2, సెప్టెంబర్ 2021, గురువారం

సంస్కృత మహాభాగవతం

 *2.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఐదవ అధ్యాయము*


*భగవంతుని సేవింపనివారిగతి - భగవంతుని పూజావిధానము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*రాజోవాచ*


*5.1 (ప్రథమ శ్లోకము)*


*భగవంతం హరిం ప్రాయో న భజంత్యాత్మవిత్తమాః|*


*తేషామశాంతకామానాం కా నిష్ఠావిజితాత్మనామ్॥12324॥*


*నిమి మహారాజు ఇట్లనెను* యోగిపుంగవులారా! మీరు ఆత్మజ్ఞానసంపన్నులు, భగవద్భక్తులలో శ్రేష్ఠులు. కొందరు జితేంద్రియులు కానివారు భోగలాలసులై, చిత్తశాంతి కరవై భగవత్సేవకు దూరమగుదురు. వారిగతి ఎట్టిది?


*చమస ఉవాచ*


*5.2 (రెండవ శ్లోకము)*


*ముఖబాహూరుపాదేభ్యః పురుషస్యాశ్రమైః సహ|*


*చత్వారో జజ్ఞిరే వర్ణా గుణైర్విప్రాదయః పృథక్॥12325॥*


*అప్పుడు తొమ్మండుగురులో ఒకడైన 'చమనుడు' అను పేరుగల యోగిపుంగవుడు ఇట్లు నుడివెను* "మహారాజా! విరాట్ పురుషుడైన పరమాత్మయొక్క ముఖము నుండి సత్త్వగుణ ప్రధానులైన బ్రాహ్మణులు, బాహువులు నుండి సత్త్వరజో గుణమిశ్రిత స్వభావులైన క్షత్రియులు, ఊరువులనుండి రజస్తమోమిశ్రిత స్వభావము గల వైశ్యులు, పాదములనుండి తమోగుణ ప్రధానులైస శూద్రులు - అను నాలుగు వర్ణములవారు జన్మించిరి. వారితోపాటు బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్న్యాసాశ్రమములు ఏర్పడినవి.


*5.3 (మూడవ శ్లోకము)*


*య ఏషాం పురుషం సాక్షాదాత్మప్రభవమీశ్వరమ్|*


*న భజంత్యవజానంతి స్థానాద్భ్రష్టాః పతంత్యధః॥12326॥*


ఈ నాలుగు వర్ణములవారిలో తమ జన్మలకు కారణమైస పరమపురుషుని భజింపక, ఆ స్వామిపై అనాదరభావమును కలిగియుండువారు తమ తమ స్థానములనుండి భ్రష్టులగుదురు. పతితులై అథోగతి పాలగుదురు.


*5.4 (నాలుగవ శ్లోకము)*


*దూరే హరికథాః కేచిద్దూరే చాచ్యుతకీర్తనాః|*


*స్త్రియః శూద్రాదయశ్చైవ తేఽనుకంప్యా భవాదృశామ్॥12327॥*


నిమిమహారాజా! స్త్రీలు, శూద్రులు భగవంతుని గాథలను, నామకీర్తనమునకు దూరమైనారు. వారందరు మీవంటి భాగవతోత్తముల దయకు పాత్రులు. కావున, మీవంటివారు వారికి భగవత్కథామృతమును వినుటకు, నామగుణాదులను కీర్తించుటకు తగిన సౌకర్యమును కలిగించి, వారిని ఉద్ధరింపవలెను. 


*మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యుః పాపయోనయః|*


*స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేఽపి యాంతి పరాం గతిమ్॥*


ఓ అర్జునా! స్త్రీ, వైశ్య, శూద్రులును, అట్లే చండాలాదిపాపయోనిజులును నన్నే శరణుపొంది పరమగతినే పొందుదురు. (గీత 9/32)


*5.5 (ఐదవ శ్లోకము)*


*విప్రో రాజన్యవైశ్యౌ చ హరేః ప్రాప్తాః పదాంతికమ్|*


*శ్రౌతేన జన్మనాఽథాపి ముహ్యంత్యామ్నాయవాదినః॥12328॥*


బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ద్విజులగుటవలన వేదాధ్యయనాది సంస్కారములకు అర్హులు. తద్ద్వారా వారు భగవత్సన్నిధికి చేరుటకు యోగ్యులే. అట్టి సదవకాశమును కలిగియున్నప్పటికిని వారు వేదములలో తెలుపబడిన కామ్యకర్మలకును, వాటియొక్క తాత్కాలిక ఫలములకును ఆకర్షితులై, వాటి మోహములోబడి భగవత్సేవలకు దూరమగుదురు.


*5.6 (ఆరవ శ్లోకము)*


*కర్మణ్యకోవిదాః స్తబ్ధా మూర్ఖాః పండితమానినః|*


*వదంతి చాటుకాన్ మూఢా యయా మాధ్వ్యా గిరోత్సుకాః॥12329॥*


ముక్తిసాధన మార్గములను ఎఱుగనివారు, జ్ఞానులయెడ నమ్రతలేనివారు, తాము సర్వజ్ఞులమని మిడిసిపడుచుండు వారు మూర్ఖులు. అట్టి మూఢులు వినుటకు ఇంపైన మాటలకు ఉత్సుకత చూపుచు స్వర్గసుఖములకు సంబంధించిన మధుర వచనములను పలుకుచుందురు. వాటిని విని అజ్ఞానులు మోహములో పడుచుందురు.


*5.7 (ఏడవ శ్లోకము)*


*రజసా ఘోరసంకల్పాః కాముకా అహిమన్యవః|*


*దాంభికా మానినః పాపా విహసంత్యచ్యుతప్రియాన్॥12330॥*


ఇట్టి మూర్ఖులు, రజోగుణ ప్రభావముచే, అభిచార హోమములకు సంకల్పము చేయుచుందురు. వారి కోరికలకు అంతేయుండదు. వారు క్రోధస్వభావము గలవారు, దురహంకారులు, డంబాచారముగలవారు, పాపాత్ములు. అట్టివారు భగవద్భక్తులనుగూర్చి పరిహాసోక్తులను పలుకుచుందురు.


*5.8 (ఎనిమిదవ శ్లోకము)*


*వదంతి తేఽన్యోన్యముపాసితస్త్రియో గృహేషు మైథున్యపరేషు చాశిషః|*


*యజంత్యసృష్టాన్నవిధానదక్షిణం వృత్త్యై పరం ఘ్నంతి పశూనతద్విదః॥12331॥*


వారు స్త్రీలోలురై, పరస్పరము సాంసారిక విషయ చర్చలలో మునిగి సమయమును వ్యర్థముగా గడుపుచుందురు. స్త్రీ సాహచర్యమువలననే అత్యంత సుఖములు లభించు చుండునని భావించుచుందురు. అట్టి అజ్ఞానులు అన్నదానములు, దక్షిణలులేని యజ్ఞములను అవిధిపూర్వకముగా (శాస్త్రవిరుద్ధముగా) ఆచరించుచుందురు. తమ జీవనోపాధికొరకై యజ్ఞములను నిర్వహించు నెపముతో పశుహింసకు పాల్పడుచు పాపములను మూటగట్టుకొనుచుందురు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము

 *02.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2249(౨౨౪౯)*


*10.1-1362-*


*క. హరికిని లోఁబడి బెగడక*

*హరి యురము మహోగ్రముష్టి నహితుఁడు పొడువన్*

*హరి కుసుమమాలికాహత*

*కరి భంగిఁ బరాక్రమించెఁ గలహోద్ధతుఁడై.* 🌺



*_భావము: చాణూరుడు లొంగిపోయినా, ఆవేశమేమాత్రము తగ్గలేదు. బెదిరిపోకుండా, శ్రీ కృష్ణుని వక్షస్థలముమీద శక్తివంతమైన తన పిడికిలి బిగించి కొట్టాడు. పూలమాలతో కొట్టబడిన ఏనుగు వలె ఆ ముష్టిఘాతము ఆ బాలునిపై ఎటువంటి ప్రభావము చూపలేదు, సరి కదా ఆ మల్లయుద్ధములో చెలరేగిపోయి తన పరాక్రమమును ప్రదర్శించాడు._* 🙏



*_Meaning: Even after yielding once, Chanura did not give up and with renewed vigour hit Sri Krishna hard with his clenched fist. For Sri Krishna, it was like an elephant being hit with flower garland and spurred by Chanura’s blow, He burst out and started exhibiting His fighting skills with valour._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

story of leadership

 A beautiful story of leadership..


India was on the verge of getting #bankrupt in 1991.


The then Congress Prime Minister Narsimha Rao called Finance Minister Manmohan Singh and asked how much money is there in the treasury. 


Manmohan Singh said, very little to enable us to run the country for about 09 days only.


Narasimha Rao got tensed and asked how to deal with this situation? 


Manmohan Singh said that the value of the country's rupee should have to fall by 20%. 


Narasimha ji said, okay call the cabinet meeting and we will seek approval.


To which Manmohan ji said, if we arrange cabinet meeting, we will not be able to take these tough decisions. All ministers will address the vote bank and won't agree to it. So as the PM, you have to take this critical decision.


Narasimha ji paused for a while, and asked Manmohan ji to leave. Manmohan ji went to his office. After about 20 minutes, the PM's secretary went to Manmohan ji and handed over a letter. In that letter Narasimha Rao Ji had written, "Done"!


Manmohan ji got surprised, how could the PM gather the courage to say 'YES' even without getting nod of cabinet ministers? 


That could upset many top leaders of Congress. 


He rushed to PM's office again and asked what happened within these 20 minutes that led you to say YES?


Narasimha ji said, it was quite easy. I just spoke to the opposition leader, Atal Bihari Bajpai ji, and he said YES.


Manmohan ji asked, does that mean you look at Atal ji more than your own cabinet? 


Narasimha ji had said, I know he is the only person who will speak in the interest of the country.


It happens that after the announcement of this drastic decision to firefight bankruptcy, the Atal ji led opposition team never organized a protest movement, but supported the government to bring the country's economy back on track.


Today we must bring back such constructive politics of grace. 


The wisdom of Rao ji and the patriotism of Atal ji.


Remember ... NATION is above any political PARTY.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌹🌷🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌷🌹

పౌర్ణమినాడు గిరిప్రదక్షిణ*

 *అరుణాచల శివ* 🙏


 *పౌర్ణమినాడు గిరిప్రదక్షిణ* 


🔔🌷🔔🌷🔔🌷🔔🌷🔔🌷


ఏ దినమైనా, ఏ సమయంలో నైనా, తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణ చెయ్యవచ్చు. ఆయా దినం, తిథి, నక్షత్రం, యోగం, కరణం, హోర, లగ్నాలకు సరిపడే విధంగా ప్రదక్షిణ ఫలితాలు మార్పుచెందుతాయి. ఒక దృశ్యాన్ని ఒకసారి చూచి, మరోసారి చూచేలోపల ఒక్క క్షణ కాలంలోపనే ఆదర్శన ఫలితం మార్పు చెందుతుంది. అందుకనే శ్రీ శగస్త్య సిద్ధ పురుషుడు ఆ మార్పులను, అరుణాచల మహత్యాన్ని నాడి గ్రంథాలుగా క్రోడీకరించాడు.

పౌర్ణమి నాడే చంద్ర భగవానుడు తన 16 కళలతో పరిపూర్ణంగా ప్రకాశిస్తుంటాడు. మనసుకు కారకుడని చెప్పబడే చంద్ర భగవానుడు మనసును పరిపాలిస్తుంటాడు. శరీర పరిశుద్ధత, మనో పరిశుద్ధత ధ్యాన సిద్ధికి ఎంతో మేలు కలుగ చేస్తాయి. మనసు ఎన్నో విధాల ఆలోచనలతో సుళ్లు తిరుగుతుంటుంది. ఆలోచనలను కట్టుబాటు చేయలేదు. ఆలోచనా తరంగ వేగాలను హద్దులలో ఉంచగలిగినప్పుడే మనోశక్తిని పెంపొందించ గలుగుతాము. దానికి చంద్ర భగవానుని అనుగ్రహం అవసరం. దానిని పొందేందుకే పౌర్ణమి నాడు గిరిప్రదక్షిణ చేయడం.

పౌర్ణమి తిథి రోజున సూర్య భగవానుని వివిధ దైవాంశలను తన 16 కళల పూర్ణబింబంలో చంద్ర భగవానుడు ఐక్యం చేసుకుని ప్రకాశిస్తుంటాడు. అతడి అనుగ్రహ శక్తి కిరణ ప్రసరణ ద్వారా మన శరీరాల పైననూ, చుట్టూరా వున్న ప్రాంతాలలోనూ ప్రసరించుతూ ఉంటుంది.

 *పౌర్ణమి వెన్నెల కిరణాలు అద్బుత శక్తివంతమైన దైవశక్తిని సాధారణ మానవుడు* *పొందలేడు గాబట్టి అణ్ణామలేశ్వరుడే తన శరీర స్వరూపమైన పర్వతం* *పైన చంద్రుని అమృత కిరణాలన్నిటిని పొంది, వాటిని ఒక్కొక్క* *మానవుని దేహ శక్తికీ సరిపడే పంధాలో ప్రసాదిస్తుంటాడు.* *అణ్ణామలైలో విశేషమైన శిలలు, మూలికలు, వృక్షాలు చాలా ఉన్నాయి.* *అవి వివిధ కర్మ ఫలితాలను, జబ్బులనూ దోషాలనూ, పాపాలనూ నివర్తించగల శక్తివంతాలు.* 

ఈ పర్వతం మీద చంద్ర భగవానుని కిరణాలు ప్రసరించి ప్రతిఫలించేటప్పుడు వాటికి పదిరెట్లు శక్తి హెచ్చయి, గిరిప్రదక్షిణ చేసే వారి శరీరాలను తాకుతాయి.

 *దీనికోసమే పౌర్ణమి రోజున బయలుదేరే పురుషుల శరీరవు పైభాగంలో ఏ ఆచ్ఛాదనా* *లేకుండా (చొక్కా లేకుండా) ధోవతి కట్టుకుని, అంగ వస్త్రంతో మాత్రమే గిరిప్రదక్షిణ చెయ్యాలి.* దీనివల్ల తిరుఅణ్ణామలైనుండి ప్రతిఫలించే పుణ్యప్రదము, శక్తీవంతములైన చంద్ర కీరణాలు అధిక శాతం నేరుగా శరీరాన్ని తాకుతాయి. *ఆ శక్తి మూలంగా ప్రతి మానవుడూ* 

 *ఎన్నో కోట్ల కర్మ ఫలాలను నివారణ చేసుకుని మంచి* *మార్గంలో జీవీతం సాగించగలుగుతాడు.* 

 *బాలారిష్ట, దృష్టిదోషం, శూన్యం, చేతబడి, దిగదుడిచిన పదార్థలను తొక్కడం,* *గాలిచేష్టలవంటి, చెడుకార్యాలనుండి కాపాడబడుతాడు.* 

ఒక్కొక్క మానవుడు సాంప్రదాయల ప్రకారం చేసే ఒక గిరిప్రదక్షిణలో కనీస పక్షం ఒక నెలకు అవసరమైన పుణ్యశక్తిని పొందగలుగుతాడు.

 *తిరుఅణ్ణామలైలో చేయబడే దానధర్మాలకు వెయ్యిరెట్ల ఫలితం ఉంటుంది.* *పౌర్ణమి రోజున చేసే దానాలకు వెయ్యిరెట్లకన్నా ఇంకా ఎక్కువ ఫలితాలుంటాయి.* ఈ విధంగా అపరిమితమైన పుణ్యశక్తులను ప్రసాదించేదే పౌర్ణమి గిరిప్రదక్షిణ.

పౌర్ణమి నాడు మహర్షులు, సిద్ధపురుషులు, యోగులు, దేవతలు, దేవ దైవమూర్తులు, కలియుగంలో మానవాళి మంచి కోసం గిరిప్రదక్షిణ చేస్తుండటంవల్ల వారు తమ గిరిప్రదక్షిణ దైవశక్తిని పుణ్యఫలితాన్ని ఆనాడు గిరిప్రదక్షిణ చేసేవారికి ప్రసాదిస్తారు.కాబట్టి సాధారణంగా గిరిప్రదక్షిణ చేయడానికి వచ్చేవారికి కూడా ఈ అద్బుతానుగ్రహం కలుగుతుంది.

తిరుఅణ్ణామలై పర్వతం పైన మన దృష్టికి గోచరించేవేకాక, బండల మాదిరీ, గుండ్ల మాదిరి గాను కనుపిస్తాయి. కానీ అవి యదార్థానికి స్వయంభూలింగ మూర్తులు, *పర్వతమే ఆదిశివుని శరీర మైనప్పుడు ఒక్కొక్క శిలా ఒక్కొక్క లింగమేగదా?* భగవంతుని శరీరంపైన ఉండే వృక్షాలు, లతలు, చెట్లు ఎంతటి ఉత్తమమైన స్థితిని పొంది ఉండాలి!

ఒక మహాత్ముని దర్శనమే వేలకువేల కర్మ విమోచనలకు కారణమవుతున్నప్పుడు భగవంతుని స్థూల రూపమైన తిరుఅణ్ణామలై మీద ఉండే, గడ్డి, వెల్లుల్ని, చెట్టు లతలు, వృక్షాల దర్శనం కోటానుకోట్ల కర్మల విమోచనాన్ని చేస్తుందిగదా. అందుకనే గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్కొక్క అడుగుకూ పర్వతాన్ని దర్శించాలి అన్నది నియమం.

తిరుఅణ్ణామలైపైన అద్బుతమైన సాలగ్రమాలు, స్ఫటిక రూపాలు, బాణ లింగాలు చాలా ఉన్నాయి. వీటిపైన సూర్యకాంతి, చంద్రకాంతి, పర్వతంపైనుంచి ప్రవహించే నీరు తగిలి పౌర్ణమినాడు ఈశక్తులు ఎన్నోరెట్లుగా వృద్ధి చెంది గిరిప్రదక్షిణ చేసేవారికి సత్ఫలితాలను దైవభక్తినీ సంపూర్ణంగా ప్రసాదిస్తాయి.


 *ఓం నమః శివాయ* 🙏


🔔🌷🔔🌷🔔🌷🔔🌷🔔🌷🔔

జీవించాలనుకొన్నాడు

 ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ మైఖేల్ జాక్సన్ 150 సంవత్సరాలు జీవించాలనుకొన్నాడు...(సాధ్యమయ్యిందా ?) కానీ...


ఆయన్ను అంటిపెట్టుకొని ప్రతిరోజు ఆయనను నఖ శిఖ పర్యంతం పరీక్షలు నిర్వహించి, ఆయన ఆరోగ్యం కాపాడడానికి తన ఇంటివద్ద 12 మంది వైద్యులను నియమించుకొన్నాడు. 


మరో 15 మంది ట్రైనర్లు ఆయన దేహదారుఢ్యాన్ని కాపాడేందుకు నియమించబడ్డారు.


తాను తినే ఆహారం ముందుగా లాబరేటరీ లో పరీక్షించబడి, అప్పుడు మాత్రమే ఆయనకు వడ్డించబడేది. 


ఆయన పదుకొనె మంచం ఆయన పీల్చుకొనే ప్రాణవాయు పరిమాణాన్ని నియంత్రించగలిగే సాంకేతికతను కలిగి ఉండేది.


ఆయనకు ఏ అవయవం ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో ఇచ్చేందుకు అవయవ దాతలు సర్వదా సిద్ధంగా ఉండేవారు. ఈ అవయవ దాతలందరి యోగక్షేమాలు ఈయన సొంత ఖర్చుపై చూసుకోబడేవి. 


ఈ వసతులన్నింటితో ఆయన 150 సంవత్సరాలు జీవించాలన్న కలతో/ కోరికతో జీవనం సాగించారు. 


అయ్యో, ఆయన విఫలమయ్యాడే!


50 సంవత్సరాల వయస్సులో, 2009 సం, జూన్ 25 వ తేదీన ఆయన గుండె పని చేయటం మానేసింది. 


ఆయన ప్రాణాన్ని నిలబెట్టడానికి ఆ 12 మంది డాక్టర్ల నిరాఘాట, నిర్విరామ ప్రయత్నాలు ఫలించలేదు. 


లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా నుండి రప్పించబడిన ప్రత్యేక నిపుణులైన డాక్టర్ల ప్రయత్నాలు కూడా ఆయనను రక్షించలేకపోయాయి. 


25 సంవత్సరాల పాటు ఆయన వ్యక్తిగత డాక్టర్ల సలహా తీసుకోకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయని వ్యక్తి 150 సంవత్సరాలు జీవించాలన్న ఆయన స్వప్నాన్ని సాకారం చేసుకోలేకపోయాడు. 


2.5 మిలియన్ మంది ప్రత్యక్షంగా తన అంతిమ యాత్రలో పాల్గొన్న చరిత్ర ఇప్పటిదాకా ప్రపంచంలో ఒక్క జాక్సన్ మాత్రమే దక్కించుకోగలిగాడు.


ఆయన చనిపోయిన ఆ ప్రత్యేక దినమైన 25/06/2009 వ తేదీన 3.15 నిముషాలకు వికీపీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లు పనిచేయటం మానేసాయి. మిలియన్ల కొద్దీ జనం మైఖెల్ జాక్సన్ గూర్చి గూగుల్ లో వెతికారు...


జాక్సన్ చావును సవాలు చేసి, దాన్ని జయించాలనుకొన్నాడు; గానీ, చావే జాక్సన్ కు ప్రతిసవాలు విసిరి, తానే జయించింది. 


ఈ భౌతిక ప్రపంచంలో మన భౌతిక జీవనాన్ని, భౌతిక మరణం కబళిస్తుంది. ఇది జీవన నియమావళి.


ఇప్పుడు మనమోసారి ఆలోచిద్దాం!


మనం డాక్టర్లు, ఇంజినీర్లు, డెకోరేటర్లు, డిజైనర్ల కోసమే (డబ్బు) సంపాదిస్తున్నామా? 


అత్యంత విలాసవంతమైన భవంతులు, కార్ల తోను; అత్యంత వ్యయభరితమైన వివాహ వేడుకలతోనూ మనం ఎవరిని సంతృప్తి పరచాలనుకొంటున్నాం? 


రెండే రెండురోజుల క్రితం ఓ వివాహ వేడుకలో మనం తిన్న ఆహారపదార్ధాలను నేడు గుర్తుకు తెచ్చుకోగలమా? 


మన జీవనాన్ని మనమొక మృగంలా ఎందుకు కొనసాగిస్తున్నాం?


సుఖ జీవనానికని చెప్పి, ఎన్ని తరాలకు సరిపడా సొమ్మును మనం ఆదా చేయలనుకొంటున్నాం? 


మనలో అత్యధికులకు ఒకరు లేదా ఇద్దరు సంతానం మాత్రమే ఉన్నారు. అయితే, మనమెప్పుడైనా, మనకెంత అవసరం ఉంది, మనం ఎంత కోరుకొంటున్నాం అని ఒక్క క్షణమైనా అలోచించామా? 


'మా పిల్లలు సంపాదించ లేని అసమర్థులు కాబట్టి వారి కోసం మరింత పోగు పెట్టటం అవసరమని' మనం ఒప్పుకొంటున్నామా? 


ఈ వారంలో నీకోసం గానీ, నీ కుటుంబం కోసం గానీ, నీ మిత్రుల కోసం గానీ, కొంత సమయమైనా కేటాయించగలిగావా? 


నీ కోసం నీ ఆరోగ్యం కోసం నువ్వు కేవలం ఐదు శాతం సొమ్మునైనా ఖర్చు చేసుకోగల్గుతున్నావా?  


మన జీవన మనుగడలో మనమేం సంపాదిస్తున్నామో వాటిలోనే మనం ఆనందాన్ని ఎందుకు వెతుక్కోలేకపోతున్నాము? 


వీటి కోసం నువ్వు లోతుగా ఆలోచిస్తే నిద్రలేమి, స్థూలకాయం, వెన్నుపూస జారిపోవటం వంటి వ్యాధులు నిన్ను చుట్టుముడతాయేమో?! బహుశా నీ గుండె కూడా పని చేయటం మానేస్తుందేమో?! వున్నంత్తలో ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చెయాలి.


ముగింపు: 


నీకోసం నువ్వు కొంత సమయాన్ని వెచ్చించుకో. మనం ఏ విధమైన ఆస్తుల్ని సొంతం చేసుకోలేం, అవన్నీ కేవలం తాత్కాలికంగా మన పేరు రాయబడే దస్త్రాలు మాత్రమే!


'ఇవ్వన్నీ నా ఆస్తులు' అని నీవు చెప్పినప్పుడెల్లా, భగవంతుడు నిన్ను చూసి ఓ వికృత నవ్వు నవ్వుతూ ఉంటాడు. 

ఓ వ్యక్తి నడుపుతున్న కారును చూసి, వేసుకున్న బట్టలు చూసి, అతనిపై ఓ గొప్ప భావనను నువ్వు సృష్టించుకోనవసరం లేదు. 


మనకున్న గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, గణిత మేధావులు, సంస్కర్తలు లాంటి మహానుభావులంతా వారి ప్రయాణానికి వారు స్కూటర్ లను సైకిళ్ళను మాత్రమే వాడేవారు!


ఐశ్వర్యవంతుడవ్వాలనుకోవటం పాపం కాదు; కేవలం డబ్బుతో మాత్రమే ఐశ్వర్యవంతుడవ్వాలనుకోవటం కచ్చితంగా పాపం! కానీ ఆరోగ్యమే మహాభాగ్యం.


జీవనాన్ని నువ్వు అదుపులో పెట్టుకో, లేకుంటే, అది నిన్ను తన అదుపులోకి తీసుకొంటుంది. 


చివరకు-

మన జీవన చరమాంకానికి మనం పొందే 'ఆనందం', 'తృప్తి', 'శాంతి' మాత్రమే మనకు నిజమైన వాస్తవ విషయాలుగా ఋజువవుతాయి. 


విచారించదగిన విషయమేమంటే- వీటినేమీ మనం డబ్బుతో కొనుక్కోలేము...🙏🙏🙏

హిందువుల పట్ల

 *హిందువుల పట్ల నెహ్రూ గారి మోసం 

ఈ యాక్ట్ 30 ఎ


*మోడీజీకి హిందువులపట్ల నెహ్రూ చేసిన మోసం సరిచేయవలసిన సమయము అస్సన్నమైనది*


*మీరు "యాక్ట్ 30", "యాక్ట్ 30 ఎ" గురించి విన్నారా ?????*


 *"30 ఎ" అంటే ఏమిటో మీకు తెలుసా? * * ఇంకా తెలుసుకోవడానికి ఆలస్యం చేయవద్దు ...... * * 30 A * అనేది రాజ్యాంగంలోని ఒక చట్టం.*


*నెహ్రూ మొదట ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చడానికి ప్రయత్నించినప్పుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు ....*


*ఎందుకంటే "ఈ చట్టం హిందువులకు గొప్ప ద్రోహం, కాబట్టి ఈ కర్ణి చట్టాన్ని రాజ్యాంగంలో తీసుకువస్తే, నేను కేబినెట్ మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను ... ఆపై ఈ ద్రోహానికి వ్యతిరేకంగా కర్ణి చట్టం, భారతీయులందరితో కలిసి వారికి ముందుండి ఆందోళనకు నాయకత్వం వహిస్తాను” అని సర్దార్ పటేల్ అన్నారు.*


*అప్పుడు తాత్కాలికంగా సర్దార్ పటేల్ సంకల్పానికి ముందు నెహ్రూ మోకాలొడ్దారు. దురదృష్టవశాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ కొన్ని నెలల్లో అనుకోకుండా మరణించాడు.*


*సర్ధార్ పటేల్ మరణించిన వెంటనే, నెహ్రూ ఈ చట్టాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు.*


*ఇప్పుడు 30 A * యొక్క లక్షణాల గురించి మాట్లాడుదాం. * ఈ చట్టం ప్రకారం - హిందువులలో హిందువులలో తమ "హిందూ మతాన్ని" బోధించడానికి అనుమతి లేదు. "యాక్ట్ 30 ఎ" దీనికి అనుమతి లేదా అధికారం ఇవ్వదు.*


*హిందువులు తమ ప్రైవేట్ కాలేజీలలో హిందూ ధర్మాన్ని బోధించకూడదు, హిందూ మతాన్ని బోధించడానికి కళాశాలలను ప్రారంభించకూడదు. హిందూ మతం బోధించడానికి హిందూ పాఠశాలలను ప్రారంభించకూడదు.*


*ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలలలో హిందూ మతం బోధించడానికి చట్టం 30 ఎ కింద అనుమతి లేదు.*


*కానీ .. విచిత్రం ఏమిటంటే, దీనితో (30A తో పాటు) నెహ్రూ రాజ్యాంగంలో చేర్చిన మరో చట్టం ఉంది, అది "చట్టం 30". ఈ "చట్టం 30" ప్రకారం ముస్లింలు తమ మతపరమైన అధ్యయనాల కోసం ఇస్లామిక్ మత పాఠశాలలను స్థాపించవచ్చు మరియు ప్రారంభించవచ్చు.*


*ముస్లింలు తమ మతాన్ని బోధించవచ్చు. చట్టం 30 ముస్లింలకు వారి స్వంత 'మదర్సా' ప్రారంభించడానికి పూర్తి అధికారం మరియు అనుమతి ఇస్తుంది. మరియు క్రైస్తవులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 వారి స్వంత మత పాఠశాలలు మరియు కళాశాలలను స్థాపించడానికి మరియు వారి మతాన్ని స్వేచ్ఛగా బోధించడానికి మరియు ప్రచారం చేయడానికి పూర్తి అధికారం మరియు అనుమతి ఇస్తుంది.*


*దీనికి మరో చట్టపరమైన అంశం ఏమిటంటే, హిందూ దేవాలయాల యొక్క డబ్బు మరియు సంపద అంతా ప్రభుత్వానికి ఇష్టానుసారం పొందవచ్చు.*


 *హిందూ దేవాలయాలలో హిందూ భక్తులు వేసిన డబ్బు మరియు ఇతర విరాళాలను పూర్తిగా ప్రభుత్వ ఖజానాకు తీసుకెళ్లవచ్చు.*


*అదే సమయంలో, మసీదులు మరియు క్రైస్తవ మసీదులలోని డబ్బు మరియు విరాళాలను పూర్తిగా క్రైస్తవ-ముస్లిం సమాజానికి ఇవ్వవచ్చు.*


*ఈ విధంగా, "యాక్ట్ 30 ఎ" మరియు "యాక్ట్ 30" అనేది హిందువులపై తీవ్రమైన వివక్ష మరియు స్పష్టమైన ద్రోహంగా పరిగణించవచ్చు.*


*ప్రతి ఒక్కరూ దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇతరులకు అవగాహన కల్పించండి. *

 *మనలో ప్రతి ఒక్కరూ సనాతన ధర్మానికి సంరక్షకులుగా ఉండనివ్వండి *

*జై హింద్ - జైభారత్ * జై శ్రీరామ్!...🕉️👏👏🇮🇳🇮🇳..🚩🚩🌞💥pb☀️🌞

భారతీయ సంప్రదాయ పెళ్ళి

 *కనుమరుగవుతున్న మన భారతీయ సంప్రదాయ పెళ్ళి ముచ్చట్లు🔷* 


 పెళ్ళిలో భోజనాలంటే ఒక పెద్ద #యజ్ఞంలా వుండేది,

సరదాగానూ వుండేది. భోజనాలకి పిలుపుల దగ్గరనుంచి భోజనాలు కార్యక్రమం పూర్తి కావడం ఒక పెద్ద వేడుక. ఐదురోజుల పెళ్ళిలో చెప్పేదేముంది, పూట పూటా సంబరమే…


పెద్దపెద్ద మండువా లోగిళ్ళుండేవి. మండువాలో ఒక పక్క ఆకులేస్తే ఒక పాతిక మందికి భోజనానికి సరిపడేది. ఇలా నాలుగుపక్కలవేస్తే దగ్గరగా వొక వంద మంది ఒక సారి భోజనం చేయడానికి వీలుండేది. ఇలా వీలు లేక పోతే దొడ్డిలో ఒక పెద్ద పందిరివేసి దానిని గదులుగా కట్టి గాలి వెలుతురు కోసం మనిషి పై ఎత్తు నుంచి ఖాళీగా వదిలేసే వారు. అలా కట్టిన వాటిలో నేల చదును చేసి కళ్ళాపు జల్లి అలికిన మట్టి ఇంటిలా తయారు చేసేవారు. భోజనాలకి కూచోడానికి ఈతాకుగాని, తాటాకు చాపలుగాని వేసేవారు. కింద కూచుని భోజనం చేసేవారు.

సాధారణంగా అరటి ఆకులు వుపయోగించే వారు. అత్యవసర పరిస్థితులలో అడ్డాకులు వాడేవారు. ఇక్కడ కూడా ఒకసారి వంద మంది పైగా ఒక సారి భోజనాలు చేసేందుకు సావకాశం ఉండేది.

పంక్తులుగా ఆకులేసి, అందరూ కూచున్న తరవాత వడ్డన ప్రారంభించేవారు. 


భోజనానికి, వడ్డనకి ఒక క్రమం ఉంది. నేటి ప్రోటోకోల్ లాగా! ముందు పప్పు, కూరలు, పచ్చళ్ళు, వూరగాయ, పిండివంటలు అన్నీ అయిన తరవాత అన్నం పెట్టేవారు. వడ్డన ప్రారంభించిన వెంటనే పెట్టినవి తినెయ్యకూడదు. అందరూ ఒక సారి తినడం మొదలు పెట్టాలి. వడ్డన అంతా పూర్తి అయినతరవాత గోవిందనామ స్మరణతో భోజనం ప్రారభమయ్యేది. అసలు సిసలు వడ్డన ఆ తరవాత ప్రారంభమయ్యేది,తినడం ప్రారంభించిన తరవాత. యువకులు యువతులు వడ్డన చేసేవారు. పంచకట్టి ఆపైన తువాలు మొలకి గట్టిగా బిగించేవారు యువకులు. యువతులు పమిట పూర్తిగా వేసుకుని ఆ కొంగు మొలలో దోపుకును వడ్డనకి ఉపక్రమించే వారు.

వడ్డన సామానుల పేర్లే మరిచిపోతున్నారు,ఇప్పుడు. పులుసు వడ్డించడానికి వాడేపాత్రని #గోకర్ణం అనేవారు. 

మొదటిది పప్పు, ఇది పట్టుకుని ఒకరు, నెయ్యి పట్టుకుని ఒకరూ బయలుదేరేవారు. పప్పు వేసే అతను పప్పండి, మీకండి, పప్పండి,పప్పండి,పప్పండి అని వడిగా అంటు కదిలేవాడు. వెనకాల వచ్చే నెయ్యి తెచ్చినతను నెయ్యండి, నెయ్యండి,నెయ్యండి అంటూ వేసుకుంటూ వెళ్ళేవాడు. ఈ మాటలు గబగబా అంటే మరొక అర్ధం స్ఫురిస్తుంది. అని చూడండి. ఆ తరవాతది కూర. కూర తెచ్చినతను కూరండి, కూరండి, కూరండి అంటూ కావలసిన వాళ్ళకి వేసుకుంటూ వెళ్ళేవాడు. మధ్యలో అన్నం బుట్ట పట్టుకుని ఒకరు వచ్చేవారు. వేడిఅన్నం తాటాకు బుట్టలో పెట్టుకుని, బుట్ట చేతిమీద పెట్టుకుని, కాలకుండా బుట్ట కింద అరటాకు వేసుకుని ఒక హస్తంలాటి దానితో అన్నం వడ్డించేవారు. వీరు అన్నమండి తో ప్రారంభించి, మీకన్నమండి,మీకన్నమండి, మీకన్నమండి అంటూ సాగిపోయేవారు. మీకు+అన్నమండి=మీకన్నమండి అయిపోయింది. ఈ మాటలన్నీ వడిగా అంటేనే ఆ అందం అర్ధం స్ఫురిస్తాయి. పప్పుతో పులుసు వడ్డించేవారు. ఈ పులుసుని పులుసండి నుంచి పులసండి, పులసండి అనుకుంటూ వెళ్ళేవారు. పులసండి కి అర్ధం పులవమని. ఈ మాటలని కొంతమంది యువకులు ఆటపట్టించడానికి కూడా వాడే వారు, గబగబా అంటూ. పప్పుతో కాకుండా పులుసు వేరేగా కలుపుకుని తినేవారు. అప్పుడు నంజుడుకి వుండటానికి వడియాలు, అప్పడాలు వేసేవారు. 

ఒక కొంటె యువకుడు పంక్తిలో ఒక తాతగారి దగ్గరకెళ్ళి తాతగారు వడియాలు కావాలా అని అడిగేవాడు. ఆయన కావాలంటే ఒక పెద్ద కేక వేసేవాడు! ఒరేయ్ సుబ్బన్నా! ఇక్కడ తాతగారికి వడియాలు కావాలి పట్రా అని. అంటే తాతగారికి పడుచుపెళ్ళాం కావాలంటున్నాడురా అని ఎద్దేవా అన్న మాట. నిజంగా ఇందులో పైకి ఏ విచిత్రమూ లేదు కాని అసలు కొంటె తనం వుంది. తాతగారు కొద్ది ఘటికుడైతే మరొకలా సాగేది. కావాలని వడియాలు తెచ్చినతరవాత ఇదేమిటి ఇవితెచ్చేవూ అనేవాడు. మీరేగా వడియాలుకావలన్నారని అనేవాడు, యువకుడు.అప్పుడు తాతగారు ఒర్నీ! వడియాలంటె పడుచుపెళ్ళాన్ని తెస్తావనుకున్నారా అనేవాడు. 

మరోలా కూడా సాగేది. ఏమిటీ అన్నారూ అనేవాడు, ముసలాయన. వడియాలుకావాలా అని మళ్ళి అడిగేవాడు, యువకుడు. ఈ తాతగారు ఘటికుడు కనక వడియాలు నాకెందుకూ అనేవాడే కాని వద్దనేవాడు కాదు. తాతా! పెళ్ళిచేసుకుంటావా అంటే పిల్లనిచ్చేవాడెవడురా! అనేవారుకాని వద్దనేవారు కాదు!. అది ఒక సరదా.! వడియాలు నేనేమి చేసుకోనూ అనేవాడు. అంటే నమలడానికి పళ్ళు లేవనీ అర్ధం, పడుచు పెళ్ళాంని నేనేమి చేసుకోనూ అని కూడా అర్ధం వచ్చేది. పోనీ అప్పడాలు కావాలా అంటే, అప్పడాలు ఇప్పటిదాకా నాదగ్గరే వుండాలి, ఎక్కడుందో చూడునాయనా అనేవాడు. ఒకవేళ భార్య పక్కనుంటే అప్పడాలు పక్కనే వుందిగా అనేవాడు.

ఇప్పుడర్ధమైనదనుకుంటాను, అప్పడాలు ( అప్పటి+ ఆలు= అప్పటాలు, అప్పటియాలు, అప్పడాలు అనగా పాత భార్య) వడియాలు అనగా ( వడి+ఆలు= వడియాలు వడి అనగా వేగం, విసురు అని అర్ధాలు, అనగా పడుచు భార్య).

 

ఒక్క మంచినీళ్ళు పోసేవారు మాత్రమే మాట్లాడకుండా ఖాళీ గ్లాసుల్లో మంచినీళ్ళుపోసేవారు. ఇక చివరిది పెరుగు, పెరుగు తెచ్చినవారు పెరుగండి నుంచి పెరగండి నుంచి వడిగా అనడం లో జరగండి దాకా వెళ్ళిపోయేది. అంటే ఇక తిన్నది చాలు లేవండి అన్నట్లుగా.భోజనాల దగ్గరనుంచి అంతా ఒక సారి లేచేవారు, గోవింద నామ స్మరణ చేస్తూ. పంక్తి లో ఎవరేనా తినడంలో వెనక పడితే వారికోసం అందరూ వారి భొజనం పూర్తి అయ్యేదాకా కూచుని వుండేవారు. ఇది వారి పట్ల చూపే గౌరవం. మన వాళ్ళు భోజనాలలో కూడా ఇలాసరదా చూపేవారు. అలా సందడి సందడిగా భోజనాలు ముగిసేవి.


ఇప్పుడు ప్లేట్లు పట్టుకుని క్యూలో నుంచుని కావల్సినవి వేసుకుని/వేయించుకుని కొండొకచో ఒంటి కాలిమీద నిలబడి/ ఎక్కడో ఒకచోట కూచుని భోజనం కానిచ్చేస్తున్నాం మరి. మాధాకోళం బ్రతుకులైపోయాయని ఒక పెద్దాయన వాపోవడం విన్నాను . అందం, హాస్యం చచ్చిపోయాయి.

 *మరెన్నో జ్ఞాపకాలు మదిని దోచుకుంటున్నాయి ప్చ్* 🤔

🔹మీరేమంటారు మిత్రులు 🔸

ప్రశ్న పత్రం సంఖ్య: 24

 ప్రశ్న పత్రం సంఖ్య: 24  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి  

 1)What is the meaning of  UPI  

2) what is the instrument used by submarines to see over sea

3) computer memory two types, what are they 

4) Why is sea water salty but not river water?

5) the vitamin present in tomato is

6). in the modern Cars carburetor is replaced by _____

7) tally is a type of software used by whom in India

8) to get the image appearing on screen over paper the device used is

9) the disease beriberi is caused due to deficiency of

10) silicon valley is the place located in which country

11) Terrycot is a Blended fabric made by combination

12) what is ECU in a modern car

13) 1 -2-4 mixture is used by which engineer

14) seat belt in airplane  main purpose is to protect you during

15) boiling point of water in centigrade is at______

16) which pigment is responsible for human hair color

17) carbon dioxide is not poisonous, but its unstable form is deadly poisonous what is it

18) if carbon dioxide is dissolved in water you will drink as soft drink, what is the name of it.

19) what is the name of mechanism which converts carbon dioxide into starch

20) CPU is the name of part in computer   is responsible for what  


Write✍️ your answers in the comments box and send with your name



శ్రీలలితా సహస్రనామ భాష్యము

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*404వ నామ మంత్రము* 2.9.2021


*ఓం భక్త హార్ద తమో భేద భానుమద్భాను సంతత్యై నమః*


సూర్యకిరణాలు చీకట్లను పారద్రోలునట్లు, భక్తుల హృదయాలలోని అజ్ఞానాంధకారాన్ని రూపుమాపు పరమేశ్వరికి నమస్కారము.


 శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భక్త హార్ద తమో భేద భానుమద్భాను సంతతిః* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *భక్త హార్ద తమో భేద భానుమద్భాను సంతత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తుల యొక్క అజ్ఞానంధకారాన్ని పోగొట్టి నిరతము ఆ పరమేశ్వరి పాదసేవనాచింతనమును ప్రసాదించి తరింపజేయును.


పరమేశ్వరి *ఉద్యద్భాను సహస్రాభ* అను నామాంకిత అయి ఉన్నది. అనగా ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతులవలె ప్రకాశించునది. తన భక్తుల హృదయాలలోని తమో గుణము అను అజ్ఞానచీకట్లను పారద్రోలి జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేయునది. ఆ జ్ఞానజ్యోతులు కూడా సూర్యకిరణములవలె ప్రకాశించునవి. 


ఆ తల్లి విద్య-అవిద్య అను రెండు స్వరూపములు గలిగినది. అవిద్య అనగా అజ్ఞానము. అట్టి అజ్ఞానము తన భక్తులలో పోగొట్టుటకే ఆ తల్లి అవిద్యా స్వరూపముకూడా తనదిగా ఉన్నది. గనుక తన భక్తుల హృదయాలలోని అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతులు సూర్యప్రభలవలె ప్రకాశింపజేస్తుంది గనుకనే అమ్మవారు *భక్త హార్ద తమో భేద భానుమద్భాను సంతతిః* అని యనబడినది. 


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భక్త హార్ద తమో భేద భానుమద్భాను సంతత్యై నమః* అని యనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*987వ నామ మంత్రము* 2.9.2021


*ఓం అనఘాయై నమః* 


అఘములనబడే పాపము, దుఃఖము, వ్యసనములు - వీటిలో ఏ ఒక్కటియుకూడా లేని పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అనఘా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం అనఘాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను ఆరాధించు భక్తులు పాపరహితులై పవిత్రమైన జీవనము కొనసాగించి తరించుదురు.


పాపము, దుఃఖము, వ్యసనము అనునవి అఘములు అంటారు. ఇవి కేవలం దేహధారులకు మాత్రమే. జననమరణ చక్రభ్రమణము కలిగినవారికి మాత్రమే. కర్మఫలములు సంచితములై, జన్మలు ఎత్తడం జరుగుతుంది. సత్కర్మలవలన సంతోషము, దుష్కర్మల వలన దుఃఖము పొందడం జరుగుతుంది. కర్మఫలాలు శూన్యమైతే, కైవల్యము లభిస్తుంది, జనన మరణ చక్రభ్రమణము నుండి విముక్తి లభిస్తుంది. శరీరధారులు కర్మ ఫలములననుసరించి దేహమును ధరించుచుందురు. కర్మఫలములు శూన్యములైతే కైవల్యమును పొందుదురు. లేకుంటే కర్మఫలానుసారము దేహధారులై జనన మరణచక్రములోనే కొనసాగుదురు. పాపకర్మల ఫలముల వలన నీచజన్మలు, పుణ్యకర్మల ఫలమువలన ఉత్తమజన్మలు పొందుదురు. ఏదైనా పాపము లేదా పుణ్యము అనునది దేహధారికి మాత్రము తథ్యము. కాని శ్రీలలితాంబిక శుద్ధజ్ఞాన స్వరూపిణి. పరమాత్మ. సచ్చిదానంద స్వరూపిణి. పాపరహితురాలు. అందుచే ఆ తల్లి *అనఘా* యని అనబడుచున్నది.


శ్రీమాతకు నమస్కరించునపుడు *ఓం అనఘాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

ఈశ్వరుడు సాక్షి

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*ఈశ్వరుడు సాక్షి ...🙏🙏🙏* 


అంతా ఈశ్వరేచ్ఛ అని అంటూ ఉంటాం అంటే... "ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించిన వాడు ఈశ్వరుడు.

ఈశ్వరుడు నిర్దేశించిన ఫలితం మనం చేసిన కర్మలకు వస్తున్నది... అది "ఈశ్వరేచ్ఛ".


🌷ఎవరు ఏ కర్మ చేస్తే వారికి ఆ ఫలితం వస్తుంది. ఆయన ఎవరి యందూ ప్రత్యేక బుద్ధి కలిగి ఉండడు. ఆయన సాక్షి. కాబట్టే ఈ కర్మలు నమోదై, ఆయా కర్తవ్య పాలనానికి ఆయా ఫలితాలు పొందుతున్నాం. ఈ కర్మకి ఇది ఫలితం వస్తుంది అని నిర్దేశించాడు... అది వస్తున్నది.


🌷ఎప్పుడూ కూడా ప్రతి మనిషికీ ఒక సంఘటనలో తన హద్దు ఒకటి తనకు ఉంటుంది. భక్తుడే కావచ్చు , జ్ఞాని కావచ్చు , యోగి కూడా కావచ్చు.. తన అంతస్థును పరిథిని మాత్రం అతిక్రమించకూడదు.

(ఇక్కడ అంతస్థు అంటే ధనం, ఐశ్వర్య రూపం లోది కాదు)


🌷ఉద్యోగం చేస్తున్నాం, మనతో కలిసి పని చేసే వ్యక్తిని తక్కువగా చూడడం ధర్మమేనా? 

అవతల వ్యక్తి సేవకా వృత్తిలో ఉంటే మాత్రం అలా చేయవచ్చా.? ఒకరు సేవ్యుడు.. ఒకరు సేవకుడు... అంతవరకే... ఆ హద్దు మీరరాదు. 


🌷ఏ అంతస్థులో, ఏ ఉద్యోగంలో, ఏ విధి నిర్వహణలో ఉన్నా మన పరిధి దాటకూడదు. దాన్ని దాటితే ధర్మాన్ని దాటిన, అతిక్రమించిన దోషం కలుగుతుంది.


🌷 శ్రీరాముడు మానవుడుగా వచ్చాడు.. మానవుడుగా జీవించాడు. యుద్ధంలో రావణుని ఎదిరించాడు, సంహరించాడు. స్వయం ఈశ్వరుడే వచ్చి నువ్వు ఆ విష్ణువువే, ఆ "ఈశ్వర" అంశ అని చెప్పినా ఆంతర స్థితిలో ఏమున్నా... లౌకిక జీవన విధానంలో తాను ఎప్పుడూ మనుష్యుడు గానే ఉన్నాడు.. దైవాంశ ఉన్నదని మహిమలు చూపలేదు. మానవుడిగా తన పరిథి దాటలేదు. తన అంతస్థు పరిథి అతిక్రమించలేదు.


🌷అలానే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునికి తన పరిథేమిటో తెలియవచ్చేలా చేసాడు. భీష్ముడు దైవీ శక్తులు కలవాడు. దైవాంశ సంభూతుడు. వసువులలో ఒకడు.

కురుక్షేత్రం లో భీష్ముడు యుద్ధమత్తుడై ఒళ్ళు మరచి తన దైవీశక్తులను ప్రకటిస్తూ, పాండవ సేనను చీల్చి చెండాడుతూ, అర్జునుని మీద కూడా తన దైవీ శక్తులను ప్రకటించి యుద్ధం చేసాడు.


🌷భీష్ముడు మీరుతున్న మానవ పరిధిని సహించక, మానవునిగా యుద్ధం చేయక అంతస్థుని, పరిథిని మించి దైవీ శక్తులను ప్రకటిస్తున్నాడు కనుక ఆయుధం పట్టనన్న కృష్ణుడు భీష్ముని మీదకు ఉరికాడు. భీష్ముడు తప్పు తెలుసుకొని అస్త్రాలను వదిలి కృష్ణుని దండన స్వీకరించడానికి సిద్ధపడ్డాడు.


🌷సంపూర్ణ అవతారమైనా ధర్మం విషయంలో మనుష్యులతో మమేకమైనప్పుడు కృష్ణుడు ఎక్కడా పరిథిని మీరలేదు... గీతలో "నీ కర్తవ్యం యుద్ధం చేయడం.. యుద్ధం చెయ్యి, గెలిస్తే రాజ్యం , ఓడితే స్వర్గం" అన్నాడు తప్ప.., ఏం జరిగినా నేనున్నాను, మీ అందరినీ కాపాడతా" అని చెప్పలేదు.


🌷నువ్వు చేయవలసింది, నీ అంతస్థులో నీ పరిథిలో చేయమని చెప్పాడు. "ధర్మం పాటించమన్నాడు" అంతే. "కాపాడే కర్తవ్యం తన మీద పెట్టుకోలేదు".. ఈ కర్మకు ఈ ఫలితం అని నిర్దేశించాడు.


🌷కాల స్వరూపాన్ని గీతలో అర్జునునికి చూపాడు... "నేను మీకు ఫలితం ఇచ్చేయడం కాదు, నువ్వు యుద్ధం చేయబోతున్నావు. .

మీరు యుద్ధం గెలవబోతున్నారు. వారు చనిపోబోతున్నారు.. మీరు రాజ్యం చేస్తారు" అని చూపించాడు తప్ప... "నేను మీకిచ్చేస్తున్నాను" అని చెప్పలేదు

అలా ఐతే కురుక్షేత్ర యుద్ధం లేకుండానే ఇచ్చేయవచ్చు.. అలా చేయలేదు. 


🌷అంటే... మనం చేసే కర్మలకు ఫలితం మనకు వస్తుంది. అదే ఈశ్వరేచ్ఛ"..

            

ఈశ్వరం శరణం యామి

 క్రోధమోహాదిపీడితః | 

 అనాథం పతితం దీనం

పాహిమాం పరమేశ్వరః ...

ముకుందమాల స్తోత్రమ్ శ్లోకం : 38

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                   శ్లోకం : 38

                           SLOKAM : 38

                                                


ध्यायन्ति ये विष्णुमनन्तमव्ययं

हृत्पद्ममध्ये सततं व्यवस्थितम् ।

समाहितानां सतताभयप्रदं

ते यान्ति सिद्धिं परमां च वैष्णवीम् ॥ ३८ ॥


ధ్యాయంతి యే విష్ణుమనంతం 

                                  అవ్యయం 

హృత్పద్మమధ్యే సతతం 

                                  వ్యవస్థితం I    

సమాహితానాం సతతాభయప్రదం  

తేయాంతి సిద్ధిం పరమాం చ 

                                     వైష్ణవీం॥ 38  


అనంతుడు, 

అవ్యయుడు, 

హృదయ పద్మములో సదా వెలసి ఉండేవాడు, 

స్థిరచిత్తులై ఉండే వారికి ఎల్లప్పుడూ అభయమిచ్చేవాడు అయిన శ్రీ మహావిష్ణువుని 

    ఎవరు సదా ధ్యానం చేస్తారో    

    వారికి ఆ భగవదనుగ్రహం వల్ల సకలాభీష్టసిద్ధి కలుగుతుంది.    

    మరియు విష్ణు సంబంధ మనెడి పరమసిద్ధిని పొందుదురు.  


    The unlimited and infallible Viṣṇu, 

   who is always present within the lotus of the heart,    

   grants fearlessness to those who fix their intelligence upon Him. 

   The devotees who meditate on Him will reach the supreme perfection of the Vaiṣṇavas.    



https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

మొగిలిచెర్ల అవధూత

 మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి లీలలు..


*దంపత్సమేత దీక్ష..*


నాలుగైదేళ్ల క్రిందట దత్త దీక్షా కార్యక్రమం జగుతున్న నాటి సంఘటన ఇది..

"అయ్యా..నలభై ఒక్క రోజుల మండలదీక్ష రేపు కూడా తీసుకోవచ్చా..? మా ఇంటాయన చేత దీక్ష చేయిద్దామని అనుకుంటున్నాను.." అని మా దేవస్థానం లో పనిచేసే సిబ్బందిని అడిగిందా ఇల్లాలు..ఆమె పేరు వెంకట సుబ్బమ్మ, ఆమె భర్త పేరు కొండయ్య.."రేపే చివరి రోజు..రేపు వచ్చి దీక్ష తీసుకోండి.."-అని మా వాళ్ళు జవాబు చెప్పారు..తలవూపి వెళ్ళిపోయింది..


వెంకట సుబ్బమ్మ కొండయ్య దంపతులు..ఇద్దరు పిల్లలు..కొన్నాళ్ళు సంసారం బాగానే గడిచింది..కొండయ్య ఏకారణం చేతో తెలీదు కానీ తాగుడికి బానిస అయ్యాడు..ఆనాటి నుంచీ సంసారం లో కలతలు ప్రారంభం అయ్యాయి..అతని సంపాదన మొత్తం తాగుడికి సరిపోతోంది..వెంకట సుబ్బమ్మ కూలి పనులు చేసి, కాపురాన్ని నెట్టుకొస్తోంది..భర్త స్వతహాగా మంచివాడే..కానీ ఈ దురలవాటు అతనిని మార్చివేసింది..త్రాగుడు మానుకోమని ఎన్నోసార్లు భర్తను బ్రతిమలాడి చెప్పుకున్నది..ఆ పూటకు సరే అంటున్నాడు..మళ్లీ ప్రక్కరోజుకు త్రాగుతున్నాడు..సరిగ్గా ఆ సమయం లోనే, మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మండల దీక్ష మొదలవుతున్నదనీ..ఎలాగో ఒకలాగా బ్రతిమలాడి కొండయ్య చేత దీక్ష ఇప్పిస్తే..అతను బాగు పడతాడనీ సుబ్బమ్మకు అనిపించింది...ఆ వివరం కనుక్కోవడానికే ముందుగా మందిరానికి వచ్చింది..


కానీ చుట్టుప్రక్కల వాళ్ళు, "ఈవిడ తాపత్రయ పడుతున్నది గానీ..వాడు తాగుడు మానుతాడా?..అనవసరంగా ఆ స్వామి దీక్ష తీసుకొని కొనసాగించకుండా..మళ్లీ తాగి, పాపం మూటగట్టుకుంటాడు.." అని చాటుమాటుగా కొందరు..ఎదురుగానే మరికొందరు అనేశారు.."అన్నిటికీ ఆ దత్తయ్యే వున్నాడు..ఆయన దీక్ష లో ఉన్నన్నాళ్ళూ నేను కూడా అక్కడే ఉంటాను..మా పిల్లలతో సహా ఆ స్వామి చెంతనే ఉంటాము..స్వామి మీదే భారం వేస్తున్నాను.." అని చెప్పింది వెంకట సుబ్బమ్మ నిశ్చయంగా..


ఆ ప్రక్కరోజు ఉదయాన్నే కొండయ్యను, పిల్లలను వెంటబెట్టుకొని, మొగిలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి, కొండయ్యకు దీక్ష ఇప్పించింది...స్వామివారి విగ్రహం ముందు నిలబడి మనస్ఫూర్తిగా మొక్కుకుంది..తన భర్త ఆ దురలవాటు ను పూర్తిగా మానుకొని, తన సంసారం చక్క బడాలని కోరుకున్నది సుబ్బమ్మ..దీక్షా మాలలు కొండయ్య మెడలో వేసేముందు.."అయ్యగారూ..మీరు కూడా ఈయనకు..దీక్ష సక్రమంగా చేయమని గట్టిగా చెప్పండి.." అని నన్ను అడిగింది..


ఆ నలభైరోజులూ ఆ దంపతులు పిల్లలతో సహా శ్రీ స్వామివారి మందిరం వద్దే వున్నారు..ప్రతిరోజూ కొండయ్య తో పాటు, వెంకట సుబ్బమ్మ కూడా శ్రీ స్వామివారి మందిరం లో 108 ప్రదక్షిణాలు చేసేది..పది రోజుల కల్లా కొండయ్య మనసులో అంతర్మధనం మొదలైంది..తాను ఇంతకు ముందు గడిపిన జీవన విధానం సరికాదని అతనికే అనిపించసాగింది..అతను మరింత నిష్ఠగా శ్రీ స్వామివారి దీక్ష కొనసాగించ సాగాడు..


వైశాఖ మాసం శుద్ధ సప్తమి నాడు శ్రీ స్వామివారి ఆరాధనామహోత్సవం జరుగుతుంది..(ఈ సంవత్సరం మే 11 వతేదీ నాడు శ్రీ స్వామివారి ఆరాధన)..ఆ ముందురోజు, దత్తదీక్ష స్వీకరించిన స్వాములందరూ మొగిలిచెర్ల గ్రామం లో గల రామాలయం వద్దనుంచి నీరు నింపిన కలశాలతో ఊరేగింపుగా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి, ఆరోజు రాత్రి 12 గంటల తరువాత, శ్రీ స్వామివారి సమాధికి ప్రదక్షిణ చేసి, తాము తెచ్చిన కలశం లోని నీటితో శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేస్తారు..స్వాములందరితో పాటు కొండయ్య కూడా శ్రీ స్వామివారికి అభిషేకం చేసాడు..ఆ ప్రక్కరోజు ఉపవాసం వుండి, ఆరాధన నాటి రాత్రికి అగ్నిగుండం లో నడిచాడు..


దీక్ష విరమణ చేసినా కొండయ్య త్రాగుడు జోలికే వెళ్ళలేదు..పూర్తిగా మానేశాడు..ప్రతి సంవత్సరం శ్రీ స్వామివారి దీక్ష తీసుకుంటాడు..ప్రస్తుతం ఆ దంపతులు హైదరాబాద్ లో వుంటున్నారు..కొండయ్య మేస్త్రీ గా పనిచేయటం మొదలుపెట్టి, ఇప్పుడు స్వంతంగా కాంట్రాక్టులు చేస్తున్నాడు..తమను తమ సంసారాన్ని ఆ దత్తయ్య స్వామే కాపాడాడని పదే పదే చెప్పుకుంటారిద్దరూ..దీక్ష కాలంలో ఏదో ఒకరోజు, శ్రీ స్వామివారి మందిరం వద్ద ఉన్న ఇతర దీక్షాధారులకు, భక్తులకు అన్నదానం చేయడం ఆ దంపతుల నిర్ణయం..గత నాలుగేళ్లుగా అదే పాటిస్తున్నారు..


దత్త దీక్ష స్వీకరించి, ఆచరించే భక్తుల అనుభవాలు కోకొల్లలు..ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం..అయితే అందరూ చెప్పేది ఒకటే మాట.."ఆ స్వామివారి వద్ద దీక్ష తీసుకుని..నిష్ఠ తో ఆచరిస్తే..మన కష్టాలు తొలిగిపోతాయి..మనలను దత్తాత్రేయుడే కాపాడతాడు.." అని..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము

 *01.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2248(౨౨౪౮)*


*10.1-1360-వ.*

*10.1-1361-*


*క. ధృతిచెడి లోఁబడె మల్లుం*

*డతులిత భవజలధితరికి హతరిపు పురికిన్*

*జితకరికిన్ ధృతగిరికిం*

*దత హరిరవ భరిత శిఖరిదరికిన్ హరికిన్.* 🌺



*_భావము: ఈ విధంగా నగరంలోని నారీమణులు అనేక విధాలుగా ముచ్చటించుచుండగా, శ్రీకృష్ణచాణూరుల మధ్య జరుగుతున్న ముష్టి యుద్ధములో చాణూరుని శక్తి నశించింది._*   

*_దుర్వారమైన సంసార సముద్రము దాటటానికి ఓడ వంటివాడు, శత్రువుల పురములను నశింపజేయగలవాడు, కువలయాపీడమనే మత్తగజమును జయించిన వాడు, పెద్ద కొండను వ్రేలిపై భరించి ధరించినవాడు, తన సింహనాదముచే పర్వతగుహలను ప్రతిధ్వనింప చేసిన శ్రీకృష్ణునితో నిలవగల ధైర్యం లేక లొంగిపోయాడు._* 🙏



*_Meaning: As these women of the town were talking within themselves, Chanura lost strength in his fight with Sri Krishna._* 

*_Chanura could not stand the power of Sri Krishna, who is like a ship to cross over the expansive and impassable ocean, who could destroy the forts of foes, who overpowered the mighty Kuvalayapeedam, who could hold huge Goverdhanagiri on his finger, whose war cry reverberated in the caves, and surrendered for a moment._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

తెలంగాణ బ్రాహ్మణ వివాహ వేదిక'.

 నమస్కారం. అందరికీ తెలియ చేయునది యేమనగా మన Whatsapp గ్రూప్ పేరు ' తెలంగాణ బ్రాహ్మణ వివాహ వేదిక'. తెలంగాణ బ్రాహ్మణ వివాహ వేదిక'. ప్రస్తుతం 5 Groups పని చేయుచున్నాయి. యెవరైనా వారి పిల్లల Matrimony Profile పంపినట్టయితే వారికి ఒక సీరియల్ నెంబర్ Allot చేసి వారిని యేదైనా ఒక గ్రూప్ లో చేర్చు కుంటాము. ఒక కుటుంబం నుండి ఒకరి ఫోన్ నెంబర్ మాత్రమే గ్రూప్ లో Add చేస్తాము. అలాగే మన గ్రూప్ పేరు లోనే 'తెలంగాణ' అని ఉంది కాబట్టి తెలంగాణ జిల్లాలకు సంబంధించిన వారు మాత్రమే ఇందులో చేరాలని వినతి. మన గ్రూప్ క్రమ శిక్షణ తో నడవడానికి మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి. మన గ్రూప్ లో సమర్ధులైన, మరియు సేవా తత్పరులు అయిన Admins ఉన్నారు. ఇందులో చేర దలచుకున్న వారు, వారికి సంబంధించిన వధూవరుల వివరాలు ఈ క్రింద చూపిన Whatsapp నంబర్స్ కు (Admins), యేదైనా ఒక నెంబర్ కు మాత్రమే పంప గలరు. (01). శ్రీ Vemuganti Rajmohan 90148 48144 (02) Oddiraju Laxman Rao 99630 59373 (03). Sri Kommera Laxman Rao – 99591 81915 (04) Sri Kalvakota Chandra Sekhara Rao 94401 43749 (5) Sri Kalvakota Jagannatha Rao 94403 57442 వివరములు అందిన తరువాత, సమాచారాన్ని Computer లో భద్ర పరచి ఒక సీరియల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలిసిన అన్ని బ్రాహ్మణ Groups కు తెలియ చేసి యెక్కువ మెంబర్స్ Join అయ్యేటట్టుగా మీ సహకారం అందించాలని వినతి. ఇది మన గ్రూప్. మన కొరకు నడుస్తున్న గ్రూప్. మరి మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి. ఈ గ్రూప్ ని ఇంకా అభివృద్ధి చేయాలని వినతి. అందరికీ శుభం. ధన్యవాదాలు. జగన్నాథ రావు కల్వ కోట Group Admin (9440357442).