మన బ్లాగులో ఉన్నటువంటి సభ్యులు తో ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయాలని సంకల్పిస్తున్నాము దీనికి మీరు సమ్మతి ఇచ్చినట్లయితే మీరు కింద కామెంట్లతో మీ సమ్మతిని తెలియజేయగలరు అన్నట్లు ఒక్క విషయం మీ వాట్సాప్ నంబర్ రాయటం మర్చిపోవద్దు
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
13, ఫిబ్రవరి 2026, శుక్రవారం
పాఠకులకు విజ్ఞప్తి
పాఠకులకు విజ్ఞప్తి
మీరు ఈ బ్లాగులో చూసే విషయాలను గూర్చిన కామెంట్లను మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఒక్క విషయం మీరు రాసే ప్రతి కామెంట్ ఇతర పాఠకులకు ఉపయోగపడే విధంగా ఉండగల అందుకు ప్రయత్నించగలరు ఇంకొక విషయం ఏమిటంటే మీ పేరు మీ చిరునామా మీ ఫోన్ నెంబరు కామెంట్ లో తెలుపగలరు అటువంటి కామెంట్లను మాత్రమే ఇక్కడ పబ్లిష్ చేయబడతాయి అన్న విషయం మర్చిపోవద్దు కాబట్టి ఇప్పుడే మీరు కామెంట్లు చేయటానికి పూనుకోగలరు
సంపత్తా కర్కశం చిత్తం
6) సంపత్తౌ కర్కశo చిత్తం
ఖలస్యాపది కోమలం l
శీతలం కఠినం ప్రాయస్తప్తం మృదా భవత్యయ: ll
7) భావః :- దుష్టుడు ధనవంతుడైనప్పుడు అతని మనస్సు కఠినంగా ఉంటుంది. కానీ అతను కష్టాల్లో ఉన్నప్పుడు మృదువు ఉంటుంది. ఎట్లనగా ఇనుము చల్లగా వున్నప్పుడు గట్టిగా ఉంటుంది, కానీ వేడిగా ఉన్నప్పుడు మెత్త బడి ఉంటుంది కదా!
ఏ పురాణంలో
🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀
ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము
1. మత్స్యపురాణం
2. కూర్మపురాణం
3. వామన పురాణం
4. వరాహ పురాణం
5. గరుడ పురాణం
6. వాయు పురాణం
7. నారద పురాణం
8. స్కాంద పురాణం
9. విష్ణుపురాణం
10. భాగవత పురాణం
11.అగ్నిపురాణం
12. బ్రహ్మపురాణం
13. పద్మపురాణం
14. మార్కండేయ పురాణం
15. బ్రహ్మవైవర్త పురాణం
16.లింగపురాణం
17.బ్రహ్మాండ పురాణం
18. భవిష్యపురాణం
ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.
*మత్స్యపురాణం*
మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.
*కూర్మపురాణం*
కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.
*వామన పురాణం*
పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, ఋతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.
*వరాహపురాణం*
వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.
*గరుడ పురాణం*
గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.
*వాయుపురాణం*
వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.
*అగ్నిపురాణం*
అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.
*స్కందపురాణం:*
కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.
*లింగపురాణం*
లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.
*నారద పురాణం*
బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.
*పద్మపురాణం*
ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.
*విష్ణుపురాణం*
పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.
*మార్కండేయ పురాణం*
శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.
*బ్రహ్మపురాణం*
బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.
*భాగవత పురాణం*
విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.
*బ్రహ్మాండ పురాణం*
బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.
*భవిష్యపురాణం*
సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.
*బ్రహ్మావైపర్తపురాణము *
ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, *రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి
J N RAO 🙏🙏🙏
✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️
అన్నం పరబ్రహ్మ స్వరూపం
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇది మన పెద్దలు చెప్పిన మాట. ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చే ముద్ద కాదు. అది మన కణాలను నిర్మించే శక్తి. మన ఆలోచనలను ప్రభావితం చేసే ఇంధనం. కానీ నేడు ఆ పవిత్రమైన ఆహారం ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. లాభాల వేటలో మనిషి ప్రాణం విలువ తగ్గిపోయింది. మనం తినే ప్రతి మెతుకులోనూ.. తాగే ప్రతి చుక్కలోనూ ఒక అదృశ్య యుద్ధం జరుగుతోంది. ఇది సరిహద్దుల్లో జరిగే యుద్ధం కాదు. మన వంటింట్లో.. మన పళ్లెంలో జరుగుతున్న జీవ రసాయన దాడి. మనం అమృతం అనుకుని తాగుతున్న పాలు.. ఆరోగ్యం అనుకుని తింటున్న కూరగాయలు.. అన్నీ ఇప్పుడు మృత్యువుకు చిరునామాలుగా మారుతున్నాయి.
రాజ్యసభలో రాఘవ్ చద్దా గారు లేవనెత్తిన అంశాలు వింటే.. మనం ఎంతటి భయంకరమైన సుడిగుండంలో ఉన్నామో అర్థమవుతుంది. ఇది కేవలం ఒక రాజకీయ ప్రసంగం కాదు. ఇది మన మనుగడకు సంబంధించిన హెచ్చరిక.
పాలు కాదు.. సింథటిక్ ద్రావణం
మనం తెల్లగా ఉండే ప్రతిదీ పాలు అనుకుంటున్నాం. కానీ మార్కెట్లో దొరికే సగానికి పైగా పాలు.. పశువుల పొదుగు నుంచి వచ్చినవి కావు. అవి ఫ్యాక్టరీల్లో తయారవుతున్నాయి. పాలలో ప్రోటీన్ విలువను (Nitrogen content) కృత్రిమంగా పెంచడానికి యూరియా కలుపుతున్నారు. ఇది నేరుగా కిడ్నీలను నిర్వీర్యం చేస్తుంది. పాలు చిక్కగా కనిపించడానికి.. నురుగు రావడానికి డిటర్జెంట్ పొడిని వాడుతున్నారు. ఆ పాలు తాగినప్పుడు మన పేగుల్లో ఉండే సున్నితమైన పొరలు కాలిపోతాయి. 71 శాతం పాల నమూనాల్లో యూరియా ఉండటం అంటే.. మనం ఒక తరాన్ని మెల్లమెల్లగా విషానికి బానిసలుగా చేస్తున్నామని అర్థం.
కూరగాయలు - రసాయనాల రంగుల లోకం
పచ్చని కూరగాయలు చూస్తే మనకు ఆరోగ్యం అనిపిస్తుంది. కానీ ఆ పచ్చదనం వెనుక 'మలాకైట్ గ్రీన్' అనే ప్రమాదకరమైన డై ఉంది. ఇది ఒక ఇండస్ట్రియల్ కలర్. ఇది కడుపులోకి వెళ్తే కాలేయం కుళ్లిపోతుంది. ఇక కూరగాయలు రాత్రికి రాత్రే పెరగడానికి 'ఆక్సిటోసిన్' అనే హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఈ హార్మోన్ ప్రభావం వల్ల చిన్న పిల్లల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతోంది. ఆడపిల్లలు చిన్న వయసులోనే పెద్దవారవ్వడం.. మగవారిలో వంధ్యత్వం పెరగడం వెనుక ఈ 'హార్మోన్ల మాఫియా' ఉంది. మనం కూరగాయలు తింటున్నామని భ్రమ పడుతున్నాం. నిజానికి మనం రసాయన ఎరువుల వ్యర్థాలను తింటున్నాం.
మసాలాల్లో ఇటుక పొడి.. నూనెల్లో యంత్రాల ఆయిల్...
భారతీయ వంటకాల్లో మసాలా దినుసులు ఒక ఔషధం లాంటివి. కానీ నేడు ఆ ఔషధమే విషమైంది. కారంలో ఇటుక పొడి కలపడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. పసుపులో మెటానిల్ ఎల్లో అనే క్యాన్సర్ కారక రంగును వాడుతున్నారు. ఇది నేరుగా మన నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. గాలి పక్షవాతం రావడానికి.. మెదడు చురుకుదనం తగ్గడానికి ఈ రసాయనాలే కారణం. మనం వాడే వంట నూనెల్లో 'మినరల్ ఆయిల్' అంటే యంత్రాలకు వాడే ఆయిల్ ను కలుపుతున్నారు. ఇది గుండె రక్తనాళాలను గట్టిపడేలా చేస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో 20 ఏళ్ల యువకులకు కూడా హార్ట్ ఎటాక్ లు రావడం మనం చూస్తున్నాం.
మన పళ్లెంలో నిశ్శబ్ద హంతకులు...
ఐస్ క్రీమ్ మరియు పనీర్ కథ మరో దారుణం. పనీర్ లో కాస్టిక్ సోడా కలిపి దాని ఆకృతిని మారుస్తున్నారు. కాస్టిక్ సోడా మన జీర్ణాశయాన్ని చిల్లులు పొడుస్తుంది. ఐస్ క్రీమ్ లలో డిటర్జెంట్ వాడటం వల్ల కాలేయానికి తీవ్రమైన గాయాలు అవుతాయి. ఇవన్నీ ఒక్క రోజులో బయటపడే సమస్యలు కావు. ఇవి క్రానిక్ టాక్సిసిటీ. అంటే నెమ్మదిగా మన శరీరంలో పేరుకుపోయి.. ఒక రోజు క్యాన్సర్ రూపంలోనో లేదా ఆర్గాన్ ఫెయిల్యూర్ రూపంలోనో బయటపడతాయి.
శాస్త్రీయంగా చూస్తే.. మానవ శరీరం సహజమైన ఆహారాన్ని మాత్రమే జీర్ణం చేసుకోగలదు. కృత్రిమ రసాయనాలు శరీరంలోకి వెళ్ళినప్పుడు.. మన కాలేయం (Liver) వాటిని బయటకు పంపడానికి తీవ్రంగా శ్రమిస్తుంది. ఒకానొక దశలో కాలేయం అలసిపోతుంది. అప్పుడు ఆ విష పదార్థాలు రక్తంలో కలిసి కణాల లోపలికి వెళ్తాయి. ఇది DNA నిర్మాణాన్ని కూడా మార్చేస్తుంది. అంటే మనం తింటున్న కల్తీ ఆహారం.. మనతో పాటు మన రాబోయే తరాల జన్యువులను కూడా నాశనం చేస్తోంది. ఇది ఒక రకమైన 'బయోలాజికల్ వార్ ఫేర్'.
FSSAI వంటి సంస్థలు ఏం చేస్తున్నాయి అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. కేవలం పండుగల సమయంలో తనిఖీలు చేయడం వల్ల ప్రయోజనం లేదు. ప్రతి ఊరిలోనూ ఆహార పరీక్షా కేంద్రాలు ఉండాలి. కల్తీ చేసే వారికి ఉరిశిక్ష కంటే తక్కువ కాకుండా శిక్షలు ఉండాలి. ఎందుకంటే వాడు ఒక వ్యక్తిని చంపడం లేదు.. ఒక సమాజం యొక్క ఆరోగ్యాన్ని దోచుకుంటున్నాడు. విదేశాల్లో నిషేధించిన పెస్టిసైడ్స్ మన మార్కెట్లలో ఎందుకు రాజ్యమేలుతున్నాయి? బహుళ జాతి కంపెనీల లాభాల కోసం మన ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నామా?
మనం మేల్కోవాల్సిన సమయం ఇది. ప్యాక్ చేసిన వస్తువుల మీద ఉండే చిన్న అక్షరాలను చదవడం అలవాటు చేసుకోవాలి. ఆహార పదార్థాల వెనుక ఉండే రసాయనాల పేర్లను గమనించాలి. వీలైనంత వరకు ఆర్గానిక్ ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఖరీదైన ఫోన్ల మీద పెట్టే ఖర్చులో కొంత భాగం.. నాణ్యమైన ఆహారం మీద పెట్టాలి. వంటింటిని మళ్ళీ ఔషధశాలగా మార్చుకోవాలి. రంగు రుచి కంటే.. అది ఎంత సహజమైనది అన్నది ముఖ్యం.
రాఘవ్ చద్దా గారు పార్లమెంట్ లో లేవనెత్తిన ఈ అంశం ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఇది రాజకీయాలకు అతీతమైన సమస్య. ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. మనం ఇప్పుడు గళం విప్పకపోతే.. రేపు మన తదుపరి తరం ఆసుపత్రి బెడ్ల మీద పుట్టి.. అక్కడే కన్నుమూసే ప్రమాదం ఉంది.
గుర్తుంచుకోండి.. మనం తినే ఆహారమే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది.
ఈ సమాచారాన్ని కేవలం చదివి వదిలేయకండి. మీరు కొనే పాలు.. కూరగాయలు.. మసాలా దినుసుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోనే చిన్న చిన్న పరీక్షల ద్వారా కల్తీని గుర్తించే పద్ధతులను నేర్చుకోండి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయండి.
కోపానికి
*శ్రీ కిరణం*
*కోపానికి ఎంత దూరంగా ఉంటే సంతోషానికి అంత దగ్గరగా ఉంటాము*
*క్రాంతి కిరణాలు*
*కం.కోపంబు దూర ముంచిన*
*తాపంబులు తొలగి పోవు దారియు దొరుకున్*
*కాపాడు మంచి పేరును*
*ఆపును కష్టంబులన్ని హర్షమునిచ్చున్*
*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం - ఏకాదశి - మూల - భృగు వాసరే* (13.02.2026)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
