12, అక్టోబర్ 2021, మంగళవారం

శ్రీమద్భాగవతము

 *11.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2288(౨౨౮౮)*


*10.1-1418-వ.*

*10.1-1419-*


*క. "సాగర! సుబుద్ధితోడను*

*మా గురుపుత్రకునిఁ దెమ్ము మా ఱాడిన నీ*

*వాగడ మగుదువు దుస్సహ*

*వేగరణాభీల నిశిత విశిఖాగ్నులకున్."* 🌺



*_భావము: గురువు గారి కోరికను తీర్చుటకొరకు బలరామకృష్ణులు ఎవ్వరూ అడ్డగించలేనటువంటి రథమెక్కి వేగముగా సముద్రతీరము చేరి, సముద్రునితో కోపంగా ఇలా అన్నారు: “మంచి బుద్ధి కలవాడవై మా గురు పుత్రుని తెచ్చి మాకు అప్పగించు. ఎదురు చెప్పావంటే, సహింపరాని వేగం కల మా పదునైన బాణాల నుండి వెలువడే అగ్నిజ్వాలలకు నీవు నశిస్తావు.”_* 🙏



*_Meaning: "To fulfil the wish of their Guru, Balarama and Sri Krishna rode on an unstoppable chariot, quickly reached the seashore and spoke to the SeaGod: "Be good and act good. Bring back the son of our Guru Sandeepa and hand over to us. Or else, you will perish facing the fire of sharpest of our oppressive and unbearable arrows."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

కామెంట్‌లు లేవు: