14, జనవరి 2022, శుక్రవారం

కేనోపనిషత్తు వేదాంత అధ్యయనం మానకండి

 కేనోపనిషత్తు


వేదాంత అధ్యయనం మానకండి. మీకు అది తలపై నుంచి వెళ్లిపోయినట్టు ఉంటే, మీ జీవితాన్ని కర్మ ప్రధానంగా మలచుకోండి. ఉపాసన, జ్ఞానం కూడా వాటి వెన్నంటే పాటించండి. అలాగే, కొంచెం అర్థమయింది. ఇంకా సాధన చేయాలి అనిపిస్తే ఉపాసన ప్రధానంగా మీ జీవితాన్ని మలచుకుని, కర్మ, జ్ఞానమార్గాలను కూడా అనుసరించండి. మీరు పూర్వజన్మలోనో, ఈ జన్మలోనో సాధన చేసి ఉంటే మీ జీవితాన్ని జ్ఞానప్రధానంగా చేసుకోండి. అలా మీరు ఉత్తమ అధికారి అయి, జ్ఞానం పొందితే మీకు కలిగే ఫలమేమిటి? అది ఈ మంత్రంలో వస్తుంది. యోవా ఏతామేవం వేద- ఈ విధంగా బ్రహ్మను ఎవరైతే తెలుసుకుంటారో; ఏవం అంటే ఈ విధంగా అంటే ఏ విధంగా? ఇది చాలా ముఖ్యం.

నేను బ్రహ్మను. నేను ప్రతి అనుభవం వెనకా చైతన్యంగా ప్రకటితమవుతున్నాను. నేను తెలిసిన వస్తువు కాను; తెలియని వస్తువును కాను. నేను వస్తువును తెలుసుకునే కర్తను. ఈ విధంగా తెలుసుకోవాలి. అలాకాకుండా అంతా విని బ్రహ్మ ఎక్కడో ఉన్నాడు. నాకు బ్రహ్మ అనుభవం ఎప్పుడు అవుతుందో అనుకోకూడదు. అలా సరిగ్గా అర్థం చేసుకుంటే, ఫలం ఏమిటి? 

అపహత్య పాప్మానమ్ - అతని పాపాలన్నీ నాశనమయిపోతాయి. 

సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే గీత 4-33 

పాపాలంటే మనం మామూలుగా పాపాలు అనుకుంటాము. కాని ఉపనిషత్తులో 

పాపాల కింద మూడు అంశాలు వస్తాయి. 

1. పాపాలంటే పాపాలే పాప రూప పాపం.

2. పుణ్యాలు పుణ్యరూప పాపం

ఆత్మ అజ్ఞానం 3. అజ్ఞానం

వేదాంతంలో పుణ్యం కూడా పాపం కిందకే వస్తుంది. ఎందుకు? పాపాలు అనుభవించటానికి పునర్జన్మ ఎత్తినట్టే, పుణ్యకర్మఫలం అనుభవించటానికి కూడా పునర్జన్మ ఎత్తాల్సి ఉంటుంది.

అజ్ఞానం కూడా పాపం కిందకే వస్తుంది. ఎందుకంటే అజ్ఞానం వల్లనే


137

కర్తృత్వ భావన, కోరికలు, కర్మలు, పుణ్యపాపాలు

 కర్తృత్వ భావన, కోరికలు, కర్మలు, పుణ్యపాపాలు, సుఖదుఃఖాలు, పునరపి జననం, పునరపి మరణం కలుగుతాయి. సంసారికి మూల కారణం అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం తొలగితే, పునర్జన్మ ఉండదు. అందువల్ల పాప్మానమ్ అంటే పాపం, పుణ్యం, అజ్ఞానం మూడూ వస్తాయి. ఈ మూడు నాశనమవుతాయి జ్ఞానికి. అప్పుడేమవుతుంది?


అనస్తే స్వర్గోలోకే ప్రతితిష్ఠతి - స్వర్గలోకంలో నెలకొని ఉంటాడు. అదెలా సాధ్యం? పరస్పర భిన్నంగా లేదా? ఒకపక్క పుణ్యం కూడా నాశనమవుతుంది అంటున్నది. స్వర్గలోకం పుణ్యఫలం కదా! అలాంటప్పుడు స్వర్గలోకానికి ఎలా వెళతాడు? శంకరుల వారు స్వర్గలోకానికి అర్థాన్ని పరం బ్రహ్మగా తీసుకోవాలి అంటారు. స్వరోలోకే బ్రహ్మణి. ఎటువంటి 'బ్రహ్మ?


జ్యేయే- అంతిమం, శ్రేష్ఠతమం. దీన్ని బట్టి కూడా స్వర్గలోకే అంటే స్వర్గలోకం కాదని తెలుస్తున్నది. స్వర్గలోకం అంతిమ లోకం కాదు. శ్రేష్ఠతమమూ కాదు. దానిపైన ఇంకా లోకాలు ఉన్నాయి. అందువల్ల జ్ఞాని బ్రహ్మలో ప్రతితిష్ఠతి అనాలి. అంటే ఎప్పుడూ బ్రహ్మనిష్ఠలో ఉంటాడు అని అర్థం.


బ్రహ్మలో ప్రతితిష్ఠతి అంటే బ్రహ్మ ఇక్కడ ఉన్నాడు. జ్ఞాని బ్రహ్మమీద ఉన్నాడు అని కాదు అర్థం. జ్ఞాని బ్రహ్మనిష్ఠలో ఉంటాడు అని అర్థం. తను బ్రహ్మకు భిన్నంగా లేడు అని తెలుసుకుంటాడు.


ప్రతితిష్ఠతి ప్రతితిష్ఠతి - రెండుసార్లు ఈ పదం చెప్పటంలోని అర్థం. ఈ ఫలం ఖచ్చితం. అందులో సందేహం లేదని హామీ ఇస్తున్నది ఉపనిషత్తు.


పూర్వం ఉపనిషత్తులు వ్రాతపూర్వకంగా ఉండేవికావు. అందుకని అధ్యాయం ముగిసేటప్పుడు, ఉపనిషత్తు ముగిసేటప్పుడు ఆఖరి పదం మళ్ళీ చెప్పటం జరుగుతుంది. అందువల్ల ప్రతితిష్ఠతి రెండుసార్లు చెప్పటంలోని ఇంకో అర్థం ఇక్కడితో నాలుగవ అధ్యాయం ముగిసింది. ఇక్కడితో కేనోపనిషత్తు కూడా ముగిసింది.


శుభం భూయాత్.


కేనోపనిషత్తు


138

కేనోపనిషత్తు సారాంశము

 కేనోపనిషత్తు సారాంశము


ప్రశ్న:- కేనేషితం పతతి ప్రేషితం మనః


మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను,చెవుల వెనుక ఉన్న దేవత ఎవరు?


జవాబు:


1. శ్రోతస్య శ్రోత్రం (చెవితో చూద్దాం) ఆత్మ వేరు, చెవి వేరు. ఆత్మ చెవి అంతటా వ్యాపించి ఉంది.


ఆత్మ ఉండటం వల్లే చెవిని చెవి అనగలుగుతున్నాము. అంటే చెవితో వినగలుగుతున్నాము.


ఇదే సూత్రం మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవులకు వర్తిస్తుంది.


2. న తత్ర చక్షుర్గచ్ఛతి న వాగ్గచ్ఛతి నో మనః మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవుల ద్వారా ఆత్మను తెలుసుకోలేము. 3. యద్వాచానభ్యుదితం యేన వాగభ్యుద్యతే


మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవుల ద్వారా ఆత్మను తెలుసుకోలేము. కాని మనస్సు, ప్రాణం, వాక్కు కన్ను, చెవులు ఆత్మ వల్లనే పని చేస్తున్నాయి. 4. అన్యదేవ తద్విదితాదథో అవిదితాదధి


ఆత్మ తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదు.


దీని అర్థం- ఎ) ఆత్మ తెలియబడే వస్తువు (ఆబ్జెక్టు) దు - ప్రమేయం కాదు. బి) ఆత్మ తెలుసుకునే నేను - ప్రమాతా అయిన నేను.


సి) ఆత్మ ప్రమాతృత్వం లేకపోయినా ఉంటుంది. అది శుద్ధ చైతన్యం. 5. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే -


ఆత్మ ఆబ్జెక్టు కాదు కాబట్టి, సగుణ రూపంలో కొలిచే దేవుడు ఆత్మ కాదు. సాక్షి చైతన్యమైన నేనే ఆత్మను.


ఆత్మ అనుభవం


ఆత్మ అనుభవం పొందలేము.

కేనోపనిషత్తు ఆత్మ అనుభవం పొందనవసరం లేదు.

 కేనోపనిషత్తు


ఆత్మ అనుభవం పొందనవసరం లేదు.


ఎందుకంటే అది నువ్వే. ఎవ్వర్ ది ఎక్స్ పీరియన్సర్, నెవ్వర్ ది ఎక్స్ పీరియడ్. అనుభవించే నువ్వే ఎప్పటికీ, అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ. యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షూంషి పశ్యతి ఆత్మను కన్నుతో చూడలేము కాని కళ్ళు ఆత్మ వల్లే పనిచేస్తున్నాయి ప్రతిబోధ విదితం మతం


ఆత్మ అనుభవం పొందలేము కాని ప్రతి అనుభవమూ ఆత్మ వల్లే పొందుతున్నాము.


ఆత్మజ్ఞానం


ఆత్మ అంటే అనుభవించబడే వస్తువు కాదు. ఆత్మ అంటే అనుభవించే నేనే. నేను అంటే సాక్షి చైతన్యాన్ని, ఆత్మజ్ఞానం పొందటం అంటే వృత్తిలో మార్పు.


ఆత్మ అనుభవం కోసం ప్రయత్నించకూడదు. ఆత్మ వల్లే అన్నీ అనుభవిస్తున్నాము. ఆ ఆత్మను నేనే అని పదునైన బుద్ధితో అర్థం చేసుకోవటమే ఆత్మజ్ఞానం,


ఆత్మజ్ఞానం పొందిన విద్యార్థి స్పందన


1. నాకు బ్రహ్మ తెలుసు అనను 2. నాకు బ్రహ్మ తెలియదు అనను అంటే- బ్రహ్మను ఆబ్జెక్టుగా చూస్తే తెలియదని నాకు తెలుసు. బ్రహ్మను సబ్జెక్టుగా తెలుసుకోవాలని నాకు తెలుసు. బ్రహ్మ ఎవరికి తెలియదో, వారికి తెలుసు.


3. నాకు తెలుసు


దీన్నే ఉపనిషత్తు మళ్ళీ చెపుతుంది.


140


4. నాకు తెలియదు


బ్రహ్మ ఎవరికి తెలుసో, వారికి తెలియదు.

కేనోపనిషత్తు తెలిసిన వారికి

 కేనోపనిషత్తు


తెలిసిన వారికి తెలియదు.


తెలియని వారికి తెలుసు. అంటే బ్రహ్మను ఆబ్జెక్టుగా


చూసేవారికి తెలియదు. బ్రహ్మను సబ్జెక్టుగా తెలుసుకునేవారికి తెలుసు.


యక్షుని కథ వల్ల వచ్చిన 6 సందేశాలు 1. బ్రహ్మ అస్తి- యక్షుడు కనబడ్డాడు. ఉపాసనలు 1. విద్యుత్ ఉపాసన


2. బ్రహ్మణః దుర్విఘ్నేయం- వాయువు, అగ్ని తెలుసుకోలేకపోయారు. అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము.


3. జ్ఞానయోగ్యతా అపేక్షః- గర్వం ఉండకూడదు. శ్రద్ధ, భక్తి,శరణాగతి కావాలి. ఇంద్రుడు శరణు వేడాడు.


4. గురు అపేక్ష:- గురువు ద్వారానే నేర్చుకోవాలి. ఉమాదేవి గురువుగా వచ్చింది. 5. బ్రహ్మవిద్యాస్తుతిః - బ్రహ్మ విద్య పొందిన ఈ ముగ్గురు దేవతలూ ఖ్యాతిని పొందారు.


6. ఉపాసనవిధి అంగత్వం - ఈ కథకు అనుగుణంగా కొన్ని ఉపాసనలు చెప్పబడ్డాయి.


2. నిమేష ఉపాసన అధి దైవ ఉపాసనలు 3. వృత్తి ఉపాసన 4. బ్రహ్మ మహిమ ఉపాసన గుణ విశిష్ట ఉపాసన యక్షుని లక్షణాలు - క్షణికత్వం, మనోహరత్వం, ప్రకాశరూపత్వం. మెరుపుకూ, కనురెప్పలు ఆర్పటానికీ, వృత్తికీ ఈ మూడు లక్షణాలు ఉన్నాయి. మనస్సు బాహ్యవస్తువును ప్రకాశింపజేస్తుంది. చైతన్యం, వృత్తిని ప్రకాశింపజేస్తుంది. మనస్సు అంతర్గతంగా ఉన్న సాక్షిని ప్రకటింపచేస్తుంది. వృత్తి, చైతన్యాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆధ్యాత్మ ఉపాసన


141

కేనోపనిషత్తు కర్మయోగం

 కేనోపనిషత్తు కర్మయోగం


ఉపనిషత్తు అనే ఆవుకు నాలుగుపాదాలు- తపస్సు, దమము, కర్మ, శమము


అంగాలు


అన్ని వేదాలు


సత్యం ఫలం


ఆయతనం


పాపరూప పాపాలు, పుణ్యరూప పాపాలు, అజ్ఞానరూప పాపాలు


నాశనమవుతాయి. సర్వాత్మ భావన కలుగుతుంది. జ్ఞాననిష్ఠలో నెలకొంటాడు. అంటే ఈ క్రింది భావనలోనే ఉంటాడు తదేవ బ్రహ్మత్వం విద్ధి వేదం యదిదముపాసతే


శాంతి పాఠం


ఓం ఆప్యాయను మమాజ్ఞాని వాక్పాణశ్చక్షుః శ్రోత్రమథోబలమిన్షియాణి చ సర్వాణి! సర్వం బ్రహ్మోపనిషదం మా_హం బ్రహ్మ నిరాకుర్యాం మా మా బ్రహ్మ నిరాకరోదనిరాకరణమస్త్వనిరాకరణం మే2 స్తు! తదాత్మని నిరతే య ఉ పనిషత్సు ధర్మాస్తే మయి సన్తు తే మయి సన్తు ||


ఓం శాస్త్రశ్శాస్తిశ్శాస్త్ర


కేనోపనిషత్తు అధ్యయనం మొదలుపెట్టే ముందు విఘ్నాలు లేకుండా చేయమని శాంతిపాఠం పఠిస్తాము. ఇప్పుడు అధ్యయనం నిరాటంకంగా సాగినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ శాంతి పాఠాన్ని పఠిస్తాము.


సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు


142

అంతటా మట్టే.

 కుండ మట్టి - జీవన్ముక్తి


మనిషి ఏం చేసినా శాంతి, సుఖం, భద్రత కోసమే చేస్తూంటాడు. అవి వస్తువుల్లోనూ, పరిస్థితుల్లోనూ, మనుషుల్లోనూ, సంఘటనల్లోనూ ఉందనుకుంటాడు. తన స్వరూపమే శాంతి, సుఖం, భద్రత అని తెలుసుకోలేక, బాహ్యంగా పరుగులు తీస్తూంటాడు. కస్తూరి మృగం తనలో సువాసన పెట్టుకుని బయట ఎక్కడో ఉందని, వెతికి, వెతికి అలసి సొలసి చనిపోతుందిట. సరిగ్గా మనిషి కూడా అలానే చేస్తాడు. తనే ఆనంద స్వరూపం అని గ్రహించడు.


కుండకు ఎవరో చెప్పారు. నీ గురించి నువ్వు తెలుసుకో! స్వరూపంగా నువ్వెవరో తెలుసుకో! స్వరూపతః నువ్వు మట్టివి. మట్టిని తెలుసుకుంటే, వెంపర్లాట, ఆరాటం పోయి జీవన్ముక్తి పొందుతావు అని చెప్పారు. వెంటనే కుండ మూటాముల్లే సర్దుకుని స్వరూపంగా మట్టిని చూద్దామని చార్ ధామ్ యాత్రకు బయలు దేరింది. యాత్ర అంతా పూర్తి అయింది కాని స్వరూపంగా మట్టి మాత్రం కనపించలేదు. యజ్ఞ యాగాదులు చేసింది మట్టి జాడే తెలియలేదు. ధ్యానం చెయ్యాలన్నారెవరో! ధ్యానం లోనూ మట్టి కనపడలేదు. కుండ మట్టిని వెతకాలి. ఎలా? మట్టి ఎక్కడ ఉంది? కుండ లోపల ఉందా? కుండ బయట ఉందా? కుండ మధ్యలో ఉందా? అసలు కుండకు మట్టికి దూరం ఎంత? కుండ అంతటా మట్టే. మట్టి తప్ప కుండే లేదు. కుండకు మట్టికి దూరం ఏమిటి? అవి రెండు వస్తువులైతే కదా! మట్టినే కుండ అంటున్నాం. కుండగా పరిమితత్వం, అల్పత్వం, అశాశ్వతత్త్వం ఉన్నాయి. అదే మట్టిగా అపరిమితత్త్వం, అనల్పత్వం, శాశ్వతత్త్వం. అదే జీవన్ముక్తి. ఇప్పుడు కుండ ఏం చేయాలి? అంతటా వెతకాలా? పూజలు చేయాలా? ధ్యానం చేయాలా? నేనే మట్టిని అని తెలుసుకుంటే చాలు. కుండ తయారుకాక ముందూ మట్టే, కుండగానూ మట్టే, కుండ పగిలినా మట్టే. మట్టిగా దానిలో ఏ మార్పూ లేదు. దానికి పుట్టుకా లేదు, మరణం లేదు. అదే కుండయితే మరణం, పుట్టుక తప్పవు.

కంఠ చామీకర న్యాయం

 అదే మాదిరిగా జీవుడు తను స్వరూపతః బ్రహ్మను అని తెలుసుకుంటే, తనే ఆనంద స్వరూపమని తెలుసుకుంటాడు. అదే జీవన్ముక్తి. జీవుడు ఎప్పుడూ ముక్తుడే. ఆ విషయం తెలుసుకోవడమే తరువాయి. దీనినే శాస్త్రం ప్రాప్తస్య ప్రాప్తం అంటుంది. మోక్షం సిద్ధవస్తువు, సాధ్యవస్తువు కాదు.


కంఠ చామీకర న్యాయం - ఒక రాజ్యంలో రాణిగారు చాలా ఖరీదైన నెక్లెస్ విదేశాలనుంచి తెప్పించుకున్నారు. అకస్మాత్తుగా ఆ నెక్లెస్ కనిపించడం లేదు. రాణిగారికి చాలా ప్రీతికరమైన నెక్లెస్ మాయమయింది. దానిమీదమోజు తీరకుండానే పోయింది. దానితో రాణిగారు విపరీతమైన ఆవేదన చెందారు. సేవకులతో రాజప్రాసాదమంతా అడుగడుగునా గాలింపు చేయిస్తున్నారు.


ఎంత వెతికినా ప్రయోజనం కన్పించ లేదు. మంత్రి ఏమైనా మార్గం చూపుతాడేమోనని పిలిపించారు. మంత్రిగారు అసలు విషయం వాకబు చేస్తే రాణిగారి నెక్లెస్ పోయిందని తెలిసింది. రాణిగారిని చూడగానే మంత్రిగారికి నెక్లెస్ జాడ తెలిసిపోయింది. వెంటనే మంత్రి అమ్మా మీ సేవకులను వెతకడం ఆపమనండి అన్నారు.


మంత్రి తెలివితేటల మీద అచంచలమైన విశ్వాసం ఉన్న రాణిగారు చప్పట్లు కొట్టి నెక్లెస్ గురించి వెతకడం ఆపింది.


“అమ్మా రాణిగారూ! మీ మెడను ఒకసారి తడుముకోండి,” అన్నారు మంత్రి. అప్పుడు రాణిగారికి మెడ తడుముకోకుండానే నెక్లెస్ బరువు తెలిసింది. ఆమె తన మెడలోనే నెక్లెస్ ను పెట్టుకుని, ఊరంతా వెతుకుతోంది. తనదగ్గరే వున్న నెక్లెస్ బయట ఎలా దొరుకుతుంది? విశ్వమంతా ఎంత వెతికినా దొరకదు. ఈ సమస్యకు పరిష్కారం నెక్లెస్ పొయింది అనే అజ్ఞానం తొలిగి తన దగ్గరే, మెడలోనే ఉందని తెలిస్తే చాలు. దీనినే కంఠచామీకర న్యాయం అంటారు. ఇది తెలిస్తే ఇక ఎటువంటి ఆందోళన ఉండదు. కంఠచామీకరం అంటే నెక్లెస్ అని అర్థం. -


సరిగ్గా ఇలాగే జీవుడు తనే స్వరూపతః బ్రహ్మనని తెలుసుకోలేక జన్మ జన్మలనుంచి బ్రహ్మను వెతుకుతూనే ఉన్నాడు. మన దగ్గరే కోహినూర్ డైమండ్ ఉంది. దానిని అజ్ఞానంతో పేపరు వెయిట్ లా వాడుతున్నాము.


ప్రయోజనం: నేనే శాంతి, సుఖం, ఆనందాలకు నెలవు అని తన పూర్ణత్వం దర్శించిన జ్ఞానికి ఎటువంటి వెలితి లేదు. అతను ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి, అత్యంతిక ఆనందం అనుభవిస్తాడు.


అలవోకగా అద్వైతం పుస్తకరూపంలో రాబోతున్నది ...


***


146

పలకరింపు

 _*🙏💫 పలకరింపు 💫🙏💐*_

*🌹🌸🌹🌸🌹🌸🌹 🌸 🌹*

_*మనుషులకు మాత్రమే వున్న వరమిది. మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతలను పారద్రోలే మంత్రమిది.*_


_*పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మనిషితనానికి, కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.*_


_*నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు. కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు.*_


_*ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు. ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు. మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు !*_


_*పలకరింపుకు అంత శక్తి వుంది. పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు. తమ జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో వున్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లు చూస్తున్నారు. "వారి శ్రమఫలమే వర్తమానపు మన కళ " - అని మరిచి పోతున్నారు. అట్లాంటి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి.*_


_*ఒక మాట మాట్లాడాలి. ఒక్కసారి పలకరింపుతో వాళ్ళను కదిపి చూడండి. బండెడు అనుభవాలను మీ ముందుంచుతారు. ఆ అనుభవాలు ఇప్పటికీ మనకు దివిటీలా పని చేస్తాయి.*_


_*పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పని చేస్తుంది. పెద్దలనే కాదు ఎవరినైనా పలకరిస్తూ వుండాలి. దాంతో స్నేహం, బంధం, ప్రేమ, అనుబంధం పెరుగుతూ వుంటుంది. ఇవి కేవలం మనుషులు సాధించేవి.*_


_*ప్రముఖ కథా రచయిత్రి ఇల్లిందల సరస్వతీ దేవిగారు _"తీయని పలకరింపు" - అని ఒక కథను రాశారు. అందులో ఒక రిటైర్డు పెద్దాయన, పలకరింపులు లేక పడుతున్న బాధను చక్కగా చిత్రించారు. ''నేను డబ్బులు బాగా సంపాదిస్తూ ఉద్యోగం చేస్తున్నపుడు నన్ను చాలా మందే పలకరించేవాళ్ళు. ఉద్యోగ విరమణ చేసి, ఆదాయం తగ్గిపోయిన క్షణం నుంచి పనికిరాని వాడిలా పలకరింపుకు నోచుకోలేక వృద్ధాశ్రమం చేరాను'' అని పాత్రలో వివరిస్తుంది.*_


_*డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమై పోయి ఈ పరిస్థితులు దాపురించాయి. ఇది లాభాల ఆర్జన కోసం సరుకుల మీద వ్యామోహాన్ని పెంచిన సాంస్కృతిక దాడి ఫలితం. దీన్ని మార్చకపోతే మనమూ ఒకప్పటికి బాధితులుగా మిగులుతాం.*_


_*లాక్‌డౌన్‌ మూలాన ఇంట్లోనే అందరూ ఉన్నప్పటికీ, వారి మధ్య దూరాలేవీ తగ్గలేదు. మరింత పెరుగుతూనే వున్నాయి. ఎవరి చేతుల్లో వాళ్ళు సెల్‌ఫోన్‌లతో ఇయర్‌ ఫోన్లతో తమలో తామే, తమకు తామే గడిపేస్తున్నారు. కుటుంబ సంబంధాల్లో విపరీత దూరాలు పెరుగుతున్నాయి.*_


_*మనసుల్లో దాగిన భావాలు, అభిప్రాయాలు పలకరించి అడిగితేనే తెలుస్తాయి. తెలిసినపుడే వాటిని సరిచేయడమో, చర్చించి మనం సరికావడమో చేయవచ్చు. కొన్ని అపోహలూ తొలిగిపోవచ్చు. కుటుంబంలోనే కాదు ఇంటి పక్కన వాళ్ళను, దూరానవున్న మిత్రులను ఖాళీ సమయం దొరకగానే ఒకసారి పలకరించండి.*_


*కరోనా బాధితులను, దాని వల్ల భయపడుతున్న వాళ్ళను పలకరించాలి. పది మందితో గల సంబంధమే జీవితం.*


*నాకు తెలిసిన ఒక పెద్దాయన అన్ని హంగులు ఉండి కూడా, తాను, తన భార్యాబిడ్డలు, సన్నిహితులతో ఏసి లాంటి సకల సౌకర్యాలు అనుభవిస్తూ, వృద్ధురాలు తన తల్లిని మాత్రం ఔట్ హౌస్ కొట్టుగదిలో ఉంచాడు. తనని పలకరించితేనే భార్య అనుగ్రహానికి దూరమైపోతానేమో అని భావించి, దూరంగానే ఉంచిన ప్రబుద్ధుడు.*


_*''నాకేమీ పెట్టాల్సిన అవసరం లేదు. నేనేమీ అడగటమూ లేదు. రోజు ఏం చేస్తున్నావమ్మా, ఏం తిన్నావు, బాగున్నావా'' అని నన్ను అడిగితే చాలని ఎనభై యేండ్ల తల్లి నాతో చెబుతూ దు:ఖించింది. అంటే పలకరింపుల విలువేమిటో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆమె పోయిన తరువాత అతను కార్చిన మొసలి కన్నీరుకి ఏ అవార్డు ఇవ్వొచ్చో అర్థం కాలేదు !*_ 


_*🌹✅ అందుకే.. పలకరించండి. పలుకులేమీ బంగారం కాదు. మనిషి మంచి తనానికి ఆనవాళ్ళు ! 🚩🙏శుభోదయం🙏

పుణ్యఫలాలన్నీ

 పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో పోతావి....

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న అతని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు.

ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు. ‘అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు’ అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.

‘ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ, నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి(వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా అప్పటికే సహనం నశించినవాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వందగుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అని అంటాడు.

ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్లీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు.. అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ‘ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావ్​. వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పనిచేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.

మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయని శ్రీ కృష్ణుడు అంతరార్థం. ...... -