19, జనవరి 2025, ఆదివారం

పంచాంగం 19.01.2025 Sunday

 ఈ రోజు పంచాంగం 19.01.2025 Sunday


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతువు పుష్య మాస కృష్ణ పక్ష పంచమి తిథి భాను వాసర ఉత్తరఫల్గుణి నక్షత్రం అతిగండ యోగః: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30  వరకు.



శుభోదయ:, నమస్కార:

పోతనగారి దర్శనం-ప్రదర్శనం !!

 శు భో ద యం 🙏


పోతనగారి దర్శనం-ప్రదర్శనం !!


వినువీధిన్ జనుదేరఁగాంచిరమరుల్

విష్ణున్ సురారాతి జీ

వనసంపత్తినిరాకరిష్ణుకరుణావర్ధిష్ణుయోగీంద్రహృ

ద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజనబృంద ప్రాభవాలంకరి

ష్ణునవోఢల్లసదిందిరా పరిచరిష్ణున్

జిష్ణు రోచిష్ణునిన్;

      బమ్మెఱపోతనకవితలోని కథాకథన

దక్షత అపూర్వమైనది. 


 .గజేంద్రమోక్షణమున భక్తరక్షణాపరాయణుడైనపరమాత్మ శ్రీమన్నారాయణుడు వైకుంఠమునుండి

వేగముగా వచ్చుసందర్భమున ఆఘట్టమును పోతనచిత్రించినతీరు.నాన్యతోదర్శనీయమైయున్నది.అదియతని కథాదర్శనము.కవితాప్రదర్శనమునకు నిదర్శనమై, అపురూపముగా మారినది.


తొలుత నారాయణుని రాకలోనివేగమును సూచించుటకైఅంత్యానుప్రాసలతోకూడిన లయాత్మకమైనవిన్యాసములతో పద్యమునలంకరించి, చివరకు కొత్తపెళ్ళికూతురుపమించులక్ష్మితోగూడి

సతీసమేతముగావచ్చునారాయణుని దర్శనమును ప్రదర్శనమొనరించినాడు.

      

    ఆసుందరదృశ్యమును దేనతలుకనులార 

కనుగొని" 

యల్లవాడెహరి,పజ్జంగంటిరే లక్ష్మి,శంఖంబల్లదె,చక్రంబల్లదె భుజంగధ్వంసియున్వాడె, చ

య్యన నేతెంచెనటంచువేల్పులు నమోనారాయణాయేతి" ని

స్వనులై ,మింటహస్తిదురవస్థావక్రికిన్ జక్రికిన్!మ్రొక్కిరట!"-

      ఆవిధముగా వినువీధిలో సపరివారుడై అరుదెంచునారాయణునిఅమరులుదర్శించి నమస్కరించినారు.

          చూడముచ్చటగా నున్నదిగదా

పోతనగారి దర్శనము-ప్రదర్శనము.

మదిలో హత్తుకు పోయినది.🙏🌷🌷🌷