*2318*
*కం*
అన్నియు గల లోకంబున
సన్నుతమతి మంచినిగని సజ్జనుడయ్యున్.
చెన్నటి వారలెయందలి
చిన్న చెడులనాలకించి చెడునిట సుజనా.
*భావం*:-- ఓ సుజనా! అన్నియునూ ఉన్న ఈ లోకంలో మంచి మనస్సు ఉన్న వారు మంచినే చూచి మంచివారిగా వెలుగుతారు. వ్యర్ధమైనవారు అందులో ఉన్న చిన్న చెడులనే ఆలకించి చెడిపోయెదరు.
*సందేశం*:-- ఈ లోకంలో అన్నీ ఉంటాయి, కానీ అది చూసేవాడి మనస్సును బట్టియే మంచి, చెడుగా గుర్తించబడుతుంది. మంచి మనస్సు ఉన్నవారి కి మంచియే పెద్దగా కనబడుతుంది, చెడ్డ మనస్సు ఉన్న వారికి చెడ్డ యే పెద్ద గా కనబడుతుంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి