12, నవంబర్ 2023, ఆదివారం

Panchaag


 

 *శ్రీ రామాయణము*

1వ దినము, బాలకాండ

వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలొ సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి - కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీదెగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతె చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి "నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు" అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు


మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని, ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చె ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబసభ్యులు. చాలా బాధ కలిగి, మళ్ళి ఆ ఋషుల దెగ్గరికి వచ్చి, నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు(వల్మీకం) కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుష నామమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి, పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటె, ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట




తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం |


నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ||


వాల్మీకి మహర్షి రామాయణంలొ రాసిన మొదటి శ్లోకం. దీని అర్ధం ఏంటంటె, తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటె...............


కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |


ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||


చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |


విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||


ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |


కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ||


ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు.నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలొ ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు........ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడుచెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాన సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులనిచూశారు.అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆమగపక్షిచుట్టూఆడపక్షిఏడుస్తూతిరుగుతుంది..

అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది..........ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలొ ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు. ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు "ఓ బ్రాహ్మణుడా! నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ." అన్నారు. ఆ శ్లోకానికి అర్ధం చూడండి......"నిషాద" అంటె బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. "మా" అంటె లక్ష్మి దేవి. "మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః", అంటె లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. " యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్", కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జెరుగుగాక, అని ఆ శ్లోక అర్ధం మారింది బ్రహ్మగారు అన్నారు, "నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను " నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగ ఆయనకి బ్రహ్మ గారి వరం వల్ల జెరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంబించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంబించారు. తరవాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశలతో పాడించారు. వాళ్ళు తరవాత ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో పాడడం మొదలుపెట్టారు......... కథ ప్రారంభం: : రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు............. పూర్వకాలంలొ కోసల దేశం . ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు. ఆ నగరం 12 యోజనముల పొడువు, 3 యోజనముల వెడల్పు ఉండేది( యోజనం అంటె = 9 మైళ్ళు ). ఆ నగరం మధ్యలొ రాజ ప్రాసాదంలొ దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలొ రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతొ ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలొ. ఏ ఇంట్లోనుకుడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలొ అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితొ వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతొ ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలొ పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలొ లేడుదశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చె ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. ఆ కోసల దేశంలొ పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు.ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్దారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలొ యాగమంటపం నిర్మించారు దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతొ సుమంత్రుడు ఇలాఅన్నాడు........... సనత్కుమారోభగవాన్పూర్వంకథితవాన్కథాం| ఋషీణాంసన్నిధౌరాజన్తవపుత్రాగమంప్రతి|| పూర్వకాలంలొ ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు............ఇక్ష్వాకువంశములొ జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతొ పాటు పుత్రకామేష్టి యాగం . ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతొ అన్నాడు.ఆ రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలొ ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి అన్నాడుఅప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటె, సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు.............పూర్వకాలంలొ విభణ్డక మహర్షి ఊర్వశిని చేసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలొ పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని ఆ రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటె విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు. దేశంలొ క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలొ అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయనికొందరుమహర్షులుఅన్నారు. వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, రుష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు..... ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి |. రుష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణ్డకుడు లేని సమయంలో వీళ్ళు ఆ రుష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు, అని మంత్రులు సలహా ఇచ్చారు. ఆ వేశ్యలకి విభణ్డకుడి మీద ఉన్న భయం వలన, వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. ఒకరోజు విభణ్డకుడు లేని సమయంలో గానం విన్న రుష్యశృంగుడు, ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి, వాళ్ళు పురుషులే అనుకొని, మహాపురుషులార! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభణ్డకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమంనుంచి వెళ్ళిపోతూ ఆ రుష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు. మరునాడు ఆ రుష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దెగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే.......... తత్రచఆనీయమానేతువిప్రేతస్మిన్మహాత్మని వవర్షసహసాదేవోజగత్ప్రహ్లాదయన్తద|| ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జెరిపించారు. ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జెరిపించారు.కాబట్టి దశరథ మహారాజు ఆ రుష్యశృంగుడిని పిలవడానికి, అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక, వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితొ ఇలా అన్నాడు...మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా, అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి, వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు .....

 *పూర్ణ పురుషుడు – శ్రీరామచంద్రుడు*


మానవుడు ఈ భూమి మీద ఆవిర్భవించినది మొదలు సుఖమయ, శాంతిమయ జీవనానికి కృషి చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ప్రయోగాలు సలుపుతూనే ఉన్నాడు. వేదాలకు పుట్టినిల్లు అయిన ఈ భరత ఖండం లో ఋషులు, మునులు తమ తపశ్శక్తి తో మానవజీవితాన్ని , ఆత్మానుభూతిని దర్శించి, మనిషి ఎలా బ్రతికితే శాంతిగా ఉంటాడో తెలియచెప్పారు. మన పవిత్ర గ్రంధాలన్నీ ఋషి ప్రోక్తమైనవే.మన భారత దేశాన్ని మిగతా అన్ని దేశాల కంటే ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేది ధర్మం పట్ల మనకున్న గాఢానురక్తి. ఋషులు ఏర్పరిచిన ఈ వర్ణాశ్రమ ధర్మాలను ధర్మం అనే చెలియలి కట్ట కు లోబడి పాటిస్తూ ఉంటే మానవ జీవితం సాఫల్యమైనట్లే. ఆశ్రమ ధర్మాలలో కెల్లా ఉత్తమమైన గృహస్థాశ్రమం యొక్క విశిష్టతని వాల్మీకి మహర్షి దర్శించి, రామకథగా రామాయణం రూపంలో మనకందించారు. “ రామో విగ్రహవాన్ ధర్మః “ అన్నట్లు రాముడే పోతపోసిన ధర్మమూర్తి. రాముడి జీవితాన్ని పరిశీలిస్తే, అనుసరిస్తే, అనుగమిస్తే అంతకన్నా మోక్షం ఇంకేదీ లేదు. మిగతా అవతారాలన్నింటి కన్నా మానవ జీవితానికి అతి దగ్గరగా ఉన్నది రామావతారమే.మిగతా అవతారాలు భగవంతుని వైభవాన్ని కీర్తించడానికి ఉపయోగపడితే, రామావతారం మనం ఆచరించడానికి వీలుగా ఉన్న ధర్మాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది.


ఈ సమాజంలో సన్యాస దీక్ష తీసుకున్న ఏ అతి కొద్దిమందినో మినహాయిస్తే, మిగతా వారందరం గృహస్థాశ్రమం లోని వారమే. అందరం అనేక రాగ ద్వేషాలకు లోనవుతూ, కుటుంబ పరంగా, సామాజికంగా బంధాలనేర్పరుచుకుంటూ, అనేక సంఘర్షణలకు గురవుతుంటాము. మనకి నిత్య జీవితంలో ఎదురయ్యే అనేకానేక సంక్లిష్ట పరిస్థితులలో, సందర్భాలలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో, ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిణామాలు వస్తాయో అని సతమతమవుతూ ఉంటాము. అలాంటప్పుడు మనకి ముందే ఒక మార్గం చూపించిన వారెవరున్నారా, వారు ఈ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించేరా అని అన్వేషిస్తూ ఉంటాము. ఆ సందర్భంలో నువ్వు ఇలా చెయ్యి, అలా ప్రవర్తించు అనే చెప్పేవాళ్ళు, గ్రంథాలు బోలెడు ఉంటాయి. ఒడ్డున కూర్చున్న వాడికేం తెలుస్తుంది నది లోతెంతో అని అనుభవించే వాళ్లకి అనిపిస్తుంది. అదిగో , అలాంటి సందర్భంలోనే మనకి శ్రీరామాయణం నేనున్నానంటూ వస్తుంది. మనందరం ఈనాడు అనుభవించే సంఘర్షణలన్నీ, ఉద్వేగాలన్నీ తానే అనుభవించి, ఆయా సందర్భాలలో ఏ నిర్ణయం తీసుకుంటే ధర్మం కాపాడబడుతుందో, ఆచరించే ఆ ధర్మమే తిరిగి మనలని ఏ విధంగా కాపాడుతుందో తన జీవితం ద్వారా తెలియచెప్పిన ధర్మమూర్తి, మహనీయుడు శ్రీరామచంద్రమూర్తి. ప్రతీ మనిషి జీవితంలో అడుగడుగునా ఏర్పడే ప్రతీ సంఘర్షణకీ రామాయణం తరచి చూసిన వారికి పరిష్కారం దొరుకుతుంది. భగవద్గీత కూడా మనిషికి ఎలా జీవించాలో చెప్పినా రామాయణం ప్రాక్టికల్ గైడ్ లాంటిది. భగవద్గీత లో చెప్పిన కర్మయోగాన్ని తాను అనుష్ఠించి, మనకి ఆదర్శప్రాయుడైన కర్మయోగి రాముడు. ఇందులో మనిషి ఆచరించలేని, కష్టసాధ్య మైన గుణాలు ఏమీ లేవు. ధర్మమంటే అదేదో బ్రహ్మ పదార్థమన్నట్లు చెప్పలేదు. సులువుగా ఆచరించగలిగేవే ఉన్నాయి. కావలసినదల్లా ధర్మం పట్ల అనురక్తి. ఒక ధర్మం, మరొక ధర్మం మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు, ఏది పరమ ధర్మమో అదే ఆచరించాలి. ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు కష్టమైనప్పటికీ, ధర్మాన్నే ఆచరించాలి. ఇష్టమైనదని, సులువైనదని, తాత్కాలికంగా సుఖాన్నిస్తుందని అధర్మాన్ని ఆచరించరాదు. అదే రామాయణం మనకి నేర్పే జీవిత సత్యం. వ్యక్తి హితం కన్నా కుటుంబ హితం, కుటుంబం కన్నా సమాజ హితం మహోన్నతమైనవి అని రాముడు తన జీవితం ద్వారా చాటి చెప్పాడు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని, రాజ్యం లోని సామాన్య పౌరుల మాట కోసం భార్యని, విడచిపెట్టాడే తప్ప ధర్మాన్ని వీడలేదు. రాముడిని ప్రజలు దశరథమహారాజు కొడుకుగా, కాబోయే రాజుగా మాత్రమే ఆరాధించలేదు. యువరాజు అవుతాడన్నప్పుడూ అదే ఆరాధన. అడవుల పాలైనప్పుడూ అదే ఆరాధన. సీత ని పోగొట్టుకొని దుఃఖం అనుభవిస్తున్నప్పుడూ అదే ఆరాధన. రావణ సంహారం చేసినప్పుడూ అదే ఆరాధన. రాముని స్థితిగతులకు అతీతంగా ఈ ఆరాధన కొనసాగింది. నిజానికి అది రాముని పట్ల ఆరాధన కన్నా, మూర్తీభవించిన ధర్మం పట్ల ఆరాధన.

వాల్మికి మహర్షి , నారద మహామునిని వేసిన ఒకే ఒక ప్రశ్న రామాయణాన్ని మనకి అందించింది. వాల్మికి మహర్షి, తను ఉన్న కాలంలో షోడశ గుణాలు కల ఒక మానవుడు ఈ భూమ్మీద ఉన్నాడా అని ప్రశ్నించినప్పుడు, నారద మహర్షి సంక్షేప రామాయణాన్ని ఉపదేశిస్తారు.!!


*కోన్వస్మిన్ సామ్ప్రతం లోకే గుణవాన్కశ్చ వీర్యవాన్,

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః.. 

చారిత్రేణ చ కో యుక్తః సర్వ భూతేషు కో హితః,

విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః .

ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ఽనసూయకః 

కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే*!!


పరాక్రమశాలియు, గుణవంతుడు, ధర్మాధర్మముల నెరిగినవాడు, మేలు మరువని వాడు, ఆడినమాట తప్పనివాడు, తలచిన పని నేరవేరువరకు పట్టుదల విడువని వాడు,మంచి నడవడి కలిగినవాడు, సర్వభూతముల మేలుకోరువాడు, మంచి చెడ్డ లెరిగిన వాడు, నేర్పరి, అందరికీ ప్రియమైన దర్శనం కలవాడు, ధైర్యవంతుడు, కోపము లేని వాడు, కాంతితో కూడిన వాడు, ఇతరులపై అసూయ లేనివాడు, యుద్ధం లో దేవతలనైన వెరపించేవాడు.

పదహారు కళలు చంద్రుని పూర్ణ చంద్రుణ్ణి చేసినట్లు ఈ పదహారు గుణాలు రాముణ్ణి పూర్ణ పురుషుడిని, పురాణ పురుషుడిని చేసాయి.

శ్రీరామ నవమి సందర్భంగా ఈ రోజు నుండీ మనం రాముని ఏ గుణాలు ఆయనను ఆదర్శప్రాయుడినీ, ఆరాధ్యనీయుడినీ చేసాయో, ఏ గుణాలు ఎన్ని యుగాలు మారినా రామ కథ నిత్యమూ పారాయణ చేయతగిన గ్రంథంగా కొలవడానికి కారణమయ్యాయో, ఆ గుణాలు మన నిత్యజీవితంలో ఎలా ఆచరణ యోగ్యమో తెలుసుకుందాం.


||శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, |శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి | 

శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, |శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే ||

 A true story posted on FB by a devout Indian.


How the Greats recognize their disciples and how they direct others to their Masters !! How Robert Adams met Ramana Maharshi:


“Finding the address of Robert Adams in the transcript, I wrote to him asking the details of how he attained Self-realization in the presence of Bhagavan. I received a long letter:

"I am Robert Adams. I was born in New York in 1928. As far as I remember, even when I was in the crib, I remember that a man about two feet tall, with white hair and gray beard would always appear at the foot of the crib and speak to me without words. As a child, I couldn't understand anything he was saying. When I was about five or six years old, I told my parents this, but they thought I was playing. I told my friends. They even laughed at me. Stopped talking about it. These visits from little man stopped when I was about seven. "

Robert Adams also added that he didn't know what to do. He couldn't share what happened with anyone. So, something weird happened. Whenever he wanted something, whether it was a pencil, chocolate or a violin, he would appear through someone when he uttered the word "God" three times. If he found out someone needed a pencil in class, he would have said "God" three times and the pencil would be there and handed the pencil to the person who needed it. It happened during his exams too. Not interested in studying. During exams, he would have said "God" three times, and the answers would appear before him and he would have written them down. This is how he passed his exams.

When he wrote a math assignment he wasn't prepared for, he did the same thing. He kept the question paper in front of him and uttered "God" three times.

Answers were expected to appear as usual, but what happened was something completely different:

“The whole room was filled with a light a thousand times brighter than the sun. It was a beautiful, warm and bright glow. Everything and everyone in the room was immersed in light. All the children seemed simple particles of light and I found myself merging into a radiant being of consciousness. So I have joined my conscience. It was not an out of body experience. This was a completely different experience. I realized I wasn’t my body. What appeared to be my body wasn't real. I've gone beyond the light in pure radiant consciousness. I became consciousness and my individuality merged into pure and absolute happiness. I expanded and become the universe. The feeling was indescribable. It was total happiness and total joy. "

After this experience, Robert Adams could no longer carry out his business as usual.

Being a teenager, he wanted someone to drive him.

Joel Goldsmith was considered a true Christian mystic at the time. Several people suggested approaching Joel Goldsmith and so he went there.

Joel Goldsmith listened to Robert Adams and suggested, “Go to Paramahansa Yogananda in Encinitas. It will guide you through. "

Robert Adams went to Encinitas in a state of excitement and ecstasy.

A strange thing has happened. Lots of people were present in Paramahansa Yogananda. Robert was out though. Paramahansa told his secretary: 'There's a boy outside. Give him a call. "

Robert Adams prostrated before the great man and said, "You are my guru." Paramahansa replied, "No, I am not your guru. Your guru is Sri Ramana Maharshi. Maharshi is not well, go to him immediately. ”

After being out, Robert felt the need to read a book at the library. I was flipping through the philosophy section when the book Who am I? I'll get her attention . When she saw Ramana Maharshi's picture on the book, her hair curled, because this was just the person who used to appear in front of her crib and talk to him. So with the strong recommendation of Paramahamsa Yogananda, reached Arunachala in 1947. ”

- Sri V Ganesan Ramana Periya Puranam 

https://www.facebook.com/reel/1058001938562554?mibextid=YNcHmz 

E scooty

You tuber in flight


 

పునీతమైన ఇల్లు..గ్రామం..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*పునీతమైన ఇల్లు..గ్రామం..*


*(ఇరవై ఐదవ రోజు)*


శ్రీ స్వామివారు శ్రీధరరావు గారి ఇంటిలో విడిది చేశారు..ఆ రాత్రి గడిచింది..తెల్లవారుఝామునే లేచి ఆ ఇంటి ఆవరణలో దిగంబరంగా తిరుగసాగారు..దాదాపు ఒక ఎకరా స్థలం ఉన్న ఆ ఇంటి ఆవరణలో ప్రతి మూలా తిరుగుతూ చూస్తున్నారు..తెల్లవారే సరికే..మొగలిచెర్ల గ్రామమంతా వార్త ప్రాకిపోయింది.."శ్రీధరరావు ఇంటికి ఎవరో సాధువు వచ్చాడు..దిగంబరంగా వున్నాడు.."అంటూ చెప్పుకోసాగారు..


మరి కొద్దిసేపటికే.."ఆ భార్యాభర్తలకు పిచ్చిగానీ పట్టలేదు కదా..ఇలా ఒక దిగంబరిని ఇంట్లో పెట్టుకుంటారా?..ఎంత అప్రదిష్ట?.." అని కొందరూ..


"ఏ లంకెబిందెల కోసమో..లేకపోతే నిధుల కోసమో..ఆ సన్యాసిని ఇక్కడికి తీసుకొచ్చారు..లేకుంటే..ఇలాటి వాడిని ఇంటికి రానిస్తారా?.." అని కొందరూ..


వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు..కానీ కుతూహలం కొద్దీ శ్రీ స్వామివారిని చూడటం కోసం ఊరు ఊరంతా కదిలివచ్చింది..సాయంత్రం దాకా తిరునాళ్ళ ను తలపించేలా వచ్చి వెళ్లారు..


ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా..శ్రీధరరావు ప్రభావతి గార్లు చెక్కుచెదరలేదు..వాళ్ళు ఒక ధృడ నిశ్చయానికి వచ్చారు..ఎటువంటి వ్యాఖ్యలకూ స్పందించదలచుకోలేదు.. కొన్ని విషయాలు ఈ దృశ్య జగత్తుకు సంబంధించినవి..అవి కళ్ళకు కనిపిస్తాయి..కానీ..కొన్ని మనసుకు మాత్రమే గోచరం అవుతాయి..అవి దైవప్రేరితాలు..అలా మనసుకు గోచరమైన భావన ను నిజమని విశ్వసించి..అలా గోచరింపచేసిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శరణాగతి చెందడమే ఉత్తమ మార్గం..ఆ మార్గం లోనే పయనించాలని శ్రీధరరావు ప్రభావతి గార్లు నిర్ణయం తీసుకొని..దానికే కట్టుబడి వున్నారు..


శ్రీ స్వామివారి గురించి, వీళ్లిద్దరి బంధువర్గం లోనూ కొందరు హేళన తో మాట్లాడటం జరిగింది..అప్పుడూ మౌనంగానే వున్నారు..శ్రీ స్వామివారి తపోసాధనకు కానీ..వారి ఏర్పాట్ల కోసం గానీ..ఏలోటూ రానీయలేదు..


శ్రీధరరావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారు కొడుకూ కోడలు చేస్తున్న ఈ పనికి పూర్తి అంగీకారం తో ఉండటం..ఆ దంపతులకు పెద్ద ఊరట నిచ్చే విషయం..


చిత్రంగా రెండు మూడు రోజుల్లోనే..పరిస్థితి తారుమారు అయింది..ఎవరైతే హేళన చేసారో..ఎవరైతే అపనమ్మకం తో ఉన్నారో..వారందరూ శ్రీ స్వామివారిని కీర్తించడం మొదలుపెట్టారు..శ్రీ స్వామివారిలో వారికి దైవాంశ కనబడసాగింది..కొందరు, శ్రీ స్వామివారు తమకు.. "పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి" లాగా కనబడుతున్నారనీ..మరికొందరు..తమకు సాక్షాత్తూ ఆ "పరమ శివుడు" లాగా కనబడుతున్నారనీ..నమస్కారం చేసుకుంటూ చెప్పుకోసాగారు..మరో రెండురోజుల కల్లా.. మొగలిచెర్ల గ్రామం మొత్తం..శ్రీ స్వామివారిని భక్తి పూర్వకంగా కొలవడం ప్రారంభించారు..


మొదట హేళనలూ..తిరస్కారాలూ..చూసి..ఆ వెంటనే భక్తిపూర్వక నమస్కారాలు చూసిన శ్రీధరరావు ప్రభావతి గార్లకు..తమ జన్మ సార్ధకత చెందిందని..ఆ స్వామి పాదం మోపిన తమ గృహం పావనం అయిందనీ..అనుభూతి చెందసాగారు..తాము ఆ యోగిపుంగవుడి సేవలో తరించే విధంగా తమకు శక్తి ప్రసాదించమని కులదైవం లక్ష్మీనారసింహుడిని ప్రార్ధించారు..


శ్రీ స్వామివారు వరుసగా మూడు రోజులపాటు సమాధి స్థితిలోకి వెళ్లిపోయారు..ఆయనకు కేటాయించిన ఇంటి తలుపులు మూసివేసుకొని..లోపల ధ్యానం లో మునిగిపోయారు..చిత్రంగా ఆ మూడురోజులూ ఆ యింటి మీద వందలాది రామచిలుకలు వచ్చి వ్రాలాయి..ఆ యింటి చుట్టూ ఒక పెద్ద సర్పం తిరుగసాగింది.. ఆ సర్పాన్ని కొట్టాలని కొంతమంది ప్రయత్నం చేశారు గానీ..దంపతులిద్దరూ వద్దని వారించారు..అత్యంత దివ్య సుగంధ పరిమళం ఆ పరిసరాల్లో వ్యాపించింది..రాత్రిపూట ఒకరకమైన నీలి రంగు కాంతి వలయం ఏర్పడసాగింది..శ్రీధరరావు గారు, ప్రభావతి గార్లు ఈ విచిత్ర పరిణామాల గురించి తన్మయత్వంతో చెప్పుకుంటుంటే విన్న సత్యనారాయణమ్మ గారు .."ఒక్కసారి స్వామివారున్న గది వద్దకు తీసుకుపొమ్మని" ప్రభావతి గారిని అడిగారు..ప్రభావతి గారు, ఆవిడను తీసుకొని ఆ గది వద్దకు తీసుకువెళ్లి..కిటికీ లోంచి శ్రీ స్వామివారిని చూపించారు..కొద్దిసేపటికే ఆవిడ ఏదో తెలీని అనుభూతితో.."అమ్మాయీ..ఈయన సామాన్యుడు కాదమ్మా..నాకు బ్రహ్మం గారిలాగా గోచరిస్తున్నారు.." అని నమస్కారం చేసుకున్నారు..


మూడోరోజు శ్రీ స్వామివారు సమాధి స్థితి నుండి బైటకు వచ్చారు..ఆరోజు సాయంత్రం మొగలిచెర్ల గ్రామస్థులు అందరూ శ్రీ స్వామివారిని చూడటానికి వచ్చారు..శ్రీ స్వామివారు ఆరుబయట అరుగు మీద పద్మాసనం వేసుకొని కూర్చుని..అందరితో ప్రశాంతంగా ముచ్చటించారు..సర్పం వచ్చిందని చెప్పగానే..శ్రీ స్వామివారు ఒక్కక్షణం కళ్ళుమూసుకుని.."అది దివ్య సర్పం..దానికి హాని తలపెట్టవద్దని..తాను తపస్సులో వున్నప్పుడు అలా తిరుగుతూ ఉంటుందనీ..మాలకొండ లో కూడా ఉండేదని.." చెప్పారు..ఆసరికే గ్రామస్థులలో ఉన్న సందేహాలన్నీ తీరిపోయాయి..అందరూ శ్రీ స్వామివారిని దైవస్వరూపుడిగా మనసారా భావించి, కొలవసాగారు..


సాధువు..సన్యాసి..అవధూత..సద్గురువు..ఇలా అన్నీ కలబోసిన ఆ మహాత్ముడు..ఆ విధంగా ఆ దంపతుల జీవనాన్ని మలుపు త్రిప్పడానికి వారింటి లోనే అడుగుపెట్టాడు..


జ్ఞానబోధ..రామకోటి..రేపు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699)

ఆలోచనాలోచనాలు

 👌ఆలోచనాలోచనాలు 👍 సంస్కృత సూక్తి సుధ 💐                                      ***** త్యజేదేకం కులస్యార్థే, గ్రామస్యార్థే కులం త్యజేత్! గ్రామం జనపదస్యార్థే, ఆత్మార్థే పృథివీం త్యజేత్!!                  ఒకడ వలన కులం చెడిపోతున్నదనుకొంటే ఆ ఒక్కడిని విడిచిపెట్టాలి. ఒక కులం వలన గ్రామానికి నష్టం ఏర్పడితే ఆ కులాన్ని వదిలెయ్యాలి. ఒక గ్రామం వలన రాజ్యానికి ఇబ్బందులు ఏర్పడితే ఆ గ్రామాన్ని విడిచిపెట్టాలి. తనకే , తాను ఉన్న భూమి వలన కష్టాలు కలిగితే దానిని వెంటనే వదిలెయ్యడం మంచిది.        ***** అహో ప్రకృతి నా దృశ్యం, శ్లేష్మణో దుర్జనస్యచ, మధురైః కోపమాయాతి , కటుకై రుపశామ్యతి!!                      దుర్జనుడు, శ్లేష్మం --- ఈ రెండూ స్వభావం చేత సమానవైనవి. ఎట్లాగంటే తియ్యటి పదార్థాలు తింటే శ్లేష్మం (కఫం) వృద్ధి చెందుతుంది. చేదు పదార్థాలు తినడం వలన శ్లేష్మం నశిస్తుంది.                   ***** యస్మిన్ దేశేన సన్మానో, నప్రీతిర్నచ బాంధవాః, న విద్యా నాస్తి ధనికో, నతత్ర దివసం వసేత్!!                                   గౌరవము, ప్రేమ, బంధువులు, విద్య, దానం చేసే ధనవంతులు ఉండరో అక్కడ బుద్ధిమంతుడైనవాడు ఒక్క రోజైనా ఉండకూడదు.( ఉంటే ప్రమాదమని భావం.)           ***** రాజవత్పుత్ర దారాశ్చ, స్వామి సన్మిత్ర బాంధవాః! ఆచార్య వత్సభామధ్యే , భాగ్యవంతం స్తువంతిహి!!     భాగ్యవంతుడైనట్లయితే భార్య, బిడ్డలు ప్రభువును గౌరవించినట్లు గౌరవిస్తారు. సభలయందు ఆచార్యుని వలె జనులు కీర్తిస్తారు. బంధువులు, స్నేహితులు యజమానిని కొలిచినట్లు కొలుస్తారు. కాబట్టి భాగ్యవంతుడికే ఈ లోకంలో నేడు గౌరవమర్యాదలు లభిస్తాయని కవి భావన.         ***** మాతా నిందతి, నాభినందతి పితా.                భ్రాతా న సంభాషతే, భృత్యః కుప్యతి, నానుగచ్ఛతి సుతః,              కాంతాపి నాలింగతే,                అర్ధ ప్రార్థన శంకయాన కురుతే సల్లాప మాత్రం సుహృత్, తస్మాదర్థముపార్జయ, శ్రుణు సఖేః, అర్థేన సర్వేవశాః!!                           ధనానికి ఎంతటి ప్రభావం ఉందో ఒకడు తన మిత్రునికి తెలియబరుస్తున్నాడు.         మిత్రమా! దరిద్రుణ్ణి తల్లి తిడుతుంది. తండ్రి సంతోషించడు. అన్నదమ్ములు మాట్లాడరు. సేవకులు కోపగించుకొంటూ ఉంటారు. కొడుకు వెంట రాడు. భార్య కూడా ప్రేమతో కౌగలించుకోదు. ఆఖరుకు ప్రాణస్నేహితుడు కూడా డబ్బు అడుగుతాడేమో అనే అనుమానంతో పలకరించకుండా, దూరంగా తప్పుకొని తిరుగుతాడు. కాబట్టి ధనాన్ని సంపాదించు. ధనం వలన అంతా నీ వశం అవుతారు.                         ***** ఆతురే నియమో నాస్తి  బాలే వృద్ధై తధైవచ, సదాచార రతే చైవ హ్యేష ధర్మ స్సనాతనః!!                            రోగగ్రస్తులకు, బాలురకు, ముసలివారికి, ఎల్లప్పుడూ మంచి ఆచారాలు పాటించేవారికి--- వీరికి వేరే నియమాలు అక్కరలేదు. ఇది పూర్వకాలం నుండి వస్తున్న ధర్మం.                      ***** గోమూత్ర మాత్రేణ పయో వినష్టం, తక్రస్య గోమూత్ర శతేన కిం వా, అత్యల్ప పాపైర్విపదశ్శుచీనాం, పాపాత్మానాం పాప శతేన కిం వా!!                                ఆవు పంచితం ఒక బొట్టు పడ్డా పాలు చెడిపోతాయి. అయితే గోమూత్రం ఎంత కలిసిన మజ్జిగకు చెరుపు లేదు. అట్లాగే పరిశుద్ధమైన సజ్జనులకు కొంచెం పాపం చేస్తేనే పెద్ద ఆపద సంభవిస్తుంది. కానీ ఘోరమైన పాపాలు చేసేవారికి , ఇంకా ఎన్ని పాపాలు చేస్తే మాత్రం నష్టం ఏముంటుంది? ( వెంటనే పాప ఫలితం కనబడదని కవి భావం.)                           ***** చివరగా ఒక చమత్కార శ్లోకం. ----            మహాకవి కాళిదాసు భోజ మహారాజుతో తెలియజేసినట్లు జనశ్రుతి.     దగ్ధం ఖాండవ మర్జునేనచ వృధా కల్పద్రుమై ర్భూషితం,    దగ్ధా వాయుసుతేన హేమరచితా లంకా వృధా స్వర్ణభూః,         దగ్ధ స్సర్వ సుఖాస్పదశ్చ మదనో హాహా! వృధా శంభునా,         దారిద్ర్యం ఘనతాపదం భువినృణాం కేనాపినో దహ్యతే!!                            కల్పవృక్షాలు గల ఖాండవ వనాన్ని అర్జునుడు , స్వర్ణభూమి అయిన లంకను ఆంజనేయుడు , అందరికీ సుఖాన్నిచ్చే మన్మథుణ్ణి శివుడు వృధాగా కాల్చివేశారు. కానీ అందరికీ ఇంత క్షోభను , కష్టాన్నీ, తాపాన్నీ కలుగజేసే దరిద్రాన్నెవరూ కాల్చివేయలేకున్నారు. ఓ భోజ మహారాజా! నీవైనా ఆ పని చెయ్యమని కోరుకొన్నాడు.( భోజుడు ఆ శ్లోక కర్తకు జీవనభృతులు ఏర్పరచాడని ప్రతీతి)               తేది 12--11--2023, ఆదివారం, శుభోదయం.

తత్వబోధ

 Inspiring Story


తత్వబోధ..! ఆమె ఓ సాదాసీదా సేల్స్ గరల్ కాదని ఆలస్యంగా అర్థమైంది..!!



చెన్నై… మైలాపూర్… కాపాలీశ్వర కోవెలలో దర్శనం అయిపోయింది… గిరి ట్రేడింగ్ స్టోర్స్‌లోకి వెళ్లి ‘తత్వబోధ’ పుస్తకం కోసం వెతుకుతున్నాను… అక్కడ బోలెడన్ని పుస్తకాలు… అనేక సీడీలు… అభంగ్ నుంచి అరుణా సాయిరాం దాకా… భజనల నుంచి బాంబే జయశ్రీ దాకా… బొచ్చెడు సీడీలు… ఓహ్, సరైన ప్లేసులోకే వచ్చాం అనిపించింది… నా భార్య భారతీయర్ పాటల సీడీల కోసం వెతుక్కుంటోంది…


నేనేమో ఆ పుస్తకాల దొంతర్లలో ఆ తత్వబోధ అనే పుస్తకం కోసం అన్వేషిస్తున్నాను… దొరకడం లేదు… ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకదు, కాస్త ఆలస్యమైనా సరే ఇక్కడే వెతుక్కోవాలి, అది చదవాలి… క్యాషియర్ పక్కన ఓ అమ్మాయి నిలబడి ఉంది… నేనూ, నా భార్య తంటాలను గమనిస్తోంది… చామనఛాయకన్నా కాస్త నలుపే… దగ్గర్లోని ఏదైనా పల్లె నుంచి వచ్చి ఉండాలి… 17, 18 ఏళ్లుంటాయేమో… ఏ ఏడో తరగతో, ఎనిమిదో తరగతో చదివి ఉండవచ్చు బహుశా… పేదరికం వల్ల ఆపేసి, ఇక్కడ కొలువు చేస్తుండవచ్చు… జర్నలిస్టును కదా, ఆమెను చూడగానే ఏదేదో ఊహించేశాను… పాడు అలవాటు… కానీ మేం అంతే.


ఎవరో అనామకురాలు, నాకెందుకు అనుకుని… తిరిగి ఆ పుస్తకాన్వేషణలో పడ్డాను… సంధ్యావందనం నుంచి వివేకానంద చికాగో ప్రసంగాలు దాకా బోలెడు పుస్తకాలు… ఎక్కువ శాతం ఆధ్మాత్మిక సంబంధమే… అరగంట గడిచిందేమో… ఆమె చూస్తూనే ఉంది నన్ను… ఈ పిల్లకు ఏం తెలుసులే అని నేను కూడా ఆమెను ఆ పుస్తకం గురించి అడగలేదు… ఏముందీ, మనం సీడీలో, పుస్తకాలో సెలెక్ట్ చేసుకుంటే, ప్యాక్ చేసి ఇస్తుంది, అంతే కదా… అవును, మా బుర్రలు అలాగే ఆలోచిస్తుంటయ్ చాలాసార్లు… ఐనా ‘తత్వబోధ’ సారాంశాన్ని వదిలేయండి, కనీసం ఆ పుస్తకం దేని గురించో బేసిక్ ఐడియా ఉంటుందా సేల్స్ గరల్స్‌కు..? నెవ్వర్… అనుకున్నాను… ఈలోపు ఆమే నా దగ్గరకు వచ్చింది…


‘సార్, మీరు దేని గురించి వెతుకుతున్నారో నాకు చెబితే, నేను ఏమైనా సాయపడగలను…’


ఒక్కసారి ఆమె వైపు ఎగాదిగా చూశాను…


‘చూడమ్మా, నేను తత్వబోధ అనే పుస్తకం కోసం వెతుకుతున్నాను’ అని బదులిచ్చాను…


‘సంస్కృతంలో పబ్లిష్ చేసింది కావాలా..? లేక ఇంగ్లిష్, సంస్కృతం భాషల్లో పబ్లిష్ చేసింది కావాలా..?’ అనడిగింది ఆమె…


ఓహ్, ఈమెకు కొంత తెలిసినట్టే ఉంది… ‘సంస్కృతం ప్లస్ ఇంగ్లిష్’ అన్నాను నేను…


‘మీకు చిన్మయానంద మిషన్ వాళ్లు ప్రచురించింది కావాలా..? ఇందూ పబ్లికేషనా..? రామకృష్ణ మఠం వాళ్లదా..?’


‘ఓహ్, ఇంతమంది పబ్లిష్ చేశారా..? నిజంగా ఇవన్నీ నాకు తెలియదు, కానీ తత్వబోధ చదవాలని ఉంది’


‘మీకు తమిళం చదవడం తెలుసా..?’


‘ఎందుకు తెలియదు, నేను తమిళుడినే… (నిజానికి నా తమిళత్వం గురించి నేను పెద్దగా బయటపెట్టుకోను ఎక్కడా…)


‘అలాగైతే మీరు ఈ పుస్తకం తీసుకొండి’ అంటూ… నేను అరగంట నుంచీ వెతుకుతున్న దగ్గర నుంచే ఓ పుస్తకాన్ని తీసి ఇచ్చింది… ఎన్.శివరామన్ తమిళంలో రాసిన పుస్తకం అది… కవర్ పేజీ బాగుంది…


‘తమిళంలోనే కాదు, మీకు అవసరమైనచోట్ల సంస్కృత ఒరిజినల్ కంటెంటు కూడా ఉంటుంది’


ఈమెకు ఈ ఆధ్యాత్మిక పుస్తకాల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టే ఉంది… నేనేమో సాదాసీదా సేల్స్ గరల్ అనుకున్నాను… నేను విదేశాల్లో కొలువు చేసే ఓ పేద్ద జర్నలిస్టును… ఆమె దేహం కలర్, వృత్తి, ఆమె దుస్తుల పేదరికం, పల్లె ఛాయలు చూసి, మరీ ‘తత్వబోధ’ గురించి ఈ పిల్లకేం తెలుసులే అనుకున్నాను… ఛఛ అని మనసులోనే లెంపలేసుకున్నాను…


‘తత్వబోధ గురించి నాకేమీ తెలియదమ్మా, నిన్న ఒక ప్రసంగం విని ఈ పుస్తకం మీద మనసుపడ్డాను, అందుకే ఈ ప్రయత్నం…’


‘ఓహో, మీరు భారతీయ విద్యాభవన్‌లో గోదా వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగానికి వెళ్లారా..? ఆయన ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తిని ఇట్టే పెంచేస్తారు… సిటీలో ఆయనంత గొప్పగా ఆధ్యాత్మికం, వైరాగ్యం, సాధన, అర్చన, కర్మ వంటి సబ్జెక్టులపై ఎవరూ మాట్లాడలేరు… భారతీయ విద్యాభవన్‌లో ఆయన చేసే ప్రసంగాలకు చాలామంది వస్తుంటారు…’


ఈమె నేననుకున్నంత అజ్ఞాని ఏమీ కానట్టుంది…


‘ఇవన్నీ నీకెలా తెలుసు..? నీకూ ఈ సబ్జెక్టుల మీద ఇంట్రస్టు ఉందా..?’


‘అవును సార్, స్వామి వివేకానంద, రామకృష్ణల పుస్తకాలే కాదు, తత్వబోధ వంటి లోతైన వేదవివరణలూ చదివాను… నాకిష్టం…’


‘తత్వబోధ కూడా చదివావా..?’


‘అవును, ఇప్పుడు మీకు ఇచ్చిన పుస్తకం కూడా చదివాను… ఒక్కసారి మీరు చదివితే దీన్ని ఎల్లప్పుడూ మీ టేబుల్ మీద మీకెదురుగానే పెట్టుకుంటారు…’


‘ఈ పుస్తకం అంత గొప్పగా ఉంటుందా..? అసలేముంది ఇందులో..? చదివితే ఏమొస్తుంది..?’


‘జోక్ చేస్తున్నారా సార్..? తత్వబోధ గురించి తెలియకుండానే ఇంతసేపూ వెతికారా..?’


సీడీల వేటలో ఉన్న నా భార్య ఈ సంభాషణ వింటూనే ఉంది…


‘సార్, నాకు తెలిసినంతవరకూ… ఈ పుస్తకం చదివి జీర్ణం చేసుకోగలిగితే వేదాంతసారం బుర్రకెక్కినట్టే… సరళంగా, సులభగ్రాహ్యంగా… అది జీవితం పట్ల అణకువను నేర్పిస్తుంది… నేను అనే అహాన్ని వదిలిస్తుంది… ఇంకా ఎన్నో…’


‘ఒక్క పుస్తకం మన గుణాన్ని మార్చేయగలదా..?’


‘నిజమే సార్, కాకపోతే కంటెంటులోకి మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవాలి… అంకితభావం, చిత్తశుద్ధితో ఆచరణకు ప్రయత్నించాలి… అంతే…’


నేను కళ్లప్పగించి చూస్తున్నాను… వింటున్నాను… ఈలోపు నా భార్య అక్కడికి వచ్చింది… ఈమె ఉత్త సేల్స్ గరల్ కాదు, బుర్రలో పదునుంది అని మెచ్చుకుని… ‘ఆ పారిస్ హిల్టన్ గట్రా దేనికి..? నీ వాషింగ్టన్ పోస్టుకు ఈమె ఇంటర్వ్యూ రాయరాదూ ఈసారి…’ అన్నది నవ్వుతూ నావైపు చూసి… నిజమే కదా… వెరయిటీగా ఉంటుంది… Chat with an intelligent sales girl  అని రాద్దాం…


‘కాసేపు నీతో మాట్లాడాలమ్మా’ అన్నాను


‘దుకాణంలో రద్దీ ఉంది, ఇది ఇప్పుడు వదిలి రాలేను సార్, మా ఓనర్‌ను అడగండి…’


‘ఇంతకీ నీపేరేంటి..?’


‘కళైవాణి’ అని చెప్పి, ఇంకెవరికో ఏదో కావాలంటే గైడ్ చేయడానికి వెళ్లింది… నా భార్యకు ఆ పిల్ల తెలివి భలే నచ్చేసింది… మాటలో నమ్రత మరింత నచ్చింది… ఇద్దరూ ఓనర్ దగ్గరకు వెళ్లాం…


‘సేటూ, ఆ అమ్మాయి కళైవాణి….’


‘అవును, కష్టపడి పనిచేస్తుంది, మంచి అమ్మాయి’


‘ఈయన నా భర్త విశ్వనాథ్, వాషింగ్టన్ పోస్టులో సీనియర్ జర్నలిస్ట్’ అని నన్ను పరిచయం చేసింది… ఆయన ఆశ్చర్యంతో ఒక్కసారి దిగ్గున లేచి నిలబడ్డాడు… ‘ఆ అమ్మాయి ఇంటర్వ్యూ రాస్తాడట…’ ఓనర్ ఆ అమ్మాయిని పిలిచాడు… వీళ్లు అమెరికా నుంచి వచ్చారట, నీతో కాసేపు మాట్లాడతారట…’


‘సేటూ, గిరాకీ బాగా ఉంది ఈరోజు… రేపు ఉదయం ఇంకాస్త ముందుగా వస్తాను…’


మరుసటిరోజు వద్దామని నిర్ణయించేసుకున్నాను… నిజానికి నాకు మరుసటిరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా మిత్రులు, మద్రాస్ ప్రెస్ క్లబ్ మిత్రులతో ముఖ్యమైన అపాయింట్‌మెంట్లున్నయ్… ఐనాసరే…


ఈలోపు ఆమె కథ కాస్త తెలుసుకున్నాను… ఆర్కాట్ దగ్గర ఏదో చిన్న ఊరు… ఆమెకు అయిదుగురు చెల్లెళ్లు… కనడం తప్ప మరేమీ చేయని తండ్రి తాగీతాగీ ఓరోజు వీళ్లను వదిలి చచ్చిపోయాడు… తల్లి ఏవో పనులు చేస్తూ పోషించేది, రెండేళ్ల క్రితం ఆమె కూడా మరణించింది… ఆరుగురు పిల్లల బతుకులు బజార్నపడ్డయ్… ఈమె తొమ్మిది దాకా చదివింది… తప్పదు కదా, ఈ షాపులో కొలువు కుదిరింది… నెలకు 2500 జీతం… తన ఐదుగురు చెల్లెళ్లనూ చెన్నై కార్పొరేషన్ స్కూల్‌లో చేర్పించింది… ఆమే అక్క, ఆమే అమ్మ, ఆమే అయ్య… అన్నీ… pathetic…


‘అసలు తత్వబోధ వంటి లోతైన సబ్జెక్టులు చదవాలని ఎందుకు అనిపించింది నీకు..?’ అడిగాను మరుసటి రోజు ఉదయం…


‘ఇక్కడ చేరాక మొదట్లో ఏమీ అర్థమయ్యేది కాదు, కష్టమర్లు అడిగేది నాకు తెలిస్తే కదా నేను వాళ్లకు సాయం చేయగలిగేది… అందుకే రమణ, రామకృష్ణ, వివేకానందల చిన్న చిన్న పుస్తకాలు చదవడం దగ్గర్నుంచి మొదలుపెట్టాను… సబ్జెక్టు అర్థమయ్యేకొద్దీ ఆసక్తి పెరిగింది… వివేక చూడామణి, భగవద్గీతల దాకా వెళ్లిపోయాను… ఏ పుస్తకంలో ఏముందో సారాంశం చెప్పేయగలను…’


‘నీకొచ్చే 2500 జీతంతో ఆరుగురు ఎలా బతుకుతున్నారు..?’


‘పర్లేదు సార్, మా ఓనర్ సాయం చేస్తుంటాడు…’


‘ఇంతకీ నీకంటూ ఓ టార్గెట్ లేదా..?’


‘ఉంది సార్, నా చెల్లెళ్లందరినీ ఇంకా చదివించాలి… మంచి కొలువుల్లో చేర్చాలి…’


ఆ పిల్ల మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంతో అసలు మాటలే సరిగ్గా రావడం లేదు… అప్పటికప్పుడు ఓ సంకల్పం తట్టింది… నేనే అడిగాను…


‘నెలకు పదివేలు ఇస్తాను… మీ అందరికీ ఆసరా అవుతాను, సరిపోతాయా..? నాకెందుకో నీతో మాట్లాడుతుంటే అలా ఇవ్వాలనిపించింది…’


‘అవి చాలా ఎక్కువ సార్, కానీ మా ఓనర్‌ను అడగాలి… మంచికీ చెడుకూ ఆయనే మాకు పెద్దదిక్కు… ఆయన్ని కాదని నేనేమీ తీసుకోను… మర్యాద కాదు…’


నిజానికి ఆమె ఎగిరి గంతేస్తుంది అనుకున్నాను… కానీ ఆమె మొహంలో పెద్దగా ఏ ఉద్వేగమూ లేదు… దీన్ని స్థితప్రజ్ఞత అనాలా..? కష్టాల నుంచి అలవడిన నిబ్బరమా..? దంపతులమిద్దరమూ ఆమెను ఓనర్ దగ్గరకు తీసుకెళ్లాం, విషయం చెప్పాం… ఆయన సంతోషంతో ‘మీరు ఆ సాయం చేసి పుణ్యం కట్టుకొండి సార్, ఈ అమ్మాయి మీ సాయానికి అర్హురాలే…’ అన్నాడు… మీ ఖాతా నంబర్ చెప్పండి, నెలనెలా మీకే పంపిస్తాను, మీరు ఆ అమ్మాయికి ఇవ్వండి అన్నాను నేను…


‘వద్దు సార్, ఆమె పేరిట ఖాతా ఓపెన్ చేసి, మీకు డిటెయిల్స్ పంపిస్తా, ఆమె ఖాతాకే పంపించండి…’ అన్నాడు తను… నా వెంట వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్, నా ఫ్రెండ్ జాన్ పాల్ నన్ను ఆలింగనం చేసుకుని, నిజంగా ఓ మంచి పనిచేస్తున్నావు బ్రో అన్నాడు… ఆ పిల్లను ఉద్దేశించి నా భార్య చెబుతోంది… ‘నాలుగు రోజులు ఆగు, నిన్ను తీసుకెళ్లి అమెరికాలో వేదాంతసారం మీద ప్రసంగాలు ఏర్పాటు చేస్తాను…’ విమానం ఎక్కుతూ అనుకున్నాను నేను… ‘మన పల్లెల్లో ఇంకెన్ని రతనాలు ఉన్నాయో… చూడలేకపోతున్నాం… సాన బెట్టాలే గానీ ఎన్ని రత్నాలో, ఎన్నెన్ని మెరుపులో…’!!


సోర్స్ :: https://www.linkedin.com/pulse/20140729103615-81657483-the-sales-girl-in-chennai-giri-store-through-the-eyes-of-washington-post/


Share this Article

ముచ్చట.

పాకలో బ్రతికినా

 https://whatsapp.com/channel/0029VaA63sq5q08lbf7pP73f

జీవితంలో అప్పు , పగ , రోగం ... ఈ మూడూ లేనివారు పాకలో బ్రతికినా...  వారే ఐశ్వర్యవంతులు . ఎందుకంటే వారికి ఎలాంటి వత్తిడి , వారిమీద ఎలాంటి ద్వేషాలు ఏమీ ఉండవు. వారు కష్టపడి సంపాదించుకున్న దానితో  కడుపు నింపుకొని హాయిగా ప్రశాంతంగా నిద్ర పోతారు. మనిషికి కావలసింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర . ఆ రెండూ ఉంటే ఏ రోగం రాదు . అలాగే వచ్చిన అవకాశాన్ని , జరుగుతున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి . ఒక సారి చేజారితే మళ్ళీ వెనక్కి తిరిగి రాదు . ప్రస్తుత యాంత్రిక జీవితంలో కలవడానికి , విడిపోవడానికి చూపించే తొందర ... అర్థం చేసుకోకపోవడానికి, దగ్గరవడానికి ప్రయత్నిస్తే  ప్రతీ బంధం అందంగానే ఉంటుంది. అలాగే విలువైన వాళ్ళతో కాకుండా విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేస్తే మనం బాధపడే రోజు రాదు. మనిషి లో చెడు , మంచి అనే రెండు గుణాలు ఉంటాయి . గర్వం అనే చెడుగుణం ఉంటే  సర్వం  కోల్పోతారు., ధైర్యం అనేది ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలరు . మనిషిలో మానవత్వం అంటే ... ఆకలితో ఉన్న వారికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్నవారికి కొంచం సాయం , బాధలో ఉన్న వారికి కొంచం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. అంతేగానీ సంఘసేవ పేరుతో చేసేది కొంచం , అర్భాటాలు ఎక్కువ చేసేవారు మానవత్వ విలువలు కోల్పోయినట్లు . అది రాజకీయం అవుతుంది .  నిజమైన మానవత్వం గలవారు ఎదుటివారి పొగడ్తలు గురించి ఆలోచించరు. తమ పని తాము చేసుకుంటూ పోతారు.  వారికి భగవంతుడు ఎప్పుడూ తోడు గా ఉంటాడు . వారికి కష్టం వచ్చినప్పుడు ఏదో రూపంలో ఆదుకుంటాడు . 


 *శుభోదయం*

ఆలోచనాలోచనాలు

 👌ఆలోచనాలోచనాలు 👍 సంస్కృత సూక్తి సుధ 💐                                      ***** త్యజేదేకం కులస్యార్థే, గ్రామస్యార్థే కులం త్యజేత్! గ్రామం జనపదస్యార్థే, ఆత్మార్థే పృథివీం త్యజేత్!!                  ఒకడ వలన కులం చెడిపోతున్నదనుకొంటే ఆ ఒక్కడిని విడిచిపెట్టాలి. ఒక కులం వలన గ్రామానికి నష్టం ఏర్పడితే ఆ కులాన్ని వదిలెయ్యాలి. ఒక గ్రామం వలన రాజ్యానికి ఇబ్బందులు ఏర్పడితే ఆ గ్రామాన్ని విడిచిపెట్టాలి. తనకే , తాను ఉన్న భూమి వలన కష్టాలు కలిగితే దానిని వెంటనే వదిలెయ్యడం మంచిది.        ***** అహో ప్రకృతి నా దృశ్యం, శ్లేష్మణో దుర్జనస్యచ, మధురైః కోపమాయాతి , కటుకై రుపశామ్యతి!!                      దుర్జనుడు, శ్లేష్మం --- ఈ రెండూ స్వభావం చేత సమానవైనవి. ఎట్లాగంటే తియ్యటి పదార్థాలు తింటే శ్లేష్మం (కఫం) వృద్ధి చెందుతుంది. చేదు పదార్థాలు తినడం వలన శ్లేష్మం నశిస్తుంది.                   ***** యస్మిన్ దేశేన సన్మానో, నప్రీతిర్నచ బాంధవాః, న విద్యా నాస్తి ధనికో, నతత్ర దివసం వసేత్!!                                   గౌరవము, ప్రేమ, బంధువులు, విద్య, దానం చేసే ధనవంతులు ఉండరో అక్కడ బుద్ధిమంతుడైనవాడు ఒక్క రోజైనా ఉండకూడదు.( ఉంటే ప్రమాదమని భావం.)           ***** రాజవత్పుత్ర దారాశ్చ, స్వామి సన్మిత్ర బాంధవాః! ఆచార్య వత్సభామధ్యే , భాగ్యవంతం స్తువంతిహి!!     భాగ్యవంతుడైనట్లయితే భార్య, బిడ్డలు ప్రభువును గౌరవించినట్లు గౌరవిస్తారు. సభలయందు ఆచార్యుని వలె జనులు కీర్తిస్తారు. బంధువులు, స్నేహితులు యజమానిని కొలిచినట్లు కొలుస్తారు. కాబట్టి భాగ్యవంతుడికే ఈ లోకంలో నేడు గౌరవమర్యాదలు లభిస్తాయని కవి భావన.         ***** మాతా నిందతి, నాభినందతి పితా.                భ్రాతా న సంభాషతే, భృత్యః కుప్యతి, నానుగచ్ఛతి సుతః,              కాంతాపి నాలింగతే,                అర్ధ ప్రార్థన శంకయాన కురుతే సల్లాప మాత్రం సుహృత్, తస్మాదర్థముపార్జయ, శ్రుణు సఖేః, అర్థేన సర్వేవశాః!!                           ధనానికి ఎంతటి ప్రభావం ఉందో ఒకడు తన మిత్రునికి తెలియబరుస్తున్నాడు.         మిత్రమా! దరిద్రుణ్ణి తల్లి తిడుతుంది. తండ్రి సంతోషించడు. అన్నదమ్ములు మాట్లాడరు. సేవకులు కోపగించుకొంటూ ఉంటారు. కొడుకు వెంట రాడు. భార్య కూడా ప్రేమతో కౌగలించుకోదు. ఆఖరుకు ప్రాణస్నేహితుడు కూడా డబ్బు అడుగుతాడేమో అనే అనుమానంతో పలకరించకుండా, దూరంగా తప్పుకొని తిరుగుతాడు. కాబట్టి ధనాన్ని సంపాదించు. ధనం వలన అంతా నీ వశం అవుతారు.                         ***** ఆతురే నియమో నాస్తి  బాలే వృద్ధై తధైవచ, సదాచార రతే చైవ హ్యేష ధర్మ స్సనాతనః!!                            రోగగ్రస్తులకు, బాలురకు, ముసలివారికి, ఎల్లప్పుడూ మంచి ఆచారాలు పాటించేవారికి--- వీరికి వేరే నియమాలు అక్కరలేదు. ఇది పూర్వకాలం నుండి వస్తున్న ధర్మం.                      ***** గోమూత్ర మాత్రేణ పయో వినష్టం, తక్రస్య గోమూత్ర శతేన కిం వా, అత్యల్ప పాపైర్విపదశ్శుచీనాం, పాపాత్మానాం పాప శతేన కిం వా!!                                ఆవు పంచితం ఒక బొట్టు పడ్డా పాలు చెడిపోతాయి. అయితే గోమూత్రం ఎంత కలిసిన మజ్జిగకు చెరుపు లేదు. అట్లాగే పరిశుద్ధమైన సజ్జనులకు కొంచెం పాపం చేస్తేనే పెద్ద ఆపద సంభవిస్తుంది. కానీ ఘోరమైన పాపాలు చేసేవారికి , ఇంకా ఎన్ని పాపాలు చేస్తే మాత్రం నష్టం ఏముంటుంది? ( వెంటనే పాప ఫలితం కనబడదని కవి భావం.)                           ***** చివరగా ఒక చమత్కార శ్లోకం. ----            మహాకవి కాళిదాసు భోజ మహారాజుతో తెలియజేసినట్లు జనశ్రుతి.     దగ్ధం ఖాండవ మర్జునేనచ వృధా కల్పద్రుమై ర్భూషితం,    దగ్ధా వాయుసుతేన హేమరచితా లంకా వృధా స్వర్ణభూః,         దగ్ధ స్సర్వ సుఖాస్పదశ్చ మదనో హాహా! వృధా శంభునా,         దారిద్ర్యం ఘనతాపదం భువినృణాం కేనాపినో దహ్యతే!!                            కల్పవృక్షాలు గల ఖాండవ వనాన్ని అర్జునుడు , స్వర్ణభూమి అయిన లంకను ఆంజనేయుడు , అందరికీ సుఖాన్నిచ్చే మన్మథుణ్ణి శివుడు వృధాగా కాల్చివేశారు. కానీ అందరికీ ఇంత క్షోభను , కష్టాన్నీ, తాపాన్నీ కలుగజేసే దరిద్రాన్నెవరూ కాల్చివేయలేకున్నారు. ఓ భోజ మహారాజా! నీవైనా ఆ పని చెయ్యమని కోరుకొన్నాడు.( భోజుడు ఆ శ్లోక కర్తకు జీవనభృతులు ఏర్పరచాడని ప్రతీతి)               తేది 12--11--2023, ఆదివారం, శుభోదయం.

రాజకీయం

 రాజకీయాన

ఎన్ని..కలలో..

కళలో!.


అభ్యర్ధి ఎవరైతే

ఎటువైపు ఉంటే

ఏమి లాభం...


తూగే తూకం సరిపోలేదనో

లెక్క తప్పిందనో

గోడ దాటుతనం..

ఎన్నికల విచిత్రం.


పోరు పందెంలో

పరిగెత్తే గుర్రాల్లో

గెలుపు ఎవరిదో..


అదే సమయంలో అవకాశం కోసం

గోడ మీది దాగిన పిల్లులెన్నో...


కండువాలు మార్చి

రంగులు ఏమార్చి

పూటకొక్క పార్టీ

అదే 'గో-పి' సంగతి.


వల విసిరే పార్టీలు

కావడి మోసే ముఖ్యులు.


తైలం పూసే అభ్యర్ధులకు

అంతా అయో'మయమే.


గెలుపే లక్ష్యంగా

ఓటరు చుట్టూ ప్ర'దక్షణాలు..

కరుణించే దెవరినో....


అంతా రహస్యం...

గప్ చిప్..బ్యాలెట్ చిత్రం..


ఎన్నికల్లో...

ఎన్ని కలలో... 

ఎన్ని కళలో...


రంగు వేసే దగ్గరనుండి

రంగు పడే వరకు

అంతా రాజకీయ విచిత్ర విన్యాసం...


చివరికి...

గెలిచిన గుర్రమే

ప్రజాపాలనపై పెత్తనం..


డామిట్... 

కధ అడ్డం తిరిగింది.


ఎన్నిక రోజు రాజైన ఓటరేమో 

మరో ఐదేండ్లు అయ్యేను బానిస...


ఇక మొదలైంది

రంగుమార్చే ఊసరవెల్లి ''రాజకీయం."



అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

పూజాకార్యక్రమాల సంకల్పము.

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు 

ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.12.11..2023

ఆది వారం (భాను వాసరే) 

**************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతాు హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే చతుర్దశ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  ఆశ్వయుజ మాసే  కృష్ణ పక్షే   చతుర్దశ్యౌపరి అమావాస్యాయాం

భాను వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.06

సూ.అ.5.23

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

ఆశ్వయుజ మాసం 

కృష్ణ పక్షం చతుర్దశి మ. 1.51 వరకు. 

ఆది వారం. 

నక్షత్రం స్వాతి రా.తె.3.14 వరకు. 

అమృతం  రా. 9.56 ల   11.38 వరకు. 

దుర్ముహూర్తం సా. 3.51 ల 4.36 వరకు. 

వర్జ్యం ఉ.7.45 ల 9.27 వరకు. 

యోగం ఆయుష్మాన్ సా.5.24 వరకు.

కరణం శకుని ప.1.51 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం సా.4.30 ల 6.00 వరకు. 

గుళిక కాలం సా. 3.00 ల 4.30 వరకు. 

యమగండ కాలం మ.12.00 ల 1.30 వరకు. 

***********

పుణ్యతిధి లేదు. 

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

M3 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

పంచాంగం నవంబరు 12, 2023*

 శుభోదయం, నేటి పంచాంగం 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*ఆదివారం, నవంబరు 12, 2023*

 *శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

   *దక్షిణాయనం - శరదృతువు*

*ఆశ్వయుజ మాసం - బహళ పక్షం*

తిథి చతుర్దశి* మ1.48 వరకు

వారం : *ఆదివారం* (భానువాసరే)

నక్షత్రం :స్వాతి* తె3.00 వరకు  

యోగం:ఆయుష్మాన్* సా5.18 వరకు

కరణం : *శకుని* మ1.48 వరకు

తదుపరి *చతుష్పాత్* రా2.02వరకు

వర్జ్యం : *ఉ7.36 - 9.17*

దుర్ముహూర్తము : *సా3.51 - 4.36* 

అమృతకాలం: *సా5.43 - 7.24*                     

రాహుకాలం: *సా4.30 - 6.00*

యమగండ/కేతుకాలం : *మ12.00 - 1.30*

సూర్యరాశి: *తుల* || చంద్రరాశి: *తుల*

సూర్యోదయం: *6.06* || సూర్యాస్తమయం: *5.22*

  👉 *నరకచతుర్దశి & దీపావళి*

  మీకు, మీ కుటుంబ సభ్యులకు

 *దీపావళి శుభాకాంక్షలు*

*సర్వేజనా సుఖినో భవంతు * శు గోమాతనుపూజించండి_ *గోమాతను సంరక్షించండి_*

నరకచతుర్దశీ

 ॐ     నరకచతుర్దశీ - దీపావళీ శుభాకాంక్షలు 


    నరకాసురవధ జరిగాక, ఆనందంగా దీపావళి జరుపుకుంటాం. 


    మనలోని నరకుణ్ణి సంహరించి, జ్ఞాన సంపద పొంది, ఆత్మానందము అనుభవించడమే ఈ రెండు పండగల అంతరార్థం. 


నరక చతుర్దశీ - దీపావళీ సందేశం 


    నరకుడు భూ పుత్త్రుడు. భౌతిక సుఖాలతోనే గడుపువాడు. స్త్రీలను చెఱబట్టినవాడు. 

    ప్రాక్ (తూర్పు) జ్యోతిషపురవాసి. అంటే సూర్యాది నక్షత్రాలు కల్గిన అంతరిక్ష నివాసి అని అర్థం. 

    సూర్యునితో కూడిన నక్షత్రాల అంతరిక్షం అంటే, 

    సరియైన బుద్ధి ప్రేరేపించబడడం ద్వారా వచ్చే, ఆత్మ జ్ఞాన ప్రకాశం. 

    అది పొందకుండా, కేవలం భూ సంబంధమైన దైహిక సుఖలోలత్వం అధర్మంగా పొందితే, 

    నరకానికి తీసుకొనిపోయే నరకుని చర్యలే అవుతాయి. 

    అది తెలుసుకొని, మనలోని నరకాసురుణ్ణి సంహరిస్తే, 

    ఆత్మ జ్యోతితో వెలిగే మన జీవితాలు దీపావళి వెలుగులే!


ఆశ్వయుజం - ముగురమ్మలు 


    ఆశ్వయుజ మాసంలో శ్రీమాతను ముగురమ్మల రూపాలలోనూ ఆరాధిస్తాం.

    శరన్నవరాత్రులలో శక్తి స్వరూపిణిగా దుర్గాదేవిగా ఆరాధిస్తాము.

    అందులోనే మూలా నక్షత్రంనాడు విద్యాప్రదాతయైన సరస్వతీదేవిగా ఆరాధిస్తాము.

    ఈ మాసం చివరిలో దీపావళీ అమావాస్యనాడు లక్ష్మీదేవిగా ఆరాధిస్తాము.

    క్రియా - జ్ఞాన శక్తులు దుర్గా సరస్వతులు అనుగ్రహిస్తే, సంపద లక్ష్మీ అనుగ్రహం. 

    ఇచ్ఛా - క్రియా - జ్ఞాన శక్తులకు సంబంధించి ముగురమ్మల రూపాలలో ఉన్న జగన్మాత అనుగ్రహం పొందుదాం. 


                    *** 


ఈరోజు దీపావళి నాడు లక్ష్మీదేవిని కొలుద్దాం 


                  శ్రీమహాలక్ష్మ్యై నమః


శ్రుత్యై నమోఽస్తు శుభకర్మ ఫలప్రసూత్యై 

రత్యై నమోఽస్తు రమణీయ గుణార్ణవాయై I 

శక్త్యై నమోఽస్తు శతపత్ర నికేతనాయై 

పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమ వల్లభాయై ॥ 

      - కనకధారా స్తోత్రమ్ (ఆదిశంకరులు) 



తాత్పర్యం: 


* సకల శుభకర్మల ఫలాలని ప్రసాదించే వేదస్వరూపిణియు, 

* మహిమాన్వితమైన గుణములకు సాగరరూపిణియైన సౌందర్య(రతి)రూపిణియు, 

* నూరురేకుల పద్మమునందు నివశించు మహాశక్తి స్వరూపిణియు, 

*  పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువు భార్యయు, పుష్టిరూపిణియు అయిన లక్ష్మీదేవికి నమస్కారము.



                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం