🔹🔸


పుట్టుక, ముసలితనం, మరణం... ఇవేవీ లేని ఆనందస్వరూపుడైన పరమాత్మను పొందడం ఎలా?*


ఉపాసనాత్మకమైన జ్ఞానం ద్వారా పొందవచ్చని "ముండకోపనిషత్తు" చెబుతోంది.*


వివేక, విమోక, అభ్యాస, క్రియా, కళ్యాణ, అనవసాద, అనుద్ధర్షాలు* అనే *సాధనాసప్తకములు* ద్వారా సాధ్యము. 


భగవంతునిపై భక్తి కలగడానికి ఉన్న ఏడు సాధనాలనే *‘సాధన సప్తకం’* అంటారు.


 *1. వివేకం :


జాతిని బట్టి గాని, ఆశ్రయాన్ని బట్టి గాని, నిమిత్తాన్ని బట్టి గాని దూషితం కాని సాత్త్విక ఆహారాన్ని తీసుకొని, మనస్సుకు శుద్ధి కలిగించుకోవడం వివేకం. *‘ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః’* అను శ్రుతి అంతఃకరణ శుద్ధికి పరిశుద్ధాహారాన్నే తీసుకోవాలని తెలుపుతుంది.


 గంజాయి, వెల్లుల్లి, మాంసము మొదలైనవి *జాతి దుష్టాలు.* 


 ఆచార హీనుల వద్ద ఉన్న వస్తువులను *ఆశ్రయదుష్టాలు* అంటారు. 


 ఎంగిలి, వెంట్రుకలు, కీటకాల వల్ల దూషితమైన ఆహారం *నిమిత్తదుష్టం* 


ఈ మూడు దోషాలు లేని ఆహారం తీసుకుంటే *సత్వగుణం* అభివృద్ధిచెంది మంచి చెడులు గుర్తించగల వివేకం కలుగుతుంది.


  *2. విమోకం :


భోగాలపై వ్యసన రూపమైన ఆసక్తి లేకుండా ఉండటం విమోకం.


  *3. అభ్యాసం :


నిరంతరం భగవత్‌ ధ్యానంలో ఉంటూ బాహ్య విషయాలను మరచిపోవడం అభ్యాసం చేయడం.


  *4. క్రియ :


తన శక్తిని అనుసరించి నిత్యం పంచమహా యజ్ఞాలు చెయ్యడం. అవి: 


 *దేవయజ్ఞం:* – 

హోమం, అర్చనలతో ఇష్ట దేవతారాధన. 


 *బ్రహ్మయజ్ఞం:*

సదా వేదశాస్త్రాధ్యయనం. 


 *పితృయజ్ఞం:*

మాతాపితలకు సేవలు చేయడం. 


 *మనుష్య యజ్ఞం:* 

అతిథి, అభ్యాగతులను ఆదరించడం.


 *భూతయజ్ఞం* 

గోవులు, తదితర జంతుజాలానికి ఆహారమివ్వడం వీటినే *‘క్రియా’* అంటారు.


 *5. కల్యాణం:*

కల్యాణాలనబడే - (పంచ మహోత్సవములను)  సద్గుణాలను కలిగి ఉండటం. 


*"సత్యార్జన దయాదానాహింసా నభిద్యాః కల్యాణాని"*


  *సత్యం* 

సర్వ ప్రాణులకు హితకరమైన యదార్థ వచనం. 

 *ఆర్జవం*

మనోవాక్కాయాలలో ఏకరూపమైన ప్రవృత్తి.

 *అనభిద్యః*- 

పరుల ఆస్తులను దొంగిలించకుండా ఉండటం, 

*అహింస,* *దయ* ఇత్యాది గుణాలను కలిగి ఉండాలి.


 *6. అనవసాద:*  

ఎటువంటి పరిస్థితుల్లోనూ దైన్యం అంటే మానసిక నిరుత్సాహం లేకుండా నిత్య నూతన ఉత్సాహంతో ఉండటం అనవసాదం. 


 *7. అనుద్ధర్షః:* 

సంపదలు పెరిగాయనో, మహోన్నత పదవి లభించిందనో, జ్ఞానమో, రూపమో, గుణములో తమలో ఎక్కువగా ఉన్నాయనే భావనలతో 

అతిగా సంతోషమును పొందకపోవడం.


ఈ సాధనాసప్తకం ముముక్షువులకు నిశ్చల భక్తియోగాన్ని ప్రసాదిస్తుంది.


⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️

శ్రీ రామ జయ రామ జయజయ రామ

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

సంకష్టహర చతుర్థీ

 *కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ అభీష్ట గణపతి పంచాయతన మూర్తయే నమః*

 రేపు (26-6-24) క్రోధి నామ సంవత్సర వైశాఖ బహుళ తృతీయా సంధ్యాకాల చతుర్థి, అనగా *సంకష్టహర చతుర్థీ మహాపర్వం*  సంకష్టహర చతుర్థి నాడు విఘ్నేశ్వరుడు మన సంకటములన్నీ తొలగించి కార్యసిద్ధి ని కల్గించును.

  రేపు ఉదయం 7 గంటలకు రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారం లో సుప్రతిష్ఠితమైన మన కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ అభీష్ట గణపతి పంచాయతన మూల మూర్తులకు న్యాసపూర్వక రుద్రాభిషేకం మరియు సాయంత్రం 6గంటలకు పల్లకీ సేవ నిర్వహించబడును. ఈ కార్యక్రమాలలో

 లో ప్రత్యక్షంగాగానీ పరోక్షంగా గానీ పాల్గొని స్వామి వారి అనుగ్రహం తో సంకటహరణమొంది కార్యసిద్ధిని పొందగలరు.

 ఈ కార్యక్రమం లో గోత్రనామాలు చెప్పించుకొనదలచినవారు 9492050200 కు వారి గోత్ర నామాలను వాట్సాప్ చేయగలరు.

*అభీష్ట గణపతి ఆలయ ట్రస్ట్*

శ్రీ హిడింబేశ్వరఆలయం

 🕉 మన గుడి : నెం 328


⚜ కర్నాటక  :- చిత్రదుర్గ 


⚜ శ్రీ హిడింబేశ్వరఆలయం


నాటి ఘటోత్కచుని ఆశ్రమం నేటి చిత్రదుర్గ



💠 అందంగా పరిచినట్టుండే రాళ్ళు, కొండలతో ప్రకృతి సోయగాలు నింపుకున్న చిత్రదుర్గ చూసి తీరవలసిన ప్రదేశం. 

చారిత్రక కాలంలో ఈ నగరం విజయనగర సామ్రాజ్యంలో వెలుగొందిన ప్రాంతం. విజయనగర చరిత్రలో ఈ చిత్రదుర్గకి సామంతులు , అమిత పరాక్రమ వంతులు అయిన నాయకరాజుల ఏలుబడిలో ఈ నగరం అత్యంత సుందరంగా ఏడు చుట్ల ప్రాకారంలో, శిల్ప కళానైపుణ్యంతో నిర్మించబడింది.


🔆 కోటలో దేవాలయాలు


💠 ఎగువ కోటలో 18 దేవాలయాలు నిర్మించబడ్డాయి. 

 ప్రసిద్ధ దేవాలయాలలో కొన్ని హిడింబేశ్వర , సంపిగే సిద్దేశ్వర, ఏకనాథమ్మ, ఫాల్గుణేశ్వర, గోపాల కృష్ణ, హనుమాన్ , సుబ్బరాయ మరియు నంది ఆలయాలు.  


💠 ఈ దేవాలయాలలో, పురాతనమైనది మరియు అత్యంత ఆసక్తికరమైనది హిడింబేశ్వర దేవాలయం. 


💠 ఈ ఎత్తైన కోటలో సిద్దేశ్వర, హిడింబేశ్వర, ఏకనాథేశ్వరి, ఫాల్గుణేశ్వర, గోపాలకృష్ణ మూర్తుల విగ్రహాలు నిర్మించారు. 

ఇక దీని పౌరాణిక కథనం ప్రకారం మహాభారత కాలంలో హిడింబాసురుడు, అతని చెల్లెలు హిడింబ ఈ కొండ మీద ఉన్న గుహల్లోనే ఉండేవారు. 

హిడింబాసురుడు తన రాక్షస ప్రవృతిలో అందర్నీ హడలెత్తించేవాడు. కానీ రాక్షస కులంలో ఈతనికి చెల్లెలుగా పుట్టినా హిడింబ మాత్రం శాంత స్వభావురాలు. 


💠 లక్క గృహ దహనం అయిన తరువాత పాండవులు తల్లి కుంతితో సహా ఈప్రాంతానికి చేరుకున్నారు.

ఇక్కడ హిడింబాసురుడికీ, భీమసేనుడికి జరిగిన ఘోర యుద్ధంలో హిడింబాసురుడు అసువులు బాసాడు. 

భీముని పరాక్రమానికి ముగ్ధురాలైన హిడింబి భీమసేనుణ్ని వివాహం చేసుకుంది. 

ఆ క్రమంలో కొంతకాలం పాండవులు ఇక్కడే ఉండి హిడింబి పరిచర్యల్లో సంతోషంగా కాలం గడిపారు. 

తరువాత భీముడికీ, హిడింబికీ ఒక మగ శిశువు జన్మించాడు. 

అతడే ఘటోత్కచుడు. 

ఈ సన్నివేశాలన్నీ జరిగిన రమణీయ ప్రదేశం ఈ చిత్రదుర్గ.


💠 ఒకనాటి విజయనగర సామ్రాజ్యాధినేత దగ్గర పనిచేసిన తిమ్మన నాయకుడు, తన దక్షతతో, సామ్రాట్టుని గుర్తింపు పొంది ఈ నగరానికి మండలాధీశుడుగా పదోన్నతిని పొందాడు. అతని నిజాయితీ, కార్యదక్షతకీ మెచ్చిన విజయనగర ప్రభువు నాయకుని రాజుగా ప్రకటించాడు. నాటి నుండీ ఈ నగరం నాయకుల ఏలుబడిలోకి వచ్చింది.

 ఆ తరువాత 1588 ప్రాంతంలో ఈతని

కుమారుడు ఒబనా నాయకుడు రాజయ్యాడు. ఈతని తరువాత ఈతని కుమారుడు కస్తూరి రంగప్ప 1602 ప్రాంతంలో రాజై ప్రజల్ని శాంతి సుఖాలతో ఉండేలా చక్కని పరిపాలన అందించాడు. 

అప్పటికే ఈ నగరం చాలా అభివృద్ధి చెందింది. కస్తూరి రంగప్పకి సంతానం లేకపోవడంతో దత్తత తీసుకున్న కుర్రవాణ్ని పట్టాభిషిక్తుణ్ని కావించాడు.


💠 కానీ, దాయాదులు అతనిని రాజ్యభ్రష్టుని చేసి హత్యచేసారు. ఆ తరువాత 1676లో చిక్కన్న నాయకుని తమ్ముడు 2వ మదకరి నాయకుడు ఈ సింహాసనాన్ని అధిష్టించాడు. అతని తరువాత అతని తమ్ముడు 3వ మదకరినాయకుడు 1686లో రాజ్యాధిపత్యం వహించాడు. ఇలా అనంతంగా పౌరాణిక, చారిత్రక విజయపరంపరలతో కూడిన ఈ చిత్రదుర్గ నగరంలో చూడదగ్గ ప్రదేశాలున్నాయి. 


💠 కోటని మదకరినాయకుడు నిర్మించాడు. దీనినే కల్లిన కోట అనీ, కిన్న కోట అనీ, ఏలు సుట్టిన కోట అని కూడా పిలుస్తారు. 

దీని చుట్టూ ఏడు ప్రాకారాలు ఉండి, కోటలోపలి భాగంలో 18 దేవాలయాలు నిర్మించబడి ఉండి. 19 ద్వారాలు, 38 ప్రవేశమార్గాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాక ఇందులో రాజభవనం, మసీదు, రహస్యమార్గాలు, నూనె బంకులు కూడా మనం చూడవచ్చు.


💠 ఈ గుహల వెనుక భాగంలో అంకాళీ మఠం ఉంటుంది. ఇది ఇక పెద్ద రాతి కింద గుహమాదిరిగా ఉండి, అందులో పెద్ద పెద్ద శివలింగాలు ఉంటాయి. 


💠 సుమారు 3 మీటర్లు (9.8 అడుగులు) చుట్టుకొలత మరియు 2 మీటర్లు (6.6 అడుగులు) ఎత్తులో భేరి లేదా డ్రమ్ ఆఫ్ భీమా అని పిలువబడే ఇనుప పలకలతో తయారు చేయబడిన పెద్ద సిలిండర్ కూడా ఇక్కడ ఉంది.  ఈ ఆలయ ద్వారం వద్ద ఏకశిలా స్తంభం మరియు రెండు ఊయల ఫ్రేమ్‌లు కూడా కనిపిస్తాయి.  

సంపిగే సిద్ధేశ్వర దేవాలయం కొండ దిగువన ఉంది.  గోపాలకృష్ణ దేవాలయంలో, శాసనాలు 14వ శతాబ్దపు పూర్వపు విగ్రహం నాటివి.


💠 ఇది బెంగుళూర్ కు 202 కి॥మీల దూరంలో ఉన్న అతి సుందర పర్వత ప్రాంతం.

 ఆ రాష్ట్రంలో ఇది జిల్లా కేంద్రం కూడా, బెంగళూరు నుండి పూనా వెళ్ళే మార్గంలో ఉంటుంది ఈ నగరం.

Panchaag


 

Youtube లో

 Youtube లో ఎలాంటి ఛానల్స్ చూడాలి,subscribe చేసుకోవాలి ????..నిత్యం ఈ క్రింది ఛానల్స్ చూడటం వల్ల మన చరిత్ర,మన నాగరికత, మన సంస్కృతి, మన జీవనవిధానం, మన ఆరోగ్యం, మన కట్టుబాట్లు,ప్రస్తుత సమాజం లో ఎలా ఉండాలి.ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ క్రింది ఛానల్స్ చూడండి.

1) Nationalist hub (నేషనల్ హబ్)

2) Rakalokam (రాకలోకం)

3) Prem talks (ప్రేమ్ టాక్స్)

4) Bharatavarsha( భారత వర్ష)

5) Hindu jana shakti (హిందు జన శక్తి)

6) Shiva shakti (శివ శక్తి)

7) Govinda seva(గోవింద సేవ)

8) Krishna dharma rakshana( కృష్ణ ధర్మ రక్షణ)

9) Gopi sanathana sena( గోపి సనాతన సేన)

10) Hindu dharma kshetram( హిందూ ధర్మ క్షేత్రం)

11) Ram talk ( రామ్ టాక్)

12) Ithihasam (ఇతిహాసం)

13) Telugu defence news ( తెలుగు డిపెన్స్ న్యూస్)

14) Ayur mantra ( ఆయుర్ మంత్ర)

15) Telugu Hindu forum (తెలుగు హిందు ఫోరమ్)

16) Haindava sakti (హైందవ శక్తి)

17) Radha manohara Das(రాధ మనోహర్ దాస్)

18) Praveen mohan telugu ( ప్రవీణ్ మోహన్ తెలుగు)

19) Vikramaditya

( విక్రమాదిత్య)

20) Sri garikapati narasimha rao official( గరికo9oపాటి నరసింహ రావు)

21) Bhagavadgita foundation( 900l0 ఫౌండేషన్)p

22) Sreepeetam (శ్రీ 9oపీఠం)

23) gudla jagadhish madiga 

24) Telugu knowledge( telugu నాలెడ్జ్)

25) Learn Astrology in telugu

26) అమరా ప్రసాద్

27) ఎక్స్ ముస్లిం

28) ఎక్స్ క్రిస్టియన్

--------------------------------- ---

మీ స్నేహితులకు share చెయ్యండి.వీటిని youtube లో subscribe చేసుకొని నిత్యం చూడండి.

...............................................

తెలుగు చరిత్రలో

 తెలుగు చరిత్రలో అరుదైన జ్ఞాపకాలు..


 


జ్ఞాపకం అనే పదం దాదాపుగా దూరమవుతోంది. జ్ఞాపకం ఉండటం లేదు అనే మాట ఇటీవల కాలంలో చాలా చోట్ల వింటున్నాం. ఏ వస్తువు ఎక్కడ పెట్టామో ఎవరికీ గుర్తుండదు. ఎప్పుడు ఏ పని చేయాలో జ్ఞాపకం ఉండదు. ఇక జయంతుల మాట చెప్పనక్కర్లేదు. కుటుంబంలోని వారివైనా ఏదయినా ప్రత్యేకంగా అంటే పండుగ రోజుల్లో ఉంటేనే తప్ప జ్ఞాపకం ఉండదు. ఒక్కోసారి మన పుట్టినరోజు, మన పెళ్ళి రోజు కూడా జ్ఞాపకం ఉండదు.


                ఇలాంటి అయోమయమైన వాతావరణంలో తెలుగు భాషను ఉద్దరించిన ప్రముఖుల అభిమానిగా అంటూ తెలుగు భాషను తమదైన శైలిలో ఒక చరిత్రగా మార్చిన ఎందరో జయంతులను జ్ఞాపకం పెట్టుకుని వారందరిమీద తనకు కలిగిన భావాలను కవిత్వీకరించిన కవి మద్దాళి రఘురామ్‌ గారు ధన్యులు. కేవలం కవిత్వమే కాకుండా నాట్యం, బుర్రకథ, నటన, వీణ, చిత్రలేఖనం వంటి కళలకు ఎంతో కృషి చేసిన ప్రముఖుల జయంతులను కూడా గుర్తు చేస్తూ కవిత్వం రచించి, వారిని మరింతగా చిరస్తాయిగా నిలబడటానికి దోహదం చేసారు. ఒక కార్యకర్తగా, ఒక ప్రచురణ కర్తగానే కాకుండా కవిగా, సంపాదకునిగా తెలుగు భాషకు సేవలను చేస్తున్నారు మద్దాళి రఘురామ్‌ గారు.


                 ఈ కవితా సంపుటిపై ముగ్గురు ప్రముఖులు ముందుమాట రాసారు. రఘురామ్‌ గారి కవితా విశిష్టతను తెలియజేస్తూ, డా॥ కెవి రమణాచారి గారు, ఈ కవిత్వంలోని సొగసు, బహుముఖీనతల్ని తెలియజేస్తూ మాజీ ఉపసభాపతి గారైన మండలి బుద్ధప్రసాద్‌గారు, నాలుగున్నర దశాబ్ధాలుగా తెలుగువారిలో ఒక గౌరవనీయమైన స్థానం సంపాదించుకున్న సాంస్కృతికోద్యమం గా కిన్నెర ప్రస్ధానాన్ని తెలియజేస్తూ, రఘురామ్‌ గారిపైన చక్కని కవిత్వాన్ని రచించిన డా॥ ఎన్‌ గోపిగారు, ఇందరి మహనీయులను కవిత్వీకరించే సమయంలో  మనిషికి మనిషికి మధ్య కాలానుగుణంగా ఎదురయ్యే జీవిత సత్యాల్ని, కవి వ్యక్తీకరణలో వివరించిన  అక్షర సత్యాల్ని  కళ్ళకు కట్టినట్లు తెలియజేసిన డా॥ ఓలేటి పార్వతీశం గారు. వీరంతా ఆ గ్రంథానికి చక్కగా పలకరించారు. అవిచాలు కవి రఘురామ్‌ గారి కవితాభినివేశం ఎంతవరకు ఉందో అని చెప్పడానికి..


                వీరు రచించిన వెండివెన్నెల, వెన్నెల కన్నీరు, అక్షరాల కన్నీరు, తూకానికి కన్నీళ్ళు వంటి కవితా సంపుటాలు చదివాను. వీరి ప్రతి కవితా  ప్రామాణిక విలువలు కలిగివుంటాయి. ఒక వ్యక్తిని గురించి రాసేటప్పుడు కానీ, ఇతర వస్తువులపైన, సంఘటనలపైన స్పందించేటప్పుడు కానీ కేవలం విషయమే కాకుండా కవిత్వం ఉండేలా చూసుకోవడమే వీరి ప్రత్యేకత..


                వీరు రచించిన తెలుగు ప్రముఖుల అభిమానిగా అనే పేరుతో వెలువడిన వీరి గ్రంధంలో దాదాపు 36 కవిత్వాలున్నాయి. ఒక వ్యక్తిమీద కవిత్వం రాయడం కష్టం. ఎందుకంటే ఒక వ్యక్తిమీద కవిత్వం రాయాలంటే వారు నిత్యం కనిపిస్తూ ఉండాలి. లేదా వారు సాధించిన విజయాలు వినిపిస్తూ ఉండాలి.  ఈ రెండూ లేదంటే వారి గురించి తెలుసుకోవాలనే తపనతో అభ్యాసం చేసి ఉండాలి. నాకు తెలిసి ఆ తపన తోనే వీరు ఇంతమంది ప్రముఖులపై కవిత్వం రాసారనిపిస్తుంది. దీనికి తోడు కిన్నెర సంస్థ ద్వారా మనం చూడటానికి కూడా నోచుకోని ప్రముఖుల్ని కూడా సన్మానించుకోవడం, వారితో నిత్యం మాట్లాడుతూ ఉండటం, వారి వారి ఇండ్లకు వెళ్ళి వారితో చాలాసేపు ముచ్చటించడం ద్వారా కూడా వీరికి ఇంత కవిత్వం రాయడానికి కుదిరింది.


                రఘురామ్‌ గారు రచించిన ఈ కవితా గ్రంథంలో గురజాడ నుండి కందుకూరి, గిడుగు రామ్మూర్తి, పానుగంటి, బుచ్చిబాబు శ్రీ రాచకొండ, అడవిబాపురాజు, దేవులపల్లి, కొవ్వలి, పింగలి, ఆరుద్ర, జమున,  వంటి అనేక మంది ప్రముఖులపై వీరునటి జమున వరకు ఎవరి గురించి రాసినా నేను కవిత్వంతో చెబుతాను అంటారు రఘురామ్‌ గారు.. వీరు రచించిన ప్రముఖులపై మనకు కనిపించే కవితాంశాలు..


                 ‘‘ఎన్ని తరాలు మారినా చెదరనిది గురజాడ`అడుగుజాడ’


                ‘‘అతడు అక్షరంలా అనిపిస్తాడు ...‘‘తెలుగు భాషా వికాశాన్ని తీర్చిన వెన్నెల మడుగు’’ గిడుగు


                ఒక కాళిదాసు ఒక శ్రీనాధుడు కలిస్తే పానుగంటి’’


                ‘చిలకమర్తి రచనలన్నీ/ తెలుగు జాతి పక్షాన / తెరచిన గవాక్షాలు’’


                ఏ తరానికైనా నచ్చుబాబు’ అంటూ బుచ్చిబాబు


                ‘తెలుగు కథల కొండ` రాచకొండ’


                ‘బాపిరాజు పేరంటే ప్రజ్ఞకు తొలి అర్థం’’


                ‘నీ కృష్ణ పక్షం చదివాకా/ నేను కృష్ణశాస్త్రి పక్షమే’


                ‘‘వెయ్యి నవలల లోగిలి` కొవ్వలి’


                ‘నీవు తీర్చిన పతాకం/ నీ పార్థివ దేహంపైన దివ్య వస్త్రమై పరచుకుంది (పింగళి)


                ‘నమస్సుల మాలపట్టి/ నీ యశస్సు ముంగిట్లో నిలుచున్నాను.-విశ్వనాధ సత్యనారాయణ


                చేకూరి రామారావు గారిపై చేసిన అద్భుతమైన ప్రయోగం ‘ఆ కుర్చీ ఎప్పటికీ ఖాళీనే’ అని ఇప్పటికీ విమర్శ అంత చక్కగా చేసేవారే లేరని తెలియజెప్పే తీరు..


                ‘రంగు చూసినప్పుడల్లా/ నాకు అతడి జ్ఞాపకమే/ రేఖలు వంపు తిరిగినా/ నాకు అతడి జ్ఞాపకమే’’ అంటూ వడ్డాది పాపయ్య


                డా ఈమని శంకరశాస్త్రి ‘తీరమంతా నీరునిండినట్లు/ నీ ఒడిలో వీణ పరచుకుంది’


                ‘నటరాజ నామధేయం/ మీ శిరస్సుపై వెలిగే కీర్తి కిరీటం’


                ‘షేక్‌ నాజర్‌ అంటే / ఒక వ్యక్తి రూపానికి పెట్టిన పేరు కాదు/ బుర్రకథకు విశ్వరూపం’


                ఇక నటనలో అక్కినేని, తెలుగింటి అత్తగారు సూరేకాంతం, నృత్యంలో శోభానాయుడు, పుచ్ఛా పరబ్రహ్మ శాస్త్రి , ‘సూర్యోదయమా? చంద్రోదయమా? ఏమో కాలం తీర్పు చెప్పాలి’ అంటూ చిత్రకారుడు చంద్ర గురించి అభినవ సత్యభామ జమున గురించి అందరినీ తలచుకుంటూ.. వారిని అక్షర కిరీటంలో రత్నాల్లా పొదిగారు. నిజంగా వీరి ప్రయత్నం నిరంతరం నిలిచిపోయేది. నేడు పరుగుల ప్రపంచంలో ఎవరికి వారే మహా కవులము అనుకుంటున్న భావితరాలకు అందితే తమకు ముందు ఇంతమంది ప్రముఖులు ఉన్నారా అనే స్పురణకు వస్తుంది. నిజమైన కీర్తిలో శబ్ధం ఉండదు. నిజమైన కవిత్వంలో ప్రాసలుండవు. జీవన వాస్తవంలో ఉండేదంతా మానవత్వమే. మహనీయుల సుతిమెత్తని పదాల ప్రయాణమే.. అని నిరూపించిన ఈ గ్రంథ కవి మద్దాళి రఘురామ్‌ గారికి నా అభినందనలు..


 


ప్రతులకు:


కిన్నెర పబ్లికేషన్స్‌


ఫోన్‌: 9866057777


 


                                                                                                                                                శైలజామిత్ర

రామ్_కథ_దుబాయ్_లో_

 రామ్_కథ_దుబాయ్_లో_రెండు_రోజులు_సెలవు 

బాగేశ్వర ధామ్‌ ధీరేంద్ర శాస్త్రి దుబాయ్ చేరుకున్నారు, షేక్ సాహెబ్ రామకథను ప్రారంభిస్తున్నారు!

దుబాయ్ 22 నుంచి 26 వరకు సెలవు ప్రకటించింది.

 రామ్ కథకి...!  🙏🚩 GREAT INDIA 


 జై శ్రీ రామ్🚩

*గురు జీ కూడా దుబాయ్ షేక్‌ని స్వదేశానికి తిరిగి వచ్చేలా చేశాడు.  వావ్ సరదాగా గడిపారు 😍❤️🙏*


 *రాముడు 🚩 నమస్కారం*

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి

 దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి 

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత తెలియని తెలుగువారు వుండరు. నిజానికి పండిత పామరులకు ఎల్లప్పుడూ నాలుకమీద ఆడే సామెత ఇది.దీనిని సాధారణ సామాజిక అర్ధంలో యేమని అంటారంటే క్రమశిక్షణతో నిర్ణీత సమయంలో పనులు ముగించుకోవాలి. కాలం గడచినతరువాత వగచిన ప్రయోజనం లేదు. ఇంకా కొంచం వివరంగా చెప్పాలంటే ఏ సమయంలో చేయాల్సిన పనులు ఆ సమయంలోనే చేయాలి కానీ కాలయాపన చేయకూడదు. ఒక రైతు వర్షం రాగానే భూమి దున్ని పైరు వేయటానికి సిద్ధపడాలి, అదే కాలం దాటినదాకా కాలయాపన చేస్తే పైరు పండదు సరికదా పెట్టిన పెట్టుబడికూడా వృధా అవుతుంది. 

అసలు ఈ సామెత ఎలా పుట్టిందా అని ఆలోచిస్తే నాకు తట్టినది. పూర్వం కిరోసిన్ దీపాలు కూడా లేనప్పుడు అంటే అప్పుడు కరంట్ అస్సలు లేదనుకోవాలి. ఆముదంతో దీపాలు వెలిగించేవారట. చిన్న మట్టి ప్రమిదలో ఒకటో రెండో ప్రత్తివత్తులు వేసి ఆముదం పోసి దీపం వెలిగించేవారు. ఇప్పడు మనం దీపావళికి వెలిగిస్తున్నాము. అయితే ఆ దీపం ప్రమిదలో ఆముదం వున్నంతవరకు మాత్రం వెలుగుతూ ఉండేది. తరచూ దానిలోని ఆముదాన్ని చూసుకుంటూ రాత్రిపూట ఇంట్లో పనులు చేసుకునేవారు. అంటే వారు దీపం ఆరిపోకముందే అన్నీ పనులు ముగించుకొని మంచం మీదకు చేరాలి. అది వారి దిన చర్య. అంటే త్వర త్వరగా పనులు చేసుకోవాలి. ఈ సామెతను మనం ఆధ్యాత్మిక జీవితానికి చక్కగా అన్వయించుకోవచ్చు. 

ఈ ప్రపంచం మొత్తం వెలుగుతో నిండి వున్నది.  ఆ వెలుగు మనకు పగటిపూట సూర్యభగవానులద్వారా వస్తున్నదన్నది అందరకు  తెలిసిన సత్యం. వెలుగు ఉంటేనే ప్రతి వస్తువు ప్రకాశిస్తుంది. వెలుగుతోటె మనకు మనముందు వున్న కుండ కుండగా, గ్లాసు గ్లాసుగా, మనిషి మనిషిగా కనిపించుతున్నాడు. మరి ఆలా కనిపిస్తున్నది ఎవరికి అని ప్రశ్నిస్తే నాకు అని సమాధానం ఇస్తాము.  ఆ నేను ఎవరు అని ఆలోచించి మన మేధావులు మనకు ఇచ్చిన సమాధానం నాలో వున్న నేను ఆ నేను అనే ప్రకాశం వలననే నేను నేనుగా బాసిల్లుతున్నాను( తెలియపడుతున్నాను) ఆ ప్రకాశాన్ని మన ఋషులు ఆత్మ అని ఆ ఆత్మ పరమాత్మ అంశమని మనకు తెలియపరిచారు. మన ఉపనిషత్తులు కూడా ఈ సత్యాన్నే తెలుపుతున్నాయి. "అహం బ్రహ్మస్మి' అనే మహా వాక్యము ఇంకా 'తత్వమసి' అనే మహావాక్యాలు ఈ విషయాన్నే తెలుపుతున్నాయి. ఒక సూర్యుడు నీరు వున్న అనేక కుండలలో అనేక సూర్యుళ్ళలాగా ఎలా కనపడుతున్నాడో అదేవిధంగా ఒక పరమాత్మా అనేక జీవులలో అనేక ఆత్మలుగా మనకు గోచరిస్తున్నాడు. ఆ ఆత్మే జీవులలో (మనుషులలో) వెలిగే ప్రకాశం లేక దీపంగా మనం అభివర్ణించవచ్చు. ఆ దీపం ఎంతసేపు వెలుగుతూ వుండాలని నిర్ధారించే ఆముదము మనిషి ఆయుష్షు గా మనం తెలుసుకోవచ్చు. ఏరకంగా అయితే మనం ఇంట్లో దీపం ఆరిపోకముందే ఇంటి కార్యాలన్నీ చక్కదిద్దుకుంటామో అదే విధంగా జీవుడు తనలోని దీపం (ఆయుష్షు) ఆరిపోకముందు తన జీవన వ్యాపారాలన్నీ ముగించుకోవాలి. 

నేను పుట్టింది ఈ శారీరిక సుఖాలను, భోగాలను అనుభవించటానికి కాదు ఇవన్నీ శరీరానికి సంబందించినవి, మరియు తాత్కాలికమైనవి అని ఎప్పుడైతే సాధకుడు తెలుసుకుంటాడో అప్పుడు అతని మనస్సు నిత్యం సత్యము, శాశ్వితము అయిన పరబ్రహ్మ సుఖం వైపు మళ్లుతుంది. అది తెలుసుకున్న ముముక్షువు మోక్షార్ధి అయి సాధన చేసి జీవైక్యం పొందుతాడు. ఆ అద్వితీయ అనుభవానికోసం ప్రతి సాధకుడు కృషిచేయాలి. సాధనాత్ సాధ్యతే సర్వం.

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ భార్గవ శర్మ 

ప్రశ్న పత్రం

 ప్రశ్న పత్రం: కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి  

1) క్రింది ఖాళీలను పూరించండి 

_________నాస్తి దుర్భిక్షం!

2)"తెగేదాకా లాగకూడదు" అని ఏ సందర్భంలో ఉపోయోగిస్తారు.  

3)శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంధము ఏమిటి. 

4) " ఏడ్చే దాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడు" అని ఎప్పుడు ఉపోయోగిస్తారు

5) మన దేశంలో ఎన్ని రకాల సంగీత పద్ధతులు వున్నాయి 

6) లంకను కాపలా కాసేది ఎవరు. 

7) వసుదేముడు ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు. 

8) హనుమంతుడు ఎన్ని వ్యాకరణల పండితుడు 

9) "కుమారసంభవం" వ్రాసిన కవి ఎవరు 

*SP PICKLES కొత్త పచ్చళ్ళు

 *SP PICKLES* 

&  *POWDERS*



*కొత్త పచ్చళ్ళు రెడిగా యున్నాయి*


*రీసెల్ చేసుకునేవారికి.. కొత్తవారికి కూడా అవకాశం కల్పించాలి అనుకుంటున్నాము* *సంప్రదించగలరు* 


*సాంప్రదాయ పచ్చళ్ళు*

*మాదగ్గర కలర్స్  ఫ్రీజ ర్వేటివ్స్ వెయ్యకుండా సంప్రదాయ పద్దతిలో పచ్చళ్ళు పొడులు బహ్మనులచే మాత్రమే సూచిగా రుచికరంగా నిల్వా ఉండేవిధంగా క్వాలిటీ పదార్ధాలతో తయారు  చేయబడతాయి*


*మీ ఇంటి శుభకార్యలకు కావలసిన పిండివటలు ఆర్డర్ పై మీకు కావలసిన విధంగా తయారు చేసి ఇవ్వగలము* 


*పచ్చళ్ళు*:  *1kg cost*

*ఉప్పు పచ్చళ్ళు పోపు లేకుండా*


చింతకాయ తొక్కు 450/-

ఉసిరి తొక్కు 450/-

ఉప్పు గోంగూర  550/-

టమోటా       550/-

మగయా       550/-

నిమ్మకాయ    450/-

దబ్బాకాయ   450/-


*ఇంగువ పోపు వేసినవి రెడీటూఈట్*


చింతకాయ(ఎండుమిర్చి  తో పండుమిర్చి ...కారం తో చేసినది )     550/-

ఉసిరి పచ్చడి 550/-

గోంగూర       650/-

టమోటా       550/-

నిమ్మకాయ    550/-

దబ్బాకాయ   550/-

పులిహోర గోంగూర 750/-

పండుమిర్చి 600/-

పండుమిరప గోంగూర 650/-

ఆవకాయ(వెల్లుల్లి/లేకుండా)  600/-

బెల్లం ఆవకాయ 650/-

పెసర ఆవకాయ 600/-

మెంతి ఆవకాయ  600/-

మెంతి ఆవకాయ బెల్లం తో  650/-

ఉసిరి అవకాయ 600/-

పచ్చ ఆవకాయ  850//

పనసపోట్టు ఆవకాయ  750/-

మాగాయ  750/-

*వంకాయ నిల్వ పచ్చడి* 850/-

అల్లం పచ్చడి   600/-

మామిడి అల్లం  650/-

మామిడి అల్లం ఆవకాయ  900/-


*పొడులు* :   *1kg cost*

కంది పొడి  650/-

నువ్వులపొడి 700/-

ధనియాల పొడి 550/-

పప్పులపొడి 550/-

కరివేపాకు కారప్పొడి  650/-

మునగాకు కారపొడి  650/-

మునగాకు పొడి 2000/-

పుదీనా కారపొడి  650/-

అవిశగింజల పొడి 650/-

కొబ్బరి పొడి  600/-

రసం పొడి  550/-

కాకరకాయ పొడి 600/-

సాంబారు పొడి 750/-

నల్లకారం 700/-


*AS బ్రాండ్ పప్పు నూనె గుంటూరు కారం  బళ్లారి కారం

మిర్చి తెచ్చి తోడిమాలు ఓలిచి కారం మేమే తయారు చేస్తాము ఆవాలు కుడా మేమే కడిగి ఆరబెట్టి పిండి పడతాము*

 మావోద్ద తయారు చేయు పచ్చళ్ళు పొడులలో వెల్లుల్లి

వాడము  వెల్లుల్లి కావాలి అనుకున్నవాళ్లకు వల్లవరకు వాళ్లకుకేవలసిన విధంగా తయారు చేసి ఇవ్వగలము*


*వడియాలు* & *వొరుగులు *అప్పడాలు*:


సగ్గుబియ్యం వడియాలు  600/-

పెసర అప్పడాలు       100pices - 650/-

మినప అప్పడాలు 100p 650/-

మిర్చి   1kg  1050/-

గుమ్మడి వొడియలు 1150/-

పేలవొడియాలు  600/-

మినపిండి వోడియలు  650/-

చిట్టెంటపోటు  kg 1250/-


*అన్ని ప్రదేశాలకు కొరియర్ సౌకర్యం కలదు*

*చార్జీలు అదనం*


*దయచేసిమీకుతెలిసిన

బ్రాహ్మణ గ్రూపులలో

ఈ మెసేజ్ ని పంపవలసినదిగా

కోరుకుంటున్నాము* 🙏


*వివరములకు సంప్రదించండి*

*పుచ్చ పల్లవి*

*గౌతమస గోత్రం*

23-30-24,

సత్యనాయణపురం 

కనకరాజు వీధి 

అన్నపూర్ణ నిలయం 

విజయవాడ -11.


*7981370664*

*0866‌ 4602255*

పద్యము

 దృశ్యానుగుణ పద్యము...

(అనులోమ విలోమ విరామ కందము)


మాకెమెరా రామెకెమా

యేకెమెరవలలవరమెకెయే కెమెరమెకె

ప్రాకట కటకటక ప్రా

ధీకర మరువవరుమరకధీ రాధీరా


సోషల్ మీడియా

 *చాలా మంది సోషల్ మీడియాను తేలికగా తీసుకుంటారు, కానీ దాని బలాన్ని నేను మీకు చెప్తాను.  చదవడానికి ఒక్క నిమిషం మాత్రమే పడుతుంది :*

 

 *1: భారతదేశంలో హిందువుల కొత్త విశ్వాసం & ఐక్యత కారణంగా, యూరప్ మొత్తం ఒత్తిడిని అనుభవిస్తోంది!*


 *3: హిందువుల ఐక్యత కారణంగా, "లవ్ జిహాద్" ఇప్పుడు 50%కి పరిమితం చేయబడింది మరియు అనేక రాష్ట్రాల్లో చట్టవిరుద్ధం చేయబడింది.*


 *4: హిందువుల ఐక్యత కారణంగా జిహాద్ వ్యాపారం చాలా చోట్ల దాడికి గురైంది!*


 *5: హిందూ ఐక్యత కారణంగా, "సనాతన ధర్మానికి" వ్యతిరేకంగా మాట్లాడిన 70% మంది నోరు మూయబడ్డారు!  చాలా మంది విదేశీయులు దీనిని స్వీకరించడం ప్రారంభించారు.*


 *6: హిందూ ఐక్యత కారణంగా, WhatsApp & Facebookలో మన పండుగలు & సంస్కృతిపై జోకులు 80% తగ్గాయి!*


 *7: హిందూ ప్రజల మధ్య ఉన్న ఐక్యత కారణంగా, ప్రతిపక్షాలన్నీ ఇప్పుడు హిందువుగా కనిపించాలని తహతహలాడుతున్నాయి!*


 *8: హిందూ ఐక్యత కారణంగా, బాలీవుడ్ ఒత్తిడిలో ఉంది, సీతామాత పాత్రను కరీనా పోషించబోతోంది, ఇప్పుడు కంగనా!*


 *9: హిందువులు ఒకప్పటిలా మౌనంగా లేరు, ఇప్పుడు విదేశాల్లో కూడా లండన్ వంటి చోట్ల నిరసనలు చేస్తున్నారు & పాకిస్థానీల దుకాణాలు & రెస్టారెంట్లను బహిష్కరిస్తున్నారు!*

 *మీకు సోషల్ మీడియాలో కేవలం 10 మంది హిందూ స్నేహితులు మాత్రమే ఉన్నప్పటికీ, ఈ ఆలోచనలను వారిలో వ్యాప్తి చేయడం చివరికి లక్షలాది హిందువులను చేరుకోవడానికి సహాయపడుతుంది!*


 *తెలియకుండా మీరు వ్రాసిన / షేర్ చేసిన విషయాలు లక్షల్లో చేరుతున్నాయని గమనించండి!*


 *మీకు మీరే రాయలేకపోతే, దయచేసి వ్రాసే / మాట్లాడే వారి ఆలోచనలను ఫార్వార్డ్ చేయడం, భాగస్వామ్యం చేయడం, కాపీ చేయడం వంటివి కొనసాగించండి*


 *హిందూ ధర్మంపై అవగాహన రోజురోజుకూ పెరుగుతోంది.  "సూడో సెక్యులరిజాన్ని" సమర్ధిస్తున్న హిందువులు కూడా తమ పాత్ర గురించి ఆలోచించడం మొదలుపెట్టారు!*


 *కమ్యూనికేట్ చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించే వ్యక్తులు పనిలేకుండా ఉండాల్సిన అవసరం లేదు;  కొందరు విద్యలో ఉన్నారు, కొందరు ఉద్యోగాలలో ఉన్నారు, మరికొందరు వ్యాపారంలో ఉన్నారు లేదా స్వయం ఉపాధి లేదా వ్యాపారవేత్తలు!*


 *అయితే హిందువులను ఏకం చేయడానికి మరియు అవగాహన పెంచడానికి ప్రతి ఒక్కరూ "ధర్మ కార్యం" కోసం తమవంతు కృషి చేస్తున్నారు!*


 *ఏమీ చేయకుండా నిష్క్రమించడం కంటే లక్ష్యం కోసం జీవించడం మేలు!  నా తల్లిదండ్రులు మన సంస్కృతి & దేశం కోసం పోరాడారని కనీసం రాబోయే తరం అయినా గర్వంగా చెబుతుంది!*

          

 *మీరు ఇక్కడ ఉన్నారని గుర్తుంచుకోండి, ఇష్టాలు లేదా అయిష్టాల సంఖ్య కోసం కాకుండా మన గొప్ప సంస్కృతి యొక్క విలువలు & సంప్రదాయాల గురించి అవగాహన కల్పించడం కోసం!  అన్ని రంగాలలో గొప్ప పనిని కొనసాగించండి!  మా బలం పెరుగుతోంది!*

                       


 *హిందువుల ఐక్యతకు స్పష్టమైన శక్తి ఉంది.  కాబట్టి కుల భేదాలను క్షమించడం, మరచిపోవడం, అధిగమించడం మరియు చెత్తబుట్టలో పడేయడం ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకోండి, గొప్ప సందేశాన్ని కనెక్ట్ చేస్తూ ఉండండి!*


 *మరియు భారతదేశం మరోసారి గొప్ప దేశం మరియు సూపర్ పవర్ అవుతుంది.*🙏


         

 *భారత్ మాతా కి జై!*

కాశీలో జీవనం

 

కాశీలో జీవనం

 కాశీలో జీవనం 


వివిధ ప్రాంతాలనుంచి అనేదానికన్నా వివిధ దేశాలనుంచి ఎంతోమంది కాశీకి వచ్చి రోజులకొద్దీ, నెలల కొద్దీ, సంవత్సరాలకొద్దీ నివసిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకు అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు లభించిన సమాధానం నేను ఏప్రిల్ 5వ తారీకు ఉదయం 8-30 నుండి 9 గంటలవరకు పొందిన అనుభవం, అనుభూతే సమాధానంగా లభించింది. కాశీవిశ్వేశ్వరుని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చుంటే అనన్య సామాన్యమైన ఆధ్యాత్మిక అనుభూతి,. అక్కడి భక్తులందరూ నాకు ఈశ్వరుని ప్రమద గణాలుగా అనిపించారు. ఆలయ ప్రాంగణం సాక్షాతు కైలాసంగా అనిపించింది. ఈ సాధకుడు పొందిన దివ్యానుభూతిని వర్ణించ మాటలు లేవు. అటువంటప్పుడు ప్రతివారు ఈశ్వరుని సన్నిధిలో ఉండాలని అనుకోటంలో ఆశ్చర్యం ఏముంది. కాశీ పట్టణం ఎంతో పురాతనమైనది. సాక్షాత్తు పరమేశ్వరుడు నడచిన ప్రదేశం. అమ్మవారు తిరిగిన స్థలం. ఇప్పటికి అక్కడికి దేవతలు వస్తారని ప్రతితీ. 


సాధకుల జీవనం: 


అరిషడ్వార్గాలను వదిలి దేహాభిమానాన్ని త్యజించిన సాధకులు అనేకులు మనకు కాశీలో  తారసపడతారు. బిక్షాటన చేస్తూ పరమేశ్వరుని కొలిచేవారు కొందరు ఆంధ్రశ్రమంలో రోజు 20,30 మంది సాధువులు వచ్చి కూర్చోవటం    వారికి అక్కడ రోజు భోజనం పెడుతున్నారు. ఆలా కాశీలో ఎన్నిచోట్ల అన్నదానం జరుగుతుందో  ఏమో మరి. ఇక కొందరు సాధువులు చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం చేస్తూ జీవిస్తున్నారు.  కొందరు. సాధువులే కాదు సామాన్యుజనం కూడా సాదారణ జీవనం పెట్టుబడి  లేకుండా,లేక కొద్దీ పెట్టుబడితో జీవిస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా వివరిస్తాను. 


కొద్దిపెట్టుబడితో: ఒక రూ 100-500 పెట్టుబడితో జీవనం. కొందరు సాధువులు ఒక చిన్న పళ్ళెరం పట్టుకొని అందులో భస్మం యెర్రని చెందనం, ఒక త్రీసులపు లేక మూడుగీతాల ముద్రలు కలిగిన ముద్రలు వెంట పెట్టుకొని భక్తులకు బొట్లు పెట్టి డబ్బులు వసులు చేసుకుంటున్నారు. హీనపక్షం వారు రోజుకు 1000 నుండి 1500 వరకు సంపాయించవచ్చు. మేము బోటులో గంగ హారతి చూస్తూవుంటే ఒక సాధువు ఒక పళ్ళెరంలో చిన్న దీపారాధన కుంది పెట్టుకొని చిన్న సీసాలో నూనె సీసా పెట్టుకొని అందరికి హారతి చూపిస్తున్నాడు.  ఒక్కొక్కరు 10,20 ఇంకా కొంతమంది అంతకన్నా ఎక్కువ డబ్బులు వేయటం నేను చూసాను. చాలా తక్కువ పెట్టుబడితో ఈ రకంగా కూడా జీవించవచ్చు. అన్నీ  పడవలు తిరిగితే అతనికి రూ 2000 వరకు కూడా రోజుకు రావచ్చు. కేవలం గంట నుండి 2 గంటల వరకు బొట్లు తిరిగితే సరి రోజంతా విశ్రాంతి తీసుకోవచ్చు చక్కగా జీవనం సాగించవచ్చు. దేవాలయూయానికి వెళ్లే మార్గంలో ఉమ్మెత్తకాయలు, జిల్లేడు పూవులు, జిల్లేడు పులా మాలలు, మారేడు దళాలు అమ్మే వాళ్ళు కొంతమంది ఎటువంటి పెట్టుబడి లేకుండా కేవలం బయలు ప్రదేశాలకు వెళ్లి ఏరుకోరావటం వాళ్ళ సంపాదిస్తున్నారు.  తక్కువ పెట్టుబడితో సాదారణ జీవనం. 


ఇక కొంచం పెట్టుబడితో జీవనం:


కొంతమంది పిల్లలు 15 నుంచి 20 సం మధ్యవాళ్ళు  ఒక కిరోసిన్ స్టవ్వును ఒక డబ్బాలో పెట్టి పైన ఒక రాతివెండి కెట్లి పెట్టి లెమెన్ టీ అమ్ముతూ సంపాదిస్తున్నారు. ఒక్కో టీకి రూ 20 తీసుకుంటున్నారు.  వెళ్ళకుండా రాత్రి గంగ హారతి సమయంలో బోట్లమీద తిరుగుతూ, పగటి పూత గల్లీలలో తిరుగుతూ అమ్ముతున్నారు. రోజుకు కనీసం రెండు, మూడు ట్రిప్పులు తిరిగితే 60 నుంచి 80 టీలు సునాయాసంగా అమ్మవచ్చు. వాళ్లకు వేయి రూపాయుయాలకన్నా ఎక్కువ గిట్టుబాటు కాగలవు. 


చిన్న దుకాణాలు. రోడ్డు ప్రక్కన ప్లాస్టిక్ డబ్బాలు, ఇతర ప్లాస్టిక్ సామానులు దుకాణాలు వీటికి 2000 నుండి 5000 పెట్టుబడి అవసరం ఉంటుంది సంపాదన బాగానే ఉంటుంది. 


చొక్కాల వ్యాపారం. మహాదేవ అని ఇంకా ఇతర శివనామాలు అచ్చువేసిన చొక్కాలు 150 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక్కొక్క చొక్కాకు రూపాయలు 50 లాభం రావచ్చు. అంతే  కాక ఆడవారి డ్రస్సులు, చీరలు కూడా ఫూటుపాత్ మీద అమ్ముతున్నారు. ఈ వ్యాపారానికి కొంత ఎక్కువ పెట్టుబడి కావాలి. లాభం మంచిగా ఉంటుంది. 


రాగి ఇత్తడి సామానులవ్యాపారం. రాగి చెంబులు,  కంకణాలు,చిన్న పాత్రలు (గంగ నీరు పట్టుకోవటానికి) ఇవి ఇనుపవే కానీ రాగివాటిలాగా కనపడతాయి. ఇత్తడి కుందులు, చిన్నచిన్న వస్తువులు, శివలింగాలు, జంధ్యాలు, విబూది, రుద్రాక్షమాలలు, స్పటిక మాలల దుకాణాలు మనకు అడుగడుగునా కనపడతాయి. వస్తువుల ధరలు పెద్దగా తేడా నాకు కనిపించలేదు. రెండు కుందులు 150 చెప్పి రూ 120 కి ఇచ్చాడు. 


చిన్న టీ స్టాళ్ళు , చిన్న ఇడ్లీ, వడ, దోశ హోటళ్లు అంటే రోడ్డు ప్రక్క బండ్లు అరుగు మీద పెట్టి అమ్మే చిన్న షాపులు మనకు కాశీలో కో కొల్లలు గా కనపడతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ దాదాపు అందరు తెలుగులో మాట్లాడటమే కాదు ప్రతి సందులో మనకు తెలుగు బోర్డులు ఉండటం విశేషం. ఈ చిన్న వ్యాపారస్తులు అక్కడి ట్రావెల్స్ తో సంబంధం పెట్టుకొని తెలుగులో కరపత్రాలు ముద్రించి మేము గయాకు, ప్రయాగకు, అయోధ్యకు కార్లు, చిన్న బస్సులు సప్లై చేస్తామని వ్యాపారం చేస్తున్నారు. వారికి ఒక్కొక్క త్రిప్పకు 500 ఆ పైన కమిషన్ కూర్చొని సంపాదిస్తున్నారు.

ఇక తొక్కే రిక్షాలు ఈ రిక్షావాళ్లు 1-2 కిలోమీటర్ల దూరం వరకు వెళతారు 70 రూపాయలకన్నా ఎక్కువ తీసుకుంటున్నారు. 

బ్యాటరీతో నడిచే రిక్షాలు వీరి సంపాదన చాలా బాగుంది. వీరు ఒక ట్రిప్పుకు 300 నుంచి 400 వందల వరకు అడుగుతున్నారు. వీరు రోజులో 20 ట్రిప్పుల కన్నా ఎక్కువ వేయగలరు అంటే వారి సంపాదన ఎలా ఉందో ఊహించండి. ఈ బ్యాటరీ రిక్షా ఖరీదు లక్షా యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఉంటుందని అన్నారు. ఈ రిక్షాలు మెయింటెనెన్స్ ఫ్రీ కేవలం రెండు మూడు ఏళ్లకు ఒకసారి బ్యాటరీలు మార్చాలి. ఒక ఊడదీసిన రిక్షాను చూసాను అందులో లేడ్  యాసిడ్ బ్యాటరీలు ఉన్నట్లు కనిపించింది. వారణాశిలో, గయలో, నాకు చాలా బ్యాటరీ రిక్షాలు కనిపించాయి. వీటిలో 8 మంది దాకా ప్రయాణించవచ్చు. వెడల్పు తక్కువగా వుంది ఎదురెదురుగా కుర్చునేటట్లు రెండు సీట్లు ఇంకా డ్రైవర్ పక్కన కూడా కూర్చుని ప్రయాణిస్తున్నారు. ఈ రిక్షా వాళ్ళ సంపాదన చాలా బాగుంది.

ఆటోలు కూడా చాలా కనపడుతున్నాయి కానీ ఆటోలు బ్యాటరీ రిక్షాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. . ఇవి కాక టాక్సీ కారులు, మినీ బస్సులు  అంటే ట్రావెలర్ వాళ్ళవి అన్నమాట, ఈ రకంగా రవాణా వాహనాల వాళ్ళు కూడా చాలా సంపాదిస్తున్నారు.

నేను ఒక గాలిలోంచి వెళ్తుంటే ఒక యువతితో పరిచయం అయ్యింది.  ఆమె రెండు నెలల క్రితం ఆంధ్ర నుంచి వచ్చిందట, తెలుగు తప్ప ఏమీ రాదు.  అక్కడ ఒక ఆశ్రమంలో ఆమె వుంటున్నది. ఆ ఆశ్రమ అరుగు మీద ఒక చిన్న దుకాణం పెట్టుకున్నది.  అది ఆశ్రమం స్వామీజీ ఏర్పాటు చేశారని అన్నది.  ఆమె రుద్రాక్ష దండాలు తెలుగు పుస్తాకాలు, కొన్ని హిమాలయ డ్రగ్స్ వారి ఆయుర్వేద మందులు విక్రయిస్తున్నది. నేను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఒక సాధువు వచ్చి రుద్రాక్షమాలలు 10 కొన్నాడు. వాటికి 600 రూపాయలు ఇచ్చాడు. నేను ఆమెతో హిమాలయ ఆయుర్వేదం కాక పతంజలి మందులు విక్రయించమని సూచించాను. రెండు మూడు సాదారణ వ్యాధులకు పనికి వచ్చే  మందుల పేర్లు కూడా చెపితే ఆమె పుస్తకంలో వ్రాసుకుంది.

ఇన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించడానికి కారణం నేను మన తెలుగువారు అనేకమంది వారణాసి వెళ్లి ఉండాలని కోరుకుంటున్నట్లు నాకు అర్ధమైనది. అలాంటి వారికి ఉపయోగపడాలని ఉద్దేశ్యంతో నేను కాశీలో వివిధ రకాల ప్రజల జీవన సరళి గురించి నేను చూసి గమనించి అర్ధంచేసుకున్నది వివరించాను నాకు తెలిసినంతవరకూ కాశీలో మధ్యతరగతి వారే ఎక్కువగా వున్నారు. కేవలం తెలుగు వస్తే చాలు కాశీలో బ్రతకవచ్చు.  నా వ్యాసం ఏ తెలుగు వారికైనా పనికి వస్తే నా ప్రయత్నం సఫలీకృతం అయినట్లే.

పంచాంగం 🕉️ 25🔸05🔹2024

 🚥🚥🚥🚥🚥🚥🚥🚥

   శుభోదయం, పంచాంగం 

🕉️ 25🔸05🔹2024 🕉️

🚥🚥🚥🚥🚥🚥🚥🚥

శ్రీ క్రోధి నామ సంవత్సరం

➖➖➖➖➖➖➖➖

🌟 శనివారము, మే 25, 2024🌟

-----------------------------------------

మాసం: వైశాఖ మాసం

అమృతకాలము: 04:12, మే 26 నుండి, 05:48, మే 26 వరకు

సూర్యోదయము: 05:42

సూర్యాస్తమయము: 18:45

రాహు కాలం: 08:58 నుండి 10:35 వరకు

యమగండము: 13:51 నుండి 15:29 వరకు

దుర్ముహుర్తములు: 05:33 నుండి 07:16 వరకు

అభిజిత్: 11:47 నుండి 12:39 వరకు

కరణం: తైతిల 07:14 వరకు, బవ 18:58 వరకు

చాంద్ర రాశి: వృశ్చికము 10:36 వరకు

వర్జ్యం: ఏమిలేదు

చంద్రోదయం: 20:39

చంద్రాస్తమయం: వృశ్చికము 10:36 వరకు

తిథులు: విదియ 18:59 వరకు

నక్షత్రము: జ్యేష్ఠ 10:35 వరకు

గుళిక కాలం: 05:42 నుండి 07:20 వరకు

యోగా: సిద్ధ 10:07 వరకు

సన్మార్గంలోనే పయనిస్తుంది

 


తల్లిదండ్రులు తమ సంతానమును మాటలు నేర్వకముందునుండే ఆధ్యాత్మిక విలువలను నేర్పుతూ ఆధ్యాత్మిక మార్గమును తాము ఆచరిస్తూ పిల్లలచేత ఆచరింపజేస్తూ పెంచితే.... కచ్చితంగా ఆ తరం సన్మార్గంలోనే పయనిస్తుంది. 


దీనికి శ్రీరాముడే ఆదర్శం. ధర్మమును తాను ఆచరిస్తూ ప్రజలచేత ఆచరింపజేశాడు ఆ మహానుభావుడు. రామాయణాన్ని ఆమూలాగ్రంగా ఎన్నిసార్లు చదివినా... శ్రీరామునికి స్వోత్కర్ష కానీ, అహంభావము కానీ కనిపించవు. 


అదే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచవలసి ఉంటుంది. అప్పుడే విలువలతో కూడిన సమాజం ఏర్పడుతుంది. 


అంతే కాదు. తల్లి గర్భవతి అయిననాటి నుండి తన మనసులో అన్యచింతనలను రానీయకుడా నిత్యమూ ఆధ్యాత్మిక చింతనలతోను, ధర్మచింతనతోను, సాత్వికభావాలతోనూ గడిపినట్లైతే ఆ పుట్టబోయే సంతానము 100% అవే గుణగణములు కలిగి పుడతారు. ఇదే విషయం భక్తప్రహ్లాదుడు మొదలైన అనేక ఇతిహాస కథలలో మనకు తెలుస్తుంది.

పిల్లల ప్రవర్తన తల్లి తండ్రులు


   పిల్లల ప్రవర్తన కు తల్లి తండ్రులు 90 శాతం భాధ్యత. వహించాల్సి వస్తుంది .

          ఆవు చెలో మేస్తే. దూడ గట్టున మేస్తుందా .

పవిత్రమైన గృహం లో( యింట్లో )  భగవద్ సంభందిత   ప్రస్తావనలు  పూర్వీకుల ఆచార కట్టుబాట్లు   వీలయితే  దేముని  నామ స్మరణలు 

దేవుని రూప  ప్రదర్శనలు గల ఫొటోలు

లేచినది మొదలు పడుకొనే దాకా కనులముందు వుంటే దాదాపు 70 శాతం. పిల్లల  ప్రవర్తన లో మార్పు లు  రావటానికి  మంచి లక్షణాలు 

తేవటానికి అవకాశం వుంటుంది. జీవిత లక్ష్యం,

  జీవిత సాఫల్యము . జన్మల  కర్తవ్యం

ముఖ్యము గా ఏదో సమయము లో పిల్లలతో  యిస్థా గోస్టి ( అనగా తల్లి తండ్రులు  ) కనీసం వొక్క అరగంట వాళ్ళతో కూర్చుని   భాగవత కథలు నుంచి  నిత్య  ధైనందిత జీవిత సమస్యలు  కుటుంబ పరిస్థుతులు ప్రశాంతం వాతావరణము లో   భయాన్ని కలిగే విధము గాక  (మనస్సు ను భాదపరచే    విధము గా కాకుండా వొత్తిడిని  కల్గించని విధము గాక  సానుకూలము గా  వుండి తేలిక గా  పరిష్కరించే  పద్ధతి లోi వ్యవాహారము ల ను  తెల్య జేస్తూ మాట్లాడుతుంటే.  ఆ పిల్లలు తల్లి తండ్రుల భాధ్యతను గుర్తిని మంచి   భాధ్యత కలిగిన  పౌరులు  గా  తయారయి అటు దేశానికి యిటు కుటుంబము  కు   మరియు పదిమందికి  ఉపయోగ పడే విధము వారు తయార వుతారు .

అలా కాక. పిల్లల ముందే తల్లి తండ్రులు  యింట్లో వాళ్ళ కు గల బలహీనతల. కు. లోనయి పిల్లల ముందే. యుద్ధ వాతావరణాన్ని కలుగ జేస్తే. యిక పిల్లలు రాక్షసులు గా మారితే.   ఆశ్చర్య పోవటం లో  విచిత్ర మేముంటుంది . పిల్లల కూడా వాళ్ళ జీవితాల్లో అలాగే వారి తల్లి తండ్రుల అడుగు జాడలు లో నడుస్తారు .

వివాహకుటుంబము లో విడాకుల సాంప్రదాయానికి నూటికి నూరుపాళ్లు  నాంది  పలికేది  తల్లి తండ్రులే  

      అలాగే. పెదాల మీద. మాత్రమే. దేముడి  స్మరణ   వాళ్ళ పై భక్తి.

ఆచరణలో మాత్రం  అస్సలు నమ్మక లేకపోవటం .  యివే నేటి  పిల్లల మరియు యువత వినాశ నానికి దారి తీస్తున్నాయి.  వేషధారణ లో  వారి ప్రవర్తన లో తల్లి తండ్రులు వారి మాటలలో పవిత్రత. పిల్లలకు చూపక పోతే  పుట్టిన పిల్లలు సంఘా విద్రోహులుగా మారతారు .

యిదే సత్యం .

ఓం నమః శివాయ.

తెలియని వారిని

 *🙏🏻శుభోదయం*🌹Goodmorning 🙏🏻


"మనస్తత్వం కలిసిన వారిని వదులుకోకూడదు.

మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు." 

      

"చెప్పుడు మాటలు విని చెడ్డవారికి చేరువ కారాదు. 

మన ముందు మనల్ని తిట్టే వారే మన మంచి కోరుకుంటారు."

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం  -‌ ద్వితీయ  -  మూల -‌‌ స్థిర వాసరే* (25.05.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 




ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు. మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ 9848647145 కు వాట్సాప్ చేయండి. దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 




ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   




ఇట్లు 




మీ బ్లాగరు





అవకాశమే అదృష్టం

 అవకాశమే అదృష్టం


మనం కోరుకున్నప్పుడు పౌర్ణమి రాదు. ఇష్టపడినప్పుడు వసంతం రాదు. చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనుస్సు కనిపించదు. ఆశించినప్పుడు ఆత్మీయులు మనకు దొరకరు. జీవితం ఆనందమయంగా గడిచేది మనం కోరుకున్నది పొందినప్పుడు కాదు. వచ్చినవి. పొందినవి ఆస్వాదించినప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది. అలాగే చేతికందిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పుడే కోరుకున్న గమ్యానికి చేరువవుతాం.


అవకాశాలు తమంతటతాముగా మన చెంత చేరవు. వాటి కోసం అన్వేషించాలి. తపించాలి. శ్రమించాలి. అందిన అవకాశాలను చేజిక్కించుకుని కార్యనిర్వహణలో విజయం సాధించాలి. రామాయణంలో హనుమంతుడు సీతాన్వేషణ ప్రయత్నంలో ఏ చిన్న అవకాశాన్నీ విడిచిపెట్టలేదు. ఎన్నో రకాల పరీక్షలను, అడ్డంకులను అధిగమించి చివరికి సీతమ్మ జాడ తెలుసుకున్నాడు. రామకార్యాన్ని పూర్తిచేశాడు. అలాగే ఉడుత సైతం తన వంతు సాయం చేసింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాముడి ప్రేమను పొందింది.

చరిత్రలో నిలిచిపోయింది. కురుక్షేత్ర యుద్ధంలో మోహావేశంలో చిక్కుకున్న అర్జునుడి మనసును మార్చాలనుకున్నాడు శ్రీకృష్ణుడు. మిత్రుడు, బంధువు అయిన అర్జునుడు అజ్ఞానపు చీకటి లోయలోకి జారిపోకుండా కాపాడి గీతామృత బోధ చేసి కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. అవకాశాలు కలిసిరావడానికి అదృష్టం ఉండాలని కొందరి వాదన. నిజానికి అదృష్టవంతుడు అంటే ఎవరో కాదు. కిందపడ్డ ప్రతీసారి లేచి నిలబడేవాడు. ఎదురుదెబ్బలు, కష్టనష్టాలు, అవరోధాలు- జీవితంలో ఒక భాగం అనుకుని ముందుకు సాగేవాడు. ఈ సత్యాన్ని అంగీకరిస్తే జీవితం ఎవరికీ కఠినంగా అనిపించదు. అప్పుడు ప్రతి మనిషి మానసికంగా ఎదగడానికి ప్రయత్నిస్తాడు. ప్రతీ సమస్య వెనకా ఒక అవకాశం ఉందని భావించి ఆశావాదంతో ముందడుగు వేస్తాడు.


చాలామంది తమను దురదృష్టం వెంటాడుతోందని, అవకాశాలు రాకుండా ఎవరెవరో అడ్డుకుంటున్నారని, కొందరు మోసం చేస్తున్నారని భావిస్తుంటారు. నిజానికి మనకు ఏది రావాలో అదే వస్తుంది. ఆ భగవంతుడికి ఎవరిమీదా పక్షపాతం ఉండదు. ఎవరు దేనికి అర్హులో అదే వారు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.


భగవంతుడి పూజ తరవాత పువ్వు, పండు... ఇలా ఏదైనా భక్తితో, కృతజ్ఞతతో స్వీకరిస్తాం. అలాగే ఈ జీవితంలో లభించిన ఎలాంటి అవకాశాన్నయినా భగవత్ ప్రసాదంగా భావించి స్వీకరించాలి. స్వశక్తితో ఇతరులను ఒప్పించి వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి అనుకున్న లక్ష్యాలను చేరడానికి ప్రయత్నించాలి.


ఉత్తమ కార్యాలు చేస్తూ ఉదాత్తవ్యూహంతో ముందుకు సాగితే ఆ మనిషికీ తప్పక దైవశక్తి తోడవుతుంది. అప్పుడు అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. చేతికందిన అవకాశాలను స్వార్థప్రయోజనాలకు కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ఉపయోగించాలి. దానం, పరోపకారం, సమాజ సేవ నిర్వహించే అవకాశాలు వచ్చినప్పుడు వాటిని దైవకార్యాలుగా భావించి నెరవేర్చేందుకు ప్రయత్నించాలి. అలాంటి అవకాశాల వల్లే మనిషికి శాశ్వతకీర్తి లభిస్తుంది.

దానములు ఎన్ని రకములు

 *దానములు ఎన్ని రకములు ?? - అవి ఏవి ???*

        *దానములు - 3 రకములు, అవి ... 1, సాత్త్విక, 2, రాజసిక, 3, తామసిక - దానములు*

దానము చేయువారిలో పెక్కుమంది ప్రతిఫలాపేక్షచే చేయుచుందురు. 

కొంతమంది మాత్రమే భగవత్ కటాక్షమును అపేక్షించుచుందురు!!...


భగవదనుగ్రహమును కోరి చేయు దానము సాత్త్వికమగును. 


అట్లుగాక, ప్రత్యుపకారము నాశించియో, పేరుప్రతిష్ఠలను పొందగోరియో, లేక పదిమందికి మెప్పునకై ముందు ఇచ్చి తదుపరి పరితపించుటయో, లేక మనఃక్లేశమువలననో ఇచ్చిన దానము రాజసికమగును. 


సత్కార పూర్వకముగాక, తిరస్కార భావముతో ఇచ్చిన దానము, దానమునకు తగని వ్యక్తికిగాని, స్థానమునకుగాని ఇచ్చిన దానము తామసికమగును. 


అనగా !!... తిండితీర్థాదులకు కొదవ లేని స్థానము అన్నదానమునకు తగని స్థానమే అగును. 


రోగులు వెళ్ళుటకు సాధ్యముగాని ప్రదేశములో వైద్యాలయమును నిర్మించుట వృథానేయగును. 


కడుపు నిండుగా తిని కదలలేనివానికి అన్నము భుజ భారమనిపించును. 

ఇట్టి సార్థకము కాని దానములు తామసిక దానములగును...


ఈరోజు మనం ఏదానం చేస్తున్నామో మనమే అర్థం చేసుకోవాలి!!...


               *_🌸శుభమస్తు🌸_*

*శివ మానస పూజ

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *రత్నైఃకల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం* 

*నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనమ్* | 

*జాతీచంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా* 

*దీపం దేవ దయానిధే పశుపతేహృత్కల్పితం గృహ్యతామ్* ౧ 


               [ *శివ మానస పూజ* ]


ఓ భగవాన్ పశుపతి, కరుణకు పభ్రువు. అమూల్యమైన రత్నాలతో 

తయారు చేయబడిన సింహాసనంపై, హిమాలయాల నుండిచల్లటి 

నీటితో స్నానం చేసి, దివ్య వస్త్రాలు ధరించి, వివిధ విలువైన రత్నాలు మరియు ఆభరణాలతో అలంకరించబడి, మీ శరీరంపైచందనం మరియు కస్తూ రితో మీరు కూర్చున్నారు. నేను భక్తితో నీకు సమర్పిస్తున్న మల్లెపూలు, చంపక పుష్పాలు, బిల్వ పత్రాలు, ధూపం, పక్రాశించేదీపం స్వీకరించండి.


   👇 //---------- ( *భజగోవిందం* )---------// 👇


శ్లో𝕝𝕝 *ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేకవిచారం* |


*జాప్యసమేత సమాధివిధానం కుర్వవధానం మహదవధానం* 30


భావం: క్రమపద్ధతిలో శ్వాసను నియమించడం; విషయాల నుండి మనసుని వెనక్కి మళ్లించడం; నిత్య వస్తువేదో, అనిత్య వస్తువేదో నిరంతరం బుద్ధితో విచారించడం; జపంతో కూడుకున్న ధ్యాననిష్ఠను సాగించి సర్వ సంకల్పాలను విడిచిపెట్టడం అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించు. 


✍️💐🪷🌷🙏

భార్యాపుత్రాదులు

 *ఋణానుబంధ రూపేణా*

*పశుపత్నీ సుతాలయః*,

*ఋణక్షయే క్షయం యాంతి*

*కా తత్ర పరివేదనా*.

```

భావం: "పశువులు,భార్యాపుత్రాదులు, ఇళ్ళూవాకిలి ఇవి ఋణానుబంధ రూపంగా వచ్చి, ఋణం తీరగానే వెళ్ళిపోతాయి. 

ఋణం తీరిపోతే ఇక బంధాల వల్ల కలిగే దుఃఖం ఉండదు కదా"


ముఖ్యంగా మనకు రావాల్సిన వాటిని గుర్తుపెట్టుకుంటాం. కానీ మనం ఇవ్వాల్సిన వాటిని మర్చిపోతాం. మనం ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే అది ఇచ్చేవరకు మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి ఉంటుంది. మనం తీసుకున్న వాటిని తిరిగి చెల్లిస్తే బంధవిముక్తులమవుతాం. 


ఈ జన్మలో ఇతరులతో మన అనుబంధాలకు కారణం గత జన్మలోని బంధాలే.   


బంధాలెన్నో రకాలు. అందులో ఋణానుబంధం చాలా ముఖ్యమైనది. మనం బంధవిముక్తులం కావాలంటే ఋణవిముక్తులం కావాలి. 


ఇచ్చిన వారు మర్చిపోయారు, అడగడం లేదు కదా, అని మనం తీసుకున్నదాన్ని తిరిగి ఇవ్వకపోతే జీవితాంతం పూజలు చేసినా మనం బంధవిక్తులం కాలేం. ఇచ్చిన వారు మర్చిపోయినప్పటికీ, తీసుకున్న వారు దానిని గుర్తుపెట్టుకొని, తిరిగి ఇచ్చినప్పుడే బంధ విముక్తులవుతారు.


పూర్వం యోగులు తీసుకున్న దానిని ఎక్కడ మర్చి పోతామేమోనని తక్కువగా గ్రహించేవారు. ఎంత అవసరమో అంతే గ్రహించేవారు. అవసరానికిమించి, అది ఉచితంగా వచ్చినప్పటికీ దానిని స్వీకరించేవారుకాదు. ఇస్తున్నారు కదా అని తీసుకుంటూపోతే ఎప్పటికీ బంధవిముక్తులం కాలేము. 


యోగులు అభ్యసించే  “అపరిగ్రహం” ఎంతోకొంత మనం పాటించగలిగితే ఋణానుబంధానికి దూరంగా ఉండగలుగుతాం, ఆ భగవంతునికి దగ్గరవగలుగుతాం.

తిరుమల కొండలకు

 *🛕తిరుమల కొండలకు ఆపేర్లెలావచ్చాయి🛕* 

 *🛕🙏⛰️⛰️\|/⛰️\|/⛰️\|/⛰️⛰️🙏🛕* 



⛰️⛰️ఏడుకొండలు మీద వెంకటేశ్వరుడెందుకున్నాడంటే దానికొక ఆధ్యాత్మిక రహస్యాన్ని చెబుతారు. శరీరంలో ఏడు చక్రాలున్నాయి. అవి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, అజ్ఞ, సహస్రారం ... అధోముఖమైన కుండినీ శక్తిని యోగాభ్యాసంతో సహస్రానికి పంపించడం పరమాత్మ సాక్షాత్కారానికి మార్గం. ఏడు కొండలకు ఏడు పేర్లున్నాయి. అవి అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి.


 *⛰️ అంజనాద్రి ⛰️*


అంజనాద్రి అనే పేరు ఎందుకొచ్చిందంటే  త్రేతాయుగంలో అంజనాదేవి పుత్ర సంతానం కోసం మతంగ మహర్షి సలహా మేరకు ఆకాశగంగ సమీపంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసింది. వాయుదేవుని వరప్రసాదంగా వాయు సమాన బలవంతుడైన హనుమంతుని కుమారునిగా పొందింది. అంజనాదేవి తపమాచరించిన పర్వతం కావడం వల్ల ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది.


 *⛰️ వృషభాద్రి ⛰️* 


వృషభాద్రి పేరు ఎలా వచ్చిందంటే ... కృతయుగంలో వృషభాసురుడనే రాక్షసుడు మహావిష్ణువు భక్తుడు, అయితే శ్రీహరితో యుద్ధాన్ని కోరుకున్నాడు. విష్ణువు వృషభాసురునితో యుద్ధం చేసాడు. ఎంతటీ వృషభుడు చనిపోక పోయేసరికి చివరకు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శునుని మహిమ తెలిసిన వృషభాసురుడు ఇక్కడ వెలసిన కొండకు తన పేరు వచ్చేలా వరాన్ని కోరాడు. మహావిష్ణువు వృషభుడు కోరిన వరాన్ని యిచ్చి వధించాడు. అందువల్ల ఆ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది.


 *⛰️ నీలాద్రి ⛰️* 


నీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ... ఏడు కొండలలో ఒక కొండ అయిన నీలాద్రి మీద క్రూరజంతువుల సంచారం విపరీతంగా ఉండేది. దానివల్ల తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని నీలాదేవి శ్రీనివాసున్ని వేడుకుంటుంది. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూరజంతువులను వేటాడి అలసి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న శ్రీనివాసుని సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా, నుదుటిపై కొంతభాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది. అంతటి మనోహర రూపానికి అది పెద్దా లోపంగా ఆమె భావిస్తుంది. తన కురులలో కొంతభాగం తీసి శ్రీవారి తలకు అతికిస్తుంది. వెంటనే శీనివాసునికి నిద్రాభంగం అయి మెలకువ వస్తుంది. ఎదురుగా ఉండే నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కొండడు వచ్చిన భక్తులు తమ నీలాలను సమర్పిస్తారని అవి నీలాదేవికి చేరుతయనే వరమిచ్చాడు. ఆ కారణం వల్లే కొండకు నీలాద్రి అనే పేరు వచ్చింది.


 *⛰️ శేషాద్రి ⛰️* 


శేషాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ... మహావిష్ణువు ఆదేశానుసారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వత రూపాన్ని ధరించడం వల్ల దీనికి శేషాచలం అనే పేరువచ్చింది. శ్రీహరి వాయువుకు, శేషునికి పందెం పెడతాడు. శేషుడు వెంకటాద్రిని చుట్టుకుంటాడు. వాయువు మహావేగంతో వీస్తాడు. శేషుడు స్వర్ణముఖి తీరం వరకూ వెళతాడు. మహావిష్ణువు ఆజ్ఞతో వెంకటాద్రి విడివడుతుంది. శేషుడు అక్కడే తపస్సు చేయడం వల్ల శేషాద్రి అనే పేరు వచ్చింది. ఈ కొండకు గరుడాద్రి అనే పేరు కూడా ఉంది. శ్వేత వరాహకల్పంలో వరాహస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మంతుడు శ్రీవైకుంఠం నుంచి ఈ పర్వతాన్ని తీసుకుని రావడం వల్ల ఈ కొండకు గరుడాద్రి అనే పేరువచ్చింది.


 *⛰️నారాయణాద్రి⛰️* 


నారాయణాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ... సాక్షాత్ నారాయణుడే నివసించడంవల్ల నారాయణాద్రి అనే పేరు వచ్చింది. అంతేగాదు, శ్రీమన్నారాయణుడు మొట్టమొదట ఈ గిరి మీద పాదాలు మోపడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. అదే గాకుండా నారాయణుడే భక్తుడు తపమాచరించి నారాయణుని సాక్షాత్కారం పొందడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. అలాగే నారాయణుడనే బ్రాహ్మణుని ప్రార్థన మన్నించి శ్రీనివాసుడు వాసం చేయడం వల్ల కూడా నారాయణాద్రి అనే పేరు వచ్చింది.


 *⛰️ వెంకటాద్రి ⛰️* 


వెంకటాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ... "వేం''కారానికి అమృతమని అర్థం "కటం'' అంటే ఐశ్వర్యం, నమ్మి కొలిచేవారికి అమృతాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే కొండ అని అర్థం. అలాగే పాపాలకు ''వేం'' అనే అర్థం ఉంది. ఆ పాపాలను దహించే కొండ కాబట్టి ఈ కొండకు వెంకటాద్రి అనే పేరు వచ్చింది. వెంకటాద్రి అనే పేరు రావడానికి ఇంకొక కథ కూడా ప్రచారం ఉంది. పూర్వం శ్రీకాళహస్తిలో పురందరుడు అనే శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణుడు ఉండేవాడు. పుత్రసంతానం లేక బాధపడి అనేక వ్రతాలు చేసాడు. చివరకు ముసలితనంలో మాధవుడనే పుత్రుణ్ణి కన్నాడు. మాధవుడు వేదవేదాంగాది సకల విద్యలను నేర్చుకుని మహాపండితుడయ్యాడు. యుక్తవయస్సు వచ్చింది. చంద్రలేఖ అనే కన్యను పెళ్ళి చేసుకున్నాడు. ఏ లగ్నంలో పెళ్ళి చేసుకున్నాడో కానీ కామాంధుడై భార్యను వదిలి, బ్రాహ్మణ విధులను విడిచి స్త్రీల పొందు పొందేవాడు. అంతేకాకుండా కుంతల అనే వేశ్యను మోహించి దిగజారిపోయి జంధ్యాన్ని తెంచేసి, మద్యమాంసాలను స్వీకరిస్తూ ఆమెతో సుఖించేవాడు. కొంతకాలానికి ఆమె మరణిస్తుంది. ఆమె వియోగంతో అతను పిచ్చివాడిలాగా దేశదిమ్మరి అయిపోతాడు.


⛰️⛰️ఒకరోజు వెంకటాద్రి యాత్ర వెళ్ళే భక్తుల్ని చూశాడు. వాళ్ళతో కలిసి వేంకటాచలానికి బయలుదేరాడు. మొదట చక్రతీర్థంలో స్నానం చేశాడు. దాంతో అతని కల్మషాలన్నీ పోతాయి. పితృదేవతలకు మట్టి పిండప్రదానం చేశాడు. వాళ్ళు ముక్తి పొందారు. వేంకటాచల మహత్యం వల్ల అతని పాపాలన్నీ దహించుకుని పోయాయి. ఆ విశేషాన్ని చూడడానికి దేవతలంతా వచ్చి వెంకటాద్రి మహాత్యాన్ని కొనియాడారు. అప్పుడు బ్రహ్మదేవుడు మాధవుని చూసి "ఓ బ్రాహ్మణుడా! నువ్వు వెంకటాచలం మహిమ వల్ల పాపాలను పోగొట్టుకున్నావు. వెంటనే స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకో. మరుజన్మలో పాండవ వంశంలో ఆకాశరాజుగా పుడతావు. లక్ష్మీదేవి నీ కూతురుగా పుడుతుంది. శ్రీనివాసుడు నీకు అల్లుడు అవుతాడు. అన్ని కోరికలు తీరి చివరికి వైకుంఠాన్ని చేరుకుంటావు. ఈ పర్వతం వేంకటాద్రి అనే పేరుతొ వర్థిల్లుతుంది'' అని చెప్పు అదృశ్యమవుతాడు. సర్వపాపాలను దహించేది కాబట్టి వేంకటాద్రి అని అర్థం.


 *⛰️ శ్రీశైలం ⛰️* 


శ్రీశైలం అనే పేరు ఎలా వచ్చిందంటే ... శ్రీ అంటే లక్ష్మీదేవి నివసించే కొండ కాబట్టి దీనికి శ్రీశైలమనే పేరు కూడా వచ్చింది. ఈ కొండడు మరొక పేరు వుంది. అదే శ్రీనివాసాద్రి. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించినప్పుడు అందులో లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి నారాయణుడిని చూసి తనను పెళ్ళాడమని కోరుకుంది. అప్పుడు నారాయణుడు తనకు ఇల్లు వాకిళ్ళు లేవు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాను ... పైగా తనకు భక్తులు ఎక్కడ భక్తితో పూజిస్తారో అక్కడ తాను ఉంటానని. కాబట్టి నువ్వు నా వక్షస్థలంలో ఉండు అని లక్ష్మీదేవికి చెపుతాడు శ్రీ మహావిష్ణువు."శ్రీ'' నివసించే చోటు కాబట్టి స్వామిని శ్రీనివాసుడని. శ్రీనివాసుడు నివసించే తిరుమలకు 'శ్రీనివాసాద్రి'' అనే పేరు వచ్చింది.


 *⛰️వృషాద్రి⛰️*


దీనికి వృషాద్రి అనే మరొక పేరు ఉంది. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ... వృష అనే పదానికి ధర్మమనే అర్థం. ధర్మదేవత తన అభివృద్ధి కోసం ఈ కొండ మీద తపస్సు చేయడం వల్ల దీనికి వృషాద్రి అనే పేరు వచ్చింది. అదే కాకుండా యమధర్మరాజు ఈ కొండపైన తపస్సు చేయడంవల్ల కూడా వృషాద్రి అనే పేరు వచ్చింది. ఈ ఏడు కొండలకు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. అవి ... చింతామణిగిరి, జ్ఞానాద్రి, తీర్థాద్రి, పుష్కరాద్రి, కనకాద్రి, వైకుంఠాద్రి, సింహాద్రి, వరాహగిరి, నీలగిరి, సుమేరు శిఖరాచలం.

వైశాఖ పురాణము - 17

 వైశాఖ పురాణము - 17


17వ అధ్యాయము - యముని పరాజయము


అప్పుడు నారదమహర్షి యమలోకమునకు వెళ్లెను. యమలోకస్థితిని జూచెను. యమధర్మరాజా! నీ లోకమున నరకబాధలు పడువారి రోదన, ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుటమాని మునివలె మౌనముగ నున్నాడేమి? సహజముగ బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండటకు కారణమేమి? అని ప్రశ్నించెను. యముడును దీనుడై యిట్లనెను. నారదమహర్షీ! భూలోకమున యిక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు. అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరిని వైశాఖవ్రతము నవలంభించునట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగ శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తివలననో దండన భయముననో తప్పక వైశాఖమాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చువారెవరును లేక వైశాఖస్నానాదుల మహిమవలన శ్రీహరిలోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైనమానువలెనుంటిని. నాకు యిట్టిస్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పినపనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసికొని ఊరకుండువాడు తప్పక నరకము నందును నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేక పోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమియని యడుగుదును. అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగున్నదని తన దారిన పోయెను.


యమధర్మరాజు తన వాహనమైన మహిషము నెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులగు యేబదికోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజని తెలిసికొని యుద్ధసన్నద్ధుడై యమధర్మరాజునెదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులగు మృత్యువు, రోగము, యమదూతలు కీర్తిమంతుని యెదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించి ఆయుధములన్నియు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును జూచి అందరును బెదిరి హాహాకారములను చేసిరి.


అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనములగావించి మరలించి యమునిపై మరలెను. విష్ణుభక్తుడను కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమునిట్లు స్తుతించెను.


సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ

త్వం సర్వలోక రక్షాయై ధృతః పురా

త్వాం యాచేద్యయమంత్రాతుం విష్ణుభక్తం మహాబలం ||

నృణాందేవద్రుహాంకాల స్త్వమేవహినచాపరః

తప్పాదేవం యమం రక్ష కృపాంకురు జగత్పతే ||


అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శనచక్రము యముని విడిచి దేవతలందరును చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను.


అతడు తలవంచుకొని సవిచారముగ బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభదీర్చియుండెను. మూర్తములు, అమూర్తములునగు వారిచే బ్రహ్మ సేవితుడై యుండెను. బ్రహ్మ దేవతల కాశ్రయమైనవాడు. జగములు అను వృక్షమునకు, బీజము, విత్తనము అయిన వాడు. అన్ని లోకములకును పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు, దిక్పాలకులు, రూపముకల, ఇతిహాసపురాణాదులు, వేదములు, సముద్రములు, నదీ నదములు, సరోవరములు, అశ్వర్థాది మహా వృక్షములు, వాపీకూప తటాకములు, పర్వతములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళలు, కాష్ఠములు, నిమేషములు, ఋతువులు, ఆయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, నిమేషోన్మేషములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, సుఖదుఃఖములు, భయాభయములు, లాభాలాభములు, జయాపజయములు, సత్వరజస్తమోగుణములు, సాంత, మూఢ, అతిమూఢ, అతి ఘోరావస్థలు, వికారములు సహజములు, వాయువులు, శ్లేష్మవాత పిత్తములు వీనితో కొలువు దీరిన బ్రహ్మను చూచెను.


ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్తపెండ్లి కూతురు వలె తలవంచుకొని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని జూచి సభలోనివారు క్షణమైన తీరికయుండని యితడిక్కడికెందులకు వచ్చెను. తలవంచుకొని విషాదముగ నుండుటకు కారణమేమియని సభలోనివారు విస్మయపడిరి. ఇతడు వచ్చిన కారణమేమి? పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండుటేమి? అని యిట్లు సభలోనున్న భూతములు, దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమధర్మరాజు బ్రహ్మపాదముల పైబడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని యేడ్చెను. స్వామీ! నన్ను రక్షించు నీవుండగా నేను పరాభవమునందితిని. మానవుల పుణ్యపాపముల దెలుపుపటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగ నిర్వ్యాపారముగ చేతులు ముడుచుకొని యుండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై యుండెను.


దీనిని జూచి సభలో గగ్గోలు బయలుదేరెను. స్థావరజంగమ ప్రాణులన్నిటిని యేడ్పించు నితడే యేడ్చుచున్నాడేమి? అయినను జనులను సంతాపపరచువాడు శుభమును పొందునా? చెడు చేసినవాడు చెడును పొందక తప్పునాయని సభలోనివారు పలు విధములుగ తమలో తాము అనుకొనిరి.


వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరచి బ్రహ్మపాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు, దృఢములునగు తన బాహువులతో పైకి లేవదీసెను. దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి యూరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు? నీ పనినిన్ను చేసికొనకుండ అడ్డగించిన వారెవరు? ఈ పాప పట్టికను యిట్లు తుడిచిన వారెవరు వివరముగ చెప్పుము? నీవెందులకు వచ్చితివి? అందరను పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు. భయములేదు చెప్పుమని వాయువు అడుగగా యమధర్మ రాజు 'అయ్యో' అని అతిదీనముగ బలికెను.


వైశాఖ పురాణం 17వ అధ్యాయం సమాప్తం.


ఓం నమో నారాయణాయ

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*25-05-2024 / శనివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

---------------------------------------

వృషభం


చేపట్టిన పనులలో శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది.

---------------------------------------

మిధునం


ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆశించిన సహాయం లభించదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

---------------------------------------

కర్కాటకం


సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------

సింహం


చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు.

---------------------------------------

కన్య


చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది

---------------------------------------

తుల


స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయమై అధికారుల నుండి కొంత ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------

వృశ్చికం


ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసే లాభాలు అందుకుంటారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది.

---------------------------------------

ధనస్సు


చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. ఆరోగ్యవిషయాలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు. జీవిత భాగస్వామితో వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు.

---------------------------------------

మకరం


చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

కుంభం


ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది.

---------------------------------------

మీనం


ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తులాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. భూ సంభందిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

నారదముని జయంతి* 🌸

 🌸 *నేడు వైశాఖ బహుళ విదియ - నారదముని జయంతి* 🌸



*𝕝𝕝 ॐ 𝕝𝕝 _25/05/ 2024 -దేవఋషి శ్రీ నారద ముని వారి జయన్తీ శుభాకాంక్షలు_ 𝕝𝕝 卐 𝕝𝕝*

~~~~~~~~~~~~~~~~~~~~~~~


నారదుడు దేవర్షి , సంగీతజ్ఞుడు. నిరంతరం లోక సంచారం చేస్తారు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ  తెలుపుతుంటారు. ఆయన ఒక ఆదర్శ పాత్రికేయుడు. మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత, త్రేతా, ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన ఉంటారు. నారదుని జన్మతిధి వైశాఖ బహుళ పాడ్యమి. ఈ తిధినాడే ప్రపంచమంతా నారద జయంతిని జరుపుకుంటున్నది.


 *ముల్లోకసంచారి*


నారదుడు త్రిలోక సంచారి. మూడు లోకాల్లోను సంచరిస్తూ ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటారు. ఎంతోమంది సాత్వికులకు అయన మోక్షమార్గాన్ని చూపించాడు. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తుంటాడు. అయితే కొంత మంది మేధావులు, రచయితలు మాత్రం ఆయన్ను *“కలహా భోజనుడు” గా “కలహా ప్రియుడు” గా* అభివర్ణించారు.

ఈ లోకం తీరే ఇంత. నిజం మాట్లాడే వాడికి ఎప్పుడు కష్టాలే. అందుకే అన్నారు *‘యదార్ధవాది లోక విరోధి’*. ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటించే వాళ్ళంటే అదో చిన్న చూపు. వారిని లోక విరోధులుగానే చూస్తారు. అనేక కష్టాలకు గురి చేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కొరకు నిరంతరం తపించే వాడు. ముల్లోకాలలోనూ సంచరిస్తూ దేవ, మానవ, దానవులకు  సందర్భానుసారంగా కర్తవ్య బోధ చేస్తుంటాడు. అయితే నారదుడిది ఒకటే లక్ష్యం. ధర్మం గెలవాలి.


*‘నార’* అనగా మానవ జాతికి ఉపయోగపడే జ్ఞానం అని , *‘ద’* అనగా ఇచ్చే వాడని అర్ధం ఉంది. మానవజాతి నిరంతర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి , వారిని సన్మార్గంలో నడిపించేవాడే నారదుడు. అంతే కాదు, నారదుడు ఒక అత్యున్నత సంగీతకారుడు.


*జన్మ వృత్తాతం*


ప్రళయం తర్వాత కాలంలో పునఃసృష్టి ప్రారంభమైనప్పుడు నారాయణుడి నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ మరీచి , అత్రి మొదలైన ఎనిమిది మంది ప్రజపతులను సృష్టించాడు. వీరిలో నారదుడు కూడా ఒకరు.


*ధర్మ రక్షణలో నారదుడి పాత్ర*


 *రామాయణ రచనలో*


రామాయణ రచనలో మనకు నారదుడి పాత్ర కనిపిస్తుంది. వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన నారదుడితో *“ఎన్ని కష్టాలు వచ్చినా , ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఋజువర్తనలో సాగిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ?”* అంటూ ప్రశ్నించాడు వాల్మీకి. అప్పుడు అయోధ్య రాజైన శ్రీరామచంద్రుడు గురించి మొదట వాల్మీకికి తెలిపింది నారదుడే. వాల్మీకి మహర్షి రామకథను విని పులకించి పోయాడు. నారదుడి తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి రామకథను శ్లోక రూపంలో రచించమని కోరాడు.


*మహర్షికి మార్గదర్శనం*


ఒకసారి మహర్షి వేదవ్యాసుడు వేదాలను ఋగ్ , యజుర్ , సామ , అధర్వణమని నాలుగు భాగాలుగా విభజించాడు. సామాన్యులకు వేదాలు మరింత సులభంగా అర్ధం కావాలనే తలంపుతో పురాణాలను రచించాడు. మహాభారతాన్ని రాశాడు. మానవాళి శ్రేయస్సుకై ఇన్ని రచించినప్పటికీ ఆయనకు తృప్తి కలుగలేదు. ఒకరోజు సరస్వతీ నది ఒడ్డున కూర్చుని ఆలోచనలో నిమగ్నుడై ఉండగా నారదుడు వచ్చి ఆయన్ను పలకరించాడు. భక్తి మహత్యాన్ని తెలిపే నారాయణుడి లీలలను తెలిపే భాగవతాన్ని రాయమని కోరాడు. ఈ రచనతో కలియుగంలో ప్రజలకు దైవభక్తి , సత్సాంగత్యం కలుగుతాయని నారదుడు తెలిపాడు.ఇలా మానవాళికి మార్గం చూపే రామాయణం , మహాభారతం , భాగవతాలను గ్రంధస్థం చేయడంలో , వాటి ప్రచారంలో నారదుడి పాత్ర చాలానే ఉంది.


అలాగే వాల్మీకి , ధ్రువుడు , చిత్రకేతు , ప్రహ్లాదుడు  సావిత్రి వంటి వారికి భక్తి మార్గాన్ని ఉపదేశించినది కూడా నారద మహర్షియే.


*ధ్రువుడు*


ఉత్తానపాద మహారాజుకి ఇద్దరు భార్యలు. వారిలో ఒకరు సునీత. ఆమె కుమారుడు ధ్రువుడు. రెండవ భార్య సురుచి. ఆమె కుమారుడు ఉత్తముడు. ఒకరోజు సురుచి *“నువ్వు రాజు కావడానికి అనర్హుడివి” అని ధ్రువుడిని నిందిస్తుంది. దానితో విష్ణువుని మెప్పించి రాజార్హత సంపాదిస్తానని ఐదేళ్ళ వయసు లోనే అడవి బాట పడతాడు ధ్రువుడు. ధ్రువుని శపథం విన్న నారదుడు వెంటనే అతని వద్దకు వచ్చి తపస్సు చేసే పద్ధతి వివరిస్తాడు. “ఓం నమో భగవతే వాసుదేవాయ”* అన్న మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాడు. నారదుని ఉపదేశం ప్రకారం ధ్రువుడు తన తపస్సు ద్వారా శ్రీ మహావిష్ణువుని మెప్పిస్తాడు.


 *చిత్రకేతు*


శూరసేన రాజ్యానికి సంబంధించిన కథలోనూ నారదుడి పాత్ర మనకు కనిపిస్తుంది. ఈ రాజ్యానికి రాజు చిత్రకేతు. ఆయనకు ఎన్నోఏళ్ల తర్వాత ఒక కుమారుడు జన్మిస్తాడు. అయితే చిత్రకేతు మిగిలిన భార్యలు ఆ పిల్లవాడికి విషం పెట్టి చంపేస్తారు. లేక లేక పుట్టిన కుమారడు మృతి చెందడంతో చిత్రకేతు చాలా దుఃఖిస్తాడు. నారదుడు వచ్చి అతనిని ఎంత అనునయించినా ఫలితం లేకపోవడంతో , తన యోగ శక్తితో చనిపోయిన చిత్రకేతు కుమారుని బ్రతికిస్తాడు. తిరిగి ప్రాణం పోసుకొన్న అ బాలుడు *“నేను ఎన్నో జన్మలను ఎత్తాను. ఎంతోమంది తల్లితండ్రులను చూశాను. ఒకరి చేతిలోనుంచి ఇంకొకరి చేతిలోకి మారే నాణెం లాగా మానవుడు తన కర్మాను సారం ఒక జన్మ తర్వాత మరొక జన్మ ఎత్తుతాడు. నేను ఈ జన్మ చక్రం నుంచి బయట పడాలను కుంటున్నాను”* అని దేహ త్యాగం చేశాడు. దీంతో చిత్రకేతుకు జ్ఞానోదయమవుతుంది. అతని మనస్సు నిర్మలమవుతుంది. చిత్రకేతుకి మంత్రోపదేశం చేసి మోక్షమార్గాన్ని చూపాడు నారదుడు.


*భక్త ప్రహ్లాద*


భక్త ప్రహ్లాదుడికి సంబంధించిన వృత్తాంతం లోనూ మనకు నారదుడు దర్శనమిస్తారు. హిరణ్యకశిపుడు దేవతలకు శత్రువు. ఒకసారి అతడు మంధర పర్వతం మీద తపస్సుచేసుకుంటూ ఉండగా, ఇంద్రుడు అతని భార్యని చెరపడతాడు. వెంటనే అక్కడకు వచ్చిన నారదుడు ఇంద్రుడిని వారిస్తాడు. ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నావని హెచ్చరిస్తాడు. హిరణ్యకశిపుని భార్యను నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. ఆమెకు ధర్మానికి సంబంధించిన విషయాలతో పాటు శ్రీమన్నారాయణుని లీలను బోధించేవారు. వీటిని ఆమె గర్భంలోని శిశువు ఎంతో ఆసక్తితో వినేవాడు. నారదుడి బోధనలు విన్న ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహావిష్ణువు భక్తుడయ్యాడు.


*సతీ సావిత్రి*


సావిత్రి కథలోనూ మహర్షి నారదుడు కనిపిస్తారు. మద్ర రాజు ఆశ్వపతి కుమార్తె సావిత్రికి సత్యవంతునితో వివాహం జరుగు తుంది. నారదుడు వచ్చి సత్య వంతుడు చాలా బుద్ధిమంతుడని , అయితే ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమే జీవిస్తాడని చెబుతాడు. అయినా అంతా శుభమే జరుగు తుందని నారదుడు సావిత్రికి ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత నారదుడి ఉపదేశానుసారం సావిత్రి తన పతిభక్తితో యమధర్మ రాజు ను మెప్పించి తన భర్త ప్రాణాలను తిరిగి కాపాడుకుంటుంది.


 శ్రీ కృష్ణుడి కథల్లోనూ నారదుడు మనకు దర్శనమిస్తాడు. ఇటు ధర్మరాజుకి రాజధర్మం , ప్రజలకోసం రాజు నిర్వహించాల్సిన కార్యాలను గురించి  కూడా నారదుడు వివరిస్తాడు. పాండవులు అరణ్య వాసం చేస్తున్నప్పుడు వారికి ఉపయుక్తమైన కథలు , ధర్మాలు చెప్పమని మార్కండేయ మహర్షిని వారివద్దకు పంపిస్తారు.


ఇంకా వేదాలు , ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావన మనకు కనిపిస్తాయి. ఖగోళ , సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు. వేదాలలో చెప్పిన విషయాలను దేశ, కాల పరిస్థితులకు తగినట్లుగా అన్వయించుకుని, ఎలా పాటించాలో చెప్పేవే స్మృతులు. నారదుడు కూడా అటువంటి స్మృతిని రచించాడు. దానిని `నారద స్మృతి’ అంటారు.  నారదుని  *“నారద శిక్ష”* అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. నారద భక్తి సూత్రాలు అనే గొప్ప గ్రంథాన్ని ఆయన రచించారు. ఇందులో భక్తి మార్గము , దాని విశిష్టత , దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించారు. అలాగే `బృహన్నారదీయమ్’, `లఘునారదమ్’ అనే గ్రంధాలలో ఆస్తిపంపకాలు మొదలైన ధర్మాలన్నీ వివరించారు. అవి నేటికీ ఉపయోగపడుతున్నాయి. నారదుడు రచించిన శిల్పశాస్త్రం కూడా ఉంది.  ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకై ధర్మ రక్షణ కోసం నారద మహర్షి తనదైన పాత్ర పోషించారు.


*మొదటి పాత్రికేయుడు నారదుడు*


ఇలా చెప్పుకొంటూ పోతే నారదుడు చేసిన మంచి పనులు అన్నీ ఇన్నీ కావు. మానవాళి శ్రేయస్సు కొసం ఎన్నో మంచిపనులు చేశారు. అవసరమైతే వ్యక్తుల మధ్య కలహాలు కూడా సృష్టించాడు. ఎన్ని కలహాలు సృష్టించినప్పటికీ అయన ధ్యేయం ధర్మ రక్షణే. శిష్ట రక్షణ , దుష్ట శిక్షణే. అయితే ఆయన అందరితో స్నేహం చేసేవాడు. చివరికి దానవులతో కూడా ఆయనకు సత్సంబంధాలున్నాయి. కానీ ధర్మానికి హాని చేసేవారు ఎంత స్నేహితులైన ఉపెక్షించే వాడు కాదు నారదుడు. తప్పు చేసినవాడు ఎంతటి వాడైన అతనికి శిక్ష పడేటట్లు చేయటమే నారదుని లక్ష్యం. మానవాళి శ్రేయస్సు కోసం , ధర్మ రక్షణ కోసం నారదుడు ఎప్పుడూ తపిస్తూ ఉంటాడు. అందుకే నారదుడు మహర్షి అయ్యాడు. మహర్షి అంటే ఋషులకే ఋషి. ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడేవారిని ఋషులనే అంటారు.


నేటి సమాజంలో ఒక పాత్రికేయుని జీవితం కూడా ప్రజల తరఫున పోరాడటమే. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పాత్రికేయుని జీవితం సాగుతుంది. ఈ మార్గంలో పత్రికేయులందరికి మహర్షి నారదుని జీవితం పరమ ఆదర్శం. అందుకే నారదుడిని మొదటి పాత్రికేయుడు అంటాం.


*నారద జయంతి –  ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం*


వైశాఖ బహుళ విదియ మహర్షి నారదుని జన్మ తిధి. మొదటి ఆదర్శ పాత్రికేయుడయిన నారదుని జయంతిని ప్రపంచం యావత్తు పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఆ రోజున పాత్రికేయ వృత్తికి న్యాయంచేకూర్చే కొంతమంది పాత్రికేయులకుసన్మాన సత్కారాలు జరుగుతాయి. ఆ రోజున మహర్షి నారదుని స్మరించు కొని నిజమైన పాత్రికేయ వృత్తిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పాత్రికేయులంతా మహర్షి నారదుని బాటలో నడిస్తే ఇక ప్రజలకు కష్టలెక్కడి నుండి వస్తాయి ? ధర్మ మార్గంలో  నడిచే సమ సమాజం వెల్లివిరిస్తుంది....

గురుచరణ కమలములనే

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *సౌవర్ణేనవరత్నఖండ రచితేపాత్రేఘృతం పాయసం*

*భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్* |

*శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్జ్వలం*

*తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా పభ్రో స్వీకురు*  ౨

                  [ *శివ మానస పూజ* ]


ఓ పభ్రూ! తొమ్మిదివిలువైన రత్నాలు పొదిగిన బంగారు పాతల్రో తయారుచేసిన పాయసం, ఐదు రకాల తీపిపదార్థాలు, పెరుగు,

అరటిపండుతో చేసిన రసంతో చేసిన భోజనాన్ని దయచేసి

స్వీకరించండి. నేను కర్పూరంతో సువాసనతో కూడిన అనేక మూలికలతో చేసిన స్వచ్ఛమైన నీటిని మరియు చివరగా

తమలపాకులను కూడా అందిస్తున్నాను. నా హృదయంలో భక్తితో చేసే

ఈ నైవేద్యాన్ని స్వీకరించండి.



   👇 //------ ( *మోహముద్గరం* )-----// 👇


*గురుచరణా౦బుజ నిర్భర భక్తః*

*సంసారాదచిరార్భవ ముక్తః*

*సేంద్రియమానస నియమాదేవం*

*ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం* ॥31॥


భావం: గురుచరణ కమలములనే సర్వస్వంగా భావించిన ఓ భక్తుడా! నీ ఇంద్రియాలను, మనసుని నిగ్రహించడం ద్వారా మాత్రమే ఈ *చావు పుట్టుకులతో కూడిన సంసార సాగరం నుండి ముక్తుడవై, నీ హృదయంలోనే ఉన్న పరమాత్మ సాక్షాత్కారం పొందెదవు గాక*!

వెధవ బండి*

 *వెధవ బండి*

(వ్యాకరణము నందు(తెలుగు)మక్కువ గల వారికి విందు భోజనం)

🌺🌺🌺🌺🌺🌺🌺 🌺 🌺 


   ఈ సంఘటన చాలా పాతకాలం నాటిది. ఒక పండితుడు వేరొక పండితుడి గ్రామానికి బస్సులో వస్తున్నానని కబురు చేశాడు. తన ఇంటికి వస్తున్న పండితుడిని ఆహ్వానించి, ఇంటికి తీసుకెళ్లడానికి ఎడ్లబండి కట్టుకొని బస్సు వచ్చే చోటికి వెళ్లాడు.


 బస్ స్టాండ్ గ్రామానికి 3, 4 మైళ్ళ దూరంలో ఉంది. అందువలన, వేరే బండివాడిని తీసుకు రాకుండా, తానొక్కడే ఎద్దులను కట్టి, బండిని తోలుకుంటూ బస్టాండ్ కు వచ్చాడు. బస్సు దిగిన సోదర పండితుడిని సాదరంగా ఆహ్వానించి, బండిలో కూర్చోబెట్టుకొని తన గ్రామానికి బయలుదేరాడు.


 పల్లెటూరుకు వెళ్లే త్రోవ కాబట్టి, అంత బాగా లేదు. నల్లేరు మీద బండి నడకలా కాకుండా, ఎగుడు దిగుడు బండల మీద త్రోవ వల్ల, ఎద్దుల బండి బాగా కుదుపులతో వెళుతూవుంది. 

కుదుపులు ఎక్కువగా ఉండడం వలన పోరుగూరి నుంచి వచ్చిన పండితుడు *'అబ్బబ్బ వెధవ బండి'* అన్నాడు.


దానికి, బండి యజమానియైన పండితుడు, ఏమండీ మీరంటున్నది షష్టీ తత్పురుషమా! లేక కర్మధారయమా! అన్నాడు నవ్వుతూ. షష్టీ తత్పురుషము అయితే 'వెధవ యొక్క' బండి అనే అర్థము వస్తుంది. అదే కర్మధారయమైతే 'వెధవ (యైన) బండి' అనే అర్థము వస్తుంది. (బండి యొక్క యజమాని వెధవనా? బండి వెధవదా?).


దానికి పొరుగూరి పండితుడు నవ్వుతూ, "అది యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి" అన్నాడు. (అంటే వెధవ కొఱకు బండి) అని. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. ఆ కాలంలో పండితులు మాటల్లో కూడా అలాంటి చెణుకులు విసురుకొని ఆనందించేవారు.


******  ******  ******  ******


ఇంకొక చమత్కార సంభాషణను ఆస్వాదిద్దాం.

 ఒక శిష్యుడు, గురువుగారి దగర విద్య అభ్యసించి,

పెళ్ళి చేసుకొని ఊరికి వెలుపల ఇల్లు కట్టుకొని స్థిరపడ్డాడు. ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద శిష్యుడి గ్రామం దారిలో వెళుతూ, ఒకసారి చూసి వెళ్దామని, శిష్యుడి యింటికి వచ్చాడు.


రాక రాక వచ్చిన గురువు గారికి, శిష్యుడూ, అతడి భార్య చక్కని ఆతిథ్య మిచ్చి, తాంబూల సహిత పంచలచాపు యిచ్చి పాదాలకు నమస్కారం చేశారు. అప్పుడు గురువు గారు, ఒక శార్దూల వృత్తంలో (పద్యము), వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.


అప్పుడు చమత్కారియైన శిష్యుడు నవ్వుతూ, "గురువుగారూ, ఆతిథ్యం స్వీకరించి మా యింట శార్దూలమును (పులిని) విడిచి వెళ్ళుట మీకు న్యాయమేనా?" అన్నాడు.


దానికి గురువుగారు నవ్వుతూ, "ఆ శార్దూలమును మంత్రించి వదిలేశాను. నీకు ఏలాంటి అపకారం చేయదు. అదీగాక, నీవు ఊరి వెలుపల ఇల్లు కట్టుకున్నావు. పంచమీ తత్పురుషము లేకుండా ఈ షష్టీని కాపలాగా పెట్టానని" అన్నారు.


పంచమీ తత్పురుషానికి అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగవలన భయము'. షష్టీ తత్పురుషానికి 'కుక్క యొక్క కాపలా'. అంటే, గురువుగారు, దొంగ వలన భయము లేకుండా శార్దూలాన్ని కాపలా పెట్టారన్నమాట.


ఆ కాలం వాళ్లు, ఈ కాలం వాళ్ల లాగా, గుమ్మం దగ్గర నుండే టాటా, బై బై చెప్పేవారు కాదు. గురువుగారిని బండిలో ఎక్కించి, "మీరు మళ్ళీ మా యింటికి దయచేయాలి అని మర్యాద పూర్వకంగా అనేవారు". శిష్యుడు కూడా అలాగే అన్నాడు.


అందుకు గురువు గారు నవ్వుతూ, "నీవు ద్వంద్వా తీతుడవైన తర్వాత వస్తానులే" అన్నాడట. ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ, 'భార్యా భర్తలు', 'తలిదండ్రులు', 'అక్కాచెల్లెళ్లు' అని ఉంటుంది.


ద్వంద్వాతీతుడంటే మీ భార్యాభర్తలు తలిదండ్రులు అయినప్పుడు, అంటే, "మీకు సంతానం కలిగినప్పుడు మళ్ళీ వస్తానని" అర్థము. పూర్వకాలము పండితులు కలిసినప్పుడు, ఇంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.


మనం ఎలాగూ మాట్లాడలేము. కనీసం విని ఆనందిద్దామని మీకు ఈ వ్యాసము ద్వారా

😊తెలియజేస్తున్నాను.


చదివినందుకు ధన్యవాదాలు😊🙏🏻🙏🏻🙏🏻

పంచాంగం 25.05.2024 Saturday.

 ఈ రోజు పంచాంగం 25.05.2024  Saturday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస కృష్ణ    పక్ష:  ద్వితీయ తిధి స్థిర వాసర: జ్యేష్ఠ నక్షత్రం సిద్ధ యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


విదియ సాయంత్రం 06:54 వరకు.

జ్యేష్ఠ పగలు 10:33 వరకు.

సూర్యోదయం : 05:45

సూర్యాస్తమయం : 06:41


వర్జ్యం : ఈ రోజు లేదు 


దుర్ముహూర్తం : ఉదయం 05:45 నుండి 07:28 వరకు.


అమృతఘడియలు : రా.తె  04:08 నుండి 05:45 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

రహస్య గ్రంథాలు

 ప్రాచీన భారతీయ మహర్షులు రచించిన రహస్య గ్రంథాలు -  వాటి గురించి విశేషాలు .


     మన ప్రాచీన మహర్షులు మహా తపస్సంపన్నులు మరియు గొప్ప విజ్ఞానులు . వీరు తమయొక్క విజ్ఞానాన్ని గ్రంధరూపంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఆయా గ్రంథాలు మనకి దొరకటం లేదు .  నాకున్న పరిఙ్ఞానం మరియు కొన్ని పురాతన గ్రంధాలను పరిశోధించి వారు రాసిన గ్రంథాలు వేటికి సంభంధించినవో వాటిలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను . 


 *  బృహద్యంత్ర సర్వస్వము  - 


         ఈ గ్రంథమును భరద్వాజ మహర్షి రచించెను . ఈ గ్రంధము నందు అనేక యంత్రాల గురించి వివరంగా ఇచ్చాడు. ముఖ్యంగా " విమానాధికారణము" అను ఒక అధ్యాయం కలదు. ఇందు అనేక విమానాలు మరియు విచిత్రంగా మెలికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించారు . ఈ విమానాలు ఆకాశంలో ఎగురునప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి , భయంకర వాయుగుండాల గురించి , అమిత విద్యుత్ శక్తి నుండి , అత్యుష్ణము , అతి శీతలం నుండి విమానం మరియు అందులో ప్రయాణించే వారిని రక్షించేందుకు పదమూడు రకాల దర్పణములు ( అద్దములు ) గురించి వివరించారు 


                   ఇందు దుష్టశక్తులను నిరోధించి ఉత్తమ శక్తులను ఆకర్షించు దర్పణములు ఆరున్నూ , సూర్యుని నుండి రకరకాల సూర్యకిరణములు ఆకర్షించి అక్కరలేని వాటిని నిరోధించే దర్పణములు ఆరున్నూ కలవు. పదమూడొవది వివిధరకాల పొగను సృష్టించును. విచిత్రకార్యములకు ఉపయోగపడును.


                 ఇప్పుడు మనం తయారుచేసే అద్దాలలో ప్రధానంగా సోడియమ్ గ్లాసులు , పొటాషియం గ్లాసులు మాత్రమే . కాని మన ప్రాచీనులు అద్దం తయారుచేసేప్పుడు సువర్ణం , పాదరసం , అయస్కాంతం , ముత్యములు మొదలగునవి కలిపెదరు . అంతే కాకుండా కొన్నిరకాల దివ్యోషదాలు కూడా అద్దం తయారీలో కలిపేవారు.  


          అనేక రకాల విచిత్ర వస్తువుల గురించి కూడా ఈ గ్రంథంలో విపులంగా ఉంది.


 *  ఆగతత్వలహరీ  - 


         ఇందు వ్యవసాయం , అనేక వృక్షాల వర్ణనలు , వాటి చికిత్సా పద్దతులు కలవు. ఈ గ్రంథం అశ్వలాయన మహర్షి రచించెను .


 *  అవతత్వ ప్రకరణం  - 


          ఈ గ్రంథాన్ని కూడా అశ్వలాయన మహర్షి రచించారు . దీనిలో స్నానఫలాలు జలాల్లో రకాల గురించి వివరించారు . 


 *  అండ కౌస్తభం  - 


           ఇది పరాశర కృతం . బ్రహ్మాండ చరిత్ర 

జీవకోటి విమర్శ మొదలగునవి వివరించబడినవి.


 *  అంశు బోధిని - 


           ఇది భరద్వాజ మహర్షి రాశారు. ఇందు గ్రహములు వేధించు పద్దతులు  , ప్రకాశం ( light ) , ఉష్ణం ( heat ) , ధ్వని ( sound ) , తంత్రీ వార్తావిధి ( టెలిఫోనీ ) , విమాన నిర్మాణ విధి ,విద్యుతశక్తి ప్రయోగాలు కలవు.


 *  ఆకాశ తంత్రం  - 


            ఇది భరద్వాజ మహర్షి రచించారు . ఇందు ఆకాశం యొక్క 7 విధములు , ఆకాశక్షేత్ర విభాగములు , ఆకాశంలోని శక్తి సంయోగ విధములు , ఆకాశం నందలి అగ్ని, కాంతి, గ్రహ కక్ష్యలు , భూములు , నదులు మొదలగు వాటి వివరణలు కలవు.


 *  ఋక్ హృదయ తంత్రం  - 


            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు రోగములు , చికిత్సలు విశేషముగా వివరించబడి ఉన్నాయి.


 *   ఔషధీ కల్పం  - 


            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు ఔషధముల ప్రభావములు . చిరకాలం జీవించుటకు యోగాలు , గుళికా యోగములు, ఆయుర్వృద్ది మొదలగునవి కలవు.


 *  కరక ప్రకరణము  - 


             ఇది అంగీరస మహాముని రచించెను . ఇందు మేఘములలొని మార్పులు , జీవరాశుల ఉత్పతి విధానం , సూర్యరశ్మిలోని మార్పులు మేఘములకు సంబంధము , నవరత్నములు పుట్టుటకు సంబందించిన సూర్యరశ్మి విభాగాలు కలవు.


 *   కర్మాబ్దిసారము  - 


             ఇది ఆపస్తంబ మహర్షిచే రచించబడెను . ఇందు కర్మలు , చేయవలసిన విధులు , వాటి ప్రాముఖ్యత , వాటి ఫలములు , శారీరక , మానసిక ఫలములు మొదలైనవి కలవు.


 *   కౌముదీ  - 


               ఇది సోమనాథ కృతం ఇందు బ్రహ్మాండం గురించి విపులంగా రాసి ఉన్నది.


 *   ఖేట సర్వస్వము  - 


              ఇది జైమినీ మహర్షి చే రచించబడెను . ఇందు ఆకాశ విభాగములు , అందలి గ్రహకక్షలు మొదలగునవి కలవు.


 *  ధాతు సర్వస్వము  - 


             ఇది బోధాయన మహర్షిచే రచించబడెను . ఇందు ధాతువులు , వాటి ఉత్పత్తులు , గనులు , గనుల నుండి

లోహములు తీయు పద్దతి , విషములు , విషహరణోపాయములు , భస్మములు , గంధకం , పాదరసం మొదలగువాటి వర్ణన కలదు . 


 *  ధూమ ప్రకరణం  - 


           ఇది నారద మహర్షి కృతం . ఇందు వివిద ధూమములు , వాటిని కొన్ని రకాల అద్దములచే పట్టుట వాటిని కొన్నిరకాల ఆమ్లములచే పరిశోధించుట . ఆ ధూమం మంచిదో కాదో తెలుసుకొనుట అనగా ఆయాపదార్థాలలోని విషగుణములను తెలుసుకొనుట తద్వారా శరీరాన్ని , బుద్ధిని పోషించుకొనుట ఈ విషయాలన్నీ కలవు.


 *  నామార్థ కల్పం  - 


           ఇది అత్రి మహర్షిచే రచించబడెను. ఇందు 84 లక్షల శక్తులు వాటి నామాలు , నామార్థాలు కలవు.


 *  ప్రపంచ లహరీ  - 


             ఇది వశిష్ట మహర్షి చే రచించబడెను . ఇందు అణువుల వలన బ్రహ్మండా నిర్మాణమా లేక బ్రహ్మతత్వం వలనా ? అని చర్చ కలదు. అణువు ల విమర్శ కూడా కలదు.


 *  బ్రహ్మాండ సారం  - 


               ఇది వ్యాస మహర్షిచే రచించబడెను . ఇందు బ్రహ్మాండ చరిత్ర కలదు.


 *  మేఘోత్పత్తి ప్రకరణం  - 


              ఇది అంగీరస మహర్షి కృతం . ఇందు మేఘములు , మెరుపులు , పిడుగులు మొదలగు వాటి ఉత్పత్తి వర్ణణలు కలవు.


 *  లోక సంగ్రహము  - 


              ఇది వివరణాచార్య కృతం . ఇందు 1714 భాషలు , జీవజాతులు , వాటి పుట్టుక , ఆహార నియమాలు , మతములు మొదలగు వివరములు కలవు. మొత్తం ప్రపంచం యొక్క సంగ్రహం కలదు.


 *  లోహ తంత్రము  - 


              ఇది శాక్త్యాయన మహార్షి చే రచించబడెను . ఇందులో లోహోత్పత్తి మొదలగు విషయాలు కలవు.


 *  వాయుతత్వ ప్రకరణము  - 


              ఇది శాక్త్యాయన మహర్షి కృతం . ఇందులో 84 వేల రకాల వాయువులు , వాటి పొరలు , భూమి మీద  ఆయా వాయువుల యొక్క ప్రభావములు , అవి వృక్ష సంపద పైన ఎట్లు పనిచేయుచున్నవి ? ఈ వాయువులను కనిపెట్టుటకు తగిన యంత్ర సాధనాలు మొదలగునవి కలవు. 


 *  వైశ్వనర తంత్రము - 


              ఇది నారద మహర్షి కృతం . ఇందు 128 రకాల అగ్నులు , వాటి రంగులు , గుణములు , ఉపయోగములు , కొలతలు తరతమ బేధములు కలవు.


 *  శక్తి తంత్రము  - 


            ఇది అగస్త్య మహార్షి చే రచించబడినది. ఇందు విద్యుత్ శక్తి యొక్క సర్వాకర్షణ సామర్ధ్యము , రూపాకర్షని , రసాకర్షిణి , గంధాకర్షిణి , స్పర్శాకర్షిణి , శబ్దాకర్షిణి , ధైర్యాకర్షిణి , శరీరాకర్షిణి , ప్రాణా కర్షిణీ  మొదలగు ముఖ్యమైన పదహారు శక్తుల వర్ణనం , సెకనుకు 1 , 86 ,000 మైళ్ళ వేగముతో ఇప్పుడు టెలివిజన్ , రేడియో ప్రసారాలు ఎలా పోవుచున్నవో అదే విధముగా విధ్యుత్ శక్తి సహాయముతో రసము , గంధకం , స్పర్శము చివరికి శరీరం కూడా అంతే వేగముతో ప్రయాణించగల విధివిధానాలు చెప్పెను . బహుశా వాయువేగంతో మనిషి ఎలా ప్రయాణించాలో తెలియచేశారు అనుకుంటా . 


 *  శుద్ద విద్యాకల్పం  - 


         ఇది అశ్వలాయన మహర్షి కృతం . ఇందు ప్రపంచోత్పత్తి నిర్ణయము కలదు.


 *  సమరాంగణ సూత్రధారము  - 


         ఇది భోజమహారాజుచే రాయబడినది. ఇందు అనేక యంత్రములు కలవు. ఈ యంత్రములు యందు ఉపయోగించు పంచభూత బీజముల విధానములు , విమాన నిర్మాణ విధానములు , ద్వని ( సైరన్ ) యంత్రము చేయు పద్ధతులు , బొమ్మలచే యుద్ధము , నాట్యము , సంగీతము , ద్వార రక్షణము మొదలగు విచిత్రములు కలవు.


           పైన చెప్పినవే కాకుండా భరద్వాజ మహర్షి రచించిన బృహద్విమాన శాస్త్రంలో అశని కల్పం , అంశుమ తంత్రం , ఉద్బిజ్జతత్వ సారాయణము , దర్పణకల్పము , దర్పణశాస్త్రం , దర్పణ ప్రకరణం , ద్రావక ప్రకరణం , మణికల్ప ప్రదీపిక , మణి ప్రకరణము , మణి రత్నాకరం , ముకుర కల్పము , యంత్ర కల్పము ,  యంత్ర కల్పతరువు , లోహతత్వ ప్రకరణం , లోహ ప్రకరణం , లోహ రత్నాకరం , లోహ రహస్యము , లోహ శాస్త్రం , విమాన చంద్రిక , విష నిర్ణయాధికారం , వ్యోమయాన తంత్రం , శక్తి తంత్రము , శక్తి బీజము , శక్తి కౌస్తుభం , సమ్మోహన క్రియాకాండం , సౌదామినీకలా మొదలగు 150 గ్రంథాలు కలవు. అదియే కాక  అగస్త్య, అత్రి , అంగీర, ఆపస్తంబ , ఈశ్వర , కపర్ది , గర్గ, గాలవ,  గోభిల , గౌతమ, నారద , పరాశర, భరద్వాజ , వశిష్ట , వాల్మీకి , వ్యాస , శౌనక , సిద్ధనాధ  మొదలగు 140 మంది గ్రంథకర్తలు కలరు. ఋషులు అంటే ముక్కులు మూసుకుని మూలన  కూర్చుని తపస్సు చేసుకునే వారు కాదు. వీరు గొప్ప వైజ్ఞానికులు .భారతదేశంలో అధికారంలో ఉన్న వారు వీటిపైన సరైన దృష్టి పెట్టకపోవడం వలన ఎంతో విజ్ఞానాన్ని కోల్పోయాము. కాని మన ప్రాచీన విఙ్ఞానం పైన విదేశీయులు అమిత మక్కువ చూపిస్తారు. దీనిపై మీకో ఉదాహరణ చెప్తాను. 1936 వ సంవత్సరం లో  1936 వ సంవత్సరం వరకు ముద్రించబడిన గ్రంథాల జాబితా ని                 "రసరత్న సముచ్ఛయ" అనే పేరుతో ముద్రించారు . ఒక కేటలాగ్ లాగా అది మనదేశంలో దాని విలువ 1 రూపాయి . జర్మనీ దేశంలో మన భారతీయ గ్రంథాల గురించి ఇచ్చిన కేటలాగ్ 5000 రూపాయిల చొప్పున అమ్ముడు అయినది.  ఇది మన భారతీయ వైఙ్ఞానిక విలువ కాని అది మరుగున పడుతుంది. మనం అయినా కాపాడుకొని మన తరవాతి తరాలకు ఆ విజ్ఞానాన్ని అందించాలి. 


        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034