3, మే 2024, శుక్రవారం

శ్రీమదాంధ్రమహాభాగవతము

 💥మ.

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం

దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా

మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా

సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.


(పోతనామాత్య "శ్రీమదాంధ్రమహాభాగవతము" 

👉భావము:

దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి;

రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి;

సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు;

వాణితోను పార్వతీదేవితోను క్రీడించే పూబోణి;

అరవిందాలు మందిరంగా గల జవరాలు;

అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న;

చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే

బంగారు తల్లి;

ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణాలు అనుగ్రహించు గాక!🙏

కామెంట్‌లు లేవు: