ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
13, అక్టోబర్ 2023, శుక్రవారం
లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం
లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం
శ్రీనివాససిద్ధాంతి9494550355
*విదేశీ ప్రయాణం-స్థిర నివాసం*
ప్రస్తుత కాలంలో చాలామంది విదేశాలకు వెళ్లాలని అక్కడ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని మరికొంతమందికి అక్కడ స్థిరంగా ఉండాలని కోరిక ఉంటుంది. మరి కొంతమందికి విదేశాలు వెళ్లి అక్కడ అందమైన ప్రదేశాలు చూడాలని టూరిస్ట్ గా కోరికలు ఉంటాయి. జాతకరీత్యా గ్రహ స్థితి అనుకూలంగా ఉన్న జాతకులు మాత్రమే విదేశాలకు వెళ్లడం స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. జ్యోతిషరీత్యా ఈ వివరాలను పరిశీలిద్దాం. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే భాగ్యస్థానము ద్వాదశ స్థానము పరిశీలించాలి. భాగ్యాధిపతి కానీ భాగ్య స్థానంలో ఉన్న గ్రహాలు కానీ అదేవిధంగా ద్వాదశ అధిపతి మరియు ద్వాదశ స్థానంలోని గ్రహాలు వీటి యొక్క దశ అంతర్దశలలో విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. భాగ్య అధిపతి అయితే విదేశాలకు వెళ్లి కొద్ది రోజులు ఉండి మాత్రం వచ్చేస్తారు అనగా టూరిస్ట్ గా కానీ బంధువులు ఇళ్ళకు గాని వేరే ఇతర కారణాలు గాని వెళ్లి రావచ్చు ద్వాదశ అధిపతికి సంబంధం వస్తే మాత్రం ఎక్కువ కాలం పాటు విదేశాలలో ఉంటారు అయితే పర్మినెంట్ సెటిల్మెంట్ మాత్రం కాదు. పర్మినెంట్ గా విదేశాలలో ఉండాలంటే రాహువు శని భగవానుడు యొక్క స్థితిని పరిశీలించాలి. రాహు 12 వ స్థానంలో ఉంటే విదేశాలలో స్థిర నివాసానికి అవకాశాలు ఉంటాయి శని భగవానుడు కుటుంబ స్థానంలో కానీ చతుర్ధ స్థానంలో కానీ ఉన్నప్పుడు లేదా చతుర్ధ అధిపతికి ద్వాదశ అధిపతికి సంబంధం ఉన్నప్పుడు విదేశాలలో స్థిర నివాసం ఏర్పడే అవకాశం ఉంటుంది. చతుర్ధ స్థానం అనగా గృహము ఇది 12వ స్థానంలో దీనికి సంబంధించిన గ్రహాలు ఉంటే అనగా చతుర్ధాధిపతి ద్వాదశంలో ఉన్నా ద్వాదశ అధిపతి చతుర్దంలో ఉన్నా లేదా రెండు స్థానాధిపతులు పరివర్తన చెందినా విదేశాలలో నివాసం ఏర్పడుతుందని అర్థం.శని భగవానుడు కుటుంబ స్థానంలో కానీ చతుర్ధ స్థానంలో కానీ ఉన్నప్పుడు వాళ్లు జన్మస్థలానికి దూరంగా ఉంటారు. శని భగవానుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కూడా విదేశాలలో నివాస ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆయా స్థానాలు అధిపతులు లేదా స్థానంలో ఉండే గ్రహాల యొక్క దశ అంతర్దశలో అవకాశాలు వచ్చినప్పుడు ప్రయత్నాలు చేస్తే సులభంగా విదేశీయానం చేయగలుగుతారు.
జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*
*జ్యోతిషరత్న, member in international astrology federation. ..శ్రీనివాస సిద్ధాంతి*
*9494550355*
PlZ Forward the message
Disclaimer. This blogger is not responsible for the above content. Vewers are requested to enquir before proceed.
రామాయణమ్ 353
రామాయణమ్ 353
...
ఓ రామా ! ఈతడు రావణుడు పంపిన గూఢచారి కావచ్చును కావున నలుగురు సహచరులతో సహా ఆతనిని చంపివేయుదము అని సుగ్రీవుడు రామునితో పలుకగా ఆ మాటలు విని కాసేపు దాశరధి మౌనము పాటించెను.
.
మిత్రమా ! ఈ రాక్షసుడు దుష్టుడైనను కాకపోయిననూ నాకు ఏమీ భయము లేదు .ఇతడు నాకు ఏ విధముగనూ అపకారము చేయలేడు,చేయజాలడు.
.
సుగ్రీవా నేను తలచుకొన్నచో నా ఈ ధనుస్సునుండి సంధించిన బాణములు సకల పిశాచ,రాక్షస గణములను క్షణములో రూపుమాపగలవు .
.
పూర్వము "కండువ" అను ఒక మహర్షి చెప్పిన వచనములను వినుము.....
.
క్రూరుడు అయిన శత్రువు తన వద్దకు వచ్చి అంజలి ఘటించి కాపాడమని ప్రార్ధించినపుడు ,తనకు చెడు పేరు రాకూడదు అని తలపోయు రాజు అతనిని చంపకూడదు.
.
తన శరణుజొచ్చిన వానిని ఏకారణముచేతనైనా రక్షించలేకపోయినచో అతడు నిందితమైన పాపము చేసినవాడగును.
.
తాను శరణు ఇచ్చి న వాడు తన కళ్ళముందరే ప్రాణము విడిస్తే ,అది పుణ్యమును నశింపచేయును.
.
సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ
.
ఎవ్వడైననూ వచ్చి నేను నీవాడను అని చెప్పుచూ ఒక్కసారి శరణుపొందిన చాలును,వానిని సకలప్రాణులనుండి నేను కాపాడెదను...ఇది నా వ్రతము...
.
అని రామచంద్రుడు దృఢచిత్తుడై పలికెను.
.
వూటుకూరు జానకిరామారావు
శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*
*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*
*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🌸 సాంఖ్య యోగః 🌸*
*2-అధ్యాయం,58వ శ్లోకం*
*యదా సంహరతే చాయం కూర్మోంఽగానీవ సర్వశః ।*
*ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 58*
*ప్రతిపదార్థము*
యదా — ఎప్పుడైతే; సంహరతే — ఉపసంహరించి; చ — మరియు; అయం — ఇది; కూర్మః — తాబేలు; అంగాని — అంగములను; ఇవ — ఆ విధంగా; సర్వశః — పూర్తిగా; ఇంద్రియాణి — ఇంద్రియములు; ఇంద్రియ-అర్థేభ్యః — ఇంద్రియార్ధముల నుండి (ఇంద్రియ విషయముల నుండి); తస్య — అతని; ప్రజ్ఞా — దివ్య జ్ఞానం; ప్రతిష్ఠితా — స్థిరమవును.
*తాత్పర్యము*
తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా, ఇంద్రియములను కేంద్రీ ఆర్తముల (విషయాదుల ) నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధిరముగా ఉన్నట్లు భావింపవలెను.
*సర్వేజనాః సుఖినోభవంతు*
*హరిః ఓం 🙏🙏*
వేద ఆశీర్వచనం.
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5124*
*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం - చతుర్ధశి - ఉత్తరాఫల్గుణి - భృగు వాసరే* (13.10.2023)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/kYAcuOJHvpo?si=JH3BcWqwZsHkNObt
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
-----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
శ్రీ ఆదిశక్తి దుర్గాదేవి మందిర్
🕉 మన గుడి : నెం 206
⚜ ఢిల్లీ : ఝాన్డే వాలన్
⚜ శ్రీ ఆదిశక్తి దుర్గాదేవి మందిర్
💠 ఆది శక్తి మా జందెవాలి మా దుర్గా దేవి అవతారం.
సృష్టిలో నైతిక క్రమాన్ని మరియు ధర్మాన్ని కాపాడే పరమాత్మ శక్తిని ఆమె సూచిస్తుంది. ఆమె ఎరుపు రంగును ధరించి, అనేక ఆయుధాలను పట్టుకుని, తన వాహనం (పులి)పై ప్రయాణిస్తుంది, ఇవన్నీ ఆమె అపారమైన మరియు అపరిమితమైన శక్తిని సూచిస్తాయి, ఇది ధర్మాన్ని రక్షించడానికి మరియు చెడును నాశనం చేయడానికి ఉపయోగిస్తుంది.
💠 ఝండేవాలన్ మాత ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతంలో ఉండేదని, మాతరణి యొక్క గొప్ప భక్తుడైన బద్రీ భగత్ ఆమె గురించి కలలు కన్నాడని మరియు ఆమె ఈ విగ్రహం గురించి అతనికి చెప్పిందని చెబుతారు.
ఈ ప్రదేశంలో బద్రీ భగత్ అమ్మవారి విగ్రహాన్ని తవ్వినప్పుడు, విగ్రహం భూమిలో కనిపించింది, అయితే దురదృష్టవశాత్తు తల్లి విగ్రహం త్రవ్వినప్పుడు చేతులు విరిగిపోయాయి.
హిందూ గ్రంధాల ప్రకారం, విరిగిన విగ్రహాన్ని పూజించడం నిషేధించబడింది, అందుకే వెండి చేతులు తయారు చేయబడ్డాయి.
ఇది ఇప్పటికీ ఆలయ గుహలో సురక్షితంగా ఉంచబడింది.
💠 దీని తరువాత అదే స్థలంలో ఝండేవాలన్ ఆలయం నిర్మించబడింది మరియు దీనిని శ్రీ బద్రీ భగత్ ఝండే వాలా మందిర్ అని కూడా పిలుస్తారు.
ఇక్కడికి కుల, హోదా అనే తేడా లేకుండా అందరూ వచ్చి పూజలు చేసుకోవచ్చు.
💠 అది కొండ ప్రాంతం కాబట్టి గుడి ఆవరణలో పెద్ద పెద్ద జెండాలు అప్పట్లో పెట్టారు తద్వారా ఆలయాన్ని చాలా దూరం నుండి చూడవచ్చు అని.
ఆ రోజులలో భక్తులు మా ఆది శక్తికి ప్రార్థన జెండాలను అధిక సంఖ్యలో సమర్పించారు కనుక దీనిని ఝండేవాలన్ దేవాలయం అంటారు.
💠 ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు, ఆలయ పవిత్ర వాతావరణం ఒక వ్యక్తిలో పవిత్రతను నింపుతుంది. అందమైన శిల్పకళతో, నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయాన్ని పువ్వులు, దీపాలతో అలంకరించి, భారీ సంఖ్యలో జనాలతో ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది.
💠 ఇందులో మా జందెవాలి విగ్రహం మరియు సరస్వతి మరియు కాళీ విగ్రహం ఇతర దేవుళ్ళతో పాటు ఉన్నాయి. ఇది కాకుండా, ఆలయం యొక్క దిగువ స్థాయికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో శివపూజ చేయడం కోసం మంత్రముగ్ధులను చేసే శివ మందిరం కూడా ఉంది
💠 ఆలయం అద్భుతంగా చెక్కబడింది మరియు కొన్ని స్తంభాలు బంగారంతో చెక్కబడ్డాయి.
ఈ కాంప్లెక్స్‌లో మా ఆది శక్తితో పాటు అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి.
💠 గుహలో రెండు దీపాలు 8 దశాబ్దాలుగా వెలుగుతున్నాయి. ఆలయంలో నవరాత్రులలో ప్రతిరోజూ భారీ అన్నదానం నిర్వహిస్తారు. నవరాత్రి సమయంలో వేలాది మంది ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తారు.
💠 అన్ని ప్రధాన పండుగలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు 'బద్రీ భగత్ ఝండేవాల్ మందిర్ సొసైటీ' ద్వారా ఆలయంలో నిర్వహించబడతాయి.
ముఖ్యంగా దుర్గాపూజ మరియు నవరాత్రి పండుగలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
💠 ఆలయ సమయం :
ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు మరియు సాయంత్రం 4:00 నుండి రాత్రి 10:00 వరకు (పండుగల సమయంలో సమయాలు మారవచ్చు)
మంగళ ఆరతి- 5:30 AM
శృంగార్ ఆరతి- 9:30 AM
భోగ్ ఆరతి- 12:00 మధ్యాహ్నం
సాయంత్రం ఆరతి- 7:30 PM
రాత్రి ఆరతి- 10:00
💠 ఎలా చేరుకోవాలి ?
బ్లూ లైన్‌లో ఉన్న ఝండేవాలన్ మెట్రో స్టేషన్‌లో దిగాలి. ఆలయం 5-10 నిమిషాల నడక దూరంలో ఉంది.
టికెట్లు గలవు
*ఫ్లాష్ ఫ్లాష్ కొన్ని టికెట్లు గలవు* *తొందరపడింది* 🛕🌄 కార్తీక మాసం స్పెషల్ అరుణాచలం రైలు ప్రయాణం నవంబర్ 17న కావున టికెట్లు తొందరగా కావాల్సిన వాళ్ళు రిజర్వ్ చేసుకోగలరు తొందరగా మీ టికెట్స్ బుక్ చేసుకోండి.🛕🌄 అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే అద్భుతమైన అవకాశం ☀️
అరుణాచల యాత్ర ఈనెల అనగా నవంబర్ 17న న ప్రారంభమై
18వ తేదీన వ అరుణాచలం లో వుండి సాయంత్రం 🛺🛺 ఆటోలో గిరి ప్రదక్షిణం చేసి ఉదయం మరల
🚶♂️కాలినడకన గిరి ప్రదక్షిణం చేసి సాయంత్రం బయలుదేరి మరుసటి రోజు ఉదయం నవంబర్ 20వ కల్లా హైదరాబాద్ కి చేరుకుంటాము
వసతి గృహాల ఏర్పాటుతో పాటుగా మొత్తం రెండు వైపులా రైల్వే స్టేషన్ నుండి తిరిగి వచ్చేదాకా ఉదయం అల్పాహారం మరియు రాత్రి భోజనం ఏర్పాటు చేయబడును సౌకర్యవంతమైన ఈ అరుణాచల యాత్రకి గాను కేవలం 4500/- చెల్లించవలెను
సమయము తక్కువగా ఉన్నందున వీలైనంత తొందరగా మీ టికెట్ బుక్ చేసుకోగలరు
సంప్రదించవలసిన వివరములు
యనమండ్ర శారద
ఫోన్ నంబర్ 9247160975.
*ట్రైన్ టికెట్లు కొన్నే ఉన్నాయి* *తొందరగా బుక్ చేసుకోగలరు*
విదురనీతి
విదురనీతి
విదుర ఉవాచ = విదురుడు పలికెను.
శ్లో)అతీతాయాం చ శర్వర్యాముదితే సూర్యమండలే
ఆథౌ జగామ తం దేశం సుధన్వా రాజ సత్తమ॥
అ)రాజశ్రేష్ఠా! ఆ రాత్రి గడిచి మరునాడు సూర్యోదయం కాగానే సుధన్వుడు ఆప్రదేశానికి వచ్చినాడు.
శ్రీ దేవీ భాగవతం
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
క్షణంలో నేను బంగారుపల్లకిలో ఉన్నాను. కుదుపు తెలియకుండా బోయీలు మోస్తున్నారు.
తాళధ్వజ రాజధానికి చేరుకున్నాను. ఒక శుభమూహూర్తాన నన్ను ఆ మహారాజు అగ్నిసాక్షిగా వివాహం
చేసుకున్నాడు. ఆ నిమిషంనుంచీ అతడికి ప్రాణాధికంగా ప్రియురాలిని అయ్యాను. సౌభాగ్యసుందరి అని
నామకరణం చేశాడు. అనుక్షణమూ అలాగే పిలిచేవాడు. కామశాస్త్రం చెప్పిన రీతిలో నిరంతర భోగవిలాసాలతో
తాళధ్వజుడు రేయింబవళ్లు నాతోనే గడిపాడు. రాజకార్యాలన్నీ మంత్రులకు అప్పగించేశాడు. కామకళారతుడై
కాలానికి కళ్ళెం వేశాడు. ఉద్యానాలలో సరోవరాలలో వాపీకూపతటాకాలలో గిరికందరాలలో గిరిశిఖరాలలో
మహాసౌధాలలో వారుణీమదమత్తుడై నాతో శృంగారకేళీవిలాసాలలో తెలియాడాడు.
వ్యాసమహర్షి! నిజం చెబుతున్నాను. నేనూ అలాగే తన్మయం చెందాను. క్రీడా
రసవశీకృతమయ్యింది నా అంతరంగం. నా పూర్వ శరీరంగానీ పురుషరూపంగానీ మునిజన్మగానీ ఏమీ
జ్ఞాపకం రాలేదు. అతడు నా పతి. నేనతడి పత్నిని. పట్టమహిషిని. విలాసాలు తెలిసిన ప్రియవల్లభను,
జీవితం సఫలమయ్యింది. యౌవనవతిత్వం చరితార్ధమయ్యింది.
పన్నెండు సంవత్సరాలకాలం క్షణంలా గడిచిపోయింది. నేను గర్భం ధరించాను. రాజుగారి
ఆనందం అవధులుదాటింది. వేదవిప్రులను రావించి యథావిధిగా గర్భసంస్కారకర్మలు జరిపించాడు.
నా మనస్సు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. గర్భిణులకు రకరకాల
కోరికలు పుడతాయిట, దాపరికం లేకండా అడుగు. నీ కోరిక ఏదైనా సరే తీరుస్తాను అంటూ రోజూ ప్రేమగా
నిర్బంధించేవాడు తాళధ్వజమహారాజు. కానీ సిగ్గుతో ఏనాడూ ఏదీ నేను అడగనేలేదు. పదివెలలూ
నిండాయి. పండంటి కొడుకు పుట్టాడు. గ్రహనక్షత్రతారాలగ్న బలాలు చాలా శుభప్రదంగా ఉన్నాయి.
రాజూ నేనూ ఎంతగానో సంతోషించాం. రాజ్యమంతటా ఉత్సవం ప్రకటించాడు. జాత కర్మలు మహావైభవంగా
జరిపించాడు. వీరవర్మ అని నామకరణం చేశాడు
ఉద్ధవగీత
ఉద్ధవగీత
శ్లో)తప్తజాంబూనదప్రఖ్యం శంఖచక్రగదాంబుజైః| లసచ్చతుర్భుజం శాంతం పద్మకింజల్క వాససమ్ |I
స్ఫురత్కిరీటకటక కటిసూత్ర వరాంగదమ్ |
శ్రీవత్సవక్ష సంభ్రాజత్కౌస్తుభం వనమాలినమ్ ||
ధ్యాయన్న భ్యర్చ్య దారూణి హవిషాభిఘృతాని చ | ప్రాస్యాజ్యభాగావాఘారౌ దత్త్వా చాజ్యప్లుతంహవిః||
జుహుయాన్మూలమం త్రేణ షోడశర్చానదానతః | ధర్మాదిభ్యో యథాన్యాయం మంత్రైః స్విష్టకృతం బుధః ||
అ)తరువాత అగ్నియందు తప్తకాంచనవర్ణము, శంఖచక్రగదాపద్మ లచే విరాజిల్లు చతుర్భుజయుక్తము, ప్రశాంతము, పద్మకేసరములవలె పచ్చనైన వస్త్రముచే శోభితము, ప్రకాశించు కిరీట కటక కటిసూత్రనూపుర సమన్వితము, శ్రీవత్సవక్షము, చక్కగ తేజరిల్లు కౌస్తుభమణిచే విరాజితము, వనమాలావిభూషితము నగు నా రూపమును ధ్యానించి పూజింపవలెను. పిమ్మట ఘృతసిక్తములైనసమిధలను.అగ్నియందాహుతినీయవలెను. ఆఘారము, ఆజ్యభాగము ననురెండు రెండాహుతులతో హవనము జేయవలెను. అనంతరము ఇంకను ఘృతసిక్తము లైన హవిస్సులనీయవలెను. అటుపిమ్మట 'ఓం నమో నారాయ అష్టాక్షరమంత్రముతోను, పురుషసూక్తమునందలి పదునాఱుమంత్రముల తోను హవనము చేయవలెను. బుద్ధిమంతు, డగుపురుషుడు ధర్మాధిదేవతలకు యథావిధిగ స్వాహాన్తమంత్రములచే స్విష్టకృతమునుహోమము చేయవలెను.
ఉద్ధవగీత
ఉద్ధవగీత
శ్లో)తప్తజాంబూనదప్రఖ్యం శంఖచక్రగదాంబుజైః| లసచ్చతుర్భుజం శాంతం పద్మకింజల్క వాససమ్ |I
స్ఫురత్కిరీటకటక కటిసూత్ర వరాంగదమ్ |
శ్రీవత్సవక్ష సంభ్రాజత్కౌస్తుభం వనమాలినమ్ ||
ధ్యాయన్న భ్యర్చ్య దారూణి హవిషాభిఘృతాని చ | ప్రాస్యాజ్యభాగావాఘారౌ దత్త్వా చాజ్యప్లుతంహవిః||
జుహుయాన్మూలమం త్రేణ షోడశర్చానదానతః | ధర్మాదిభ్యో యథాన్యాయం మంత్రైః స్విష్టకృతం బుధః ||
అ)తరువాత అగ్నియందు తప్తకాంచనవర్ణము, శంఖచక్రగదాపద్మ లచే విరాజిల్లు చతుర్భుజయుక్తము, ప్రశాంతము, పద్మకేసరములవలె పచ్చనైన వస్త్రముచే శోభితము, ప్రకాశించు కిరీట కటక కటిసూత్రనూపుర సమన్వితము, శ్రీవత్సవక్షము, చక్కగ తేజరిల్లు కౌస్తుభమణిచే విరాజితము, వనమాలావిభూషితము నగు నా రూపమును ధ్యానించి పూజింపవలెను. పిమ్మట ఘృతసిక్తములైనసమిధలను.అగ్నియందాహుతినీయవలెను. ఆఘారము, ఆజ్యభాగము ననురెండు రెండాహుతులతో హవనము జేయవలెను. అనంతరము ఇంకను ఘృతసిక్తము లైన హవిస్సులనీయవలెను. అటుపిమ్మట 'ఓం నమో నారాయ అష్టాక్షరమంత్రముతోను, పురుషసూక్తమునందలి పదునాఱుమంత్రముల తోను హవనము చేయవలెను. బుద్ధిమంతు, డగుపురుషుడు ధర్మాధిదేవతలకు యథావిధిగ స్వాహాన్తమంత్రములచే స్విష్టకృతమునుహోమము చేయవలెను.
విద్య శ్రద్ధ గా నేర్చుకోవాలి
🌸🌄⚛🌅🌸🔯🚩
🌸🌼ಬೆಳಗಿನ 🌅 ಸೂಳ್ನುಡಿ🌼🌸
*ಶ್ರದ್ಧಧಾನಃ ಶುಭಾಂ ವಿದ್ಯಾಂ*
*ಆದದೀತಾವರಾರಪಿ |*
*ಅಂತ್ಯಾದಪಿ ಪರಂ ಧರ್ಮಂ*
*ಸ್ತ್ರೀರತ್ನಂ ದುಷ್ಕುಲಾದಪಿ ||*
(ಮನುಸ್ಮೃತಿ)
ತನಗಿಂತ ಕಡಿಮೆಯಾದವನಿಂದಲೂ ಒಳ್ಳೆಯ ವಿದ್ಯೆಯನ್ನು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕಲಿಯಬೇಕು. ಬಹಳ ಸಾಮಾನ್ಯರಿಂದಲೂ ಶ್ರೇಷ್ಠವಾದ ಧರ್ಮವನ್ನು ತಿಳಿಯಬಹುದು. ಕೆಟ್ಟ ವಂಶದಲ್ಲಿದ್ದರೂ ಶ್ರೇಷ್ಠಳಾದ ಸ್ತ್ರೀಯನ್ನು ತಂದುಕೊಳ್ಳಬಹುದು.
*🌷🌺🙏 ಶುಭದಿನವಾಗಲಿ! 🙏🌺🌷*
మనకన్నా తక్కువ వారి వద్ద నైనా మంచి విద్య శ్రద్ధ గా నేర్చుకోవాలి. సామాన్యుల నుంచి కూడా శ్రేష్ఠ మైన ధర్మం తెలుసు కోవచ్చు. వంశం చెడ్డ దైనను, కన్య గుణవంతు రాలైన స్వీకరించవచ్చు
ఉద్ధవగీత
[13/10, 9:05 am] Sarmada Vdk Br Fn: విదురనీతి
శ్లో)విరోచనో యత్ర విభో కేశిన్యా సహితః స్థితః
సుధన్వాచ సమాగచ్ఛత్ ప్రాహ్లాదిం కేశినీం తథా॥
అ)రాజా! కేశినితో కూడ విరోచనుడున్న చోటికి సుధన్వుడు వచ్చి కేశినీ సుధన్వుల కెదురుగా నిలబడెను
ఉద్ధవగీత
శ్లో)అభ్యర్చ్యాథ నమస్కృత్య పార్ష దేభ్యో బలిం హరేత్ | మూలమంత్రం జపేద్య్రహ్మ స్మరన్నా రాయణాత్మకమ్||
అ)తరువాత అగ్నియందున్న భగవానుని పూజించి నమస్కరించి, నందాదులైన పార్షదులకు బలుల నీయవలెను. నారాయణస్వరూప మగు పరబ్రహ్మమును స్మరించి, యథాశక్తిగ మూలమంత్రమును జపించవలెను
మనకన్నా తక్కువ వారి వద్ద నైనా మంచి విద్య శ్రద్ధ గా నేర్చుకోవాలి. సామాన్యుల నుంచి కూడా శ్రేష్ఠ మైన ధర్మం తెలుసు కోవచ్చు. వంశం చెడ్డ దైనను, కన్య గుణవంతు రాలైన స్వీకరించవచ్చు
భక్తిసుధ
🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️
ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐
*_-శ్లోకమ్ -_*
*_విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం_*
*_పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా_*
*_యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం_*
*_తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే||_*
*_-దక్షిణామూర్తి స్తోత్రమ్ -_* 1
*ఈ బ్రహ్మాండం అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది....నిజమే బ్రహ్మము... బ్రహ్మమునకు రెండవది లేదు. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును.... ఈ సాక్షాత్కారమునకై శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి నా నమస్కారములు.
భాజపా ఏం చేసింది
భాజపా ఏం చేసింది ఆంధ్రా కి ?
1. తెలుగు దేశం ఉన్నప్పుడు , పోలవరం నిధుల విడుదలలో ముప్పతిప్పలు పెట్టింది , అందులో మెజారిటీ కారణం , రాజకీయ రాక్షస క్రీడ .. 70 శాతం పైగా పూర్తి అయినా కూడా ..
2. ప్రత్యేక హోదా లేదు , పాకేజీ లేదు .. 1250 కోట్లు విదిల్చి , సవతి ప్రేమ బయటపెట్టింది ..
3. రైల్వే జోన్ పేరుతో బురిడీ .. ఉపయోగం శూన్యం ..
4. రాష్ట్రాలు కట్టే పన్నుల్లో 42 శాతానికి మించి , తెలుగు దేశం హయాం లో ఎంత నిధులు అందాయి , ఏసు పార్టీ హయాం లో ఎంత అందాయో , లెక్క తీస్తే తేలిపోతుంది కదా ..
5. హిందూత్వం మీద దాడులు జరుగుతున్నా , జెరూసలేం దత్త పుత్రుని కారణం గా చూస్తూ కూర్చుంది , చర్యలు శూన్యం . టీడీపీ హయాం లో , రోడ్ల విస్తరణ కి జరిగినా పిన్ పాయింటెడ్ ద్వేషం ..
6. ఎన్నికలకి ముందు జగన్ ఘర్ వాపసీ అంటూ ప్రచారం ..
ఎందుకు లేండి .. చెప్పుకుంటూ పోతే , సిగ్గు చేటు ..
లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రానికి , చంద్ర బాబు మీద ద్వేషం కారణం గా నిధులు ఆపిన నికృష్ట పాలన ..
ఇంత జరిగినా .. నేను బీజేపీ కే మద్దతు ఇస్తాను .. కానీ ప్రశ్నించడం మానను .. ధర్మం దృష్ట్యా ..
నా ధర్మం , నా గ్రామం , నా జిల్లా , నా రాష్ట్రం , నా దేశం , వసుధైక కుటుంబం ..
స్వస్తి .. జై శ్రీ రాం ...
🙏🏻
అధికారము హస్తగతము కావు.
శ్లోకం:☝️
*జ్యేష్ఠత్వం జన్మనా నైవ*
*గుణైర్జ్యేష్ఠత్వముచ్యతే l*
*గుణాద్గురుత్వమాయాతి*
*దుగ్ధం దధి ఘృతం క్రమాత్ ll*
భావం: ముందు పుట్టినంత మాత్రాన పెద్దరికము, అధికారము హస్తగతము కావు. పాలు అట్లే ఉండిపోతే పనికిరాకుండా పోతాయి. కాచి తోడు పెడితే పెరుగౌతుంది. పెరుగును చిలికితే వెన్న, వెన్నను వేడిచేస్తే నేయి వస్తాయి. కావున విద్య, లోకానుభవము, పరివర్తన మొదలగు గణాలతోనే మనిషి క్రమంగా శ్రేష్ఠ, శ్రేష్ఠతర, శ్రేష్ఠతముడు కాగలుగుతాడు.
పంచాంగం 13.10.2023 Friday
ఈ రోజు పంచాంగం 13.10.2023 Friday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష: చతుర్దశి తిధి భృగు వాసర: ఉత్తరఫల్గుని నక్షత్రం బ్రహ్మ యోగ: శకుని కరణం ఇది ఈరోజు పంచాంగం.
చతుర్దశి రాత్రి 09:48 వరకు.
ఉత్తరఫల్గుని మధ్యాహ్నం 02:08 వరకు .
సూర్యోదయం : 06:12
సూర్యాస్తమయం : 05:52
వర్జ్యం : రాత్రి 11:18 నుండి 01:03 వరకు
దుర్ముహూర్తం : పగలు 08:32 నుండి 09:19 వరకు తిరిగి మధ్యాహ్నం 12:25 నుండి 01:12 వరకు.
రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు
యమగండం : మద్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
అర్చన..విభూతి.
*అర్చన..విభూతి..*
"నేనండీ..తిరుమల రెడ్డిని...మా దంపతుల పేరు మీద రేపు గురువారం ఉదయం స్వామిదగ్గర అర్చన చేయిస్తారా?..మా గోత్రము వగైరాలు మీకు మెస్సేజ్ చేస్తాను..రెండు మూడు వారాల్లో అక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటాము..చాలా ఇబ్బందుల్లో వున్నాను స్వామీ..ఈ ఒక్క సహాయం చేయండి.." అని అతను ప్రాధేయపడుతూ ఫోన్ లో అడిగాడు.."అలాగే రెడ్డి గారూ..అర్చన చేయిస్తాను.." అన్నాను..మరో పదినిమిషాల్లో అతను తనది, తనభార్యది గోత్రము, నక్షత్రము మెస్సేజ్ చేసాడు..మా అర్చకస్వామికి ఆ గోత్రనామాలు ఒక కాగితం మీద వ్రాసి ఇచ్చి..మర్చిపోకుండా అర్చన చేయమని చెప్పాను..
ఆ ప్రక్కరోజు గురువారం..స్వామివారికి ప్రభాతసేవ పూర్తి కాగానే..అర్చకస్వామి తిరుమలరెడ్డి దంపతుల గోత్రనామాలతో అర్చన చేశారు..ఆ విషయమే నాకు తెలిపారు కూడా..మరో గంటలో తిరుమల రెడ్డి ఫోన్ చేసి.."అయ్యా..మన్నించండి..మా తరఫున స్వామివారి వద్ద అర్చన జరిపించారు కదా.." అన్నాడు.."జరిపించాము.." అన్నాను.."చాలా ధన్యవాదాలు స్వామీ.." అని చెప్పి.."ఇప్పుడున్న పరిస్థితుల్లో మా కుటుంబాన్ని ఆ స్వామివారే ఆదుకోవాలి.." అన్నాడు..నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది.."ఏమైంది రెడ్డిగారూ..ఎందుకు ఆందోళన చెందుతున్నారు..?" అన్నాను.."నేను అక్కడికి వచ్చి అన్నీ వివరంగా చెపుతాను..అయ్యా..దయచేసి స్వామివారి విభూతి గంధం మా అడ్రెస్ కు పంపించండి.." అన్నాడు.."అలాగే పంపుతాము.." అని చెప్పాను..ప్రక్కరోజే అతని చిరునామాకు స్వామివారి విభూతి గంధం పోస్ట్ ద్వారా పంపాము..ఆ తరువాత అతని వద్ద నుంచి మరే సమాచారము రాలేదు..మేము కూడా ఆ విషయం మర్చిపోయాము..
ఐదారు నెలలు గడిచిపోయాయి..ఒక శనివారం నాటి మధ్యాహ్నం తిరుమల రెడ్డి తన భార్యతో సహా మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చాడు.."ఈరోజు స్వామివారి వద్దకు రావడానికి వీలు కలిగింది..అందుకే ఉదయాన్నే బయలుదేరి నేరుగా మాలకొండకు వచ్చి..ఆ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని..ఇక్కడికి వస్తున్నాము..ఈరోజు పల్లకీసేవ లో పాల్గొని..రేపుదయం స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్లిపోతాము.." అన్నాడు.."కొన్నాళ్ల క్రితం మీరేదో ఇబ్బందుల్లో ఉన్నామని నాతో అన్నారు కదా?..ఇప్పుడు బాగున్నారా..?" అని అడిగాను..ఆ మాట అడిగిన వెంటనే..తిరుమల రెడ్డి ముఖం గంభీరంగా మారిపోయింది.."ఆ విషయం మీతో చెప్పుకోవాలి..ముఖ్యంగా ఈ స్వామివారు నన్ను ఎలా కాపాడిందీ మీతో చెప్పుకోవాలి..మీకు తెలుసుకదా నేను సెంట్రింగ్ కాంట్రాక్టులు చేస్తుంటానని..ఆరేడు నెలల క్రితం ఒక్కసారిగా వ్యాపారం లో మాంద్యం ఏర్పడింది..నాకు సెంట్రింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిన ముగ్గురు బిల్డర్లూ బిల్లులు రాలేదని పనులు ఆపేశారు..వాళ్ళ వద్దే సుమారు ఒక లక్ష చదరపు అడుగుల సెంట్రింగ్ పెట్టివున్నాను..పూర్తిగా ఆగిపోయింది..చేతిలో ఉన్న పెట్టుబడి ఇరుక్కుపోయింది..ఈలోపల మా భార్య కడుపులో నొప్పి అంటూ బాధపడుతోంది..డాక్టర్ గారికి చూపిస్తే ఆపరేషన్ చేయాలన్నారు..ఆవిడను హాస్పిటల్ లో చేర్పించాను..మూడురోజుల తరువాత ఆపరేషన్ చేస్తాము..అంతవరకూ ఇక్కడే ఉంచండి..పరీక్షలు చేయాలి..అన్నారు..పరీక్షలకే సుమారు యాభైవేలు ఖర్చు పెట్టించారు..ఒక్కసారిగా నిరాశ ఆవహించింది..అప్పుడే మీకు ఫోన్ చేసాను..ఏ దిక్కూ తోచలేదు..ఈ స్వామివారే పదే పదే గుర్తుకొచ్చారు..ఇన్నిసార్లు మొగిలిచెర్ల వెళ్లినా ఎన్నడూ స్వామివారిని ఏ కోరికా కోరలేదు.."మమ్మల్ని చల్లగా చూడు తండ్రీ.." అని మాత్రమే కోరుకునేవాడిని..కానీ ఆరోజు మాత్రం "స్వామీ నన్నూ నాకుటుంబాన్నీ నువ్వే కాపాడాలి.." అని మొక్కుకున్నాను..మీరు మా పేర్లతో అర్చన చేయించాము అని చెప్పారు..గురువారం మీరు అర్చన చేయించారు..శుక్రవారం మధ్యాహ్నం డాక్టర్ గారు నన్ను పిలిచి.."ఆపరేషన్ ఇప్పుడు అవసరం లేదని అనుకుంటున్నాము..పరీక్షల్లో పెద్దగా ఏమీ కనబడలేదు..మందులు వాడండి..ఓ రెండు మూడు నెలల తరువాత మళ్లీ చూసి..అప్పుడు నిర్ణయం తీసుకుందాము.." అన్నారు..శనివారం పొద్దున్న ఇంటికి పంపారు..కేవలం స్వామివారి దయ వల్లే ఇలా జరిగింది అని అనిపించింది..మరో రెండు మూడు రోజుల్లో మీరు పంపిన స్వామివారి విభూతి గంధం పోస్టులో వచ్చాయి..స్వామివారి ఫోటో వద్ద వాటిని ఉంచి..రోజూ నుదుటి పై ఇద్దరమూ పెట్టుకున్నాము..వారం గడిచింది..నేను పని ఒప్పుకున్న ముగ్గురు లో ఒకరు నన్నుపిలచి..మళ్లీ పని మొదలుపెట్టమని చెప్పారు..కొంత డబ్బు కూడా ఇచ్చాడు..మరో నెల కల్లా మూడు చోట్లా పని మొదలైంది..గాడిన పడ్డాను..మొన్ననే మొదటి బిల్లు కూడా చేతికి వచ్చింది..ఇక ఆగలేదు..నేరుగా ఇక్కడికి వచ్చాను..ఆమె ఆరోగ్యం బాగుంది..నా సెంట్రింగ్ వ్యాపారం కూడా బాగుంది..స్వామివారు ఎంత దయ చూపించారో అర్ధం అయింది.." అంటూ బాగా ఉద్వేగంతో చెప్పుకొచ్చాడు.."ఈ స్వామి చల్లంగా చూడబట్టే ఇప్పుడు ఇద్దరమూ ఇలా ఉన్నాము.." అంటూ అతని భార్య అన్నది..ప్రక్కరోజు ఉదయం స్వామివారి సమాధి దర్శించుకొని ఇవతలికి వచ్చి.."అయ్యా..మందిరం వద్ద రూములు కట్టిస్తామన్నారు కదా..నాకు తెలపండి..నా శక్తిమేరకు నేను కూడా పాలుపంచుకుంటాను.." అని నాతో చెప్పి వెళ్లారు..
భక్తుల అనుభవాలు కోకొల్లలు..వాటికి కారణభూతుడైన ఆ అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు మాత్రం మందిరం లోపల మౌనంగా సమాధి స్థితి లో ఉండి..అందరినీ ఉద్దరిస్తున్నారు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
ఆలోచనాలోచనాలు
~~~ ఆలోచనాలోచనాలు ~~~. ------0 జీవితసాఫల్యం 0------ మన జీవితసాఫల్యానికి కావలసినవి----- ***** మనల్ని ప్రసన్నంగా ఉంచేందుకు తగినంత ఆనందం. ***** మనల్ని బలంగా ఉంచేందుకు తగినన్ని కష్టాలు. ***** మనం మానవత్వం చూపించేందుకు తగినన్ని కష్టాలు. ***** మనం ఆనందంగా ఉండేందుకు తగినంత ఆశ. ***** మనం (గర్వం పొందకుండా) వినయంగా ఉండేందుకు తగినంత వైఫల్యం. ***** ఉత్సాహంగా ఉండేందుకు తగినంత సాఫల్యం. ***** మన కష్టకాలంలో ఓదార్పు లభించేందుకు తగినంతమంది స్నేహితులు. ***** అవసరాలు తీర్చుకొనేందుకు తగినంత ధనం. ***** రేపటి కోసం ఎదురు చూసేందుకు తగినంత ఉత్సాహం. ***** నిరాశను పారద్రోలేందుకు తగినంత విశ్వాసం. ***** నిన్నటికన్నా , నేడు బాగా జీవించేందుకు తగినంత సంకల్పం. ***** కాబట్టి , జీవనవికాసానికి - - - - - సంతోషవిషాదాలూ, సుఖదుఃఖాలూ, సాఫల్యవైఫల్యాలూ అన్నీ అవసరమేనన్నమాట. కాకపోతే అవి తగినంత మోతాదులో మాత్రమే ఉండాలి. ***** మన ఇంటితోపాటు ఒక గ్రంథాలయం, హాయిగా విహరించేందుకు ఒక ఉద్యానవనం ఇవి చాలు. వేళకు ఇంత తిండి, మనసారా నవ్వడం, కంటినిండా నిద్ర , మన శారీరక రుగ్మతలను పోగొట్టడానికొక వైద్యుడు చాలు! ఇక తృప్తిగా బ్రతుకును కొనసాగిద్దాం. ఏమంటారు మీరు? ***************************** Answers to sharpen your mind! 1*;Because she likes to rock and roll. 2* Pi. 3* Doors. 4* An alarm clock. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~. అర్థబేధము గల పదములు 1* దార = భార్య. ధార = ప్రవాహము. 2* దృతము = ఆచరింపబడినది. ధృతము = ధరింపబడినది. 3* నిదానము = ఆలోచించి పని చేయుట. నిధానము = నిక్షేపము. 4* నిరశనము = తిండి తినకుండుట. నిరసనము = తిరస్కారము. 5* నిర్వాణము = జ్ఞానసిద్ధిని పొందుట. నిర్యాణము = మృతిచెందుట 6* నిర్దిష్టము = నిర్ణయింపబడినది. నిర్దుష్టము = మంచిది 7* నేరమి = అజ్ఞానము. నేరిమి = నేర్పుదల. 8* పరిదానము = లంచము. పరిధానము = వస్త్రము 10* పరిణామము = మార్పు. పరిమాణము = కొలత. తేది 13--10--2023, శుక్రవారం, శుభోదయం.
విజ్ఞప్తి
*శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులకు విజ్ఞప్తి*
నవంబర్ 19వ తేది, ఆదివారం రోజున మన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు నిర్వహించతలపెట్టినాము.
ఈ కార్యక్రమంలో గతంలో మనం అనుకున్న మాదిరిగా *భగవద్గీత శ్లోకాల పఠనం* (కంఠస్థం గా) ఏర్పాటు చేయడం జరిగింది.
కావున లింగ, వయో భేదం లేకుండా అందరూ ఈ పఠనం చేరవచ్చు. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన వారికి సంఘం తరపున తగిన ప్రోత్సాహకాలు అందించబడును.
ఆ రోజు కార్యక్రమాల వివరాలు:-
👉🏽పది గంటలకు దీప ప్రజ్వలన
👉🏽గీతా పఠనం
👉🏽భజన, కోలాటం
👉🏽 ప్రముఖుల మార్గదర్శనం
👉🏽 భోజనాలు
👉🏽 సాయంత్రం 3 గంటలకు సభా సమాప్తం
కావున ఇట్టి కార్యక్రమానికి సభ్యులందరూ తప్పక హాజరు కావాలని కోరుకుంటున్నాము
గమనిక : మీరు ఎంత మంది రాగలరో ముందుగా తెలియజేసినట్లైతే తదనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగుతుంది.
ఆహ్వానిస్తున్నారు
*శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం*
నవగ్రహా పురాణం🪐* . *52వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *52వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*శనిగ్రహ జననం - 3*
*"ఛాయా ! నువ్వు నా ప్రతిబింబమన్న సంగతి భవిష్యత్తులో బైటపడకుండా ఉండాలంటే , మనకు సంబంధించిన - అంటే నాకు సంబంధించిన విషయాలు అన్నీ నీకు తెలియాలి. తెలియడమే కాకుండా ఆ విషయాలు నీకు హృదయగతం కావాలి ! రక్తగతం కావాలి !”* అంది సంజ్ఞ.
*“ఒక్కసారి వింటే చాలు... అవి నాకు రక్తగతం అయిపోతాయి !"* ఛాయ నవ్వుతూ అంది.
తనలాగే తక్షణం ప్రతిస్పందిస్తూ , సూటిగా మాట్లాడుతున్న ఛాయను తృప్తిగా చూస్తూ ఇలా అంది సంజ్ఞ.
*"నేను విశ్వకర్మ కుమార్తెను. ఆయన వసుపుత్రుడు , దేవశిల్పి..."* సంజ్ఞ పరిచయ ప్రసంగం ప్రారంభించింది.
*"నువ్వు కాదు , సంజ్ఞ నేను !”* ఛాయ అడ్డు తగుల్తూ, చిరునవ్వుతో అంది. *“నేను విశ్వకర్మ పుత్రికను ! నాకు సంబంధించిన విషయాలు చెప్పు !”*
సంజ్ఞ అర్థం చేసుకున్నట్లు నవ్వింది. *“నిన్ను విశ్వకర్మ దంపతులు కశ్యప ప్రజాపతీ , అది దంపతుల పుత్రుడు సూర్యునికి కన్యాదానం చేశారు. నీకు , నీ భర్త సూర్యుడి వల్ల వైవస్వతుడూ , యముడూ అనే ఇద్దరు కుమారులూ , 'యమి' అనే కుమార్తె కలిగారు. నీ భర్త శరీరం నుండి నిరంతరం వెలువడే వేడినీ , వెల్తురునీ భరించలేక నువ్వు కొన్ని రోజుల క్రితం నీ పుట్టింటికి వెళ్ళావు. అర్ధమవుతోంది కదా !”*
ఛాయ నవ్వింది. *“సందేహానికి అవకాశం లేకుండా ! అంటే నువ్వు వెళ్ళావని భావం. సరే... చెప్పు !”*
*“ఆయన వేడిమినీ , వెలుగునూ తట్టుకోవడానికి అవసరమైన మానసిక శక్తినీ , శారీరక సంసిద్ధతనూ సమకూర్చుకుని , సూర్యమందిరానికి తిరిగి వెళ్తున్నావు !”*
*"వెళ్ళి , నీ స్థానంలో సూర్యపత్నిగా రాణిస్తూ , నీ బిడ్డలను నా బిడ్డలలాగే చూసుకుంటాను !"* ఛాయ నవ్వింది.
*"ఏకాంతంలో ఆయనతో ఏ విధంగా మసలుకోవాలో నీకు వివరిస్తాను ! తదనంతరం నువ్వు సూర్య మందిరానికి వెళ్ళు !”* అంటూ చెప్పసాగింది సంజ్ఞ....
*"సంజ్ఞా !"* ద్వారం ముందు నిలుచున్న ఛాయను చూడగానే ఆశ్చర్యానందాలతో అన్నాడు సూర్యుడు.
*"స్వామీ !"* ఛాయ అప్రయత్నంగా అంది , సంజ్ఞ బోధించిన నటనావిన్యాసాన్ని గుర్తుచేసుకుంటూ.
*"నువ్వు వెళ్ళిపోయాక మందిరం కాంతి విహీనం అయిపోయింది , సంజ్ఞా !"* సూర్యుడు ఆమె వైపు అడుగులు వేస్తూ అన్నాడు.
ఛాయ చిరునవ్వుని బలవంతాన ఆపుకుంది. నిజంగా సూర్యుడు అమాయకుడే ! కాంతి ఆయన ఆస్తి ! సంజ్ఞ వెళ్ళిపోయాక మందిరంలో కాంతి మాయమైందట !
*"మీ కోసం , నా బిడ్డల కోసం వచ్చేశాను స్వామీ..."* ఛాయ భావ స్ఫోరకంగా అంది. *"మీ కోసం... పూర్తిగా , పూర్తిగా మారిపోయి , నూతనంగా వచ్చాను స్వామీ !”*
*"నిజంగా !"* సూర్యుడు ఆశ్చర్యంగా అన్నాడు. ఆశగా ఆమెనే చూస్తూ రెండు చేతుల్నీ ఎడంగా చాచాడు. ఛాయ వేగంగా వచ్చి , ఆయన చేతుల మధ్య ఇమిడి పోయింది. సూర్యుడిలోని అనురాగం ఆమెను దగ్గరగా తీసుకుంది. తన్మయత్వంతో ఉండిపోయాడు సూర్యుడు ! ఔను ! సంజ్ఞ తాను చెప్పినట్టు తనను పరివర్తింపజేసుకుని , సర్వసిద్ధంగా తన లోగిలిలోకి , తన కౌగిలిలోకి తిరిగి వచ్చింది. తన వేడిమినీ , వెలుగునూ భరించే శక్తిని సమీకరించుకుని వచ్చింది. అందుకే తన గాఢపరిష్వంగంలో ఆమె శరీరం కంపిస్తోంది.
*“సంజ్ఞా !”* సూర్యుడు తన ఛాతీ మీద ఆనిన ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు.
*"స్వా... మీ...”*
*"ఇంక ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళకూడదు !'*
*"...అలాగే...”*
*"ఇంకెప్పుడూ నాకు 'దగ్గరగా ఉంటూ, దూరంగా ఉండకూడదు !"* సూర్యుడి కంఠంలో భావోద్వేగం వణికింది.
ఛాయ సూర్యుణ్ణి చుట్టిన తన చేతులతో ఆయనకు సమాధానం చెప్పింది. *"అమ్మా !"* చిన్న బాలిక పిలుపు ఛాయను హెచ్చరించింది. యమి పిలుపు ఛాయా సూర్యుల్ని విడదీసి దూర దూరంగా జరిపింది.
యమి వాళ్ళ వైపు పరుగెట్టుకు వస్తోంది.
*"అమ్మా !"* రెండు కంఠాలు ఒకేసారి పిలిచాయి. యమిని దగ్గరకు తీసుకుంటూ , చూసింది ఛాయ. వైవస్వతుడూ , యముడూ నవ్వుతో అమ్మను చూస్తున్న ఆనందంతో , వికసిస్తున్న ముఖాలతో వేగంగా వస్తున్నారు.
*"ఛాయా ! నా భర్తని నీ భర్తగా చూసుకున్నట్టే , నా బిడ్డల్ని నీ బిడ్డలుగా జాగ్రత్తగా , ప్రేమగా , భద్రంగా చూసుకోవాలేం !"* సంజ్ఞ పదేపదే చెప్పిన మాట ఛాయ చెవుల్లో గింగురుమంది.
సూర్యుడి సాహచర్యమనే అదృష్టాన్ని అందిచ్చిన అక్క సంజ్ఞను తలచుకుంటూ ఛాయ ముగ్గురు పిల్లల్నీ ఒకేసారి దగ్గరగా తీసుకొని , ముగ్గురి బుగ్గల మీదా ముద్దులు పెట్టుకుంది.
కాలం గడిచిపోతోంది. ఛాయ సంజ్ఞ పాత్రలో పూర్తిగా లీనమైపోయింది. సూర్యుణ్ణి తన భర్తగా స్వీకరించి , అతనితో సుఖిస్తూ , సంజ్ఞ సంతానాన్ని తన సంతానంగా చూసుకుంటూ హాయిగా కాలం వెళ్ళబుచ్చుతూ ఉండిపోయింది. సూర్యుడు ప్రస్తుత సంజ్ఞ , సత్య సంజ్ఞ కాదనీ , ఛాయ అనీ లేశమాత్రం కూడా సందేహించకుండా ఆనందంగా ఉన్నాడు.
ఇలా ఉండగా - నారదుడు శ్రీమహావిష్ణువు దర్శనానికి వెళ్ళాడు. లక్ష్మీ విష్ణువులకు వందనాలు అర్పించాడు.
*"నారదా , నువ్వు ఇక్కడికి వస్తే బాగుండేదని నాకు అనిపించింది. సంకల్పం కలిగింది ; సన్నిధికి వచ్చావు !"* అన్నాడు శ్రీమహావిష్ణువు నవ్వుతూ.
*“నారాయణ ! నేను రావాలని మీరనుకున్నారు. అందుకేనేమో రావాలని నాకు అనిపించింది !"* నారదుడు నవ్వాడు.
*“ఎవరికైనా , ఏదైనా వర్తమానం అందజేయాలా , స్వామీ?”*
*“నవగ్రహాలలో సప్తమ గ్రహం జన్మించాలి కదా ! నువ్వు కల్పించుకుంటే గానీ సంకల్పం ఫలించేలా లేదు సుమా !"* విష్ణువు నవ్వుతూ అన్నాడు.
*“నారాయణ ! నారాయణ ! మీరు సంకల్పిస్తే , మరొకరు కల్పించుకోవడం దేనికి ? వృధా ప్రయాస !"*
*"లేదు నారదా ! నువ్వు కల్పించుకోవాలి. సప్తమ గ్రహం సూర్యపుత్రుడుగా సంభవించాలి"* అన్నాడు విష్ణువు.
*"సూర్య పుత్రుడిగానా ? ఇప్పటికే సూర్యుడికి ఇద్దరు పుత్రులున్నారుగా... నారాయణా !"*
*"ఆ ఇద్దరూ సూర్యుడికి భార్య వల్ల కలిగిన పుత్రులు నారదా ! మన ఏడవ గ్రహం భార్య కాని భార్య ద్వారా సూర్యుడికి జన్మించాలి !"* శ్రీహరి వివరించాడు.
*"నారాయణ ! భార్య కాని భార్యకా ?"* నారదుడు ఆశ్చర్యంగా అన్నాడు.
*"సూర్యుడి శరీర ఉష్టాన్నీ , కాంతినీ భరించలేకపోయిన సంజ్ఞ తన నీడకు ప్రాణ ప్రతిష్ఠ చేసి 'ఛాయ' అనే నామధేయంతో మందిరానికి పంపింది. ఛాయ సూర్యుడికి పత్నిగా , సంజ్ఞ సంతానానికి తల్లిగా నటిస్తూ జీవిస్తోంది. సంజ్ఞ బిడ్డల పోషణలో పూర్తిగా లీనమై పోయిన 'ఛాయ'కు తల్లి కావాలన్న తలంపే లేదు ! నువ్వు సూర్యమందిరానికి వెళ్ళి , ఆమెకూ స్వీయ సంతతి ఉండాలని రెచ్చగొట్టు. సూర్యుణ్ణి ప్రార్థించి సంతానాన్ని పొందమంటూ ప్రేరేపించు. తద్వారా మన నవగ్రహాలలోని సప్తమ గ్రహం ఆవిర్భవిస్తాడు !"*
*"ఆజ్ఞ ! కానీ... చిన్న సందేహం. సంజ్ఞ ఏమైంది ? పుట్టినిల్లు చేరిందా ?"* నారదుడు అడిగాడు.
*"లేదు ! పుట్టినింటికి వెళ్తే రహస్యం బట్టబయలు కాదా ? సంజ్ఞ అరణ్యంలో తపస్సులో మునిగిపోయిందిలే ! నువ్వు వెళ్ళు - సూర్య మందిరానికి !”* అన్నాడు శ్రీమహావిష్ణువు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 62*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 62*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*కాలాంతరంలో నరేంద్రుడు ఇలా చెప్పాడు.....*
"మైల గడువు పూర్తికాక మునుపే నేను ఉద్యోగం కోసం మధ్యాహ్నపు మండుటెండలో ఒక కార్యాలయం నుండి మరొక కార్యాలయానికి (ఆకలితో,ఉత్త కాళ్ళతో) తిరిగాను. ఆప్తమిత్రులు కొందరు సానుభూతితో కొన్ని రోజులు నాతోనే ఉండే వారు. కాని కొన్ని రోజులు నాతో ఉండలేకపోయేవారు. కాని ప్రతిచోట నాకు నిరాశా నిస్పృహలే ఎదురైనాయి. కఠోర లౌకిక వాస్తవాల ప్రప్రథమ అనుభవంతో నిస్వార్థమైన సానుభూతి ఎంతో అరుదైనదనీ, దుర్బలులకూ పేదలకు ఇక్కడ స్థానం లేదనీ నాకు బాగా అర్థమయింది.
ఇదివరలో ఒకటి రెండు రోజులు నాకు సహాయం చేసినందుకు తాము కృతార్ధులమయినట్లు భావించిన వారిప్పుడు అందుకు విరుద్ధంగా చేయడమే సబబని భావించసాగారు. సహాయం చేయగల స్థితిలో ఉండి కూడా వాళ్లు నా పట్ల పెడముఖం చూప సాగారు.
“ఒక రోజు మిట్టమధ్యాహ్నం మండుటెండలో తిరిగి తిరిగి పాదాలు బొబ్బ లెక్కాయి; అలసిసొలసిపోయి మైదానంలోని 'ఓక్ టెర్లోని' స్మారకచిహ్న నిర్మాణం నీడలో విశ్రమించాను. ఆ రోజు ఒకరిద్దరు మిత్రులు నాతోపాటు ఉన్నారు; అనుకోకుండా అక్కడ కలుసుకోవడం జరిగింది. నన్ను అనునయించడానికి కాబోలు వారిలో ఒకడు, 'కృపాళువైన బ్రహ్మశ్వాస అనే పిల్లవాయువు వీచ సాగింది' అనే పాట పాడసాగాడు.
ఆ పాట వినగానే అతడు నా తల మీద సమ్మెటతో కొడుతున్నట్లు అనిపించింది. నా తల్లి, తమ్ముల నిస్సహాయ స్థితి గుర్తుకు వచ్చి, అవమానంతో నిరాశానిస్పృహలు ముప్పిరిగొనగా, 'నోరుముయ్యి, ఎవరికి ఆకలి బాధతో అలమటించే అవసరం లేదో అటువంటి భాగ్యవంతులకు ఈ కల్పనలు మధురంగా కానరావచ్చు. ఒకప్పుడు నాకూ అలాగే అనిపించేది.
కాని ఇప్పుడు కఠోర వాస్తవాలు ఎదురైనప్పుడు ఆ కల్పనలు అపహాస్యంగా తోస్తున్నాయి' అంటూ అరిచాను. నా మాటలు విని మిత్రుడు ఎంతో నొచ్చుకొన్నాడేమో! కాని ఎంతటి కటిక దారిద్ర్యం అనుభవిస్తూవుంటే ఆ మాటలు నా నోట వెలువడి ఉంటాయో అతడి కెలా అర్థమవుతుంది?🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
సౌందర్యలహరి🌹* *శ్లోకం - 52*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 52*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతీ*
*పురాం భేత్తు శ్చిత్తప్రశమరస విద్రావణఫలే |*
*ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంస కలికే*
*తవాకర్ణాకృష్ట స్మరశరవిలాసం కలయతః ‖*
పర్వతములకు రాజైన హిమవంతుని వంశమనే సిగకు పూమొగ్గ అయిన దేవీ, ధ్యాన సమయంలో నా హృదయ కమలంలో ప్రత్యక్షమై చూపిస్తున్న నీ నేత్రాలు బాణములకు కూర్చిన ఈకల వంటి కనురెప్ప వెండ్రుకలతో అలరారుతూ, చెవులవరకూ విస్తరించినవై, పరమశివుని చిత్త ప్రశాంతతను భంగపరచటమే లక్ష్యంగా వుండి, కొసల వరకు లాగబడిన మన్మథుని చెరకు విల్లు యొక్క సొగసును తలదన్నుచున్నట్లుగా వున్నవి.
ఇక్కడ అమ్మవారు తన శృంగార రస విలాసమును అభివ్యక్తీకరిస్తూ, తన *చలన్మీనాభ లోచనములతో* శివుని ధ్యానభంగము చేయుచుండగా, ఆమెకు సహాయపడుటకై మన్మథుడు తన పంచ పుష్ప బాణములతో ఆయనను సమ్మోహనపరుస్తున్నాడు అని అమ్మవారి నేత్ర సౌందర్యమును గురించి చెప్తున్నారు.
మన్మధుని పంచ పుష్ప బాణాలు ఇవి
అరవిందము (తెల్ల కలువ), అశోకము, చూత (మామిడి), నవమల్లిక, నీలోత్పలము (నల్లకలువ).
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
వేద ఆశీర్వచనం.
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం - చతుర్ధశి - ఉత్తరాఫల్గుణి - భృగు వాసరే* *(13-10-2023)*
ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/kYAcuOJHvpo?si=JH3BcWqwZsHkNObt
🙏🙏
Navaratna maalika
*అమ్మవారి అనుగ్రహం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ, శుభోదయ శుభాకాంక్షలతో, మీ శ్రేయోభిలాషి, నిష్ఠల సుబ్రహ్మణ్యం.*