30, అక్టోబర్ 2021, శనివారం

శ్రీమద్భాగవతము

 *30.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2307(౨౩౦౭)*


*10.1-1446*


*క. పెనిమిటి బిడ్డని గుణములు*

*వినిపింప యశోద ప్రేమవిహ్వలమతియై*

*చనుమొనలఁ బాలు గురియఁగఁ*

*గనుఁగొనలను జలము లొలుకఁగా బెగ్గిలియెన్.* 🌺



*_భావము: నందుడు అలా తన ముద్దుల కుమారుడు కృష్ణుని లీలలను గురించి వర్ణిస్తుంటే, యశోదాదేవి ప్రేమాతిరేకముతో చలించిపోయి శోకించగా, ఆమె స్తనములనుండి చనుబాలు, కన్నులనుండి ధారాపాతముగా కన్నీరు ప్రవహించింది._* 🙏



*_Meaning: As Nanda was narrating the mystic deeds of Sri Krishna , Yashodadevi was overwhelmed with intense emotion and profound fondness and thinking of her son, milk gushed from her breasts and tears flowed from her eyes._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

రామాయణం‌ 108 ప్రశ్నలు

 *🙏🏻 రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో ... రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి. 🙏🏻*


*1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు? = వాల్మీకి.*


*2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?= నారదుడు.*


*3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు? = తమసా నది.*


*4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి? =24,000.*


*5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? = కుశలవులు.*


*6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? = సరయూ నది.*


*7. అయోధ్య ఏ దేశానికి రాజధాని? = కోసల రాజ్యం.*


*8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? = సుమంత్రుడు.*


*9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి? =కౌసల్య, సుమిత్ర, కైకేయి.*


*10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు? = పుత్ర కామేష్ఠి.*


*11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను? = కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.*


*12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు? = జాంబవంతుడు.*


*13. వాలి ఎవరి అంశతో జన్మించెను? = దేవేంద్రుడు.*


*14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు? = హనుమంతుడు.*


*15. కౌసల్య కుమారుని పేరేమిటి? = శ్రీ రాముడు.*


*16. భరతుని తల్లి పేరేమిటి? = కైకేయి.*


*17. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి? = లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.*


*18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు? = వసిష్ఠుడు.*


*19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు? =16 సంవత్సరములు.*


*20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు? = మారీచ, సుబాహులు.*


*21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి? = బల-అతిబల.*


*22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు? = సిద్ధాశ్రమం.*


*23. తాటక భర్త పేరేమిటి? = సుందుడు.*


*24. తాటకను శపించిన మహర్షి ఎవరు? = అగస్త్యుడు.*


*25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు? = భగీరథుడు.*


*26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను? = జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.*


*27. అహల్య భర్త ఎవరు? = గౌతమ మహర్షి.*


*28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు? = శతానందుడు.*


*29. సీత ఎవరికి జన్మించెను? = నాగటి చాలున జనకునికి దొరికెను.*


*30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను? = దేవరాతుడు.*


*31. శివధనుస్సును తయారు చేసినదెవరు? = విశ్వకర్మ.*


*32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు? = మాండవి, శృతకీర్తి.*


*33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు? = జనకుడు.*


*34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి? =కుశ ధ్వజుడు.*


*35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి? = వైష్ణవ ధనుస్సు.*


*36. భరతుని మేనమామ పేరు ఏమిటి? = యుధాజిత్తు.*


*37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు? = మంధర.*


*38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను? = గిరివ్రజపురం, మేనమామ యింట.*


*39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది? = శృంగిబేరపురం.*


*40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను? = గారచెట్టు.*


*41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?= భారద్వాజ ముని.*


*42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి? = మాల్యవతీ.*


*43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు? = తైల ద్రోణములో.*


*44. శ్రీరామునితో నాస్తిక వాదన చేసినదెవరు? = జాబాలి.*


*45. భరతుడు రాముని పాదుకల నుంచిన పట్టణమేది? = నంది గ్రామము.*


*46. అత్రిమహాముని భార్య ఎవరు? = అనసూయ.*


*47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు? = విరాధుడు.*


*48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు? = అగస్త్యుడు.*


*49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది? = గోదావరి.*


*50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను? = శూర్ఫణఖ.*


*51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను? = జన స్థానము.*


*52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను? = మారీచుడు.*


*53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది? = బంగారు లేడి.*


*54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు? = జటాయువు.*


*55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను? = దక్షిణపు దిక్కు.*


*56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను? = కబంధుని.*


*57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది? = మతంగ వనం, పంపానదీ.*


*58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను? = ఋష్యమూక పర్వతం.*


*59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారి వద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను? = హనుమంతుడు.*


*60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?= అగ్ని సాక్షిగా.*


*61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను? = కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.*


*62. సుగ్రీవుని భార్య పేరు? = రుమ.*


*63. వాలి భార్యపేరు? = తార.*


*64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి? = కిష్కింధ.*


*65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి? = మాయావి.*


*66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు? = దుందుభి.*


*67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను? = మతంగ ముని.*


*68. వాలి కుమారుని పేరేమిటి? = అంగదుడు.*


*69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను? = ఏడు.*


*70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను? = ప్రసవణ గిరి.*


*71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? = వినతుడు.*


*72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? = అంగదుడు.*


*73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి? = మామగారు, తార తండ్రి.*


*74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? = శతబలుడు.*


*75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను? = మాసం (ఒక నెల).*


*76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను? = దక్షిణ దిక్కు.*


*77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను? = తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.*


*78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి? = స్వయంప్రభ.*


*79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి? = సంపాతి.*


*80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు? =పుంజిక స్థల.*


*81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి? = మహేంద్ర పర్వతము.*


*82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు? = మైనాకుడు.*


*83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి? = సురస.*


*84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి? = సింహిక.*


*85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత? = నూరు యోజనములు.*


*86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి? = లంబ పర్వతం.*


*87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి? = అశోక వనం.*


*88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను? = పన్నెండు*


*89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు? = త్రిజట.*


*90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను? =రామ కథ.*


*91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి? = చూడామణి.*


*92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను? = ఎనభై వేలమంది.*


*93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను? = ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.*


*94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు? = విభీషణుడు.*


*95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి? = మధు వనం.*


*96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు? = మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.*


*97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి? = ఆలింగన సౌభాగ్యం.*


*98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి? = నలుడు*


*99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను? = నికుంభిల.*


*100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు? = అగస్త్యుడు.*


*101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు? = ఇంద్రుడు.*


*102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు? = మాతలి.*


*103. రావణ వధానంతరం లంక నుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పక విమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరి కోసం ఆగుతుంది? = కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!*


*104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీ రాముడు ఎవరిని ముందుగా పంపెను? = హనుమంతుడు.*


*105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి? = శత్రుంజయం.*


*106. శ్రీ రాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను? = స్వయంగా తన భవనమునే యిచ్చెను.*


*107. పట్టాభిషేక సమయంలో శ్రీ రామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది? = బ్రహ్మ.*


*108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి? = తన మెడలోని ముత్యాల హారం.*

Btahmin


 

సంస్కృత మహాభాగవతం

 *28.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పందొమ్మిదవ అధ్యాయము*


*జ్ఞాన-భక్తి-యమనియమాది సాధనముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*19.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*అహింసా సత్యమస్తేయమసంగో హ్రీరసంచయః|*


*ఆస్తిక్యం బ్రహ్మచర్యం చ మౌనం స్థైర్యం క్షమాభయమ్॥12993॥*


*శ్రీకృష్ణభగవానుడు నుడివెను* ఉద్ధవా! అహింస (ప్రాణులయెడ ఎట్టి ద్రోహచింత లేకుండుట), సత్యము (భూతహితమైన భాషణము), అస్తేయము (మనస్సునందు ఇతరుల సొత్తును అపహరించు ధోరణి లేకుండుట), అసంగము (ఎట్టి లౌకిక విషయములయందును ఆసక్తి లేకుండుట), లజ్జ (సిగ్గు), అసంచయము (అవసరమునకు మించి ధనాదికమును కూడబెట్టకుండుట), ఆస్తిక్యము (వేదశాస్త్రముల యందు విశ్వాసము), బ్రహ్మచర్యము (స్త్రీసంగరాహిత్యము), మౌనము (వృథాలాపవర్జనము, భగవన్నామస్మరణము), స్థిరత (నిశ్చలత్వము), క్షమ (తితిక్ష-సహనము), అభయము (నిర్భయత్వము) అను ఈ పన్నెండును యమములు అనబడును.


*19.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*శౌచం జపస్తపో హోమః శ్రద్ధాఽఽతిథ్యం మదర్చనమ్|*


*తీర్థాటనం పరార్థేహా తుష్టిరాచార్యసేవనమ్॥12994॥*


శౌచము - బాహ్య శౌచము, అభ్యంతర శౌచము (బాహ్యాభ్యంతర పవిత్రత), జపము (మంత్రమును జపించుట), తపస్సు (శాస్త్రీయ కాయక్లేశము), హోమము (అగ్నికార్యమునందు ఆహుతి సమర్పించుట), శ్రద్ధ (సత్కార్యములయందు పట్టుదల), ఆతిథ్యము (అతిథిసేవ), భగవదారాధనము, తీర్థయాత్ర, పరోపకారబుద్ధి, తుష్టి (దైవికముగా లభించినదానితో తృప్తిచెందుట), గురుసేవ అను ఈ పన్నెండును 'నియమములు' అని యనబడును.


*19.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*ఏతే యమాః సనియమా ఉభయోర్ద్వాదశ స్మృతాః|*


*పుంసాముపాసితాస్తాత యథాకామం దుహంతి హి॥12995॥*


ఈ యమ, నియమములు రెండును పన్నెండేసి విధములు. ఇవి సకామ, నిష్కామసాధకులకు మిగుల ఉపయుక్తములు. నాయనా! వీటిని అనుష్ఠించినవారికి సకలకార్యములు నెరవేరును.


*19.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*శమో మన్నిష్ఠతా బుద్ధేర్దమ ఇంద్రియసంయమః|*


*తితిక్షా దుఃఖసమ్మర్షో జిహ్వోపస్థజయో ధృతిః॥12996॥*


*19.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*దండన్యాసః పరం దానం కామత్యాగస్తపః స్మృతమ్|*


*స్వభావవిజయః శౌర్యం సత్యం చ సమదర్శనమ్॥12997॥*


*శమము* అనగా శాంతి మాత్రమేగాదు. భగవత్పరమైన నిష్ఠతోగూడిన బుద్ధి. *దమము* అనగా బాహ్యేంద్రియ నియమనము. *తితిక్ష* అనగా దుఃఖములను సహించుట. *ధృతి* అనగా జిహ్వ మరియు జననేంద్రియములను జయించుట (వాటి ఉద్వేగమును అణచుట). *దండన్యాసము* అనగా ఏ ప్రాణి యెడలను ద్రోహచింతన లేకుండుట (ఏ ప్రాణినీ దండింపకుండుట). *దానము* అనగా ధనమును అర్హులకు ఇచ్చుటయేగాక, ఇతరులకు (ఆపన్నులకు) అభయమిచ్చుట, *తపస్సు* అనగా భోగములయెడ అపేక్ష లేకుండుట. *శౌర్యము* అనగా కేవలము శత్రువులను జయించుట మాత్రమేగాదు, వాసనలను అన్నింటిని జయించుట. *సత్యము* అనగా కేవలము యదార్థభాషణమేగాదు. సకల ప్రాణులలోను పరమాత్మను దర్శించుట.


*19.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*ఋతం చ సూనృతా వాణీ కవిభిః పరికీర్తితా|*


*కర్మస్వసంగమః శౌచం త్యాగః సన్న్యాస ఉచ్యతే॥12998॥*


*ఋతము* అనగా సత్యము మరియు హితభాషణము అని మహాత్ములు పేర్కొనిరి. *శౌచము* అనగా కర్మలయందు ఆసక్తి లేకుండుట. *సన్న్యాసము* అనగా కోరికలను త్యజించుట.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

ఉబ్బసవ్యాధి నివారణ కొరకు అద్బుత యోగం -

 ఉబ్బసవ్యాధి నివారణ కొరకు అద్బుత యోగం -


 

      చక్కగా పెద్దగా ఎదిగిన కలబంద మట్టని మొదలకి కొసి తెచ్చుకోవాలి . దీన్ని అడ్డంగా వెదురుబద్ధ చీల్చినట్టు రెండుగా చీల్చుకొని అందులో నవాసారం పొడిని తగినంతగా చల్లి తిరిగి రెండింటిని యధాప్రకారం చేర్చి దారంతో చక్కగా కట్టి ఎండలో వేలాడదీసి దీనికింద ఒక గాజు లేక పింగాణి పాత్రని ఉంచాలి. ఎండవేడికి కరిగి రెండు గంటల్లో పాత్రలోకి కలబంద ద్రావణం దిగుతుంది. పూర్తిగా దిగినతరువాత దీనిని ఒక గాజుసీసాలో పోసి మూత గట్టిగా బిగించాలి.


           తరువాత ఒక పాత్రలో నీళ్లు తీసుకుని బాగా మరిగేలా కాచి దించి ఆ పాత్రలో నీటిలో ఈ గట్టిగా బిగించిన సీసాని ఉంచాలి . సీసాతోపాటు ద్రావకం కూడా వేడెక్కుతుంది . అలా వేడెక్కిన తరువాత సీసాని తీసి భద్రం చేయాలి . 


  వాడే విధానం - 


      ఉదయం , సాయంత్రం రెండుపూటలా అరకప్పు నీటిలో అయిదు చుక్కలు ఈ ద్రావకం కలుపుకుని సేవించాలి . వారం రోజుల్లో మీకు ఫలితం కనిపిస్తుంది. 


  గమనిక - 


      ఈ ఔషదం వాడే సమయంలో చేప , ఎండుచేప , కోడి మాంసం నిషేధం .


          నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


       


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మా పాఠశాలలు ఎలా మూతపడ్డాయో

 *🙏🙏🙏🙏🙏🙏🙏🙏* 


*మా పాఠశాలలు ఎలా మూతపడ్డాయో తెలుసుకోండి.* 


🙏🙏🙏🙏🙏🙏🙏🙏 


*మనం ఎదుగుతున్నప్పుడు సైన్స్, ఆర్ట్స్, కామర్స్ అనే 3 బ్రాంచ్‌లు మాత్రమే తెలుసు.* 


*1978లో కళాశాలలకు ఐదు శాఖలు ఉండేవి.* 


సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ మరియు ఎలక్ట్రానిక్స్. 


కానీ *మీకు తెలుసా మన భారతీయ పాఠశాలలు 1858కి ముందు 50-72 రకాల విద్యలను బోధించేవి.* 


భారతీయ పాఠశాలల వ్యవస్థను బ్రిటిష్ దార్శనికులు నాశనం చేశారు. 


*ఇంగ్లండ్‌లో మొదటి పాఠశాల 1811లో ప్రారంభించబడింది.  ఆ సమయంలో భారతదేశంలో 732000 భారతీయ పాఠశాలలు ఉన్నాయి.* 


మా పాఠశాలలు ఎలా మూతపడ్డాయో తెలుసుకోండి.  ఇండియన్ స్కూల్ లెర్నింగ్ ఎలా ముగిసింది.

ముందుగా భారతీయ సంస్కృతిలో ఏయే విభాగాలు బోధించబడ్డాయో చెబుతాను! 


చాలా భారతీయ పాఠశాలలు ఈ క్రింది విషయాలను బోధించాయి. 


01 అగ్ని విద్య (మెటలర్జీ)

02 వాయు విద్య (గాలి)

03 జల విద్య (నీరు)

04 అంతిక్ష్ విద్యా (అంతరిక్ష శాస్త్రం)

05 పృథ్వీ విద్య (పర్యావరణం)

06 సూర్య విద్య (సోలార్ స్టడీ)

07 చంద్ర మరియు లోక్ విద్య (చంద్రుని అధ్యయనం)

08 మేఘ్ విద్యా (వాతావరణ సూచన)

09 ధాతు ఊర్జ విద్య (బ్యాటరీ శక్తి)

10 దిన్ ఔర్ రాత్ విద్య.

12 సృష్టి విద్య (అంతరిక్ష పరిశోధన)

13 ఖగోల్ విజ్ఞాన్ (ఖగోళ శాస్త్రం)

14 భుగోల్ విద్యా (భూగోళశాస్త్రం)

15 కాల విద్య (సమయ అధ్యయనాలు)

16 భూగర్భ్ విద్యా (జియాలజీ & మైనింగ్)

17 రత్నాలు మరియు లోహాలు (రత్నాలు & లోహాలు)

18 ఆకర్షణ విద్య (గురుత్వాకర్షణ)

19 ప్రకాష్ విద్య (శక్తి)

20 సంచార్ విద్య (కమ్యూనికేషన్)

21 విమాన విద్య (విమానం)

22 జలయన్ విద్య (నీటి నాళాలు)

23 ఆగ్నేయ అస్త్ర విద్య (ఆయుధాలు & మందుగుండు సామగ్రి)

24 జీవవిజ్ఞాన విద్య (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం)

25 యజ్ఞ విద్య (మెటీరియల్ సిక్)

* ఇదీ వైజ్ఞానిక విద్య గురించిన చర్చ.  ఇప్పుడు కవర్ చేయబడిన వృత్తిపరమైన మరియు సాంకేతిక విభాగాల గురించి మాట్లాడుకుందాం!*

26 వ్యాపార విద్యా (కామర్స్)

27 కృషి విద్య (వ్యవసాయం)

28 పశు పాలన్ విద్య (పశుసంవర్ధక)

29 పక్షి పాలన్ (పక్షి సంరక్షణ)

30 యాన్ విద్య (మెకానిక్స్)

32 వాహన రూపకల్పన

33 రతంకర్ (రత్నాలు & ఆభరణాల రూపకల్పన)

36 కుమ్హార్ విద్యా (కుమ్మరి)

37 లఘు (మెటలర్జీ & కమ్మరి)

38 టక్కాలు

39 రంగ్ విద్య (డైయింగ్)

40 ఖట్వాకర్

41 రజ్జుకర్ (లాజిస్టిక్స్)

42 వాస్తుకార్ విద్య (వాస్తుశిల్పం)

43 ఖానా బనానే కి విద్య (వంట)

44 వాహన విద్య (డ్రైవింగ్)

45 జలమార్గాల నిర్వహణ

46 సూచికలు (డేటా ఎంట్రీ)

47 గౌశాల మేనేజర్ (పశు సంవర్ధక)

48 బాగ్వాణి (హార్టికల్చర్)

49 వాన్ విద్య (అటవీ శాస్త్రం)

50 సహయోగీ (కవరింగ్ పారామెడిక్స్) 


ఈ విద్య అంతా బడిలో బోధించబడింది, కానీ కాలక్రమేణా, పాఠశాల అదృశ్యమైనప్పుడు, ఈ జ్ఞానం బ్రిటిష్ వారు కనుమరుగయ్యేలా చేసారు!  ఇది మెకాలేతో ప్రారంభమైంది.  నేడు మెకాలే పద్ధతిలో మన దేశ యువత భవిష్యత్తు నాశనం అవుతోంది. 


భారతదేశంలో పాఠశాల సంస్కృతి ఎలా ముగిసింది?

కాన్వెంట్ విద్య శిథిలమైన పాఠశాలల ప్రవేశం భారతీయ విద్యా చట్టం 1835లో ఏర్పడింది (1858లో సవరించబడింది).  దీనిని 'లార్డ్ మెకాలే' రూపొందించారు. 


చాలా మంది బ్రిటీషర్లు భారతదేశ విద్యా వ్యవస్థ గురించి తమ నివేదికలను అందించినప్పుడు మెకాలే ఇక్కడ విద్యా వ్యవస్థపై సర్వే నిర్వహించారు.  బ్రిటిష్ అధికారి ఒకరు జి.డబ్ల్యూ.  లూథర్ మరియు మరొకరు థామస్ మన్రో!  వీరిద్దరూ వేర్వేరు సమయాల్లో వేర్వేరు ప్రాంతాల్లో సర్వే చేశారు.  ఉత్తర భారతదేశాన్ని (ఉత్తరభారత్) సర్వే చేసిన లూథర్ ఇక్కడ 97% అక్షరాస్యత ఉందని మరియు దక్షిణ భారతదేశాన్ని (దక్షిణభారత్) సర్వే చేసిన మన్రో ఇక్కడ 100% అక్షరాస్యత ఉందని రాశారు. 


భారతదేశం (భారత్) శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే, దాని ′′*స్వదేశీ మరియు సాంస్కృతిక విద్యా వ్యవస్థ*′′ని పూర్తిగా కూల్చివేసి, దాని స్థానంలో "ఇంగ్లీషు విద్యావిధానం′′" తీసుకురావాలి, అప్పుడే భారతీయులు భౌతికంగా భారతీయులు అవుతారని మెకాలే స్పష్టంగా చెప్పాడు.  , కానీ మానసికంగా ఇంగ్లీష్ మారింది.  వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఆంగ్ల విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు, వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు అనుగుణంగా పని చేస్తారు. 


మెకాలే ఒక యాసను వాడుతున్నాడు - ′′ పంట వేయకముందే పొలాన్ని పూర్తిగా దున్నినట్లే, దానిని దున్నేసి ఆంగ్ల విద్యా విధానంలోకి తీసుకురావాలి.  "అందుకే అతను పాఠశాలలను చట్టవిరుద్ధమని మొదట ప్రకటించాడు.  ఆ తర్వాత సంస్కృతం చట్టవిరుద్ధమని ప్రకటించి పాఠశాలలకు నిప్పంటించి, అందులోని ఉపాధ్యాయులను కొట్టి జైల్లో పెట్టాడు.

1850 వరకు భారతదేశంలో '7 లక్షల 32 వేల' పాఠశాలలు & 7,50,000 గ్రామాలు ఉన్నాయి.  అంటే దాదాపు ప్రతి గ్రామంలో ఒక పాఠశాల ఉండేది మరియు ఈ పాఠశాలలన్నీ నేటి భాషలో 'ఉన్నత అభ్యాస సంస్థలు'గా ఉండేవి.  వాటన్నింటిలో 18 సబ్జెక్టులు బోధించబడ్డాయి మరియు ఈ పాఠశాలల ప్రజలు రాజుచే కాకుండా కలిసి వీటిని నడిపేవారు.

విద్యను ఉచితంగా అందించారు.

పాఠశాలలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్య చట్టబద్ధం చేయబడింది మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది.  అప్పట్లో 'ఉచిత పాఠశాల' అనేవారు.  ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం & మద్రాసు విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి.  ఈ మూడు బానిసత్వ కాలం నాటి విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి!

మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశాడు.  ఇది చాలా ప్రసిద్ధ లేఖ, అందులో అతను ఇలా వ్రాశాడు: ′′ ఈ కాన్వెంట్ పాఠశాలలు భారతీయులలా కనిపిస్తున్నప్పటికీ మెదడులో ఆంగ్లంలో ఉన్న పిల్లలను బయటకు తీసుకువస్తాయి మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు.  వీరికి వారి సంస్కృతి గురించి ఏమీ తెలియదు, వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి యాసలు తెలియవు, ఇలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు, బ్రిటీష్ వారు పోయినా, ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు.  .′′ అప్పట్లో రాసిన లేఖలోని నిజం నేటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది.  ఈ చట్టం సృష్టించిన దుస్థితిని చూడండి.  మన స్వంత భాష మాట్లాడటానికి మరియు మన స్వంత సంస్కృతిని గుర్తించడానికి సిగ్గుపడే మనకంటే మనం తక్కువగా భావిస్తున్నాము. 


మాతృభాషతో తెగతెంపులు చేసుకున్న సమాజం ఎప్పటికీ వర్ధిల్లదు, ఇది మెకాలే వ్యూహం!  ఇక్కడి నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు.  భారతీయ సంస్కృతి అంత చల్లదనాన్ని పరిగణిస్తుంది, కానీ పాశ్చాత్య దేశాన్ని అనుకరిస్తుంది. 


ఎంత పాపం.  మనమందరం మేల్కొలపడానికి మరియు మన గొప్ప సంస్కృతి & వారసత్వాన్ని తిరిగి పొందేందుకు ఇది సరైన సమయం. 


                           ఇట్లు 

                             మీ

            అవధానుల శ్రీనివాస శాస్త్రి

మంచి ఆలోచనలు, మంచి పనులు

 నీకు ఎలా తెలుసు

మీరు ధనవంతులు?


అద్భుతమైన సమాధానం

IIT విద్యార్థి ద్వారా.


నేను బి టెక్ చేస్తున్నప్పుడు మాకు ‘మెకానిక్స్’ నేర్పించే ఒక ప్రొఫెసర్ ఉండేవారు.


అతను బోధించడానికి మరియు వివరించడానికి ఆసక్తికరమైన మార్గం ఉన్నందున అతని ఉపన్యాసాలు చాలా ఆసక్తికరంగా ఉండేవి

భావనలు.


ఒకరోజు క్లాసులో ఈ క్రింది ప్రశ్నలు అడిగాడు.


1. ZERO అంటే ఏమిటి?

2. అనంతం అంటే ఏమిటి?

3. ZERO మరియు INFINITY ఒకేలా ఉండవచ్చా?


మాకు సమాధానాలు తెలుసునని మేమంతా భావించాము మరియు మేము ఈ క్రింది విధంగా ప్రత్యుత్తరం ఇచ్చాము:


ZERO అంటే ఏమీ లేదు.

INFINITY అంటే

ఏదైనా లెక్కించదగిన సంఖ్య కంటే పెద్ద సంఖ్య.


ZERO మరియు INFINITY వ్యతిరేకం మరియు అవి ఎప్పుడూ ఒకేలా ఉండవు.


అతను మొదట అనంతం గురించి మాట్లాడటం ద్వారా మమ్మల్ని ఎదుర్కొన్నాడు మరియు లెక్కించదగిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్య ఎలా ఉంటుంది?


మా దగ్గర సమాధానాలు లేవు.


35 ఏళ్ల తర్వాత కూడా నాకు గుర్తున్న అనంతం అనే కాన్సెప్ట్‌ని చాలా ఆసక్తికరంగా వివరించారు.


నిరక్షరాస్యుడైన గొర్రెల కాపరి ఉన్నాడని ఊహించుకోమని ఆయన అన్నారు

20 వరకు.


ఇప్పుడు, అతని వద్ద ఉన్న గొర్రెల సంఖ్య 20 కంటే తక్కువ మరియు అతని వద్ద ఎన్ని గొర్రెలు ఉన్నాయని మీరు అతనిని అడిగితే, అతను మీకు ఖచ్చితమైన సంఖ్యను చెప్పగలడు (3, 5 14 మొదలైనవి).


అయితే, సంఖ్య 20 కంటే ఎక్కువ ఉంటే, అతను "చాలా ఎక్కువ" అని చెప్పే అవకాశం ఉంది.


సైన్స్‌లో అనంతం అంటే 'చాలా ఎక్కువ' (మరియు లెక్కించలేనిది కాదు) మరియు అదే విధంగా సున్నా అంటే 'చాలా తక్కువ' (మరియు ఏమీ కాదు) అని ఆయన వివరించారు.


ఉదాహరణగా, భూమి మరియు సూర్యుని మధ్య దూరంతో పోలిస్తే భూమి యొక్క వ్యాసాన్ని తీసుకుంటే, భూమి యొక్క వ్యాసం చాలా చిన్నది కనుక సున్నా అని చెప్పవచ్చు.


అయితే, భూమి యొక్క అదే వ్యాసాన్ని ఒక గింజ పరిమాణంతో పోల్చినప్పుడు, భూమి యొక్క వ్యాసం అనంతం అని చెప్పవచ్చు.


అందువల్ల, సందర్భాన్ని బట్టి లేదా మీ పోలిక మాతృకను బట్టి అదే విషయం ఒకే సమయంలో ZERO మరియు అనంతం కావచ్చునని అతను నిర్ధారించాడు.


ఐశ్వర్యం మరియు పేదరికం మధ్య సంబంధం అనంతం మధ్య సంబంధాన్ని పోలి ఉంటుంది

మరియు సున్నా.


ఇది మీ కోరికలతో పోలిక స్థాయిపై ఆధారపడి ఉంటుంది.


మీ ఆదాయం మీ కోరికల కంటే ఎక్కువగా ఉంటే,

మీరు ధనవంతులు.

మీ కోరికలు మీ ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే,

మీరు పేదవారు.


నా సంపాదన కంటే నా కోరికలు చాలా తక్కువ కాబట్టి నన్ను నేను ధనవంతుడిగా భావిస్తాను.


నేను చాలా డబ్బు సంపాదించడం ద్వారా చాలా ధనవంతుడిని అయ్యాను, కానీ క్రమంగా నా కోరికలను తగ్గించుకోవడం ద్వారా.


మీరు మీ కోరికలను తగ్గించుకోగలిగితే, మీరు కూడా ఈ క్షణంలో ధనవంతులు కావచ్చు.


మంచి ఆలోచనలు, మంచి పనులు, మీ చుట్టూ ఉండే మంచి వ్యక్తులతో మీ జీవితాలు ఎల్లప్పుడూ సంపన్నం కావాలి.🙏🏽

పాలు.. వాటి కథ..

 పాలు.. వాటి కథ..


పొద్దున్నే వచ్చాడు మిత్రుడు. కీటో డైటింగ్ చేస్తున్నాడుకాబట్టి కాస్త సన్నబడ్డాడు. సరే! కాఫీ తాగుతావా అని అడిగాను, అప్పుడే ఇంట్లోంచి ఘుమఘుమ కాఫీ వొసన వస్తోంది. వేడి వేడి కాఫీ రెడీ ఔతోంది. "అయ్యబాబోయ్!! నేను కాఫీ తాగను" అని అన్నాడు, కాఫీ తాగితే పున్నామ నరకానికి పోతామనేంత ముఖం చిట్లిస్తూ...


సరే పోనీ పాలు!?


పాలు తాగుతాను కానీ!. పాకెట్ పాలైతే తాగను. మీ ఇంట్లో గేదె పాలు ఉంటే ఇవ్వండి‌. అన్నాడు.


నీ కోరిక సింగారం గానూ!. గేదెల్ని నేనెక్కడ నుంచి తీసుకురావాలి సామీ!. ఐనా ప్యాకెట్ పాలు ఏం పాపం చేశాయట?. తాగనంటున్నావ్!? అని అడిగాను.


"నేను అంతా ప్రకృతి సహజమైన పాలే తాగుతాను. ఈ ఇంగ్లీష్ వాళ్ళు పాలల్లో ఏవో కెమికల్స్ కలిపి ఈ పాకెట్ పాల సిస్టం తీసుకొచ్చారు. ఇవి ఆరోగ్యానికసలు మంచిదే కాదు. చాలా డేంజర్!. ఈ రోజు మనకొచ్చే జబ్బులకన్నింటికీ ఈ ప్యాకెట్ పాలే కారణం..." అన్నాడు. ఇంత గ్యానం ఎక్కడిదీ సారుకు అని ఆశ్చర్యంగా చూసే లోపల అతడే అన్నాడు...

"ఇంత జ్ఞానం నాకెక్కడిది అనుకున్నావా?. మొన్ననే ఒక ప్రోగ్రాం అటెండయ్యా!. ఆయన మీ ఆధునిక డాక్టర్ల బండారం మొత్తం బయట పెట్టేశాడు. ప్రపంచమంతా సహజత్వం వైపు ప్రకృతి వైపు ఆరోగ్యం వైపు పయనిస్తుంటే మీ డాక్టర్లు మాత్రమే ఆ ఇంగ్లీషోడు పాశ్చర్ చెప్పినట్టు పాలను పాశ్చరైజేషన్ కు గురిచేసి వాటిని పసలేని పాలుగా మార్చి వాటిని తాగమని అడ్వైజ్ చేస్తున్నారు...అవి తాగటం వలననే సకల జబ్బులూ వస్తున్నాయి" అన్నాడు. ఆవేశంగా.. కాసేపు బుర్ర గిర్రున తిరిగింది. వీళ్ళు ప్రాబ్లం పాశ్చరైజేషన్ తోనా లేక ఇంగ్లీష్ వాళ్ళతోనా అనుకున్నాను. ఈ రేంజ్ గ్యానం అందించిన ఆ సహజ ప్రకృతి అడ్వైజర్ ఎవరో చూడాలని అనుకున్నా. నేను నోట మాట రాక ఆశ్చర్యం పోతుంటే..." నోట మాట రావట్లేదు కదూ!. మీ బండారం బయట పడింది కదూ!" అన్నాడు. ఓర్నీ వీడి దుంపతెగ!. "సరేనబ్బా...! ఇంతకీ గేదె పాలు డైరెక్ట్ గా తాగితే ఏంటంట బెనిఫిట్టు!?'" అనడిగిను.


"అసలే జబ్బులూ రావు. చిన్న పిల్లలకు కూడా ఆ పాలే ఇవ్వాలి. తల్లి పాలు లేకపోతే స్వచ్ఛమైన దేశీ ఆవు పాలు ఇవ్వాలి'" అన్నాడు ఖరాఖండీగా!


నాయనా! ఇటువంటి పిచ్చి పనులు మీరు చేయాలనుకుంటే చేయండి, కానీ పిల్లలకు పాశ్చరైజ్డ్ ఆవు పాలే ఇవ్వండి. పాశ్చరైజేషన్ వలన హాని కారక బ్యాక్టీరియాలు ఎన్నో చంపబడతాయి. ముఖ్యంగా ఈ.కోలై, కాంపైలోబ్యాక్టర్, లిస్టీరియా, సాల్మోనెల్లా, బ్రూసెల్లా, ట్యూబర్క్యులోసిస్, స్ట్రెప్టోకోకస్ వంటివి చంపబడతాయి. పాలను పితికేటపుడు ఆ పశుల కొట్టంలో ఉండే సకల బ్యాక్టీరియాలు పాలలో కలుస్తాయి. కింద ఆ నేలమీద ఉండేటటువంటి పేడ, అక్కడ ముసురుకున్న ఈగలు, పశువుల మూత్రం, గడ్డి, పాలు పిండుతున్న వాడి చేతులు( పొద్దున్నే పిండుతాడు మరి...నైట్ చేతులు ఎక్కడైనా పెట్టుకోచ్చుగాక!) పిండే ఆ బకీట! ఇవన్నీ పరమ పవిత్రంగా ఉన్నాయని నీవనుకుంటే అట్టాగే కానీయ్! కానీ పాలు ఇంతటి unhygienic conditions లో పితకబడతాయి. ఆవు పొదుగుకు ఉండే ఇన్ఫెక్షన్( mastitis)వలన ఆ బ్యాక్టీరియా కూడా అందులో చేరుతాయి. ఈ సకల బ్యాక్టీరియా లనూ వాటి స్పోర్లనూ ఒక్క పాశ్చరైజేషన్ ద్వారా చంపి పడేయొచ్చు. పాశ్చరైజేషన్ లో ఏమీ కెమికల్స్ ని కలపరు. వాటిని ఒక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి కొంత సేపు అదే ఉష్ణోగ్రత వద్ద ఉంచి ఫాస్ట్ గా కూల్ చేస్తారు. ఇలా చేయడం వలన ఎన్నో బ్యాక్టీరియాలు చనిపోతాయని లూయీ పాశ్చర్ కనుగొన్నాడు" అని చెప్పాను. " ఇంకో విషయం ఏమిటంటే un pasturized milk తాగటం వలన ఇటువంటి milk born diseases ఎన్నో విజృంభించిన సందర్భాలు రికార్డై ఉన్నాయి. పెద్దలకే ఈ పాలు హానికరం అంటుంటే చిన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టకూడదు.


అదేం కాదు. పాలల్లో మనిషికి ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా ఉంటాయట అవి చనిపోవడం వలన నష్టమే కదా!?. అడిగాడు.


"'మనిషికి ఉపయోగపడే బ్యాక్టీరియా లు మనిషి కడుపులోనే ఉంటాయి. ఈ పాలలో ఎందుకుంటై?. ఆవు లేదా గేదె కడుపులో దానికి అవసరమైన బ్యాక్టీరియాలు ఉంటై, అవి పాలలోకి రావు. ఉదాహరణకు బైఫిడో బ్యాక్టీరియాలు మనిషికీ గేదెకీ కడుపులో ఉంటాయి. ఇపుడు గేదె పాలలో బైఫిడో బ్యాక్టీరియా ఉంటే ఏమని అర్థం!?" సీరియస్ గా అడిగాను. భృకుటి ముడి పెట్టి చూశాడు ..అంతే సీరియస్ గా. సమాధానం రాకపోయేసరికి నేనే చెప్పాను.


" అరే సామీ! మనిషి కడుపులో, గేదె కడుపులో ఉండే ఆ బ్యాక్టీరియా గేదె పాలలోకి ఎలా వస్తాయి!?.. కేవలం ఫీకల్ మ్యాటర్ వలననే కదా బయటకు రావాలి!. అంటే ఆ గేదె పెండతో ఆ పాలు కంటామినేట్ ఐవుండాలి. లేదా ఆ పాలు పితికేవాడు పొద్దున్నే తన వామ హస్తముతో......"'


ఛీ!... నిజమా?...రామ రామా!!"'


"'కృష్ణ కృష్ణా!. అందుకే నీకు సహజత్వమని సొల్లేసినోడెవడో మహా ఘటికుడు. చదువుకున్న నిన్నే బోల్తా కొట్టించాడు చూశావూ!?"" అన్నాను.


మరి పాశ్చరైజేషన్ వలన పాలల్లో శక్తి తగ్గుతుందని, ఆ పాలు వలన ఎముకలు పలుచనవుతాయనీ చెప్పాడే!?. 


వాడి బొంద!. పాలను వేడి చేస్తే పాల ప్రొటీన్ "కేసిన్"' కి ఏమీ కాదు. అలాగే పాలలో ఉండే కాల్షియం ఏమీ ముక్కలైపోదు. కాబట్టి మామూలు పాలలో ఎంత ప్రొటీన్ ఉంటుందో ఎంత కాల్షియం ఉంటుందో పాశ్చరైజ్డ్ పాలల్లో అంతే ఉంటుంది. ఇక పాలలో ఉండే ల్యాక్టోజ్ అనే షుగర్ కొంతమందికి పడదు. అది పాకెట్ పాలా గేదె పాలా అని కాకుండా లాక్టోజ్ ఎక్కడున్నా పడదు. లాక్టేజ్ అనే ఎంజైమ్ కడుపులో లేకపోవడం వలన పాలు అరగక ఇబ్బందులు పడుతూంటారు. దీనిని లాక్టోజ్ ఇంటోలరెన్స్ అంటారు. చిన్న పిల్లల్లో ఇది ఉంటే వాళ్ళ ఎదుగుదల ఉండదు. 


ఔనౌను. దీని గురించి కూడా చెప్పాడు. ఐతే ప్యాకెట్ పాలవలననే ఇది వస్తుందనీ, ఆవు పాలు తాగితే రాదనీ చెప్పాడు. ఇంకా ప్యాకెట్ పాలు తాగితే ఆస్తమా వస్తుందనీ చెప్పాడు.


ఇదీ అబద్దమే! ఆస్త్మా అనేది కొన్ని ప్రోటీన్ లకు రియాక్షన్ గా వస్తుంది. పాలలో కేసీన్ ఉంటుంది. పాశ్చరైజేషన్ వలన కేసిన్ ప్రోటీన్ స్ట్రక్చర్ లో మార్పు ఏమీ ఉండదు. కాబట్టి ఒక వ్యక్తికి కేసీన్ ప్రొటీన్ పడలేదంటే అది ప్యాకెట్ పాలైనా గేదె పాలైనా ఒకటే!. కేవలం ప్యాకెట్ పాలకు మాత్రమే ఆస్తమా వస్తుంది గేదె పాలకు రాదు అని చెప్పడంలో ఏ సైన్సూ లేదు.