1, ఫిబ్రవరి 2023, బుధవారం

స్వర్ణప్రాశన

 శిశువుకి స్వర్ణప్రాశన చేయించుట వలన కలుగు ఉపయోగాలు  - 

   ప్రస్తుత పరిస్థితుల్లో శిశువుకి స్వర్ణ ప్రాసన చేయడం అనేది చాలమందికి తెలియని విషయం . అన్నప్రాసన చేసేప్పుడు శిశువుకి స్వర్ణప్రాసన  అన్న మాట విధిగా వస్తుంది. అప్పుడు చేతికి ఉన్న ఉంగరాన్ని శిశువు యొక్క నాలుకపైన రాస్తారు .దానినే మనం స్వర్ణప్రాసనగా తీసుకుని మురిసిపోతాం. నిజానికి అది స్వర్ణప్రాసన కాదు. 

      ఈ స్వర్ణప్రాసన గురించి సుశ్రుతుడు తన సుశ్రుతసంహితలో ఏ విధముగా చేయవలెనో వివరంగా ఇచ్చాడు. పుట్టిన శిశువుని చన్నీళ్లతో శుభ్రపరచి జాతకసంస్కారం చేసిన తరువాత తేనె , నెయ్యి బంగారం మెత్తటి పొడిని నెయ్యి, తేనె తో కలిపి ఉంగరం వేలుతో శిశువు నాకించవలెను. బంగారపు భస్మాన్ని కూడా ఇదే విధంగా వాడవచ్చు . ఈ స్వర్ణభస్మ మోతాదు శిశువు యొక్క బలప్రకృతులును అనుసరించి ఆవగింజ అంత మోతాదు వరకు వాడవచ్చు .దీనిని ప్రతిశిశువుకు ప్రతిదినం ఇవ్వవచ్చు.

 శిశువుకు స్వర్ణభస్మం ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు  - 

 *   ఈ స్వర్ణభస్మం శిశువుకి తినిపించడం వలన బుద్ది, జఠరాగ్ని , బలం వృద్దినొందును .

 *  ఆయష్షు వృద్ధిచెందును. 

 *  మంగళకరమైనది.

 *  పవిత్రమైనది.

 *  మగవారి యొక్క పుంస్త్వమును పెంచును.

 *  చర్మకాంతి వృద్ధిచెందును.

 *  గ్రహపీడ పొగొట్టును.

 *  కొంతకాలం స్వర్ణభస్మం వాడుట వలన శిశువు యొక్క రోగనిరొధక శక్తి పెరిగి రోగాలపాలు అవ్వడు .

 *  ఆరుమాసములు విడవకుండా వాడిన శిశువు బ్రహుస్పతి సమానమైన తెలివితేటలు కలిగినవాడు అగును. అనగా ఒక్కసారి చదివిన చాలు ఎంతపెద్ద విషయం అయినను తిరిగి చెప్పగలడు. 

 *  శరీరం నందు అతను పెరిగేకొలది అతనియొక్క శరీరబలం కూడా అమితంగా పెరుగును . 

 గమనిక  - 

      ఈ స్వర్ణభస్మాన్ని "ఆటిజం " వ్యాధితో బాధపడే పిల్లలకు ఇచ్చిన చాలా తొందరగా వ్యాధినుంచి బయటపడతారు. నేను ఈ స్వర్ణభస్మాన్ని చాలా మందిపై ప్రయొగించాను. నేను గమనించిన విషయం ఏమిటంటే ఇది ముఖ్యంగా "హార్మోన్స్" పై చాలా బాగా పనిచేస్తుంది. ముఖం నందు తేజస్సు పెరిగింది. వీర్యకణాల సంఖ్య, మరియు సంఖ్య కూడా పెరిగింది. రోగనిరోధక శక్తి, కండరాల శక్తి, చాలాబాగా పనిచేస్తుంది . నరాల బలహీనత పోయి వణుకుడు తగ్గింది . స్వర్ణభస్మం ఖరీదుతో కూడిన వ్యవహారం అలాగే అనుభజ్ఞుల దగ్గర పొందగలరు.

     ఈ స్వర్ణప్రాశన గురువారం పుష్యమి నక్షత్రం లేదా అదివారం పుష్యమి నక్షత్ర గడియల్లో మొదలు పెట్టండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ యోగాన్ని పుష్యార్క యోగం అని పిలుస్తారు .

  గమనిక  -

     నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

            9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

హనుమను కొలచిన

 *శుభ మంగళవారం*

హనుమను కొలచిన చాలును

కనుమరుగై పోవునన్ని కష్టములెల్లన్

అనువనువున హనుముండును

కనులారా కాంచవలెను కదరా కృష్ణా!

✍🏼 *గోగులపాటి కృష్ణమోహన్* 🙏🏽

దేహపుష్టి కలిగించు సిద్దయోగాలు

 దేహపుష్టి కలిగించు సిద్దయోగాలు - 

 * ప్రతినిత్యం రెండు అమృతపాణి అరటిపండ్లు తినుచున్న మంచి దేహపుష్టి , బలము కలుగును. 

 * ఉదయము మరియు మధ్యాహ్న సమయములో మినుములతో చేసిన గారెలు రెండు నుంచి నాలుగు తినుచున్న మంచి దేహపుష్టి కలుగును. 

 * ఆవునెయ్యిలో మినుములు వేయించి దానిని పిండిచేసి దానిలో బెల్లం మరియు నెయ్యి కలిపి పూటకు రెండు చెంచాల చొప్పున తీసుకొనుచున్న దేహబలం కలుగును. 

 * బూరుగ జిగురును చింతగింజ అంత మోతాదులో ఒక కప్పు నీటిలో కలుపుకుని తాగుచున్న శరీరానికి మంచిబలం కలుగును. 

 * ఒక కప్పు వేడినీటిలో తేనె కలిపి సేవించుచున్న మంచి దేహపుష్టి కలుగును. 

 * పెద్ద పల్లేరు కాయలను ఆవుపాలలో ఉడికించి ఆ తరువాత చూర్ణం చేసి పంచదారలో కలిపి పూటకు పదిగ్రాముల చొప్పున సేవించుచున్న మంచి దేహపుష్టి కలుగును. 

 * నేలగుమ్మడి చూర్ణమును ఒక స్పూన్ పాలతో కలిపి సేవించుచున్న మంచిదేహపుష్టి కలుగును. 

        దేహపుష్టి కొరకు కొన్ని పదార్దాలు కూడా నిత్యం ఆహారంలో ఉండేలా చూసుకోండి .అవి ఏమిటో మీకు వివరిస్తాను. 

    అల్లము , ఉత్తరేణి చెట్టు బియ్యం , ఉశిరికాయ , కొబ్బరి కురిడి , కొబ్బరిపాలు , చేపనూనె , జీడిపండు , జీడిమామిడి , పటికపంచదార , తియ్యటి దానిమ్మ , బాదంపప్పు , ఆవుపాలు , కర్పూర శిలాజిత్ , కుందేలు మాంసం , కర్బుజాపండు , తాటికల్లు , నీరుల్లిపాయ , పచ్చకర్పూరం , బూడిద గుమ్మడికాయ , శనగలు , మెంతికూర , వెన్న . 

        దేహాన్ని పుష్టిగా ఉంచుకోవాలి అనుకునేవారు శరీరం నందు వేడిపెరగకుండా చూసుకోవాలి వీలైనంత వరకు శరీరానికి వేడిచేయు పదార్దాలను భుజించకపోవడం మంచిది . 

        ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.