17, జనవరి 2026, శనివారం

ఆదివారం*🌞 *🌹18జనవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌞 *ఆదివారం*🌞     

   *🌹18జనవరి2026🌹*    

     *దృగ్గణిత పంచాంగం* 

   

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - బహుళపక్షం*


*తిథి      : అమావాస్య* ‌రా 01.21 ఉపరి *మాఘం ప్రారంభం*

*వారం    : ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం   : పూర్వాషాఢ* ఉ 10.14 వరకు ఉపరి ఉత్తరాషాఢ

*యోగం  : హర్షణ* రా 09.11 వరకు ఉపరి *వజ్ర* 

*కరణం   : చతుష్పాద* మ 12.45 *నాగ* రా 01.21 ఉపరి *కింస్తుఘ్న*

*సాధారణ శుభ సమయాలు* 

         *ఈరోజు లేవు*

అమృత కాలం  : *శేషం ఉ 06.45 వరకు*

అభిజిత్ కాలం  : *ప 11.55 - 12.40*

*వర్జ్యం            : సా 06.46 - 08.29*

*దుర్ముహూర్తం  : సా  04.26 - 05.11*

*రాహు కాలం   : సా 04.32 - 05.56*

గుళికకాళం      : *మ 03.07 - 04.32*

యమగండం    : *మ 12.18 - 01.42*

సూర్యరాశి : *మకరం*

చంద్రరాశి : *ధనస్సు/మకరం*

సూర్యోదయం :*ఉ 06.50*

సూర్యాస్తమయం :*సా 06.04*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.39 - 08.55*

సంగవ కాలం         :     *08.55 - 11.10*

మధ్యాహ్న కాలం    :      *11.10 - 01.26*

అపరాహ్న కాలం    : *మ 01.26 - 03.41*

*ఆబ్ధికం తిధి         : పుష్య అమావాస్య*

సాయంకాలం        :  *సా 03.41 - 05.56*

ప్రదోష కాలం         :  *సా 05.56 - 08.29*

రాత్రి కాలం           :*రా 08.29 - 11.52*

నిశీధి కాలం          :*రా 11.52 - 12.43*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58 - 05.49*

******************************

        🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞*


*వరాహ్యై నమః ఇంద్రాణ్యై నమః*

*చాముండాయై నమః* 

*కంఠస్థానే మాం రక్షతు*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

ఎక్కాల పుస్తకం*

 *ఎక్కాల పుస్తకం*  

-------------------------

ఎవరు కనిపెట్టారో కాని చిన్నతనంలో నూటికి కనీసం 70 మంది పిల్లల్ని భయపెట్టేది ఈ పుస్తకం. ప్రతీ పుస్తకానికీ గైడ్లు వున్నాయి. కానీ దీనికి లేవు. అలా అంకెలు నేర్చుకుని ఒకటో తరగతి నించి రెండో తరగతిలోకి అడుగు పెట్టామో లేదో ఈ పుస్తకం పుస్తకాల సంచీలోకి చేరిపోయేది. అందులో పట్టుమని 10 పేజీలు లేకపోయినా లావుపాటి తెలుగు, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము లాంటి పుస్తకాల కంటే ఎక్కువ భయపెట్టేది. 


ఈ ఏడాది పుస్తకాలన్నీ మారిపోయాయి. కొత్త పుస్తకాలు కొనండి అని ఇంట్లో గొడవ పెడితే అన్నీ కొనేవారు కాని, ఎక్కాల పుస్తకం మాత్రం కొనేవారు కాదు. ఏ అక్కో, అన్నో వాడేసి చిరిగి శల్యావస్థ లో వున్న పుస్తకం వాడుకోమనే వారు. ఎందుకంటే ఎక్కాల పుస్తకం ఏమీ మారదు కదా అనేవారు. ఇదొక యునివర్సల్ పుస్తకం. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా ఏ ఖండంలోనైనా రెండు రెళ్లు నాలుగే – ఒక్క తెలుగు సినిమాలో తప్ప. అక్కడ మాత్రం “రెండు రెళ్లు ఆరు”.  

 

అందరికీ బై డిఫాల్ట్ ఒకటో ఎక్కం వచ్చేస్తుంది కదా. రెండో తరగతిలో రెండో ఎక్కంతో మొదలయ్యేవి పాట్లు. “ రెండొకట్ల రెండు, రెండ్రెళ్ళు నాలుగు, రెండు మూళ్ళు ఆరు ...” అంటూ ఒక ప్రత్యేక రాగం లో మాస్టారు పాడితే మనం కూడా అనాలన్న మాట. వేదాలు నేర్చుకునే వాళ్ళు కూడా అంత చక్కగా ఒకే రాగంలో మంత్రాలు చదవలేరన్నట్లుగా సాగేది ఆ రాగం. ఈ ఎక్కాల రాగాన్ని కర్ణాటక సంగీతంలో ఎందుకు చేర్చలేదో ఇప్పటికీ అర్ధం కాదు. దీని గొప్పతనం ఏమిటంటే ఈ రాగంలో పాడితేనే ఎక్కం సరిగ్గా వచ్చేది. కాని దాని శృతి/రాగం/తాళం ఏమాత్రం మార్చినా ఆ ఎక్కం నోటికి వచ్చేది కాదు. అసలు అది బుర్రలోకి అంత సులభంగా ఎక్కదు కాబట్టే దానికి “ఎక్కము” అనే పేరు వచ్చి వుంటుంది. 


అసలు ఎక్కాలు అంటే గుణకారాలేనని తెలియడానికి ఓ రెండు మూడు ఏళ్లు పట్టేది. అసలు ఇవి ఎందుకు కంఠతా పట్టాలి మాస్టారూ అని అడిగితే “పెద్దయ్యాక ఉపయోగిస్తాయిరా” అనే సమాధానం వచ్చేది. 


ఇరవై ఇరవైలు దాకా కంఠస్థ పడితే కాని పైక్లాస్ కి పంపము అని ప్రతీ క్లాస్ లోనూ అందరికీ ఓ మాస్ వార్నింగ్ లాంటిది ఇచ్చేవారు. ప్రతీ ఎక్కం ఇరవై దాకానే ఎందుకుంటుంది, అలాగే పుస్తకంలో 20వ ఎక్కం దాకానే ఎందుకుంటుంది అన్నది అప్పట్లో అంతుచిక్కని ప్రశ్న. బహుశా మన సామర్ధ్యం ఇరవైల దాకానే అని వాళ్ళు నిర్ధారించుకుని వుంటారు.


ఏ పనికైనా వాయిదా పద్ధతి వున్నట్లు రెండో క్లాస్ లో పది పదుల దాకా చాలు అనేవారు. ఒక్కో క్లాసు పెరిగే కొద్దీ పన్నెండు పన్నెండులు, పదహారు పదహార్లు, చివరికి ఇరవై ఇరవైలు దాకా సాగేది. ఎక్కాలు అప్పజెప్పే సమయంలో అందరికీ గుండెలు దడ దడ లాడేవి. అప్పటి దాకా చదివినదే అయినా మాస్టారి దగ్గరకి వచ్చేసరికి ఆరు ఆర్లు కాస్తా నలభై రెండు అయిపోయేది. ఓ రెండు బెత్తం దెబ్బలు కొట్టి మళ్ళీ మొట్టమొదటి నించీ చదివి అప్పజెప్పు అని లైన్ లో చివరికి పంపించే వారు. 


నెక్స్ట్ స్టేజ్ లో కూడా ఎక్కాలు మోసం చేసేవి. అన్నీ చక్కగా అప్పచెప్తూ ఆరార్లు ముప్ఫై ఆరు అని చెప్పగానే మాస్టారు కోపంగా “ముప్ఫై ఆరా ?” అని గద్దించే సరికి సెల్ఫ్ డౌట్ వచ్చి నలభై రెండు అనడం, రెండు దెబ్బలు తినడం, మళ్ళీ లైన్ లో చివరికి వెళ్ళడం నిమిషాల్లో జరిగిపోయేది. 


అప్పట్లో వీడియోలు లేవు కానీ ఈ ఎక్కాల క్లాస్ వీడియో తీస్తే ఒక హారర్ రీల్ గా వైరల్ అయిపోయేది. చేతులు దండకట్టి శూన్యంలోకి చూస్తూ మధ్య మధ్య మాస్టారి బెత్తం వైపు బెరుకు చూపులు చూస్తూ అప్పజెప్తుంటే భలే వుండేది. ఇక ఆడపిల్లలైతే రాగం బ్రేక్ అయిపోయి ఏడెనిమిదులు.. ఏడెనిమిదులు.. ఏడెనిమిదులు.. అంటూ కళ్ళు ఆకాశం వైపు పెట్టి దైవ సహాయానికై అర్ధించేవాళ్ళు. దేవుడు మాత్రం సహాయం మాట అటుంచి రెండు చిన్న బెత్తం దెబ్బలు మాస్టారి ద్వారా ప్రసాదించేవాడు. 


ప్రతీ క్లాస్ లోనూ ఒకరిద్దరు ఐన్స్టీన్ లు వుంటారు కదా. వాళ్ళు ఎప్పుడు కంఠస్థ పడతారో తెలిసేదికాదు గాని టక టకా అప్పజెప్పేసే వాళ్ళు. ప్రపంచాన్ని జయించినంత గర్వంతో మిగతా వాళ్ళ వైపు జాలిగా చూస్తుండేవారు. మనకి వళ్ళు మండిపోతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయత. 


సరే, రాగాన్ని ప్రాక్టీస్ చేసో, కొండగుర్తులు పెట్టుకునో, బండగా బట్టీ పట్టో మొత్తానికి ఇరవై ఇరవైల దాకా అప్పజెప్పామనుకోండి, వెంటనే మాస్టారు రూల్స్ మార్చేసేవారు. ఈసారి తలక్రిందుగా అప్పజెప్పాలి అనే వారు. అంటే ఇరవై ఇరవైలు నాలుగొందలు నుంచి రెండు ఒకట్ల రెండు దాకా అన్న మాట. పట్టుదలగా అదీ సాధిస్తే ఈ సారి రాండమ్ గా అడిగేవారు. పదమూడు పదిహేళ్లెంత అనో, పద్దెనిమిది పదమూళ్లెంత అనో ఆడగ్గానే మనసులో రాగం పాడుకోడానికి టైమ్ పట్టేది. 


 స్కూల్లో మాష్టర్లే కాదు, ఇంటికొచ్చిన చుట్టాలు, పక్కాలు కూడా కనబడితే చాలు “ఎన్నో క్లాస్ రా నువ్వు ? ఎన్ని ఎక్కాలు వచ్చు ? పన్నెడు పద్నాలుగులు ఎంత ?” లాంటి ప్రశ్నలతో వేధించే వాళ్ళు. అందుకే వాళ్ళని తప్పించుకుని తిరగవలసి వచ్చేది.  

  

ఈ ఎక్కాల పుస్తకంలో ఎక్కాలే కాక ఇంకా ఎన్నో వుండేవి. అవి చాలా ఇంటరెస్టింగ్ గా వుండేవి. ప్రతీ పేజీలోనూ క్రింద ఒక మంచి సుభాషితమో, సామెతో, వేమన పద్యమో వుండేది. అవన్నీ చక్కగా కంఠతా వచ్చేసేవి. చివరి పేజీలలో అన్ని భాషల లోనూ తెలుగు వారాల పేర్లు,నెలల పేర్లు,ఋతువులు,తిధులు,నక్షత్రాల పేర్లు వుండేవి. తెలుగుతో బాటు తమిళ, హిందీ భాషలలొ కూడా వుండేవి. భాను వారము, ఇందు వారము .. చిత్తి , వయ్యాశీ.. ఇలాగ. నిజానికి తెలుగు రాష్ట్రాలలో పల్లెటూళ్ళలో వుండేవారికి దేశంలో తెలుగుతో బాటు వేరే భాషలు కూడా వుంటాయని మొదటి సారి పరిచయం చేసేది ఈ ఎక్కాల పుస్తకమే. అవి చదివేసిన విద్యార్ధులు బహుభాషా కోవిదుల్లా ఫీలైపోయేవారు.  


మొత్తానికి ఈ ఎక్కాల పుస్తకం ఒక మైక్రో బాలశిక్షలా పనిచేసేది. ఇది చదివినందువల్లే అప్పటి పిల్లలకి తెలుగు నెలలు, తిధుల పేర్లు తెలిసేవి. ఇప్పటి బాలలని ఎవరిని అడిగినా ఇవి సరిగ్గా చెప్పలేరని బల్ల గుద్ది మరీ చెప్పవచ్చు. కావాలంటే మీరే టెస్ట్ చేసుకోండి. 


ఇంతటి ఘన చరిత్ర వున్న ఎక్కాల పుస్తకం ఈనాటి కాలిక్యులేటర్లు, అబాకస్ లు, టాబ్లెట్ ల ధాటికి తట్టుకోలేక మాయమైపోతోంది. దానితోబాటే మన పిల్లలకి తెలుగు సంస్కృతిని చిన్నతనం నించీ నేర్పే అవకాశం కూడా మృగ్యమైపోతోంది. ఐ మిస్ యు - ఎక్కాల పుస్తకం !!


ఇది చదివిన తర్వాత మీరు కూడా మిస్సవుతున్నారు కదూ? వెంటనే బజారుకెళ్ళి ఓ ఎక్కాల పుస్తకం కొనుక్కుని ఇరవై ఇరవైల దాకా తలక్రిందుగా కంఠస్థం చేయండి. మొబైల్లో పాడు రీల్స్ చూస్తూ కాలక్షేపం చేసేకంటే అదే మంచిది. మైండ్ ఆరోగ్యంగా, ఉత్సాహంగా వుంటుంది.🌹

సంక్రాంతిపండుగ

 

  🪷 *సంక్రాంతిపండుగ శుభాకాంక్షలు* 🪷


సీ॥

ముంగిళ్ళ దిద్దిన రంగవల్లులలోన 

గొబ్బిదేవతలెల్ల కూడియుండ 

సన్నాయి మేళముల్ సరిగంగిరెద్దులు 

హరిదాసు కీర్తన లందగించ 

చెఱకుదండమ్ములు చేబంతిక్రీడలు 

మంగళతోరణమాల లలర

పొంగారు పొంగళ్ళు పోతుపేరంటాలు 

క్రొత్తయల్లుళ్ళదౌ కోలహలము 

గీ॥ నింగినంటు గాలిపటల భంగిమలును 

బావమరదళ్ళ సరదాల భాషణములు 

నింత యంతయు గాదయ నెంతొ కలదు 

మకరసంక్రాంతి సందడి మరులు గొలుపు 


సీ॥

క్రొత్తబెల్లముతోడ క్రొత్తబియ్యముజేర 

సంక్రాంతి యయ్యెనో చందమలర 

ధనువు వీడిన రవి తా మకరము జేర 

సంక్రాంతి ప్రబలెనో సౌరులలర 

రైతుకష్టములెల్ల ప్రభవించ ధాన్యమై 

సంక్రాంతి ప్రసరించె శాలలలర 

బొమ్మలకొలువుల ముగుదపేరంటాళ్ళ 

సంక్రాంతి యరుదెంచె సరసతలర 

గీ॥ రంగులలముకొన్న వృషభరాజులెల్ల 

పూజలందగ సంక్రాంతి మోహరించ 

దివ్యసంక్రాంతిపర్వమ్ము తేజరిల్ల 

శుభదకామన లందరి కభయ మగుత! 

*~శ్రీశర్మద* 

*8333844664*

శనివారం🍁* *🌹17జనవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* 

     *🍁శనివారం🍁*

*🌹17జనవరి2026🌹*

  *దృగ్గణిత పంచాంగం* 

                  

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - బహుళపక్షం*


*తిథి  : చతుర్దశి* ‌రా 12.03 వరకు ఉపరి *అమావాస్య*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : మూల* ఉ 08.12 వరకు ఉపరి *పూర్వాషాఢ*

*యోగం : వ్యాఘాత* రా 09.18 వరకు ఉపరి *హర్షణ*

*కరణం  : భద్ర* ఉ 11.15 *శకుని* రా 12.03 ఉపరి *చతుష్పాద*

*సాధారణ శుభ సమయాలు:*

           *-ఈరోజు లేవు-*

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.55 - 12.40*

*వర్జ్యం    : శేషం ఉ 08.12* & సా 06.37 - 08.21

*దుర్ముహూర్తం  : ఉ 06.39 - 08.10*

*రాహు కాలం   : ఉ 09.29 - 10.53*

గుళికకాళం      : *ఉ 06.39 - 08.04*

యమగండం    : *మ 01.42 - 03.07*

సూర్యరాశి : *మకరం*                             

చంద్రరాశి : *ధనస్సు*

సూర్యోదయం :*ఉ 06.50*

సూర్యాస్తమయం :*సా 06.03*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.39 - 08.55*

సంగవ కాలం         :     *08.55 - 11.10*

మధ్యాహ్న కాలం    :    *11.10 - 01.25*

అపరాహ్న కాలం    : *మ 01.25 - 03.40*


*ఆబ్ధికం తిధి         : పుష్య బహుళ చతుర్దశి*

సాయంకాలం        :  *సా 03.40 - 05.56*

ప్రదోష కాలం         :  *సా 05.56 - 08.28*

రాత్రి కాలం           :*రా 08.28 - 11.52*

నిశీధి కాలం          :*రా 11.52 - 12.43*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58 - 05.49*

<><><><><><><><><><><><><><>

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర శ్లోకం*🙏


*లోకాంత రంగం లయకార మిత్రం*

*లక్ష్మీకళత్రం లలితాబ్జ నేత్రం*

*శ్రీ విష్ణు దేవం సుజనైక గమ్యం*

*శ్రీ వేంకటేశం శిరసా నమామి !!*


*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️


*సీతా రక్షక హనుమంత*

*ఇహపర దాయక హనుమంత*

*జయ బజరంగబలి*

*జయజయ జయ బజరంగబలి*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

గురువు -జ్ఞానము*

 *గురువు -జ్ఞానము*


గురువు ఉపదేశించిన జ్ఞానమే ప్రయోజనకరం ఎందుకంటే? ఉపనిషత్తు చెబుతోంది ఇలా చెప్పింది కాబట్టి. "గురు ఉపదేశం లేకుండా వచ్చే జ్ఞానం బలంగా ఉండదు." భగవంతుడు గీతలో కూడా ఇదే మాట చెప్పాడు.

*ఇమం వివస్వతే యోగం బ్రోఖ్తవానహమవ్యయం I*

*వివస్వాన్ మనవే ప్రాహ మనురీక్ష్వాగవేప్రవీద్ II*

 అన్నారు. అంటే “సృష్టిలో సూర్యునికి ఇది నేనే నేర్పించాను” అంటాడు. అప్పుడు, ఈ గురు-శిష్య వంశం సృష్టి నుండి వచ్చిందని చెప్పాలి. గురువు లేకుండా మనం మన జీవితాన్ని నడిపించలేము. కావున, గురు-శిష్య సంప్రదాయం ద్వారా శాస్త్ర తత్త్వం తెలిసిన వ్యక్తి మాత్రమే మళ్లీ గురువు కాగలడు. అంతే కాదు శాస్త్రంలో చెప్పిన విధంగా ఆసనాలు వేయగలగాలి. అంతేకానీ, మేము పుస్తకం చదివాము. బాగా బోధిద్దాం. అంటే సరికాదు. ముందుగా గురువు వాటిని ఆచరించకపోతే ఆయనను గురువు అని ఎలా పిలుస్తాము? ముందుగా మనం సరైన, శాస్త్రీయంగా మరియు నైతికంగా ఆచరించి ఉండాలి. ఇలా ప్రవర్తించమని మనం మరొకరికి చెప్పవలసి వస్తే, అలా ప్రవర్తించగలగడానికి యోగాత్మను ముందుగా కలిగి ఉండాలి.

 ముందుగా తాను సదాచరణంలో ఉండి తర్వాత ఇతరులకు ధర్మాన్ని ప్రబోధించడం గురువు విధి. ప్రతి ఒక్కరు గురు సంప్రదాయ పూర్వకంగా గ్రంధాలను తెలుసుకోవాలి. శాస్త్రోక్తాన్ని అనుసరించి ఆసనాలు వేయాలి.

*- జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామివారు*

సమస్యల ప్రభావం

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం 🕉️🙏 🏵️ *మన జీవితంలో సమస్యల ప్రభావం10% భాగము మాత్రమే.. ఆ సమస్యల పట్ల మన దృక్పథం అనేది 90% ప్రభావం కలిగి ఉంటుంది.. చెయ్యకుండా చేశాను అని చెప్పేవాడు అధముడు.. కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పేవాడు గర్వపోతు.. ఎంతో చేసి కొంచెం చేశానని చెప్పేవాడు గొప్పవాడు*🏵️ మనిషి మనస్ఫూర్తిగా తప్పును ఒప్పుకుంటే తప్పు ఒప్పు అవ్వదు.. కానీ తప్పు నుండి వచ్చే ముప్పు తప్పవచ్చు.. మనసులో ఒప్పుకుంటే అంతరాత్మ లోలోపల తినటం నుండి తప్పించుకోవచ్చు.. మాటలతో ఒప్పుకుంటే మాట పడవలసిన ముప్పు నుండి తప్పించుకోవచ్చు.. జరిగిపోయిన తప్పును ఒప్పుకుని పరివర్తన అయ్యి చూపిస్తే చేతల చరిత్ర వంతమవుతాయి🏵️🏵️మీ *అల్లంరాజు భాస్కర శర్మ. శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3. గోకవరం బస్టాండ్ దగ్గర .స్టేట్ బ్యాంక్ ఎదురుగా.రాజమండ్రి. వైద్య సలహాలు ఉచితం. మందులు అయిపోయిన వారు రాలేని వారు కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును.9440893593.9182075510.*🙏🙏

అర్చకత్వం

  *అర్చకత్వం:* విరామం లేని సేవ…

కనిపించని త్యాగం, మౌన ఆరోగ్య పోరాటం


ఈ ప్రపంచంలో నిజంగా సెలవులే లేని వృత్తులు చాలా తక్కువ.

అటువంటి అరుదైన, నిరంతర త్యాగంతో నడిచే వృత్తుల్లో అర్చకత్వం ఒకటి.

ఇది ఉద్యోగం కాదు… ఇది ఒక జీవన విధానం, ఒక తపస్సు.


అర్చకుడి రోజు గడియారంతో కాదు – దేవుడి కాలంతో మొదలవుతుంది.

తెల్లవారుజామున లేచి, ఇంట్లో కాలకృత్యాలు తీర్చుకొని,

గుడికి చేరుకొని ముందుగా గర్భగుడిని ఊడ్చి, శుభ్రపరిచి,

దీపాలు వెలిగించి, స్వామివారిని మేల్కొలిపి

 అర్చన ప్రారంభం.


అక్కడినుంచి ఆగకుండా—

అభిషేకాలు, అలంకారాలు, మహానైవేద్యం, దర్శనాలు.

సాధారణ రోజుల్లోనే ఇవన్నీ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 1 దాటిపోతుంది.

ఇక విశేష ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు వస్తే

నిద్ర ఎప్పుడు? భోజనం ఎప్పుడు?

అన్న ప్రశ్నలకే సమాధానం ఉండదు.


ధనుర్మాసం, కార్తీక మాసం అయితే

ఆ సేవ మరింత కఠినంగా మారుతుంది.

భక్తులు ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉంటారు.

అర్చకుడికి మాత్రం

విశ్రాంతి అనే మాటే ఉండదు.


ఒక అత్యవసర పరిస్థితిలో పక్క ఊరు వెళ్లాల్సి వస్తే—

ఫోన్ ఓపెన్ చేసి కనీసం 15 మందికి కాల్ చేయాల్సిందే.

14 మంది “కుదరదు” అన్నాక

ఒక్కడు మాత్రమే

“అన్నా నువ్వు వెళ్లిరా… రేపు అర్చన నేను చూసుకుంటా”

అని చెప్పినప్పుడు వచ్చే ఆనందం

డబ్బుతో కొలవలేనిది.


పెద్ద దేవాలయాల్లో ప్రత్యామ్నాయ అర్చకులు ఉండవచ్చు.

కానీ చిన్న దేవాలయాల్లో,

మధ్యస్థ దేవాలయాల్లో,

ఒకే ఒక్క అర్చకుడు ఉన్న ఆలయాల్లో

ఆ ఒంటరితనం, ఆ బాధ

నిజంగా వర్ణనాతీతం.


దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లో

సెలవులు కూడా అధికారుల అనుమతుల మీదే.

సేవ చేయాలన్న మనసు ఉన్నా

స్వేచ్ఛ ఉండదు.


ఎవరైనా ఫంక్షన్‌కు పిలిస్తే ఆనందం కాదు… భయం!

ముహూర్తం వేళ గుడిలో అర్చనకి ఎవరు ఉంటారు?

వెళ్లకపోతే ఏమనుకుంటారో?

ఇక మన ఇంటి శుభకార్యాలకు పిలవడం మానేస్తారేమో?


ప్రత్యామ్నాయ అర్చకుడు దొరకక

వెళ్లలేక వదిలేసిన పెళ్లిళ్లు, శుభకార్యాలు

పదుల్లో కాదు… వందల్లో ఉంటాయి. వాడు అంతేలే పిలిచిన రాడు అనే నిష్టూరాలే ఎక్కువ. మౌనముగా భరిస్తూ బాధ పడుతూ వుంటారు. 


ఇంకా హృదయాన్ని పిండేసే విషయం—

ఇంటిపేరు వాళ్లు, చిన్నప్పటినుంచి తెలిసినవాళ్లు చనిపోతే కూడా

“వాడు ఒక్కడే గుడి చేసుకుంటున్నాడు”

“కార్తీక మాసం”

“ధనుర్మాసం”

అని చెప్పి

మొత్తం కార్యక్రమాలన్నీ అయిపోయాక

పదో రోజు ఫోన్ చేసి

“బాబు, రేపు తలస్నానం చేయి”

అనే స్థితి.


నిన్ను ఎత్తుకుని పెంచినవాడు చనిపోతే

కనీసం ఆఖరి చూపు కూడా చూడలేకపోవడం

అర్చకుడి జీవితంలో

మాటల్లో చెప్పలేని బాధ.


ఇంత సేవ చేస్తూనే

ఎక్కువసేపు గర్భగుడిలో ఉండడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు

చాలా తీవ్రమైనవి – కానీ అవి ఎవ్వరూ మాట్లాడరు.


▪️ గాలి ప్రసరణ లేని గర్భగుడిలో

ధూపం, దీపాలు, కర్పూరం పొగను

రోజూ గంటల తరబడి పీల్చడం వల్ల

తలనొప్పులు, మైకం, శ్వాసకోశ సమస్యలు, దీర్ఘకాలంలో ఆస్థమా


▪️ దీపాల వేడి, మూసివేసిన గది వల్ల

అధిక వేడి, డీహైడ్రేషన్, నీరసం, బీపీ సమస్యలు


▪️ గంటల తరబడి నిలబడి ఉండటం,

వంగి అభిషేకాలు చేయడం వల్ల

మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి, స్పాండిలైటిస్


▪️ తక్కువ వెలుతురు, పొగ వల్ల

కళ్ల మంట, నీరు రావడం, చూపు మందగించడం


▪️ టైమ్‌కు భోజనం లేక

గ్యాస్ట్రిక్, అసిడిటీ, అల్సర్లు, జీర్ణకోశ వ్యాధులు


▪️ నిద్రలేమి, కుటుంబానికి సమయం లేక

మానసిక ఒత్తిడి, ఒంటరితనం


ఇవన్నిటికంటే అత్యంత దారుణమైన సమస్య ఒకటి ఉంది.

ఒకసారి గుడిలో అడుగు పెట్టాక

మధ్యలో ప్రకృతి పిలిచినా

గర్భగుడిని వదిలి వెళ్లే వెసులుబాటు ఉండదు.


అందుకే చాలాసార్లు

అవి ఆపేసుకుంటూ ఉండిపోతారు.

దీని వల్ల తీవ్రమైన శరీర సంబంధ సమస్యలు వస్తాయి.

ఒకవేళ పక్కకు వెళ్లి వచ్చినా

మళ్లీ మళ్లీ స్నానాలు, తలస్నానాలు—

అవి తెచ్చే మరో రకమైన ఇబ్బందులు.


ఈ అన్నిటికీ కారణం అవుతుందేమో అని

చాలాసార్లు తినకుండా, తాగకుండా

అలాగే ఉండిపోతారు.


పొద్దున్నే డ్యూటీ ఎక్కితే

ఎప్పుడూ డ్యూటీ దిగే సమయం వస్తుందో

అర్చకుడికే తెలియదు.


ఇన్ని కష్టాలు తెలిసినా

అర్చకుడు గుడిని వదలడు.

స్వామిని వదలడు.

సేవను ఆపడు.


కనీసం సమాజం

గౌరవం,

మాటల మర్యాద,

మానవీయ దృష్టి

చూపితే

అదే అతనికి పెద్ద ఆరోగ్యం.


🙏 అర్చకత్వం వృత్తి కాదు…

తరతరాల త్యాగం,

నిరంతర సేవ,

నిశ్శబ్ద జీవితం,. 🙏🙏👍

నేటి వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం - చతుర్దశి - మూల -‌‌ స్థిరవాసరే* (17.01.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtube.com/watch?v=rmxeFJ28dO4&feature=shared



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*