*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*987వ నామ మంత్రము* 2.9.2021
*ఓం అనఘాయై నమః*
అఘములనబడే పాపము, దుఃఖము, వ్యసనములు - వీటిలో ఏ ఒక్కటియుకూడా లేని పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అనఘా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం అనఘాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను ఆరాధించు భక్తులు పాపరహితులై పవిత్రమైన జీవనము కొనసాగించి తరించుదురు.
పాపము, దుఃఖము, వ్యసనము అనునవి అఘములు అంటారు. ఇవి కేవలం దేహధారులకు మాత్రమే. జననమరణ చక్రభ్రమణము కలిగినవారికి మాత్రమే. కర్మఫలములు సంచితములై, జన్మలు ఎత్తడం జరుగుతుంది. సత్కర్మలవలన సంతోషము, దుష్కర్మల వలన దుఃఖము పొందడం జరుగుతుంది. కర్మఫలాలు శూన్యమైతే, కైవల్యము లభిస్తుంది, జనన మరణ చక్రభ్రమణము నుండి విముక్తి లభిస్తుంది. శరీరధారులు కర్మ ఫలములననుసరించి దేహమును ధరించుచుందురు. కర్మఫలములు శూన్యములైతే కైవల్యమును పొందుదురు. లేకుంటే కర్మఫలానుసారము దేహధారులై జనన మరణచక్రములోనే కొనసాగుదురు. పాపకర్మల ఫలముల వలన నీచజన్మలు, పుణ్యకర్మల ఫలమువలన ఉత్తమజన్మలు పొందుదురు. ఏదైనా పాపము లేదా పుణ్యము అనునది దేహధారికి మాత్రము తథ్యము. కాని శ్రీలలితాంబిక శుద్ధజ్ఞాన స్వరూపిణి. పరమాత్మ. సచ్చిదానంద స్వరూపిణి. పాపరహితురాలు. అందుచే ఆ తల్లి *అనఘా* యని అనబడుచున్నది.
శ్రీమాతకు నమస్కరించునపుడు *ఓం అనఘాయై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి