3, మే 2024, శుక్రవారం

నీకు నువ్వే దీపం*

 *నీకు నువ్వే దీపం*

              ➖➖➖✍️


```

ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు.


ఒకతని దగ్గర లాంతరు ఉంది. ఇంకొకతని దగ్గరలేదు.


కానీ ఇద్దరూ కలిసి పక్కపక్కనే నడవడం వల్ల కాంతి ఇద్దరి మార్గాల్లో పరుచుకోవడం వల్ల మార్గం సుగమంగా ఉంది.


దీపం ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో లాంతరు లేని వ్యక్తి కూడా అంతే అనాయాసంగా సాగుతున్నాడు.


కారణం దీపమున్న వ్యక్తితో బాటు దీపం లేని వ్యక్తి నడవడమే.


లాంతరు లేని వ్యక్తి తన దగ్గర లాంతరు లేదే అని దిగులు పడలేదు.

కారణం దాని అవసరం అక్కడ లేదు.


అట్లా ఇద్దరూ చాలా దూరం నడిచాక ఒక నాలుగురోడ్ల కూడలికి చేరారు. అప్పటి దాకా ప్రయాణం సాఫీగా సాగింది.

అక్కడినించీ దార్లు వేరయ్యాయి. లాంతరు ఉన్న వ్యక్తి కుడివేపుకి, లాంతరు లేని వ్యక్తి ఎడమవేపుకి వెళ్ళాలి.


లాంతరు ఉన్న వ్యక్తి కుడివేపు తిరిగి వెళ్ళిపోయాడు.

కాంతి అతనితో బాటు అతనికి దారి చూపిస్తూ వెళ్ళింది.


లాంతరు లేని వ్యక్తి ఎడమవేపుకి తిరిగి పది అడుగులు వేశాడో లేదో కాలు ముందుకు కదల్లేదు.


కారణం చీకటి..!


అతనికి ఏడుపు వచ్చింది. లాంతరు ఉన్న వ్యక్తిని తలచుకున్నాడు. అతని దగ్గరగా తను నడుస్తున్నంత సేపూ ప్రయాణం అనాయాసంగా జరిగింది. అతను వెళ్ళిపోయాక తన మార్గం అంధకారబంధురమయింది. తన దగ్గర కూడా కనీసం చిన్న దీపమయినా ఉంటే ప్రయాణం సాఫీగా సాగేది కదా అని బాధ పడ్డాడు.


మనకు ఇతరులు కొంతవరకే మార్గం చూపిస్తారు.


తరువాత మనదారి మనం వెతుక్కోవాలి.


చివరిదాకా ఎవరూ ఎవరికీ దారి చూపరు.


గురువు చేసే పనయినా అదే.


గురువు దగ్గరున్న కాంతి కొంతవరకే దారి చూపుతుంది.


శిష్యుడు తనలోని దీపాన్ని వెలిగించుకున్నపుడు ప్రయాణం చివరిదాకా చేయగలడు.```


*నీకు నువ్వే దీపం అని బుద్ధుడనడం వెనక అర్థమదే.*✍️```

.

Panchaag

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*శనివారం, మే 4, 2024


       *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

       *చైత్ర మాసం - బహళ పక్షం*   

🔔తిథి      : *ఏకాదశి* సా6.04 వరకు

🔯వారం   : *శనివారం* (స్థిరవాసరే )

⭐నక్షత్రం  : *పూర్వాభాద్ర* రా7.55 వరకు

✳️యోగం : *ఐంద్రం* ఉ9.00 వరకు

🖐️కరణం  : *బవ* ఉ7.16 వరకు

 తదుపరి *బాలువ* సా6.04 వరకు

       ఆ తదుపరి *కౌలువ* తె4.50 వరకు

😈వర్జ్యం   :ఉ8.44 - 10.14*

  మరల *రా1.53 - 3.22*

💀దుర్ముహూర్తము :  *ఉ5.37 - 7.18* 

🥛అమృతకాలం    :  *మ12.28 - 1.57* 

👽రాహుకాలం       : *ఉ9.00 - 10.30*

👺యమగండ/కేతుకాలం : *మ1.30 - 3.00*

🌞సూర్యరాశి: *మేషం* || 🌝చంద్రరాశి: *కుంభం*

🌅సూర్యోదయం: *5.37* || 🌄సూర్యాస్తమయం:* *6.16*

       👉 *సర్వ ఏకాదశి*

*సర్వేజనా సుఖినో భవంతు*  

ఇరగవరపు రాధాకృష్ణ

వివిధ దేశాలకు సంకల్పం

 వివిధ దేశాలకు సంకల్పం 


👉 Sankalpam for US / U


క్రౌంచ ద్వీపే , రమణక వర్షే, ఐన్ద్ర ఖండే. ప్రశాంత సాగరే, పుష్కర క్షేత్రే ,  రాకీ మిక్కిలిని పర్వతయోర్ మధ్యే , మిస్సిసిప్పీ మిస్సోరి ఇత్యాది షోడశ జీవ నదీనాం మధ్యే ఇండియానా రాష్ట్రే , మిన్నిసోటా జీవ నది తీరే ,  బ్లూమింగ్టన్నగరే, వసతి గృహే .....,

( Above is for Bloomington city in Indiana state . pla make required changes to your city) 


👉 Australia 


శాల్మాలి ద్వీపే, ఐల వర్షే, నవ ఖండే, మేరో:  దక్షిణ దిగ్భాగే, అస్త్రాలయ దేశే,  భరతదేశే ఆగ్నేయ దిగ్గబాగే  హిందూ మహా సముద్ర తీరే సిద్ధిపుర్యామ్


👉 UK region.


విన్ధ్యస్య  పశ్చిమ దీక్భాగే, శాల్మలీ ద్వీపే, సముద్రమధ్యస్థిత బృహదారణ్య క్షేత్రే , ఐరోపా వ్యవహార నామ ఖండే, థేమ్స్  నదీ తీరే , లండన్   నగరేౌ


👉 Africa 


ప్లక్ష ద్వీపె , వింధ్యస్య నైరుతి దిక్భాగె , తామ్ర ఖండె , కెన్య దెసె ...... నగరె ....... లక్ష్మి నివాస గ్రుహె 


👉 SINGAPORE 


మేరొ: ఆగ్నేయ దిక్భాగే,

మలయ ద్వీపస్య దక్షిణ భాగెఁ,

పూర్వ సముద్ర తీరే,

సింహపురి మహా ద్వీపే,

సెరంగూన్ నదీ పరివాహక ప్రదేశే,

వసతి గృహే/ 

లక్ష్మీ నివాస గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నీధౌ...And so on.....


👉 Middle East 


జంబూ ద్వీపె భరత వర్షె భరత ఖండే వింధ్యస్య  పస్చిమ  దిక్భాగె , అరబీ మహాసాగర పస్చిమ తటె , కతార్ దెసె , దొహా నగరె .......... గ్రుహె 


👉 South Korea


జంబూ ద్వీపె, అఖండ భరత వర్షె , మేరొ: పూర్వ దిక్భాగే, హరిద్రా సాగర తటె , కొరియా నామ ద్వీపె వసతి గృహే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ


👉 Mumbai 


వింధ్యస్య పశ్చిమ దిక్భాగె , సహయాద్రి పర్వత ప్రాంతె, అరబీ మహా సాగర తీరె , ముంబాయి నగరె ....   లక్ష్మి నివస / స్వ     గ్రుహె 


👉 Delhi 


మెరొహ్ దక్షిణ పార్స్వె , వింధ్యస్య పశ్చిమ దిక్భాగె , ఆర్య వర్తైక ప్రదెశె , యమునా తటె , ధిల్లీ నగరె ... గ్రుహె  


👉 VARANASI


వింధ్యస్య పశ్చిమ దిక్భాగె , అశీ వరుణయొర్ మధ్యె , మహాస్మశానె , ఆనందవనె , త్రికంటక విరాజితె , అవిముక్త వారణాశీ క్షెత్రె , ఉత్తరవాహిన్యా భాగీరధీ పశ్చిమ తటె , వసతి గ్రుహె , విశ్వెస్వర విశాలాక్షీ ఇత్యాది త్రయస్త్రిగిం శత్కొటి దెవత , గొ బ్రహ్మణ గురుచరణ సన్నిధౌ ,


👉 Banglore


శ్రీసైలస్య నైరుతి ప్రదెశె , తుంగ భద్ర కావెరి మధ్య ప్రదెసె , శ్రీ శ్రుంగగిరి సమీప ప్రాంతె , ..... గ్రుహె ..... సమస్త దెవతా .....

అల్లం గురించి

 అల్లం గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .


      సంస్కృతంలో అల్లమును "విశ్వాఔషధ" అని అంటారు. ఇది వాతాన్ని తగ్గిస్తుంది . జీర్ణకరము , విరేచనకారి , కళ్లు , గొంతుకు మంచిది . దీని విరేచనగుణం వలన పేగులలో పురుగులను నాశనం చేస్తుంది . అలా నాశనం అయిన క్రిములు మూత్రము ద్వారా బయటకి విసర్జించబడతాయి. పేగులకు అల్లం మంచి టానిక్ లాగా పనిచేస్తుంది . దీనిని వాడటం వలన ఇటువంటి సైడ్ ఎఫక్ట్స్ ఉండవు.


         అల్లము నందు విటమిన్ A , మరియు విటమిన్ C , ఫాస్ఫరస్ కొంత మోతాదులో ఉంటుంది. భోజనం తీసుకోవడానికి గంట ముందు చాలా చిన్నమొత్తంలో మినరల్ సాల్ట్ , నిమ్మకాయ రసం కొన్ని చుక్కలు , నాలుగు స్పూనుల అల్లం రసం కలిపి లోపలికి తీసుకుంటే ఆకలిని అద్భుతముగా పెంచును. గ్యాస్ సమస్య కూడా పరిష్కారం అగును. దగ్గు , జలుబు , రొంప మొదలయిన సమస్యలతో బాధపడేవారు అల్లం వాడటం వలన సమస్య నుంచి తొందరగా బయటపడతారు. గుండెజబ్బు ఉన్నవారు తరచుగా అల్లం వాడటం చాలా మంచిది . అన్ని రకాల ఉదరవ్యాధులకు అల్లం చాలా మంచి పరిష్కారం చూపిస్తుంది.


           అల్లం రసం ప్రతినిత్యం తీసుకోవడం వలన మూత్రసంబంధ సమస్యలు , కామెర్లు , మూలశంఖ , ఆస్తమా , దగ్గు , నీరుపట్టడం వంటి సమస్యలు త్వరగా నయం అగును. ఔషధాలు సేవిస్తూ అల్లంకూడా వాడటం వలన త్వరగా ప్రయోజనం చేకూరును . ఆయుర్వేదం ప్రకారం అల్లాన్ని ప్రతినిత్యం తీసుకోవడం వలన గొంతు , నాలుక సంబంధ సమస్యలకు అద్భుతముగా పనిచేయును . తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు అల్లంరసం ముక్కులో వేయుచున్న తలనొప్పి తగ్గును. పంటినొప్పితో బాధపడుతున్నప్పుడు పంటిపైన అల్లం ముక్కతో రుద్దిన నొప్పి తగ్గును. సైనసైటిస్ నుంచి కూడా విముక్తి లభించును.


     ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

Panchaag


 

దైవీ సంపదలు

 *"దైవీ సంపదలు"*

🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ఎవరైతే క్రితం జన్మలో జ్ఞానాన్ని సంపాదిస్తారో వారు మరుజన్మలో దైవీ సంపదలతో పుడతారు. వారికి ఈ క్రింద చెప్పబడిన దైవీ సంబంధమైన 26 గుణాలు ఉంటాయి.


1) భయం లేకపోవడం.

2) సత్వగుణం కలిగి వుండటం, మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం.

3) జ్ఞానాన్ని సంపాదించడం.

4) విద్యాదానం, జ్ఞానదానం, భూదానం, అన్నదానం మొదలైన దానాలు శక్తి కొద్దీ చేయడం.

5) ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం.

6) జ్ఞాన యజ్ఞం చేయడం.

7) పురాణాలు, శాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించడం.

8) ప్రతి పనీ ఒక తపస్సులాగా చేయడం.

9) మంచి ప్రవర్తన కలిగి వుండటం.

10) అహింస వ్రతాన్ని పాటించడం.

11) సత్యం పలకడం.

12) కోసం విడిచిపెట్టడం.

13) దుర్గుణాలను త్యాగం చేయడం.

14) ప్రశాంతంగా ఉండటం.

15) ఇతరులను విమర్శించకుండా ఉండటం

16) భూత దయ కలిగి ఉండటం.

17) ఇంద్రియ లోలత్వం, స్త్రీ లోలత్వం లేకుండా ఉండటం.

18) మృదువుగా మాట్లాడటం.

19) చెడ్డ పనులు చేసినపుడు సిగ్గుపడటం.

20) చిత్త చాంచల్యం వదిలిపెట్టడం.

21) ముఖంలో, మనస్సులో తేజస్సు కలిగి ఉండటం.

22) ఓర్పు కలిగి ఉండటం.

23) అన్నివేళలా ధైర్యంగా ఉండటం.

24) శరీరంతో పాటు మనస్సును కూడా శుచిగా ఉంచుకోవడం.

25) ద్రోహబుద్ధి లేకుండా ఉండటం.

26) స్వాభిమానం వదిలి పెట్టడం.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀

*ఈ గుణాలను దైవీసంపదగా పెద్దలు పరిగణించారు.*

🍀🍀🍀🍀🍀🍀🍀🍀

శాంతులు వృద్ధాప్యంలో

 వృద్ధాప్యంలో (మలివయసులో) జరిపే శాంతులు

పురుషునికి 60 సంవత్సరాల వయసులో షష్టిపూర్తి మరియు 80 సంవత్సరాల వయసులో సహస్ర చంద్ర దర్శన శాంతి చేయడం మనం సర్వ సాధారణంగా చూస్తుంటాము.

కాని భాస్కరభట్టు అభిప్రాయం ప్రకారం 50 సంవత్సరాల వయసు మొదలుకొని ప్రతి 5 సంవత్సరాలకు అరిష్టం తొలగిపోవడానికి వయోవస్థా శాంతులు జరిపించాలి. 

 (భట్టభాస్కరీయ మతానుసారిణ్యః వయోవస్థా శాంతయః పంచాశత్ వర్షమారభ్య పంచభిః పంచభిః వర్షైర్యుక్తాః।(అన్యమతేన - షష్టితమ వర్షమారభ్య దశభిర్దశభిర్వర్షైః శాంతిరుక్తాః)) 

శ్లో॥ వైష్ణవీ వారుణీ చైవ తతశ్చోగ్రరథీ తథా ।

     మహారథీ భీమరథీ ఐంద్రీచైవ విశేషతః ॥1॥

     చాంద్రీదార్శనికీ రౌద్రీ సౌరీ మృత్యుంజయీ తథా।

     మహామృత్యుంజయీ శాంతిః క్రమశశ్చ ప్రకీర్తితాః ।

     అరిష్ట పరిహారార్థం శాంతిం కుర్యాత్ప్రయత్నతః ॥2॥

వాటి వివరాలు క్రింద తెలిపినట్లుగా... 

1. వైష్ణవీ శాంతి ----50 వ సంవత్సరము 

2. వారుణీ శాంతి ----55 వ సంవత్సరము 

3. ఉగ్రరథ శాంతి ---60 వ సంవత్సరము 

4. మృత్యుంజయ శాంతి ---65 వ సంవత్సరము 

5. భౌమరథీ శాంతి ---70 వ సంవత్సరము 

6. ఐంద్రీ శాంతి ---75 వ సంవత్సరము 

7.సహస్ర చంద్ర దర్శన శాంతి ---80 వ సంవత్సరము 

8. రౌద్రీ శాంతి ---85 వ సంవత్సరము 

9.కాలస్వరూప శౌరి శాంతి ---90 వ సంవత్సరము 

10. త్ర్యంబక మహారథి శాంతి ---95 వ సంవత్సరము 

11. శతాబ్ది -- మహామృత్యుంజయ శాంతి --- 100 వ సంవత్సరము

Sangamrswara temple


 

Naaga saadhu in kaasi

 https://youtube.com/shorts/Zi46PbiK7Zw?si=Z52exZFCfJw3_koi


Kaasi

 https://youtube.com/shorts/TzQ7K3k3CqQ?si=5MGiw0SUO-4GFfWf


Kapila theertham


 

Manikantika ghat kaasi


 

కనబడని కష్టాలు

 *2015*

*కం*

ధనములు గలవారికెపుడు

ఘనమగు సుఖముండునటుల కనబడుచున్నన్

ధనముల వెంబడి యెప్పుడు

కనుగానని సంకటములు కలవిల సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ధనములు గలవారికి ఎల్లప్పుడూ గొప్ప సుఖములు ఉండునట్లు కనిపించిననూ కంటికి కనబడని కష్టాలు ధనముల తో ఎల్లప్పుడూ ఉంటాయి.

*సందేశం*:-- ధనములు లేని వారి కి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎక్కువగా ఉంటాయి., కానీ, ధనవంతుల కు అటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉండవు, ఇలాంటి అనేక కష్టాలు ధనవంతుల కే ఉంటాయి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*03-05-2024 / శుక్రవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన వస్తు వాహనాలు చేస్తారు. ఇంటాబయట నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం  ఉత్సాహంగా ఉంటుంది.

---------------------------------------

వృషభం


ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.  చేపట్టిన పనులను మరింత మందకొడిగా సాగుతాయి.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. ఉద్యోగమున  అధికారులతో సమస్యలు కలుగుతాయి.

---------------------------------------

మిధునం


ఆప్తుల నుండి  శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో మీ శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు వివాదాలు తీరి ఊరట చెందుతారు.

---------------------------------------

కర్కాటకం


రాజకీయ సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు.  ఉద్యోగమున మీ  పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

---------------------------------------

సింహం


దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా  వ్యవహరించాలి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. సోదరుల నుండి ధన పరమైన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో  గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------

కన్య


ముఖ్యమైన వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు. వ్యయ ప్రయాసలతో కానీ  పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు.

---------------------------------------

తుల


గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.  జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలిస్తుంది. స్థిరాస్తి  వివాదాలు  పరిష్కార దిశగా సాగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో చికాకులు  అధిగమించి ముందుకు సాగుతారు.

---------------------------------------

వృశ్చికం


చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.  ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

---------------------------------------

ధనస్సు


దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి.

---------------------------------------

మకరం


ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.  వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి.  నిరాశ కలుగుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు.  ప్రయాణాలలో వాహన  ఇబ్బందులు ఉంటాయి.

---------------------------------------

కుంభం


కీలక వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి. మీ మాటకు విలువ పెంచుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలలో నూతన  నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు  సానుకూలమవుతాయి.

---------------------------------------

మీనం


దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. అధిక శ్రమతో స్వల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి.  ఆరోగ్యపరంగా అప్రమత్తంగా వ్యవహరించాలి.  ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

ఎటువంటి భయములు ఉండవు*

 🌅  *_-|¦¦| శుభోదయమ్ |¦¦|-_* 🌄 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


  శ్లో𝕝𝕝 దారిద్య్ర నాశనం దానం శీలం దుర్గతినాశనమ్‌ |

       అజ్ఞాననాశినీ ప్రజ్ఞా భావనా భయనాశినీ ||


తా𝕝𝕝 దానము దారిద్య్రమును పోగొట్టును.... శీలము అనగా ఉత్తమ గుణకర్మ స్వభావములు దుర్గతిని కష్టములను, దౌర్భాగ్యమును పోగొట్టును. బుద్ధి అజ్ఞానమును బోగొట్టును....*నిష్టతో - దేవునియందు విశ్వాసముంచితే ఎటువంటి భయములు ఉండవు*....

      

  👇 //---------- ( *భజగోవిందం* )---------// 👇


శ్లో𝕝𝕝  సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం |

      నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి:  9 


భావం: సత్పురుషులతో సాంగత్యం  చేయడం వల్ల  ఈ ప్రాపంచిక విషయాల మీద సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. *మోహం పోతే మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది. అప్పుడు సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం, జీవన్ముక్తి*. 

🪷

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం  -‌ దశమి - శతభిషం -‌‌  భృగు వాసరే* (03.05.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

శుక్రవారము, మే 3, 2024

 🚥🚥🚥🚥🚥🚥🚥🚥

   🙏 శుభమస్తు 🙏

🕉️ 03🔸05🔹2024 🕉️

🚥🚥🚥🚥🚥🚥🚥🚥

శ్రీ క్రోధి నామ సంవత్సరం

➖➖➖➖➖➖➖➖

🌟 శుక్రవారము, మే 3, 2024🌟

-----------------------------------------

మాసం: చైత్ర మాసం

అమృతకాలము: 17:25 నుండి 18:54 వరకు

సూర్యోదయము: 05:49

సూర్యాస్తమయము: 18:37

రాహు కాలం: 10:37 నుండి 12:13 వరకు

యమగండము: 15:25 నుండి 17:01 వరకు

దుర్ముహుర్తములు: 08:12 నుండి 09:03 వరకు

అభిజిత్: 11:48 నుండి 12:39 వరకు

కరణం: వణిజ 12:40 వరకు, విష్టి 23:24 వరకు

చాంద్ర రాశి: కుంభము

వర్జ్యం: 08:29 నుండి 09:58 వరకు

చంద్రోదయం: 02:49, మే 04

చంద్రాస్తమయం: కుంభము

తిథులు: దశమి 23:24 వరకు

నక్షత్రము: శతభిషం 00:05 వరకు

గుళిక కాలం: 07:25 నుండి 09:01 వరకు

యోగా: బ్రహ్మ 14:19 వరకు

తర్పణం

 .

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



                     *తర్పణం!*

                   ➖➖➖✍️


 ఎన్ని రకముల తర్పణాలు ఉన్నాయో తెలుసుకుందామా....!


తృప్తినిచ్చే అర్పణం తర్పణం అంటారు.


*1.) తర్పణం అంటే ఏమిటి?


పితృదేవతలకు తృప్తినిచ్చి, వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం. విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలురకాలు.


*2. ) తర్పణము ఎన్నిరకాలు ?


తర్పణము రెండు విధములుగా చేయ వచ్చును అవి సకామ లేక నిష్కామములు.

సకామ తర్పణములో కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణము చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో చేయబడుతుంది. ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ, అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు.


*ప్రధానంగా తర్పణాలు నాలుగు రకాలు.


1-గరుడ తర్పణం : -

ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు.


2-బ్రహ్మ యజ్ఞ తర్పణం : -

నిత్యానుష్టానం లో భాగంగా విడిచే తర్పణాలు ఇవి.


3-పర్హెణి తర్పణం : -

యేటా చేసే పితృకర్మల తరువాతిరోజు ఇచ్చే తర్పణాలు.


4-సాధారణ తర్పణం : -

అమావాస్య రోజున, పుణ్యనదీ స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమణ, గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు.


మన ఋషులు ఇటువంటి తర్పణాలను 96 పేర్కొన్నారు.


*3.) తర్పణాలు ఎందుకు వదులుతాము?

తర్పణము చేయడము వలన దేవతలు శీఘ్రముగా సంతుష్టులౌతారు. లేదా వారిని సంతృప్తి పరచే విధిని తర్పణము అని అందురు. దేవతలను ప్రసన్నము చేసుకొనబడుటకు, వారిని ప్రీతీ చేయుట కొరకు ఈ తర్పణము వదల బడుతుంది.


*4.) ఏ తర్పణానికి ఎటువంటి ఫలితం ఉంటుంది ?

1. తేనె ద్వారా తర్పణము చేయడము వలన అన్ని కోరికలు నెర వేరుతాయి, అన్ని పాతకములు నాశనము అవుతాయి.


2. కర్పూర జలముతో తర్పణము చేస్తే, రాజు వశ మౌతాడు .


3. పసుపు కలిపిన జలముతో తర్పణము చేస్తే, సామాన్య వ్యక్తి వశమౌతాడు.


4. ఆవు నేతితో తర్పణము చేస్తే, …….సుఖము


5. కొబ్బరి నీళ్ళతో తర్పణము చేస్తే, ……. సర్వ సిద్ధి


6. మిరియాలు కలిపిన జలముతో తర్పణము చేస్తే.. శత్రు నాశనము.


*5. )తర్పణం ఎలా వదలాలి ?

కల్పోక్త ప్రకారముగా సాధకుడు, స్నాన, పూజా, హోమ సమయము లందు ప్రతి రోజు దేవతల ప్రీతి కొరకు తర్పణము గావించవలయును. దేవతలకు వారి నామ మంత్రములు ఉచ్చరించుచు, దేవ తీర్ధము ద్వారా తర్పణము చేయ వలెను. వారి నామములకు “స్వాహా” చేర్చి తర్పణము లీయవలెను.

(అగ్ని పురాణము, బ్రహ్మ పురాణము, మంత్ర మహోదధి నుంచి సేకరించ బడినది)


మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?


మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.


 భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు.


*పితృదేవతలకు.... ఆకలా...?

అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.


*అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః*


*యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః*


అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.


మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.


మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే...


పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..


*తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?*


అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారాకానీ, ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు, వరదలు) ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు, పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం ఉంది. దీనినే *సర్వకారుణ్య తర్పణ విధి* అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం, పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.


*మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?*


సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.


క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.


భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి సత్కరించి పంపాలి.


చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.


ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏

*03-05-2024 / శుక్రవారం / రాశిఫలాలు


గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి  "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును



మేషం

ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన వస్తు వాహనాలు చేస్తారు. ఇంటాబయట నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం  ఉత్సాహంగా ఉంటుంది.

---------------------------------------

వృషభం


ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.  చేపట్టిన పనులను మరింత మందకొడిగా సాగుతాయి.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. ఉద్యోగమున  అధికారులతో సమస్యలు కలుగుతాయి.

---------------------------------------

మిధునం


ఆప్తుల నుండి  శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో మీ శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు వివాదాలు తీరి ఊరట చెందుతారు.

---------------------------------------

కర్కాటకం


రాజకీయ సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు.  ఉద్యోగమున మీ  పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

---------------------------------------

సింహం


దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా  వ్యవహరించాలి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. సోదరుల నుండి ధన పరమైన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో  గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------

కన్య


ముఖ్యమైన వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు. వ్యయ ప్రయాసలతో కానీ  పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు.

---------------------------------------

తుల


గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.  జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలిస్తుంది. స్థిరాస్తి  వివాదాలు  పరిష్కార దిశగా సాగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో చికాకులు  అధిగమించి ముందుకు సాగుతారు.

---------------------------------------

వృశ్చికం


చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.  ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

---------------------------------------

ధనస్సు


దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి.

---------------------------------------

మకరం


ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.  వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి.  నిరాశ కలుగుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు.  ప్రయాణాలలో వాహన  ఇబ్బందులు ఉంటాయి.

---------------------------------------

కుంభం


కీలక వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి. మీ మాటకు విలువ పెంచుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలలో నూతన  నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు  సానుకూలమవుతాయి.

---------------------------------------

మీనం


దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. అధిక శ్రమతో స్వల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి.  ఆరోగ్యపరంగా అప్రమత్తంగా వ్యవహరించాలి.  ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

🍁 *శుభం భూయాత్* 🍀

ఆనందాన్ని అందిస్తుంది*..

 💎🌅 *_-|¦¦| శుభోదయమ్ |¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


   శ్లో𝕝𝕝 *ఏతస్మాత్కారణాత్ప్రజ్ఞాం మృగయంతే పృథగ్విధామ్౹*

          *ప్రజ్ఞాలాభో హి భూతానామ్ ఉత్తమః ప్రతిభాతి మే॥* 


                      *-మహాభారతం-*


*భావం:- శ్రేయస్సును కోరుకునేవారు చాలా విషయాల్లో ప్రజ్ఞలను సంపాదించాలని నిరంతరం ప్రయత్నిస్తారు. అన్నిటికంటె ప్రజ్ఞా లాభమే ఉత్తమ ఫలాన్ని ఇచ్చి అభివృద్ధిని - ఆనందాన్ని అందిస్తుంది*....      


🪷 ✍️🙏

శుక్రవారం,మే 3,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


శుక్రవారం,మే 3,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

చైత్ర మాసం - బహుళ పక్షం

తిథి:దశమి రా8.28 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే )

నక్షత్రం:శతభిషం రా9.34 వరకు

యోగం:బ్రహ్మం మ12.02 వరకు

కరణo:వణిజ రా9.38 వరకు

తదుపరి విష్ఠి రా8.28 వరకు

వర్జ్యం:ఉ5.50 - 7.21

మరల తె3.31 - 5.01

దుర్ముహూర్తము:ఉ8.08 - 8.59

మరల మ12.21 - 1.11

అమృతకాలం:మ2.49 - 4.19

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి: మేషం

చంద్రరాశి : కుంభం 

సూర్యోదయం:5.37

సూర్యాస్తమయం:6.15


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి* *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

పూర్వ పద్ధతి పంచాంగం

 *శుభోదయం*

*********

 సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ03.05.2024

శుక్ర వారం (భృగు వాసరే) 

************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ చైత్ర మాసే కృష్ణ పక్షే దశమ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భృగు వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

చైత్ర మాసే కృష్ణ పక్షే దశమ్యాం

భృగు వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.37

సూ.అ.6.15

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

చైత్ర మాసం 

కృష్ణ పక్షం దశమి రా.8.31 వరకు. 

శుక్ర వారం. 

నక్షత్రం శతభిషం

రా.9.36 వరకు. 

అమృతం మ.2.51 ల 4.21 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 8.08 ల 8.59 వరకు. 

దుర్ముహూర్తం ప. 12.21 ల 1.12 వరకు. 

వర్జ్యం ఉ.5.52 ల 7.22 వరకు. 

వర్జ్యం తె. 3.33 ల 5.02 వరకు. 

యోగం బ్రహ్మం మ.12.04 వరకు.  

కరణం వనజి ఉ.9.40 వరకు. 

కరణం విష్ఠి రా.8.31 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం ఉ. 10.30 ల 12.00 వరకు. 

గుళిక కాలం.ఉ.7.30 ల 9.00 వరకు. 

యమగండ కాలం మ.3.00 ల 4.30 వరకు. 

*****************    

పుణ్యతిధి క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ దశమి. 

****************

పుణ్యతిధి క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ నవమి. 

 **************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

శ్రీమదాంధ్రమహాభాగవతము

 💥మ.

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం

దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా

మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా

సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.


(పోతనామాత్య "శ్రీమదాంధ్రమహాభాగవతము" 

👉భావము:

దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి;

రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి;

సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు;

వాణితోను పార్వతీదేవితోను క్రీడించే పూబోణి;

అరవిందాలు మందిరంగా గల జవరాలు;

అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న;

చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే

బంగారు తల్లి;

ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణాలు అనుగ్రహించు గాక!🙏