🌅 *_-|¦¦| శుభోదయమ్ |¦¦|-_* 🌄 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐
శ్లో𝕝𝕝 దారిద్య్ర నాశనం దానం శీలం దుర్గతినాశనమ్ |
అజ్ఞాననాశినీ ప్రజ్ఞా భావనా భయనాశినీ ||
తా𝕝𝕝 దానము దారిద్య్రమును పోగొట్టును.... శీలము అనగా ఉత్తమ గుణకర్మ స్వభావములు దుర్గతిని కష్టములను, దౌర్భాగ్యమును పోగొట్టును. బుద్ధి అజ్ఞానమును బోగొట్టును....*నిష్టతో - దేవునియందు విశ్వాసముంచితే ఎటువంటి భయములు ఉండవు*....
👇 //---------- ( *భజగోవిందం* )---------// 👇
శ్లో𝕝𝕝 సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి: 9
భావం: సత్పురుషులతో సాంగత్యం చేయడం వల్ల ఈ ప్రాపంచిక విషయాల మీద సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. *మోహం పోతే మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది. అప్పుడు సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం, జీవన్ముక్తి*.
🪷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి