4, ఏప్రిల్ 2026, శనివారం

పంచాంగం

 


ఆదివారం*🌞 *🌹05ఏప్రిల్ 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     🌞 *ఆదివారం*🌞

  *🌹05ఏప్రిల్ 2026🌹*  

   *దృగ్గణిత పంచాంగం*  

                 

         *ఈనాటి పర్వం* 

     *సంకష్టహర చతుర్థి*    

   *చంద్రోదయ: రా 09.12*

   

            *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - కృష్ణ పక్షం* 


*తిథి : తదియ* ప 11.59 వరకు ఉపరి *చవితి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : విశాఖ* రా 12.08 వరకు ఉపరి *అనూరాధ*

*యోగం : వజ్ర* మ 02.44 వరకు ఉపరి *సిద్ధి*

*కరణం  : భద్ర* ప 11.59 *బవ* రా 01.03 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 12.00 మ 02.00 - 04.30*               

అమృత కాలం  : *మ 02.24 - 04.10*

అభిజిత్ కాలం  : *ప 11.45 - 12.35*

*వర్జ్యం    : రా.తె 04.36 - 06.23*

*దుర్ముహూర్తం:సా04.42- 05.31*

*రాహు కాలం :సా04.48- 06.21*

గుళికకాళం    : *మ 03.16 - 04.48*

యమగండం    : *మ 12.10 - 01.43*

సూర్యరాశి : *మీనం*                         

చంద్రరాశి : *తుల/వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 06.08*  

సూర్యాస్తమయం :*సా 06.30*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.02 - 08.28*

సంగవ కాలం    :*08.28 - 10.56*

మధ్యాహ్న కాలం    :*10.56- 01.24*

అపరాహ్న కాలం  :*మ 01.24- 03.53*

*ఆబ్ధికం తిధి :చైత్ర బహుళ చవితి*

సాయంకాలం   :*సా 03.53 - 06.21*

ప్రదోష కాలం      :*సా 06.21 - 08.40*

రాత్రి కాలం         :*రా 08.40 - 11.47*

నిశీధి కాలం       :*రా 11.47 - 12.33*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.26- 05.12*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


      *🌞రవయే నమః*

*వామహస్తే మాం రక్షతు🌞*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

శ్రీ మహా విష్ణు పురాణము

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*శనివారం 4 ఏప్రిల్ 2026*


       *శ్రీమహా విష్ణు  పురాణము 

`` *47వ భాగం*``


*నరసింహావతారం హిరణ్యకశిపుడి సంహారం*```


లీలావతి ప్రహ్లాదునికి కాలకూట విషము కలిపిన పాయసము పట్టలేక కన్నీళ్ళు కారుస్తూ ప్రహ్లాదునితో “నాయనా! ఎందుకు శ్రీహరి నామ స్మరణ పై పట్టుదల నీకు. దానవ వైరి నారాయణుడు అని మీ తండ్రి చెప్పిన మాట వినుము. హరినామ స్మరణ మానివేయుము. నీకు విషం పెట్టలేను. పుత్రశోకం పొంద

లేను” అని బ్రతిమాలింది.


ప్రహ్లాదుడు తల్లిని ఓదారుస్తూ.. “అమ్మా! సకల జగత్తుకు ప్రభువైన నారాయణుడు తన భక్తులను సదా కాపాడుతాడు. శ్రీహరి అండ ఉంది కనుక తండ్రి గారు ఎన్ని మరణ దండనలు వేసినా నాకు ఏమియు కాలేదు. కర్మ ఫలం పరిపక్వం కానిదే ఏ జీవికి మృత్యువు రాదు. మృత్యు సమయం వస్తే ఏంచేసినా ఆగదు. శ్రీహరిని నమ్మి తండ్రిగారు ఆజ్ఞాపించి నట్లు చేయుము” అని ధైర్యం కలిగించాడు.


మనస్సులో నారాయణుని స్మరించి లీలావతి కాలకూట విషము కలిపిన పాయసపు పాత్ర ప్రహ్లాదునికి ఇచ్చింది. 

నారాయణ నామం జపిస్తూ ప్రహ్లాదుడు ఆ పాయసం సేవించాడు. నారాయణ నామ స్మరణ ఆ కాలకూట విషాన్ని అమృతంగా మార్చివేసింది. నీలపు రంగుకి మారుతుంది అనుకున్న ప్రహ్లాదుడి శరీరం బంగారు తేజస్సుతో ప్రకాశ మానమైంది.


చూస్తున్న హిరణ్యకశిపుడు ఆశ్చర్యపడ్డాడు. తన కుమారుని చెంత అదృశ్యరూపంలో శ్రీహరి ఉండి సహాయం చేస్తున్నాడని తలచాడు. ప్రహ్లాదుని తీసుకుని రాజసభకు వెళ్లాడు. సభాసదులందరి ముందు దగ్గరకు పిలిచి “ప్రహ్లాదా! నాకు భయపడి వైకుంఠం వదలి పారిపోయిన శ్రీహరి అదృశ్యంగా నీ వెంట ఉండి నిన్ను రక్షిస్తున్నాడు అని తెలుసుకున్నాను. నాకు కనపడని నారాయణుడు నీకు కనపడతున్నాడా? కనపడుతున్నట్టైతే ఎక్కడ ఉన్నాడో చెప్పుము. అతనిని హతమార్చి నా పగ తీర్చుకుంటాను. నీకూ నీ తండ్రి బల పరాక్రమాలు తెలుస్తాయి" అని అడిగాడు. 


ప్రహ్లాదుడు తండ్రికి నమస్కరించి “తండ్రీ! నారాయణుడు జగత్తు అంతటా ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహం వద్దు తండ్రీ! భక్తితో ఎక్కడ వెతికినా అక్కడ శ్రీహరి కనపడతాడు. నారాయణ నామం జపిస్తూ ఎక్కడైనా వెతుకుము. తప్పక శ్రీహరి కనిపిస్తాడు” అని భక్తిభావంతో చెప్పాడు.


హిరణ్యకశిపుడికి నచ్చక హేళన చేస్తూ “ప్రహ్లాదా! నీవన్నది నిజమే అయితే మరి ఈ స్థంభంలో ఉంటాడా నీ శ్రీహరి! పగలకొడితే వస్తాడా!”అని గట్టిగా నవ్వాడు. 


సభాసదులు నవ్వారు. ప్రహ్లాదుడు మాత్రం “ఉన్నాడు తండ్రీ! తప్పక బయటకు వస్తాడు” అనడంతో హిరణ్యకశిపుడు తన గదతో గట్టిగా ఆ స్థంభాన్ని కొట్టాడు.


సభలోని వారందరూ భయపడేలా భీకర ధ్వనితో స్థంభ మధ్యభాగం పగిలింది. స్థంభంలో నుండి భీకర సింహ గర్జనలు చేస్తూ ఉగ్రరూప నరసింహావతారంలో శ్రీహరి బయటకు వచ్చాడు. దేహమంతా మానవరూపం కలిగి శిరస్సు మాత్రం సింహపు శిరస్సు ఉంది. చతుర్భుజాలు కలిగి శిరస్సు నుండి వేలాడుతున్న సింహపు జూలును చేతికున్న పొడవైన సింహపు వ్రేళ్ళతో పక్కకు తీసుకుంటూ స్థంభం నుండి బయటకు దూకి వచ్చాడు.


ఉగ్రనరసింహుని చూసి సభలోని వారు భయపడి పారిపోసాగారు. ప్రహ్లాదుడు భక్తితో నమస్కరించి పక్కకు నిలుచున్నాడు. తన ఎదుటకు గర్జిస్తూ వస్తున్న నరసింహుని చూసి “నారాయణా! ఎన్నాళ్లకు కనిపించావు. నీకోసం వెతకని చోటు లేదు. వైకుంఠం వచ్చినా పారిపోయి దాక్కున్నావు. నా సోదరుడు హిరణ్యాక్షుడిని వరాహ రూపంలో చంపినట్టు, నన్ను ఈ సింహరూపంతో భయపెట్టి చంపాలనుకుంటున్నావు నేను బ్రహ్మవర ప్రసాదిని. నాకు ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా మరణం లేని వరం పొందాను. నిన్నే హతమార్చి నా పగ తీర్చు కుంటాను" అని ఆగ్రహంతో ముందుకు వచ్చి గదతో నరసింహుని వక్షస్థలంపై బలంగా కొట్టాడు. నరసింహుని వజ్ర శరీరానికి ఆ గదే ముక్కలై పోయింది.


హిరణ్యకశిపుడు భయభ్రాంతుడయ్యాడు. నరసింహుడు కోపంగా సింహగర్జనలు చేస్తూ హిరణ్యకశిపుని ఒడిసి పట్టుకుని బరబరా ఈడ్చుకుని రాజభవనపు సింహ ద్వారము వద్దకు వెళ్లాడు. అక్కడ సింహద్వారము మీద తాను కూర్చుని హిరణ్యకశిపుని లాగి తన తొడలపై పడుకోబెట్టాడు. సభాసదులు భయంతో వణికి పోతుంటే హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై చూస్తున్నాడు.


సూర్యాస్తమయం జరిగే సాయం సంధ్యా సమయం అది. ఇటు పగలు కాదు అటూ రాత్రి కాదు. వెలుగు తగ్గుతుంటే చీకట్లు కమ్ముతున్నాయి. నరసింహుడు భీకర గర్జన చేసి “హిరణ్యకశిపా! ఇది పగలు కాదు రాత్రి కాదు. సంధ్యా సమయం. నీవు ఇంటిలో లేవు. బయటా లేవు. ఆకాశంలో లేవు. భూమి మీద లేవు. నా అంకపీఠం (తొడలపై) మీద ఉన్నావు. నేల-నీరు-ఆకాశము కాకుండా నేను నీ రాజభవన సింహద్వారము పై కూర్చుని ఉన్నాను.


నేను పూర్తి మానవుడను కాను, పూర్తి జంతువుని కాను. నరుడు, సింహము కలసి ఉద్భవించిన ఉగ్రనరసింహుడను. ఆయుధా

లేవీ ఉపయోగించకుండా నేను నా సింహపు చేతి గోళ్ళతో నిన్ను చీల్చి సంహరిస్తాను.మృత్యువుకి బ్రహ్మదేవుడి వరం అడ్డం కాదు, రాదు” అంటూ చేతిగోళ్ళతో హిరణ్యకశిపుడి గుండెలు చీల్చి వేశాడు. రక్తం బయటకు చిమ్మి నరసింహునికి రక్తాభిషేకం చేసింది.


చనిపోయే ఆఖరి క్షణాల్లో హిరణ్యకశిపుడికి తన గత జన్మ, జయవిజయులైన తమకు సనక

సనందనాదుల శాపం గుర్తుకు వచ్చాయి. “నారాయణా! శాపం వలన నీకు శత్రువులుగా జన్మించిన మా మొదటి జన్మ సమాప్త మవుతోంది. మరో రెండు జన్మలు కూడా తొందరగా ముగించి నీసన్నిధికి చేరే భాగ్యం ప్రసాదించు" అని ప్రాణాలు వదిలేశాడు. 


హిరణ్యకశిపుడి ఆత్మజ్యోతి దేహము నుండి వెలువడి నరసింహ స్వామిలో లీనమైంది.


బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై నరసింహ స్వామిని స్తుతిస్తూ స్తోత్రాలు చేసారు. ప్రహ్లాదుడు ఉగ్ర నరసింహుని శాంతింప చేస్తూ నరసింహ స్తోత్రమ్ పఠించి కర్పూర నీరాజనాలు అర్పించాడు. శాంతించిన నరసింహుడు ప్రహ్లాదుని దగ్గరకు తీసుకుని మనోభీష్టం చెప్పమన్నాడు.


ప్రహ్లాదుడు నమస్కరించి "పరమాత్మా! నరసింహ రూపంలో దర్శన భాగ్యం కలిగించావు. ఈ రూపంలో భూమి పై వెలసి నీ భక్తుల కోరికలు తీర్చి మరణానంతరం నీ సన్నిధి పొందే భాగ్యం కలిగించుము" అని కోరాడు. నరసింహుడు తథాస్తు అని ఆశీర్వదించిఅదృశ్యమయ్యాడు. ఆనాటి నుండి భూమి పై లక్ష్మీ నరసింహ క్షేత్రాలు వెలసి భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నాయి.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

04ఏప్రిల్ 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

       *🍁శనివారం🍁*

  *🌹04ఏప్రిల్ 2026🌹*  

   *దృగ్గణిత పంచాంగం*                      

   

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - బహుళపక్షం* 


*తిథి : విదియ* ఉ 10.08 వరకు ఉపరి *తదియ*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : స్వాతి* రా 09.35 వరకు ఉపరి *విశాఖ*

*యోగం : హర్షణ* మ 02.17 వరకు ఉపరి *వజ్ర*

*కరణం  : గరజి* ఉ 10.08 *వణజి* రా 11.01 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 01.00 సా 05.00 - 06.00*               

అమృత కాలం  : *ప 11.59 - 01.44*

అభిజిత్ కాలం  : *ప 11.46 - 12.35*

*వర్జ్యం    : రా03.47 - 05.33 తె*

*దుర్ముహూర్తం  : ఉ 06.00 - 07.39*

*రాహు కాలం   : ఉ 09.05 - 10.38*

గుళికకాళం      : *ఉ 06.00 - 07.33*

యమగండం    : *మ 01.43 - 03.16*

సూర్యరాశి : *మీనం*                    

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 06.09* 

సూర్యాస్తమయం :*సా 06.30*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం      :*ఉ 06.02- 08.28*

సంగవ కాలం       :*08.28 - 10.56*

మధ్యాహ్న కాలం    :*10.56 - 01.25*

అపరాహ్న కాలం  :*మ 01.25- 03.53*

*ఆబ్ధికం తిధి   :చైత్ర బహుళ తదియ*

సాయంకాలం     :*సా 03.53- 06.21*

ప్రదోష కాలం       :*సా 06.21- 08.40*

రాత్రి కాలం        :*రా 08.40 - 11.47*

నిశీధి కాలం      :*రా 11.47 - 12.33*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.26 - 05.13*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం🙏*


*రఘునాయక రామ రమేశ విభో*

*వరదోభవ దేవ దయాజలధే*


*!!.ఓం నమో వెంకటేశాయ నమః!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️


*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*


*శ్రీరామరామ ఇతి జాపకృతాత్మశక్తే!*

*శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><<><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*శుక్రవారం 3 ఏప్రిల్ 2026*


     *శ్రీ మహావిష్ణు పురాణం*

``      *46వ భాగం*``


*నరసింహావతార కథ-  హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని నారాయణ నామ స్మరణ సహించలేక చంప డానికి చేసిన ప్రయత్నాలు విఫలం అవుట*```


హిరణ్యకశిపుడు ‘గురుకులంలో  చేరిన ప్రహ్లాదుడు దైత్యగురువుల బోధనకు మారిపోయి శ్రీహరినామ స్మరణ వదలివేస్తాడు’ అని భావించాడు. 


కానీ ప్రహ్లాదుడు గురుకులంలో తోటి విద్యార్థులను హరిభక్తులుగా మార్చసాగాడు. ‘శ్రీమహావిష్ణువు సకల చరాచర జగత్తుని పరిరక్షించే వాడు. శ్రీహరినామస్మరణ, భజనయే అసలైన విద్య’ అని అందరి చేత నారాయణ నామ భజనచేయించ సాగాడు. 


దైత్య గురువులు అనేకవిధాల నచ్చచెప్పి, భయపెట్టి ప్రహ్లాదుని మార్చే ప్రయత్నం చేసారు.


కానీ ప్రహ్లాదుని చేత హరినామస్మరణ మాన్పించలేకపోయారు. హిరణ్యకశిపుడికి తెలిస్తే తమప్రాణాలకు ముప్పువస్తుందని భయపడసాగారు. వారి భయం నిజంచేస్ తూహిరణ్య కశిపుడు తమ కుమారుడి విద్యాభ్యాసం ఎలాఉందో తెలుసు కోవాలని దైత్యగురువులను ప్రహ్లాదుని తీసుకుని తన దగ్గరకు రమ్మని సందేశం పంపాడు.


దైత్యగురువులు భయపడుతూ నిల్చుంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని దగ్గరకు పిలిచి ‘గురుకులం లో చదువుకున్నది వివరించి చెప్పమ’ని అడిగాడు. 


ప్రహ్లాదుడు తండ్రి పాదాలకు నమస్కరించి "తండ్రీ!ఆచార్యులు సకలవిద్యలు చక్కగా అర్ధం అయ్యేటట్టు నేర్పిస్తున్నారు. అన్ని విద్యల ద్వారా నాకు తెలిసింది, అర్ధమైంది ఒకటే విషయం తండ్రీ! ఈ జగత్తులోని అందరికి తల్లి తండ్రి కర్త భర్త దైవం ఒక్కడే. వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీహరి అనుగ్రహంకోసం నారాయణ నామస్మరణయే సరైన మార్గము" అని ప్రసన్నవదనంతో చెప్పాడు.


హిరణ్యకశిపుడు ఉలిక్కిపడ్డాడు. దైత్య గురువుల వంక కోపంగా చూశాడు. దైత్యగురువులు భయంతో వణికిపోతూ "తాము నారాయణ స్మరణ 

మాన్పించడానికి అనేక విధాలుగా ప్రయత్నించామని, కానీ ప్రహ్లాదుడు మొండివాడై తను మారకుండా గురుకుల ఇతర విద్యార్థులచేత కూడా నారాయణ నామస్మరణ చేయిస్తున్నాడని" చెప్పారు.


హిరణ్యకశిపుడు ఆగ్రహంతో "ప్రహ్లాదా! శ్రీహరి దైత్యవంశానికి శత్రువు. మన దానవ చక్రవర్తులెందరినో శ్రీహరి సంహరించాడు. దేవతల పక్షపాతి అయిన నారాయణుడు అందరికి భగవంతుడు ఎలా అవుతాడు?హరినామస్మరణ నిషేధం అని నీకు తెలియదా!" అని అడిగాడు.


ప్రహ్లాదుడు ప్రశాంత వదనంతో "నారాయణుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు. కారణం లేకుండా ఎవరినీ శిక్షించడు. ప్రపంచమంతా నారాయణుడు ఉంటాడు. 

నారాయణునిలో ప్రపంచమంతా ఉంటుంది. మీరు అహంకారం, గర్వంతో ఆవరించిన అజ్ఞానపు పొరలు తొలగించి జ్ఞాన నేత్రాలతో చూస్తే నారాయణపాదపద్మ యుగళ దర్శనం కలుగుతుంది. నారాయణుడే నిత్యుడు,శాశ్వతుడని తెలుసుకుంటారు"  అని తండ్రికి నారాయణుని మహిమ గురించి వివరించి చెప్పాడు.


విన్న హిరణ్యకశిపుడికి మతి పోయింది. "చిన్న బాలునిలో ఇంత నారాయణ భక్తా! సందేహం లేదు! తన శత్రువు శ్రీహరి తనను జయించలేక తన కుమారుని విష్ణు మాయలతో మార్చి వేసి తనకు శత్రువుగా చేసాడు" అనుకున్నాడు. కుమారుడు అని జాలి చూపకుండా కఠినంగా శిక్షించాలని అనుకుని భటుల వంక చూసి "వీడు బాలకుడు కాదు. బాలుని రూపంలో ఉన్న నా శత్రువు నారాయణుడు. దానవ వంశంలో ఉండదగినవాడు కాదు. మదమెక్కిన ఏనుగులతో తొక్కించి చంపేయండి" అని ఆదేశించాడు.


ప్రహ్లాదుడు భయపడకుండా నారాయణ నామం జపిస్తూ భటుల వెంట వెళ్ళాడు. సైనికులు మదగజాల ముందు ప్రహ్లాదుని పడవేసి మావటివాళ్ళను ఏనుగులను ప్రేరేపించి తొక్కించి చంపమని చెప్పారు. తమ పాదాలతో ప్రహ్లాదుని తొక్కబోయిన ఏనుగులకు అక్కడ గజేంద్ర రక్షకుడైన నారాయణుడు కనిపించాడు. ఏనుగులు ప్రహ్లాదుని తొక్కకుండా ఘీంకా రాలు చేస్తూ తొండాలతో నమస్కారం చేసాయి. 


ప్రహ్లాదుని తొక్కమన్న రాక్షస భటులను, ప్రేరేపించిన మావటివాళ్ళను తొక్కి చంపేసి అడవిలోకి వెళ్లి పోయాయి.


మిగిలిన సైనికులు ప్రహ్లాదుని హిరణ్యకశిపుడి వద్దకు తీసుకెళ్లి జరిగినది చెప్పారు. హిరణ్యకశిపుడి సంశయం తొలగిపోయింది. నారాయణుడు సహాయం 

చేస్తున్నాడంటే తప్పకుండా ప్రహ్లాదుడు తన శత్రువే. సైనికులను చూసి  "ప్రహ్లాదుని నాగపాశాలతో కాళ్ళు చేతులు కట్ఠివేచి పర్వతము 

పై నుండి సముద్రంలోకి విసిరి

వేయండి" అని ఆజ్ఞాపించాడు. 


ప్రహ్లాదుడు "తండ్రీ! మీ ఆజ్ఞను తప్పక పాటిస్తాను" అని నమస్కరించాడు.


సైనికులు ప్రహ్లాదుని కాళ్లు చేతులు నాగపాశాలతో కట్టివేసి కొండ పై నుండి సముద్రంలోకి విసిరివేసారు. ప్రహ్లాదుడు నారాయణ నామ స్మరణ వదలకుండా.. 

"ఓం నమో నారాయణాయ" అని జపిస్తూనే ఉన్నాడు. 

సముద్రం అడుగున చేరిన ప్రహ్లాదునికి శ్రీహరి మత్స్యావతారనారాయణుడుగా చతుర్భుజాలలో గదా శంఖ చక్ర పద్మాలు కలిగి దర్శనమిచ్చాడు. స్వహస్తాలతో బంధనాలు తెంపి ప్రహ్లా దుని చేతులలోకి తీసుకుని సముద్రం బయటకు తీసుకు వచ్చి తీరాన దింపాడు. ప్రహ్లాదుడు శ్రీహరికి నమస్కరించి “జగన్నాథా! నీ దర్శనంతో నాజన్మ తరించింది. అజ్ఞానంతో మా తండ్రి చేసే తప్పు లను, నీ పైగల శత్రుత్వాన్ని క్షమించుము. అతనికి ముక్తి 

ప్రసాదించుము" అని ప్రార్ధించాడు. 


మహావిష్ణువు ప్రహ్లాదుని భక్తికి, సంస్కారానికి సంతోషించి  "ప్రహ్లాదా! నీ తండ్రి విరోధంతో నైనా నా నామాన్ని విడవకుండా స్మరిస్తున్నాడు. తప్పక నీ కోరిక మన్నించి తగిన సమయంలో అతనికి మోక్షాన్ని ఇస్తాను" అని పలికి ఆశీర్వదించి

అదృశ్యమయ్యాడు.


రాక్షస భటులు సముద్రం నుంచి క్షేమంగా బయటపడిన ప్రహ్లాదుని చూసి దివ్యమహిమకల బాలుడని భయపడి "రాజకుమారా మీతండ్రి గారి ఆజ్ఞ పాటించి సముద్రంలో పడవేసాము. మాకు నీపై ఎటు వంటి ద్వేషము లేదు. మమ్మల్ని క్షమించుము" అనివేడుకున్నారు. 


ప్రహ్లాదుడు వారికి అభయమిస్తూ "నాకు అందరిలో నారాయణుడే కన్పిస్తాడు. మీరు నాకు పూజ

నీయులే" అని నమస్కరించాడు.


రాక్షసభటులు ప్రహ్లాదుని తీసుకుని హిరణ్యకశిపుడి వద్దకు వెళ్లి జరిగింది చెప్పారు.  హిరణ్య కశిపుడు ఈసారి చితి పేర్చి ప్రహ్లాదుని మంటల్లో కాల్చివేయమని ఆదేశించాడు. 

అగ్ని చేతదహించబడని వరం పొందిన హిరణ్య కశిపుడి చెల్లెలు హోలిక ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని చితిపై కూర్చుంది. సైనికులు అగ్ని రాజేసారు. ప్రహ్లాదుడు శ్రీహరి నామం జపిస్తున్నాడు. ప్రహ్లాదుని నారాయణ నామస్మరణతో పునీతమైన మంటలు ప్రహ్లాదుని వదలి హోలికను దహనం చేసాయి.


చూస్తున్న జనం, సైనికులు ఆశ్చర్యం, భయం చెందారు. ప్రహ్లాదునికి నమస్కరించారు. యధాప్రకారంగా ప్రహ్లాదుని హిరణ్యకశిపుడి వద్దకు తీసుకెళ్లి జరిగినది చెప్పారు. తనకు తెలియకుండా ఏదో జరుగుతోంది అని అనుకున్న హిరణ్యకశిపుడు ఈసారి తన భార్య లీలావతిని కాలకూట విషము కలిపిన పాయసాన్ని తన కన్నుల ఎదుటే ప్రహ్లాదునికి తినిపించమని ఆదేశించాడు. రాజభటులు కాలకూట విషము తీసుకురావడానికి వెళ్లారు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

బహిష్టు అయ్యే సమస్యకు

 రెండు మూడు సార్లు బహిష్టు అయ్యే సమస్యకు నివారణా యోగం  -


      నేరేడు చెట్టు పైన బెరడు మెత్తగా రోటిలో వేసి దంచి ఉసిరికాయ అంత ముద్ద చేసుకోవాలి.  దాంట్లో 9 మిరియాలు కలిపి నూరి పూటకి ఒక మోతాదుగా రోజూ రెండుపూటలా మంచినీటి అనుపానంతో వేసుకుంటూ ఉంటే నెలకు రెండు మూడుసార్లు అయ్యే బహిష్టు నివారించబడును.


 

ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .



చతుష్షష్టి కళలు

  *చతుష్షష్టి కళలు లేక విద్యలను తెలియజేసే శ్లోకం* 

“ వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే. ”

పంచ మహా పాతకాలు

  **పంచ మహా పాతకాలు*: అత్యంత భయంకరమైన ఐదు మహా పాపాలను పంచ మహా పాతకాలు అంటారు. ఇవి బ్రహ్మహత్య, సురాపానం, సువర్ణ చౌర్యం, గురుపత్ని సాంగత్యం మరియు వీటిని చేసేవారితో స్నేహం. ఈ పాపాలు నిష్కృతి (పరిహారం) లేనివి.

శ్లోllబ్రహ్మహత్యా సురాపానం స్వర్ణస్తేయం గురుంగనాఃl

తద్భావం తన్మిత్రం చ పఞ్చ మహా పాతకాని||

 *బ్రహ్మ హత్య:* జ్ఞానులను, బ్రాహ్మణులను లేదా నిరపరాధులను చంపడం.

 *సురాపానం:* మద్యం సేవించడం.

 *సువర్ణ చౌర్యం:* బంగారం లేదా ఇతరుల ధనాన్ని దొంగిలించడం.

 *గురుపత్ని సాంగత్యం* : గురువు భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉండటం.

 *పాతక సాంగత్యం:* పైన పేర్కొన్న నాలుగు పాతకాలు చేసిన వారితో స్నేహం లేదా సహవాసం చేయడం. 

అష్ట కష్టాలు

 *శ్లోకం* :

ఋణం యాచ్నాచ వృద్ధత్వం జార చోర దరిద్రతాl

రోగశ్చ భుక్త శేషశ్చా హ్యష్ట కష్టాః ప్రకీర్తితాఃll

 *అష్ట కష్టాలు (ఎనిమిది కష్టాలు)* *వివరణ:* 

 *ఋణం* ( *అప్పు* ): అప్పు చేయడం లేదా అప్పుల ఊబిలో కూరుకుపోవడం.

 *యాచ్నా (యాచన):* ఇతరులను సహాయం లేదా భిక్ష అడగాల్సి రావడం.

 *వృద్ధత్వం (ముసలితనం):* వయసు పైబడి పనులకు చేతకాకపోవడం, ఇతరులపై ఆధారపడటం.

 *జారత్వం (పరస్త్రీ/పురుష* *వ్యామోహం):* నైతికంగా పతనమవడం.

 *చోర (దొంగతనం):* దొంగతనం చేయడం లేదా దొంగతనానికి భయపడటం.

 *దరిద్రతా (పేదరికం* ): దారిద్య్రం లేదా పేదరికం.

 *రోగశ్చ (రోగం):* అనారోగ్యం.

 *భుక్త శేషశ్చా (ఎంగిలి/మిగిలిన* *ఆహారం* ): ఒకరు తిన్న తర్వాత మిగిలిన ఆహారాన్ని తినడం. 

ఈ ఎనిమిదింటినీ మానవుడికి అత్యంత కష్టమైన స్థితిగా శాస్త్రం తెలుపుచున్నది.


..

ఈ ప్రశ్నకు బదులేది 10

 ఈ ప్రశ్నకు బదులేది 10


ఈరోజు మన ప్రశ్న రసాయనిక శాస్త్రానికి సంబంధించింది.


  కార్బన్క్ యాసిడ్ (carbonic acid  

H₂CO₃.) 

 అంటే ఏమిటి? 


దీనిని ఎలా తయారు చేస్తారు? 



మనము ఏ పేరుతో దీనిని పిలుస్తాము.


మీరు ఎప్పుడైనా దీనిని తాగారా? 

ఎప్పుడు తాగారు ?చెప్పగలరు


 సవివరంగా వివరించగలరు.


ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.


ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ

రామాయణం - 25)

 శ్రీరామ ( వాల్మీకి రామాయణం  - 25)

                (పరశురాముడు- 2)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

                              ----


(3-4-'26 పోష్టు తరువాయి భాగము)


ఇంతకు ముందు పోష్టులో శ్రీ పరశురాముని జననం గురించి చెప్పుకున్నాము


 శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములలో ఆరవవాడైన పరశురాముడు, వైశాఖ శుద్ధ తదియ నాడు అవతరించాడని స్కాంద పురాణం, బ్రహ్మాండ పురాణం తెలియజేస్తున్నాయి.

పరశురాముడు శివుని వద్ద విద్యాభ్యాసం చేశాడు.

ఆయన ధరించిన గండ్రగొడ్డలి శివుడు అనుగ్రహించి ఇచ్చినది.


శ్లో// వైశాఖస్య సితే పక్షే 

తృతీయాయాం పునర్వసౌ!

నిశాయాః ప్రథమయామే తు

రామాఖ్యః సమయే హరిః!!

స్వోచ్ఛగైః షడ్గ్రహైర్యుక్తే 

మిథునే రాహు సంస్థితే!

రేణుకాయాస్తు యోగర్భాత్

అవతీర్ణో హరిఃస్వయమ్!!


(వైశాఖ శుద్ధ తృతీయనాడు, (అక్షతదియ)

రాత్రి మొదటి జామున, పునర్వసు

నక్షత్రంలో, ఆరుగ్రహాలు ఉచ్ఛస్థితి

లోనుండగా, రాహువు

మిథునమునందుండగా, రేణుకా

గర్భంనుండి హరి పరశురామునిగా

అవతరించెను)

అని స్కాంద,భవిష్య పురాణములలో చెప్పబడింది.



పరశురామ జయంతి చాలా పవిత్రమైనదని,

ఆరోజు అందరూ ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానం చేయవలెనని శాస్త్ర గ్రంథములు ఉపదేశిస్తున్నవి.


శ్లో// జామదగ్న్య మహావీర

క్షత్రియాంతకర ప్రభో

గృహాణార్ఘ్యం మయాదత్తం

కృపయా పరమేశ్వర ॥


(క్షత్రియుల నంతము చేసిన,

మహావీరుడవైన ఓ పరశురామా !

నేనిచ్చిన అర్ఘ్యమును దయతో

స్వీకరించుము)


విలక్షణమైన ఈ పరశురామావతారంలో,

అధర్మవర్తనులై, భూమికి భారంగా పరిణమించిన క్షత్రియులను  సంహరించడానికి,

పరశురాముడు,

 ఒక్క భటుడి సహాయం కూడా లేకుండా, 

దేశమంతా ఇరవైయొక్క మార్లు తిరిగి తిరిగి, అనేకమంది రాజులను, లక్షలాది వారి చతురంగ బలాలను, కేవలం గండ్రగొడ్డలే ఆయుధంగా, ఒంటరిగా సంహరించాడు.

చిరంజీవిగా ఇప్పటికీ మహేంద్ర పర్వతంపై నివసిస్తున్నాడు.


ప్రస్తుత కథావిషయానికి వద్దాం.


"పాలకులు" ధర్మమార్గంలో ఉంటే దేశం సుభిక్షంగా వుంటుంది.

వారు అధర్మమార్గాన్ని అనుసరిస్తే దేశం అల్లకల్లోలం అవుతుంది.

ధర్మపరుడైన రాజు కలియుగాన్ని "కృతయుగం" లాగా చేయగలడు.

అధర్మపరుడైన రాజువల్ల కృతయుగం కూడా "కలియుగం" అవుతుంది.

మహాభారతంలో కుంతీదేవి కూడా యుద్ధం చెయ్యమని

 శ్రీ కృష్ణుని ద్వారా, ధర్మరాజుకు సందేశం పంపిస్తూ,

 "రాజా కాలస్య కాలః" ( రాజు కాలానికి కూడా కాలుడు) అనగా,

 రాజు దేశ, కాలాలను కూడా శాసించి ప్రజలను

ధర్మమార్గంలో నడపగలడు,అన్నది.


శ్లో//కాలోవా కారణం రాజ్ఞః రాజావా కాలకారణమ్/

ఇతి తే సంశయో మాభూత్ "రాజా కాలస్య కారణమ్"//

(ఓ ధర్మరాజా! రాజు కాలానికి కారణమా! కాలం రాజుకు కారణమా అనే సందేహం వద్దు.రాజే కాలానికి కారణం).

కృతయుగాన్ని, త్రేతాయుగాన్ని, ద్వాపరయుగాన్ని,కలియుగాన్ని,సృష్టించగలవాడు రాజే.

అంతా ప్రారబ్ధం అని చేతులు ముడుచుకుని కూర్చోకుండా క్షత్రియ ధర్మమైన యుద్ధం చెయ్యి" అన్నది.

(పరమాచార్యస్వామివారి భక్తుడు, మాజీ ఎన్నికల అధికారి అయిన "శ్రీశేషన్ గారు" దీనికి చక్కని ఉదాహరణ)

అయితే అత్యంత శక్తివంతమైన అటువంటి పాలకవ్యవస్థ, పరశురాముడి కాలంలో గాడి తప్పింది.

పాలకులైన క్షత్రియజాతికి 

అధికార దర్పం తలకెక్కి  ధర్మం పట్ల అంధులయ్యారు. 

వారిలో కొందరు  కొన్ని ఉపాసనలు కూడా చేసి, శక్తులు సంపాదించి గర్వంతో విర్రవీగేవారు.  

శాంతమును ఆశ్రయించి, తపస్సు,స్వాధ్యాయములతో నిత్యము కాలం గడిపే   బ్రాహ్మణులను కూడా, వారు  అవమానించసాగారు.

భూమండలమంతా పాలకుల అకృత్యాలతో నిండిపోయింది.

 భూభారం అధికమైంది. 

ఆ భూభారం తగ్గించడానికి 

భగవంతుడైన శ్రీ మహావిష్ణువు  "రాముడు" (పరశురాముడు) అనే పేరుతో భృగువంశములో, జమదగ్ని మహర్షికి కుమారుడుగా అవతరించాడు.


 ఆ కాలంలో శ్రీ దత్తాత్రేయ మహాస్వామిని ఆరాధించి "కార్తవీర్యార్జునుడు"  అనే హైహయ వంశ క్షత్రియుడు అనేక అతీంద్రియ శక్తులు సంపాదించాడు.

 వేయి చేతులు కలవాడయ్యాడు.

ఎవరినైనా జయించగలిగే శక్తి సంపాదించాడు.

అష్టసిద్ధులు స్వాధీనం చేసుకున్నాడు. 

శ్లో//యోగేశ్వరత్వ మైశ్వర్యం గుణా యత్రాణిమాదయః/

చచారావ్యాహతగతి ర్లొకేషు పవనో యథా//

(అణిమాది అష్ట సిద్ధులతో కూడిన ఐశ్వర్యము,వాయువు వలె అడ్డులేని గమన శక్తులతో కూడి ఆ కార్తవీర్యుడు లోక సంచారం చేశాడు)

                                  

ఒక రోజు సైన్యముతో సహా అడవిలో మృగములను వేటాడుతూ, కార్తవీర్యుడు జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ప్రవేశించాడు.

మహర్షి ఆయనకు అతిధి సత్కారాలు చేసి, తన దగ్గర ఉన్న కామధేనువు సహాయంతో, రాజుకు,మంత్రులకు, సైన్యానికి దివ్యమైన భోజనముతో ఆతిధ్యం ఇచ్చాడు.

ఒక బడుగు బ్రాహ్మణుడు అన్ని వేలమందికి,

మహారాజులు కూడా ఇవ్వలేని ఆతిధ్యం ఇవ్వడం

అహంకారపూరితుడైన కార్తవీర్యార్జునుడు సహించలేక పోయాడు. 


సద్గుణములు లేని వానికి తపశ్శక్తులు అనర్ధాన్ని తెచ్చి పెడతాయి.

జమదగ్నిమహర్షి ఆతిధ్యాన్ని అభినందించే బదులు, అహంకారంతో,అసూయతో, కార్తవీర్యార్జునుడు 

ఆయనను తృణీకరించాడు. 

జమదగ్ని  ఐశ్వర్యమునకు కారణమని తాను భావించిన కామధేనువును,దూడను బలాత్కారముగా తన పట్టణమైన మాహిష్మతీ పురానికి తరలించాడు.

ఆ విషయం తెలుసుకున్న పరశురాముడు అగ్రహోదగ్రుడై, ధనుర్బాణములను, 

గండ్రగొడ్డలిని ధరించి ఒంటరిగా మాహిష్మతికి వెళ్ళాడు.


(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

4-4-'26.

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - ‌ద్వితీయ -‌ స్వాతి -‌‌ స్థిర వాసరే* (04.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

సావడి కబుర్లు - 6

 సావడి కబుర్లు - 6


వందేమాతరం 


మిత్రులు బిఎస్ శర్మ గారు తాను చదివిన మోక్ష సాధన మార్గము అనే గ్రంథం గురించి చెప్తూ, దైవ మీమాంసను వీడి, దేహ‌ మీమాంసను పట్టుకోవడం అజ్ఞానమని, బార రహితమైన ఆత్మపై నిలకడ కలిగి ఉండడమే మోక్షం అని ఆ గ్రంధంలో వివరించిన విషయాన్ని ప్రస్తావించారు.


ప్రతి మనిషి విజ్ఞతతో ఒక్క క్షణం ఆలోచిస్తే, అందులోని ధర్మ సూక్ష్మం అర్థం అవుతుంది. అటువంటి పుస్తకాలు నేటి సమాజానికి ఎంత అవసరం కూడా తెలుస్తుంది. 


“దైవ మీమాంస” అంటే దేవుని గురించి తర్కించడం, “దేహ మీమాంస” అంటే శరీరాన్ని ఆధారంగా చేసుకుని ఆలోచించడం. ఇవి రెండూ మనసును బాహ్య ప్రపంచంలోనే బంధించి ఉంచే ప్రక్రియలు. ఈ రెండింటిని అధిగమించి “బార రహితమైన ఆత్మ” (నిర్మలమైన, నిర్వికల్పమైన చైతన్యం)పై నిలకడ కలిగి ఉండడమే మోక్షానికి మార్గం. ఈ విధమైన సాధన ఆధునిక సమాజానికి చాలా అవసరం.


దేవుని స్వరూపం మాటలకతీతం. తర్కంతో ఆయనను పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదు. దేవుడు ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అనే ప్రశ్నలు మానవుల మనసుకు కలగడం సహజం. కానీ ఈ ప్రశ్నలు కొన్ని కొన్ని సార్లు వాదోపవాదాలకు, విభేదాలకు దారితీస్తాయి. అవి సాధనకు కాకుండా అపోహలకు దారి తీస్తాయి.‌ ఎందుకంటే దేవుని స్వరూపము మాటలుకు అతీతం. ఇటువంటి వాదనల వలన ఆయనని దర్శించడం సాధ్యం కాదు సరికదా, అటువంటి చర్చలు వక్ర భాష్యాలకి దారి తీస్తాయి. అందుకే మన మహర్షులు దేవుడిని తెలుసుకోవడం కాదు దైవత్వాన్ని అనుభవించడం ముఖ్యం అంటారు.


ఇక దేహమీమాంకు వస్తే, దానికి ప్రధాన కారణం అహంకారం.‌ అసలు మనిషి నేను అంటే ఈ శరీరం అని ఆలోచించడమే అజ్ఞానం. అదే అన్ని బాధలకి కారణం. మన అసలు స్వరూపం ఆత్మ అని తెలుసుకుంటే ఏది శాశ్వతమో తెలుస్తుంది. శరీరంతో అనుబంధం బంధనం, ఆత్మతో అనుబంధం విముక్తి.


అలాగే మొదట్లో ప్రస్తావించినట్లు, బారారహితమైన ఆత్మ అంటే, రాగద్వేషాలకు అతీతంగా ఎటువంటి తర, తమ వాసనలు అంటని చైతన్యం. ఇది సాధించాలి అంటే మొదట నేను ఎవరు అనే ఆత్మ విశ్లేషణ జరగాలి. అది జరగాలి అంటే వైరాగ్యభావనతో కూడిన ధ్యానం కావాలి. అందరూ వైరాగ్యం అంటే జీవితం నుంచి దూరంగా పారిపోవడం అనుకుంటారు, అది తప్పు, అసత్యంపై ఆసక్తి తగ్గడమే వైరాగ్యం. అప్పుడే ప్రశాంతమైన మనసుతో ఆత్మ దర్శనం జరుగుతుంది. అదే బారరహిత ఆత్మ దర్శనం. 


ప్రస్తుత సమాజంలో మనిషి భయము ఒత్తిడి, విరక్తి, విసుగు, అసంతృప్తి,.‌ లాంటి మానసిక పరిస్థితులను అనుభవిస్తున్నాడు. దానికి కారణం బాహ్య విషయాలపై అధిక ఆసక్తి కలిగి ఉండడం, అంతర్ముఖత లేకపోవడం. ఇటువంటి మానసిక పరిస్థితులను అధిగమించాలి అంటే జీవుడు బ్రహ్మమే అనే భావన మనసులో కలగాలి. అప్పుడే అది సాధ్యపడుతుంది. 


అసలు మనిషి జీవితానికి లక్ష్యం ఏమిటి? కుటుంబము, సుఖాలు, ధనము, కీర్తి ఇవన్నీ అనుభవించిన తర్వాత కూడా ఏదో ఒక వెలితి కనిపిస్తుంది. అదేమిటి అని ఆలోచిస్తే, మనకి సంతృప్తి కలిగించే సమాధానం ఒకటే, అది ఆత్మజ్ఞానం. 


అదేమిటో తెలుసుకోవాలి అనిపించినప్పుడు ఇటువంటి మహా గ్రంథాల అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. అవి మనసుకు శాంతిని ఇస్తాయి, జీవన లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తాయి. నిజమైన ఆనందం అంతర్గతంలోనే ఉందని బోధిస్తాయి. 


నేటి సమాజానికి ఇలాంటి మోక్ష సాధన గ్రంథాలు కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలుగా మాత్రమే కాదు, జీవన మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి. ఇవి మనిషిని బాహ్య ప్రపంచం నుండి అంతర్గత చైతన్యానికి తీసుకెళ్లి నిజమైన స్వరూపాన్ని తెలియజేస్తాయి.


ఈ భావాన్ని వివేక చూడామణిలో 


*మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం*

*న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే ।*

*న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః*

*చిదానంద రూపః శివోఽహం శివోఽహం ॥*


నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, చిత్తం కాదు, చెవులు కాదు, నాలుక కాదు, ముక్కు కాదు, కళ్ళు కాదు, ఆకాశం కాదు, భూమి కాదు, అగ్ని కాదు, గాలి కాదు. నేను చిదానంద స్వరూపుడిని.‌ శుద్ధ చైతన్యం, ఆనంద రూపం. నేను శివుడిని. నిర్గుణ, నిర్మల, నిత్యమైన ఆత్మని అంటారు.


ఈ శ్లోకం దేహ మీమాంసను వ్యతిరేకిస్తుంది, దైవ మీమాంసను దాటి ఆత్మ స్వరూపాన్ని చూపిస్తుంది. నేను అంటే ఆత్మ నే అని నిశ్చలమైన భావాన్ని ప్రస్పుటంగా చూపిస్తుంది. 


చివరిగా, భౌతికమైన ఈ దేహాన్ని (మానసికంగా) వదిలి, బాహ్య ప్రపంచానికి సంబంధించిన భావాలను దాటి, మనసును నియంత్రించుకుని దానిని అధిగమించి నేను అంటే ఆత్మ అని తెలుసుకున్న వారికే ముక్తి లభిస్తుంది. 


*ఓం అసతోమా సద్గమయ,* 

*తమసోమ జ్యోతిర్గమయ,* 

*మృత్యోర్మా అమృతంగమయ*

*ఓం శాంతిః శాంతిః శాంతిః:*


మృశి

(దశిక ప్రభాకరశాస్త్రి)

9849795167

03.04.2026

మంత్రపుష్పం

 185C4;3012d4;44f6;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀



                 *మంత్రపుష్పం* 

                  ➖➖➖✍️



 *దేవాలయంలో పూజ చేసేటప్పుడు మంత్రపుష్పం చదువుతారు.* 


*పరమాత్మ సర్వత్రా ఉన్నాడని మంత్రపుష్పం చెబుతుంది.*


*మానవుల లోపల, బయట కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడని, ఆ పరమాత్ముడు ఏ రూపంలో ఉందో మంత్రపుష్పం చెబుతుంది.*

```

మానవ శరీరంలో ముకుళించుకుని వున్న కమలంలో నాభి పైభాగంలో హృదయ కమలం వుంది. దానికి మొట్టమొదటి భాగాన అగ్నిశిఖలో పసుపు రంగుతో వడ్ల గింజ మొనలా దేవదేవుడు అణు రూపంలోవున్నాడు” అని మంత్ర పుష్పంలో వర్ణించబడింది.


చేతిలో పుష్పాలని తీసుకుని మంత్రపుష్పం పూర్తయిన తర్వాత ఆ పుష్పాలని భగవంతునికి సమర్పించి, నమస్కరించి, ఆ పుష్పాలని మన శిరస్సు మీద వేసుకుంటే ఆ దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందని భక్తుల విశ్వాసం.


మనిషిలో వున్న పరమాత్మ ఉనికిని తెలియజేసి భక్తుడు, పరమాత్మ ఒక్కటే అనే అద్వైత భావం కలిగించే మంత్రపుష్పాన్ని విన్నప్పుడు కళ్ళు మూసుకుని పరమాత్మని దర్శనం చేసుకోవాలి.


అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని,ఆయన మంగళకరుడు, నాశరహితుడని మంత్రపుష్పంలోని మూడో శ్లోకం చెబుతుంది. 


చీకటివెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి. ఆ సూర్యుణ్ని సృష్టించింది శ్రీమన్నారాయణుడే. అందుకే “దైవం పరంజ్యోతి”అంటారు. అతనే పరబ్రహ్మ. ధ్యానం, అది చేసేవాడు- రెండూ నారాయణుడే అని మంత్రపుష్ప సారాంశం.```


                    

*#రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే*

*నమోవై యం వై శ్రవణాయ కుర్మహే* 

 *సమే కామాన్ కామకామాయ* 

 *మహ్యం కామేశ్వరో వై శ్రావణౌ*

 *దధాతు*

 *కుబేరాయవై శ్రవణాయ* 

 *మహారాజాయ నమః* ```


రాజులకు రాజైన దేవుడోయి

పరులకు లాభాలీయునోయి

వైశ్రవణునకు వందనమోయి

సకల కోరికల యజమానోయి

మా కోరికలన్ని తీర్చునోయి

అతడే కుబేరుడు వైశ్రవణుడోయి

ఆ మహారాజుకు వందనమోయి.```


*#ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు,*

 *ఓం తదాత్మా* *ఓం తత్సత్యమ్*

*ఓం తత్సర్వం, ఓం తత్పురోమ్ నమః*```


అతడే బ్రహ్మమతడే వాయువు

అతడే సత్యమతడే ఆత్మ

అతడే సర్వమతడే ఆదిదైవం```


 *#అన్తశ్చరతి భూతేషు* 

*గుహాయామ్ విశ్వమూర్తిషు*```


జీవులందున్నవాడు

బయటా వున్నవాడు

తెలియని వాడు

విశ్వమంతా వున్నవాడు.```


 *#త్వం యజ్ఞ్యస్త్వం* *వషట్కారస్త్వం* 

*మిన్ద్రస్తగ్ం* *రుద్రస్త్వం విష్ణుస్త్వం*

*బ్రహ్మత్వం ప్రజాపతిః*

*త్వం తదాప ఆపొజ్యోతీ*

*రసో ౭ మృతం*

*బ్రహ్మ*

*భూర్భువస్సువరోమ్*```


నీవే యాగము  యాగమంత్రము

నీవే  విష్ణువు బ్రహ్మ ఇంద్రుడవు

నీవే  జలము తేజము రసము

నీవే శాశ్వతము  విశ్వరూపము

నీవే  ఓం కారబ్రహ్మవు```


*#ఈశాన స్సర్వ విద్యానా మీశ్వర*

*స్సర్వభూతానామ్ బ్రహ్మధిపతిర్*

*బ్రహ్మణో ౭ ధిపతిర్ బ్రహ్మశివోమే*

*అస్తు సదా శివోమ్*```


సకల విద్యల కు ఈశుడవు

సకల జీవులకు ఈశుడవు

నీవే బ్రహ్మ యజమాని

నీవే బ్రాహ్మల యజమాని

నీవే బ్రహ్మ సదాశివుడవు```


*#తద్విష్ణో పరమం పదగ్ం*

*సదా పశ్యన్తి సూరయః*

*దివీవ చక్షు రాతతమ్*```


ఆ విష్ణు లోకము నోయి

ఆ పరమ పధమునోయి

జ్ఞానులు సదా చూచేరోయి ఆకాశమంతా చూచేరోయి```


*#తద్విప్రాసో విపన్వవో*

*జాగృవాం స్సమిన్దతే*

*విష్ణోర్య త్పరమం పదమ్*```


కోరికలు దోషాలు లేని వారు

జాగృతి చలనాలు కలవారు

విష్ణులోక కాంతులు పెంచేరు

పరలోక ప్రకాశము```


 *#ఋతగ్ం  సత్యం పరమ్బ్రహ్మ* 

*పురుషం కృష్ణ పింగళమ్*

*ఊర్ధ్వరేతమ్ విరూపాక్షం*

*విశ్వరూపాయ వై నమో నమః*```


ముక్తినాధుడు సత్యరూపుడు

బ్రహ్మ రూపుడు నల్లనివాడు

పైకి వెలుగు  తేజోవంతుడు

విరూపనేత్రుడు విశ్వరూపుడు

దేవదేవునకు మరల వందనము.```


*#నారాయణాయ విద్మహే*

*వాసుదేవాయ ధీమహి*

*తన్నో విష్ణు ప్రచోదయాత్*```


నారాయణుని ఉహించెదను

వాసుదేవుని ధ్యానించెదను

విష్ణు చైతన్యము కలుగు గాక```


*#ఆకాశ త్పతితం తోయమ్*

*యథా గచ్ఛతి సాగరం*

*సర్వదేవ నమస్కారః*

*కేశవమ్ ప్రతి గచ్ఛతి*```


ఆకాశ ధారాల నీరులు

ఎలా సాగరమే చేరునో

సకలదేవ వందనాలు

ఆ పరందామునే చేరును```


 *మంత్రపుష్పం సంపూర్ణం*


 *సర్వం భగవదర్పణం స్వాహా.* 

.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀