15, మార్చి 2024, శుక్రవారం

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 55*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 160*


*అన్నము తినువేళ నాత్మరుచుల గోరు*

*టదియు నాల్క సెప్ప నడుగు మనసు*

*నాత్మకు దృణమైన నయ్యయ్యో యనరాదు*

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

అన్నము తినేవేళ , నాలిక రుచులుకోరును మనసు తృప్తి చెందునట్లు భోజనము చేయవలెను.

అన్నం పొట్టలో ప్రవేశించిన తరువాత ఆత్మ ఏ రుచులను కోరదు గదా !


*💥వేమన పద్యాలు -- 161*


*అన్నము నమృతమును నంటు నంటనుచును*

*బరిహరింత్రు దెలియ బడక ద్విజులు*

*యన్నమమృత మివియ హరిహర బ్రహ్మలు*

*యంటవన్న వాని కంటు వేమా !*


*🌹తాత్పర్యము --*

బ్రాహ్మణులు అన్నమును అమృతమని అంటూంటారు.

అన్నము అమృతము , హరిహర బ్రహ్మస్వరూపమని తెలియలేరు.


*💥వేమన పద్యాలు -- 162*


*అన్నయనగ నెవరొ యది తెలియగజూడ*

*తనకు ముందు బుట్టి తనరు చుండె*

*యన్నవంటివాడు హరుడౌను గురుడౌను*

*మిన్ను మన్ను మాడ్కి మెరయు వేమా !*


*🌹తాత్పర్యము --*

తనకు ముందు పుట్టినవాడే అన్న , ఆ అన్నయే హరుడును , గురుడని తెలియుము.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: