19, జులై 2020, ఆదివారం

ఋణములు

 మానవ జీవితంలో ప్రతి మనిషికి పూర్వజన్మ కృతమైన వాటివల్ల పుణ్య, పాప విశేషములు ఈ జన్మలో ఆయా సమయాలలో అనుభవిస్తాం. ఇది కర్మ సిద్ధాంతం. మనది కర్మభూమి కావున ఆయా సందర్భాలను అనుసరించి దైవారాధన చేయుట వల్ల సంచిత కర్మల నుండి విముక్తిని పొందవచ్చు.

మానవులు ఎల్లప్పుడూ పితృఋణం, మాతృఋణం, పుత్రికా ఋణం, స్త్రీ ఋణం, సోదర ఋణం, దైవఋణం, ఋషిరుణం, దానఋణం, గురు ఋణం ఈ తొమ్మిది ఋణాలను తెలిసి కానీ తెలియక కానీ తీర్చకపోతే ఎల్లప్పుడూ ఋణబాధలు వేధిస్తూ ఉంటాయి. ఉన్నత స్థితి కలుగదు. 

1. తల్లి ఋణం :- 
తల్లితో విభేదాలుంటాయి. వీరు తల్లిని బాధించకూడదు. పేదవారికి పాలు, బియ్యం, దానం చేయుట వల్ల మేలు జరుగుతుంది.

2. పితృఋణం :-
 తల్లితండ్రులు గతించినచో వారికి చేయవలసిన కర్మలను సకాలంలో ఆచరించకపోవటం వల్ల విద్య, ఉద్యోగం. వ్యాపార అభివృద్ధి ఉండదు.

3. పుత్రికాఋణం :- 
పుత్రికను బాధించటం, కూతురు ఆస్తిని అనుభవించటం వల్ల అవమానాలు, ధననష్టం, ఒంటరి జీవితం కలుగుతాయి.

4. స్త్రీ ఋణాలు :- 
పరస్త్రీలను వ్యామోహించి బాధించటం, సంగమించటం, వారిని వదిలివెయ్యటం, తరచు గుర్తుచేసి దుర్మార్గంగా బాధించటం, భార్యను బాధించటం, కొట్టడం, ఆమెను పస్తులుంచటం, ఆమెను బయటకు గెంటివేయుట, నిందలు ప్రచారం చేయుట, పరస్త్రీలను బల్కారించటం, కామవాంఛలకు గురిచేయటం, మధ్య వయసునుండి అకాల మరణ భయం, దారిద్ర్యం కలుగుతాయి. గర్భవతులను కూడా బాధించరాదు.
🍂🌹🌷

5. సోదర ఋణం :- 
తన రక్త సంబంధీకుల ధనం వాడుకోవటం వారిని బాధించటం, వారి ఆస్తులను సక్రమంగా పంచక తాననుభవించుట మోసం చేయుట వీటివల్ల కొంతకాలానికి తన పిల్లలు దరిద్రం అనుభవిస్తారు. మనఃశ్శాంతి ఉండదు. జీవిత చరమాంకంలో దీనస్థితి కలుగుతుంది. వంశక్షయం కలుగుతుంది.
🍂🌹🌷

6. దైవ ఋణం :- 
దైవాన్ని నిందించుట, జంతుహింస చేయుట, దేవాలయ ఆస్తులను అనుభవించుట వీటివల్ల సంతాననష్టం ఉంటుంది. అంగవైకల్యం కలిగిన సంతానం కలుగుతారు. శారీరక బలహీనత కలుగుతుంది.
🌻🍂🌹 

7. ఋషి ఋణం :- 
తమ వంశఋషిని సేవించలేకపోవటం, సాధు సన్యాసుల పట్ల తెలిసో తెలియక అమర్యాదగా ప్రవర్తించుట, ఋషిప్రోక్తమైన మంత్రాలను అవహేళన చేయుట వల్ల కలుగుతుంది.
దీనివల్ల మూర్ఖత్వం, ఆవేశం, సౌఖ్యలేమి కలుగుతుంది.
🍂🌹🌷 

8. దాన ఋణం :- 
ఒకరికి దానం చేస్తానని చేయకపోవుట - దానం చేసి ప్రతిఫలం కోరుట, చేసిన దానిని తిరిగి తీసుకొనుట వల్ల ఈ ఋణం ఏర్పడుతుంది. ఇటువంటి వారు తరచు వివాదాలకు గురవుతూ ఉంటారు. వ్యసన పీడ కలుగుతూ అపకీర్తి కలుగుతుంది.. 🍀🌻🌹

9. గురు ఋణం :-
 గురువులను దూషించుట, అంతకుసమానమైన వారిని నిందించుట. దీనివల్ల మిత్రభేదం, ఉపాధి కోల్పోవుట, ఋణ బాధలు కలుగుతాయి.
🍀🌻🌹🌷

ప్రతినిత్యము తల్లితండ్రుల సేవ చేయుట వల్ల సమస్త గ్రహబాధలు తొలగిపోతాయి.

సర్వే జానాః సుఖినో భవంతు

మహాభారతంలో మనకు తెలియని కథ

మహాభారతంలో మనకు తెలియని కథలెన్నో దాగి ఉన్నాయి...!

జూదం, ద్రౌపదీ వస్త్రాపహరణం, కురుక్షేత్ర యుద్ధం... వీటినే చూపెడతారు. నిజానికి ఇప్పటి ఈ సమాజానికి కావాల్సిన "నీతికథలు" ఎన్నో ఉన్నాయి...!!!

అందులో ఒకటి ఇది...👇🏻

పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని  పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు  అహంకారంగా  మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం  కృష్ణుడు ధర్మరాజుని వేరే  రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.

ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది.

 అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు... ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది !

ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా   బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా ?.. అని చెప్పడంతో...
ఆమె... మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును  మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది !!!

ఆ రాజ్యపు సంపదను  గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు.

ఇక రాజును  కలవడానికి  ఇద్దరు వెళ్లారు.

కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు...

రాజా...ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు...

కృష్ణా... మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా  పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు, అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన  అవసరం లేదు...  ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు... అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో... ఈయన రాజ్యంలో అంతమందిని   పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను  అన్నారు !!!

తన రాజ్యస్థితిని  తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు !!! 😭😭😭

👉🏻 సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం... ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా  వివరించారు !!!

👉🏻 మరి మన పాలకులు  ఎప్పుడు తెలుసుకుంటారో... ప్రజలు ఎప్పుడు మారుతారో...


Note :     విధిగా సాధ్యమైన ఎక్కువ మందకి ఈ సందేశం పంపండి ఎందుకంటే కనీసం కొంతమంది నైన మార్చా లని ఆశిస్తూ........ 

మహాభాగవతం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము*

*గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

*15.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*దేశే శుచౌ సమే రాజన్ సంస్థాప్యాసనమాత్మనః|*

*స్థిరం సమం సుఖం తస్మిన్నాసీతర్జ్వంగ ఓమితి॥6276॥*

ధర్మరాజా! సాధకుడు పవిత్రమైన, సమతలమైన భూమిపై తన ఆసనమును ఏర్పరచుకొనవలెను. దానిపై నిటారుగా, నిశ్చలముగా, సుఖముగా కూర్చొనవలెను. పిదప ఓంకారమును జపింపవలెను.

*15.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*ప్రాణాపానౌ సన్నిరుధ్యాత్పూరకుంభకరేచకైః|*

*యావన్మనస్త్యజేత్కామాన్ స్వనాసాగ్రనిరీక్షణః॥6277॥*

మనస్సుసంకల్ప వికల్పములను విడిచిపెట్టనంత వరకు సాధకుడు తననాసికాగ్రమున దృష్టిని నిలుపవలెను. పిమ్మట పూరక, కుంభక, రేచకముల ద్వారా ప్రాణాపాన గతులను నియమింపవలెను. (గాలిని నిండుగా తీసికొనుట పూరకము. నింపి కొంత సేపు నిలిపి ఉంచుట కుంభకము. బయటకు వదలుట రేచకము)

*15.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*యతో యతో నిఃసరతి మనః కామహతం భ్రమత్|*

*తతస్తత ఉపాహృత్య హృది రుంధ్యాచ్ఛనైర్బుధః॥6278॥*

కామవాసనలచే కొట్టబడి, అటునిటు పరుగులు దీయుచున్న చిత్తమును విద్వాంసులు మఱలవెనుకకు మరల్చి, మెల్లమెల్లగా హృదయము నందు నిలుపవలెను.

*15.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*ఏవమభ్యస్యతశ్చిత్తం కాలేనాల్పీయసా యతేః|*

*అనిశం తస్య నిర్వాణం యాత్యనింధనవహ్నివత్॥6279॥*

సాధకుడు ఈ విధముగా నిరంతరము అభ్యాసము చేసినచో, ఇంధనము లేని అగ్నివలె అతని చిత్తము స్వల్పకాలములోనే ప్రశాంతమగును.

*15.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*కామాదిభిరనావిద్ధం ప్రశాంతాఖిలవృత్తి యత్|*

*చిత్తం బ్రహ్మసుఖస్పృష్టం నైవోత్తిష్ఠేత కర్హిచిత్॥6280॥*

ఈ విధముగా కామవాసనల తాకిడిని నిరోధించి నప్పుడు, అతని వృత్తులు అన్నియును శాంతించును. అప్పుడు అతని చిత్తము బ్రహ్మానందముతో మునిగిపోవును. మరల ఆ వృత్తులు ఎన్నడును తలయెత్తవు.

*15.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*యః ప్రవ్రజ్య గృహాత్పూర్వం త్రివర్గావపనాత్పునః|*

*యది సేవేత తాన్ భిక్షుః స వై వాంతాశ్యపత్రపః॥6281॥*

ధర్మార్థకామములకు మూలమైన గృహస్థాశ్రమమును పరిత్యజించి, సన్న్యాసమును స్వీకరించినవాడు తిరిగి గృహస్దాశ్రమమును స్వీకరించినచో, వాడు తాను వమనమును (వాంతిని) చేసికొనిన ఆహారమును, మరల భుజించినట్టీ కుక్కతో సమానుడగును.

*15.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*యైః స్వదేహః స్మృతో నాత్మా మర్త్యో విట్కృమిభస్మసాత్|*

*త ఏనమాత్మసాత్కృత్వా శ్లాఘయంతి హ్యసత్తమాః॥6282॥*

తన శరీరమును అనాత్మయనియు, మృత్యుగ్రస్తమై, మలము, క్రిములు, బూడిదకు నిలయమని భావించినవాడు, తిరిగి ఆ శరీరమే ఆత్మయని ప్రశంసించినచో, నిజముగా అతడు మూఢుడే.

*15.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*గృహస్థస్య క్రియాత్యాగో వ్రతత్యాగో వటోరపి|*

*తపస్వినో గ్రామసేవా భిక్షోరింద్రియలోలతా॥6283॥*

*15.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*ఆశ్రమాపసదా హ్యేతే ఖల్వాశ్రమవిడంబకాః|*

*దేవమాయావిమూఢాంస్తానుపేక్షేతానుకంపయా॥6284॥*

కర్మలను త్యజించిన గృహస్థుడు, బ్రహ్మవ్రతమును విడిచిపెట్టిన బ్రహ్మచారి, గ్రామములో నివసించునట్టి వానప్రస్థుడు, ఇంద్రియ సుఖలోలుడైన సన్న్యాసి అను నలుగురును తమ ఆశ్రమములకు కళంకమును తెచ్చెదరు. వారు ఆయా ఆశ్రమములలో ఉన్నట్లు కపట నాటకమును ఆడుచున్నవారగుదురు. కావున, భగవంతుని మాయచే మోహితులైనట్టి ఆ మూఢులపై జాలిచూపి, వారిని ఉపేక్షింపవలెను.

*15.48 (నలుబదియవ శ్లోకము)*

*ఆత్మానం చేద్విజానీయాత్పరం జ్ఞానధుతాశయః|*

*కిమిచ్ఛన్ కస్య వా హేతోర్దేహం పుష్ణాతి లంపటః॥6285॥*

ఆత్మజ్ఞానమును సాధించినవానికి అంతఃకరణము నిర్మలమగును. అట్టి జ్ఞానికి దేహాభిమానము ఉండదు. కావున, అట్టి జ్ఞానియైనవాడు తిరిగి ఇంద్రియలౌల్యము నందుగాని, దేహాసక్తియందుగాని ఏల చిక్కుకొనును?

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

*భవ సంతృప్తి-భావసంతృప్తి*!

పోతన భోజనం వడ్డించమని అడిగాడు పోతన తన భార్యతో

ఆమె చోద్యంగా చూస్తూ ‘అదేమిటండీ! ఇప్పుడే కదండీ భోజనం చేసి వెళ్లారు. మళ్లీ భోజనం అంటున్నారు? మళ్లీ అప్పుడే ఆకలయిందా’ అని నవ్వుతూ అడిగింది ఆ సాధ్వీమణి.

దిగ్భ్రమ చెందాడు పోతన ఇదేమిటి? ఈవిడ ఇలా చెబుతోంది అని విస్మయంగా చూశాడు భార్య వైపు. ‘నేను భోంచేశానా?’ అని అడిగాడు. ‘అవును. కూర్చుని ఒక పద్యం కాబోలు వ్రాశారు. ఆపైన నేను భోజనం చేయమంటే చేశారు. 

మీరు తిన్న తర్వాత అలవాటు ప్రకారం, నేను మీరు తిన్న విస్తరిలోనే భోం చేశాను’ అంది.
‘ఏదీ నువ్వు తిన్న విస్తరి?’
‘బైట తొట్లో వేశాను’ అంది ఇల్లాలు.
బయటికి వచ్చి కుప్పతొట్లో చూశాడు. 

అప్పుడే ఒక కుక్క ఆ విస్తరిని నోటిలోకి లాక్కుని దొరకకుండా పరుగెత్తి పోయింది. ఇంట్లోకి వచ్చి కూర్చుని తను వ్రాస్తున్న చోట కూర్చుని చూశాడు. 

 అక్కడ ఒక త్రాటియాకుపైన-
అలవైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా/ పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోప లో/ త్పల పర్యంక రమావినోదియగు నాపన్న ప్రపన్నుండు వి/ హ్వల నాగేంద్రము పాహిపాహి యన కుయ్యాలించి సంరంభియై’

మొసలితో యుద్ధం చేస్తూ శక్తులుడిగి చేష్టలుల కోల్పోయిన నాగేంద్రము (గజశ్రేష్ఠుడు) ఈ జగత్తును ఎవరు సృష్టించి పరిరక్షిస్తుంటారో వారు కాపాడాలి అని ‘ఎవ్వనిచే జనించు’ ‘జగమెవ్వని లోపల నుండు లీనమై’ అని అర్థిస్తుంది, ప్రార్థిస్తుంది, అపుడు

‘ఆ వైకుంఠ నగరంలో సౌధంలో మూలన మందార వనామృత సౌరభంలో రమాదేవితో క్రీడిస్తున్న ఆపద్బాంధవుడైన మహావిష్ణువుకు ఆ గజేంద్రం యొక్క మొర వినిపించి, వెంటనే పూనుకుని ఉన్నపళాన ఆపద్రక్షకుడు పక్రమించినవాడై రక్షణకు!

 దిగ్భ్రమతో పోతన కళ్ల వెంట ఆనందభాష్పాలు! ఆనందాతిరేకం! అంతలోనే దుఃఖాతిరేకం!
పరుగు పరుగున వచ్చి దిగ్భ్రమతో నిశే్చష్టుడయిన పోతనను చూసి కుదుపుతూ ‘స్వామీ స్వామీ!’ అని పిలిచింది ఆ పతివ్రతామతల్లి. తేరుకుని ఆమె భుజంపై తలవాల్చి మళ్లీ అమిత రోదనకు గురయ్యాడు పోతన. 

కాసేపు అతడిని దుఃఖింపనిచ్చి, ఆపైన ఓదారుస్తూ ‘ఏం జరిగింది నాథా! ఎందుకంతగా దుఃఖిస్తున్నారు’ అని అడిగింది ఇల్లాలు. 

‘శ్రీరామచంద్రుడు! శ్రీరాముని దర్శనభాగ్యం పొందావు నువ్వు! అనంత భాగ్యరాలివి! ధన్యాత్మవు. నాకా భాగ్యం కలుగలేదు’ అని చెపుతూ ఉన్నాడు పోతన. ఏడుస్తూ ఉన్నాడు మళ్లా వెంటనే దుఃఖాభ్యాగ్నుడై!

‘అవునా స్వామీ! నిజమా! ఇంతక్రితం వచ్చి వ్రాసి, భోజనం చేసి వెళ్లినవారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడైన శ్రీరామచంద్ర మూర్తియా?’
‘అవును దేవీ! ఇది శ్రీరాముల వారు తమ స్వహస్తాలతో వ్రాసిన పద్యం! విను’ 

అని ఆ పద్యాన్ని వెక్కిళ్ల మధ్యనే పాడుతూ, చెపుతూ, ఏడుస్తూ ‘చూడు - నువ్వు భగవంతుడి దర్శనం పొందావు - వారు వ్రాస్తున్నది చూశావు - నీ స్వహస్తాలతో భోజనం పెట్టావు - వారి స్పర్శనం పొందావు! నాకేదీ ఆ భాగ్యం? ఆ స్వామి తిన్న ఎంగిలాకును ముట్టుకునే భాగ్యం కూడా నాకు లేకపోయింది కదా!’ అని మళ్లీ ఏడుస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు పోతనామాత్యుడు.

‘స్వామీ! మీరు తీవ్రమైన దుఃఖంతో ఆవేదన చెందుతున్నారు. శ్రీరామచంద్రమూర్తి మీ రూపంలో వచ్చి, మీరు వ్రాసినట్లుగా వ్రాసి, మీరు తిన్నట్లుగా తిని, నాకు మహద్భాగ్యమైన అవకాశం ఇచ్చారు. 

మీరే తానై స్వామి వస్తే, మళ్లా మీకు దర్శనం ఇవ్వలేదని దుఃఖిస్తారేం? ఇంత గొప్ప ‘మహా భాగవత కావ్యాన్ని’ తెనిగిస్తున్న మీ అపూర్వమైన పాండిత్యం చూసి, ఆనందం పట్టలేక, మీ రచనలో తానూ పాలు పంచుకోవాలని నిశ్చయించుకుని, మీకు భ్రమ కలిగించి బయటకు పంపి, తాను మీ రూపంలో వచ్చి, ‘తనను గురించి తానే’ గొప్పగా వ్రాసుకున్నాడు. 

ఇంత మహాభాగ్యులు మీరు. మీరు తెనిగిస్తున్న ‘మహాభాగవతం’ ఆచంద్రార్కం ప్రసిద్ధ పొందుతుంది. మీ రాముడు మీ లోపల ఆత్మారాముడై ఉన్నాడు. దుఃఖం మాని, ప్రశాంతంగా కూర్చుని ధ్యానమగ్నులుకండి! మీకే అర్థం అవుతుంది’ అంది.

వెంటనే ధ్యానమగ్నుడయ్యాడు పోతనామాత్యుడు. తన ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి, తన ఉచ్ఛ్వాసనిశ్వాసలను తదేకంగా గమనిస్తూ అంతర్ముఖుడయాడు. తన హృదయ కుహరంలో కొలువైవున్న ఆత్మారాముడిని చూసి పరమానంద భరితుడయ్యాడు ‘రామదాసు’లాగా!

‘భవ సంతృప్తినీ, భావసంతృప్తినీ పూర్తిగా పొందారు పోతన దంపతులు.  ముక్తజీవులు! ధన్యులు! పుణ్యాత్ములు!
వీరభద్ర విజయం, భోగినీ దండకం పోతన ఇతర రచనలు. 

పరమ ప్రఖ్యాతి పొందినదీ, ప్రతి కవీ, పండితుడూ, ప్రతి సాహితీ ప్రియుడు పరవశించేది ‘మహాభాగవతం’! ఈ కావ్యానువాదం, ఇందులోని గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర అజరామరాలు. పోతన కలికితురాయి మహాభాగవతం!
( *చొప్పకట్ల సత్యనారాయణ గారి సందేశం.*)


ఒక చెడు ఒక మంచికే - కధ

*సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది.*

*అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు.*

*ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు.

 *ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగి పోయాడు.*

*ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ️ఆ గుడిసెలో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు.*

*ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు.* 

*తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి.*  🔥

*తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు.*  

*తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు.

*తరువాత కొంతసేపటికి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది.*

*అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసింది. అతని ఆనందానికి అవధుల్లేవు.* 

*ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని “నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?” అని అడిగాడు.*

*“నువ్వు మంట పెట్టి  పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా! దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం” అన్నాడు.*

*ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఉన్నట్టుండి ఒక్కసారిగా తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతమూ కావచ్చు ............* 

 *ఎంత గొప్పవాళ్లకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు.* *ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి - చెడు, సుఖం - దుఃఖం, కష్టం - నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకొని జీవించాలి..........*      

భద్రాచల రాములవారిని చూసే చెప్పిన శ్లోకం


వామాంక స్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే!
చక్రంచోర్థ్వ కరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే!
బిభ్రాణం జలజాత పత్రనయనం *భద్రాద్రి* మూర్ధిస్థితం!
కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే!!!
(భద్రాచాలరాముని ధ్యాన శ్లోకం.-- *జగద్గురువులుఆదిశంకరాచార్య*)
*తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా* !——
*భద్రాచల రామదాసుగారు*


*జరిగిన కధ !*

*"మనలో చాలామందిమి అనుకుంటాం నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం ?"*
*అతడు అనుకున్నాడు  నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని*

*జరిగిన కధ !*

*స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో 1892 లో జరిగిన వాస్తవం.*

*18 సంవత్సరాల ఆ యువకుడు ఫీజులు కట్టలేక ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో ఉన్నాడు . అతడు తల్లి తండ్రులు లేని అనాధ !*

*అతడూ అతడి స్నేహితుడూ కలిసి ఒక పధకం ఆలోచించారు . వాళ్ళ యూనివర్సిటీ లో ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేద్దామనీ , అందులో ఖర్చులు పోను మిగీన దానితో తమ ఫీజులు కట్టెయ్యవచ్చు అనీ నిర్ణయించుకున్నారు.*

అప్పట్లో గొప్ప పియానో వాద్య కారుడు
Ignace J.Paderewski. వద్దకు వెళ్ళారు.ఆయన మేనేజరు ఫీజు రూపం లో 2000 డాలర్లు కనీస మొత్తం గా ఇవ్వాలనీ,ఆ పైన ఇతర ఖర్చులు అనీ ఒప్పదం చేసుకున్నారు.వీళ్ళు అంగీకరించారు.టికెట్లు అమ్మడం సాగించారు . అనుకున్న రోజు వచ్చింది . ప్రోగ్రాం అద్భుతం గా జరిగింది . అయితే వీళ్ళు అనుకున్నట్టు వసూళ్లు రాలేదు.మొత్తం 1600 డాలర్లు మాత్రమె వచ్చింది*.

*వాళ్ళు #Paderewski. దగ్గరకు వెళ్ళారు . వసూలు అయిన మొత్తమూ,400 డాలర్లకు చేక్కూ పట్టుకు వెళ్లి జరిగిన మొత్తం విషయం చెప్పారు . సాధ్యమయినంత త్వందరలో ఆ మిగిలిన సొమ్ము చెల్లిస్తాము అనీ,క్షమించమనీ అన్నారు.*

*వాళ్ళ గురించి Paderewski. కి తెలీదు . ఆయన వాళ్ళని అతకు ముందు చూడలేదు . ఆయన ఆ చెక్కును చింపేశాడు . . 1600 డాలర్లూ వాళ్ళ చేతిలో పెడుతూ వాళ్ళతో ఆయన ఇలా అన్నాడు.* 

*"మీకు అయిన ఖర్చులు ఎంతో లెక్క పెట్టుకోండి.* *మీ ఫీజులకు ఎంతో అవుతోందో అది కూడా ఇందులో నుండి మినహాయించుకోండి*. *ఏమైనా మిగిలితే ఆ మిగిలిన సొమ్ము నాకు ఇవ్వండి "*

ఈ సంఘటన Paderewski మానవతను చాటి చెబుతుంది . తనకు తెలీని , తనకు ఏమీకాని , వారి వలన ఎటువంటి ప్రయోజనమూ ఆశించకుండా తన శ్రమనూ , తన ఆదాయాన్నీ ఇవ్వడం Paderewski హృదయం గురించి చెబుతోంది కదూ!

మనలో చాలామందిమి అనుకుంటాం " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం?"
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని. 
అదే ఉత్తములకీ మనకీ తేడా !
ఇది ఇక్కడితో ఆగిపోలేదు

Paderewski తర్వాతి కాలం లో పోలాండ్ ప్రధాని అయ్యారు.

రెండో ప్రపంచ యుద్ధం లో పోలాండ్ సర్వ నాశనం అయిపొయింది.15 లక్షల మంది ఆకలితో అలమటించే స్థితికి చేరారు. 

Paderewski కి ఏమి చెయ్యాలో తోచలేదు . ఎవరిని అడగాలో తోచలేదు . చివరికి అమెరకా ఆహార , పునరావాస విభాగాన్ని సంప్రదించాడు

దానికి అధిపతి #HerbertHoover . ఇతడే తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా అయ్యాడు . అతడు వెంటనే ప్రతిస్పందించాడు . టన్నులకొద్దీ ఆహార పదార్ధాలు పోలాండ్ కు సరపరా జరిగింది. పోలాండ్ లో ఆహార సంక్షోభం నివారించబడింది

Herbert Hoover చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి Paderewski అమెరికా వెళ్లి హూవర్ ను కలిశాడు . కృతజ్ఞతలు చెబుతూ ఉండగా హోవర్ అన్నాడు

*కొన్ని సంవత్సరాల క్రితం మీరు కాలేజీ ఫీజులు కట్టలేని ఇద్దరు యువకులకు సహాయం చేశారు .వారిలో నేను ఒకడిని.*

*ఈ ప్రపంచం ఒక అద్భుతమైన విషయం!!!*

*"~నీవు ఏది ఇస్తావో అది నీవు అనేక రెట్లు పొందుతావు అనే గీతాసారం ఇది."*

*"~The world is a wonderful place. What goes around usually comes around."*

ఆహార నియమాలు ......

దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు.

ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు.

అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు చెబుతున్నాయి. దొండకాయ తింటే వెంటనే బుద్ధి నశిస్తుంది.

రాత్రి అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే విస్తరాకునుగాని, పాత్రనుగాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు.

రాత్రి తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్ళు చల్లడం, దేవతను స్మరింపచేయడం ఆచారంగా ఉంది. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపివాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది.

రాత్రిళ్లు కాచిన పెరుగును మజ్జిగపులుసు మొదలైనవి) వాడకూడదు. ఆవునేయి కంటికి మంచిది. ఆవు మజ్జిగ చాలా తేలికైనది. అందులో సైంధవలవణం కలిపితే వాతాన్ని పోగొడుతుందని, పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు. తేగలు, బుర్రగుంజు, జున్ను, తాటిపండు మొదలైనవి వేదవేత్తలు తినరు. మునగ, పుంస్త్వానికి (మగతనానికి) మంచిదంటారు.

ఆకలితో బాధపడేవారు కోడి, కుక్క మొదలైనవి చూస్తూ ఉండగా తినకూడదన్నారు. దృష్టిదోషం పోవడానికి ఇది చదవాలి.

 ఎప్పుడూ నిర్ణీత సమయం లోనే భోజనం చెయ్యాలి . ( అందువలన బయోలాజికల్ క్లాక్ సక్రమంగా ఉంటుంది )

ఆహారం నెమ్మదిగా పూర్తిగా నమిలి తినాలి ( ఘన పదార్ధాలను త్రాగండి అంటారు . అంటే నోటిలోనే సగం నమలబడాలి . అందువలన లాలాజలం పూర్తిగా కలిసి , ముద్దా మింగడం సులువు అవుతుంది . పిండి పదార్ధాలు పూర్తిగా జీర్ణం అవుతాయి . కడుపులో ఊరే ఆమ్లాలకు లాలాజలం ( క్షారం ) విరుగుడు గా పనిచేస్తుంది .

 ఆహార నియమాలను పాటించే వ్యక్తికి ఔషధాల అవుసరం ఏమి ఉంటుంది ? ఆహార నియమాలను పాటించని వ్యక్తికి ఔషధాలు ఏమి ఫలితాలను ఇవ్వగలవు ?

పధ్యే సతి గదార్తస్య కి మౌషద నిషేవనై:
వినాపి భేశాజేవ్యర్ది : పత్యాదేవ్ నివర్తత
న తు పథ్య విహీనస్య భేశాజానాం శథైర్యపి

అంటే రోగికి ఔషధాల అవుసరం లేకుండానే కేవలం నియమిత ఆహారం పాటించడం వలన వ్యాధులు దూరమవుతాయి .

రోగికి ఆహారం పై నియంత్రణ లేక పోతే మాత్రం అత్యుత్తమ మైన మందులు కూడా ఫలితాన్ని ఇవ్వలేవు అని అర్ధం .

అన్నం బ్రహ్మ రసోవిష్ణు: బోక్తా దేవో మహేశ్వర: ఇతి సంచింత్య భుంజానం దృష్టిదోషో నబాధతే అంజనీగర్భంసంభూతం కుమారం బ్రహ్మచారిణం దృష్టిదోషవివానాశాయ హనుమంతం స్మరామ్నహం||

అనగా అన్నం బ్రహ్మం, అన్నరసం విష్ణురూపమై ఉన్నది. తినువాడు మహేశ్వరుడు, ఇట్లా చింతిస్తే దృష్టిదోషం ఉండదని పండితులు అంటున్నారు.

*మహానీయుని మాట*


అద్దెకట్టేటపుడు సొంతింటి విలువ
ఆకలేసినపుడు అన్నం విలువ
ఉద్యోగం లేనపుడు డబ్బుల విలువ
విడిపోయినపుడు ప్రేమ విలువ
దూరమైనపుడు మనిషి విలువ
జాగ్రత్త లేనపుడు జీవితం విలువ తెలుస్తుంది.
 -------------------
*నేటీ మంచి మాట* 
      ---------------------------

మనం తప్పుచేసే సందర్భం ఏమిటంటే
అలవాటైన బంధాలను అంత శ్రద్ధగా పట్టించుకోము.

3 types of Taap(Sorrows)


3 types of Taap(Sorrows) as per Vedas and how to overcome it.

Many people had a query on this and requested to decode it with Solution. This topic is mentioned in many of my Vedic tweets. So lets decode it now from Bhagwat puran

कृपया भूतजं दुःखं दैवं जह्यातं समाधिना।
आत्मजं योगवीर्येण निद्रां सत्त्वनिषेवया।।

#हिंदी अनुवाद

आधिभौतिक दुःख को दया के द्वारा, आधिदैविक वेदना को समाधि के द्वारा और आध्यात्मिक  दुःख को योगबल और निद्रा को सात्विक भोजन,स्थान, संग आदि के सेवन से जीत लेना चाहिए।।

#English Translation
We should overcome our Adhivhautik sorrow(Epyphysis or pertaining to materialistic things or people)  through Compassion, Adhidaivik sorrow(super natural) should be overcome through Samadhi(meditation) and 

Adhyatmik sorrows (super natural) through Yogic powers and Sleep should be won through Satvik foods,places,company etc.