25, మే 2024, శనివారం

దానములు ఎన్ని రకములు

 *దానములు ఎన్ని రకములు ?? - అవి ఏవి ???*

        *దానములు - 3 రకములు, అవి ... 1, సాత్త్విక, 2, రాజసిక, 3, తామసిక - దానములు*

దానము చేయువారిలో పెక్కుమంది ప్రతిఫలాపేక్షచే చేయుచుందురు. 

కొంతమంది మాత్రమే భగవత్ కటాక్షమును అపేక్షించుచుందురు!!...


భగవదనుగ్రహమును కోరి చేయు దానము సాత్త్వికమగును. 


అట్లుగాక, ప్రత్యుపకారము నాశించియో, పేరుప్రతిష్ఠలను పొందగోరియో, లేక పదిమందికి మెప్పునకై ముందు ఇచ్చి తదుపరి పరితపించుటయో, లేక మనఃక్లేశమువలననో ఇచ్చిన దానము రాజసికమగును. 


సత్కార పూర్వకముగాక, తిరస్కార భావముతో ఇచ్చిన దానము, దానమునకు తగని వ్యక్తికిగాని, స్థానమునకుగాని ఇచ్చిన దానము తామసికమగును. 


అనగా !!... తిండితీర్థాదులకు కొదవ లేని స్థానము అన్నదానమునకు తగని స్థానమే అగును. 


రోగులు వెళ్ళుటకు సాధ్యముగాని ప్రదేశములో వైద్యాలయమును నిర్మించుట వృథానేయగును. 


కడుపు నిండుగా తిని కదలలేనివానికి అన్నము భుజ భారమనిపించును. 

ఇట్టి సార్థకము కాని దానములు తామసిక దానములగును...


ఈరోజు మనం ఏదానం చేస్తున్నామో మనమే అర్థం చేసుకోవాలి!!...


               *_🌸శుభమస్తు🌸_*

కామెంట్‌లు లేవు: