30, అక్టోబర్ 2021, శనివారం

శ్రీమద్భాగవతము

 *30.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2307(౨౩౦౭)*


*10.1-1446*


*క. పెనిమిటి బిడ్డని గుణములు*

*వినిపింప యశోద ప్రేమవిహ్వలమతియై*

*చనుమొనలఁ బాలు గురియఁగఁ*

*గనుఁగొనలను జలము లొలుకఁగా బెగ్గిలియెన్.* 🌺



*_భావము: నందుడు అలా తన ముద్దుల కుమారుడు కృష్ణుని లీలలను గురించి వర్ణిస్తుంటే, యశోదాదేవి ప్రేమాతిరేకముతో చలించిపోయి శోకించగా, ఆమె స్తనములనుండి చనుబాలు, కన్నులనుండి ధారాపాతముగా కన్నీరు ప్రవహించింది._* 🙏



*_Meaning: As Nanda was narrating the mystic deeds of Sri Krishna , Yashodadevi was overwhelmed with intense emotion and profound fondness and thinking of her son, milk gushed from her breasts and tears flowed from her eyes._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

కామెంట్‌లు లేవు: