12, అక్టోబర్ 2021, మంగళవారం

దసరా పాట

 దసరా వచ్చేసింది కదండి....



ఇదే ఆ దసరా పాట


పల్లవి-


1⃣

ఏదయా మీదయ మామీద లేదు!

ఇంతసేపుంచుట ఇది మీకు తగదు!


దసరాకు వస్తిమని విసవిసల బడక!

చేతిలో లేదనక ఇవ్వలేమనక !


ఇప్పుడు లేదనక అప్పివ్వరనక!

రేపురా మాపురా మళ్ళి రమ్మనక!


శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

2⃣


పావలా బేడైతె పట్టేది లేదు!

అర్థరూపాయైతె అంటేది లేదు!

ముప్పావలైతేను ముట్టేది లేదు!

రూపాయి ఐతేను చెల్లుబడి కాదు!

హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటాము!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!


3⃣

అయ్యవారికి చాలు ఐదు వరహాలు!

పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!

మా పప్పు బెల్లాలు మాకు దయచేసి!

శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!


*

దసరా పండుగను గిలకల పండగంటారు చక్కగా కొత్త దుస్తులు ధరించి వెదురుతో చేసిన విల్లం బులు, ఎక్కుబెట్టిన విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారుచేసి దానిలో "బుక్కా" రంగు పొడీ కొందరైతై పువ్వులూ వేసి ఒండొరులు చల్లుకొంటు, ఆడుకొంటూ, పాడుకొంటూ నడిచే దసరా గీతమిది.


పంతుళ్ళు వెనుక నడుస్తుంటే పిల్లలు వరుస ల్లో పాడుతూ ప్రతి వాకిటాఆగి దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైనఆచార మిది.


ఒక వ్యక్తి అభివృద్ధి గాని

కుటుంబ, సమాజ, ప్రాంత అభివృద్ధి గాని జ్ఞానము తోటే సాధ్యమని, చదువుతోటే వికాసమని భావించిన ఆ గ్రామములోని పెద్దలు గ్రామం లోని బడి బలంగా ఉండడానికి తమ సహాయాన్ని అందించేవారు.


ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ స్ధలాలను బడి పెట్ట డానికి నిస్వార్ధంగా దానం ఇచ్చేవారు.

వెలుగు తున్న దీపం మరియొక దీపాన్ని వెలిగిస్తుందని నిజాయతీగా నమ్మిన జ్ఞాన మూర్తులు బతక డానికి కాకుండా, బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి

ఆ గ్రామంలోని పిల్లలను వెలుగు దివ్వెలుగా మార్చేవారు.

దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తాము విద్యార్ధులకు నేర్పిన పద్యాలు, శ్లోకాలు, గణిత సమస్యలు, పొడుపు కధలు మొదలైనవి గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవులలో కుమార జ్ఞాన ప్రదర్శన కావించేవారు.


పిల్లల వయస్సు, తరగతిని బట్టి వివిధ కళలను పిల్లకు నేర్పి తమను పోషిస్తున్న పెద్దలతో చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలను పొందేవారు.

ఇదే కదా నిజమైన పరీక్ష ఉపాధ్యాయులకు

విద్యార్ధులకు 

ఎంత గొప్ప ఆంతర్యమో ఆనాటి దసరా పాటల్లో.

దేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశ్శీస్సులు అందిస్తే ముగ్దులైన ఆ ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని తమ ధనాన్ని దసరా కానుకగా అందించేవారు.

ఆనాటి పిల్లలు అర్జునునిలా జీవన కురుక్షేత్రంలో విజయులే.


అలాంటి ఉపాధ్యాయులు ద్రోణాచార్యులు.

ఈ సంప్రదాయం పాటించే అవసరం ఇప్పుడు లేదనుకోండి. దాంతోపాటే ఈ పాటా మూలపడిపోయింది...

*ఒక తండ్రి తన పిల్లలకు వ్రాసిన ఒక లేఖ....*

 *ఒక తండ్రి తన పిల్లలకు వ్రాసిన ఒక లేఖ....*


నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలు:

1. జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు.

2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.

3. నేను రాస్తున్నదంతా నేను జీవితంలో అనుభవించినవి. నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో 

నీ గుండె గాయపడకుండా ఉంటుందని.


*ఈ క్రింద విషయాలు అతి జాగ్రత్తగా గుర్తుంచుకో....


1)నీతో సఖ్యముగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు. నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ ఉండదని బాగా గుర్తెరిగి మసలుకో.

నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు. అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది. నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త, గుడ్డిగా వారిని ఆత్మీయులు అనుకొని, నమ్మి నీ మనసు గాయపరచుకునేవు సుమా!


2)ఏ ఒక్కరూ తప్పనిసరి కాదు, తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు.

ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు.


3)జీవితం బహు చిన్నది.

ఒక్క రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవిం చాల్సిన, మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించుకో.


4) ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన ఒక భావన. కాలాన్ని, మూడ్ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్. నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు, ఓపిక పట్టు. కాలం నీగాయాలను, బాధలను అన్నింటినీ కడిగేస్తుంది, కావాలంటే నీ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని గమనించు.

ప్రేమ సౌందర్యాన్ని , అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు. ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో ( Damn crazy movies! )


5)చాలామంది బాగా చదువుకోకుండానే జీవితంలో పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు, కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు. నువ్వు సంపాదించే జ్ఞానమంతా 

నీకు గొప్ప ఆయుధాలని గ్రహించు.

దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే, కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుందని మరచిపోకు.


6)నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను. 

అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత సైకిల్ మీద తిరుగుతావా, బస్సులో తిరుగుతావా, నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకోవాలి.


7) ఇచ్చిన మాటను ఎంత కష్టమైనా నిలబెట్టుకో.

మనస్సు లో

ఆలోచించే ఆలోచన,

మాట్లాడే మాట,

చేసే పని 

సత్యము, 

న్యాయము ,

ధర్మము కలిగి యుండాలి

ఇతరులనుంచి ఇది ఆశించకు. నువ్వు అందరితో మంచిగా ఉండు, అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు. ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే నీకు అనవసర సమస్యలు వస్తాయి.


8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే(స్మార్ట్ గా) ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్స్ లేవని బలంగా నమ్ము.


9)దేవుని మీద పరిపూర్ణ విశ్వాసము,నిరీక్షణ కలిగి యుండు.


10)అది ఎంతకాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా మనస్సు లో దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా .

 *(సమాజము పట్ల ఆరోగ్యవంతమైన భయము ఉన్న ఒక తండ్రి* ).

అమ్మా వాణీ!....

 అక్షర జ్ఞానాన్ని ప్రసాదిస్తావని

తల్లీ నిన్ను దలంచి అంటూ 

ఆర్తితో కీర్తి స్తున్నా!....

వాక్పటుత్వాన్నీ ఇస్తావనీ

భక్తితో నిను కొలుస్తున్నా!

నీ దయను నాపై కూరిపించావని

ఆపై యుక్తితో నీ ప్రతిభను ప్రదర్శిస్తున్నా!

విజ్ఞాన ఉషస్సు ను నాలో వెలిగించి

అజ్ఞాన తిమిరా న్నీ తొలగించి

సు జ్ఞాన మనో వీధిలో 

నను అక్షర రమ్యత గొలిపే

జ్ఞానుడిగా చేస్తూ!....

ఈ జగత్తున మిధ్య లో

నను ఉంచెయ్యక

మాయా ప్రపంచం లోనూ 

ముంచె య్యక

యుక్తితో నీ విచ్చిన ఈ జన్మనుచరితార్థం చేసుకుంటూ!

నీ సేవలో సదా పునీతంగావించుకో నీ అమ్మా!...

శారదమ్మా నీ కీదే నా అంజలీ గైకోమ్మా!

వాగ్దేవి!...వీణాపాణి!...అమ్మా వాణీ!


దోస పాటి.సత్యనారాయణ మూర్తి

సామర్లకోట

9866631877

సమాన హక్కులు ఎక్కడ ఉన్నాయి?

 *సైర నరసింహరెడ్డిని తల తీసి కోట గుమ్మానికి వేలాడదీశారు,

*అల్లూరి సీతారామరాజు ని చుట్టుముట్టి చంపారు,

*మంగల్ పాండేను ఉరితీశారు,

*తాంతియా తోపేను ఉరితీశారు,

*రాణి లక్ష్మీబాయిని ఆంగ్ల సైన్యం చుట్టుముట్టి చంపింది,

*భగత్ సింగ్ ను ఉరితీశారు,

ఉరితీసిన సుఖ్ దేవ్, రాజగురు‌ వేలాడదీయ బడ్డారు,

*చంద్రశేఖర్ ఆజాద్ స్వయం బలిదానం,

*సుభాష్ చంద్రబోస్ అదృశ్యమయ్యాడు,

*భగవతి చరణ్ వోహ్రా బాంబు దాడిలో మరణం,

*రాంప్రసాద్ బిస్మిల్ ను ఉరితీశారు,

*అష్ఫకుల్లా ఖాన్ ను ఉరితీశారు,

*రోషన్ సింగ్ ను ఉరితీశారు,

*లాలా లాజ్‌పత్ రాయ్ లాతిచార్జ్‌లో మరణించారు,

*వీర సావర్కర్ యావజ్జీవ శిక్ష,

*చాఫేకర్ సోదరులను (3 ని) ఉరితీశారు,

*మాస్టర్ సూర్య సేన్ ని ఉరితీశారు,

ఈ దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో తమ అత్యున్నత త్యాగం చేసిన కొద్దిమంది పేర్లు మాత్రమే ఇవి.

చాలా వేల మంది హీరోలు ఉన్నారు, మనకు వారి పేర్లు కూడా తెలియదు.


ఈ రోజు వరకు ఒక విషయం నాకు అర్థం కాలేదు, గాంధీ మరియు నెహ్రూలకు దేవుడు ఎలాంటి కవచ కుండాలాలు ఇచ్చాడు,

ఏ కారణంగా బ్రిటిష్ వారు వారిద్దరినీ ఉరితీయడం అటుంచి, ఒక లాఠీ కూడా కొట్ట లేదు ... 

అన్నింటికంటే మించి, ఇద్దరూ భారతదేశానికి చెందిన బాపు మరియు చాచా అయ్యారు.

మరియు వారి తరాలు ఇప్పటికీ దేశం మొత్తం మీద తమ పెంటెంట్‌ను అను భవిస్తున్నాయి. 

* లోతుగా ఆలోచించండి *

సైనికులపై రాళ్ళు - అహింసా ఉద్యమం

ప్రొసీడింగ్స్ ఆన్ లవ్ జిహాద్ - పోకిరితనం

రాళ్ళు రువ్వారు - తిరుగుతున్న యువత

భారత్ ను ముక్కలు చేస్తాం - భావ ప్రకటనా స్వేచ్ఛ 

భన్సాలీ చెంపదెబ్బ - హిందూ ఉగ్రవాదం

గొడ్డు మాంసం తినడం - ఆహార హక్కు

ఈద్ మీద మేక కోత - మత స్వేచ్ఛ 

ట్రిపుల్ తలాక్ హలాలా - మతపరమైన అంతర్గత పదార్థం 

దీపావళి బాణసంచా - పర్యావరణ కాలుష్యం 

నూతన సంవత్సర పటాకులు - వాతావరణానికి ఇబ్బంది లేదు.

క్రిష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టే పిల్లలు - 

రాజ్యాంగ విరుద్ధం 

అమాయక పిల్లల సున్తీ - మతపరమైన అంతర్గత విషయం 

వేదికపై నమాజ్ - మతపరమైన హక్కులు

రోడ్ పండల్ - రోడ్ జామ్ కేసు 

మసీదు లౌడ్ స్పీకర్ - మత స్వేచ్ఛ

ఆలయంలో లౌడ్ స్పీకర్ - శబ్ద కాలుష్యం

కార్వాచౌత్ - ధకోసల 

ప్రేమికుల రోజు - ప్రేమ ఉత్సవం 

నాలుగు వివాహాలు - మత స్వేచ్ఛ 

హిందూ రెండు వివాహం - కేసు నమోదు

గణేష్ నిమజ్జనం, హోలీ - నీటి కాలుష్యం

తాజియా ఇమ్మర్షన్ - రాజ్యాంగ హక్కులు

అజామ్, ఒవైసీ, కేజ్రీ - నేషన్ మెన్ 

మోడీ, యోగి, స్వామి- హిందూ ఉగ్రవాదులు

భగత్ సింగ్ సుఖ్‌దేవ్ రాజ్‌గురు - ఉగ్రవాదులు

అఫ్జల్, కసాబ్, బుర్హాన్-షాహీద్ స్వాతంత్ర్య వీరులు

15 నిమిషాల పోలీసు తరలింపు-సహనం

ఎన్నికల్లో బిజెపి గెలిచింది - అసహనం

కాశ్మీర్, అస్సాం కేరళ అల్లర్లు - దేశం నిశ్శబ్దంగా ఉంది 

అఖ్లాక్, గుజరాత్ అల్లర్లు - అవార్డు వాపసీ, అసహనం కలిగిన దేశం

శివలింగంపై పాలు - పాలు వ్యర్థం 

మేకలు కోయుట, రక్తపు టేరలు - మత విశ్వాసాలు 

రాముని ఆలయం - గుండరాజ్

బాబ్రీ మసీదు - దేశంలో శాంతి 

తాజ్ మహల్ - ప్రేమకు సంకేతం 

రామ్ సేతు- ఊహాత్మకమైనది, రాముడు లేడు 

ఉగ్రవాదుల ఉరిశిక్షపై - రాత్రి సమయంలో, కోర్టులు తెరుచుకుంటాయి, క్షమ పిటిషన్లు దాఖలు చేయబడతాయి, భారత వ్యతిరేక నినాదాలు లేవనెత్తుతాయి. 

ఒక కులభూషణుని ఉరి - అందరూ మౌనంగా ఉన్నారు.

భారతదేశంలో హిందువులపై దారుణం - ఏ గొంతు పెగలదు ... అందరూ నిశ్శబ్దంగా మారతారు. చచ్చిన పాముల్లా ఉండిపోతారు.

హిందువుల ప్రతిచర్య - కాషాయ ఉగ్రవాదులు. దేశంలో అసహనం యొక్క వాతావరణం, వంచన వంటి అవార్డులు‌.

దేవతలను అవమానించడం - వ్యక్తీకరణ యొక్క స్వేచ్ఛ 

మహ్మద్ గురించి వివరణ - దేశంలో అరాచకత్వం.

ఇది భారతదేశం యొక్క నిజం 

ఈ దేశంలో ఏమి జరుగుతోంది?

సమాన హక్కులు ఎక్కడ ఉన్నాయి? 

ఇది ఏమిటో అందరూ ఆలోచించాలి? 

ఓహో కాంగ్రేస్ మీరు ఈ దేశానికి ఏ గతి పట్టించారు .

లేవండి సోదరులారా లేవండి.

ఈ సమాచారం భారత దేశం అంతా చదివితేనే దేశం ముందుకెలుతుంది.......!

నా దేశం, మొట్టమొదట ప్రాధాన్యత.......!

ప్రతి ఒక్కరూ ఈ పద బంధాన్ని ఎప్పుడు పునరావృతం చేసు కోవాలి,

అప్పుడే నా దేశం మారగలదు!


*****భారత్ మాతా కీ జై!******

÷÷÷÷÷÷÷×××××××÷÷÷÷÷÷

ఒక గొప్ప కథ .

 ఒక గొప్ప కథ ..


సముద్ర తీరాన *ఒక కుర్రాడు* ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది. అతను వెంటనే " *ఈ సముద్రం మహా దొంగ*"అని రాశాడు.


 కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పట్టాడు. ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ *చేపలు* దొరకడంతో

 " *ఈ సముద్రం గొప్ప దాత*" అని రాశాడు. 


*ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు* మునిగి పోయాడు. అతని తల్లి ‘ " *ఈ సముద్రం*" నా కొడుకు లాంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న *మహమ్మారి* " అని రాసింది. 

ఒక *పెద్దతను* సముద్రంలోకి వెళ్లి *ముత్యాలు సేకరించి* విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో " *ఈ సముద్రం ఒకటి చాలు జీవితమంతా హాయిగా బ్రతికేస్తాను* " అని రాశాడు.


*అనంతరం ఒక పెద్ద అల వచ్చింది.వీరందరూ రాసిన మాటలను తుడిచి పెట్టేసింది*. 


*రకరకాల అభిప్రాయాలను సముద్రం తన అలలతో తుడిచేసుకుంది.అలానే మన జీవితంలో ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడరాదు*...

*ఇంకా ఇతరులు ఏవేవో చెప్పిన మాటలన్నింటిని విని ఎవరి పైనా చెడు అభిప్రాయానికి రాకూడదు.* *వారిని కూడా మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి*. *ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు.మన చేతి ఐదు వేళ్లలా, ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని ఆలోచించండి*.

*దాని తొలగించి ముందుకు అడుగు వేయండి. భగవంతుని తోడుగా చేసుకోండి*..

*వినయం, విధేయతతో విజయం మీ సొంతం అవుతుంది.మనస్సాక్షి , భగవంతుడు ఒప్పుకునేలా జీవించాలి.

ఇంటికి పెద్ద దిక్కు ఉండాలి

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🚩🚩🚩🚩🚩🚩🌸

*ఇంటికి పెద్ద దిక్కు ఉండాలి అంటారు ఎందుకు?* 👌👍🙏


ఇంటికి పెద్దదిక్కు వుండాలి అంటారు.. ఎందుకంటే నాలుగు మంచి మాటలు చెప్పడానికి మరియు ఎవరైనా తప్పు చేస్తే ఖండించడానికి.. *మాకు పెద్ద దిక్కే వద్దు, మంచి చెప్పే వాళ్లు వద్దు అని అంటే ఆ కుటుంబం ఎటుపోతుంది..

కళ్లు గానక ఊభిలోనికి కూరుకుపోతారు* ..

ఇదే దుర్యోధనుని విషయంలో జరిగింది. దుర్యోధనునికి తల్లిదండ్రులు ప్రేమ వలన చెప్పలేకపోయారు, విదురుడు మంత్రిత్వం వలన చెప్పలేక పోయాడు, భీష్ముడు పాపం తాత గారు, చనువు ఎక్కువ అయినా ఎన్నో సార్లు చెప్పి చూశాడు కానీ ఆయన్నీ లెక్క చేయలేదు.. చివరికి సర్వం రాజ్యమే కూలిపోయింది..


పెద్దలు లేని సంసారం, కుటుంబం ఏమవుతుందో తెలుసుకోవాలి..

నూరుగురు కౌరవులు ఏమయినారో మనం గుర్తుంచుకోవాలి, ధర్మాన్ని చెప్పేవాడు ఓక్కడైనా వుండాలి, 

అదే ధృతరాష్ట్రుని గొప్పతనం...

ధృతరాష్ట్రుడు విదురుడ్ని ప్రక్కన బెట్టుకొన్నాడు, అందుకనే ఆయనకు శ్రీకృష్ణ విశ్వరూప దర్శనం లభించింది.

అదే శకుడ్ని దగ్గర పెట్టుకొన్న దుర్యోధనడు యొక్క స్థితి మనకు తెలుసు..


దుర్మార్గుడైనా సరే ఓ మహాత్ముడ్ని, మంచి వాడ్ని చెంత పెట్టుకోవాలి.. దీనిని మనం బాగా పట్టుకోవాలి.

అదే ధర్మరాజు విషయంలో చూడండి.. అందరి మాట విన్నాడు, ఆయన మాట ఆయన తమ్ముళ్లు విన్నారు, ధర్మ ప్రవర్తనతో బ్రతికారు, 

దుర్యోధనుడు ఎవ్వరి మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు, గురువుల మాట వినలేదు, పెద్దల మాట వినలేదు, శ్రేయోభిలాషుల మాట వినలేదు, భగవంతుడి మాట కూడా వినలేదు చివరికి ఏమైయాడు?


 *మంచి చెప్పే వాళ్లను బ్రతిమలాడి కోనైనా తెచ్చుకోవాలి."అయ్యా మీరు మార్గ నిర్ధేశకులుగా ఉండండి* , అధ్యక్షులుగా వుండండి, పెద్దలుగా వుండండి మాకు!" అని ప్రాధేయపడి వుంచుకోవాలి. పెద్దవాళ్లను వుంచుకున్నందు వలన కుటుంబాలకు, సంస్థలకు, సభలకు గౌరవం లభిస్తుంది,

చెడ్డవాళ్లను డబ్బులు ఇచ్చి అయినా వదిలించుకోవాలి అంటారు.. రాజు చెడ్డవాడు అయినా మహా మంత్రి మంచివాడుగా, ధర్మం చెప్పేవాడుగా వుండాలి.. అప్పుడే ఆ రాజు, ప్రజలు పది కాలాలు పాటు చల్లగా వుంటారు.. ధర్మం చెప్పే పెద్దలు లేనందువలన లేదా చెప్పినా వినకపోవడం వలన సమాజం దెబ్బతింటుంది.


 *ఎవడికి వాడు నేనే పెద్ద అంటే ఎలాగా? 

అలాంటి జ్ఞానవంతులు వుంటేనే ఓక్కోసారి పొరబాట్లు, తప్పులు జరిగిపోతూ వుంటాయి..* 


అయ్యా శ్రీకృష్ణా! నేను ఏమి తప్పుజేసానని? అని భీష్ముడు శ్రీకృష్ణుల వారిని అడుగుతాడు...

"ఓ తప్పు జరిగేచోట పెద్దలు వుండటమే తప్పు" అని అంటాడు. ఓ తప్పును చూస్తూ ఖండించకుండా, అక్కడ నుంచి వెళ్లిపోకుండా మౌనం వహించి చూస్తూ వుండటమే భీష్ముడు చేసిన తప్పు. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు ఏమీ చేయలేక అక్కడే వుండిపోయాడు..

అదే విదురుడు చూడకుండా వెళ్లిపోయినాడు....

కావున పెద్దలు ఓ తప్పు జరిగిన చోట వుంటే ఆ పాపం వారి ఖాతాలో కూడా వేస్తారు. అందువలన చెప్పిన మాట విననప్పుడు పెద్దలు ఆ స్థలం నుంచి వెళ్లిపోతారు.....

ఇది విజ్ఞులు చేసే పని.

నవావరణ పద్యార్చన*

 *శ్రీ ప్లవ - శరన్నవరాత్రులు - నవావరణ పద్యార్చన*

           రచన: శ్రీశర్మద - స్వర్ణపురి (పొన్నూరు)


ఆశ్వయుజ శుక్ల సప్తమి: ది.12-10-2021


శార్దూలము: 

శీతాద్రిన్ తుహినాన కెంపులమరెన్ శ్రీమాతృపాదారుణా

రీతుల్గ్రాలగ, పుష్యరాగమణులే క్రీడించె శారీరికా

భాతిన్, నీలమణీవిహారధృతిసంవాదాన నీలాలకల్

నా తల్లీ! తవసౌకుమార్యలహరీనాదమ్ము నన్నోముతన్

✍️శ్రీశర్మద

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

 *12.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునాలుగవ అధ్యాయము*


*భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*14.17 (పదిహేడవ శ్లోకము)*


*నిష్కించనా మయ్యనురక్తచేతసః శాంతా మహాంతోఽఖిలజీవవత్సలాః|*


*కామైరనాలబ్ధధియో జుషంతి యత్ తన్నైరపేక్ష్యం న విదుః సుఖం మమ ॥12745॥*


నా భక్తులు సర్వదా నాయందే అనురక్తులై నన్ను దప్ప మరి దేనీనీ అభిలషింపరు. వారు అంతఃకరణ శుద్ధిగలవారు (జితేంద్రియులు). సకల జీవులయందును వాత్సల్యము గలిగియుందురు. సాధుస్వభావముగలవారు. ఎట్టి కామవాసనలునూ లేనివారు. అట్టి సత్పురుషులకు లభించు ఏకాంతిక సుఖానుభవము (నిరతిశయానంద సుఖానుభవము) మఱి ఎవ్వరికిని ప్రాప్తింపదు.


*14.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*బాధ్యమానోఽపి మద్భక్తో విషయైరజితేంద్రియః|*


*ప్రాయః ప్రగల్భయా భక్త్యా విషయైర్నాభిభూయతే॥12746॥*


నా భక్తుడు జితేంద్రియుడు కానప్పటికి అతనిని శబ్దస్పర్శాది విషయములు బాధించుచున్నను (ఆకర్షించుచున్నను) అతనిలో దినదినాభివృద్ధి చెందుచున్న నా భక్తియోగ ప్రభావముచేత క్రమక్రమముగ విషయాసక్తి నశించిపోవును.


*14.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*యథాగ్నిః సుసమృద్ధార్చిః కరోత్యేధాంసి భస్మసాత్|*


*తథా మద్విషయా భక్తిరుద్ధవైనాంసి కృత్స్నశః॥12747॥*


ప్రచండాగ్ని (బాగుగా ప్రజ్వలించుచున్న అగ్ని) ఇంధనములను భస్మము చేయునట్లు, నా యందుగల భక్తియే పాపములను అన్నింటిని పూర్తిగా రూపుమాపును.


*14.20 (ఇరువదియవ శ్లోకము)*


*న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఉద్ధవ|*


*న స్వాధ్యాయస్తపస్త్యాగో యథా భక్తిర్మమోర్జితా॥12748॥*


ఉద్ధవా! నన్ను చేరుటకు భక్తియే సులభమైన మార్గము. యోగసాధనము, సాంఖ్యము, ధర్మాచరణము, స్వాధ్యాయము, తపస్సు, త్యాగము మున్నగునవి ఏవియును భక్తివలె సులభోపాయములు గావు.


*14.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*భక్త్యాహమేకయా గ్రాహ్యః శ్రద్ధయాఽఽత్మా ప్రియః సతామ్|*


*భక్తిః పునాతి మన్నిష్ఠా శ్వపాకానపి సంభవాత్॥12749॥*


నేను సత్పురుషులకు ఇష్టుడను. వారికి నేను ఆత్మస్వరూపుడను. వారి భక్తిశ్రద్ధలవలన మాత్రమే (నేను) వారికి ప్రాప్యుడను. నా భక్తుడు పుట్టుకచే (జన్మతః) చండాలుడైనప్పటికిని, నాపైగల గాఢమైన భక్తియే అతనిని పవిత్రుని గావించును.


*14.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*ధర్మః సత్యదయోపేతో విద్యా వా తపసాఽన్వితా|*


*మద్భక్త్యాఽపేతమాత్మానం న సమ్యక్ ప్రపునాతి హి॥12750॥*

ఉద్ధవా! నాయందు భక్తిలేనివాడు ఎంతగా ధర్మాచరణ మొనర్చినను, సత్యనిష్ఠ గలిగియున్నను, ఎంతటి దయాళువైనను, ఎన్ని విద్యలను నేర్చినను, ఎట్టి తపస్సులను గావించినను అతడు పవిత్రుడు కాజాలడు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*450వ నామ మంత్రము* 12.10.2021


*ఓం నందిన్యై నమః*


సకలజీవులకు ఆనందమును ప్రసాదించు ఆనందస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.


కామధేను వంశమునందలి నందినీధేను స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.


గంగా స్వరూపిణియైన లలితాంబికకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నందినీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం నందిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులు ఆత్మానందస్వరూపులై విరాజిల్లుదురు.


అనంతకోటి జీవరాశులందు పరమేశ్వరి ఆనందస్వరూపిణియై విరాజిల్లుచున్నది. సకలజీవులకు ఆయువు, ఆరోగ్యమును ప్రసాదించి, చక్కని శరీరఛాయతో విరాజిల్లువారిగను, తను ప్రసాదించిన అన్నపానీయములను సేవించు ఆ జీవరాశులు పుష్టిగా, తుష్టితోను, పరమానందముతోను జీవనము సాగించునట్లు అనుగ్రహించును. 


అమ్మ బ్రహ్మానందస్వరూపురాలు గనుకనే జీవకోటికి ఆనందమును ప్రసాదించుచున్నది. అందుచే ఆ తల్లి *నందినీ* యని అనబడినది. 


జగన్నిర్మాణానికి భగవంతుని యొక్క శక్తి. యాదవకులమునందు, యశోదానందుల ఇంటియందు యోగమాయగా పెరిగిన నారాయణీస్వరూపురాలు గనుకనే అమ్మవారు *నందినీ* యని అనబడినది. యోగమాయా స్వరూపిణియైన ఆ నారాయణి సాక్షాత్తు దుర్గాస్వరూపిణి. దుష్టలకు భయంకరిణిగాను, శిష్టులకు రక్షిణిగాను, ఆనందప్రదాయనిగాను విరాజిల్లు పరమేశ్వరి *నందినీ* యని అనబడినది. 


కామధేనువంశమునందు పుట్టిన ఒక గోవునకు *నందిని* యను నామముగలదు.అటువంటి గోమాతా స్వరూపిణి గనుకనే అమ్మవారు *ఓం గోమాత్రే నమః* (605వ నామ మంత్రమునందు) యని కూడా అనబడినది. అనగా అమ్మవారు గోవులకు తల్లి అయిన కామధేనువు రూపంలో పూజింపబడుచున్నది. గనుకనే అమ్మవారు *నందినీ* యని అనబడినది.


గంగానదికి *నందినీ* యను నామము గలదు. అందుచే పరమేశ్వరి గంగాస్వరూపురాలు అగుటచే *నందినీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నందిన్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*449వ నామ మంత్రము* 12.10.2021


*ఓం కాంత్యై నమః*


ఇచ్ఛాస్వరూపురాలు మరియు శక్తిస్వరూపురాలు (కాంతి శబ్దముచే) గా విశేషించి చెప్పబడు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కాంతిః* అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం కాంత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులను స్ఫురద్రూపులుగాను, పరిపూర్ణత్వము నిండిన ముఖవర్చస్సుతో విరాజిల్లువారిగను అనుగ్రహించి సకల జనుల మధ్య ఆదరణగలవారిగ వర్ధిల్లజేయును.


*యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థితా|*


*నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః॥*


కాంతి రూపంలో సకల జగములందూ విరాజిల్లుచున్న పరమేశ్వరీ నమో నమః🙏🙏🙏


అనంతకోటి జీవరాశులలో ఆ పరమేశ్వరి తేజస్సుగా విరాజిల్లుచూ, ఆ జీవులకు జీవకళను ప్రసాదించుచున్నది. జీవులకు తేజస్సులేనిచో ఆ జీవులలో ప్రేతకళ ఉట్టి పడుచుండును. కాంతిస్వరూపిణియై, జీవులకు కాంతిప్రదాతయై విరాజిల్లుచూ, ఇచ్ఛాస్వరూపురాలుగను, శక్తిస్వరూపురాలుగను విలసిల్లుచున్నది ఆ పరమేశ్వరి గనుకనే జీవులకు శక్తిని ప్రసాదించుచున్నది, తేజస్సును ప్రసాదించుచున్నది. ఆ తల్లి *ఉద్యద్భానుసహస్రాభ* ఉదయించుచున్న వేయి (అనంతకోటి) సూర్యుల కాంతిని బోలియున్నది. అంతటి కాంతిగలిగి యుండుటచే జీవులకు తేజస్సును ప్రసాదించుచున్నది గనుకనే అమ్మవారు *కాంతిః* అని యనబడినది. కాంతిలో సంచరించు జీవులు కళకళలాడు కాంతివంతమైన శరీరచ్ఛాయతో విరాజిల్లుట జరుగును. నీడలో పెరిగే మొక్కకు, సూర్యకాంతిలో పెరిగే మొక్కకు ఎంత వ్యత్యాసముండునో కాంతితో విరాజిల్లు జీవులకు, కాంతివిహీన జీవులకు అంతటి వ్యత్యాసముండును. అందుకనే అమ్మవారు *యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థితా* అని కీర్తింపబడుచున్నది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కాంత్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం

 *11.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునాలుగవ అధ్యాయము*


*భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*14.9 (తొమ్మిదవ శ్లోకము)*


*మన్మాయామోహితధియః పురుషాః పురుషర్షభ|*


*శ్రేయో వదంత్యనేకాంతం యథాకర్మ యథారుచి॥12737॥*


మహాత్మా! ఉద్ధవా! నా మాయవలన అందరి బుద్ధులును మోహితములైనవి. అందువలన వారు తమ తమ కర్మసంస్కారములను, ఇష్టములను అనుసరించి, ఆత్మశ్రేయస్సునకై పెక్కు మార్గములను వెలువరించిరి.


*14.10 (పదియవ శ్లోకము)*


*ధర్మమేకే యశశ్చాన్యే కామం సత్యం దమం శమమ్|*


*అన్యే వదంతి స్వార్థం వా ఐశ్వర్యం త్యాగభోజనమ్|*


*కేచిద్యజ్ఞతపో దానం వ్రతాని నియమాన్ యమాన్॥12738॥*


*14.11 (పదకొండవ శ్లోకము)*


*ఆద్యంతవంత ఏవైషాం లోకాః కర్మవినిర్మితాః|*


*దుఃఖోదర్కాస్తమోనిష్ఠాః క్షుద్రానందాః శుచార్పితాః॥12739॥*


అవి ఏవనగా - ధర్మమే శ్రేయస్సాధనమని పూర్వమీమాంసకులు చెప్పగా, కీర్తియని సాహిత్యాచార్యులు, కామమని కామశాస్త్రజ్ఞులు, సత్యము, శమదమాదులేనని యోగవిదులు, ఐశ్వర్యమని నీతిశాస్త్రవేత్తలు, త్యాగమని త్యాగధనులు, భోగములే మిగుల లాభములని చార్వాకులు చెప్పెదరు. కొందరు యజ్ఞము, తపస్సు, దానము, వ్రతము, యమ-నియమాదులే పురుషార్థములని వివరింతురు. కాని, ఈ కర్మలన్నింటి ఫలస్వరూపములుగా లభించెడు లోకములు అన్నియును ఉత్పత్తి, వినాశములు గలవి. కర్మఫలములు సమాప్తమైన వెంటనే వారికి దుఃఖములే మిగులును. నిజమునకు వారికి చిట్టచివరకు లభించేది ఘోరమైన అజ్ఞానమే. వాటిద్వారా ముందుగా వారికి లభించే సుఖములుగూడా తుచ్ఛమైనవి, లెక్కింపదగినవికావు. వాటిని అనుభవించే కాలముసందు కూడా వారు అసూయాది దోషములను కలిగియుండుటచే పూర్తిగా దుఃఖభాజనులే అగుదురు. కావున, వేరువేరు సాధనముల దురాశలో చిక్కుకొనరాదని గ్రహింపవలెను.


*14.12 (పండ్రెండవ శ్లోకము)*


*మయ్యర్పితాత్మనః సభ్య నిరపేక్షస్య సర్వతః|*


*మయాఽఽత్మనా సుఖం యత్తత్కుతః స్యాద్విషయాత్మనామ్॥12740॥*


సాధుపురుషుడవైన ఉద్దవా! నిరతిశయానంద స్వరూపుడనైన నాయందే తమ మనస్సులను (సర్వస్వమును) సమర్పించినవారును, సమస్త విషయసుఖములయందు ఎట్టి ఆసక్తియు లేనివారును అగు పురుషులు ఆత్మానందమును అనుభవింతురు. అట్టివారికి ప్రాప్తించెడి పరమసుఖము విషయలోలురకు ఎట్లు చేకూరును?


*14.13 (పదమూడవ శ్లోకము)*


*అకించనస్య దాంతస్య శాంతస్య సమచేతసః|*


*మయా సంతుష్టమనసః సర్వాః సుఖమయా దిశః॥12741॥*


ఎట్టి అభిలాషలూ లేనివారును, బాహ్యేంద్రియ-అంతరింద్రియ నిగ్రహము గలవారును, సుఖదుఃఖాది ద్వంద్వములయందు సమదృష్టి గలవారును అయి, నిరంతరము నాయందే తమ చిత్తములను లగ్నమొనర్చుచు సంతుష్టిచెందెడి నా భక్తులకు అన్నివిధములుగా సుఖమే ప్రాప్తించును.


*14.14 (పదునాలుగవ శ్లోకము)*


*న పారమేష్ఠ్యం న మహేంద్రధిష్ణ్యం న సార్వభౌమం న రసాధిపత్యమ్|*


*న యోగసిద్ధీరపునర్భవం వా మయ్యర్పితాత్మేచ్ఛతి మద్వినాఽన్యత్॥12742॥*


తమ హృదయములను (సర్వస్వమును) నాకే సమర్పించిన భక్తులు బ్రహ్మపదవినిగాని, ఇంద్రాధిపత్యమును గాని, సార్వభౌమాధికారమునుగాని, రసాతల-ఐశ్వర్యములనుగాని, అణిమాది సిద్ధులనుగాని కోరరు. అంతేగాదు కడకు వారు మోక్షమునుగూడ అభిలషింపరు. నాయందు అనన్యభక్తిని కలిగియుండుటయే వారి పరమలక్ష్యము. దానిముందు ఈ బ్రహ్మాది పదవులు అన్నియును దిగదుడుపే.


*14.15 (పదిహేనవ శ్లోకము)*


*న తథా మే ప్రియతమ ఆత్మయోనిర్న శంకరః|*


*న చ సంకర్షణో న శ్రీర్నైవాత్మా చ యథా భవాన్॥12743॥*


ఉద్ధవా! నీవు నాకు అత్యంత ప్రియతముడవు. నా పుత్రుడైన బ్రహ్మగాని, ఆప్తుడైన శంకరుడుగాని, సోదరుడైన బలరాముడుగాని, నిత్యానపాయినియైన లక్ష్మీదేవిగాని, కడకు నా ఆత్మగాని నీవలె నాకు ప్రియములుగావు.


*14.16 (పదహారవ శ్లోకము)*


*నిరపేక్షం మునిం శాంతం నిర్వైరం సమదర్శనమ్|*


*అనువ్రజామ్యహం నిత్యం పూయేయేత్యంఘ్రిరేణుభిః॥12744॥*


నన్ను దప్ప మరి దేనినీ అపేక్షింపనివాడు, నా రూపగుణములనే మననము చేయుచుండువాడు, ప్రశాంతచిత్తుడు, ఏ ప్రాణియందును వైరభావము లేనివాడు, అంతటను నన్నే దర్శించుచుండువాడు అగు భక్తుని నేను అనుగమించు చుందును. వాని పాదధూళులు నన్ను సోకుటవలన నాలోని లోకములన్నియును పవిత్రములగును. అనగా నా స్పర్శతోవలె, నా భక్తునియొక్క పాదరేణువుల స్పర్శవలనగూడ సకల లోకములును పునీతములగును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

చిత్రకారుడు


************************

        *శుభోదయం* 

       *మంగళవారం* 

************************


🔥ఒకప్పుడు ఒక చిత్రకారుడుండేవాడు. అతనెంత ప్రతిభావంతుడంటే అతను దేన్ని చూసినా యథాతదంగా చిత్రించే వాడు. అతని చిత్రాలు ఎంతో సజీవంగా ఉండేవి. అతను చిత్రకారుడేకాక ఉదాత్తమయిన ఉద్దేశాలు ఉన్నవాడు. అందర్నీ ఆనందపెట్టడమే కాదు. అందరూ మరచిపోలేని మహోన్నత చిత్రాల్ని చిత్రించాలన్నది అతని ఆశయం. అవి మనుషులకు ఉపయోగపడాలి. వాళ్ళని ఆలోచింప చెయ్యాలి అనుకునేవాడు. ఒకసారి ఆ చిత్రకారుడికి ఒక ఆలోచన వచ్చింది. ప్రపంచంలో కెల్లా ప్రశాంతమయిన వ్యక్తి రూపురేఖల్ని చిత్రించాలనుకున్నాడు. ఆ శాంతమూర్తిని ఎవరయినా చూస్తే వాళ్ల మనసులోని ఆందోళనలన్నీ మాయమయిపోవాలి. ఆ వదనం అంత నిర్మలంగా ఉండాలి. అతన్ని చూస్తే దైవం గుర్తు రావాలి.

అంత పవిత్రమైన రూపం కోసం అతను బయలు దేరాడు. ఎన్నో నగరాలు చూశాడు. ఎన్నో పట్టణాలకు వెళ్లాడు. లెక్కలేనన్ని గ్రామాలు తిరిగాడు. ఎక్కడా అతనికి అతను ఊహించిన నిర్మలమయిన మనిషి కనిపించలేదు. అన్నీ ఆందోళన నిండినట్లున్న ముఖాలే. ఎక్కడా నిశ్చింతగా నిర్మలంగా ఉన్న ఒక్క ముఖం కూడా కనిపించలేదు. చాలా నిరాశతో తన ప్రయత్నం విరమించుకునే దశలో అతను ఒక గ్రామం గుండా వెళుతున్నాడు. అక్కడ ఒక కుర్రాడు బీడు భూముల్లో గొర్రెల్ని కాచుకుంటూ కనిపించాడు. అతన్ని చూసి చిత్రకారుడు ఆగిపోయాడు. నిష్కపటమయిన, నిర్మలమయిన అతని వదనంలో గొప్ప దైవత్వం, తన్మయత్వం, సంతృప్తి కనిపించాయి. అన్నాళ్లూ తను వెతుకుతున్న వ్యక్తి తనకు కనిపించడం తన అదృష్టంగా భావించాడు.


ఆ కుర్రాణ్ణి తన ముందు కూచో బెట్టుకుని తదేక దీక్షతో అతని చిత్రాన్ని వేశాడు. ఆ కుర్రాడు తన బొమ్మ చూసుకుని ఎంతో ఆనందించాడు. చిత్రకారుడు ఆ కుర్రాడికి కొంత ముట్టజెప్పి తన ప్రయత్నం సఫలమయినందుకు సంతోషించాడు. దేశదేశాల్లో అతని చిత్రానికి ఎంతో పేరు వచ్చింది. ఆ చిత్రానికి ఎన్నో బహుమతులు వచ్చాయి.

కాలం ఆగదు కదా! ఇరవయ్యేళ్లు గడిచిపోయాయి. సృజనకారులకు ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. చిత్రకారుడికి ఈసారి ప్రపంచంలోకెల్లా క్రూరుడు,దుర్మార్గుడు అయిన వ్యక్తిని చిత్రించాలని కోరిక కలిగింది. అత్యంత దుర్మార్గుడు,దానవుడు ఎవరని వెతుక్కుంటూ బయల్దేరాడు. మంచివాళ్లని వెతకడం కష్టం. కానీ దుర్మార్గుల్ని వెదకడం కష్టం కాదు. అయితే అందరికన్నా దుర్మార్గుణ్ణి వెతకటం కష్టమే. గొప్ప దుర్మార్గుడు మన నగరంలోనే జైల్లో ఉన్నాడని అతను నరరూపరాక్షసుడని ఎంతమందిని చంపాడో, ఎన్ని దోపిడీలు చేశాడో లెక్కలేదని ఎవరో చెప్పారు. జైలు అధికారిని సంప్రదించి చిత్రకారుడు ఆ దుర్మార్గుణ్ణి చూశాడు. నల్లని కండలు తిరిగిన శరీరం, ఎర్రటి కళ్లు చూస్తూనే భయం వేసింది. అతన్ని తన ముందు కూచోబెట్టుకుని లీనమై అతని చిత్రాన్ని గీశాడు. తను గీసిన చిత్రం చూసి తనకే భయం వేసింది. అక్కడి నుంచి వెళ్లబోతుంటే ఎవరో సన్నగా ఏడుస్తున్న శబ్ధం వినిపించింది.


చూస్తే ఆ దుర్మార్గుడు, గజదొంగ రోదిస్తున్నాడు. ఆ గజదొంగ చిత్రకారుడి కాళ్లమీద పడి ”స్వామీ నన్ను గుర్తు పట్టలేదా?! ఇరవైఏళ్ల క్రితం గొర్రెలు మేపుకుంటున్న నా బొమ్మ గీశారు. ఈ ఇరవైయేళ్ళలో నేను ఎంత పతనమయ్యానో తలచుకుని కుమిలిపోతున్నాను” అని పశ్చాత్తాప పడ్డాడు. ప్రశాంత జీవితం గడిపే నేను పతనమయిపోయాను” అని పరితపించాడు.ప్రతి మనిషిలోనూ రెండు రూపాలుంటాయి. దేవుడుంటాడు. రాక్షసుడుంటాడు. మనిషిలో

స్వర్గముంటుంది,

నరకముంటుంది.

మనిషి ఈ రెండింటి మధ్య వూగిసలాడుతూ

ఉంటాడు. ఏది ఎన్నుకోవాలన్నది మన చేతుల్లో ఉంటుంది. మనిషికి వేరుగా మంచితనం, చెడ్డతనం ఉండవు. రెండూ మనిషిలోనే ఉంటాయి. మనం దేనికి ప్రాముఖ్యమిస్తామన్న దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది.

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

*సన్యాసి..పరివర్తన

 *సన్యాసి..పరివర్తన..*


సుమారు ఎనిమిదేళ్ల క్రిందట..డిసెంబర్ నెలలో ఒక శనివారం సాయంత్రం ఐదు గంటల వేళ..బుల్లెట్ మోటార్ సైకిల్ మీద తెల్లటి వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి.."ఈ మందిరం నిర్వాహకులు ఎవరు..?" అని అడిగాడు..


"నేనే.." అన్నాను..అతనిని చూస్తే ఓ ముప్పై ఐదేళ్ల వయసుంటుందేమో..తెల్లగా వున్నారు..గడ్డం పెంచుకొని, తలమీద జుట్టును ముడి వేసుకొని..నుదుటి మీద ఒకే నామం దిద్దుకొని..వున్నారు...చూడగానే సన్యసించారేమో అని అనిపిస్తున్నది..సరే..వివరాలు తెలుసుకుందామని అనుకొని.."మీరెవరు..?" అన్నాను..


"నా పేరు రామయోగి స్వామి..సన్యాసం స్వీకరించి నిరంతర దైవ స్మరణలో గడుపుతున్నాము..అన్ని క్షేత్రాలూ, తీర్ధాలూ దర్శించుకుంటూ..ఈ ప్రాంతంలో ఒక అవధూత సిద్ధిపొందాడని విని..ఈ ప్రదేశాన్ని చూసిపోవాలని వచ్చాము..ఈరాత్రికి ఇక్కడ బస చేసి, రేపుదయం తిరిగి వేరే ప్రాంతానికి వెళ్లిపోతాము.." అని నాతో చెప్పాడు.."ఇప్పుడు ఈ అవధూత సమాధి చూడవచ్చా.." అన్నారు..


"ఈరోజు శనివారం కనుక, శ్రీ స్వామివారి ఆదేశానుసారం..సమాధిని దూరం నుండి దర్శించుకోవచ్చు కానీ..దగ్గరగా వెళ్లి, ముట్టుకునే అవకాశం లేదు.." అని చెప్పాను..


"ఓహో..అలాగా..పర్లేదు..రేపుదయం చూస్తాము..ఎలాగూ రాత్రికి ఇక్కడే ఉంటాము కదా.." అన్నారు..


తనని తాను "మేము.." అని సంబోధించుకోవడం నాకెందుకో నచ్చలేదు..అయినా అది వారి స్వవిషయం కనుక ఊరుకున్నాను..ఉండటానికి ఏదైనా గది కావాలా అని అడిగాను..పెద్దగా నవ్వి.."అక్కర్లేదు..ఈ మంటపం లోనే ఉంటాము..కాలకృత్యాలకు బైటకు వెళతాము..బావి వద్ద స్నానం చేస్తాము..ఈరాత్రికి ఆహారంగా పళ్ళు తీసుకుంటాము..అవికూడా తెచ్చుకున్నాము..మా గురించి మీరేమీ శ్రమ పడవద్దు.." అన్నారు..సరే అన్నాను..


ఆ శనివారం నాడు భక్తులు ఎక్కువ మంది రాలేదు..సుమారుగా మూడు నాలుగు వందలమంది మాత్రం వున్నారు..ఆరుగంటలకే చీకటి పడింది..ఏడు గంటలకు పల్లకీసేవ ప్రారంభం అయింది..అంతవరకూ మంటపం ముందు వైపు కూర్చుని ఉన్న రామయోగి స్వామి..పల్లకీ దగ్గరకు వచ్చి కూర్చున్నారు..చాలా శ్రద్ధగా పల్లకీసేవ తతంగాన్ని గమనించసాగారు..పూజా కార్యక్రమాలు అయిపోయి..పల్లకీని శ్రీ స్వామివారి సమాధి చుట్టూ త్రిప్పడానికి భక్తులు సమాయత్తం అవుతున్న సమయం లో..తన వంటి మీద ఉన్న చొక్కాను విప్పివేసి..భుజంబుమీద ఉన్న ఉత్తరీయాన్ని నడుముకు చుట్టుకొని..ఒక్క ఉదుటున పల్లకీ దగ్గరకు వచ్చి..పల్లకీ ని తన భుజం మీదకు ఎత్తుకున్నారు..నేను కొద్దిగా నివ్వెరపోయాను..


శ్రీ స్వామివారి ఆలయం వెలుపల..మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణాలు అయ్యేవరకూ..ఆపై ముఖద్వారం వద్ద పల్లకీని ఇతర భక్తుల తో పాటు పైకెత్తి పట్టుకొని..భక్తులందరూ ఆ పల్లకీ క్రింద నుంచి నడచి వచ్చేదాకా..తిరిగి పల్లకీ యధాస్థానానికి చేరేదాకా...తానే మోస్తూ వున్నారు..అర్చకస్వామి చివరలో ఇచ్చిన తీర్ధ ప్రసాదాలను భక్తితో స్వీకరించి..ఇవతలికి వచ్చేసారు..ఆ తరువాత..కొంచెం సేపు మంటపం లో వుండి..బైటకు వెళ్లిపోయారు..


ప్రక్కరోజు ఆదివారం ఉదయం ఐదు గంటలకల్లా మందిరం లోని మంటపం లోకి వచ్చేసారు..శ్రీ స్వామివారి సమాధికి అర్చకస్వాముల ద్వారా జరిగిన అభిషేకాన్ని దగ్గరుండి మరీ చూసారు..హారతులు అయిపోయిన తరువాత..నా వద్దకు వచ్చి..

"స్వామివారి సమాధి వద్దకు ఇప్పుడు వెళ్ళొచ్చా..." అని అడిగారు.."వెళ్ళండి.." అన్నాను..


శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, మూడు ప్రదక్షిణాలు చేశారు..శ్రీ స్వామివారి పాదుకులను తన నెత్తిమీద పెట్టుకున్నారు..వాటిని మళ్లీ యధాస్థానం లో ఉంచి..సమాధికి మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చారు..


"నిన్న రాత్రి పల్లకీసేవ లో కూర్చున్న క్షణం నుంచీ..నాలో ఏదో తెలీని అంతర్మధనం మొదలైంది..నేను చేస్తున్న సాధనలో పొరపాటు ఉందేమో అని అనిపిస్తున్నది..ఇతమిద్ధంగా ఇదీ అని చెప్పలేను..అహంకరించొద్దు..అహంకరించొద్దు..అని పదే పదే అంతర్వాణి పలుకుతున్నది..రాత్రంతా అశాంతి గా వున్నాను..శ్రీ స్వామివారి సమాధి వద్ద పాదుకలు నా శిరస్సు కు ఆనించుకున్న మరుక్షణం..నాలోని ఆవేదన మాయం అయింది..నేను చేసే సాధనే గొప్పది అనే భావన విడవమని స్వామివారి ఆదేశం అనిపించింది..ఇలా దేశాలు పట్టి తిరగకుండా..ఒకచోట స్థిరంగా వుండి సాధన చేసుకోమని నాకు ఆజ్ఞ వచ్చినట్లు అనిపించింది..ఇక నాకు అనువైన ప్రదేశానికి వెళ్లి అక్కడే నేను సాధన చేసుకుంటాను..నాకు ఏ సందేహం వచ్చినా...ఇక్కడకు వచ్చి..ఈ స్వామివారి సమాధిని దర్శించుకుంటాను..మీ ఆదరణ కు నా ధన్యవాదములు.." అన్నారు..


తనని తాను గౌరవ వాచకం తో సంబోధించుకున్న ఆ సాధకుడు..శ్రీ స్వామివారి సమాధి దర్శనం అనంతరం అత్యంత వినయంగా తన గురించి చెప్పుకొచ్చారు..అదే పరివర్తన అనుకున్నాను నేను..


ఆ తరువాత ఆ సన్యాసి మరొక్కసారి మాత్రమే శ్రీ స్వామివారి సమాధి దర్సనానికి వచ్చారు..తనకు మార్గదర్శనం చేసిన స్వామివారికి ఆజన్మపర్యంతం ఋణపడిఉంటానని పదే పదే చెప్పుకొచ్చారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

శ్రీమద్భాగవతము

 *11.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2288(౨౨౮౮)*


*10.1-1418-వ.*

*10.1-1419-*


*క. "సాగర! సుబుద్ధితోడను*

*మా గురుపుత్రకునిఁ దెమ్ము మా ఱాడిన నీ*

*వాగడ మగుదువు దుస్సహ*

*వేగరణాభీల నిశిత విశిఖాగ్నులకున్."* 🌺



*_భావము: గురువు గారి కోరికను తీర్చుటకొరకు బలరామకృష్ణులు ఎవ్వరూ అడ్డగించలేనటువంటి రథమెక్కి వేగముగా సముద్రతీరము చేరి, సముద్రునితో కోపంగా ఇలా అన్నారు: “మంచి బుద్ధి కలవాడవై మా గురు పుత్రుని తెచ్చి మాకు అప్పగించు. ఎదురు చెప్పావంటే, సహింపరాని వేగం కల మా పదునైన బాణాల నుండి వెలువడే అగ్నిజ్వాలలకు నీవు నశిస్తావు.”_* 🙏



*_Meaning: "To fulfil the wish of their Guru, Balarama and Sri Krishna rode on an unstoppable chariot, quickly reached the seashore and spoke to the SeaGod: "Be good and act good. Bring back the son of our Guru Sandeepa and hand over to us. Or else, you will perish facing the fire of sharpest of our oppressive and unbearable arrows."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*