4, జులై 2021, ఆదివారం

మొగలిచెర్ల అవధూత శ్రీ

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయస్వామి వారి లీలలు..


*సంతాన భాగ్యం..* 


మొగలిచెర్ల గ్రామ సరిహద్దుల లోని ఆశ్రమం లో కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ..తనను నమ్మి కొలచిన భక్తుల కోర్కెలు సత్వరమే తీర్చేవారు..


"శరీరం తో ఉంటేనే సమాజానికి ఉపయోగమా?..నా సమాధి నుండి కూడా భక్తులను అనుగ్రహిస్తాను.." అని చెప్పిన మాటలు అక్షర సత్యాలని నిరూపించే ఘటనలు కోకొల్లలు..


ప్రకాశం జిల్లా పామూరు మండలం గుమ్మనంపాడు గ్రామ వాస్తవ్యులు వెదురూరి మాలకొండయ్య వెంకటమ్మ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని భక్తితో కొలుచుకునేవారు..వెంకటమ్మ కు శ్రీ స్వామివారి మీద ఎనలేని భక్తి..శ్రీ స్వామివారు తపస్సు చేసుకునే రోజుల్లోనే..వారు ఆశ్రమానికి వచ్చి వెళ్లే వారు..శ్రీ స్వామివారు సమాధి చెందిన తరువాత కూడా మందిరానికి వచ్చి దర్శనం చేసుకునేవారు..  తమ కూతురిని కడప జిల్లా మైదుకూరు వాస్తవ్యులు లక్షుమయ్య తో వివాహం చేసారు..తమ కూతురు కొండమ్మ కు వివాహం అయి నాలుగు సంవత్సరాల కాలం గడచినా..సంతానం కలుగలేదు..


వెంకటమ్మ కూతురుకు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి ని దర్శించి మొక్కు కోమని సలహా ఇచ్చింది..కూతురు కొండమ్మ, అల్లుడు లక్షుమయ్య ఇద్దరూ మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు..కొండమ్మ నిష్ఠతో మండలం రోజుల పాటు దీక్ష బూని శ్రీ స్వామి వారి మందిరం వద్దే ఉండిపోయింది..


ఒకరోజు స్వప్నం లో శ్రీ స్వామివారు కనబడి, మామిడిపండు చేతికిచ్చి..భుజించమని చెప్పారట!..కొండమ్మ శ్రీ స్వామివారు ఇచ్చిన ఆ ఫలాన్ని కళ్లకద్దుకుని భుజించించింది..తరువాత మెలుకువ వచ్చింది..తనకు వచ్చిన స్వప్నం గురించి భర్తకు చెప్పింది.. మరుసటి నెలలోనే కొండమ్మ నెల తప్పింది..1977 నవంబరు లో పండంటి బిడ్డకు జన్మ నిచ్చింది..


ఆ దంపతుల ఆనందానికి హద్దులు లేవు..బిడ్డకు శ్రీ స్వామి వారి పేరే.."దత్తాత్రేయ" అని నామకరణం చేసుకున్నారు..శ్రీ స్వామివారి కరుణను పదే పదే తలచుకునే వారు..ఆ పిల్లవాడికీ చిన్నతనం నుంచే శ్రీ స్వామివారి మీద భక్తి ఏర్పడింది..కాలక్రమేణా దత్తాత్రేయ పెరిగి పెద్దవాడు అయ్యాడు.. చదువుకొని ఉద్యోగం లో చేరాడు...వివాహమూ జరిగింది..సంతానం కోసం దత్తాత్రేయ కూడా శ్రీ స్వామివారిని మొక్కుకున్నాడు..వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు.."దత్త చరిత" .."దత్త వర్షిత" అని  పేర్లు పెట్టుకున్నారు..మగ సంతానం కావాలని మళ్లీ ఆ స్వామివారిని వేడుకున్నాడు..భక్తుడి కోరిక తీర్చడమే భగవంతుని పని..ఈసారి దత్తాత్రేయకు కుమారుడు కలిగాడు.."విష్ణు దత్త" అని పేరు పెట్టుకున్నాడు..


కష్టమైనా సుఖమైనా..ఆ మొగలిచెర్ల దత్తాత్రేయుడి పాదాలే మాకు శరణ్యం అని దత్తాత్రేయ భక్తి పూర్వకంగా చెప్పుకునే మాట!..


ప్రస్తుతం కడప పట్టణం లోని INDUS IND BANK లో పని చేసే దత్తాత్రేయకు ..సర్వకాల సార్వావస్థలయందూ గుర్తుకొచ్చే దైవంఆ మొగలిచెర్ల అవధూత దత్తాత్రేయుడే!..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523101...సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: