ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
6, జనవరి 2025, సోమవారం
హరిదాసుడు
*శ్రీకృష్ణని మరోరూపం హరిదాసుడు*
*సంక్రాంతి ముందు ధనుర్మాసం లో మాత్రమే వీళ్ళు కనపడతారు మళ్ళి సంవత్సరం దాకా రారు...*
*శ్రీ మహవిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు. హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగి పోతాయి.*
*హరిదాసు అనగా పరమాత్మతో సమానం. మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగలని దీవించేవారు హరిదాసులు.*
*నెలరోజులు పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య , వస్తు దానాలను స్వీకరిస్తారు.*
*హరిదాసులు తమ తలపై ధరించే పంచలోహ పాత్రను సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా భావిస్తారు.*
*ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు.*
*ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.*
*శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం.*
*హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు.*
*’శ్రీమద్రమారమణ గోవిందో హరీ’ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు.*
*అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు.*
*హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.*
*హరిదాసులు సామాజిక సంరక్షకులని చినజీయర్‌స్వామి అన్నారు*.*శ్రీరామానుజాచార్యులు చూపిన బాటలో వీరంతా పయనిస్తున్నారని పేర్కొన్నారు.*
*హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్నా ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి.* *మన ఆచారాలను మనమే కాపాడుకోవాలి,మన ధర్మాన్ని మనమే కాపాడు కోవాలి*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
త్యాగయ్య
జనవరి 6.
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడైన, నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు,కర్ణాటక సంగీత విద్వాంసులు,కృతి కర్త త్యాగరాజు గారి వర్ధంతి. .
ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి.
ఉపనయనంతరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.
త్యాగరాజు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభంమండలంలో కాకర్ల అను గ్రామంలో తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1767లో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆధ్వర్యంలో ఉండేవాడు. త్యాగరాజు గారి తాతగారు గిరిరాజ కవిగారు. వీరి గురించి త్యాగయ్య తన బంగాళరాగ కృతిలో "గిరిరాజసుతా తనయ" అని తన తాతగార్ని స్తుతించి యున్నారు. త్యాగయ్య గారి విద్య కొరకు రామబ్రహ్మము తిరువారూర్ నుంచి తిరువయ్యూర్ కు పోయిరి. త్యాగయ్య గారు అచట సంస్కృతమును, వేదవేదాంగములను అమూలాగ్రము పఠించెను. సంగీతాభ్యసము కొరకు త్యాగయ్య గారు శొంఠి వేంకటరమణయ్య గారి దగ్గర చేరారు. వేంకటరమణయ్య గారు త్యాగయ్య గారి చాకచక్యమును, సంగీతమునందుగల ప్రావీణ్యతను గమనించి వారియందు అతి శ్రద్ధతో సంగీతోపదేశము చేయసాగిరి.
త్యాగయ్య గారి తండ్రి గారు పిన్న వయస్సులోనే గతించిరి. కనుక అన్నదమ్ముల మధ్య అయిన భాగపరిష్కారములలో త్యాగయ్య గారి భాగములో కులప్రతిమలైన శ్రీరామ లక్ష్మణులు విగ్రహములు వచ్చెను. ఆ ప్రతిమను అతి భక్తితో పూజించుచుండిరి. వారు జీవితమంతయూ ఊంఛవృత్తిని అవలంబించి సామాన్యముగా చేయుచుండిరి. తక్కిన సమయమంతయు తన యిష్టదైవమైన "శ్రీరాములు" పై కృతులు రచించుటలో పాల్గొనుచుండిరి. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ నామములు జపించి వారి దర్శనము పొంది వారి ఆశీర్వాదము పొందిరి. త్యాగరాజువారు మంచి వైణికులు కూడా.
18 సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆయన 23 వయస్సులో ఉండగా ఆమె మరణించడం జరిగింది. తరువాత ఆయన పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడాడు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి త్యాగరాజుకు కచ్చితమైన వారసులెవరూ లేరు కానీ ఆయన ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.
త్యాగరాజు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించాడు. పదమూడేండ్ల చిరు ప్రాయమునాడే త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచాడు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడాడు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య గారు చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే నిధి చాల సుఖమా అనే కీర్తన.
సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గముగా త్యాగరాజు భావించాడు. సంగీతంలోని రాగ, తాళములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించు కోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనముగా మాత్రమే చూసాడు.
తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను, తీర్థములను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించాడు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందాడు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నాడు.
త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడేస్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి, "స్వరార్ణవము" ఇచ్చాడనీ, ఆ సంధర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన "సాధించెనే" అనీ చెపుతారు. ఈ పుస్తకము వల్ల త్యాగయ్యగారు సంగీతములో అత్యుత్కృష్టమైన విషయములను తెలిసికొనినట్లు తెలియుచున్నది.
శంకరాభరణము లోని "స్వరరాగ సుధారసము" అను కృతిలో ఈ గ్రంథము గురించి త్యాగయ్య పేర్కొనియున్నారు.
త్యాగయ్యవారు 24000 రచనల వరకు రచించిరి. "దివ్యనామ సంకీర్తనలు", "ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు" అను బృంద కీర్తనలు కూడా రచించెను. "ప్రహ్లాద భక్తి విజయము", నౌకా చరిత్రము అను సంగీత నాటకములు కూడా రచించిరి.
త్యాగరాజు జీవితంలో కొన్ని సంఘటనలు త్యాగరాజు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు పాడిన పాట: ఎందు దాగినావో
ఇతడు తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, తెరతీయగరాదా అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత అవే తొలగి పోయినాయి. ఆ తరువాత ఆయన వేంకటేశ నిను సేవింప అనే పాట పాడినాడు.
త్యాగయ్య పరమపదము చేరటానికి ముందు పాడిన పాటలు: గిరిపై, పరితాపము
అసంఖ్యాకమైన కీర్తనలు రచించిరి.
కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటసంగీతానికి మూలస్తంభంగా చెపుతారు. ఈయన జన్మదినం రోజుని భారతియ సంగీత దినొత్సవంగా జరుపుతాము.
ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు తిరువయ్యూర్లో ఆయన సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.
ఆయన భక్తులు, సంగీత కళాకారులు మొదట ఊంఛవృత్తి భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచింది. ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల మరియు సందర్శకుల కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మాణదశలో ఉంది.
'రామేతి మధురం వాచం' అన్నట్లు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వగాన మధురానుభూతిగా లోకానికి అందించారు. భూలోక నారదుడైన త్యాగరాజ స్వామి నారద మంత్రోపదేశం పొంది, అనుగ్రహం ప్రాభవంతో 'స్వరార్ణవం' 'నారదీయం' అనే రెండు సంగీత రహస్యార్థ శాస్త్ర గ్రంథాలు రచించారు.
శ్రీత్యాగరాజస్వామి రచించిన కృతులను
ప్రాపంచికం,
తాత్వికం,
కీర్తనం,
నిత్యానుష్ఠానం
అని పంచరత్న కృతి ని వర్గీకరించవచ్చు.
శ్రీత్యాగరాజస్వామి. రామభక్తా మృతాన్ని సేవించి, కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలచి సంగీత, సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు.
త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సంప్రదాయం.
త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు. వీటిలో చాలావరకు ఆయన మాతృభాష ఐనటువంటి తెలుగులోరచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్నా కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి.
సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది.
'ప్రహ్లాద భక్తి విజయం', 'నౌకా చరితం' అనే నాట్యరూపకాలను కూడా రచించాడు.
సేకరణ- ఈరోజు ప్రాముఖ్యతల గ్రూప్ కు కె కె వి నాయుడు.
విష్ణు సహస్రనామ స్తోత్రము*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*విష్ణు సహస్రనామ స్తోత్రము*
*రోజూ ఒక శ్లోకం*
*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్లోకం (11)*
*అజసర్వేశ్వర సిద్ధః*
*సిద్ధిః సర్వాదిరచ్యుతః ।*
*వృషాకపిరమేయాత్మా*
*సర్వయోగవినిఃసృతః ॥*
*ప్రతి పదార్థం:~*
*96) అజః - జన్మము లేనివాడు;*
*97) సర్వేశ్వరః - ఈశ్వరులకు ఈశ్వరుడు, ప్రభువులకు ప్రభువు;*
*98) సిద్ధః - పొందవలసిన సమస్త సిద్ధులను పొందియేయున్నవాడు;*
*99) సిద్ధిః - సర్వ కార్య ఫలములు తానై యున్నవాడు;*
*100) సర్వాదిః - సర్వమునకు మూలమైనవాడు.*
*101) అచ్యుతః - స్వరూప సామర్ద్యముల యందు పతనము లేనివాడు; జన్మ, పరిణామ, వార్ధక్యము వంటి దశలకు అతీతమైనవాడు.*
*102) వృషాకపిః - జలములలో (అధర్మములో) మునిగిపోవు భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి; ధర్మ పరిరక్షకుడు*.
*103) అమేయాత్మా - అపరిమిత స్వరూపము గలవాడు, ఆ పరమాత్ముని స్వరూపము తెలిసికొనుటకు సాధ్యము కాదు;*
*104) సర్వ యోగ వినిసృతః - సర్వ విధములైన సాంగత్యముల నుండి విడిపడినవాడు, అన్ని సంగములకు, బంధములకు, విషయ వాసనలకు అతీతుడు;*
*తాత్పర్యము:~*
*పుట్టుకలేని వాడు, ఈశ్వరులందరికి ఈశ్వరుడైనవాడు, పొందవలసిన దంతయు పొందినవాడు, ఫలరూపుడైనవాడు, సర్వమునకు మూలమైనవాడు, స్వరూప సామర్ద్యముల యందు పతనము లేనివాడు, అధర్మముచే మునిగియున్న భూమిని వరహావతారమెత్తి ఉద్ధరించినవాడు, అపరిమిత స్వరూపము గలవాడు, సర్వ విధములైన సంగత్యములనుండి విడిపడినవాడు అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*(ఏరోజుకా రోజు ఇచ్చిన శ్లోకం కంఠస్థం వచ్చేదాకా మననం చేద్దాం)*
*సూచన: కృత్తిక నక్షత్రం 3వ పాదం జాతకులు పై 11వ శ్లోకమును నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు సకల శుభాలను పొందగలరు.*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*ఓం నమో నారాయణాయ!*
*ఓం నమః శివాయ!!*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
కాలహస్తీశ్వర శతకం*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*ఓం నమః శివాయ*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*కాలహస్తీశ్వర శతకం*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*నిను సేవింపగన్ ఆపదల్ పొడమనీ, నిత్యోత్సవంబు అబ్బనీ,*
*జనమాత్రుండననీ, మహాత్ము డననీ, సంసార మోహంబు పై*
*కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ*
*చ్చిన రానీ, యవి నాకు భూషణములే, శ్రీకాళహస్తీశ్వరా!*
తా||
*ఈశ్వరా! నేను నిన్ను సేవించుచుండగా, నాకు కష్టాలే రానీ, సుఖాలే రానీ, నన్ను లోకము సామాన్యుడననీ, గొప్పవాడననీ, సంసార వ్యామోహము కలుగనీ, జ్ఞానమే కలుగనీ, గ్రహచారము నన్ను క్రుంగదీయనీ, లేక మంచియే చేయనీ అవియన్నియు నాకు ఆభరణముల వంటివే యగును. నీ పాదసేవ చేయుచున్న నాకు అన్నియు నీ యనుగ్రహములు గానే కనిపించును.*
ఓం నమః శివాయ!!
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
భజగోవిందం (మోహముద్గరః)*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*.
*విరచిత*
*భజగోవిందం (మోహముద్గరః)*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*రోజూ ఒక శ్లోకం (లఘు వివరణతో)*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*శ్లోకం - 11*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*మా కురు ధన జన యౌవన గర్వం*
*హరతి నిమేషాత్కాలః సర్వం|*
*మాయామయమిదమఖిలం హిత్వా*
*బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా||*
*శ్లోకం అర్ధం : ~*
*ధనము, పరివారము, యవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము.*
*వివరణ : ~*
*ఈ ప్రపంచములో అందరికన్నా నీకు మొదటి శత్రువు గర్వము. ఎప్పుడు మనసున గర్వము చేరినదో, అపుడే మనిషికి పతనము ప్రారంభమైనదని అర్ధము. గర్వము అజ్ఞానమునకు సూచన. గర్వము కలిగిన వ్యక్తి తాను ధనవంతుడిననో, అందగాడిననో, పదవిలోనో- పలుకుబడిలోనో ఉన్నతుడననో, లేక జ్ఞానిననో, మంత్రోచ్ఛారణలో దిట్టననో ఊహించుకొని, ఊహాగానాలు చేసుకొని, స్త్రీ, జ్ఞాన, వృద్ధులు అన్న తారతమ్యములు మరిచి, అందరినీ అవమానిస్తాడు. ఈ అజ్ఞానమునకు కారణము అసంపూర్ణత. కావున గర్వమును సంపూర్ణముగా నశింప చేసి, పరతత్వమును సరిగా అర్థము చేసుకొని పరమాత్మునిలో ఆత్మని ఐక్యము చేసి పరమ పదము సాధించుము.*
*ఓం నమో నారాయణాయ।*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*(తిరిగి రేపు మరో శ్లోకంతో కలుద్దాం)*
*శ్రీమద్ భాగవతం* *(12వ రోజు)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(12వ రోజు)*
*(నిన్నటి భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*కాల పరిమాణం*
*జయవిజయలు కథ.*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*నాలుగు జాముల కాలం మానవులకు ఒక పగలు. అలాగే నాలుగు జాముల కాలం ఒక రాత్రి. మొత్తం ఎనిమిది జాముల కాలం ఒక అహోరాత్రం.*
*పదిహేను అహోరాత్రాలు ఒక పక్షం. ఈ పక్షాలు రెండు, ఒకటి శుక్లపక్షం, రెండు కృష్ణపక్షం. ఈ రెండు పక్షాలూ కలిపితే ఒక మాసం. రెండు మాసాలు ఒక ఋతువు. మూడు ఋతువులు ఒక ఆయనం. ఈ ఆయనాలు రెండు. ఒకటి ఉత్తరాయనం. రెండు దక్షిణాయనం. ఈ ఆయనాలు రెండూ కలిస్తే మానవులకు ఒక సంవత్సరం. నూరు సంవత్సరాలు పరమాయువు.*
*మానవుల మాసం పితృదేవతలకు ఒక రోజు. అలాగే మానవుల సంవత్సరం దేవతలకు ఒక దినం.*
*యుగాలు నాలుగు. అవి కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు. యుగానికీ యుగానికీ మధ్య కాలాన్ని ‘సంధ్యాంశ’గా పేర్కొంటున్నారు. ఈ సంధ్యాంశతో కలుపుకుని కృతయుగ పరిమాణం పదహారు వేల ఎనిమిది వందల దివ్య సంవత్సరాలు. సంధ్యాంశతో కూడిన త్రేతాయుగ పరిమాణం పదిహేను వేల ఆరు వేల దివ్య సంవత్సరాలు. అలాగే ద్వాపరయుగం పద్నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాలు. కలియుగం పదమూడు వేల రెండు వందల సంవత్సరాలు. ఈ నాలుగు యుగాలూ వేయిసార్లు తిరిగితే బ్రహ్మకు ఒక పగలు. అలాగే వేయిసార్లు తిరిగితే ఒక రాత్రి. బ్రహ్మ మెలకువలో ఉంటే సృష్టి జరుగుతుంది. నిద్రపోతే విలయం సంభవిస్తుంది.*
*పద్నాలుగు మంది మనువుల కాలం బ్రహ్మకు ఒక రోజు. ఒకొక్క మనువు ఆయుః ప్రమాణం డెబ్బయి ఒక్క మహాయుగాలు. మనువుల మధ్య ఉండే భాగాల్నే మన్వంతరాలు అంటారు. ఈ మన్వంతరాలలోనే మనువంశపురాజులూ, సురలూ, మునులూ భగవదంశాన పుట్టి పాలన చేస్తారు. బ్రహ్మమానంలో నూరేళ్ళు బ్రహ్మకు ఆయువు. అతని ఆయువులోని సగభాగాన్ని ‘పరార్థం’ అంటారు.విదురుడికి మైత్రేయుడు కాలపరిమాణం గురించి చెబుతున్న సమయానికి బ్రహ్మకు మొదటి పరార్థం గడిచింది. రెండవది నడుస్తున్నది. మొదటి పరార్ధం మొదటి భాగంలోనే బ్రహ్మ జన్మించాడు. కాబట్టి దీనిని ‘బ్రహ్మకల్పం’ అన్నారు. క్షీరసాగర మధ్యంలో శయనించిన శ్రీమన్నారాయణుని నాభి నుంచి పద్మం ఉద్భవించిన కాలం ‘పద్మకల్పం’. ఈ రెండు కల్పాలూ మొదటి పరార్థంలో గతించాయి. రెండవ పరార్థం మొదటి భాగంలో శ్రీమన్నారాయణుడు వరాహావతారం దాల్చాడు. ఆ కారణంగానే ‘వరాహకల్పం’ అని పేరొచ్చింది. ఇప్పుడు నడుస్తున్నది వరాహకల్పం.*
*జయవిజయలు:॥~*
*అనంతకోటి అవతారాలలో భగవంతుని పది అవతారాలే ప్రధానమయినవి. తాత్పర్యం అంటే జగత్కంటకులయిన రాక్షసులను సంహరించి, భూభారాన్ని తగ్గించేందుకే భగవంతుడు ఒకొక్క అవతారాన్నీ దాల్చాడు. రాక్షసులలో కొందరు మహాబలశాలులై, వరప్రభావంతో కూడా మరణాన్ని శాసిస్తూ లోకాలన్నిటినీ వేధిస్తూ వచ్చారు.*
*రాక్షసుల్లో హిరణ్యాక్ష-హిరణ్యకశిపులు, రావణ-కుంభకర్ణులు ముఖ్యులు.*
*అసాధారణ బల పరాక్రమాలు కలిగిన ఈ రాక్షసులు, దేవాంశతో శాపవశాన భూమి మీదకు రాగలిగారు. ఈ శాపానికి కారణమైనదే జయవిజయులు కథ.*
*వైకుంఠంలో విష్ణుమూర్తి వద్ద ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. వారి పేర్లు జయుడు-విజయుడు. ఇద్దరూ విష్ణుభక్తులే!*
*‘ఒకనాడు సనక సనందనాదులు విష్ణు సందర్శనార్థం వైకుంఠానికి వచ్చారు. సనకసనందనాదులు మహామునులు, బ్రహ్మ మానసపుత్రులు, అసాధారణ మహిమలు గల మహనీయులు. సకల జగత్తూ వారికి ఈశ్వరమయం గానే కాన వస్తుంది. సమస్తలోకాలనూ యోగబలంతో సంచరించగలిగే వారికి ఎక్కడా ఎలాంటి అడ్డూ ఆపూ లేదు, ఉండదు. వారెప్పుడూ అయిదేళ్ళ ప్రాయంలోనే ఉంటారు. నగ్నంగా ఉంటారు. బాలురవలే కనిపిస్తారు.*
*మానస వైకుంఠంలో ప్రవేశించిన సనకసనందనాదులు ఆరు ద్వారాలు దాటారు. ఏడవ ద్వారం దగ్గరకు చేరుకున్నారు. అక్కడే జయవిజయులు కాపలాగా ఉన్నది. లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల కేళీమందిరమే ఏడవ ద్వారం. ఆ ద్వారం దాటాలంటే జయవిజయుల అనుమతి ఉండి తీరాల్సిందే! అయితే సనకసనందనాదులకు ఒకరి అనుమతితో పని లేదు. బ్రహ్మ స్వరూపులు వారు. ఏడవ ద్వారం దాటబోతున్నారు. గమనించారది జయవిజయలు. అడ్డగించారు వారిని. అడ్డగించడమే కాదు, మదాంధులై ఆ మహామునుల్ని నిందావాక్యాలతో అవమానించారు.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
నాకే ఇలా అవుతుంది
M🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏 🌹జీవితంలో ప్రతీ ఒక్కరికి ఎదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది..నాకే ఇలా అవుతుంది అనుకోవడం పెద్ద భ్రమే అవుతుంది..పరిస్థితి రాకముందే మనసు యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ను పెంచుకోవాలి.. మనసును స్థిరంగా శక్తి వంతంగా చేసుకోగలిగితే పర్వతం వంటి పరిస్థితి కూడా మీ మనసు ముందు అవగింజలా అవుతుంది🌹జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండు మార్గాలు..మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు..ఇతరుల సమస్యలలో తల దుర్చకూడదు..మన గురించి నలుగురూ ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా, మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది ముఖ్యం..మనకు వచ్చే కష్టానష్టాలను మనమే భరించాలి..చుట్టూ ఉన్న నలుగురూ కాదు..మన జీవితం మనదే..గొప్పగా బతకడం సాధ్యం కాక పోవచ్చు..కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది🌹కొన్ని బాధలు అశ్వాదించాలి..అప్పడే మన గుండె ధైర్యం తెలుస్తుంది..కొన్ని మాటలు భరించాలి..అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది..జీవితంలో ఏదీ కోల్పోయినా ఎక్కువ బాధ పడకు..ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతీ సారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది..జీవితం కూడా అంతే..ఏమి జరిగినా ఏదో ఒక మంచి కోసమే🌹 *అందుకే ప్రతీ రోజు ఉదయాన్నే కొంతసేపు అత్మిక సర్జన్ వైద్యనాథుడైన ఆ పరమాత్మునితో ఆత్మీయంగా ఆప్యాయతతో ప్రశాంతమైన మనసుతో ధ్యానించు..వారి శక్తివంత మైన కిరణాలు మనసులోని చెడుని నశింప చేసి మానశిక ఆరోగ్యం సిద్ధిస్తుంది* 🌹🌹మీ *అల్లం రాజుభాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజెన్సీస్ .D N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్యసలహాలు ఉచితం మందులు అయిపోయిన వారు రాలేను వారు కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510* 🙏🙏🙏
రసవాద విద్య .
భారతదేశపు పురాతన విద్య - రసవాద విద్య .
మన ప్రాచీన భారతీయుల విఙ్ఞానం అమోఘమైనది . వారు పరిశోధించి కనుగొనిన అనేక అంశాలు అత్యంత రహస్యంగా నిక్షిప్తం చేసి ఉంచారు . మన భారతీయ వేదాలలో ఎంతో విజ్ఞానం నిక్షిప్తం అయ్యి ఉంది. కాని మనం దానిని పట్టించుకోకుండా పాశ్చాత్త్యా సంప్రదాయాల మోజులో పడిపోయి మన పూర్వీకుల విజ్ఞానాన్ని మనం పట్టించుకోవడం లేదు . తాళపత్రాలలో మరియు మన పురాతన గ్రంథాలలో నిక్షిప్తం అయిన అద్బుత విజ్ఞానాన్ని వారు తమ తమ పరిశోధనలలో ఉపయోగించుకుంటున్నారు. మనం పోగొట్టుకున్న ఒక అద్భుత రహస్య విద్య గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను.
మనం పోగుట్టుకున్న , మరిచిపోయిన ఆ రహస్య విద్య పేరే "రసవాద విద్య" ఈ విద్య గురించి వివరించాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ విద్యలో ముఖ్యంగా చెట్ల రసాలు , పాదరసం వంటి లోహాలు ఉపయోగించి "బంగారం " తయారుచేయుట . రహస్యంగా ఉండిపోయిన ఈ విద్య గురించి కొంత సమాచారమును నేను సేకరించాను . కొన్ని పురాతన గ్రంథాలను కూడా నేను ఈ విద్య గురించి తెలుసుకోవడానికి చదవడం జరిగింది. ఇప్పుడు మీకు ఆ విశేషాలు తెలియచేస్తాను.
అగస్త్య మహర్షులవారు అగస్త్యప్రోక్తం అను రసాయనిక గ్రంధమును రచించి అందులో పాషాణ , రససమ్మేళణాదులు ఉపయోగించు విధానం పేర్కొనెను. నీచలోహాలను స్వర్ణముగా మార్చు విధానములు సవివరముగా తెలియచేస్తూ రసవాదులకు మార్గదర్శకుడు అయ్యెను . ఈ రసవాదం సంపూర్ణంగా సిద్ధించుటకు అత్యంత ప్రజ్ఞ కలవాడై ఉండవలెను . పురాతన సిద్ధులు మాత్రమే కాకుండా కొంతమంది ఆధునిక రసవాద పరిశోధకులు కూడా స్వర్ణాన్ని తయారుచేశారు. వారిలో కాశీ నివాసి "పండిత్ కృష్ణపాల్ " 1943 సంవత్సరంలో హృషికేష్ లోని ప్రముఖుల సమక్షాన రసవాద విద్య ద్వారా స్వర్ణాన్ని తయారుచేశారు. ఆ బంగారం ఆ కాలంలో 72000 రూపాయలకు విక్రయించబడినది. ఆ మొత్తం పంజాబ్ లోని సనాతన ధర్మ ప్రతినిధి సభకు విరాళంగా ఇవ్వబడినది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విశ్వనాధ మందిరం పై అంతస్తులో రసవాద విద్యలో ప్రముఖ ఆచార్యుడు అయిన నాగార్జుని చిత్రంతో పాటు పాలరాతిపై ఈ వివరాలు కూడా చెక్కబడి ఉన్నాయి . 11 వ శతాబ్దంలో "ఆల్బెరుని " అనే విదేశీ యాత్రికుడు మనదేశం సందర్శించి ఇక్కడి సిద్దులు బంగారం తయారుచేసేవారు అని పేర్కొన్నాడు. దేశంలో కరువుకాటకాలు ఏర్పడినపుడు రసాయనాచార్యులు కృత్రిమంగా స్వర్ణాన్ని తయారుచేసెవారు అని అనేక గ్రంథాలలో వివరించబడి ఉంది.
ఈ రసవాద విద్యను "స్వర్ణకరణి" పగారవిద్య అని అంటారు. ఈ విద్యను ఉర్దూలో కీమియా అని ఇంగ్లిష్ భాషలో ఆల్కెమీ అని పిలుస్తారు . ఈ రసవాదవిద్యలో నీచ వస్తువుని స్వర్ణంగా మార్చడానికి ఉపయోగించు ఒక వస్తువును "పరుసవేది " అని పిలుస్తారు . ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఈ రసవాద విద్య సిద్దించక భ్రష్టుడు , పిచ్చివాడు కావొచ్చేమోకాని ఒక గొప్ప వైద్యుడు మాత్రం తప్పక అవుతాడు. అందుకనే మన పూర్వీకులు " వాదభ్రష్టో వైద్య శ్రేష్ఠ" అని అన్నారు. ఆధునిక శాస్త్రవేత్తలు స్వర్ణం తయారుచేయడాన్ని ఒక పిచ్చిపనిగా , చెప్పినవాడ్ని పిచ్చివానిగా చూస్తారు. వారు చెప్పినట్లు స్వర్ణం ఒక ఎలిమెంట్ అణుసంఖ్య పట్టికలో దీని సంఖ్య 79 . AU కాంతి లోహ సంబంధమైనది . ప్రకృతిసిద్ధంగా లభించే బంగారుస్పటికముల అవయవ రూపత్వం ఇసొమెట్రిక్ భూమి యొక్క ఉష్ణోగ్రతకు కరిగి కిందికి దిగి పేరుకుని పొందే అవయవాకృతిని "నగ్గెట్స్" అంటారు. బంగారం యొక్క కాఠిన్యం 2 .5 to 3 .రష్యా వంటి దేశాలలో ప్రయోగశాలలలో కృత్రిమంగా తయారుచేశారు. బయట ఉన్న బంగారం ఖరీదు కంటే తయారు చేయుటకు అయ్యే వ్యయం ఎక్కువ ఆగుతుంది. అందువల్ల పరిశోధనలు ఆగిపోయాయి.
భారతీయ పురాణాల్లో చెప్పినదాని ప్రకారం ఈ రసవాద విద్యలో ప్రముఖులు ఆదిమ చంద్రసేనుడు , లంకేశ్వరుడు, మత్తమాండవ్య ఇంద్రదత్త , కలంబి, నాగార్జునుడు, ఋషిశృంగ, రసేంద్రాతిలక , భాలుకి , మైధిలి , హరీశ్వర మొదలగు 27 మహామహులు చేత సింహగుప్తుని కుమారుడు అయిన వాగ్భాటాచార్యుడు , వేమనయోగి వంటి ఎందరో మహాత్ములు , సిద్దులు మొదలయిన వారు ఎందరొ ఉన్నారు.
మనకు తెలిసిన వేమన గొప్ప రసవాది ఆయన ఒక చోట ఇలా చెప్పాడు . " వెన్నెల నిలుచుండి , వేపాకు పడవేసి అడ్డసరం రసమందు నదియు పిండి రాగి కరుగవేయ రమణ బంగారమౌ విశ్వదాభిరామ " అని చెప్పాడు . మరియొక చోట " పుట్టమీద కాయ , పుట్టమీద మన్ను పుట్టలోనివాని పుట్టుతుదను గట్టియవచనము కాంచనాంబగయ" అని చెప్పాడు. నేపాల్ దేశంలో పరుశువేది లింగం ఉన్నట్టు శ్రీశైల క్షేత్రంలో కూడా శివలింగానికి కింద ఉన్న సప్తమ లింగం కూడా పరశువేది లింగం అంటూ కొన్ని ప్రాచీన రహస్య గ్రంధాలలో ఉన్నది.
రసవాద విద్య గురించి సంపూర్ణంగా వివరించే అత్యంత ప్రాచీన గ్రంథాలు -
గ్రంధాల పేర్లు -
* అగస్త్య రసాయనిక తంత్రం.
* కక్షపూట తంత్రం.
* కూపిపక్వ రస నిర్మాణ్ విజ్ఞాన్.
* ద్వాదశ లోహ భస్మ విధానము.
* పారద విజ్ఞానం.
* పారద సంహిత.
* రస చింతామణి.
* రసరత్నాకరము .
* రసాయన ఖండం.
* రసార్ణవము.
* రసేంద్ర చూడామణి.
* రసేంద్ర కల్పద్రుమ.
* సనారి విశ్వేశ్వర సంవాదం.
* రస కంకాలియ.
* రస కౌముది.
* రస పారిజాత.
* రసరత్న మణిమాల.
* రస ప్రదీప.
* రసేంద్ర మంగళం .
* సూత ప్రదీపిక.
* రస సాగరః.
* రస రాజలక్ష్మి.
* రస ముక్తావళి.
* రసరాజ శిరోమణి.
* రస సంగ్రహ సిద్ధాంత .
* రస కిన్నెర .
* స్వర్ణ తంత్రం.
* కనకమంజరి.
* కళాయి శాస్త్రం.
పైన చెప్పిన గ్రంథాలు అత్యంత ప్రాచీనం అయినవి . ఇంకా కొన్నిచోట్ల అరుదుగా లభ్యం అగుచున్నవి.
రసవాదం నందు వివరించిన కొన్ని ప్రయోగాలు -
* తెల్ల వాకుడు రసం తో పాదరసాన్ని నూరిన మైనం . ఆ మైనంలో ఆ పిప్పిలో పొదిగి , ఆరబెట్టి చిన్న పుటం పుట్టిన భస్మం అగును. రాగిని కరిగించి అందులో ఈ భస్మం వేసిన హేమించును
* ఒక శేరు ఇంగిలీకమును 5 శేరుల పచ్చిపసుపు రసమున 4 జాములు చురకా ఇచ్చి తరువాత 15 శేరుల తంగేడుపువ్వుల రసముతో చురకా ఇచ్చిన కట్టును . ఇది నిశ్చయం. అది వెండి మీద పదోవంతు వేసిన బంగారం అగును.
* అడవి మెంతి ఆకు పాదరసమున వేసి నూరి శుద్ద రాగి బిళ్లకు పట్టించి గజపుటం వేసిన వెండి అగును ఇది నిశ్చయం .
* శంఖు పాషాణం వంకాయలో పెట్టి మట్టిరాసి ఆరబెట్టి 21 పుటములు పెట్టవలెను . 10 పుటముల వరకు 4 నుంచి 5 వేసినను కట్టును . తరువాత 4 కి 1 పిడక చొప్పున పుటములు పెట్టవలెను. దీనిని రసంలో వేసి రాగికి జోడించి కరిగించిన స్వర్ణం అగును.
* నల్ల ఉమ్మెత్త సమూలం నూరి శుద్ద రాగి బిళ్లకు పట్టించి గజపుటం పెట్టిన భస్మం అగును. ఆ భస్మమును రాగి కరుగుచుండగా వేసిన స్వర్ణం అగును. శుద్ధ రాగి కొరకు నైజామ్ అర్ధరూపాయి వెడల్పాటిది శ్రేష్టం.
* రెండు నేరేడు పండ్లు తెచ్చి ఒక్కోటి సగం వరకు కోసి కొంచం గుజ్జు తీసి రెండు తులముల రాగి రజను అందులో పోసి తీసిన గుజ్జు మీద వేసి రెండు డిప్పలు కలిపి గుడ్డ చుట్టి 7 సార్లు శీలమన్ను ఇవ్వవలెను . పిమ్మట ఏరు పిడకలతో పుఠం పెట్టి సాంగశీతలమున బలి ఇచ్చి తీసి చూచిన 6 వన్నె బంగారం అగును .కరిగించి దూచిన సరిపోవును .
పైన చెప్పిన యోగాలు కొన్ని ప్రాచీన అత్యంత అరుదయిన గ్రంథాల నుంచి నేను సేకరించినవి . ఇవి కేవలం మీ విజ్ఞానం కోసం మాత్రమే వివరిస్తున్నాను. అత్యాశకు పోయి మీకుటుంబాలను , మీ మీద ఆధారపడ్డ వారిని ఇబ్బందులపాలు చేయొద్దని నా మనవి. ఆ సర్వేశ్వరుడు ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు . కావున ఇచ్చినదానితో తృప్తిగా కుటుంబంతో సంతోషంగా ఉందాం.
. ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
న్యాయస్థానములెప్పుడు
ఓం శ్రీ మాత్రేనమః
ఓం శ్రీ గురుభ్యోనమః
05-01-25
న్యాయ - నైపుణి
డా.రఘుపతి శాస్త్రుల(41)
న్యాయస్థానములెప్పుడు
న్యాయాన్యాయపు విచక్షణైక సుబుద్ధిన్
సాయము చేసెడు విధముల
శ్రేయమొసగ మాతృభాష సేవింపనగున్
మాతృభాషలో తీర్పు సమంచితముగ
తెలియ జేసిన బాధితుల్ తృప్తిగనుచు
వాస్తవమ్ముల గ్రహియించి వర్ధిలుదురు
మాటలాడెడు భాషదౌ మహిమ దెలియు
(సమంచితము=పూజింప తగినది)
చెప్పెడు భాషకున్ తగు విశిష్టత గూర్చిన జాలు వాస్తవ
మ్మెప్పుడు గాంచ నౌను జనముల్ తగు వృద్ధిని గాంచు రీతులే
మెప్పును పొంద గల్గును సమీక్షలు జేయగ గల్గు భాగ్యమున్
చొప్పడు గాన ధర్మ విధి శోధన జేసి వచింపగా తగున్
(సమీక్ష=అవగాహన)
మాతృభాషకు సాటి యీ మహినిలేదు
తల్లిదండ్రుల మించిన దైవ శక్తి
గాంచగా లేము భువిలోన నెంచగలుగ
విలువల తెలిసి మసలిన ప్రియమొసంగు
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5125*
*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం - సప్తమి - ఉత్తరాభాద్ర - ఇందు వాసరే* (06.01.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
తిరుప్పావై 22వ పాశురం*
🔱ఓం నమః శివాయ🔱:
*తిరుప్పావై 22వ పాశురం*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*22.పాశురం*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
*అఙ్గణ్ మాఞాలత్తరశర్, అబిమాన*
*బఙ్గమాయ్ వన్దు నిన్ పళ్లిక్కటిల్ కీళే*
*శఙ్గమిరుప్పార్ పోల్ వన్దు తలైప్పెయ్ దోమ్*
*కిఙ్గిణివాయ్ చ్చెయ్ ద తామరై ప్పూప్పోలే*
*శెఙ్గణ్ శిఱిచ్చిణిదే యెమ్మేల్ విళియావో;*
*తిఙ్గళు మాదిత్తియను మెళున్దాఱ్పోల్*
*అఙ్గణిరణ్డు ఙ్గొణ్డు ఎఙ్గళ్ మేల్ నోక్కుదియేల్*
*ఎఙ్గళ్ మేల్ శాబ మిళిన్దులో రెమ్బావాయ్!!*
*భావం :-*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
సుందరము విశాలము అగు మహాపృధివి మండలము అంతయు ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరు అనెడి అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు, మేమును అభిమాన భంగమైవచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరియున్నాము.
చిరుగంట ముఖమువలె విడియున్న తామరపువ్వు వలె వాత్సల్యముచే ఎర్రగా ఉన్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింప చేయుము.
సూర్యచంద్రులు ఇరువురు ఒక్కసారి ఆకసమున ఉదయించునట్లు ఉండెడి నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షించితివా ! మేము అనుభవించియే తీరవలెననెడి శాపము వంటి కర్మ కూడా మమ్ములను వీడిపోవును.
ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగ నేలిన రాజులందరును తమ కెదురెవ్వరు లేరను అహంకారమును వీడి, అభిమానులై నీ శరణు జొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారివలె నీ శరణుజొచ్చినాము.
మాకు నీవు దక్క వేరు దిక్కులేదు స్వామీ! చిరుమువ్వలు నోళ్ళు తెరచినట్లుగను, సగము విరిసిన తామరపూవువలెను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాలనుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము.
సూర్యచంద్రులు ఉదయించునట్లు కనిపించు నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగగనే మేము నిన్ను చేరుకొందము కద! మా వ్రతమునకు పొందవలసిన ఫలము గూడ యిదియేగదా! యని ఆండాళ్ తల్లి కర్మ బంధం. తొలగితే ముక్తి లభిస్తుందని' తెలియజేస్తోంది.
*అవతారిక :-*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
గోపికలు శ్రీకృష్ణపరమాత్మ వద్దకు చేరి మేల్కొనుమని వెనుక పాశురమున ప్రార్థించినారు. వేరొక గతిలేక నీకే చెందినవారము అని చెప్పినారు. వెనుకటి పాశురమున సూచింపబడిన అనన్య గతి తత్వమునే ఈ పాశురమున వివరించుచున్నారు. అభిమానము రెండు రకాలుగా ఉండును.
సర్వము నాది అను అభిమానము మమతాభిమానము. దేహమే నేను , నేను స్వతంత్రుడను అనునది అహంతాభిమానము. వెనుకటి దానిలో శత్రువులు రాజ్యములను వదలి నీ వాకిటికి వచ్చినట్లు వచ్చితిమి - అని చెప్పిరి.
తిరిగి రాజ్యము ఇచ్చినను స్వీకరింపుము. అని శత్రువులు నీ వాకిటనే ఉన్నట్లు ఉంటిమి. అని సర్వమునందు మమతాభిమానము వీడిపోయినట్లు చెప్పిరి.
భగవానుని ఆశ్రయించునపుడు ఇతర సంబంధమును పూర్తిగా వీడి భగవానునికే చెందినవారము అను భావము పరిపూర్ణముగా ఉండవలెను. గోపికలు కూడా అట్లే ఈ పాశురమున తమ అనన్యార్హత్వమును విజ్ఞాపన చేయుచున్నారు.
పరమాత్మను పొందాలని కోరుకొనేవారు స్వామికి సంపూర్ణ శరణాగతులవ్వాలి. సంపూర్ణ ప్రపత్తిని చేయాలి. స్వామి పాదాలచెంత వ్రాలి 'నీవు దక్క మాకు దిక్కులేదు. మేము పూర్తిగా నీవారమే' అనే శరణాగతి చేసి పాదాల నాశ్రయించాలని ఆండాళ్ తల్లి బోధిస్తోంది.
ఈ మాలికలో - మేము నిన్ను స్తుతిస్తుండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని - అనగా మెల్లమెల్లగా నీ సూర్యచంద్రులవంటి కన్నులను వికసింపచేస్తుండగా అందుండి నీ కరుణా కటాక్ష వీక్షణాల వాత్సల్యరసపూర్ణధారలను తనివితీరా పొంది ఆనందించాలని వచ్చామని గోపికలు తెలిపారు. కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి కలుసుకొనేటట్లు చేసేదే యీ ధనుర్మాస వ్రతమంటుంది మన ఆండాళు తల్లి.
*కల్యాణిరాగము - రూపక తాళము*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
ప.. చిరు మువ్వలు నవ్వి నటుల వికసించిన కలువల వలె - ఆ
ఎరుపులీను కన్నుదోయి కరుణణు ప్రసరింపనీవె!
అ..ప.. సూర్యచంద్రులుదయించెనో? యట్టుదోచు కనుదోయిని
పరమాత్మా! మా పాపములన్ని బోవ చూడరావె!
1. చ.. అహంకార మమకారములణచి వచ్చి రాజులు - నీ
సింహాసనమునకు క్రిందగుంపు గూడియున్నట్టుల
అహము వీడి నీ సన్నిధి నంజలి ఘటియించినాము
మహాప్రభో! యింకనైన కటాక్షింపరావె! స్వామి
ఎరుపులీను కన్నుదోయి కరుణను ప్రసరింపనీవె!
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
*అనన్య గతిత్వం*
*ఆండాళ్ తిరువడిగలే శరణం*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
మనిషి వస్తువులపై ఏర్పరుచుకున్న అభిమానం ఎప్పటికీ పట్టుకొని వేలాడుతూ ఉంటాడు ఎంత దుఃఖాల పాలైనా. అసలు ఇవన్నీ వాడివే అని ఒక మాట అనుకుంటే, ఏడవ వల్సిన అవసరము ఉండదు.
ఒక మహానుభావుడు ఉండేవాడట, ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగు ఎక్కి ఎప్పటికి పైకే చూసేవాడట, క్రిందకి చూడటము కూడా మరచి పోయాడట.
వీడి దయకోసం రారాజులే వీడి పాదాల వద్ద వాళ్ళ కిరీటాలు ఉంచేవారట. ఇలాంటి వాడికి ఒకనాడు ఏమైందంటే వాడి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. వాడు తన వాళ్ళని వదిలి వచ్చేసాడు. ఊరు దాటి బయటికి వెళ్ళలేడు, ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు. మరి ఎవరికైనా తెలిస్తే అభిమానం అడ్డొస్తుంది. తినటానికి అడుక్కోవాలంటే పగలు బయటికి రాలేడు.
ఒక పెంకు ముక్కను తీసుకొని రాత్రి బయలుడేరాడు ఎవ్వరు చూడరని, అది కూడా వెలుతురు ఉండదని ఇండ్ల చూరు కింద నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక పిల్లలు కల కుక్క పడుకొని ఉండట, వీడేదో చేయటానికి వచ్చాడని, వీడి కాలు పట్టి కరిచిండి. అమ్మో అంటూ అరవడం మొదలు పెట్టాడు.
అంతలోనే వచ్చి రాజు అని గుర్తు పట్టే సరికి వాడు అభిమానంతో తల దించుకున్నాడట. *"ఒరు నాయగమాయ్ ఓడ ఉల ఉడ ఆండవర్ కరునాయ్ కవరంద కాలర్ సిదగీన పానయర్ పెరునాడు కావున ఇమ్మయిలే పిచ్చితాన్ కరువర్"* ఏక ఛత్రాదిపతిగా పరిపాలించిన మహనీయుడే, ఒకనాడు కిరీటాలు తగిలించుకున్న కాలు, ఈనాడు కుక్క కరిచిన కాలు.
ఒకనాడు బంగారు పాత్రలలో తినేవాడు, ఇప్పుడు చితికిన పెంకు ముక్క చేత పట్టుకున్నవాడు. అభిమానం పెంచుకున్న వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయి అని అళ్వారులు చూపిస్తారు.
మనిషి వస్తువులను సంపాదించటం, వాటిని అనుభవించటం తప్పు కాడు, అవి నావల్ల అని అనుకోవడం తప్పు. వాడిచ్చింది అనుకుంటే అన్ని మనకు సుఖంగా ఉండేట్టు చేస్తాడు, నేనార్జిస్తున్న అనుకుంటావా చుట్టు ఉండే వాటితో నిన్ను వదిలేస్తా, నీవే కాపాడుకో అని నిన్ను వదిలేస్తాడు.
ఎంతవరకు అని మనం రక్షించుకోగలం కనుక. ఈ భూమి మీద అభిమానాలు అంతలా పెంచుకొని, భగవంతుడిదీ అని మరచి, బ్రతుకుతే వాడికి గతి ఉండనే ఉండదు.
*“అంగణ్ మా ఞాలత్తరశర్”* ఈ అందమైన భుమి మీద *“అబిమాన పంగమాయ్ వందు”* అభిమానాలను వదులుకొని వచ్చి *“నిన్ పళ్ళికట్టిల్ కీరే”* నీ పడక మంచం క్రింద దాగి ఉండే రారాజుల వలె మేము వచ్చామయ్యా.
మనిషి తన శరీరం పై కూడా అలాగే అభిమానం కల్గి ఉంటున్నాడే, చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహ్యించుకొనేలా మన శరీరం మారిపోతుందే. ఈ అభిమానాలను మనిషి వీడాలి. అన్నీ భగవంతుడు ఇచ్చినవి అని భావించాలి.
ఈ దేహాల పై అభిమానాలు పెంచుకుని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నమో ఆ అభిమానాలను అన్నీ వదులుకొని నీ పద సన్నిధి చేరామయ్యా. ఎవరైనా వదులుకొని రావాల్సిందే. మన లాంటి సామాన్యులకే అది సులభం, చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్నీ లోకాలను వదులుకొని రావాలనంటె అది కష్టం, కాని తరించాలి అంటె ఆయన కూడా వదులుకు రావడం తప్పదు.
*“శంగమ్ ఇరుప్పార్ పోల్”* అయిటే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమోనని గుంపులు గుంపులుగా ఎట్లా ఐతే చేరి ఉన్నారో, మేము కూడా అలాగే నీ వద్దకు చేరాము.
*“వందు తలై ప్పెయ్-దోమ్”* ఈ చేరటం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే, ఇది మా ప్రయత్నం కాదు సుమా, దురభిమానంతో మేం తప్పించుకు తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మామీద ఆరోపణ చేసి మాకు ఎంతలా ఉపకారం చేసావు.
మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేముంటే ఒక శరీరాన్ని ఇచ్చి, ఇంద్రియాలను ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, మహానుభావులను ఇచ్చి వారి ఉపదేశాలు వినేట్టు మాలో ఉండి మమ్మల్ని సంస్కరించి, మాలో నీ పై ద్వేశాన్ని తగ్గించి ని పై ప్రేమ కల్గి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చాం, ఇదంతా నీవే చేసిన ప్రయత్నం కదయ్యా. నీ కృషి ఫలించేట్టు చేయడానికి వచ్చాం.
ఇక నీ సన్నిధి చేరాం, ఇక మాకు ఫలితం దక్కాలికదా, *“కింగిణివాయ్ చ్చేయ్ద”* చిన్నటి సిరిమువ్వ గజ్జలు ఒక గీతగా కనిపిస్తాయే, అట్లా కనిపించే ఆనేత్రాలని *“తామరై ప్పూప్పోలే”* పద్మాల్లా *“శెంగణ్ శిఱుచ్చిఱిదే”* అందముగా, మెల్లి మెల్లిగా *“యెమ్మేల్”* మాపై *“విరయావో”* ప్రసరించేట్టు చెయ్యి.
*“తింగళుమ్”* చంద్రుడి చల్లటిచూపులాగా *“ఆదిత్తియనుమ్”* సూర్యుడి కాంతి వలె *“ఎరుందాఱ్పోల్”* ఇద్దరు కలిసి నట్లుగా ఉంది, ప్రేమించే వారికి ప్రేమను కురిపించేట్లు, ద్వేశించేవారికి ప్రతాపం కల్గి ఉంటాయి ఆ చూపులు. మరి ఈ రెండు ఒక్కసారి సంభవిస్తాయా అంటే సంభవిస్తాయి *“ప్రసన్నం ఆదిత్య వర్చసమ్ రామం”* అంటారు, సూర్యుడు తన మాధ్యాత్మిక కాంతిని చంద్రుడి చల్లటి చూపులలా ఇస్తె ఎలా ఉంటుందో మాకు నీ చూపులను అందించు.
తప్పు తప్పు *“అంగణ్ ఇరండుం”* ఆకళ్ళు అవే. నీ కళ్ళను పోల్చటానికి ఏ ఉపమానం లేదు, *“కొండు ఎంగళ్మేల్”* వాటిని మాపై పడేట్లు చెయ్యి.
*“నోక్కుదియేల్ ఎంగళ్మేల్”* ఆచూపులు మాపై పడితే *“శాపం ఇరింద్”* మాకున్న శాపాలన్నీ తొలగుతాయి. ఆహల్యకున్న శాపం నీ పాద స్పర్షతో పోయింది-మాకూ నీ పాద స్పర్ష కావాలి, చంద్రపుష్కరిణి లో స్నానం ఆడితే దక్షుడికి శాపం పొయ్యింది- మాకూ నీ కళ్యాణగుణపుష్కరిణి లో స్నానం కావాలి, శివుడికి బ్రహ్మ తల తీసిన శాపం నీ వక్షస్పర్శచే తొలగింది-మాకూ అది కావాలి. నిన్ను ఎడబాసి ఉండడమే మాకు ఒక శాపం, నీవు అనుగ్రహించాలి.
*“చకృషా తమ సౌమ్యేన పూతాస్మీ రఘునందన”* నీ చూపు నాపై పడిండయ్యా ఇక నా పాపాలన్నీ తొలగుతాయి అని శభరి అన్నట్లుగా మనవాళ్ళు ఆయన చూపులు మనపై ప్రసరింపచేయ్యమని స్వామిని కోరుతూ తమ అనన్య గతిత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవి అని భావిస్తున్నారు. ఇక స్వామిని చేరే వరకే శాస్త్రాలు, ఇకపై ఆయనకు వీళ్ళ మాటలు వినక తప్పదు.
🕉️🌞🌏🌙🌟🚩
*తిరుప్పావై 22 వ పాశురము తెలుగు పద్యానువాదము*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
సీ.నీ వీక్షణమ్మును నిలుపుము మా పైన
దయగల చూపున్న తండ్రి వీవు
చిన్న గజ్జెల వలె యున్నట్టి తామర
యెర్రగా మెరిసెడు వెలుగు వచ్చె
అందమౌ యీ లోక మందున్న రాజులు
మానాభిమానాలు మానినారు
సుందరమౌ గద్దె క్రింద బృందమ్ముగా
నిలిచి మా డెందము చలువ చేసి!!
తే.గీ. కన్ను కొసలలో చూపు మాకున్న చాలు
పాద ధూళియు మాపైన పడిన యంత
పాప మంటదు పరమాత్మ బాపు యిడుము
తాపముల చల్ల బరచును దయయు యున్న
చూపు మాపైన ప్రసరింపు సుందరాంగ
శ్రద్ధ భక్తిని కల్గించి బుద్ధి నొసగు
శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!
🕉🌞🌎🌙🌟🚩