రామాయణమ్ 353
...
ఓ రామా ! ఈతడు రావణుడు పంపిన గూఢచారి కావచ్చును కావున నలుగురు సహచరులతో సహా ఆతనిని చంపివేయుదము అని సుగ్రీవుడు రామునితో పలుకగా ఆ మాటలు విని కాసేపు దాశరధి మౌనము పాటించెను.
.
మిత్రమా ! ఈ రాక్షసుడు దుష్టుడైనను కాకపోయిననూ నాకు ఏమీ భయము లేదు .ఇతడు నాకు ఏ విధముగనూ అపకారము చేయలేడు,చేయజాలడు.
.
సుగ్రీవా నేను తలచుకొన్నచో నా ఈ ధనుస్సునుండి సంధించిన బాణములు సకల పిశాచ,రాక్షస గణములను క్షణములో రూపుమాపగలవు .
.
పూర్వము "కండువ" అను ఒక మహర్షి చెప్పిన వచనములను వినుము.....
.
క్రూరుడు అయిన శత్రువు తన వద్దకు వచ్చి అంజలి ఘటించి కాపాడమని ప్రార్ధించినపుడు ,తనకు చెడు పేరు రాకూడదు అని తలపోయు రాజు అతనిని చంపకూడదు.
.
తన శరణుజొచ్చిన వానిని ఏకారణముచేతనైనా రక్షించలేకపోయినచో అతడు నిందితమైన పాపము చేసినవాడగును.
.
తాను శరణు ఇచ్చి న వాడు తన కళ్ళముందరే ప్రాణము విడిస్తే ,అది పుణ్యమును నశింపచేయును.
.
సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ
.
ఎవ్వడైననూ వచ్చి నేను నీవాడను అని చెప్పుచూ ఒక్కసారి శరణుపొందిన చాలును,వానిని సకలప్రాణులనుండి నేను కాపాడెదను...ఇది నా వ్రతము...
.
అని రామచంద్రుడు దృఢచిత్తుడై పలికెను.
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి