కర్తృత్వ భావన, కోరికలు, కర్మలు, పుణ్యపాపాలు, సుఖదుఃఖాలు, పునరపి జననం, పునరపి మరణం కలుగుతాయి. సంసారికి మూల కారణం అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం తొలగితే, పునర్జన్మ ఉండదు. అందువల్ల పాప్మానమ్ అంటే పాపం, పుణ్యం, అజ్ఞానం మూడూ వస్తాయి. ఈ మూడు నాశనమవుతాయి జ్ఞానికి. అప్పుడేమవుతుంది?
అనస్తే స్వర్గోలోకే ప్రతితిష్ఠతి - స్వర్గలోకంలో నెలకొని ఉంటాడు. అదెలా సాధ్యం? పరస్పర భిన్నంగా లేదా? ఒకపక్క పుణ్యం కూడా నాశనమవుతుంది అంటున్నది. స్వర్గలోకం పుణ్యఫలం కదా! అలాంటప్పుడు స్వర్గలోకానికి ఎలా వెళతాడు? శంకరుల వారు స్వర్గలోకానికి అర్థాన్ని పరం బ్రహ్మగా తీసుకోవాలి అంటారు. స్వరోలోకే బ్రహ్మణి. ఎటువంటి 'బ్రహ్మ?
జ్యేయే- అంతిమం, శ్రేష్ఠతమం. దీన్ని బట్టి కూడా స్వర్గలోకే అంటే స్వర్గలోకం కాదని తెలుస్తున్నది. స్వర్గలోకం అంతిమ లోకం కాదు. శ్రేష్ఠతమమూ కాదు. దానిపైన ఇంకా లోకాలు ఉన్నాయి. అందువల్ల జ్ఞాని బ్రహ్మలో ప్రతితిష్ఠతి అనాలి. అంటే ఎప్పుడూ బ్రహ్మనిష్ఠలో ఉంటాడు అని అర్థం.
బ్రహ్మలో ప్రతితిష్ఠతి అంటే బ్రహ్మ ఇక్కడ ఉన్నాడు. జ్ఞాని బ్రహ్మమీద ఉన్నాడు అని కాదు అర్థం. జ్ఞాని బ్రహ్మనిష్ఠలో ఉంటాడు అని అర్థం. తను బ్రహ్మకు భిన్నంగా లేడు అని తెలుసుకుంటాడు.
ప్రతితిష్ఠతి ప్రతితిష్ఠతి - రెండుసార్లు ఈ పదం చెప్పటంలోని అర్థం. ఈ ఫలం ఖచ్చితం. అందులో సందేహం లేదని హామీ ఇస్తున్నది ఉపనిషత్తు.
పూర్వం ఉపనిషత్తులు వ్రాతపూర్వకంగా ఉండేవికావు. అందుకని అధ్యాయం ముగిసేటప్పుడు, ఉపనిషత్తు ముగిసేటప్పుడు ఆఖరి పదం మళ్ళీ చెప్పటం జరుగుతుంది. అందువల్ల ప్రతితిష్ఠతి రెండుసార్లు చెప్పటంలోని ఇంకో అర్థం ఇక్కడితో నాలుగవ అధ్యాయం ముగిసింది. ఇక్కడితో కేనోపనిషత్తు కూడా ముగిసింది.
శుభం భూయాత్.
కేనోపనిషత్తు
138
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి