6, జనవరి 2025, సోమవారం

విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (11)*


*అజసర్వేశ్వర సిద్ధః*

*సిద్ధిః సర్వాదిరచ్యుతః ।*


*వృషాకపిరమేయాత్మా*

*సర్వయోగవినిఃసృతః ॥* 


*ప్రతి పదార్థం:~*


*96) అజః - జన్మము లేనివాడు;*


*97) సర్వేశ్వరః - ఈశ్వరులకు ఈశ్వరుడు, ప్రభువులకు ప్రభువు;*


*98) సిద్ధః - పొందవలసిన సమస్త సిద్ధులను పొందియేయున్నవాడు;*


*99) సిద్ధిః - సర్వ కార్య ఫలములు తానై యున్నవాడు;*


*100) సర్వాదిః - సర్వమునకు మూలమైనవాడు.*


*101) అచ్యుతః - స్వరూప సామర్ద్యముల యందు పతనము లేనివాడు; జన్మ, పరిణామ, వార్ధక్యము వంటి దశలకు అతీతమైనవాడు.*


*102) వృషాకపిః - జలములలో (అధర్మములో) మునిగిపోవు భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి; ధర్మ పరిరక్షకుడు*.


*103) అమేయాత్మా - అపరిమిత స్వరూపము గలవాడు, ఆ పరమాత్ముని స్వరూపము తెలిసికొనుటకు సాధ్యము కాదు;*


*104) సర్వ యోగ వినిసృతః - సర్వ విధములైన సాంగత్యముల నుండి విడిపడినవాడు, అన్ని సంగములకు, బంధములకు, విషయ వాసనలకు అతీతుడు;*


*తాత్పర్యము:~*


*పుట్టుకలేని వాడు, ఈశ్వరులందరికి ఈశ్వరుడైనవాడు, పొందవలసిన దంతయు పొందినవాడు, ఫలరూపుడైనవాడు, సర్వమునకు మూలమైనవాడు, స్వరూప సామర్ద్యముల యందు పతనము లేనివాడు, అధర్మముచే మునిగియున్న భూమిని వరహావతారమెత్తి ఉద్ధరించినవాడు, అపరిమిత స్వరూపము గలవాడు, సర్వ విధములైన సంగత్యములనుండి విడిపడినవాడు అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*(ఏరోజుకా రోజు ఇచ్చిన శ్లోకం  కంఠస్థం వచ్చేదాకా మననం చేద్దాం)*


*సూచన: కృత్తిక నక్షత్రం 3వ పాదం జాతకులు పై 11వ శ్లోకమును నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు సకల శుభాలను పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

కామెంట్‌లు లేవు: