23, డిసెంబర్ 2025, మంగళవారం

అన్నియు గల లోకంబున

 *2318*

*కం*

అన్నియు గల లోకంబున

సన్నుతమతి మంచినిగని సజ్జనుడయ్యున్.

చెన్నటి వారలెయందలి

చిన్న చెడులనాలకించి చెడునిట సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అన్నియునూ ఉన్న ఈ లోకంలో మంచి మనస్సు ఉన్న వారు మంచినే చూచి మంచివారిగా వెలుగుతారు. వ్యర్ధమైనవారు అందులో ఉన్న చిన్న చెడులనే ఆలకించి చెడిపోయెదరు.

*సందేశం*:-- ఈ లోకంలో అన్నీ ఉంటాయి, కానీ అది చూసేవాడి మనస్సును బట్టియే మంచి, చెడుగా గుర్తించబడుతుంది. మంచి మనస్సు ఉన్నవారి కి మంచియే పెద్దగా కనబడుతుంది, చెడ్డ మనస్సు ఉన్న వారికి చెడ్డ యే పెద్ద గా కనబడుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మంకీ ట్రాప్*

 


                 *మంకీ ట్రాప్*

                  ➖➖➖✍️```

(నాన్ పొలిటికల్)సైకాలజీ..అంశం 


ఇటీవల మూడు రోజుల క్రితం చదివిన ఒక చిన్న వార్త... మెదడు నుండి బయటికి పంపించేసినా.. పదేపదే మళ్ళీ వచ్చి మది తలుపు తడుతూనే ఉంది.. ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది.


భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పోస్టుమార్టం లో తేలింది ఏమిటంటే, అతను 14 రోజుల నుంచి భోజనం లేదు... 

అంటే ఆకలి మరణం. 

ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమి కాదు, కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే బిక్షగాడి జోలిలో కానీ సంచిలో కానీ అక్షరాల మొత్తము 1లక్ష 34 వేల రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను. “బిచ్చగాడి దగ్గర భారీ మొత్తమని.”  


ఇక్కడ బాగా గుంజి పడేస్తున్న విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న బిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అదీ తన ప్రాణం పోతున్నా.. 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు.. తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి ఈ మనస్తత్వం ? ఇటువంటి దౌర్భల్యం మనందరిలో కూడా ఉంటుందా? అంటే.. అవుననే చెబుతుంది ‘మానసిక శాస్త్రము.’


ఈ విషయం చదవగానే నాకు మొదట గుర్తు వచ్చిన విషయము “మంకీట్రాప్” 


అవును ఆఫ్రికాలోని ఒక తెగ వారు కోతులను వేటాడటానికి చెట్టు తొర్రలో కానీ, పుట్టలో కానీ, ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో... ఖచ్చితంగా కోతి చేయపట్టే అంత రంధ్రం చేస్తారు. ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కోతి చేయి పట్టే అంత పెద్దదిగా మరియు.. కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది.. 


ఇక ఈ రంధ్రంలో కోతి కి కావలసిన అరటికాయనో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశ పడిన కోతి రంధ్రములో చేయి పెట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేక పోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగ వారు ఆ కోతిని పట్టుకుంటారు. 


గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న... ప్రమాదం పొంచి ఉన్న.. కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది. తాను పట్టుకొన్నది వదలలేక పోతుంది.

చివరికి దొరికిపోతుంది. 

దీన్నే సింపుల్ గా మంకీ ట్రాప్ అంటాము.


నిజంగా మనకి ప్రమాదమని.. నష్టమని తెలిసినప్పటికినీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతున్నామా? 


అయితే ఇటువంటి మంకీ ట్రాప్ లో మనం ఉన్నట్లే.. 


రోజువారి కష్టపడి సంపాదించుకున్న కూలీ డబ్బులను దాచిపెట్టుకొని ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు ఒప్పుకోకుండా తనువు చాలించిన వారు నాకు చాలా మంది తెలుసు.


నిజంగా డబ్బు అంతగా కట్టి పడేస్తుందా అంటే..డబ్బు కాదుకాని మన తత్వం మనల్ని ట్రాప్ లో పడేస్తుంది.  


నిశితంగా ఇంకా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది..... 


చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము .. *మనకు తెలియకుండానే మనమూ అదే ట్రాప్ లో ఉన్నామనిపిస్తుంది. 


ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికీ ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేము? 

ఒక మాట పంతానికి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లు మనలో లేరా?

వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్ఠలంటూనో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు నాకు బాగా తెలుసు. మేము పరాజితులమని వాళ్లే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు.


అందుకే చిన్న మోతాదులో కానీ పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్ లో ఏమైనా ఉన్నామేమో చూసుకోవాలి. 


అది బంధం కావచ్చు డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు.. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. 


అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం.


మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు,  

నో అని చెప్పలేని మోహమాటాలు, తిరిగి అడగలేని అప్పులు, దండించలేని ప్రేమలు...

ఊపిరి సలపనివ్వని పనులు,  

ఒత్తిడి పెంచే కోరికలు, ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు, పేరు ప్రఖ్యాతుల కోసం పరుగులు.. ఇలాంటివన్నీ మంకీ ట్రాప్ లే.


మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్లు “వదలటం గొప్పా? పట్టుకోవడం గొప్పా?”


*కొన్ని సార్లు వదిలేయడమే గొప్ప. 


రామాయణంలో రావణుడు సీతను వదిలేసి ఉంటే ప్రాణాలతో బతికేవాడు.. 


మంకీ ట్రాప్... మనందరికీ ఉంటుంది.✍️

-కే. రవీందర్ పటేల్, RSS

సనాతన హిందూ``` 

🧡 జై భారత్ 🇮🇳 జై హింద్ 💚

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


ముక్కు వెనుక వైద్య శాస్త్రానికే

 మనందరి ముక్కు వెనుక వైద్య శాస్త్రానికే తెలియని కొత్త అవయవం కనిపించిందా ??!! 

- అవును కనిపించింది.! ఇది సత్యం మీరు ఊపిరి తీస్తున్నంత నిజం.!!!  

.

ఆ వివరాలోకి మనం వెళితే... 

కొన్ని శతాబ్దాలుగా మనకు తెలిసిన మానవ శరీర నిర్మాణ శాస్త్రంలో (Anatomy) ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. నెదర్లాండ్స్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు మన ముక్కు వెనుక భాగంలో ఒక కొత్త జత లాలాజల గ్రంథులను కనుగొన్నారు.


1. ఇది ఎలా బయటపడింది?

సాధారణంగా చేసే శస్త్రచికిత్సల్లో ఇవి కనిపించలేదు. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి ఉపయోగించే PSMA PET-CT అనే అత్యాధునిక స్కాన్ ద్వారా వీటిని గుర్తించారు. ఈ స్కాన్ చేసినప్పుడు లాలాజల గ్రంథులు స్పష్టంగా మెరుస్తాయి. అలా 100 మంది రోగులను పరీక్షించినప్పుడు, అందరిలోనూ ముక్కు వెనుక భాగంలో ఒకే చోట ఈ కొత్త గ్రంథులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు.


2. వీటి పేరు మరియు ఉనికి

పేరు: వీటికి "టుబేరియల్ లాలాజల గ్రంథులు" (Tubarial Salivary Glands) అని పేరు పెట్టారు.


పరిమాణం: ఇవి సుమారు 1.5 అంగుళాల (3.9 సెంటీమీటర్లు) పొడవు ఉంటాయి.


స్థానం: ముక్కు లోపలి భాగం మరియు గొంతు కలిసే చోట (Nasopharynx), పుర్రెకు దగ్గరగా ఇవి దాగి ఉన్నాయి.


3. ఇన్నాళ్లూ ఇవి ఎందుకు కనిపించలేదు?

ఈ గ్రంథులు చాలా లోతైన భాగంలో, ఎముకల మధ్య అమరి ఉండటం వల్ల సాధారణ అల్ట్రాసౌండ్ లేదా MRI స్కాన్‌లలో ఇవి స్పష్టంగా తెలియవు. కేవలం ఆధునిక రేడియోధార్మిక స్కాన్‌ల వల్లనే వీటి ఉనికి ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది.


4. దీని వల్ల కలిగే ప్రధాన వైద్య ప్రయోజనం

ఈ ఆవిష్కరణ ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు ఒక వరం లాంటిది:


రేడియేషన్ నుండి రక్షణ: తల లేదా మెడకు క్యాన్సర్ వచ్చినప్పుడు ఇచ్చే రేడియేషన్ థెరపీలో, ఈ గ్రంథులు ఎక్కడున్నాయో తెలియక వైద్యులు వాటిపై కూడా రేడియేషన్ ఇచ్చేవారు.


దుష్ప్రభావాల నివారణ: ఆ గ్రంథులు దెబ్బతినడం వల్ల రోగులకు నోరు ఆరిపోవడం (Dry mouth), ఆహారం మింగలేకపోవడం, మాట్లాడటానికి ఇబ్బంది కలగడం వంటి సమస్యలు వచ్చేవి.


మెరుగైన చికిత్స: ఇప్పుడు వీటి ఉనికి తెలిసింది కాబట్టి, రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఈ భాగానికి నష్టం కలగకుండా వైద్యులు జాగ్రత్త పడవచ్చు. తద్వారా క్యాన్సర్ చికిత్స తర్వాత రోగులు త్వరగా కోలుకుంటారు.


ఈ పరిశోధన ఎలా జరిగింది?

నెదర్లాండ్స్‌లోని వైన్ వోగెల్ (Wouter Vogel) మరియు మ్యాథైస్ వాల్‌స్టార్ (Matthijs Valstar) అనే ఇద్దరు పరిశోధకులు ఈ ఆవిష్కరణకు నేతృత్వం వహించారు. వీరు వందలాది స్కాన్‌లను పరిశీలించడమే కాకుండా, ఈ కొత్త గ్రంథుల ఉనికిని నిర్ధారించడానికి మృతదేహాలను (Cadavers) చాలా సూక్ష్మంగా విడదీసి (Dissection) పరీక్షించారు. ఆ పరీక్షలో ఆ గ్రంథులు ముక్కు వెనుక భాగంలోని కణజాలానికి అతుక్కుని ఉండటం గమనించారు.


ఇది అధికారికంగా ఆమోదించబడిందా?

అవును, ఈ పరిశోధన ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ జర్నల్ 'రేడియోథెరపీ అండ్ ఆంకాలజీ' (Radiotherapy and Oncology) లో ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనాటమీ నిపుణులు ఇది ఒక ముఖ్యమైన ఆవిష్కరణగా గుర్తించారు.


మన శరీరంలో ఉండే ఇతర లాలాజల గ్రంథులు:

ఈ కొత్త గ్రంథులతో కలిపి ప్రధాన లాలాజల గ్రంథుల జాబితా ఇప్పుడు ఇలా ఉంది:


పరోటిడ్ గ్రంథులు (Parotid glands): ఇవి చెవుల కింద ఉంటాయి.


సబ్‌మాండిబ్యులర్ గ్రంథులు (Submandibular glands): ఇవి దవడ కింద ఉంటాయి.


సబ్‌లింగువల్ గ్రంథులు (Sublingual glands): ఇవి నాలుక కింద ఉంటాయి.


టుబేరియల్ గ్రంథులు (Tubarial glands): ముక్కు వెనుక భాగంలో కొత్తగా కనుగొన్నవి.


ఇవే కాకుండా మన నోటి లోపల సుమారు 1,000 వరకు చిన్న చిన్న లాలాజల గ్రంథులు (Minor salivary glands) విస్తరించి ఉంటాయి.


ఈ ఆవిష్కరణ ఎందుకు అంత ఆశ్చర్యపరిచింది?

గత 200-300 ఏళ్లుగా మానవ శరీరంపై ప్రతి అంగుళం పరిశోధన జరిగిందని మనం భావించాం. ఆధునిక వైద్యశాస్త్రంలో ఇలాంటి ఒక ప్రధాన భాగం ఇన్నాళ్లూ కనుగొనబడకుండా ఉండటం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము  - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం - తృతీయ - శ్రవణం -‌‌  భౌమ వాసరే* (23.12.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*