*01.09.2021*
*వందేమాతరం*
*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏
*రోజుకో పద్యం: 2248(౨౨౪౮)*
*10.1-1360-వ.*
*10.1-1361-*
*క. ధృతిచెడి లోఁబడె మల్లుం*
*డతులిత భవజలధితరికి హతరిపు పురికిన్*
*జితకరికిన్ ధృతగిరికిం*
*దత హరిరవ భరిత శిఖరిదరికిన్ హరికిన్.* 🌺
*_భావము: ఈ విధంగా నగరంలోని నారీమణులు అనేక విధాలుగా ముచ్చటించుచుండగా, శ్రీకృష్ణచాణూరుల మధ్య జరుగుతున్న ముష్టి యుద్ధములో చాణూరుని శక్తి నశించింది._*
*_దుర్వారమైన సంసార సముద్రము దాటటానికి ఓడ వంటివాడు, శత్రువుల పురములను నశింపజేయగలవాడు, కువలయాపీడమనే మత్తగజమును జయించిన వాడు, పెద్ద కొండను వ్రేలిపై భరించి ధరించినవాడు, తన సింహనాదముచే పర్వతగుహలను ప్రతిధ్వనింప చేసిన శ్రీకృష్ణునితో నిలవగల ధైర్యం లేక లొంగిపోయాడు._* 🙏
*_Meaning: As these women of the town were talking within themselves, Chanura lost strength in his fight with Sri Krishna._*
*_Chanura could not stand the power of Sri Krishna, who is like a ship to cross over the expansive and impassable ocean, who could destroy the forts of foes, who overpowered the mighty Kuvalayapeedam, who could hold huge Goverdhanagiri on his finger, whose war cry reverberated in the caves, and surrendered for a moment._* 🙏
*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*
*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*
*Kiran (9866661454)*
*Pavan Kumar (9347214215).*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి