15, మార్చి 2024, శుక్రవారం

లక్ష్మీగణపతి

 ప్ర: 'లక్ష్మీగణపతి' అంటే ఏమిటి? లక్ష్మి విష్ణువు పత్ని కదా. గణపతితో ఉన్న లక్ష్మి ఎవరు?


జ: ఆ లక్ష్మి వేరు. ఈ లక్ష్మి వేరు. ఇవన్నీ మంత్రశాస్త్ర విషయాలు. ఉపాసనా రహస్యాలు. 'లక్ష్మి' అంటే గ్రహణ శక్తి. ప్రతి దేవతకీ ఆ దేవతాశక్తే లక్ష్మి. ఐశ్వర్యమే లక్ష్మి. ఆ దైవం యొక్క శక్తే. ఆ దైవానికి ఐశ్వర్యం. కాబట్టి ఆ దైవశక్తిని 'లక్ష్మీ' అన్నారు. విష్ణుపత్ని లక్ష్మికీ, గణపతిశక్తి లక్ష్మికీ భేదం ఉంది. వీటిని పౌరాణికంగా వ్యాఖ్యానించనవసరం లేదు. మంత్రోపాసనలో భాగాలివి. ఉపాస్య దైవంలో సర్వ దేవతా శక్తులూ ఉంటాయి. ఆ విధంగా పరాశక్తి 'లక్ష్మి' పేరుతోనున్న గౌరిగా శివాంకంలో ఉన్నట్లు తంత్ర శాస్త్రం వర్ణిస్తోంది.

కామెంట్‌లు లేవు: