3, మే 2024, శుక్రవారం

దైవీ సంపదలు

 *"దైవీ సంపదలు"*

🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ఎవరైతే క్రితం జన్మలో జ్ఞానాన్ని సంపాదిస్తారో వారు మరుజన్మలో దైవీ సంపదలతో పుడతారు. వారికి ఈ క్రింద చెప్పబడిన దైవీ సంబంధమైన 26 గుణాలు ఉంటాయి.


1) భయం లేకపోవడం.

2) సత్వగుణం కలిగి వుండటం, మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం.

3) జ్ఞానాన్ని సంపాదించడం.

4) విద్యాదానం, జ్ఞానదానం, భూదానం, అన్నదానం మొదలైన దానాలు శక్తి కొద్దీ చేయడం.

5) ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం.

6) జ్ఞాన యజ్ఞం చేయడం.

7) పురాణాలు, శాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించడం.

8) ప్రతి పనీ ఒక తపస్సులాగా చేయడం.

9) మంచి ప్రవర్తన కలిగి వుండటం.

10) అహింస వ్రతాన్ని పాటించడం.

11) సత్యం పలకడం.

12) కోసం విడిచిపెట్టడం.

13) దుర్గుణాలను త్యాగం చేయడం.

14) ప్రశాంతంగా ఉండటం.

15) ఇతరులను విమర్శించకుండా ఉండటం

16) భూత దయ కలిగి ఉండటం.

17) ఇంద్రియ లోలత్వం, స్త్రీ లోలత్వం లేకుండా ఉండటం.

18) మృదువుగా మాట్లాడటం.

19) చెడ్డ పనులు చేసినపుడు సిగ్గుపడటం.

20) చిత్త చాంచల్యం వదిలిపెట్టడం.

21) ముఖంలో, మనస్సులో తేజస్సు కలిగి ఉండటం.

22) ఓర్పు కలిగి ఉండటం.

23) అన్నివేళలా ధైర్యంగా ఉండటం.

24) శరీరంతో పాటు మనస్సును కూడా శుచిగా ఉంచుకోవడం.

25) ద్రోహబుద్ధి లేకుండా ఉండటం.

26) స్వాభిమానం వదిలి పెట్టడం.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀

*ఈ గుణాలను దైవీసంపదగా పెద్దలు పరిగణించారు.*

🍀🍀🍀🍀🍀🍀🍀🍀

కామెంట్‌లు లేవు: