15, మార్చి 2024, శుక్రవారం

Panchaag

 


సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:*

 *సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:* 

1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 

2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 

3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 

4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 

5. మొగిలీశ్వర్.

6. కోదండరామ దేవాలయం, కడప జిల్లా.


*నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:* 

1. మహానంది

2. జంబుకేశ్వర్ 

3. బుగ్గరామలింగేశ్వర్

4. కర్ణాటక కమండల గణపతి.

5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.

6. బెంగళూర్ మల్లేశ్వర్ 

7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం

8. సిద్ధగంగా


*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.* 

1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 

2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,  

3. మంజునాథ్.

*శ్వాస తీసుకునే* కాళహస్తీశ్వర్

*సముద్రమే వెనక్కివెళ్లే* 

1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 

2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.

*స్త్రీవలె నెలసరి* అయ్యే 

1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  

2. కేరళ దుర్గామాత.

*రంగులు మారే ఆలయం.* 

1. ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.

2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.

పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.


*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు* 

 1. కాణిపాకం,  

2. యాగంటి బసవన్న,  

3. కాశీ తిలభండేశ్వర్,  

4. బెంగుళూరు బసవేశ్వర్

5. బిక్కవోలు లక్ష్మీగణపతి


*స్వయంభువుగా* 

సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.

*ఆరునెలలకు ఒకసారి తెరిచే* 

1. బదరీనాథ్,  

2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)

3. గుహ్యకాళీమందిరం. 


*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు* 

హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.


*12 ఏళ్లకు ఒకసారి*

పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.


*స్వయంగా ప్రసాదం* 

1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.

2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం


*ఒంటి స్తంభంతో*

యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.


*రూపాలు మారే*

ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.


*నీటితో దీపం వెలిగించే* ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.

*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు* 

1. హేమాచల నరసింహ స్వామి.

2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి


*మనిషి వలె గుటకలు*  

వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.


*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.* 


*ఛాయా విశేషం* 

1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.

2. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.

3. బృహదీశ్వరాలయం


*నీటిలో తేలే* విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ), నేపాల్


*ఇంకా...* 

తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్, కంచి, 

చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం, అన్నవరం etc


*పూరీ* 

పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం.


ఇవి తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే.

దానము చేయుటతో

 🌸🌸 *సుభాషితమ్* 🌸🌸


దానేన పాణిర్న తు కంకణేన 

స్నానేన శుద్ధిర్న తు చన్దనేన|

మానేన తృప్తిర్న తు భోజనేన 

జ్ఞానేన ముక్తిర్న తు ముణ్డనేన||


చేయి దానము చేయుటతో శోభించును, కంకణధారణ వలన గాదు. శరీరము స్నానముతో శుద్ధినొందును, కేవలము మంచిగంధము పూయుటతో కాదు.  చేసిన గౌరవాభిమానములతో తృప్తి కలుగును, పెట్టిన భోజనము వలన కాదు. జ్ఞానముతోనే ముక్తి లభించును, శిరోముండనము వలన గాదు

పలుపు తాడు

 

పలుపు తాడు

ప్రస్తుత సమాజంకు పలుపు తాడు అంటే ఏమిటో తెలియదు కానీ గ్రామీణ జీవనం చేసే వారికి పలుపు తాడు చిరపరిచయం వున్న మాట. పలుపు తాడు అంటే పశువులను కట్టేసే త్రాడు. ఇది ఒకవైపు పశువు మెడ చుట్టూ కట్టే విధంగా ఉండి మరొకవైపు ఒక గుంజకు (స్తంబానికి )కట్టటానికి వీలుగా ఉంటుంది. పలువు మేడలో తాడు కట్టి గుంజకు కట్టి వున్నట్లయితే పశువు కొట్టాన్ని (షెడ్డు) వదలి వెళ్ళదు . ఉదయం గోపాలుడు వచ్చి పలుపు తాడును తీసి పశువులను మేపటానికి అడవికి తీసుకొని వెళ్లి మరల సాయంత్రం వచ్చి కొట్టంలో గుంజకు కట్టివేయటం రైతుల దినచర్య. పలుపు తాడు పరిధిలోనే పశువులు సంచరించగలవు అంటే త్రాడు నిడివికన్నా దూరంగా అవి వేళ్ళ లేవు. వాటి ముందు మేత (గడ్డి) కుడితి ఏర్పాటు చేసి రైతు వెళతాడుఅవి వాటికి ఆకలి వేసినప్పుడు గడ్డి తిని కుడితి తాగుతాయి.

ఒక రోజు ఒక రైతు తన వద్ద వున్న ఒక పశువుకు పలుపు తాడు కట్టడానికి ప్రయత్నిస్తే తాడు రోజు పసువు మల మూత్రాదులతో తడిసి ఉన్నందున చీకి తెగిపోయి వున్నది. మిగిలిన తాడును కలిపి ముడి వేయ ప్రయత్నిస్తే అది చాలా పోట్టిగా వుంది. ఇక పశువుకు వేరే తాడు కట్టటం  మినహా ఇంకొక మార్గం లేకపోయింది. సమయానికి అతని వద్ద ఇంకొక త్రాడు లభ్యం కానందువల్ల ఏమి చేయాలా అని అలోచించి అక్కడ వున్న కొన్ని గడ్డి పోచలను పశువు మెడచుట్టు త్రాడు కట్టినట్లుగా త్రిప్పినాడట. మరుసటి రోజు గోపాలుడు వచ్చి పశువుకు త్రాడు లేకపోవటం గమనించి దానిని తోలుకొని పోవటానికి ప్రయత్నిస్తే అది అక్కడి నుండి కదలటం లేదు. ఇదేమి ఆశ్చర్యం మేడలో పలుపు లేనే లేదు కానీ పశువు మాత్రం కదలటం లేదు అని రైతుకు చెపితే అప్పుడు రైతుకు గత దినం తానూ చేసిన పని గుర్తుకు వచ్చి మరల కొన్ని గడ్డి పోచలను తీసుకొని దాని మెడచుట్టు త్రాడు విడతీస్తున్నట్లు త్రిప్పాడట అప్పుడు పశువు అక్కడినుండి కదిలి గోపాలునితో అడవికి వెళ్ళింది. నిజానికి అప్పటిదాకా పశువు తన మెడకు పలుపు తాడు లేకపోయినా ఉన్నట్లు భ్రాంతిలో ఉండీ వుందిఅందుకే అక్కడినుండి కదల లేదు.

సాధక మిత్రమా నిజానికి ప్రతి సాధకుడు కూడా కేవలం పశువు లాగానే ఆలోచిస్తున్నాడు. తన మెడకు పలుపు తాడు లేకపోయినా ఉన్నట్లు భ్రాంతిలో ఉండీ వుంటున్నారు.ప్రతి మనిషి చెరా చెర ప్రపంచంలోకి అంటే జగత్తులోకి ఒంటరిగానే వస్తువున్నాడు. అంతే  కాదు జగత్తుని నిష్క్రమించే వేళ ఒంటరిగా వెళుతున్నాడు. ఇంకొక విషయం ఏమిటంటే తానూ ఉన్నన్ని రోజులు ఇది నాది అది నాది వీరు నా వాళ్ళు నా భార్య నా భర్త నా పిల్లలు నా సోదరులు నా సోదరీమణులు అని భావిస్తూ ఒక గిరి గీసుకొని బ్రతుకుతున్నారు. రకంగా అయితే పశువు తన మెడకు పలుపు తాడు ఉండి దాని పరిధిలో ఉంటున్నట్లు. నిజానికి పశువు తన మెడకు పలుపు లేకపోయినా రైతు తెలివిగా దానికి పలుపు తాడు ఉన్నట్లు బ్రాంతిని కలుగచేస్తే అదే నిజమని అనుకొని పలుపుకు కట్టుబడి ఉన్నట్లు. మనము కూడా భగవంతుడు కల్పించిన శారీరిక బంధాలను శాశ్వితమైన బంధాలు అని అనుకోని వాటి పరిధిలోనే ఉండటమే కాకుండా వాటివరకు పరిమితం అయి అవే శాశ్వితం అని అనుకోని వాటి వెంటే జీవితాన్ని గడిపి అమూల్యమైన కాలాన్ని వృధా చేస్తూ విలువైన మానవ జీవితాన్ని శాశ్వితము నిత్యమూ అయినా బ్రహ్మపదం వైపు నడపకుండా మరల జీవన మరణ చక్రంలో పరిబ్రమిస్తూవున్నాము. నిజానికి సాధకునికి సంసారం ఒక బంధనం కానే కాదు. ప్రతి సాధకుడు సాధారణ సంసారిక జీవనం చేస్తూ మోక్ష పదాన్ని చేరుకోవచ్చు.

 

కాకపొతే సాధకుడు గమనించవలసిన విషయం ఏమిటంటే తన సాధనకు ఏవి ఏవి అవరోధాలుగా ఉంటున్నాయి అని తెలుసుకొని  తెలివిగా అధిగమించాల్సి ఉంటుంది.

త్రివిధ అవరోధాలు. ప్రతి సాధకుడు మూడు విధములైన అవరోధాలను అధిగమించవలసి ఉంటుందని మన మహర్షులు వక్కాణించారు

1) ఆద్యాత్మికం: అంటే సాధనకు సాధకుని శరీరం సహకరించక పోవటం. ఉదాహరణకు సాధకుడు అనారోగ్యంతో ఉంటే శరీరము సాధనకు సహకరించదు. అంతే కాక బద్దకం అంటే తామస ప్రవ్రుత్తి కలిగి వున్నా సాధనకు ఉపక్రమించలేడు.

2) అది భౌతికము అంటే తన చుట్టు ప్రక్కల పరిసరాలు ప్రజలు తన సాధనకు అవరోధం కలిగించటం. అంటే సాధకుడు సాధనకు ఉపక్రమించినప్పుడు ఎక్కడో యేవో ధ్వనులు, లేక పరిసరాలలో కాలుష్యలో ఇతరులు లేక ఇతర జంతువులు కలిగించటం మొదలైనవి. ఇటీవల సాధకుడు ఇంకొక విషయాన్ని కోవకు చెందినదిగా తెలుసుకున్నాడు. ఎవరో మిత్రుడు భక్తి మార్గంలో వెళుతుంటాడు. మంచిదే కానీ తానూ అంతటితో ఆగడు సాధకుని మిత్రుడు అవటం చేత సాధకుని నిరుత్సాహపరుస్తాడు ఎలాగంటె కలి యుగంలో జ్ఞ్యాన మార్గంతో పనిలేదు  కేవలం స్మరణాత్ ముక్తిహి అని అన్నారు కాబట్టి నీవు కూడా నామ స్మరణ చేయి లేక ఇంకొక నోమో వ్రతమో, యజ్ఞమో చేయి అని తాను చేసిన చేస్తున్న దైవ కార్యాన్ని వివరించి అది ఆచరించమని ప్రబోధిస్తూ వుంటారు. వారి మాట వినక పొతే నీకు ఏమాత్రం భక్తి లేదు అందుకే నేను చెప్పింది వినటం లేదు అనో లేక నీవు కేవలం డాంబికుడివే నీకు ఏమి తెలియకపోయిన అన్ని తెలుసు అని తలుస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఇతరులను త్రప్పుడు తోవలో సూచనలిస్తున్నావు అని హెచ్చరించాను కూడా వచ్చును. ఇవన్నీ ఎందుకు చెపుతున్నానంటే ప్రస్తుత సమాజంలో మన గురుదేవులు ఆది శంకరులు బోధించిన అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకొని ఆచరించే శక్తి లేకపోవటమే వీటన్నిటికీ కారణాలుఎవరు ఏమి అన్న వాటిని వీటిని లెక్కలో పెట్టుకోకుండా సాధకుడు నిత్యం తన సాధనతో బ్రహ్మ పదాన్ని చేరవలసి ఉంటుంది. అనితర సాధన చేస్తే కానీ మోక్షాన్ని పొందలేరు.

ఇక మూడవ అవరోధాన్ని అది దైవికము అని అంటారు అవి ఏమిటంటే ప్రక్రుతి వలన ఏర్పడే బీబత్సవాలు ఉదాహరణకు తీవ్ర వానలు, తుఫానులూ భూకంపాలు ఇతర ప్రళయాలు. వాటిని మనం అదుపులో వుంచుకోలేవు. కానీ జాగ్రత్త వహిస్తే మొతటి రెండు అవరోధాలను సాధకులు అదుపులోకి తీసుకొని రావచ్చు.

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు మీ

భార్గవ శర్మ