15, మార్చి 2024, శుక్రవారం

*షష్ఠ స్కంధం

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*షష్ఠ స్కంధం*


*కొందరు పుణ్యవర్తనులు గోపకుమార పదారవింద జా*

*నంద మరందపాన కలనా రత షట్పదచిత్తు లౌచు, గో*

*వింద పరాయణుల్ విమలవేషులు దోష మడంతు రాత్మలం*

*జెందిన భక్తిచేత రవి చేకొని మంచు నడంచుకై వడిన్.*


రాజా ! లోకంలో కొందరు సర్వకాలాలలో పుణ్యకార్యాలే చేస్తూ ఉంటారు. వారి నడవడి అంతా పవిత్రంగానే ఉంటుంది. వారు గోపకుమారుడున్నాడే! అదేనయ్యా కృష్ణయ్య! ఆయన పాదాలను పద్మాలుగా భావించి అందునుండి జాలువారే ఆనందం అనే మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆ స్థితిలో వారి హృదయం తుమ్మెదవంటిదవుతుంది. ఆ విధంగా గోవిందుడే పరమగతి అన్నభావనలో నిశ్చలంగా ఉండే భక్తులు స్వచ్ఛమైన వేషం తాల్చి పాపాలను పటాపంచలు చేసుకుంటారు. వారి ఆత్మలలో చక్కగా కుదురుకొన్న భక్తిచేత, సూర్యుడు మంచును అణచివేసినట్లుగా, పాపాలను బాపుకుంటారు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

కామెంట్‌లు లేవు: