🌸🌸 *సుభాషితమ్* 🌸🌸
దానేన పాణిర్న తు కంకణేన
స్నానేన శుద్ధిర్న తు చన్దనేన|
మానేన తృప్తిర్న తు భోజనేన
జ్ఞానేన ముక్తిర్న తు ముణ్డనేన||
చేయి దానము చేయుటతో శోభించును, కంకణధారణ వలన గాదు. శరీరము స్నానముతో శుద్ధినొందును, కేవలము మంచిగంధము పూయుటతో కాదు. చేసిన గౌరవాభిమానములతో తృప్తి కలుగును, పెట్టిన భోజనము వలన కాదు. జ్ఞానముతోనే ముక్తి లభించును, శిరోముండనము వలన గాదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి