25, మే 2024, శనివారం

సన్మార్గంలోనే పయనిస్తుంది

 


తల్లిదండ్రులు తమ సంతానమును మాటలు నేర్వకముందునుండే ఆధ్యాత్మిక విలువలను నేర్పుతూ ఆధ్యాత్మిక మార్గమును తాము ఆచరిస్తూ పిల్లలచేత ఆచరింపజేస్తూ పెంచితే.... కచ్చితంగా ఆ తరం సన్మార్గంలోనే పయనిస్తుంది. 


దీనికి శ్రీరాముడే ఆదర్శం. ధర్మమును తాను ఆచరిస్తూ ప్రజలచేత ఆచరింపజేశాడు ఆ మహానుభావుడు. రామాయణాన్ని ఆమూలాగ్రంగా ఎన్నిసార్లు చదివినా... శ్రీరామునికి స్వోత్కర్ష కానీ, అహంభావము కానీ కనిపించవు. 


అదే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచవలసి ఉంటుంది. అప్పుడే విలువలతో కూడిన సమాజం ఏర్పడుతుంది. 


అంతే కాదు. తల్లి గర్భవతి అయిననాటి నుండి తన మనసులో అన్యచింతనలను రానీయకుడా నిత్యమూ ఆధ్యాత్మిక చింతనలతోను, ధర్మచింతనతోను, సాత్వికభావాలతోనూ గడిపినట్లైతే ఆ పుట్టబోయే సంతానము 100% అవే గుణగణములు కలిగి పుడతారు. ఇదే విషయం భక్తప్రహ్లాదుడు మొదలైన అనేక ఇతిహాస కథలలో మనకు తెలుస్తుంది.

కామెంట్‌లు లేవు: