2, సెప్టెంబర్ 2021, గురువారం

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము

 *02.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2249(౨౨౪౯)*


*10.1-1362-*


*క. హరికిని లోఁబడి బెగడక*

*హరి యురము మహోగ్రముష్టి నహితుఁడు పొడువన్*

*హరి కుసుమమాలికాహత*

*కరి భంగిఁ బరాక్రమించెఁ గలహోద్ధతుఁడై.* 🌺



*_భావము: చాణూరుడు లొంగిపోయినా, ఆవేశమేమాత్రము తగ్గలేదు. బెదిరిపోకుండా, శ్రీ కృష్ణుని వక్షస్థలముమీద శక్తివంతమైన తన పిడికిలి బిగించి కొట్టాడు. పూలమాలతో కొట్టబడిన ఏనుగు వలె ఆ ముష్టిఘాతము ఆ బాలునిపై ఎటువంటి ప్రభావము చూపలేదు, సరి కదా ఆ మల్లయుద్ధములో చెలరేగిపోయి తన పరాక్రమమును ప్రదర్శించాడు._* 🙏



*_Meaning: Even after yielding once, Chanura did not give up and with renewed vigour hit Sri Krishna hard with his clenched fist. For Sri Krishna, it was like an elephant being hit with flower garland and spurred by Chanura’s blow, He burst out and started exhibiting His fighting skills with valour._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

కామెంట్‌లు లేవు: