2, సెప్టెంబర్ 2021, గురువారం

పౌర్ణమినాడు గిరిప్రదక్షిణ*

 *అరుణాచల శివ* 🙏


 *పౌర్ణమినాడు గిరిప్రదక్షిణ* 


🔔🌷🔔🌷🔔🌷🔔🌷🔔🌷


ఏ దినమైనా, ఏ సమయంలో నైనా, తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణ చెయ్యవచ్చు. ఆయా దినం, తిథి, నక్షత్రం, యోగం, కరణం, హోర, లగ్నాలకు సరిపడే విధంగా ప్రదక్షిణ ఫలితాలు మార్పుచెందుతాయి. ఒక దృశ్యాన్ని ఒకసారి చూచి, మరోసారి చూచేలోపల ఒక్క క్షణ కాలంలోపనే ఆదర్శన ఫలితం మార్పు చెందుతుంది. అందుకనే శ్రీ శగస్త్య సిద్ధ పురుషుడు ఆ మార్పులను, అరుణాచల మహత్యాన్ని నాడి గ్రంథాలుగా క్రోడీకరించాడు.

పౌర్ణమి నాడే చంద్ర భగవానుడు తన 16 కళలతో పరిపూర్ణంగా ప్రకాశిస్తుంటాడు. మనసుకు కారకుడని చెప్పబడే చంద్ర భగవానుడు మనసును పరిపాలిస్తుంటాడు. శరీర పరిశుద్ధత, మనో పరిశుద్ధత ధ్యాన సిద్ధికి ఎంతో మేలు కలుగ చేస్తాయి. మనసు ఎన్నో విధాల ఆలోచనలతో సుళ్లు తిరుగుతుంటుంది. ఆలోచనలను కట్టుబాటు చేయలేదు. ఆలోచనా తరంగ వేగాలను హద్దులలో ఉంచగలిగినప్పుడే మనోశక్తిని పెంపొందించ గలుగుతాము. దానికి చంద్ర భగవానుని అనుగ్రహం అవసరం. దానిని పొందేందుకే పౌర్ణమి నాడు గిరిప్రదక్షిణ చేయడం.

పౌర్ణమి తిథి రోజున సూర్య భగవానుని వివిధ దైవాంశలను తన 16 కళల పూర్ణబింబంలో చంద్ర భగవానుడు ఐక్యం చేసుకుని ప్రకాశిస్తుంటాడు. అతడి అనుగ్రహ శక్తి కిరణ ప్రసరణ ద్వారా మన శరీరాల పైననూ, చుట్టూరా వున్న ప్రాంతాలలోనూ ప్రసరించుతూ ఉంటుంది.

 *పౌర్ణమి వెన్నెల కిరణాలు అద్బుత శక్తివంతమైన దైవశక్తిని సాధారణ మానవుడు* *పొందలేడు గాబట్టి అణ్ణామలేశ్వరుడే తన శరీర స్వరూపమైన పర్వతం* *పైన చంద్రుని అమృత కిరణాలన్నిటిని పొంది, వాటిని ఒక్కొక్క* *మానవుని దేహ శక్తికీ సరిపడే పంధాలో ప్రసాదిస్తుంటాడు.* *అణ్ణామలైలో విశేషమైన శిలలు, మూలికలు, వృక్షాలు చాలా ఉన్నాయి.* *అవి వివిధ కర్మ ఫలితాలను, జబ్బులనూ దోషాలనూ, పాపాలనూ నివర్తించగల శక్తివంతాలు.* 

ఈ పర్వతం మీద చంద్ర భగవానుని కిరణాలు ప్రసరించి ప్రతిఫలించేటప్పుడు వాటికి పదిరెట్లు శక్తి హెచ్చయి, గిరిప్రదక్షిణ చేసే వారి శరీరాలను తాకుతాయి.

 *దీనికోసమే పౌర్ణమి రోజున బయలుదేరే పురుషుల శరీరవు పైభాగంలో ఏ ఆచ్ఛాదనా* *లేకుండా (చొక్కా లేకుండా) ధోవతి కట్టుకుని, అంగ వస్త్రంతో మాత్రమే గిరిప్రదక్షిణ చెయ్యాలి.* దీనివల్ల తిరుఅణ్ణామలైనుండి ప్రతిఫలించే పుణ్యప్రదము, శక్తీవంతములైన చంద్ర కీరణాలు అధిక శాతం నేరుగా శరీరాన్ని తాకుతాయి. *ఆ శక్తి మూలంగా ప్రతి మానవుడూ* 

 *ఎన్నో కోట్ల కర్మ ఫలాలను నివారణ చేసుకుని మంచి* *మార్గంలో జీవీతం సాగించగలుగుతాడు.* 

 *బాలారిష్ట, దృష్టిదోషం, శూన్యం, చేతబడి, దిగదుడిచిన పదార్థలను తొక్కడం,* *గాలిచేష్టలవంటి, చెడుకార్యాలనుండి కాపాడబడుతాడు.* 

ఒక్కొక్క మానవుడు సాంప్రదాయల ప్రకారం చేసే ఒక గిరిప్రదక్షిణలో కనీస పక్షం ఒక నెలకు అవసరమైన పుణ్యశక్తిని పొందగలుగుతాడు.

 *తిరుఅణ్ణామలైలో చేయబడే దానధర్మాలకు వెయ్యిరెట్ల ఫలితం ఉంటుంది.* *పౌర్ణమి రోజున చేసే దానాలకు వెయ్యిరెట్లకన్నా ఇంకా ఎక్కువ ఫలితాలుంటాయి.* ఈ విధంగా అపరిమితమైన పుణ్యశక్తులను ప్రసాదించేదే పౌర్ణమి గిరిప్రదక్షిణ.

పౌర్ణమి నాడు మహర్షులు, సిద్ధపురుషులు, యోగులు, దేవతలు, దేవ దైవమూర్తులు, కలియుగంలో మానవాళి మంచి కోసం గిరిప్రదక్షిణ చేస్తుండటంవల్ల వారు తమ గిరిప్రదక్షిణ దైవశక్తిని పుణ్యఫలితాన్ని ఆనాడు గిరిప్రదక్షిణ చేసేవారికి ప్రసాదిస్తారు.కాబట్టి సాధారణంగా గిరిప్రదక్షిణ చేయడానికి వచ్చేవారికి కూడా ఈ అద్బుతానుగ్రహం కలుగుతుంది.

తిరుఅణ్ణామలై పర్వతం పైన మన దృష్టికి గోచరించేవేకాక, బండల మాదిరీ, గుండ్ల మాదిరి గాను కనుపిస్తాయి. కానీ అవి యదార్థానికి స్వయంభూలింగ మూర్తులు, *పర్వతమే ఆదిశివుని శరీర మైనప్పుడు ఒక్కొక్క శిలా ఒక్కొక్క లింగమేగదా?* భగవంతుని శరీరంపైన ఉండే వృక్షాలు, లతలు, చెట్లు ఎంతటి ఉత్తమమైన స్థితిని పొంది ఉండాలి!

ఒక మహాత్ముని దర్శనమే వేలకువేల కర్మ విమోచనలకు కారణమవుతున్నప్పుడు భగవంతుని స్థూల రూపమైన తిరుఅణ్ణామలై మీద ఉండే, గడ్డి, వెల్లుల్ని, చెట్టు లతలు, వృక్షాల దర్శనం కోటానుకోట్ల కర్మల విమోచనాన్ని చేస్తుందిగదా. అందుకనే గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్కొక్క అడుగుకూ పర్వతాన్ని దర్శించాలి అన్నది నియమం.

తిరుఅణ్ణామలైపైన అద్బుతమైన సాలగ్రమాలు, స్ఫటిక రూపాలు, బాణ లింగాలు చాలా ఉన్నాయి. వీటిపైన సూర్యకాంతి, చంద్రకాంతి, పర్వతంపైనుంచి ప్రవహించే నీరు తగిలి పౌర్ణమినాడు ఈశక్తులు ఎన్నోరెట్లుగా వృద్ధి చెంది గిరిప్రదక్షిణ చేసేవారికి సత్ఫలితాలను దైవభక్తినీ సంపూర్ణంగా ప్రసాదిస్తాయి.


 *ఓం నమః శివాయ* 🙏


🔔🌷🔔🌷🔔🌷🔔🌷🔔🌷🔔

కామెంట్‌లు లేవు: