4, జులై 2021, ఆదివారం

🙏విశ్వ నటచక్రవర్తి రంగారావు🙏

 🙏🙏🙏విశ్వ నటచక్రవర్తి రంగారావు🙏🙏🙏


సినిమాల్లో నవరసాలు అత్యద్భుతంగా పండించిన ఎస్‌.వి.రంగారావు చలనచిత్ర రంగ ప్రవేశం అంత సజావుగా సాగలేదు. ‘పాతాళభైరవి’ సినిమా విడుదలయ్యేదాకా రంగారావు సినిమారంగంలో నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డారు. నటన మీద మోజుతో చేతికందిన ఉద్యోగాలు కూడా వదులుకున్నారు. తొలిరోజుల్లో రంగారావు నటజీవితం వడ్డించిన విస్తరి కాదు. దాదాపు 300 చిత్రాలకు పైగా నటించిన వాటిలో జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, సాంఘికాలు వున్నాయి. కుటుంబకథా చిత్రాలే కాదు, డిటెక్టివ్‌ చిత్రాల్లో కూడా రాణించిన రంగారావు తొలి సినిమాలో నటించడానికి అనేక ఇబ్బందులు, ఆటుపోట్లతోబాటు అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. ఆ నటసార్వభౌముడు తదనంతరకాలంలో పాత్రలను మించి ఎదిగి నటించారు. రౌద్రం, వీరం, అద్భుతం, కరుణ రసాలను అలవోకగా పండించిన ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన నటప్రస్థానాన్ని పరికించి చూద్దాం....


* నటసార్వభౌముని తొలిరోజులు...


ఎస్‌.వి.రంగారావుగా పిలుచుకునే సామర్ల వెంకట రంగారావు 1918 జూలై 3న కృష్ణా జిల్లా నూజివీడులో వారి పితామహుని ఇంటిలో జన్మించారు. రంగారావుకు నలుగురు అన్నదమ్ములు, ఎనమండుగురు అక్కచెల్లెళ్ళు. సంసారం పెద్దది. అందరూ తాత ఇంట్లోనే పెరిగారు. తాత డాక్టర్‌ కోటయ్య నాయుడు నూజివీడులో పెద్ద శస్త్రచికిత్సా నిపుణుడుగా పేరు గడించారు. ఆయన గొప్ప సంఘ సంస్కర్త, బ్రహ్మసమాజ సానుభూతిపరుడు. ప్రముఖ తెలుగు చలనచిత్ర పితామహుడుగా కీర్తించబడే రఘుపతి వెంకటరత్నం నాయుడుకు రంగారావు తాత చాలా సన్నిహితుడు. రంగారావు తల్లి లక్ష్మీనరసమ్మ గృహిణి. తండ్రి కోటేశ్వరరావు నాయుడు ఎక్సైజు ఇనస్పెక్టరు ఉద్యోగం చేసేవారు. ఆయన కూడా బ్రహ్మసమాజ కార్యకర్తే. దేవులపల్లి కృష్ణశాస్త్రికి రంగారావు తండ్రి సహాధ్యాయి. ఉద్యోగరీత్యా తండ్రి ఊళ్లు మారుతుండడంతో రంగారావు ఆలనా పాలనా నూజివీడులో తాత ఇంటనే సాగింది. రంగారావుకు రెండేళ్ల వయసున్నప్పుడు తాత మద్రాసుకు మకాం మార్చారు. హైస్కూలు చదువుకు రాకముందే తాత మద్రాసులో మరణించారు. నాయనమ్మ గంగారత్నం సంరక్షణలోనే రంగారావు మద్రాసులో పెరిగారు. మద్రాసు ట్రిప్లికేన్‌లోని హిందూ హైస్కూలులో రంగారావు చదువు సాగింది. నాయనమ్మ రంగారావుని కట్టుదిట్టంలో పెంచింది. ఒకరకంగా అది రంగారావు జీవిత సంఘర్షణకు పునాదిగా మారిందనడంలో తప్పులేదు. పిరికితనం ఆవహించి, ఆత్మవిశ్వాసం లోపించిన వ్యక్తిగా పెరిగి పెద్దవాడయ్యారు. రంగారావుకి నాటకాల మీద ఆసక్తి. ఆ నాటకాలకు వెళ్ళాలంటే ఏవో సాకులు చెప్పి వెళ్ళే పరిస్థితి. వంశమర్యాదలకు నాయనమ్మ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ సంఘర్షణలో రంగారావులో తిరుగుబాటు లక్షణం బలపడింది. 


15 సంవత్సరాల వయసులో ఆయన స్కూలులో ఒక నాటకంలో మాంత్రికునికి సహాయకుడిగా నటించారు. భవిష్యత్తులో అలాంటి మాంత్రికుడి పాత్రే తనని నటుడుగా నిలబెడుతుందని రంగారావు ఊహించలేదు. 1936లో ఆంధ్ర నాటక కళాపరిషత్‌ వారు ప్రదర్శించిన పోటీ నాటకాల్లో ఆనాటి సూపర్‌ స్టార్లు అనదగిన బళ్ళారి రాఘవ, గోవిందరాజుల సుబ్బారావు, స్థానం నరసింహారావు వంటి నిష్ణాతులు నటించడం చూశాక రంగారావువుకు నటుడు కావాలని బలమైన ఆకాంక్ష పెరిగింది. అప్పుడే టాకీ సినిమాలు రావడంతో మద్రాసులో ఆడుతున్న తమిళ, తెలుగు, హిందీ సినిమాలు చూడడం అలవాటయ్యింది. రంగారావు చూసిన తొలి తెలుగు సినిమా ‘లవకుశ’ (1934), తొలి హిందీ సినిమా ‘అచ్యుత్‌ కన్య’ (1936), తొలి తమిళ సినిమా ‘అంబికా పతి’ (1937). సినిమాల్లో గాని, నాటకాల్లో గాని నటించాలంటే వాచకం చాలా అవసరమని భావించి, రంగారావు వక్తృత్వ పోటీల్లో ఎక్కువగా పాల్గొనడం ప్రారంభించారు. శరీర సౌష్టవం కోసం ఆటల్లో పాల్గొనేవారు. ఏలూరులో రంగారావు మేనత్త భర్త, గంగారత్నం అల్లుడుగారైన బడేటి వెంకట్రామయ్య నాయుడు మరణించడంతో, మేనత్త వద్దకు మకాం మార్చడంతో రంగారావు హైస్కూల్‌ చదువు ఏలూరుకు మారింది. బడేటి వెంకట్రామయ్య నాయుడు ఆరోజుల్లో గోదావరి జిల్లా బోర్డు అధ్యక్షుడుగా ఉంటూ జస్టిస్‌ పార్టీలో అగ్రనాయకుడుగా ఎదిగారు. ఏలూరులో చదువు పూర్తయ్యాక రంగారావు ఇంటర్మీడియట్‌ చదువుకోసం విశాఖపట్నం వెళ్లి ఎ.వి.ఎన్‌ కాలేజిలో చేరారు. ఆ కాలేజి ప్రిన్సిపాలు సుంకర పార్థసారథి, రంగారావు తండ్రి మంచి మిత్రులు. రంగారావు వ్యక్తిత్వానికి మెరుగుపెట్టి ఒక స్వరూపాన్ని కలిగించిన వ్యక్తి పార్థసారథి. కాలేజి విద్యార్థి సంఘాల్లో రంగారావుకు ఎన్నో పదవులు కల్పించారు. తండ్రికన్నా రంగారావుకు ఎంతో సన్నిహితులయ్యారు. నియమాలు నేర్పారు. ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దారు. తరువాత బి.ఎస్‌.సి చదవడానికి కాకినాడ వెళ్లారు. పిఠాపురం రాజావారి కళాశాలలో బి.ఎస్‌.సి.లో చేరారు. 1943లో పట్టా పుచ్చుకున్నారు. అక్కడ చదువుకుంటూనే యంగ్‌ మెన్స్‌ హ్యాపీ క్లబ్‌లో నాటకాలు వేయడం మొదలెట్టారు. ఆ క్లబ్‌కి దంటు సూర్యారావు అధ్యక్షుడుగా వుండేవారు. పెనుపాత్రుని ఆదినారాయణరావు (అంజలీదేవి భర్త ఆదినారాయణరావు) ఆ నాటక సమాజానికి కార్యనిర్వాహకుడు, శిక్షకుడు, సంగీత దర్శకుడుగా వ్యవహరించేవారు. రంగారావు యంగ్‌ మెన్స్‌ హ్యాపీ క్లబ్‌ తరఫున ‘లోభి’ అనే నాటకంలో హీరోగా, ‘పీష్వా నారాయణరావు వధ’ అనే నాటకంలో అరవై ఏళ్ళ వృద్ధ రఘునాథరావు పాత్రలోను నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆదినారాయణరావు రచించి దర్శకత్వం వహించిన ‘వీధి గాయకులు’ అనే నాటకంలో రంగారావు అంజలీదేవితో కలిసి నటించారు. అంజలీదేవి ఆ సమాజం ప్రదర్శించే అన్ని నాటకాల్లోనూ నృత్యం చేస్తూ, స్త్రీపాత్రలు పోషిస్తూవుండేవారు. అప్పట్లో రైల్వే శాఖలో టికెట్‌ కలెక్టర్‌ వుద్యోగం చేస్తున్న దర్శకనిర్మాత బి.ఎ.సుబ్బారావు కూడా రంగారావుతోబాటు నాటకాల్లో నటిస్తుండేవారు. రంగస్థలనటుడుగా రాణిస్తున్న రోజుల్లో ‘పోతన’ చిత్ర శతదినోత్సవ సభకు దర్శకుడు కె.వి.రెడ్డి కాకినాడ రావడం జరిగింది. అప్పుడే రంగారావు కె.వి.రెడ్డికి పరిచయం అయ్యారు. ఇంతెందుకు... ప్రముఖ దర్శక నిర్మాత, నటులు ఎల్‌.వి.ప్రసాద్‌ రంగారావు కుటుంబానికి సన్నిహిత మిత్రులు. ఏలూరులో రంగారావు ఇల్లు, ప్రసాద్‌ ఇల్లు ఎదురెదురుగా ఉండేవి. ఇన్ని ప్రాపకాలు వుండి కూడా రంగారావుకు సినిమాలలో నటించే అవకాశం రాలేదు. అయితే అతని రంగస్థల నటన ఒక మంచి ఉద్యోగం సంపాదించి పెట్టేందుకు ఉపకరించింది. సైనికుల వినోదార్ధం కాకినాడలో ‘వీధిగాయకులు’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ హ్యాన్డింగ్‌ హ్యామ్‌ హాజరవడం జరిగింది. రంగారావు నటనకు ముగ్ధుడైన ఆ డైరెక్టర్‌ రంగారావు బి.ఎస్‌.సి పట్టభద్రుడని తెలుసుకొని అగ్నిమాపక శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అలా రంగారావుకు ఫైర్‌ ఆఫీసర్‌గా వుద్యోగం ఖాయమైంది. దాంతో రంగారావు మద్రాసు వెళ్లి మూడు నెలల శిక్షణ పూర్తిచేశారు. మొదటి పోస్టింగ్‌ బందరులో. అయితే అక్కడ కొన్ని నెలలు మాత్రమే పనిచేశారు. తరువాత విజయనగరం బదలీ కావడంతో కళలకు పుట్టిల్లైన ఆ వూర్లో నాటకాలు వెయ్యడం మొదలెట్టారు.


* కలిసొచ్చిన అవకాశం...కలిసిరాని కాలం...


1946 ఆరంభంలో తలవని తలంపుగా రంగారావు జీవితం ఒక మలుపు తిరిగింది. రంగారావు సమీప బంధువు బి.వి.రామానందం ‘వరూధిని’ అనే సినిమా నిర్మించాలచి, ప్రవరాఖ్యుడు పాత్రకోసం నటుల అన్వేషణలో పడ్డారు. అతడు రంగారావు విషయం తెలుసుకొని, ఆ పాత్రను పోషించేందుకు మద్రాసు రమ్మని కబురెట్టారు. రంగారావు తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి మద్రాసు చేరుకున్నారు. ఆరోజుల్లో సినిమాలు మద్రాసుతోబాటు కొల్హాపూర్, సేలం, కలకత్తా నగరాల్లో ఎక్కువగా నిర్మించబడుతుండేవి. ‘వరూధిని’ సినిమాను సేలంలోని మోడరన్‌ థియేటర్స్‌ స్టూడియోలో ప్రారంభించారు. రంగారావుకు నెలకు ముట్టిన జీతం 250 రూపాయలు. అందులో దాసరి తిలకం (నటి గిరిజ తల్లి) వరూధినిగా నటించింది. ఆ సినిమా 1947 జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలైంది. అందులో రంగారావు పేరును ఎస్‌.వి.ఆర్‌.రావ్, బి.ఎస్సీ అని టైటిల్స్‌లో వేశారు. కానీ రంగారావుకు ఆ పాత్ర అంతబాగా నప్పలేదు. కాకినాడ ఎల్ఫిన్‌ టాకీసులో, ఏలూరు, రాజమండ్రి సినిమా హాళ్లలో తొలిసారి ఈ సినిమా విడుదలైంది. తరువాత బెజవాడ, గుంటూరులో విడుదలైంది. తొలిరోజు నుంచే ఈ సినిమాకు ఫ్లాప్‌ ముద్రపడింది. దాంతో రంగారావుకు సినిమా అవకాశాలు రాలేదు. మరలా ఉద్యోగం వెదుక్కుంటూ జంషెడ్పూర్‌ వెళ్లి టాటా స్టీల్‌ ఫ్యాక్టరీలో గుమాస్తా ఉద్యోగంలో చేరారు. రెండేళ్లపాటు అక్కడే వుండిపోయారు. 1947 డిసెంబరు 27న తన మేనమామ బడేటి వెంకట్రామయ్య కూతురు లీలావతిని వివాహమాడి రంగారావు ఒక ఇంటివాడయ్యారు. అక్కడి ఆంధ్రా కల్చరల్‌ క్లబ్‌ వారు నిర్వహించి నాటకాల్లో, ముఖ్యంగా పౌరాణిక నాటకాల్లో రంగారావు వేషాలు వేస్తుండేవారు. అక్కడి ఆంధ్ర సంఘం వారు ప్రదర్శించే ‘వీరాభిమన్యు’, ‘వెన్నెల’, ‘ఊర్వశి’ వంటి నాటకాల్లో ముఖ్యపాత్రలు రంగారావే పోషించేవారు. అప్పుడే సినీ నిర్మాతగా అవతారమెత్తుతున్న బి.ఎ.సుబ్బారావు ‘పల్లెటూరిపిల్ల’ చిత్రాన్ని నిర్మిస్తూ అందులో ప్రతినాయకుడు కంపనదొరగా నటించేందుకు రావలసిందిగా రంగారావుకు టెలిగ్రాం ఇచ్చారు. కానీ, అదే సమయంలో రంగారావు తండ్రి చనిపోయారు. ధవళేశ్వరం నుంచి టెలిగ్రాం రావడంతో రంగారావు ధవళేశ్వరం వెళ్లారు. మరణశయ్యపై వున్న తండ్రి రంగారావుతో ‘నువ్వు ప్రపంచంలో ఎవరికీ భయపడవద్దు. నువ్వు మంచిదని తోచిన పనిని ఎవరు ఆమోదించక పోయినా ఆచరించు’ అంటూ హితబోధ చేశారు. తండ్రి అంత్యక్రియలు వగైరా పూర్తి చేసుకొని రంగారావు మద్రాసు వెళ్లేసరికి, అప్పటికే ఆలస్యమైందని దర్శకనిర్మాత బి.ఎ.సుబ్బారావు ఆ కంపనదొర పాత్రను ఎ.వి.సుబ్బారావుకు ఇచ్చేశారు. అయితే అంత దూరం నుంచి తనని నమ్ముకొని, ఉద్యోగం వదలుకొని వచ్చారని బాధపడి అందులో ఒక చిన్న పాత్రను రంగారావుకు ఇచ్చారు. అది అంజలీదేవి తండ్రి పాత్ర! సమాంతరంగా రంగారావును బి.ఎ. సుబ్బారావు ఎల్‌.వి.ప్రసాద్‌కు పరిచయం చేశారు. అప్పుడు ప్రసాద్‌ ‘మనదేశం’ సినిమాకు దర్శకత్వం వహిస్తునారు. అందులో ఎన్‌.టి.రామారావుతోబాటు రంగారావుకు కూడా పోలీసు ఇన్స్పెక్టర్‌ పాత్రను ఇచ్చారు. ప్రసాద్‌ సిఫారసు మీదే పి.పుల్లయ్య రంగారావుకు ‘తిరుగుబాటు’ అనే సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు. అలాగే హెచ్‌.ఎం.రెడ్డి నిర్మించిన ‘నిర్దోషి’ చిత్రంలో ప్రాత్రకోసం సిఫార్సు చేస్తే, అది అంతకు ముందే ముక్కామలకు వెళ్ళింది.


* విజయా సంస్థతో అంబరానికి...


అప్పుడే విజయా సంస్థ నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి తొలిప్రయత్నంగా ‘షావుకారు’ చిత్రాన్ని నిర్మిస్తూ ఎన్‌.టి.రామారావును ఘంటసాలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. అందులో సున్నం రంగడి పాత్రకు సదాశివరావును తీసుకోవాలని భావించినా దర్శకుడు ఎల్‌.వి.ప్రసాద్‌ మాత్రం ఎస్‌.వి.రంగారావును ప్రతిపాదించారు. అలా రంగడిపాత్ర రంగారావుకు దక్కింది. ఈ రౌడీ పాత్రను విభిన్నంగా పోషించాలనే ఉద్దేశ్యంతో ఒక రిక్షావాడు మాట్లాడే పధ్ధతి, నడిచే తీరు, బీడీ కాల్చే విధానం బాగా పరిశీలించి ఆ పద్ధతిని అనుసరించారు. ప్రేక్షకులకు రంగారావు నటన బాగానచ్చింది. సినిమా గొప్పగా ఆడకపోయినా చక్రపాణికి ‘షావుకారు’ కథమీద మమకారం పోలేదు. కొంతకాలం తరువాత అదే సినిమాని తమిళంలో ‘ఎంగవీట్టు పెణ్‌’ పేరుతో పునర్నిర్మించారు. అందులో రంగడి పాత్ర రంగారావుకే అనుకున్నా, కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఆ పాత్ర ఎస్‌.వి.సుబ్బయ్యకు దక్కింది. తమిళంలో ఈ చిత్రం బాగా విజయవంతమైంది. విజయావారు తెలుగు, తమిళంలో నిర్మించిన రెండవ చిత్రం ‘పాతాళభైరవి’లో నేపాళ మాంత్రికుడి పాత్ర రంగారావు వశమై, చరిత్ర సృష్టించి నటుడిగా నిలబెట్టింది. ఈ పాత్రతో రంగారావుకు సినిమా నటులలో మహోన్నత స్థానం, అసంఖ్యాకులైన ప్రేక్షకుల అభిమానం లభించాయి. ఇందులో పాతాళభైరవిని ప్రసన్నం చేసుకోవడానికి మాంత్రికుడు చదివే మంత్రాల కోసం మంత్రపుష్పంలోని వేదమంత్రాలను తిరగరాయించి విచిత్రమైన భాషగా రంగారావు చేత పలికించారు. సినిమా అఖండవిజయం సాధించిన విషయం విదితమే. ఈ చిత్రం భారతీయ తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు నోచుకుంది. తరువాత విజయా సంస్థ నిర్మించిన మరో ద్విభాషా చిత్రం ‘పెళ్ళిచేసిచూడు’ (‘కల్యాణం పన్ని పార్‌’ 1952)లో జమీందారు ధూపాటి వియ్యన్న పాత్రలో రంగారావు హాస్యరసాన్ని మేళవించి విభిన్న మ్యానరిజంతో రక్తికట్టించి ప్రేక్షకుల మనసుల్ని మరోసారి దోచేశారు. మద్రాసు సెంట్రల్‌ స్టేషన్‌లో ఒక వ్యక్తి ముక్కుపుటాలను ఎగరవేస్తూ వింతగా మాట్లాడడం గమనించిన రంగారావు అదే మ్యానరిజంని ఈ చిత్రంలో అనుకరించారు. తమిళ వర్షన్‌ని మాత్రం పాక్షికంగా గేవాకలర్‌లో నిర్మించారు. ‘పాతాళభైరవి’లాగే ఈ చిత్రం కూడా అద్భుతంగా ఆడి విజయావారికి కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం తరువాత ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలోనే విజయా వారు ‘మిస్సమ్మ’ (1955) చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం కూడా ద్విభాషా చిత్రమే. కాకపొతే ఇందులో తమిళ నటులు వేరు, తెలుగు నటులు వేరు. అయితే రంగారావు మాత్రం అటు తెలుగు ఇటు తమిళ వర్షన్లలో నటించి మెప్పించారు. ఈ సినిమాల మధ్య కాలంలో కోవెలమూడి భాస్కరరావు నిర్మించిన ‘బ్రతుకుతెరువు’ చిత్రంలో జమీందారు బాలాసాహెబ్‌గా, భానుమతి నిర్మించిన ‘చండీరాణి’ ద్విభాషా చిత్రంలో ప్రచండుడుగా, వినోదావారి ‘దేవదాసు’ ద్విభాషా చిత్రంలో జమీందారు నారాయణరావుగా, ఎ.వి.ఎం వారి ‘సంఘం’ ద్విభాషా చిత్రంలో సీతారామాంజనేయ దాసుగా రంగారావు నటించారు.


* ‘బంగారు పాప’లో కోటయ్యగా...


బి.ఎన్‌.రెడ్డి నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘బంగారు పాప’ (1955 ) చిత్రంలో రంగారావు కోటయ్య పాత్ర ప్రత్యేకమైంది. ఒక రౌడీగా, తాగుబోతుగా జీవనం సాగించే కోటయ్య తనచేతికి ఒక బాలిక రావడంతో పూర్తిగా మారిపోతాడు. ఇందులో రంగారావు పాత్ర యవ్వనం, నడివయసు, వార్ధక్యం వంటి వివిధ దశల్లో సాగుతుంది. రంగారావు పాత్ర ఈ సినిమాకు వెన్నెముక. ఆయనలేని ‘బంగారుపాప’ చిత్రాన్ని ఊహించలేం. భీమవరంలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా వున్న పాలగుమ్మి పద్మరాజును ఈ చిత్రం ద్వారా బి.ఎన్‌.రెడ్డి రచయితగా పరిచయం చేశారు. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్ర బహుమతి లభించింది. దేవులపల్లి రాసిన ‘తాధిమి తకధిమి తోలు బొమ్మా దీని తమాష చూడవే కీలుబొమ్మా’ పాట ఆరోజుల్లో అందరికీ కరతలామలకమే. ఈ పాటకు మాత్రం స్వరాలల్లింది బాలాంత్రపు రజనీకాంత రావు. నేటికీ ఆ పాట ఎక్కడో ఒకదగ్గర వినపడుతూనే వుంటుంది. ‘బంగారుపాప’ చిత్రం ఆశించినంత గొప్పగా ఆడకపోయినా, లండన్, న్యూయార్క్‌ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శనకు నోచుకుంది. జాతీయ స్థాయిలో ఉత్తమచిత్రంగా రజత పతకం కైవసం చేసుకుంది. తరువాత అదే సంవత్సరం విడుదలైన విజయావారి ‘చంద్రహారం’ చిత్రంలో రంగారావు ధూమకేతు పాత్ర పోషించారు. రెండుభాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. అయితే బి.ఎ.సుబ్బారావు నిర్మించిన ‘రాజు-పేద’లో మహారాజు సురేంద్రదేవ్‌ పాత్రలో రంగారావు జీవించారు. మార్క్‌ ట్వేన్‌ రచించిన ప్రసిద్ధ నవల ‘ది ప్రిన్స్‌ అండ్‌ పాపర్‌’ ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం విజయఢంకా మ్రోగించింది. సుబ్బారావు తొలి ప్రయత్నంగా నిర్మించిన ‘పల్లెటూరిపిల్ల’ విజయవంతం కావడంతో ‘రాజు-పేద’ నిర్మాణానికి పూనుకున్న సుబ్బారావుకు ఈ సినిమా కూడా కాసులు రాల్చింది. ఈ చిత్రం ద్వారా పినిశెట్టి శ్రీరామమూర్తి రచయితగా పరిచయమయ్యారు. తరువాత అంజలీదేవి నిర్మించిన ‘అనార్కలి’ (1955) చిత్రంలో రంగారావు ప్రధానమైన అక్బర్‌ పాత్ర పోషించి మెప్పించారు. ఈ చిత్రం శతదినోత్సవం చేసుకోవడమే కాకుండా, తమిళంలోకి డబ్‌ చేయగా అక్కడ కూడా వందరోజులు ఆడింది.                                                                                                   

                      

* వీరతాడు వేసిన ‘మాయాబజార్‌’...


‘మిస్సమ్మ’ హిట్‌తో ఎన్‌.టి.రామారావు కెరీర్‌ ఊపందుకుంది. ఒకసారి దర్శకనిర్మాత కె,.వి. రెడ్డి రామారావును పిలిచి ‘భారతంలో ఘటోత్కచుడి పాత్రను హైలైట్‌ చేస్తూ సినిమా తీయాలనుకుంటున్నాను. డేట్స్‌ కావాలి’ అని అడిగారు. ‘సార్‌... నేను మరీ రాక్షస పాత్ర ధరిస్తే బాగోదేమో’...రామారావు జవాబు. కె.వి. నవ్వి ‘లేదయ్యా ... నీది కృష్ణుడి పాత్ర’ అన్నారట. అంటే ఘటోత్కచుడి పాత్రకు ‘మాయాబజార్‌’ (1957) సినిమాలో అంతటి ప్రాధాన్యం వుందని! ఘటోత్కచుడుగా తదాత్మ్యంతో రంగారావు అసమాన అభినయాన్ని ప్రదర్శించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తరవాతి రోజుల్లో ‘సతీసావిత్రి’ చిత్రంలో యముడుగా, భక్త ప్రహ్లాద’, ‘చెంచులక్ష్మి’లో హిరణ్యకశిపుడుగా, ‘శ్రీకృష్ణలీలలు’లో కంసుడుగా, ‘పాండవవనవాసము’లో దుర్యోధనుడుగా, ‘హరిశ్చంద్ర’లో హరిశ్చంద్రునిగా, మహారాజుగా, ‘శ్రీకృష్ణాంజనేయయుద్ధం’లో బలరాముడుగా, ‘ఉషాపరిణయం’లో బాణాసురుడుగా, ‘సంపూర్ణ రామాయణం’లో రావణుడుగా, ‘బాలనాగమ్మ’లో మాయల ఫకీరుగా, ‘దీపావళి’ చిత్రంలో నరకాసురుడుగా, ‘భట్టివిక్రమార్క’లో మాంత్రికుడుగా, ‘బొబ్బిలియుద్ధం’లో తాండ్రపాపారాయుడుగా, ‘సారంగధర’లో నరేంద్రుడుగా, ‘జయభేరి’లో విజయానంద రామగజపతిగా, ‘కాళిదాసు’లో భోజమహారాజుగా, ‘సతీ సావిత్రి’లో యమధర్మరాజుగా అనేక పౌరాణిక, జానపద పాత్రలు సమర్ధవంతంగా పోషించారు. అలాగే ‘అప్పుచేసి పప్పుకూడు’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘నమ్మినబంటు’, ‘దేవాంతకుడు’, ‘గాలిమేడలు’, ‘మురళీకృష్ణ’, ‘మాంగల్యబలం’, ‘తోడికోడళ్ళు’, ‘వెలుగునీడలు’, ‘గుండమ్మ కథ’, ‘చిలకా గోరింక’, ‘రాము’, ‘మంచిమనసులు’, ‘బందిపోటు దొంగలు’, ‘పండంటికాపురం’ వంటి ఎన్నో సాంఘిక చిత్రాలలో వైవిధ్యమైన నటనే కాకుండా, పాత్రోచితమైన నటనను ప్రదర్శించి మన్నన పొందారు. రంగారావు నటించిన ‘తాత-మనవడు’ చిత్రం దాసరి నారాయణరావుకి దర్శకుడిగా మంచి పేరుతెచ్చిపెట్టింది. రాజ్యం పిక్చర్స్‌ వారు నిర్మించిన ‘నర్తనశాల’ చిత్రంలో రంగారావు కీచకుడిగా నటించారు. ఆ పాత్ర వుండేది కేవలం 15 నిమిషాలు మాత్రమే. కానీ, ఆ పాత్రలో జీవించి నటించిన రంగారావుకు భారత రాష్ట్రపతి బహుమతి లభించింది. జకార్తా ఫిలిం ఫెస్టివల్‌లో రంగారావు నటనకు అబ్బురపడి, ఉత్తమ నటుడుగా అంతర్జాతీయ బహుమతి ప్రదానం చేశారు. ‘యశోదాకృష్ణ’ (1974) సినిమా రంగారావు నటించిన చివరి చిత్రం.


* నటసామ్రాట్‌గా, నిర్మాతగా...


సినీ ప్రేక్షకులు, అభిమానులు రంగారావుని నటసామ్రాట్, విశ్వనటచక్రవర్తి మొదలైన బిరుదులతో గౌరవించారు. తమిళంలో ‘అన్నై’, ‘శారద’, ‘కర్పగం’, ‘నానుమ్‌ ఒరు పెణ్‌’, ‘కుమారి పెణ్‌’, ‘సెల్వమ్’, ‘పేసుమ్‌ దైవం’, ‘నమ్‌ నాడు’, ‘ప్రాప్తం’, ‘వసంత మాళిగై’ వంటి తమిళ చిత్రాల్లోనూ, ‘మై భి ఏక్‌ లడ్కి హూ’ వంటి హిందీ చిత్రాల్లోనూ, ‘విదయాగళే ఎతిలే ఎతిల’ే, ‘కవిత’ వంటి మళయాళ సినిమాల్లోనూ తన నటన ప్రదర్శించి ‘ఓహో’ అనిపించుకున్నారు. రంగారావు 


1966లో ఎ.వి.మెయ్యప్పచెట్టియార్‌తో భాగస్వామ్యం కలిపి ‘నాదీ ఆడజన్మే’ సినిమా నిర్మించి హిట్‌ చేశారు. తరువాత ఎస్‌.వి.ఆర్‌ ఫిలిమ్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి నరసరాజుకు కబురంపారు. అప్పుడు ఎనిమిదేళ్లుగా ఆటకెక్కిన డి.వి.నరసరాజు స్క్రిప్టు ‘చిదంబర రహస్యం’ విషయం చర్చకొచ్చింది. ఆ స్క్రిప్టు రంగారావుకు బాగా నచ్చడంతో ‘చదరంగం’ పేరుతో దానిని సినిమాగా మలిచారు. ఎనిమిదేళ్లుగా మూలపడివున్న చదరంగం సినిమా స్క్రిప్టు చదివిన ఎస్వీఆర్‌తో ‘ఎప్పుడో రాసిన కథ కదా, కొన్ని చిన్నచిన్న మార్పులు చేద్దామా’ అని నరసరాజు అడిగితే, ‘నాకు ఏ మార్పులూ అవసరం లేదు. అక్షరం కూడా మార్చకండి. నాకు బాగా నచ్చింది’ అంటూ, ‘దీనిని ఇంకొకరి చేతిలో పెట్టడం నాకు ఇష్టం లేదు. నేనే డైరెక్టు చేస్తాను’ అని ఎస్వీఆర్‌ దర్శకత్వ బాధ్యతలు మోశారు. దర్శకుడిగా ఎస్వీఆర్‌కు ఇదే మొదటి చిత్రం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ చిత్రానికి ద్వితీయ ఉత్తమచిత్ర బహుమతిని అందజేసింది. నరసరాజుకు ఉత్తమ కథారచయిత బహుమతి దక్కింది. అన్యోన్యతకు, అనుబంధాలకు ప్రాధాన్యమిస్తూ 1968లో రంగారావు ‘బాంధవ్యాలు’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కూడా దర్శకత్వ బాధ్యతలను రంగారావే నిర్వహించడం విశేషం. ఈ సినిమాలో వచ్చే ముఖ్య సన్నివేశాలను రేఖాచిత్రాలుగా టైటిల్స్‌ ప్రక్కనే చూపడం ఆ రోజుల్లో కొత్త ప్రయోగం. హీరోయిన్‌ లక్ష్మికి ఇదే తొలి చిత్రం కావడం కూడా మరో విశేషం. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా నంది బహుమతి లభించింది. మెత్తంమీద రంగారావు 300 పైచిలుకు చిత్రాల్లో నటించారు.


* అవార్డులు... రివార్డులు...


జకార్తా చలనచిత్ర మహోత్సవంలో ‘నర్తనశాల’ చిత్రంలో కీచకుడి పాత్రపోషణకు రంగారావు ఉత్తమ నటుడుగా అంతర్జాతీయ బహుమతి అందుకున్నారు. తమిళ సినిమాలు ‘అన్నై’, ‘శారద’, ‘నానుమ్‌ ఒరు పెణ’Â, ‘కర్పగం’ చిత్రాలలో నటనకు రాష్ట్రపతి నుంచి ఉత్తమ నటుని బహుమతి స్వీకరించారు. ‘బాంధవ్యాలు’, ‘చదరంగం’ చిత్రాలలో నటనకు దర్శకత్వానికి బంగారు నంది పురస్కారాలు అందుకున్నారు. ‘నానుమ్‌ ఒరు పెణ’ చిత్రంలో నటనకు ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. ‘సంపూర్ణ రామాయణం’ చిత్రంలో రావణాసుర పాత్రకు, ‘పాండవ వనవాసం’లో దుర్యోధన పాత్రకు, ‘భక్తప్రహ్లాద’లో హిరణ్యకశిపుని పాత్రపోషణకు నంది బహుమతులు లభించాయి. ఉత్తమ క్యారక్టర్‌ నటుడికి ఇచ్చే బహుమతిని ప్రతిసంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రంగారావు పేరిట ఇస్తోంది. విశ్వనట చక్రవర్తి, నటసార్వభౌమ, నటశేఖర, నటసింహ వంటి బిరుదులూ పొందారు. 2013లో భారత తంతి తపాలా శాఖ రంగారావు స్మారక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. సామర్లకోటలో, రాజమహేంద్రవరంలో రంగారావు కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. రంగారావుకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. 1974లో ఆయనకు హైదరాబాదులో గుండెపోటు వచ్చింది. ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే జూలై 18, 1974న చెన్నైలో మరలా గుండెనొప్పి వచ్చి ఆసుపత్రికి వెళ్లేలోపునే ప్రాణం విడిచారు. ‘విశ్వనటచక్రవర్తి’ పేరుతో ఇటీవల ‘సంగం’ అధినేత సంజయ్‌ కిశోర్‌ ఎస్‌.వి.రంగారావు మీద ఒక ‘ఫోటో బయోగ్రఫీ’ పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్ది మెగాస్టార్‌ చిరంజీవి చేత ఆవిష్కరింప జేశారు. వంద సంవత్సాలు పూర్తయిన సందర్భంలో ఈ పుస్తకాన్ని విడుదల చేయడం ముదావహం. సంజయ్‌ కిశోర్‌ అభినందనీయులు.


   - ఆచారం షణ్ముఖాచారి

ప్రాణాలను ఇచ్చునది

 783. 🔱🙏  ప్రాణదా 🙏🔱

మూడు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *ప్రాణదాయైనమః* అని చెప్పాలి.

ప్రాణ = ప్రాణములను, దా = ఇచ్చునది.

మందులు ప్రాణాలను ఇవ్వలేవు. పోబోయే ముందు ఎంత విలువైన మందులను ఎన్ని దేహంలోకి ఎక్కించినా ప్రాణశక్తి (Vital body) తిరిగి మన వైపుకే వాటిని త్రిప్పికొడుతుంది (Expels)

ఈ దేహంలో నిరంతరం అశనములు(Organic) - అనశనములు (Inorganic) గాను, అనశనములు అశనములుగాను మారుతూ ఉంటాయి. (సాశనానశనే అభి - పురుష సూక్తం) నిరంతరం జరిగే ఈ మార్పుల వల్ల - దేహం' పెరుగుతుంది కాని, “దేహి' (జీవి) పెరగడు. ఈ జీవి పుట్టినప్పటి నుండి పోయేంతవరకు గూడా పెరుగుదలా

తరుగుదలా లేకుండా ఒక లాగే ఉంటాడు. ప్రాణ, అపానాల మధ్య; అశన, అనశనాల మధ్య జరిగే ద్విగతి స్పందనను ఆంగ్లంలో Double Pulsation అంటారు. 'ప్రాణశక్తి'ని “ప్రాణాగ్ని' అంటారు. ఆయుర్వేదంలో 'పాచకాగ్ని' అంటే పచనం చేసేది(The fire of Metabolism) అనీ, 'రేచకాగ్ని' అంటే బయటకు నెట్టే దీThe fire of excretion) అనే ద్వంద్వ పదాలతో చెబుతారు. అంగముల యందు ' నిహితం' అంటే - 'ఉంచబడినదాన్ని' అగ్ని' అంటారు. గర్భంలో ఉన్న జీవిని మొట్ట మొదటగా మేల్కొల్ఫింప చేసేది ఈ అగ్నియే! ఈ విధంగా మనలో పనిచేసే ప్రాణశక్తి ని ఇచ్చేది అమ్మవారే కాబట్టి, అమ్మవారు “ప్రాణదా'!

ప్రాణాలను ఇచ్చునది - అని ఈ నామానికి అర్థం.


🙏ఓం ఐం హ్రీం శ్రీం ప్రాణదాయైనమః🙏

🌷శ్రీ  మాత్రే  నమః 🌷

National Digital Library for students

 Govt of India has created National Digital Library for students for all subjects. Below is the link:

https://ndl.iitkgp.ac.in.

It contains 4 crore 6O lakh books. Pls share this info as much as possible for students to know and avail this priceless facility for academic knowledge.

దేవతలైన దానవులైనా

 https://youtu.be/VzqaIsfSWVI


4.7.21🌹 దేవతలైన దానవులైనా  మానవులైనా

యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదు లైనా...

 రూపం ఉంటేనే వస్తారు చూపుల గాలం వేస్తారు కానీ పరమాత్ముడు అలా కాదు రూపం లేని వారి చెంతకు కూడా వస్తాడు వారి చింత తీరుస్తాడు.

🌹 ఎప్పుడూ? మీ మనసు మంచిది మీ కర్తవ్యాన్ని ఎల్లప్పుడు ముఖ్యంగా పరీక్ష సమయాలలో కూడా  ధర్మమార్గంలో నిర్వహిస్తున్నప్పుడు.! 

 అందుకే ఈ సృష్టిలోని సర్వ ప్రాణికోటి ఆ పరమాత్ముడికి భక్తి గేలం వేయవలసిందే ఆయన చూపుల్లో పడవలసిందే అనుగ్రహం పొంద వలసిందే!

🌹 ఇలాంటి ఒక చిన్న కథ... కుబ్జ కథ. కుబ్జ ఇప్పుడు అబ్జ. ఇక, ఈ పద్యం వినండి! మీ స్పందన తెలపండి. 🙏🙏🙏

సంప్రదాయం

 *సంప్రదాయం అనుసరించే వారికోసం సదాచారములు*

🌺🌻🍀🌺🌻🍀🌺🌻🍀🌺🌻

*🌴🏵🙏జై శ్రీమన్నారాయణ🙏🏵🌴*

*🙏🕉ఓం అస్మత్ గురుభ్యోనమః🕉🙏*


*1) మంగళ, శుక్ర వారాలలో క్షవరం చేసుకోరాదు*


*2) ఒకే ఇంట్లో అందరూ ఒకేసారి క్షవరం చేసుకోరాదు.స్నానం చేయరాదు*


*3) అన్నదమ్ములు, తండ్రీకొడుకులు ఒకేరోజు క్షవరం చేసుకోరాదు.*


*4) భోజనం తిన్న పళ్లెంలో చేయి కడగకూడదు.*


*5) నూనె, ఉప్పు, గుడ్లు చేతికి ఇవ్వరాదు.*


*6) ఇంటికి ఎవరైనా వచ్చినపుడు ఎదురుగ చీపురు కనపడకూడదు.*


*7) సాయంత్రం గం.5 తర్వాత ఇల్లు ఊడ్చ కూడదు.*


*8) మంచం మీద కూర్చునిఎట్టిపరిస్థితుల్లోనూ  తినకూడదు.*


*9) తలుపుల మీద బట్టలు వేయకూడదు."*


*10) సాయంత్రం చీకటి పడగానే అన్ని తలుపులు వేసి ఇంట్లో దీపాలు వెలిగించాలి. వీధి తలుపు మాత్రం తీసి ఉంచాలి.* (మనదేశ సంప్రదాయం ప్రకారం సంధ్యా సమయంలో లక్ష్మీ దేవి సంచరిస్తూ ఉంటుంది.)


*11) ఇంటి యజమాని ఇంట్లో మొక్కలకు నీళ్లు పోయాలి.*


*12) మంగళ, శుక్ర వారాలలో డబ్బులు ఎవరికీ ఇవ్వరాదు.*


*13) ఇంటి ముందు రాక్షసుడు పటం ఉండకూడదు.*


*14) బయటికి వెళ్లి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుగుకొని ఇంట్లోకి రావాలి.*


*15) తెల్లవారి లేవగానే ముందు అమ్మానాన్నలను,దేవుని పటములు కానీ మీ రెండు అరచేతులు గాని చూడాలి. అద్దంలో మీ ముఖం చూసుకోరాదు.*


*16)ఉదయం5గంటల లోపే మేల్కొనండి కాలు కిందపెట్టకముందు భూమాతకు నమస్కరించాకే కాలు పెట్టాలు.*


*17) ఉత్తర దిక్కున తల పెట్టుకుని పడుకోరాదు తూర్పు, దక్షిణం వైపు తల పెట్టి పడుకోవాలి.*


*18) ప్రతినెలా కొత్త రైస్ బ్యాగు తేగానే అన్నం వండి తొలిముద్ద దేవుడికి నైవేద్యంగా పెట్టండి.*


*19) పూజా మందిరంలో మరణించిన మన కుటుంబీకుల ఫోటోలు ఉంచకూడదు.*


*20) ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు.*


*21) దేవాలయానికి వెళ్ళి వచ్చాక వెంటనే కాళ్ళు కడుగుకోకూడదు.*


*22) తూర్పు, పడమటి దిక్కులుగా తిరిగి కాలకృత్యాలు తీర్చుకోకూడదు.*


*23) ఆడవాళ్లు శిరోజాల విరబోసుకోరదు,బొట్టు లేకుండా ఉండరాదు*


*24) ఆదివారం అన్నదమ్ములు ఉన్న అక్కచెల్లులు తలస్నానం చేయరాదు*


*25) ముత్తైదువులు పంచ మంగల్యాలు (బొట్టు, గాజులు, నల్లపూసలు, కాలి మెట్టెలు ,పువ్వులు) ధరించవలెను*


*26) దానం చేసేటప్పుడు కుడి చేత్తో చెయ్యవలెను.*


*27) సంధ్య సమయం లో పడుకోకూడదు ,భోజనం చేయకూడదు*


 *ఎవరు పాటిస్తారులే అని పెద్దలు మౌనంగా ఉండకూడదు.చెప్పడం చెయ్యడం మన విధి. ఆ పైన వారి ఇష్టం*


*ఇది మన భారతీయుల సత్సాంప్రదాయాలు*


*🌹🙏ఓం నమో వేంకటేశాయ🙏🌹*

🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉

*🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🍀*

*విష్ణు సహస్ర నామం.*

 *విష్ణు సహస్ర నామం.* 


*(మొదటి భాగం.)*


ఏ  దేవత సహస్రనామం చూసినా వాటన్నిటిలోనూ కొన్ని సాధారణమైన విషయాలు ఉంటాయి. మొదటిది సృష్టి స్థితి లయము మొదలైన కార్యాలన్నీ  ఆ దేవత నియంత్రణలోనే ఉండడం.  భగవంతుడి లక్షణాలైన కరుణ దయ భక్త పరాధీనత మొదలైన కళ్యాణ గుణాలు కలిగి ఉండడం.  ఆ దేవత కు మిగిలిన అందరు దేవతలు లొంగి ఉండడం. ఆ దేవత ఆభరణాలు ఆయుధాలు వాహనాలు వాటికి సంబంధించిన పేర్లు. పురాణాలలో ఆ దేవత కు సంబంధించిన కథల వివరాలు ఆ దేవత చేతిలో ఓడిపోయిన రాక్షసుల పేర్లు వగైరా వివరాలు నామాల రూపంలో ఉంటాయి.


ఉన్న పరబ్రహ్మ ఒక్కడే. ఆయనను ఏ రూపంలో అయినా పూజించుకోవచ్చు. అనేది హిందూమతంలో మౌలికమైన భావన. అందువల్ల అందరు దేవతలకు కూడా ఒకే మూసలో సహస్ర నామాలు తయారయ్యాయి.


శైలీ రచనా ఇంకా విషయపరంగా కూడా విష్ణు సహస్రనామానికీ  మిగతా ఏ సహస్రనామం లోనూ లేని కొన్ని ప్రత్యేకతలు కొన్ని గొప్పతనాలు ఉన్నాయి. ఆ గొప్పతనాల వల్లే విష్ణు  సహస్రనామం అన్ని వేల సంవత్సరాల నుంచి పండిత పామరుల మన్ననలు అందుకుంటూ ప్రజాబాహుళ్యంలో ఆ స్థాయిలో నిలిచిపోయింది.


విష్ణు సహస్రనామం వినడంలో ఒక మాధుర్యం ఉంది. నామాల యొక్క అర్థం తెలియకపోయినా ఆ శబ్దాల కలయికలో ఏదో తెలియని ఆకర్షణ హాయీ ఉన్నాయి. ఇది వ్యాసుల  వారు చాలా శ్రమపడి మనకు అందించిన బహుమానం.


కలౌ వెంకట  నాయకః అనే మాట అందరికీ తెలుసు. కానీ ఏ యుగంలో భగవంతుడిని ఏ విధంగా పూజించాలి అనే విషయం అంత ప్రసిద్ధిగా లేదు. "యజ్ఞానాం జప యజ్ఞోzస్మి" అని భగవద్గీత లో ఉంది. ఇదే భావాన్ని ఇంకాస్త విపులంగా విష్ణు పురాణం లోని ఈ క్రింది శ్లోకం వివరిస్తుంది


 *ధ్యాయన్ కృతే యజన్ యగ్నై*

 *స్త్రేతాయామ్ ద్వాపరేz ర్చయన్*

 *యదాప్నోతి తదాప్నోతి*

 *కలౌ సంకీర్త్య కేశవం.*


 కృతయుగంలో ధ్యానం చేయాలి. యజ్ఞయాగాలు త్రేతాయుగంలో. ద్వాపరంలో అర్చించడం. కలిలో శక్తి ఓపిక తక్కువ కాబట్టి మానవులు తపస్సులు యజ్ఞ యాగాలు చేయలేరు. అందువల్ల కలి యుగంలో నామ సంకీర్తన ఆ ఫలితాలనే ఇస్తుంది అని ఆ శ్లోక తాత్పర్యం. ఆ శ్లోకంలో కేశవ అనే పదం ఉంది. శంకర భాష్యం లో ఈ పదానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర లందరికీ అధినాయకుడు అని అర్థం రాశారు. పరబ్రహ్మ వాచక మైన పదం కాబట్టి అందరు దేవతలకూ వర్తిస్తుంది. "సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి". అనే మాట ఎలాగూ ఉంది.  విష్ణు నామ సంకీర్తనము అనేది వాచ్యార్థము. దేవతా నామ సంకీర్తనము అనేది గౌణార్థము. ఎలా చూసుకున్నా విష్ణు సహస్రనామ పారాయణ యజ్ఞ ఫలాన్ని ఇస్తుంది. విష్ణు సహస్రనామం ప్రసిద్ధంగా అవడానికి ఈ శ్లోకం కూడా ఒక కారణము. 


విష్ణు సహస్రనామం శ్రీకృష్ణుని సమక్షంలో మహావిష్ణువుకు పరమభక్తుడైన భీష్ముల వారు ధర్మరాజుకు ఉపదేశించినది.  మామూలు కవులు రాసిన సహస్ర నామాలకు విష్ణు సహస్రనామానికి ప్రధానమైన తేడా ఇదే. ఈ సహస్రనామాలలో ఏ దేవతా రూపం స్తుతింపబడుతుందో స్వయంగా ఆ శ్రీకృష్ణుని సమక్షంలో ఆయన మహా భక్తుడు ఆ సహస్రనామాలను సంపుటీకరించి ఉపదేశించారు. ఆ ఉపదేశం పుచ్చుకున్న వాడు తరువాత బొందితో స్వర్గానికి వెళ్ళిన ధర్మరాజు.  అందువల్ల ఆ సహస్రనామాలు లోకంలోకి వచ్చిన పద్ధతిలోనే ఒక పవిత్రత ఒక ప్రత్యేకత ఉన్నాయి.


ఈ  సహస్రనామాల్లో ఉన్న విడి నామాలు అన్నీ స్వతంత్ర మంత్రాలు. అంటే వాటికి ముందు ఓం తరువాత నమః చేర్చి వాటిని జపించవచ్చు. అన్ని సహస్రనామాల కు ఈ లక్షణం ఉంటుంది కదా అంటారేమో. ప్రతి పేరుకూ ముందు వెనక ఓం నమః అని చేర్చగానే ప్రతిదీ మంత్రం అవ్వదు. పుట్టు ముహూర్తాలు పెట్టుడు ముహూర్తాలు అన్నట్టుగానే స్వతహాగా ఆధ్యాత్మిక ప్రకంపనలు (vibration) ఉండడం దానికి తగిన విధంగా లోతైన వేదాంత పరమైన అర్ధాలు ఉండడం వినసొంపుగా ఉండడం ఈ మూడు గుణాలు కలిసిన మంత్రాలు విష్ణు సహస్రనామం లో ఉన్నాయి. మిగతా సహస్రనామాలను జల్లెడ పడితే అట్లాటి మంత్రాలు కొన్ని బయట పడతాయి కానీ అన్ని మంత్రాలు అట్లా ఉండవు. ఈ మాట మహర్షులు జ్ఞానులు నిర్ణయించింది.


*"శాస్త్రేషు భారతం సారం*

*తత్ర నామ సహస్ర కం"*


అన్ని శాస్త్రాలలో కి భారతం సార భూతమైనది. అందులోనూ విష్ణు సహస్రనామం అత్యంత సారవంతమైనది అని ఆ శ్లోక పాదానికి అర్థము.


*ముఖ్యమైన నామాలు వాటి అర్ధాలు* ::  విష్ణు శబ్దం ఈ ప్రపంచంలో అణువణువునా చొచ్చుకొని వ్యాపించి ఉన్న పరమాత్మ ను సూచిస్తుంది.  నారములు అంటే ఆకాశం మొదలైన తత్వాలు. అయన వాటికి ఆశ్రయమైన వాడు గమ్యమై నవాడు. ఆయన నుంచి వచ్చిన సర్వ భూతాలకు వాటికి ఆశ్రయం అయినవాడు మళ్లీ వాటిని తనలోనే లీనం చేసుకునే వాడు నారాయణుడు. ("అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్తితః.")  వాసుదేవ శబ్దం చరాచర మైన ఈ సమస్త ప్రపంచాన్ని ఆవరించుకుని ఉన్న విరాట్ రూపాన్ని సూచిస్తుంది.  (" అత్య తిష్ట ద్దశాంగుళం").  ఒక నామము లోపలికి... ఇంకొక నామం బయటికి...  ఉన్న స్థితిని తెలియజేస్తాయి. మధ్యలో ఉన్న పేరు సర్వసృష్టికి మూలము మళ్లీ గమ్యము ఆయన స్థితిని సూచిస్తుంది. మొదటి నామం విష్ణు, మధ్యలో వచ్ఛే నామం నారాయణ ఆఖరి నామం వాసుదేవ.


ఇంకా వుంది....


*పవని నాగ ప్రదీప్.*

Read when you are free!

 Read when you are free!

But read with patience and peace.... & then conclude!


This is by A. N. D'Souza


*2021*


*BJP*

  Vs

*Congress + Left + BSP + SP + TDP + RJD + Shiv Sena + TMC + DMK + AAP + JDU + NDTV + ABP NEWS + Scroll + The Wire + Award Returning Gang + JNU + Pakistan + China*


*Both Hindus & Muslims* want to remove Modi ji... 

but see the difference between them :


A Hindu is looking at the price of petrol 

and Muslims are looking at Rohingya Muslims!


Hindus are angry with GST and want to bring Congress 

and Muslims want to make India an Islamic nation, so want to bring Congress! 


Whatever is the reason... EVERYONE has the same purpose!


There are many people in India, who oppose *Narendra Modi* by coming to the words of corrupt leaders! 

*Good !!* 

It is Democracy... to oppose or support!

It is your own right!!

*But....  whom are you supporting by opposing Modi??*


This is a very serious question!!!

So.... the decision should also be taken SERIOUSLY!


Are Politicians like Mulayam, Laalu, Akhilesh,Tejaswi yadav, Mayawati, Sonia, Rahul, Kejriwal, Mamta Banerjee, Leftists . Yechury... better than Narendra Modi???

Are their records any better???


Does the tenure of Mamta Banerjee, Akhilesh etc. look better than Narendra Modi's Chief Ministerial term of Gujarat? 

If you want to compare....  go to a small city of Gujarat and then visit the capital city of other states!


When Laalu & Mulayam entered politics ... their home condition was pathetic.

They didn't have money to buy bicycles and lanterns!

These Leaders... who used to run in the name of caste... are today Billionaires!!! 


Ramgopal yadav roams in a chartered plane,

Shivpal  yadav in Audi, 


From where did so much money come ??

Are these people better than Narendra Modi??? Ask any banker about the bank balance of Modiji, they will point to a single account in State Bank. He owns one two bedroom flat in Ahmedabad. 


Sonia's son-daughter and son-in-law are Billionaires today!

Are they better than Narendra Modi???


Are the leftists ...who ruled and ruined Bengal for 35 years... better than Narendra Modi???


For Five years... Kejriwal run advertisements and promised the people of Delhi for WIFI, 5000 CCTV, 150 colleges, 500 schools etc.

Is this so-called-IIT scholar better than Narendra Modi???


When Mayawati wanted to get into politics with companion Kashiram... she had no money to light a lamp in her house.   She used to campaign by bicycle!

Today... her sandal also comes by plane... her brother has 497 companies in his name...

Is he better than Narendra Modi???


*Those who oppose Modi... go ahead & Oppose!!* 🤷‍♀️

*BUT ... decide...  whom to support as an alternative !!* 🤙


Tell if there is a BETTER option!!

Think a little about the country!!

How much more to ruin??

How much more to loot and disgrace ? 


● I don't know why I like Modi, but I have many reasons to dislike other parties...


● I don't know if good days will come, but I cannot see any other politician ... other than Modi ji... who is trying hard for the good days of India!


● I don't even know whether Modi ji will be able to make India a Hindu nation, but I am sure that he is trying to give Bharat-Mata the status of *Vishwaguru* again!


● I don't care whether Modi ji has knowledge about history, but I am sure that he has full preparation for the future!


I agree that the one who made this post is a "Modi-Devotee" & I too shared it.

But God has given you... WISDOM too!


So... THINK with full honesty!

Not only for yourself...  but for your country🙏


If you do agree, please forward this message... in the interest of the country! 


*Bharat Maata ki Jai* 🙏🇮🇳

ప్రశ్న పత్రం సంఖ్య: 4 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది

  ప్రశ్న పత్రం సంఖ్య: 4                              కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి ప్రతి పదం "కం" తో అంతమౌతాయి  

1) గ్రామ సింహం అని దేనిని అంటారు 

2) రాముడికి సేవ చేసి కృష్ణుడితో తలపడిన జంతువు  ఏది 

3) దీనికోసమే చాలామంది తాపత్రయ పడతారు  

4) గుడిలో బెల్లంతో చేసి ఇచ్చే ద్రవ పదార్ధం 

5) కంసాలి బంగారాన్ని ముంచే ద్రవం ఏది 

6) నాటకాలలో భాగం  

7) పద్మం ఎక్కడినుండి పుడుతుంది 

8) పన్ను లేక కప్పం 

9) బంగారం లేక స్వర్ణం 

10) ఒక పుష్పము 

11) చెల్లుబాటు

12) పొలంలో నీరు పంపటం 

13) ఒక ప్రసిద్ధ వినాయక క్షేత్రం 

14)అన్నదమ్ముల మధ్య ఆస్తి విభజన 


సాహోయస్వీనటయశస్వీ

 *సాహోయస్వీనటయశస్వీ.*

*సామలవంశ సామర్థ్యం యశోధనుడు,

విశ్వనటరంగ చక్రవర్తి- రంగారావు యస్వీ,

నటన కోసమే పుట్టిన యశస్వి.

ఏపాత్రనైనా అవలీలగ అభినయమై,

ఎడమచేతితో ఎవ్వర్ గ్రీన్ ధీరత యశ్వీదే.

లెజెండరీ విఖ్యాత పురస్కారం  అత్యున్నతకృషినటవిజేతగా,

నటశౌర్యముద్ర-విశ్వనటశక్తి సార్వభౌముడు.

ప్రతినాయక పాత్రకేవిశ్వనట తేజోకిరీటియై,

ప్రతిభావంత అద్భుతమై యశోనాయకుడై,

తెలుగుఠీవి మీసంతిప్పినట్లు,

రారాజు తెలుగురోషమై తొడగొట్టినట్లు,

హావభావ యమహో,నట దర్పం-విశ్వనట దర్పణం.

దీక్షాదక్షతలవీరత విశిష్టుడు.

యోధుడు,మొనగాడుయశ్వీ.*

*డా.వేదులశ్రీరామశర్మ'శిరీష'.

(నేడుయస్వీరంగారావు జయంతి నివాళిగా..డా.శిరీష)


*Die empty

 *Die empty*


The most beautiful book to read is "Die Empty" by Todd Henry.


The author was inspired and got this idea of writing ​​this book while attending a business meeting. 


When the director asked the audience: "Where is the richest land in the world?"


One of the audience answered: "Oil-rich Gulf states." 


Another added: "Diamond mines in Africa."


Then the director said: "No it is the cemetery. Yes, it is the richest land in the world, because millions of people have departed/died and they carried many valuable ideas that did not come to light nor benefit others. It is all in the cemetery where they are buried."


Inspired by this answer, Todd Henry wrote his book, "Die empty .


The most beautiful of what he said in his book is: "Do not go to your grave and carry inside you the best that you have. Always choose to die empty.


The TRUE meaning of this  expression, is to die empty of all the goodness that is within you. Deliver it to the world, before you leave.


If you have an idea perform it.

If you have knowledge give it out.

If you have a goal achieve it.

Love, share and distribute, do not keep it inside.


Let’s begin to give. Remove and spread every atom of goodness inside us.


Start the race.


Let us *Die Empty*.

భగవంతునికి ధన్యవాదాలు..

 సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్ గారు హడావుడిగా హాస్పిటల్ కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు.


తిన్నగా సర్జరీ బ్లాక్ లోకి వెళ్ళాడు. అక్కడ ఒక అబ్బాయి తండ్రి, గోడకు ఆనుకుని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు.


డాక్టరును చూసిన వెంటనే కోపంగా "ఇంత ఆలస్యమయింది ఎందుకు?. నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్తితిలో వున్నాడని మీకు కొంచెం కూడా బాద్యత లేదా?"


డాక్టర్ చిరునవ్వుతో " సారీ! నేను హాస్పిటల్లో లేను. బయట వున్నాను. ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే.. సాధ్యమయినంత త్వరగానే వచ్చాను.


మీరు స్తిమిత పడి శాంతించండి నేను సర్జరీకి వెళతా"...


తండ్రి ఇంకా కోపంతో "శాంత పడాలా? నీ కొడుక్కే ఇలా జరిగి వుంటే.. నువ్వు శాంతంగా ఉండగలవా?"


డాక్టర్ మొఖంపై చిరునవ్వు చెరగకుండా "మన పవిత్ర వేద గ్రంధాలలో వున్నది ఒకటి చెప్పనా..  'మనం మట్టి నుండే వచ్చాం. మట్టిలోకే వెళ్ళిపోతాం.


అదంతా ఆ భగవంతుని మాయాలీలలు.  డాక్టర్స్ ఎవరూ ఎవరి జీవిత కాలాన్ని పొడిగించలేరు. మీరు వెళ్లి మీ కొడుకు కోసం దేవుణ్ణి ప్రార్ధించండి.


నేను చెయ్యవలసింది చేయటానికి ప్రయత్నిస్తాను.


తండ్రి కోపంతో రగిలిపోతూ "మనది కానప్పుడు సలహాలు ఇవ్వటం చాలా తేలిక" అంటూ గొణుకుంటున్నాడు.


డాక్టర్ కొన్ని గంటల తరువాత వచ్చి తండ్రితో "భగవంతునికి ధన్యవాదాలు... మీ కొడుకు ఇప్పుడు క్షేమం. మీరు ఇంకా తిట్టాలనుకుంటే ఆ నర్స్ తో చెప్పండి."


అని.. ఆ తండ్రి నుంచి సమాధానం కోసం ఆగకుండా బయటకు గబగబా వెళ్ళిపోయాడు.


తండ్రి నర్సుతో ఈ డాక్టర్ ఎందుకు ఇంత కఠినాత్ముడు. కొన్ని నిముషాలు కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు అంటూ కోపంతో అన్నాడు.


నర్స్ కొన్ని నిముషాల తరువాత ... కన్నీళ్ళతో "ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే ఒక రోడ్ ఆక్సిడెంటులో చనిపోయాడు.


మేము ఆయనకి ఫోన్ చేసినప్పుడు.. స్మశానంలో వున్నారు. మద్యలో వచ్చి మీ కొడుక్కి ట్రీట్మెంట్ చేసి, మిగిలిన దహన సంస్కారాలు పూర్తి చెయ్యటానికి మళ్ళా స్మశానానికే వెళ్లారు" అని చెప్పింది.


*ఆయనే డాక్టర్ బీ సీ రాయ్. డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి డాక్టరుకు పాదాభి వందనాలు..*

మొగలిచెర్ల అవధూత శ్రీ

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయస్వామి వారి లీలలు..


*సంతాన భాగ్యం..* 


మొగలిచెర్ల గ్రామ సరిహద్దుల లోని ఆశ్రమం లో కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ..తనను నమ్మి కొలచిన భక్తుల కోర్కెలు సత్వరమే తీర్చేవారు..


"శరీరం తో ఉంటేనే సమాజానికి ఉపయోగమా?..నా సమాధి నుండి కూడా భక్తులను అనుగ్రహిస్తాను.." అని చెప్పిన మాటలు అక్షర సత్యాలని నిరూపించే ఘటనలు కోకొల్లలు..


ప్రకాశం జిల్లా పామూరు మండలం గుమ్మనంపాడు గ్రామ వాస్తవ్యులు వెదురూరి మాలకొండయ్య వెంకటమ్మ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని భక్తితో కొలుచుకునేవారు..వెంకటమ్మ కు శ్రీ స్వామివారి మీద ఎనలేని భక్తి..శ్రీ స్వామివారు తపస్సు చేసుకునే రోజుల్లోనే..వారు ఆశ్రమానికి వచ్చి వెళ్లే వారు..శ్రీ స్వామివారు సమాధి చెందిన తరువాత కూడా మందిరానికి వచ్చి దర్శనం చేసుకునేవారు..  తమ కూతురిని కడప జిల్లా మైదుకూరు వాస్తవ్యులు లక్షుమయ్య తో వివాహం చేసారు..తమ కూతురు కొండమ్మ కు వివాహం అయి నాలుగు సంవత్సరాల కాలం గడచినా..సంతానం కలుగలేదు..


వెంకటమ్మ కూతురుకు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి ని దర్శించి మొక్కు కోమని సలహా ఇచ్చింది..కూతురు కొండమ్మ, అల్లుడు లక్షుమయ్య ఇద్దరూ మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు..కొండమ్మ నిష్ఠతో మండలం రోజుల పాటు దీక్ష బూని శ్రీ స్వామి వారి మందిరం వద్దే ఉండిపోయింది..


ఒకరోజు స్వప్నం లో శ్రీ స్వామివారు కనబడి, మామిడిపండు చేతికిచ్చి..భుజించమని చెప్పారట!..కొండమ్మ శ్రీ స్వామివారు ఇచ్చిన ఆ ఫలాన్ని కళ్లకద్దుకుని భుజించించింది..తరువాత మెలుకువ వచ్చింది..తనకు వచ్చిన స్వప్నం గురించి భర్తకు చెప్పింది.. మరుసటి నెలలోనే కొండమ్మ నెల తప్పింది..1977 నవంబరు లో పండంటి బిడ్డకు జన్మ నిచ్చింది..


ఆ దంపతుల ఆనందానికి హద్దులు లేవు..బిడ్డకు శ్రీ స్వామి వారి పేరే.."దత్తాత్రేయ" అని నామకరణం చేసుకున్నారు..శ్రీ స్వామివారి కరుణను పదే పదే తలచుకునే వారు..ఆ పిల్లవాడికీ చిన్నతనం నుంచే శ్రీ స్వామివారి మీద భక్తి ఏర్పడింది..కాలక్రమేణా దత్తాత్రేయ పెరిగి పెద్దవాడు అయ్యాడు.. చదువుకొని ఉద్యోగం లో చేరాడు...వివాహమూ జరిగింది..సంతానం కోసం దత్తాత్రేయ కూడా శ్రీ స్వామివారిని మొక్కుకున్నాడు..వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు.."దత్త చరిత" .."దత్త వర్షిత" అని  పేర్లు పెట్టుకున్నారు..మగ సంతానం కావాలని మళ్లీ ఆ స్వామివారిని వేడుకున్నాడు..భక్తుడి కోరిక తీర్చడమే భగవంతుని పని..ఈసారి దత్తాత్రేయకు కుమారుడు కలిగాడు.."విష్ణు దత్త" అని పేరు పెట్టుకున్నాడు..


కష్టమైనా సుఖమైనా..ఆ మొగలిచెర్ల దత్తాత్రేయుడి పాదాలే మాకు శరణ్యం అని దత్తాత్రేయ భక్తి పూర్వకంగా చెప్పుకునే మాట!..


ప్రస్తుతం కడప పట్టణం లోని INDUS IND BANK లో పని చేసే దత్తాత్రేయకు ..సర్వకాల సార్వావస్థలయందూ గుర్తుకొచ్చే దైవంఆ మొగలిచెర్ల అవధూత దత్తాత్రేయుడే!..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523101...సెల్..94402 66380 & 99089 73699).